హోమ్ / మా గురించి
పంచుకోండి

మా గురించి

ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) వారు ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) వారు ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వెబ్ పోర్టల్ లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, శక్తి వనరులు, ఇ-పాలన రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

వికాస్ పీడియా అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను మెరుగుపరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది.

ప్రస్తుతానికి భారత ప్రగతి ద్వారం కొన్ని ముఖ్యమైన అంశాలు - అంటే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, శక్తి వనరులు, పరిసరాలు, ఇంకా ఇ-పాలన వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ వెబ్ పోర్టల్ వల్ల గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్ని బాగా తగ్గించవచ్చు అనేది వికాస్ పీడియా భావన. గ్రామీణాభివృద్ధిని సాధించడానికి ప్రజలు, సంస్థలు, అనుభవజ్ఞులు నలుమూలల నుంచి పరస్పర సహకారంతో అందరూ పాల్గొని పూర్తి ప్రజాస్వామిక, ప్రజామిత్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపోందించడమే భారత ప్రగతి ద్వారం అంతిమ లక్ష్యం.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), మార్చి 1988 లో శాస్త్ర, సాంకేతిక సంస్థగా ఏర్పడినది. సి-డాక్ ఒక పరిశోధన మరియు అభివృద్ది సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ప్రగతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పరమ్ వంటి సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం మరియు వాటిని ఉపయోగంలోకి తీసుకు రావడం చేస్తుంది. సి-డాక్ హైదరాబాద్ ఇ-సెక్యూరిటీ, ఇ-లెర్నింగ్, సప్లై చెయిన్ మేనేఙ్ మెంట్, ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ , వి.యల్.యస్.ఐ మరియు సిస్టమ్స్ డిఙైన్ వంటి వాటి పైన పరిశోధనలు చేస్తుంది.

మరిన్ని వివరాలకు మా వెబ్ సైట్ www.cdac.in సందర్శించండి.

Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు