హోమ్ / వ్యవసాయం / పశు సంపద / కోళ్ళ పెంపకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కోళ్ళ పెంపకం

కోళ్ళ జాతులు,బర్డ్‌ఫ్లూ,బ్రాయిలర్ మరియు రాజశ్రీ కోళ్ళ పెంపకం.

కోళ్ళ జాతులు

సెంట్రల్ ఏవియన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇజత్ నగర్ నుండి రూపొందించబడిన జాతులు:

దేశవాళీ రకాలు పెరటి పెంపకానికి

కారీ నిర్ బీక్ ( అసీల్ క్రాస్)

  • అసీల్ అంటే ‘స్వచ్ఛత’ అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా,ఠీవితో తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి.
  • ఈ జాతి కోళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు.
  • ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి.
  • పుంజులు 3-4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2-3 కిలోల ఉంటాయి.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు
  • సంవత్సరములో గ్రుడ్లు ఉత్పత్తి -92
  • 7. 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా.







కారీ శ్వామా (కడకనాథ్ క్రాస్)

  • ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్ధాన్ మరియు గుజరాతీ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ. మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి.
  • వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు,గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేధ్యంగా పెడతారు.
  • రోజుల కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలతోపాటు.సెక్సు సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు
  • ఆదివాసీ దీని రక్తాన్ని చాలా దీర్ఘ కాల జబ్బులకు ఉపయోగిస్తారు.
  • గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
  • 20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
  • సంవత్సరనికి  గ్రుడ్ల ఉత్పత్తి – 105
  • 40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 55%.







హితకారీ (నేకడ్ నెక్ క్రాస్)

  • ఈ జాతి  పెద్దగా  ఉండి పొడవైన ఈకలు లేని మెడ ఉంటుంది.
  • మగ కోడిలో పరిపక్వ దశకు వచ్చే సరికి మెడ భాగం ఎర్రగా మారుతుంది.
  • కేరళ లోని త్రివేండ్రం దీనికి పుట్టినిల్లు.
  • 20 వారాలు వయస్సులో దాని బరువు 1005 గ్రా
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 201 రోజులు.
  • గ్రుడ్ల ఉత్పత్తి సంఖ్య 99 సంవత్సరానికి
  • 40 వారాలు వయస్సులో గ్రుడ్లు బరువు 54 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 66%

ఉపకారి (ఫ్రిజెల్ క్రాస్)

  • దేశవాళీ కోడిలాగా ఉండి, ఉష్ణ ప్రాంతాలకు, బాగా అలవాటు పడి, రోగనిరోధక శక్తి బాగా ఉండి, మంచి పెరుగుదల, ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది.
  • పెరటిలో పెంచేందుకు బాగా అనువైనది.
  • ఉపకారి కోళ్ళ వివిధ వాతావరణ పరిస్ధితులకు అనువైన రకాలు
  • కడకనాధ్ x డెహలామ్ రెడ్
  • అసిల్ x డెహలామ్ రెడ్
  • నేకడ్ నెక్ x డెహలామ్ రెడ్
  • ఫ్రిజిల్ x డెహలామ్ రెడ్
  • గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు – 170-180 రోజులు.
  • వార్షిక గ్రుడ్ల ఉత్పత్తి – 165-180 గ్రుడ్లు
  • గ్రుడ్ల బరువు – 52-55గ్రా
  • బ్రౌను రంగు గ్రుడ్లు
  • గ్రుడ్లు నాణ్యత బాగుంటుంది.
  • బతకగల సామర్ధ్యం 95%

మన భారత దేశంలో బర్డ్‌ఫ్లూ

బర్డ్ ఫ్లూ గురించి

మనుష్యుల్లాగే పక్షులకూ  ఫ్లూ వస్తుంది. దీన్నే ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనీ అంటారు.  ఐ5కే1అనే వైరస్ పక్షులకు, కోళ్లకూ బాతులకూ కూడా సోకుతుంది. పక్షులకు సోకే సాధారణ వైరస్లు కేవలం ఇతర పక్షులకు మాత్రమే సోకుతాయి. ఐతే, ఈ బర్డ్ఫ్లూ మాత్రం పక్షులనుంచి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. అలాటి ఒక మనిషికిఐ5కే1 వైరస్ సోకిన కేసు 1997లో తొలిసారిగా హాంగ్కాంగ్లో బైట పడింది. ఆ తర్వాత ఈ వైరస్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలోని పక్షులకి నెమ్మదిగా వ్యాపించింది. ఆసియాలో 2003లో ఐ5కే1 వైరస్ సోకినప్పటినుంచి, దీని వల్ల ఇప్పటిదాకా 234 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రాణాంతకమైన ఈ వైరస్ ఇండియాలో మొన్న జనవరి 2008 ప్రాంతంలో సోకింది. ఫలితంగా, మనుష్యులకు సోకుతుందన్న భయంతో దాదాపు 3.9 మిలియన్ల కోళ్లనూ, బాతులనూ అంతం చేయాల్సి వచ్చిందని ఆహార వ్యవసాయ సంస్థ  ఒక ప్రకటనలో వెల్లడి చేసింది. దానివల్ల ఫిబ్రవరి 2, 2008 తర్వాత ఎలాటి సంఘటన జరగలేదని అన్నారు.

ఈ బర్డ్ఫ్లూ తీవ్రంగా ఉన్నపుడు ఆ పక్షులతో బాగా దగ్గరగా సంచరించడంవల్ల మనుష్యులూ అనారోగ్యం పాలౌతారు. ఆ వ్యాధి సోకిన కోళ్లనూ, బాతులనూ సరైన రీతిలో ఉడికించకుండా తినడంవల్ల కూడా ఆ వ్యాధి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. దీనికి ఇప్పటిదాకా ఎలాటి వ్యాక్సినూ లేదు.

బర్డ్ ప్లూ గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు

బర్డ్ ప్లూ (ఎవియన్ ఇన్ ప్లూయింజా) గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు 1

బర్డ్ ప్లూ (ఎవియన్ ఇన్ ప్లూయింజా) గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు – 2

బ్రాయిలర్ కోళ్ళ పెంపకం

కోడి మాంసం పరిశ్రమలో బ్రాయిలర్ కోళ్ళ్కు ప్ర్త్యేకమైన స్ధానముంది. బ్రాయిలర్లను వుత్పత్తి చేసే రైతులు పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతి మీద సరఫరా చేస్తూ ఉంటారు. అందుచేత కోళ్ళ రైతులకు మార్కెటింగ్ సమస్య కాబోదు. బ్రాయిలర్ అంటే ఎనిమిది వారాల చిన్న కోడిపిల్ల/అరకోడి. లేత మాంసం మెత్తగా ఉండి ఒకటిన్నర-రెండు కి.గ్రా. బరువు ఉంటుంది.

శ్రేష్టమైన పెంపక విధానం:

కోళ్ళఫారం ఉష్ణోగ్రత: మొదటి వారంలో 95 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటే బాగుంటుంది.తరువాత వారానికి 5 డిగ్రీ ఫా. చొప్పున తగ్గుతూ, ఆరు వారాల వయస్సు వచ్చేసరికి 70 డిగ్రీల ఫా.దగ్గర ఉంచాలి.

గాలి: మంచి గాలి తగిలేటట్టు చూడాలి. ఎప్పటికప్పుడు కోడి రెట్టల్ని(అమ్మోనియా) తొలగిస్తూ ఉండాలి. లేకపోతే కోళ్ళు ఉక్కిరిబిక్కిరికి లోనవుతూ ఉంటాయి.
వెలుతురు: ప్రతి 200 చ. అ నేలకు ఒక 60 వాట్ల బల్బు అమర్చాలి.
ముక్కు కత్తిరించడం: కోడికి ఒకరోజప్పుడే ముక్కును కత్తిరించాలి.

కోడికి కావలసిన ప్రదేశం : ఒక కోడికి ఒక చ. అడుగు

బ్రాయిలర్ ఆరోగ్య రక్షణ:

  • రోగాలు లేని కోడిపిల్లలతోనే ప్రారంభించాలి.
  • మారెక్ వ్యాధి సోకకుండా హేచరీలోనే టీకా వేయించాలి.
  • 4 నుంచి 5 రోజులప్పుడు ఆర్.డి.వి.ఎఫ్.ఐ మందు వేయాలి.
  • కోక్సిడి యూసిస్ రాకుండ మేతలోనే మందులు కలపాలి.
  • అప్లోటాక్సిన్ బారినపడకుండా మేతను కాపాడాలి.
  • కోళ్ళ పెంటను తీసి వేసి నేలను 3 అంగుళాల లోతు ఉండేలాగ నీటితో కప్పాలి.

మార్కెటింగ్:

  • కోడిపిల్లను 6-8 వారాల వయస్సులో అమ్మవచ్చు.
  • కోడిపిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దె బ్బలు తగలకుండా మేత, నీరు తొలగించాలి.
  • వాతావరణం బాగాలేనప్పుడు, కోడిపిల్లల్ని రవాణా చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

ప్రవేటు కంపెనీలు

  • సుగుణ(కోయంబత్తూరు),
  • వెంకటేశ్వర హేచరీస్ లిమిటెడ్ (వి.హెచ్.ఎల్-పూణె),
  • పయనీర్,
  • బ్రోమార్క్
  • మెదలగు ప్రవేటు కంపెనీలు కోళ్ళ రైతులతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాయి.

ఈ క్రింది వివరాల కోసం దగ్గరలోని వెటర్నరీ క్లీనిక్స్ లేదా అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్ వారిని సంప్రదించండి.

  • మంచి జాతి కోళ్ళ రకాలు
  • కోళ్ళ షెడ్ ల తయారి
  • కోళ్ళ మేత
  • ఆరోగ్యమైన కోళ్ళ ఉత్పత్తి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

  • అగ్రిస్ నెట్ వారు ప్రతీ సంవత్సరం విడుదల చేసే వ్యవసాయ పంచాంగంను అనుసరించి కోళ్ళ పెంపకం మరియు యాజమాన్యం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మాంసపు జాతి కోళ్ళ పెంపకం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొల్ల పెంపకం - పౌల్ట్రీ పై మరింత అవగాహన మరియు వివరాల కొరకు జీవనోపాధులు శీర్షిక నుండి పౌల్ట్రీ సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరట్లో రాజశ్రీ కోళ్ళ పెంపకం

గ్రామీణ మహిళలకు సులభంగా ఉపాధి కల్పించేది పెరటి కోళ్ళ పెంపకం. రాజశ్రీ కోళ్ళు శరీర బరువు మధ్యస్థంగా ఉండటంతోపాటు, పొడవైన కాళ్ళు కలిగి చురుకుగా కదులుతూ పిల్లులు, కుక్కలు, గద్దల నుంచి తప్పించుకొనగలవు. వీటి కి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనగలవు. గోధు మ రంగు గుడ్లను పెడుతాయి. గ్రామీణ ప్రజలు ఇటువంటి గుడ్లను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీటి గుడ్డు బరువు నాటు కోళ్ళ గుడ్డు బరువు కన్నా ఎక్కువ. రాజశ్రీ కోళ్ళు ఎక్కువ కాలం బతుకుతాయి. రాజశ్రీ కోళ్ళు ఒక రోజు వయసు కోడిపిల్ల బరువు 38-40 గ్రాములు ఉంటే అదే నాటు కోడి పిల్ల బరువు 25-28గ్రాములు ఉంటుంది.

20 వారాల వయస్సు గల రాజశ్రీ పెట్ట 1100 గ్రాములు ఉంటే అదే నాటు కోడి 800-950 గ్రాములు ఉంటుంది. రాజశ్రీ కోడి పుంజు 2000 గ్రాముల బరువు ఉంటే నాటుకోడి పుంజు 1200-1400 గ్రాములు ఉంటుంది. మొదటి గుడ్డుపెట్టే వయస్సులో రాజశ్రీ కోళ్ళకు 160 రోజులు పడితే నాటు కోళ్ళకు 224 రోజుల పడుతుంది. రాజశ్రీ కోళ్ళు 72 వారాల వరకు 140-160 గుడ్లు పెడుతాయి. నాటు కోళ్లు 45-60 గుడ్లు మాత్రమే పెడుతాయి. మొదటి ఆరు వారాలలో రాజశ్రీ కోళ్లు 98 శాతం బతికితే అదే నాటు కోళ్లు 90 శాతమే బతుకుతాయి.

పెంపకం

ఒకరోజు వయస్సు గల రాజశ్రీ కోడిపిల్లలు మొదటి ఆరు వారాల వరకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. కనుక వీటికి తగిన వేడిని ఇవ్వవలసి వస్తుంది. తదుపరి కోడిపిల్లలను బయటికి విడిచిపెట్టి పెరటిలో పెంచవచ్చు. ఈకోళ్లు గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా సంచరించే కారణంగా ఇవి పరాన్నజీవుల బారినపడే అవకాశాలుంటాయి. అందువల్ల ఆరు నెలల కాలవ్యవధిలో ఒకసారి డీవార్మింగ్ కోసం పైపరిజిన్ మందును ఒక చెంచా లెక్కన అరలీటరు నీళ్ళలో కలిపి ఒక్కొక్క కోడికి 5-10 మిల్లీ లీటర్లు తాగించాలె. దీనివల్ల వీటి కడుపులో ఉండే పురుగులను నిర్మూలించవచ్చు. పెరటికోళ్ళకు వచ్చే వ్యాధులన్నింటి నుంచి కాపాడటానికి టీకాలు వేయాలి.

దాణా:

ఈ రకం కోడి పిల్లలను నర్సరీల్లో పెంచేటప్పుడు లేయర్ కోడిపిల్లలకు ఆరంభ దశలో ఇచ్చే దాణాను ఇవ్వాలి. తరువాత పెరటిలో దొరికే పచ్చగడ్డి, క్రీములు సహజంగా లభించే పదార్థాలే కాకుం డా వంటగది వ్యర్థ పదార్థాలు వివిధ రకాల గిం జ ధాన్యాలు, నూకలు మొదలగు ధాన్యాలు వేయాలె. లూసర్న్ లేదా బర్సీమ్ వంటి పశుగ్రాసాలు చిన్న ముక్కలుగా తరిగి ఇస్తే తింటాయి. నూనె గింజల నుంచి వచ్చే చెక్క మోతాదు ప్రకా రం ఖనిజ లవణాలను మేపవచ్చు.

రాజశ్రీ కోడి పెట్టకు పొదిగే గుణం లేనందువల్ల వాటి ఫలదీకరణ చెందిన గుడ్లను నాటు కోడిపెట్ట లేదా ఇంక్యుబేటర్ సహాయంతో పొదిగించి పిల్లలను పొందవచ్చు. రాజశ్రీ కోళ్ళు హైదారాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోగల అఖిల భారత కోళ్ళ పరిశోధన స్థానం నుంచి పొందవచ్చు.

చిరునామా: అఖిల భారత కోళ్ళ పరిశోధన స్ధానం, పశువైద్య కళాశాల శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదారాబాద్-30,ఫోన్‌ః 040-24015316 - ఎం. మహిపాల్ రెడ్డి

ఆధారము: అగ్రిస్ నెట్

3.02304147465
తోట హరీష్ Sep 11, 2019 01:43 PM

బ్రాయిలర్ కోళ్ళలో వివిద దశలను తెలియచేయగలరు

kondalu Jul 22, 2019 09:57 AM

నాటుకోళ్ల పెంపకం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా తెలియజేయండి

ఎం ఆదిత్య Jul 11, 2019 01:19 PM

నాటు కోళ్లు మార్కెట్ ఏవిందగా చెయ్యాలో సూచనలు వివరించండి .
అడ్రస్
పార్వతీపురం,విజయనగరం.

దానియల్ Apr 27, 2019 04:58 PM

జనవాసలకు ఎంత దూరం లో కోళ్లఫారం పెట్టాలి

LOKESH Mar 30, 2019 11:27 AM

రాజా శ్రీ కోడిపిల్లలు పెంపకం తెలియజెయన్దిది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు