অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాడి పశువులు,జీవాల ఎంపిక

వ్యవసాయంలో పశుసంపద ముఖ్యమైన అంతర్బాగంగా ఉంటుంది. పశుసంపద వ్యవసాయం పైన ఆదారపడిన రైతుల పంటలకు అవసరమైన కఎరువును అందించిదిగుబదడిని పెంచుటకు తోడ్పడుతటయే గాక మనకు కావలసిన పౌష్టిక ఆహరాన్ని (పాలు, మాంసము మరియు గుడ్లు), ఉపాధి సౌకర్యాలుమరియు ఆదాయాన్ని సంవత్సరం పొడుగున ఇస్తుంది. పశు ఉత్పాదన శక్తి ఆ జాతి లక్షణాలు , బంజరు భూముల నుండి మరియు రైతుల పొలం నుండి లబించే పశుగ్రాసం ఆ ప్రాతంలో పశువుల సంఖ్య వాతవరణ పరిస్థితులు మరియు రైతులు పాటించే యాజ్యమాన్య పద్దతుల మీద ఆదరపదడి ఉంటుంది.

సాదరణంగామద్య తరగతి రైతు సముదాయంలో ఎక్కువగా దేశవాళి పాడి పశువులు ఉంటాయి. పాడి పశువులు పాల ఉత్పత్తి సగటున 1- 2 లీటర్లు కన్నా ఎక్కువగా ఉండదు. చిన్నకారు, సన్నకారు రైతులకి దేశవాకళి జీవాలు (గొర్ర్లు, మేకలు) ఎక్కువగా ఉంటాయి. కాని వాటి పెరుగుదల మరియు ఉత్పాదన సామర్థ్యము తక్కువగా ఉంటుంది. వాటి బరువు సంవత్సరకాలంలో 15 – 20 కిలోల కంటే ఎక్కువగా పెరగదు. చాలా మంది రైతుల పశువులు , జీవాలతో పాటు తమ పెరట్లో దేశవాళి కోళ్ళు కూడ పెంచు కుంటారు, కాని వాటి పెరుగుదల మరియు గుడ్ల ఉత్పాదన సామర్థ్యము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా తరతరాలుగా దేశవాళి నాసిరకం జాతుల ఫోషణ చేయక పోవటం, పరిశుభ్రమైన వసతి సౌకర్యాలు (పాకలు/కొట్టాము), లేకపోవడం, తీవ్రమైన జబ్బులు, సనాతన సాప్రదాయ పశుయాజ్యమాన్య పద్దతులు మొదలైన వాటి వల్ల రైతులు తమ పశువులు, జీవాలు మరియు కోళ్ళనుండి పూర్తి స్థాయిలో ఉత్పాదన పొందలేకపోతున్నారు. అందువల్ల ప్రతి రైతు కాలానికి అనుగుణంగా మేలైన అధిక ఉత్పాదన సామర్థ్యము గల జాతులని పెంచుకొని, ఆధునిక పశు యాజ్యమాన్య పద్దతులను పాటించి తమ పశుసంపద నుండి సుస్థిరమైన ఆదయాన్ని వర్షాబావ పరిస్థతులలొ కూడ పొ0దవచ్చును.

పాడి పశువులు

పాడి పరిశ్రమ నిర్వాహణలో పశువుల ఎంపిక అతి ముఖ్యమైనది. పోషణ ఖర్చులు నాసిరకపు పశువులకు మరియు ఎక్కువ పాల దిగుబడి నిచ్చే పశువులకు దాదాపు సమానము. కావున లాభసాటిగా పాల ఉత్పత్తిని నిర్వహించాలంటే మేలు

ముర్రాజాతి గేదె 
హెచ.ఎఫ.జాతి ఆవు

జాతి పశువులనే ఎంపిక చేసుకోవాలి. తక్కువ పాల నిచ్చే దేశవాళి నాటురకం పశువుల కంటే, ఎక్కువ పాలనిచ్చే మంచి జాతి గేదెలు మరియు ఆవుల పోషణ చేయాలి (గేదలలో ముర్రా, సూర్తి, జఫర్ భడి జాతులను, ఆవులలో సంకర జాతి ఆవులైన జర్సీ, హాలిస్టన్, మరియు బ్రౌన్, స్విస్ లను ఎంపిక చేసుకోవాలి). పశువుల శరీర లక్షణాలు, దాని సంతతి, ఉత్పత్తి సామర్థ్యాలను ఆధారం చేసుకొని పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి పశువు సంతతి వివరాలు, ప్రభూత్వ ఫారాలలో లేదా పెద్ద పెద్ద ఫారాలలోనే దొరుకును కాబట్టి సాదారణంగా సంతలో కొనుగోలు చేసెటప్పుడు, పశువు శరీర లక్షణాలు, దాని పాల ఉత్పత్తి సామర్థ్యమును బట్టి కొనుగోలు చేయవలసి ఉంటుంది. మొదటి 5 ఈతలలోనే పాడి పశువులు గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇవ్వగలవు కావున మొదటి ఈత లేదా రెండవ ఈత లో ఉండి, ఈనిన నెలలోపు పశువులను ఎంపిక చేసుకోవాలి. పశువును వరుసగ మూడు రోజులు పాలు పితిలి దాని పాల ఉత్పత్తి సామర్థ్యమును నిర్థారణ చేయాలి. ఆరోగ్యమైన పశువులను, మచ్చికగా ఉండి వాతావరణానికి అలవాటుపడే పశువులనే ఎంచుకోవాలి;

మేలు జాతి పాడి పశువుల శరీర లక్షణాలు

  • పాడి పశువు ఆడ లక్షణాలు కలిగి మచ్చిక భాగ అగునట్లు ఉండాలి.
  • పశువుల శరీరం త్రికోణాకారంగా వుండాలి.
  • చర్మము పలుచగా, మృదువుగా వుండాలి.
  • కళ్ళు చురుకుగా, మెడ పొట్టిగా వుండాలి.
  • కడుపు పెద్దగా,డొక్కలు నిండుగా వుండాలి.
  • పొదుగు బాగా విస్తరించి శరీరానికి బాగా అతుక్కొని వుండాలి.
  • చనుకట్లు పొదుగు మీద సమానంగా అమరి వుండాలి.
  • పొదుగుకి ఇరువైపుల రక్తనాళాలు లావుగా, స్పష్టంగా సన్పించాలి.

జీవాలు (గొర్రెలు మరియు మేకలు)

లాభసాటిగా వుండే జీవాల పెంపకంలో అధిక మాంసోత్పత్తికి మేలు జాతి ఆరోగ్యమైన జీవాలు తమ ప్రాంత వాతావరణానికి అనుగుణంగా పశువులను, రైతులు ఎంచుకోవాలి. జీవాలలో (గొర్రెలు / మేకలు) తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగే, అధిక రోగ నిరోధక శక్తి కలిగిన జాతులను ఎంచుకోవాలి. గొర్రెలలో నెల్లూరు (జోడ్పి, తెలుపు, గోధుమ రంగు), దక్కని, మాండ్య, మొదలగు జాతులను, మేకలలో పాలమూరు, ఉస్మానాబాదీ, జమ్నాపరి బార్బరి మొదలగు జాతులను ఎంపిక చేసుకోవాలి. జీవాలను సంతలో ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ జాతి శరీర లక్షణాలు, దాని సంతతి ఉత్పత్తి సామర్థ్యాలను నిర్దారణ చేసుకోవాలి లేదా తమకు దగ్గరలో వున్న ప్రభుత్వ ఫారాలనుండి కూడ పొందవచ్చును. రైతులు ఎంచుకొనే జీవాలు చురుకుగా, పుష్టిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కవల పిల్లలుగా పుట్టిన, యుక్త వయస్సులో ఉన్న జీవాలను ఎంపిక చేసుకోవాలి. జీవాలు రంగులోను, ఆకారంలోను, దేహధారుడ్యములోను ఎంచుకున్న లక్షణాలను పొల్లు పోకుండా బలిష్టంగా ఉండి కాళ్ళు నిటారుగా, లావుపాటి ఎముక కలిగి ఉండాలి.. ముఖముపైన, కళ్ళ చుట్టు ఉన్ని ఉండకూడదు. విత్తనపు పోట్టేలు పుష్టిగా, చురుకుగా, బలిష్టంగా, జీవకళ ఉట్టి పడుతు ఉండాలి. కనీసం, తమవద్ద ఉన్న దేశవాళి జీవాలను పైన చెప్పిన జాతి విత్తనపు పోట్టేళ్లతో జతకలాఅలి తద్వారా తర్వాత తరంలో మంచిజాతి లక్షణాలు ఉన్న పిల్లలు లభిస్తాయి.

కోళ్ళు

కోళ్ళలో వనరాజ/గిరిరాజ/గ్రామ ప్రియ మొదలగు అభివృద్ధి పరచిన సంకర జాతి కోళ్ళు దేశవాళి కోళ్ళకు ప్రత్యామ్నాయముగా పెరట్లో పెంచుకోవచ్చు. వీటి ద్వారాతక్కువ పెట్టుబడితో సంవత్సరానికి 120 – 150 వరకు గుడ్లను మరియు తక్కువ కాలంలో అధిక మాంసము పొందవచ్చును.

ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/19/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate