অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మేకల పెంపకం

వ్యవసాయానికి అనువుగా లేని,  వర్షపాతం తక్కువగా ఉన్న్గా ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకలు కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను, బీడు భూములను, పంటకోసిన మొదళ్ళను సమర్ధవంతంగా ఉపయోదించుకొని విలువైన మాంసం, చర్మం, మరియు పంటపొలాలకు, అడవులకు అధిక సత్తువగల ఎరువు నిస్తాయి. వీటిని పెద్ద పశువలతోగాని గొర్రెలతోగాని పోలిస్తే తక్కువ ఖర్చుతో మామూలు పాకల్లో లేదా ఆరు బయళ్ళలో పెంచవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరితగతిన వృద్ధిచెంది ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలు రావడంవల్ల, అధిక రోగ నిరోధక శక్తి కలిగి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువ ఉండటంవల్ల, బాగా ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నోకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపటవచ్చు.

మేకలలో ముఖ్యజాతులు

జమునాపరి : ఇది మేక జాతుల్లో ఎత్తైనది. ఈ జాతిమేకలు ఉత్తరపోరదేశ్ లోని మధుర, ఇటావా ప్రాంతాల్లో దొరుకుతాయి. ఈ జాతి మేకలు తెల్లగా, శరీరంపైన గోధుమరంగులో చుక్కలు కలిగి ఉంటాయి. గొంతు, ముఖం వద్ద ఎక్కవగా ఈ మచ్చలుంటాయి. ముక్కు భాగం ఉబ్బేత్తుగా ఉండి, ఒత్తుగా వెంట్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉండి వేలాడుతూ ఉంటాయి. మగ, ఆడ రెండింటిలోనూ కొమ్మలుంటాయి. ఈ జాతి మేకలకు చిన్నగా సన్ననితోక ఉంటుంది. ఈ జాతి మేకలు ఒకటి నుంచి రెండు లీటర్ల పాలిస్తాయి.

బార్బారి : ఈ జాతి మేకలు ఉత్తరప్రదేశ్ లోని మధుర, ఇటావా, ఆలీగర్ ప్రాంతాల్లో లభ్యమవుతాయి. ఈ జాతి ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలను ఈనుతుంది. ఇవి చిన్నగా, తెల్లగా ఉండి, చర్మం పై లేత గోధుమ రంగులో మచ్చులు ఉంటాయి. చెవులు చిన్నగా ఉండి నిక్కబోడ్చుకొని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలు రోజుకు 700 మి.లీ నుంచి లీటరు వరుకు పాలిస్తాయి.

బీటల్ : ఈ జాతి మేకలు పంజాబ్ మరియు హర్యానాలో లభ్యమావుతాయి. ఇవి పెద్దగా ఉండి, (జమునాపరి కంటే చిన్నవి), నల్ల రంగులో ఉంటాయి. చెవులు మేలాడుతుంటాయి. ఇవి రెండు లీటర్ల దాకా పాలిస్తాయి.

ఉస్మానాబాది: ఈ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉద్ గిర్, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో లభ్యమవుతాయి. శరీరాకారం పెద్దదిగా ఉండి, నల్లరంగులో ఉంటుంది. శరీరం పై తెల్ల రంగులో మచ్చలుంటాయి. అరలీటరు నుండి లీటరున్నర వరకు పాలనిస్తాయి.

బ్లాక్ బెంగాల్ : ఇవి చిన్నగా, ఎక్కవగా నల్లరంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమరంగులో మరియు తెలుపు రంగులో లభ్యమవుతాయి. వీటి చెవులు మొనదేలి వుంటాయి. ఇవి త్వరగాకడతాయి. ఎక్కువ పిల్లల్ని పెడతాయి మేకల్లో, మేకపోతుల్లో కొమ్మలుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది. మాంసానికి ప్రసిద్ధి చెందినది.

మేకల గృహావసతి : ఎత్తైన, నీరు నిల్వని, మురుగునీరు బయటికి పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా తగినంత గాలి ప్రసరించాలి. స్ధానికంగా దొరుకు కలపగాని లేదా రాతి స్తంభాల పైన గాని కొట్టాలు వేయవచ్చు. పైకప్పును ఎండిన కంచగడ్డితోగాని, తుంగ లేదా తాటి ఆకులతోగాని వర్షపు నీరు కారకుండా కప్పువచ్చు. నీరు, దాణా అన్ని మేకలకు అందుబాటులో ఉండే విధంగా దాణా మరియు నీటి తొట్టెలను నిర్మంచాలి. ఎండ, వాన, చలి వంటి పరిస్ధితులనుండి రక్షణ కలిగించేలా మేకల కొట్టాలను నిర్మించాలి. షేడ్ నాలుగు వైపుల, మేలుపల చల్లదనం, మేతనిచ్చే చెట్లుపెంచాలి. షేడ్ లోపల నేల పై మొరము లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్ధలం ఉండాలి. ఒక్కొక్క ఆడ మేకకు ఒక చ.మీటరు, మేకపోతుకు 2 చ.మీ., మేక పిల్లకు 0.5 చ.మీ. స్ధలం ఉండేటట్లు చూడాలి. శీతాకాలంలో దడి చుట్టూ గొనెసంచులు కప్పిన ఎడల రాత్రివేళల్లో చలిగాలి లోపలికి రాకుండా ఉంటుంది.

మేకల మేపు : మేకలు

మేకల మేపు: మేకలు అభివృద్ధి కావాలంటే వాటికి కావలసిన మేపును సమకూర్చాలి. మేకలను కనీసం రోజుకు 8 నుండి 10 గంటల వరకు భీడు భూముల్లో పంటకోసిన పొలాల్లో, అడవుల్లో మేపాలి. వీటితోపాటు పాక చుట్టు ప్రక్కల ఉన్న స్థలంలో పచ్చిమేతలు పెంచాలి. మేకలు పచ్చిగడ్డితోపాటు ఎక్కువ చెట్ల ఆకులను, పండ్లతొక్కలను, కూరగాయల ఆకులను ఇష్టపడతాయి. కావున పశుగ్రాసాన్నిచ్చే చెట్లేనటువంటి సుబాబుల్, అవిశ, రావి, తుమ్మ అల్లనేరేడు, సీమచింత, వేప మొదలగు వాటి ఆకులను సమృద్ధిగా ఉపయోగించవచ్చు వీటితోపాటు కాయజాతి ఏకవార్షికాలైన జొన్న సజ్జ, మొక్కజొన్న మరియు పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, హెడ్డిలూసర్స్ స్టెలో మొదలగునవి పెంచాలి. క్యాబేజి, కాలీఫ్లవర్, క్యారట్ కూరగాయల ఆకులను కూడా తింటాయి.

పచ్చిమేత ఇచ్చేటప్పుడు షుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేతలు, 3 కిలోల ఇతర పశుగ్రాసాలివ్వాలి.

విత్తనపు మేక పోతుల పోషణ

విత్తనపు మేకపోతులకు వేరే వసతి కల్పించి వాటికి కావలసిన ఆహార పోషక పదార్థాలను సమకూర్చాలి. ప్రతి మేకపోతుకు ఒక్కొక్క దానికి 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రా. (ఒక్కింటికి)ల చొప్పున ఇవ్వాలి. శుభ్రమైన త్రాగేనీటిని అందుబాటులో ఉంచాలి.

మేకపోతులకు, పెద్దమేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 భాగాల మొక్కజొన్నలు, 5 భాగాల వేరుశనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 14 భాగాల జొన్నలు మరియు సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండాలి.

స్థానికంగా దొరికే ముడి సరుకులనుపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారుచేసుకొనవచ్చు.

మేకల్లో సంపర్కం

మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలుండాలి. ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి. మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి. మేకలు ఎదలో 1-3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమీ చేసిన మేకపోతును వదలాలి. ఇది ఎదలో వున్న మేకలను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. ఎదలో వున్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మేకలకు సరిపోతుంది.

చూడి మేకల పెంపకం

మేకలు, చూడి కట్టిన మూడు నెలల తర్వాత కడుపులోని పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడి మేకలకు మంచి దాణా ఇవ్వాలి. 200 నుండి 250 గ్రాముల వరకు మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటంవలన ఎక్కువ బరువుతో పిల్లలు పుడతాయి. మేక ఆరోగ్యం బాగుండి ఎక్కువ పాలిస్తుంది. మరియు పిల్లలు బాగా పెరుగుతాయి. పచ్చిమేత, చెట్ల ఆకులతో బాగా మేపాలి. శుభ్రమైన నీటిని త్రాగించాలి. కొద్దిపాటి వ్యాయామం అవసరం. అందుకుగాను షెడ్ చుటూ ఉన్న ఖాళీస్థలంలో తిరగటానికి వదలాలి.

మేకపిల్లల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు

మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి. మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాల్ ను చల్లాలి. ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రోజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు) ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి ನಿಮ್ಗೆ ఆంటిబాడీలు, విటమిన్లు ఎక్కువగా వుంటాయి. మొదటిసారి ముర్రు పాలను జన్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాపాలి. రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేక పిల్లలు రెండు వారాలు దాటగానే వాటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతిరోజు 100 గ్రా, చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి. మేక పిల్లల పెడ్తో ఉప్ప, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి. మేక పిల్లల పెద్లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పాడి సున్నం చల్లాలి. మూడు మాసాల వయసు దాటిన మేకపిల్లలకు నట్టల నిర్మూలన మందులు త్రాగించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకొట్టాలి, దీని వలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.

పిల్లల దాణాలో 28 భాగాల మొక్క జొన్నలు, 20 భాగాల వేరుశనగ చక్క 10 భాగాల గోధుమ పొట్టు, 11 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 10 భాగాల జొన్నలు (లేక) సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండాలి. దీనిని తయారు చేయటానికి స్థానికంగా దొరికే దినుసులు వాడాలి. ధరలను బట్టి వీటిని మార్చుకొనవచ్చు.

మేకల వ్యాధులు - నివారణోపాయాలు

ఇతర జంతువులతో పోలిస్తే మేకల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. మేకల్లో సాధారణంగా ఈ క్రింది వ్యాధులు కనిపిస్తాయి.

పారుడు వ్యాధి (పి.పి.ఆర్)

ఈ వ్యాధి వైరస్ క్రిముల వలన వస్తుంది. విపరీతమైన జ్వరం 107"ఫారన్హీట్ వరకు ఉంటుంది. కండు ఎర్రబడి నీరు కారటం, నోటినుండి చొంగ రావడం, చిగుళ్ళమీద సన్నని పండ్లు ఏర్పడటం, పలచని విరేచనాలు అవడం ఈ వ్యాధి యొక్క ముఖ్యలక్షణాలు. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఈ అంటువ్యాధిని నివారించవచ్చు.

బొబ్బరోగం/ మశూచి

ఈ వ్యాధి డిసెంబరు, జనవరి, ఏప్రిల్, మే నెలల్లో కనిపిస్తుంది. మేకలు, బొబ్బలతోను, ఎక్కువ జ్వరంతోను బాధపడుతుంటాయి. ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. ముక్కుల నుండి నీరు కారడం, వేగంగా ఊపిరి పీల్చటం జరుగుతుంది. ఈ వ్యాధి రాకుండ అరికట్టేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేకలకు మశూచి టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన మేకలను వేరుచేసి పుండ్లపై వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూతమందులను పూయాలి.

గాలికుంటు

ఈ వ్యాధి సోకిన మేకల నోటిలో, చిగుళ్ళమీద, నాలుక మీద గుల్లలు ఏర్పడి మేత మేయవు. నోటి నుండి చొంగ రావడం, కాళ్ళగిట్టల మధ్య పండ్లు ఏర్పడటం గమనించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి మేకలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి నివారించవచ్చు. వ్యాధి సోకిన మేకలను వేరుచేసి పుండ్లపై వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూతమందులను పూయాలి. నోటిలోని పండ్లకు బోరోగ్లిసరిన్ను పూయాలి. గిట్టల మధ్య పండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి పూతమందులను పూయాలి.

చిటుకు వ్యాధి

మేకలు హటాత్తుగా చనిపోవటం, మేకపిల్లలు కాళ్ళు తన్నుకోవటం, కండలు అదరటం, నోటి నుండి చొంగ కారటం మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముఖ్యంగా వరాలు పడిన తరువాత మొలకెత్తిన పచ్చిగడ్డిని మేకలు బాగా మేయటం వలన వస్తుంది. ఈ వ్యాధి రాకుండేందుకు మేకలకు వరాకాలపు ప్రారంభానికి 3 వారాల ముందుగా “ఏంట్రో టాక్సీమియా" అను వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.

మేకల పెంపకంలో ఆదాయం పొందటానికి వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. మేకలను పరిశుభ్రమైన పరిసరాలు, మేత, నీరు మరియు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేసినట్లయితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు.

మేకలు మేత మేస్తున్నప్పుడు వాటి ఆహారంతోపాటు కొన్ని అంతర పరాన్నజీవులు (ఏలిక పాములు, బద్దెపురుగులు, జలగలు) వాటి శరీరంలో చేరి, పోషకాల్ని పీల్చివేసి, అనారోగ్యానికి గురిచేస్తాయి. కావున సంవత్సరానికి కనీసం మూడుసార్లు నట్టల నిర్మూలన మందులను త్రాగించాలి. పేలు, పిడుదులు, గోమార్లు మొదలగు బాహ్య పరాన్నజీవులు రకాన్ని పీలుస్తూ బలహీన పరచటమే కాక కొన్ని అంటువ్యాధులను కలుగజేస్తాయి. వాటిని అరికట్టాలంటే వాటి శరీరంపై సుమిసిడిన్, మలాథియాన్, ఫెన్వలరేట్ మొదలగు మందులను పిచికారి లేదా డిప్పింగ్ చేయాలి.

అంటువ్యాధుల్లో పారుడు వ్యాధి (పి.పి.ర్), చిటుకురోగం, గొంతువాపు, మశూచి, గాలికుంటు ముఖ్యమైనవి. ఈ వ్యాధులన్నిటికి వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయించి రక్షించవచ్చు.

టికామందు

సమయం

మోతాదు/వయస్సు

మేకల మశూచి

ఫిబ్రవరి

3 నేలలు దాటిన మేకపిల్లలకు మేకపిల్లలకు మొదలుకొని 1 మి.లీ చర్మం క్రింద

పి.పి.ఆర్ వ్యాధికి (ముసర వ్యాధి టికా)

జనవరి

3 నేలలు దాటిన మేకపిల్లలకు మేకపిల్లలకు మొదలుకొని 1 మి.లీ చర్మం క్రింద

గాలికుంటు

జూన్

3 నేలలు దాటిన మేకపిల్లలకు మేకపిల్లలకు మొదలుకొని 2.5 మి.లీ చర్మం క్రింద

గొంతువాపు

మర్చి/ఆగష్టు (సంవత్సరానికి రెండుసార్లు)

3 నేలలు దాటిన మేకపిల్లలకు మేకపిల్లలకు మొదలుకొని 2.5 మి.లీ చర్మం క్రింద

పై టీకాలను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వేయించాలి.

గొర్రెల, మేకల పెంపకంపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామాలు : "సీనియర్ సైంటిస్ట్ లేదా సైంటిస్ట్ (యల్.పి.ఎమ్), పశు పరిశోధనా స్థానం, పలమనేరు-517 408, చితూరు జిల్లా". ఫోన్ నెం. 08579-252208

లేదా

"సైంటిస్ట్ (ఎ.జి.బి.), పశు పరిశోధనా స్థానం, మహబూబ్నగర్ - 509 001". ఫోన్ నెం. 08542-275007

లేదా

"సీనియర్ సైంటిస్ట్ (యల్.పి.ఎమ్), పశు పరిశోధనా స్థానం, గరివిడి-582 101, విజయనగరం జిల్లా". ఫోన్ నెం. 08952-282458

లేదా

"సీనియర్ సైంటిస్ట్, పశు పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-20025442/24002752

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate