অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రత్తి

ప్రత్తి

నేలలు

వర్షాధారంగా నల్లరేగడి నేలలు. నీటి వసతి క్రింద తేలిక, ఒండ్రు నేలలు ప్రత్తి సాగుకు అనుకూలం.

రకాలు

దేశవాళీ రకాలు

వీణ ఉత్తర తెలంగాణా ప్రాంతాలలో తేలిక మధ్యస్థ, బరువు నేలలో 4 – 5 క్వింటాలు ఒక ఎకరాకు దిగుబడినిస్తుంది. దీని పంట కాలం 160 రోజులు. అమెరికన్ సూటి రకాలు: ఎమ్ .పి.యు.5, ఎల్ .ఆర్ .ఎ.5166, కాంచన, ఎల్ . కె.861, ఎల్ .369, నరసి0హ, ఎల్ . 603, ఎల్ .604, ఎల్ . 761 ఇవి అన్ని ప్రాంతాలకు అనువైనవి.

స్వజాతి సంకర రకాలు

హెచ్ .8, ఎల్ .ఎ.హెచ్ .హెచ్ .4, 5, 7, సవితా ఇవి అన్ని ప్రాంతాలకు అనువైనవి. బిటి ప్రత్తి: శనగ పచ్చ పురుగును తట్టుకోనే రకాలు – రాశి  బిటి – 2, రాశి  బిటి – 20, ఎన్ .సి.హెచ్ .- 145(బన్ని) బిటి., ఎన్ . సి.హెచ్ . -207 (మల్లిక) బిటి, ప్రొఅగ్రో- 368 బిటి.

విత్తే సమయం

తెలంగాణా ప్రాంతాలలో  దేశవాళీ, అమెరికన్ మరియు సంకర జాతి రకాలు జూన్ – జూలై నెలల్లో విత్తుటకు అనువైనవి. విత్తే మోతాదు

దేశవాళీ, అమెరికన్ రకాలు ఎకరాకు 3 – 4 కిలోలు మరియు సంకర జాతి రకాలు ఎకరాకు 0.75-1 కిలో.

విత్తే దూరం (సెం.మీ)

దేశవాళీ రకాలు వరుసల మధ్య 60 మరియు మొక్కల మధ్య (22), అమెరికన్ రకాలు వరుసల మధ్య 90-105 మరియు మొక్కల మధ్య 45 – 60, సంకర జాతి రకాలు మధ్య 90 – 120 మరియు మొక్కల మధ్య 60 -90.

విత్తే పద్ధతి

దేశవాళీ రకాలు గొర్రుతో విత్తాలి, అమెరికన్ మరియు సంకర జాతి రకాలు అచ్చుతో విత్తాలి.

ఎరువులు (ఎకరాకుకిలోల్లో)

తెలంగాణా ప్రాంతాలలో దేశవాళీ రకాలకు నత్రజని, భాస్వరం, పొటాష్ 16 : 8 : 8, అమెరికన్ రకాలకు 36 : 18 : 18, మరియు సంకర జాతి రకాలకు 48 : 24 : 24, సిఫార్సు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.  అమెరికన్ రకాలకు మరియు హైబ్రిడ్స్ కు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాష్ లను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళకు 7 – 10 సె.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి.

సూక్ష్మ ధాతు లోపాలు

  • మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45 మరియు 75 రోజుల తరువాత రెండు సార్లు పిచికారి చెయ్యాలి.
  • జింక్ లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు వెయ్యాలి లేదా జింక్ లోప లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 2గ్రా. జింక్ సల్ఫేట్ 5-6 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చెయ్యాలి. బోరాన్ లోప నివారణకు లిటకు నీటికి 1-1.5 గ్రా. బోరాక్స్ పైరువేసిన 60 మరియు 90 రోజుల తరవాత రెండు సార్లు పిచికారి చెయ్యాలి.
  • పూత,పిందె రాలటాన్ని నాఫ్తలీన్ ఎసితిక్ యాసిడ్ 10 పి.ప్పి.ఎమ్. ద్రావణాన్ని విడిగాకాని లేక 1-2 శాతం డై అమ్మోనియం ఫాస్ఫేట్ ద్రావణం తో కలిపి 10 -15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాడం వలన అరికట్టవచ్చు.

అంతరకృషి

కలుపు నివారించుటకు, విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొఫ్ఫున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30 ఎకరాకు 1.3 నుండి 1.6 లీ లేదా అలాక్లోర్ 50 శాతం  1.5 నుండి 2.5 లీ విత్తిన వేంటనే కాని మరుసటి రోజున కాని పిచికారి చేయాలి. విత్తన 30 రోజులప్పుడు మరియు 50 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేయాలి.

నీటి యాజమాన్యం

ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు.  భూమిలో వున్న తేమను బట్టి 20 – 25 రోజులకొకసారి నీరు పెట్టాలి.  నీటి వసతిని అనుసరించి ఎరువులు వేసిన వెంటనే మరియు పూత సమయంలో కాయ తయారయ్యే సమయంలో నీరు పెట్టాలి.

సస్యరక్షణ

రసం పీల్చే పురుగులు

ప్రత్తి విత్తిన 60 రోజులలోపు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ ఆశి0చి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి.  వీటి యాజమాన్యానికి తెల్లదోమ తట్టుకునే రకాలు కాంచన, ఎల్ . కె. 861  మరియు పచ్చ్దోమను తట్టుకొనే రకాలు ఎం.సి.యు.5, ఎల్ .ఆర్ .ఎ. 166, ఎల్, 603, 604,ఎన్.హెచ్.హెచ్ .390,ఎల్. ఎ. హెచ్.హెచ్. 4,6,7 సాగు చేయాలి.  కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5గ్రా.ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూ.ఎస్ .తో విత్తన శుద్ధి చేసి విత్తితే 45 రోజుల వరకు రసంపీల్చే పురుగులను నివారించవచ్చు.  మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1 : 4 నిష్పత్తిలో లేక ఇమిడాక్లోప్రిడ్ 200 యస్ .యల్ . మరియు నీరు 1 : 20 నిష్పత్తిలో కలిపి, విత్తిన 20,40,60 రోజుల్లో మొక్క కాండానికి బ్రష్ తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో వుంచవచ్చు.  పురుగు నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకొని అవసరాన్ని బట్టి లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ.లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 యస్.యల్.0.4 మి.లీ ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా.లేదా ఎసిఫెట్ 1.5 గ్రా.కలిపి పిచికరి చెయ్యాలి.  తెల్లదోమను అదుపులో వుంచటానికి లీటరు నీటికి 2 మి.లీ ట్రైజోఫాస్ మరియు 5 మి.లీ. వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాన పడేటట్లు పిచికారి చెయ్యాలి. ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా. నీళ్ళలో కరిగే గంధకం (50శాతం) లేక 5 మి.లీ.డైకోఫాల్ కలిపి పిచికరి చెయ్యాలి.

కాయతొలుచు పురుగుల యాజమాన్యం

కాయతొల్చే పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నల్ల మచ్చల పురుగు, గులాబీ పురుగులు ప్రత్తి పంటను ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. ప్రత్తిలో కాయతొల్చు పురుగులను అదుపులో వుంచటానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు  పాటించడం ఎంతైనా మంచిది. అందుబాటులో ఉన్న ఇతర యాజమాన్య పద్ధతులు జోడించి పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో ఉంచుకొని పురుగు మందుల వాడకం తగ్గించడం వలన సస్యరక్షణ ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం అరికట్టడం జరుగుతుంది.

సమగ్ర సస్యరక్షణ

  • పంట మార్పిడి పద్ధతి అవలంభించాలి.
  • వేసవి దుక్కులు బాగా లోతుగా దున్నాలి.
  • సేంద్రీయ ఎరువులు, రసాయన ఎరువుల వాడకం నిర్ధారిత మోతాదులోనే ఉండాలి.
  • 1 : 2 నిష్పత్తిలో అంతర పంటలు వేయాలి.  (సోయాచిక్కుడు, అలసంద, పెసర, మినుము)
  • చేను చుట్టు నాలుగు వరుసల జొన్న లేదా మొక్కజొన్న కంచె పంటగా వేయాలి.   తెల్లదోమ ఉదృతిస్ తెలుసుకొనుటకు పసువురంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచటం వలన తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుంటాయి లేదా పచ్చరంగు ఎరలు ఉంచాలి.
  • లద్దె పురుగులను ఆకర్షించడానికి ఎకరాకు 50 ఆముదపు మొక్కలు పెట్టి, మొక్కలపై పెట్టిన లద్దె పురుగు గ్రుడ్లను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి.
  • శనగ పచ్చ పురుగును ఆకర్షించడానికి ఎకరాకు 100 పసుపు రంగు పూలు పూచే బంతి మొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో ఉన్న పురుగులను ఏరివేయాలి.
  • శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు ఉనికిని,ఉధృతిని అ0చనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి.
  • విత్తిన 90-100 రోజులకు మొక్కల తలలు త్రుంచాలి.
  • ట్రైకోగ్రామ పరాన్నజీవులు ఉన్న ట్రెకోకార్టులను (ఎకరనికి 20000 గ్రుడ్లు) ప్రతి పొలంలో 5మీ.కు ఒకటి చొఫ్ఫున ఆకు అడుగుభాగంలో అమర్చాలి.  ట్రైకోగ్రామ పరాన్న జీవులు ముఖ్యంగా పచ్చపురుగును నివారిస్తాయి.
  • పచ్చపురుగు వైరస్ ద్రావణం ఎకరానికి 200 లార్వాలకు సమానమైన మోతాదులో లేదా బాక్టిరియా సంబందిత మందులు బి.టి. ఎకరాకు 400గ్రా. లేక 400మి. లీ పిచికారి చెయ్యాలి.
  • పురుగు గ్రుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి 5 శాతం వేప గింజల ద్రావణాన్ని పిచికారి చెయ్యాలి.
  • గులాబి రంగు పురుగు ఉదృతి తగ్గించడానికి గడ్డి పూలను చేతితో ఏరి వేయాలి.
  • చివరిగా పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకోవాలి లీటరు నీళ్ళకు ఎండోసల్ఫాన్2మి. లీ. లేదా క్వినాల్ ఫాస్ 2.5 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్ 2 మి.లి. కలిపి వాడాలి. ఒకే మందు ఎక్కువసార్లు పిచికారి చేయకుండా చూడాలి.
  • సిఫారుసు చేసిన మోతాదులో మందు ద్రావణం మరియు సిఫార్సు చేసిన సస్యరక్షణ పరికరాలతోనే పిచికారి చేయాలి.

తెగ్గుళ్ళు

వెరు కుళ్ళు తెగులు

కిలో విత్తనానికి కార్బండైజిమ్ శిలీంధ్ర నాశని 2గ్రా. తో విత్తనశుద్ధి చేసి విత్తుకొవాలి.

నల్లమచ్చ తెగులు

ఉదృతిని బట్టి 3-4 పర్యాయములు 15రోజుల వ్యవధిలో 10 లీ. నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేక అగ్రిమైసిన్ మరియు రాగి ధాతు సంబంధిత మందులు (కాపర్ ఆక్సీక్లోరైడ) 30గ్రా చొఫ్ఫున కలిపి పిచికారి చేయాలి.

ఆకు మచ్చ తెగులు

దీని నివారణకు లీ. నీటికి 2.5 గ్రా మాంకో జెబ్ లేదా రాగుధతు సంబంధిత (కాపర్ ఆక్సీక్లోరైడ) 3గ్రా. అవసరం మేరకు 15 రోజుల వ్యవధిలో పిచికారి చెయాలి.

బూడిద తెగులు

దీని నివారణకు లీ. నీటికి  50 శాతం నీటొలో కరిగే గంధకం 3గ్రా లేదా 80 శాతం 1గ్రా. కార్బడైజిమ్ 2 నుంచి 3 పర్యాయములు 15 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి.

ప్రత్తి తీయుట

ప్రత్తిని నాలుగైదు సార్లు తీయవాలిసి వస్తుంది. బాగా ఎండినటువంటి ప్రత్తిని గుల్లల నుండి వేరు చేసి ఎండిన ఆకులు, కాయతొలుచు పురుగులు ఆశించిన ప్రత్తిని వేరు చేయాలి. తీసిన ప్రత్తిని నీడలో ఆరబెట్టి నిల్వ చేసిన ప్రత్తికి తేమ తగలకుండా చూడాలి.

ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/27/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate