అన్ని కాలాల్లో పచ్చి మేతను అందించే బహు వార్షిక పశుగ్రాసాలు ముఖ్యమైనవి క్రింద వివరించబడినవి.
ఇది నేపియర్ గడ్డిని సజ్జతో సంకర పరుచగా ఉద్భవించిన పశుగ్రాస రకం.
రకాలు | ఎ.పి.బి.ఎన. 1, కో.3, ఐ.జి.ఎఫ్ . ఆర్ . ఐ. 6, ఎన్ .బి. 21. |
విత్తేసమయం | ఫిబ్రవరి – ఆగస్ట్ మధ్యలో (చలి కాలంలో తప్ప) |
విత్తనంలు | 22 -30 వేల కాండపు మొక్కలు ఒకసారి నాటితే 3 –4 సం ఉంటుంది |
విత్తు పద్ధతి | వరుసలలో, వరుసల మధ్య అంతరము 50 - 75 సెం.మీ, |
ఎరువులు వాడకం | 20 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). |
నీటి తడులు | ఎండ కాలంలో 8-21, చలికాలంలో 15 నుండి 20 రోజుల వ్యవధికి ఒక్కసారి |
మొదటి కోత | నాటిన తర్వాత 60 – 75 రోజులకు |
కోతలు | ప్రతి 40-45 రోజులకు ఒకసారి 5 – 6 కోతలు వస్తుంది. |
దిగుబడి | పచ్చిమేత 72 నుండి 160 టన్నులు ఒక ఎకరానికి ఇస్తుంది. |
పశుగ్రాసాల సాగులో రైతులకు శిక్షణ (హైబ్రిడ్ నేపియర్)
రకాలు | హమిల, మాకుని, రివర్స్ డేల్ , గ్రిన్ పానిక్ , గాటన్ పానిక్ , పి.పి.బి.14 |
విత్తేసమయం | ఫిబ్రవరి – ఆగస్ట్ మధ్యలో (చలి కాలంలో తప్ప) |
కావలసిన నారు మొక్కలు | 30 – 40 వేల నారు మొక్కలు |
నాటు పద్ధతి | వరుసలలో, చాళ్ళ మధ్య అంతరము 45 – 60 సెం.మీ |
ఎరువులు వాడకం | 60 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). |
నీటి తడులు | ఎండ కాలంలో 8-10, చలికాలంలో 15 నుండి 20 రోజుల వ్యవధికి ఒక్కసారి |
మొదటి కోత | నాటిన తర్వాత 50 – 60 రోజులకు |
కోతలు | ప్రతి 40-45 రోజులకు ఒకసారి 3 – 4 కోతలు వస్తుంది |
దిగుబడి | పచ్చిమేత 20 నుండి 24 టన్నులు (ఒక ఎకరాకు). |
ప్రత్యేకత | లోతట్టు మరియు మురుగు ప్రాంతాలలో వీటిని పెంచవచ్చు. |
రకాలు | స్టైలో హమట, స్టైలోహమిలిస్, స్టైలోస్కాబ్రా |
విత్తేసమయం | జూన్ –ఆగస్ట్ (నీటీపారుదల క్రింద) |
కావలసిన విత్తనాలు | స్టైలో హమట, 20 – 25 స్టైలోస్కాబ్రా మరియు స్టైలోహమిలిస్ 10 – 15 కిలోలు. |
విత్తు పద్ధతి | చల్లాలి |
ఎరువులు వాడకం | 35 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ (ఒక ఎకరాకు). |
నీటి తడులు | 20 నుండి 30 రోజుల వ్యవధికి ఒక్కసారి. |
మొదటి కోత | చల్లిన తర్వాత 75 – 80 రోజులకు |
కోతలు | రెండు కోతలు ప్రతి 35 – 40 రోజులకు ఒకటి. |
దిగుబడి | పచ్చిమేత 30 నుండి 35 టన్నులు. |
స్టైలో హమట
రకాలు | టి-9, ఆనంద్ -2, ఎస్ -244, కాంప్-3,కో-1 |
విత్తేసమయం | అక్టోబర్ -నవంబర్ |
విత్తు పద్ధతి | సాళ్లలో, సాళ్ళ మధ్య అంతరము 20-25 సెం. మీ |
ఎరువులు వాడకం | 30 కిలోల నత్రజని, 100 కిలోల పొటాష్ (ఒకహెక్టారుకు) |
నీటి తడులు | 2 నుండి 3 తడులు వారానిక ఒక్కసారి. ఆ తర్వాత 10-12 రోజులకు. |
మొదటి కోత | 70 రోజులకు |
కోతలు | ప్రతి 25-30 రోజులకు కొకసారి 6 -7 కోతలు. |
దిగుబడి | పచ్చిమేత 60 నుండి 75 టన్నులు. |
లూసర్ను
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023