పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పచ్చిక బీళ్ళలో మేలు జాతి గడ్డి రకాలు

మేలు జాతి గడ్డి రకాలు మరియు లక్షణాలు

పచ్చిక బీళ్ళలో మేలు జాతి గడ్డి రకాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా బీళ్ళలో, చెంగలి గడ్డి, సేంద్ర గడ్డి, ఎక్కువగా ఉన్నాయి. ఈ రకాలు నెమ్మదిగా పెరుగుతాయి. దిగుబడి తక్కువ. ఒకసారి పశువులు మేస్తే తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుంది. పచ్చిక బీళ్ళకు పనికి వచ్చే గడ్డి, ఈ క్రింద లక్షణాలు కలిగి వుండాలి.

 1. తక్కువ వర్షపాతానికి త్వరగా ఎదిగి దిగుబడి ఇవ్వాలి.
 2. ఎండాకాలం కూడా చనిపోకుండా తేమ తగలగానే తిరిగి త్వరగా పెరగాలి.
 3. పశువులు మేసినందువల్ల గడ్డి దెబ్బతినకుండా త్వరగా పెరగాలి.
 4. మంచి ఆహారపు విలువ కలిగి రుచికరంగా వుండాలి.

ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని పచ్చిక బయళ్లకు ఉపయోగబడు కొన్ని మంచి రకాలు గుర్తించబడినవి.

 1. అంజన గడ్డి
 2. చిన్న గడ్డి
 3. రోడ్స్ గడ్డి
 4. కూసా గడ్డి
 5. దీనా గడ్డి
 6. సిరాట్రా
 7. గ్లైరిసిడియా
 8. లోసాంథెస్

ఈ మేలు జాతి రకాలు విత్తనాలు చల్లి పచ్చిక బీళ్ళను అభివృద్ధి చేసుకోవాలి. విత్తనాలు చల్లిన సంవత్సరము మేపకుండా పూర్తిగా వదిలి వేయాలి. ఒక ఎకరం పచ్చిక భీళ్ళ నుంచి 1-2 టన్నులు గడ్డి కనీసం 3 -4 నెలలోపల వస్తుంది.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

2.99396135266
kommu Rajesh Sep 11, 2016 06:32 AM

20 గేదలకుఎంత అమోంటీకావలి అలాగేసేడు ఎలనెంచాలి

sunil kumar Nov 02, 2015 10:25 PM

ఒక గెదల ఫారం అనగ 20 గెదలు ఫారం కు ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు