অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉల్లి గడ్డ

ఉల్లిగడ్డ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిని పచ్చికురగా, ఇంకా తినే పదార్ధాలకు రుచి కల్పించటానికి ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో షుమారు 35.645 హెక్టార్ల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 17.0 టన్నుల సరాసరి దిగుబదినిస్తున్నది.

విత్తే సమయం : రాబికాలంలో నవంబరు – డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకూ, ఖరీఫ్ కాలంలో జూన్ – జూలై నుండి అక్టోబరు-నవంబరు వరకు సాగుచేస్తారు. వేసవి పంటగా జనవరి-ఫెబ్రవరి నెలల్లో నాటవచ్చు. వాతావరణంలో పెద్దగా మార్పు లేని ప్రాంతాల్లో వీటి ఎదుగుదల బాగుంటుంది.

నేలలు: నీరు నిలవని సారవంతమైన మేరకు నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం మరియు నీరు నిలువ వుండే నేలలు పనికి రావు.

రకాలు: బళ్ళారి రెడ్ రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసారెడ్ , అర్కనికేతన్, అర్కకళ్యాణ్, అర్కప్రగతి, కళ్యాణ్ పూర్, రెడ్ రౌండ్, యన్-53, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్రెడ్ మరియు తెలుపు రకాలయిన పూసావైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్.

బళ్ళారి రెడ్: పాయలు పెద్దగా ఉండి, పాయలు ఒకటిగా గాని, రెండుగా కలిపి గాని ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాగు చేయుటకు అనువైనది.

రాంపూర్ రెడ్: బళ్ళారి రెడ్ రకంవలె ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. దిగుబడి తక్కువ. పాయలు తెల్లగా ఉంటాయి.

నాసిక్ రెడ్: పాయలు మధ్యస్ధంగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి. ఘాటుగా ఉంటాయి.

అగ్రిఫౌండ్ డార్క్ రెడ్: పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఘాటుగా ఉంటాయి. ఎక్కవ రోజులు నిలువ చేయవచ్చు. పాయలు ఎరుపు రంగులో మధ్యస్ధంగా (70-90 గ్రా.) ఉంటాయి.తక్కువ ఘాటుతో నిలువ నాణ్యత ఎక్కువ. దిగుబడి 100 – 120 క్వి/ఎకరాకు .

అర్కనికేతన్: పాయలు ఎరుపు రంగుతో 100-180 గ్రా. బరువు ఉంటాయి. టి.యస్.యస్. 12-14%. నిలువ నాణ్యత హెచ్చు. ఘాటు ఎక్కువ, దిగుబడి 132 క్వి/ఎకరాకు. ఖరీఫ్, రబీ పంటలకు అనువైనది.

అర్మకల్యాణ్: పాయల బరువు 100-190 గ్రా. దిగుబడి 136 క్వి/ఎకరాకు. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకొంటుంది. ఖరీఫ్కు అనువైనది.

అర్క ప్రగతి: 120 రోజులలో కోతకు వచ్చే గుండ్రని, ఎరుపు రకం. ఖరీఫ్, రబీ పంటలకు అనువైనది. దిగుబడి 130 క్వి/ఎకరాకు.

కల్యాణ్ పూర్ రెడ్ రౌండ్: ఎరుపు రకం. టి.యస్.యస్. 13-149%. 130-150 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 100-120 క్వి దిగుబడి నిస్తుంది.

యన్-53: పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.దిగుబడి 100-120 క్వి/ఎకరాకు. 140 రోజులలో కోతకు వస్తుంది. ఖరీఫ్ పంటకు అనువైనది.

అగ్రిఫౌండ్ లైట్రెడ్: పాయలు చిన్నవిగా, గట్టిగా, గులాబి రంగులో ఘాటుగా వుంటాయి. నారుపోయకుండా విత్తనం నేరుగా విత్తుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వయుండి, రవాణాకు తట్టుకుంటుంది. ఎగుమతులకు అనువుగా వుంటుంది.

ఇవికాక తెలుపు రకాలయినటువంటి పూసావైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్ డీహైడ్రేషన్ కు అనువైనవి.

విత్తన మోతాదు: ఎకరాకు 3-40 కిలోలు.

నారు పెంచటం: నేలను బాగాదున్ని 120 సెం.మీ. వెడల్పు. 3 మీ. పొడవుగల ఎత్తైన నారుమళ్ళను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ.మీ.ల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి (3 గ్రా. కాష్ట్రాన్ లేదా ధైరమ్ కిలోవిత్తనానికి). నారుమడిలో విత్తనాన్ని పలుచగా వరుసల్లో పోయాలి. నారుకుళ్ళ తెగులు సోకకుండా 10 రోజులకోసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పరుగులాశించకుండా కార్బోప్యూరాన్ 3 జి గుళికలు నారుమడిలో చల్లి నీరు కట్టాలి.

నారు నాటటం: 2-3 సార్లు దుక్కిదున్ని పొలాన్ని చదును చేయాలి. బోదెలు 30 సెం.మీ. ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నాటుకోవాలి. నారును 1 శాతం బోర్లో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల నారుకుళ్ళ సోకకుండా వుంటుంది. ఖరీఫ్ కాలంలో ఆగష్టు నెలలోని మొదటి 15 రోజుల్లో, రబీలో డిసెంబరు మొదటి పక్షంలో నాటుకోవాలి.

కలుపు నివారణ, అంతరకృషి: నాటే ముందు ఫక్లోరాలిన్ 45% ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిధాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీ. లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% 200 మి.లీ. చొప్పున ఏదో ఒకదానిని నాటే ముందు పిచికారి చేయాలి లేదా నాటిన 2, 3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సీఫ్లోరోఫిన్ 23.5% 200 మి.లీ. 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30, 45 రోజుల మధ్య మరలా కలుపుతీసి మట్టిని ఎగదోయాలి.

నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రోజైడ్ 0.25 శాతం (2.5 గ్రా/లీ. నీటికి) ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తటం వలన కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100 మరియు 110 రోజులకు 1 గ్రా. కార్బండైజిమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే నిలువలో ఉల్లికుళ్ళటం చాలా వరకు తగ్గుతుంది.

ఎరువులు: ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 60-80 కి. నత్రజని, 24-32 కి. భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి గొప్పతవ్వి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా (నాటి నప్పడు మరియు నాటిన 30 రోజుల తర్వాత) వేసుకోవాలి. నత్రజనితోపాటు, పొటాష్ను రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది.

నీటి యాజమాన్యం: నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధితో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ వూరేదశలో 6-7 రోజుల వ్యవధితో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టుట ఆపాలి.

సస్యరక్షణ

  • తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో బాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగుమచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు డైమిధోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. + మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి చొuన కలిపి 10 రోజుల వ్యవధితో రెండు మూడుసార్లు పిచికారి చేయాలి.
  • ఉల్లిలో ఆకుతినే పచ్చ పురుగు నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఉల్లిలో ఆకుమచ్చ తెగులు

ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనపుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఉల్లిలో సమగ్ర సస్యరక్షణ

  • ధాన్యపు పంటలతో పంటల మార్పిడి చేయాలి.
  • ఎకరాకు 80 కిలోల చొప్పన వేపపిండిని వేయడం వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలింధ్రాలు నాశనం చేయబడతాయి.
  • పొలంలో అక్కడక్కడ పసుపురంగు పూసిన డబ్బాలు(జిగురు/గ్రీజ్ పూసిన) ఎకరానికి 2 చొప్పన పెట్టాలి. దీనివల్ల రసంపీల్చుపురుగులు ఆకర్షింపబడతాయి.
  • తామరపురుగుల నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లాలి.
  • కిలో విత్తనానికి 2 గ్రా, టైకోడెర్మా విరిడి మరియు 3 గ్రా, ధైరమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. టైకోడెర్మాతో చేసిన 2 గంటల తర్వాత ధైరమ్తో చేయాలి.
  • రసం పీల్చు పరుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పన విడుదల చేయాలి.
  • పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారి చేయాలి.

పంటకోత మరియు ఆరబెట్టటం

గడ్డలు పీకటానికి ముందు నీళ్ళు కట్టడం ఆపెయ్యాలి. ఉల్లి ఆకులను, గడ్డకు 2.5 సెం.మీ. కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో వుంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిలవ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. క్యూరింగ్ క్యూరింగ్ వలన పొర రంగు ෂඩ්කුඩු చెందుతుంది. 3-4 రోజులు పొలం మీదే ఎండబెట్టి, తర్వాత 10-12 రోజులు నీడలో ఎండబెట్టి ఆ తర్వాత నిలవ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా వుండనందువలన సూర్యరశ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వంగాని చిన్నచిన్న పాయలను ఎప్పడూ నిల్వ ఉంచరాదు. షుమారు 4-6 సెం.మీ. ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిలవ గుణం కలిగి వుంటాయి.

దిగుబడి

ఎకరాకు ఖరీఫ్లో 80-100 క్వింటాళ్ళు, రబీలో 120-140 క్వింటాళ్ళ చొప్పన దిగుబడివస్తుంది. ఉల్లి సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా 251వ పేజీలో ఇవ్వబడింది.

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate