హోమ్ / వ్యవసాయం / జిల్లాల వారి సమాచారం / ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ పంటలు / వాణిజ్య పంటలు / పండ్లు మరియు కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పండ్లు మరియు కూరగాయల తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం

ఫర్టిగేషన్ ఎరువులకు ఎలా ఉపయోగపడుతుందో చుస్దాం.

ఫర్టిగేషన్

నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా మొక్కకు వివిధ దశలలో అందించడాన్ని ఫర్టిగేషన్ పద్ధతి అంటారు.

ప్రస్తుతం జనాభా పెరుగుదల రేటుతో పోటిగా భూమి, నీరు ఇతర సహజ వనరులు వినియోగం కూడా పెరుగుతున్నాయి. రైతులు నేడు అధిక నాణ్యత మరియు సురక్షత ఆహార ఉత్పత్తి కోసం పెరుగుతున్న డిమాండ్ ను చేరుకోవడానికి సవాలును ఎదుర్కొంటున్నారు. కానీ ఈ డిమాండ్లు ఆర్ధికంగా ఉండి, సహజ వనరులను మరియు పరిసరాల్ని రక్షంచే వింధంగా ఉండాలి. వ్యవసాయంలో నీటి పారుదల ద్వారా రసాయనిక ఎరువులను ఇవ్వడం వలన భూగర్భ మరియు భూఉపరితలంపై పోషకాల ఉదృతి పెరిగి పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది.అందువలన నీటిలో కరిగే రసాయనిక ఎరువులను డ్రిప్ పద్ధతిని ఉపయోగించి మొక్క వేర్లు దగ్గర ఇవ్వడం వలన పోషకాలు వినియోగ సామర్ధ్యం పెరిగి మొక్క ఏపుగా ఎదిగి అధిక దిగుబదిని ఇస్తుంది.

ఫర్టిగేషన్ ఆవశ్యకత

 1. రసాయనిక ఎరువుల పెరుగుదల ఎగుడుదిగుదల వల్ల రాష్ట్రాల వారీగా, పంటల వారిగా వినియోగం వైవిధ్యంగా ఉంది.
 2. సరిపడే రసాయనిక ఎరువుల యజమాన్యంను పాటించకపోవడం వలన భూసారం క్షినిస్తుంది.
 3. ఎరువుల స్తబ్దత మరియు పంట స్పందన బలహీన పడటం.
 4. ఎరువుల ఉత్పత్తి మందగించడం.
 5. ఎరువుల దిగుమతుల పై ఆధారపడి ఉండటం.

ఫర్టిగేషస్ వలన ఉపయోగాలు

 1. పంట దిగుబడి 25-30% వరకు పెరుగుతుంది.
 2. రసాయనిక ఎరువుల ఆదా 25-30% వరకు ఉంటుంది.
 3. ఖచ్చితమైన రీతిలో ఎరువులను పంపిణీ చేయవచ్చు.
 4. మొక్క అవసరాన్ని బట్టి పోషకాలను అందించవచ్చు.
 5. పోషక నష్టాలను తగ్గిస్తుంది.
 6. స్థూల, సూక్మ పోషకాలను ఒకేసారి బిందు సేద్యం ద్వారా మొక్కలకు అందించవచ్చు.
 7. ఎరువులను మొక్కలకు అవసరమైన మోతాదులో అందించవచ్చు.
 8. దీనివలన సమయం, కూలీలు, శక్తి ఆదా అవుతుంది.
 9. దీనివలన తేలికపాటి భూములను కూడా సాగులోకి తీసుకరావచ్చు.

ఫర్టిగేషస్ లో ఉపయోగించే నీటిలో కరిగే రసాయన ఎరువులు:

క్రమ సంఖ్య

రసాయనిక ఎరువులు

N:P:K

సూత్రం

1.

యూరియా

46:0:0

CO(NH(2))2

2.

అమ్మోనియం నైట్రేట్

34:0:0

NH(4)NO(3)

3.

అమ్మోనియం సల్ఫేట్

21:0:0

(NH(4))NO(3)

4.

కాల్సియం నైట్రేట్

15:0:0

Ca(NO(3))2

5.

మెగ్నిసియం నైట్రేట్

11:0:0

Mg(NO(3))2

6.

యూరియా అమ్మోనియం నైట్రేట్

32:0:0

CO(NH(2))2. NH(4)NO(3)

7.

పొటాషియం నైట్రేట్

13:0:45

KNO(3)

8.

మొనో అమ్మోనియం ఫాస్ఫాట్

12:61:0

NH(4)H(2)PO(4)

9.

పొటాషియం క్లోరైడ్

0:0:60

KCL

10.

పొటాషియం సల్ఫేట్

0:0:50

K(2)SO(4)

11.

పొటాషియం ధయోసల్ఫేట్

0:0:25

K(2)S(2)0(3)

12.

మొనో పొటాషియం పాస్ఫెట్

0:52:34

KH(2)PO(4)

13.

ఫాస్పారోక్ ఆమ్లం

0:52:0

H(3)PO(4)

14.

N:P:K

19:19:19

20:20:20

Poly-feed

ఫర్టిగేషన్ లో ఉపయోగించే సూక్ష్మ పోషకాలు

సుక్ష్మ పోషకాలు

పోషకాలు శాతం

సాల్యుబోర్

20 B

కాపెర్ సల్ఫేట్

25 Cu

ఐరన సల్ఫేట్

20 Fe

మెగ్నిషియం సల్ఫేట్

10

అమ్మోనియం మాలిబ్డినెట్

54

జింక్ సల్ఫేట్

36

మాంగనిస్ సల్ఫేట్

27

నీటిలో కరిగే రసాయన ఎరువుల కలయిక పట్టిక

రసాయనిక

ఎరువులు

యూరియా

అమ్మోనియం

నైట్రేట్

అమ్మోనియం

సల్ఫేట్

కాల్షియం నైట్రేట్

మోనో అమ్మోనియం

పాస్ఫెట్

మోనో

పోటాష్

పాస్ఫెట్

పొటాషియం

నైట్రేట్

యూరియా

 

c

c

c

c

c

c

అమ్మోనియం నైట్రేట్

c

 

c

c

c

c

c

అమ్మోనియం సల్ఫేట్

c

c

 

LC

c

c

LC

కాల్షియమ్ నైట్రేట్

c

c

LC

 

NC

NC

C

మోనో అమ్మోనియం పాస్ఫెట్

c

c

c

NC

 

C

C

మోనో

పొటాషియం

పాస్ఫెట్

c

c

c

NC

C

 

C

పొటాషియం

నైట్రేట్

c

c

c

C

C

C

 

C- కలయిక NC- కలయిక కాదు LC- తక్కువ కలయిక

ఫర్టిగేషస్ లో వాడే ఎరువులకు ఉండవలసిన లక్షణాలు

 1. ఎక్కువ పోషక విలువలు కలిగి మొక్కలకు ఉపయోగపడే విధంగా ఉండాలి
 2. ఎరువులు నీటిలో బాగా కరిగే విధంగా ఉండాలి.
 3. డ్రిప్ పిల్టర్లు, ఏమిటర్లు వద్ద అడ్డు పడే విధంగా ఉండకూడదు
 4. ఇతర రసాయన ఎరువులతో కలిసే విధంగా ఉండాలి.
 5. నీటి ఉధజనిలో (3.59.0) విపరీతమైన మార్పులు ఉండకూడదు.

ఫర్టిగేషన్ లో పరిమితులు మరియు జాగ్రత్తలు:

 1. కేవలం నీటిలో కరిగే రసాయనిక ఎరువులను మాత్రమే డ్రిప్ లో వాడాలి.
 2. ఎరువులను మోతాదుకు మించి వాడటం వలన పంట దెబ్బతింటుంది. అంతేగాక పోషకాల వడపోత జరిగి భూగర్భ జలాలలో కలుషతం అవుతాయి
 3. రసాయనిక ఎరువుల కలయిక గురించి తెలుసుకోవాలి
 4. డ్రిప్ సిస్టం లో ఫర్టిగేషన్ కి సంభందించి అన్ని పరికరాలు ఉండేవిధంగా చూసుకోవాలి
 5. డ్రిప్ సిస్టం లో మరియు నీటిపారుదల నీటిపారుదల పరికరాలులో తుప్పు లేకుండా చూసుకోవాలి.
 6. ఈ ఫర్టిగేషన్ నీటిని త్రాగు నిరుగా ఉపయోగించరాదు.

ఫర్టిగేషన్ పద్ధతిలో పాటించవలసిన విషయాలు

 • రసాయనిక ఎరువులను ఫర్టిగేషన్ ద్వారా పంపేటప్పుడు ఫెర్టిలిజర్ ట్యాంక్ లేదా ఇంజేక్సెన్ పంప్ ను గాని వాడాలి.
 • నీరు రసాయనాలు ఖచ్చితమైన స్ధలంలో పడే విధంగా అధిక పీడనం తట్టుకోనగలిగే డ్రిప్ మరియు ఏమిటార్ లను ఎంచుకోవాలి
 • ఎరువులను తగిన మోతాదులో రోజు లేదా రోజు మార్చి రోజు వాడాలి
 • నత్రజని నివియోగం కోసం యూరియాను ఇతర రసాయనాలతో కలిపి వాడాలి.
 • బిందు సేద్యంలో నీటితో పాటు ఆఖరి సమయంలో మాత్రమే ఎరువులను వదలాలి. ఫర్టిగేషన్ అయిన తరువాత 5-6 నిమిషాలు వదలి ఆఫ్ చేయాలి.
 • ఎక్కువ గాడత కలిగిన రసాయనాలను నాడటం మంచిది కాదు
 • ఫర్టిగేషన్ లో వాడే రసాయన ఎరువులు సేద్యంలో వాడే నీటితో కలయిక వుండాలి
 • ఫర్టిగేషన్ లో రసాయన ఎరువులుతో పాటు క్రిమిసంహారక మందులు, క్లోరిన్ తో కలిపి వాడకూడదు
 • ఫర్టిలైజర్ ఇంజక్సన్ పాయింట్ ను ఫిల్టర్ పై భాగంలో ఉండే విధంగా చూడాలి. దీనివల్ల ఫిల్టర్ లో కరగని వ్యర్ధాలను తీసివేయవచ్చు ను .
 • అవసరమైతే నీటి ఉదజని సూచికను సర్దుబాటు చేసివిధంగా ఫెర్టిలైజర్ ను ఎన్నుకోవాలి.
 • ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎక్కువ సేపు నీటి పారుదల ఇవ్వకూడదు. దీని వల్ల మొక్కకు అందాల్సిన పోషకాలు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు