పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శ్రీకాకుళం

ఈ పేజిలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నీటి పారుదల

  • జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ద్వారా 26.47 శాతం, నైరుతీ రుతుపవనాలు ద్వారా 62.61 శాతం వర్షాలు లభిస్తాయి.
  • జిల్లాలో ఈశాన్య రుతుపవనాలు ద్వారా 26.47శాతం, నైరుతీ రుతుపవనాలు ద్వారా 62.61 శాతం వర్షాలు లభిస్తాయి.
  • చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో 905 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిద్వారా 39,024 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
  • జిల్లాలో 113 వరకు సాగునీటి కాల్వలు ఉన్నాయి. వీటిద్వారా 61,825 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
  • జిల్లావ్యాప్తంగా 1,05,693 పిల్లకాల్వలు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 42,845 హెక్టార్లుకు, రబీలో 1,568 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
  • బోర్లు 3,350, సాధారణ బావులు 4467 వరకు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 28,366 రబీలో 565 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
  • జిల్లాలో 31 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిద్వారా 5137 హెక్టార్లుకు సాగునీటి వసతి కల్పించారు.
  • జిల్లాలో మొత్తం ఆయకట్టు - 3,34,675 హెక్టార్లు
  • వంశధార ఎడమకాల్వ కింద ఆయకట్టు: 59,986 హెక్టార్లు
  • వంశధార కుడికాల్వ ఆయకట్టు: 31,552 హెక్టార్లు
  • అక్కులపేట ఎత్తిపోతల ఆయకట్టు: 1744 హెక్టార్లు
  • వంశధార హైలెవల్‌కెనాల్‌ ఆయకట్టు: 10,117 హెక్టార్లు
  • తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు ఆయకట్టు: 23,449 హెక్టార్లు

మధ్యతరహా ప్రాజెక్టులు (పూర్తియినవి) – ఆయకట్టు

  • నారాయణపురం ఆనకట్ట - 14,995 హెక్టార్లు
  • మడ్డువలస రిజర్వాయర్‌ - 9996 హెక్టార్లు
  • పైడిగాం ప్రాజెక్టు - 2098 హెక్టార్లు

మధ్యతరహా ప్రాజెక్టులు (నిర్మాణంలో ఉన్నవి) ఆయకట్టు

  • మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ - 9955 హెక్టార్లు
  • మడ్డువలస స్టేజ్‌-2ఎక్స్‌టెన్సన్‌ - 5058 హెక్టార్లు
  • కళింగదళ్‌ ప్రాజెక్టు - 1457 హెక్టార్లు
  • డబారిసింగి ప్రాజెక్టు - 453 హెక్టార్లు
  • బొందిగెడ్డ ప్రాజెక్టు - 80 హెక్టార్లు
  • బొమ్మిక ప్రాజక్టు - 310 హెక్టార్లు

వంశధార నదిపై ఉన్న ప్రాజెక్టుల వివరాలు

  • వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2
  • వంశధార పొడవు: 265 కి.మీ
  • రాష్ట్రంలో ప్రవహించే నది పొడవు: 85 కి.మీ
  • వంశధార కాలువ నిర్మాణం: 1971
  • వంశధార స్టేజ్‌-1 సామర్థ్యం: 17.841 టీఎంసీలు
  • వంశధార స్టేజ్‌-2 సామర్థ్యం: 16.091 టీఎంసీలు
  • ఎడమ కాల్వ ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
  • కుడి కాల్వ ఆయకట్టు: 62,280 ఎకరాలు
  • ఎడమ కాల్వ పొడవు: 104.826 కి.మీ
  • కుడి కాల్వ పొడవు: 55కి.మీ
  • వంశధారపై నీటిసంఘాలు: 54
  • డిస్ట్రిబ్యూటరీ కమిటీలు: ఎడమ కాలువపై 7, కుడికాలువపై 1
  • ఎడమ కాలువ దిగువన చెరువులు: 1036
  • కుడికాలువ దిగువన చెరువులు: 1518
  • ఎడమ కాలువపై నిర్మాణాలు: 87
  • కుడి కాలువపై నిర్మాణాలు: 53

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

  • జిల్లాలో సాగు విస్తీర్ణం: 5,84,290 హెక్టార్లు
  • వరి, చెరకు, జొన్న, గంటి, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, నువ్వులు, పత్తి, గోగు, ఉలవలు, వేరుశెనగ, మిరప, ఉల్లి, పొద్దుతిరుగుడు, పొగాకు.

సాగు విస్తీర్ణం ఇలా..

  • వరి - 2,33,008 హెక్టార్లు
  • చెరకు - 8,854 హెక్టార్లు
  • జొన్న - 268 హెక్టార్లు
  • గంటి - 3251 హెక్టార్లు,
  • మొక్కజొన్న - 1767 హెక్టార్లు
  • రాగి - 1411 హెక్టార్లు
  • కందులు - 1409 హెక్టార్లు
  • పెసర - 30830 హెక్టార్లు
  • మినుము - 41743 హెక్టార్లు
  • వేరుశెనగ - 24335 హెక్టార్లు
  • నువ్వు - 4997 హెక్టార్లు
  • పొద్దుతిరుగుడు - 2668 హెక్టార్లు
  • ఉల్లి - 1332 హెక్టార్లు
  • గోగు - 10795 హెక్టార్లు
  • పత్తి - 1848 హెక్టార్లు

జిల్లాలో రైతుల వాడే వివిధ పంటల విత్తన రకాలు ఇవీ...

  • వరి వంగడాలు: స్వర్ణ, సాంబమసూరి, ఎంటియు 1001, ఎంటియు 1010, సోనామసూరి, శ్రీకాకుళం సున్నాలు , పూజిత
  • అపరాలు: ఎల్‌జిజి407, ఎల్‌జిజి410, ఎల్‌జిజి450, తేజ, ఎల్‌బిజి623,సాధారణ దిగుబడి
  • వరి - ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు
  • అపరాలు - ఎకరాకు 5 క్వింటాళ్లు
  • వేరుశెనగ - ఎకరాకు 12 నుంచి 14 బస్తాలు
  • నేలలు - రకాలు
  • ఇసుక గరప నేలలు
  • ఇసుక కొండ్రుమట్టి నేలలు
  • ఎర్రమట్టి నేలలు
  • ఇసుక, ఒండ్రు, బంకమట్టి నేలలు

జిల్లాలో వరి ప్రధాన పంట. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో దీన్ని విస్తీర్ణం బాగా తక్కువ. వాణిజ్య పంటల్లో జీడిమామిడిదే అగ్రతాంబూలం. జిల్లావ్యాప్తంగా కొండలు, కోనల్లో జీడిని రైతులు పెంచుతున్నారు.

  • వరి : జిల్లాలో అన్ని మండలాల్లోనూ సాగవుతోంది.
  • చెరకు : రేగిడి, పాలకొండ, వీరఘట్టం, వంగర, ఆమదాలవలస, శ్రీకాకుళం, జలుమూరు, నరసన్నపేట, పొందూరు మండలాల్లో సాగులో ఉంది.
  • జొన్న : రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, గార మండలాల్లో సాగులో ఉంది.
  • గంటి : రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, గార మండలాల్లో సాగు చేస్తున్నారు.
  • మొక్కజొన్న: జి.సిగడాం, రణస్థలం, లావేరు, పొందూరు, రాజాం, వీరఘట్టాం, శ్రీకాకుళం మండలాల్లో సాగు చేస్తున్నారు.
  • చోడి : రణస్థలం, జి.సిగడాం, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పాలకొండ, వీరఘట్టాం, కొత్తూరు మండలాల్లో సాగులో ఉంది.
  • కంది : సీతంపేట, కొత్తూరు, భామిని, జి.సిగడాం, లావేరు, రణస్థలంమండలాల్లోపండిస్తున్నారు.
  • పెసర : కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో పండిస్తున్నారు.
  • మినుము : కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సాగులో ఉంది.
  • వేరుశనగ: కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సాగులో ఉంది.
  • నువ్వులు: వజ్రపుకొత్తూరు, పాలకొండ, కొత్తూరు, బూర్జ మండలాల్లో పండిస్తున్నారు.
  • ప్రత్తి: భామిని, కొత్తూరు, సరుబుజ్జిలి, రాజాం, పొందూరు, రణస్థలం, లావేరు మండలాల్లో సాగు చేస్తున్నారు.
  • గోగు : ఆమదాలవలస, బూర్జ, కొత్తూరు, వీరఘట్టం, హిరమండలం, సీతంపేట, లావేరు, రాజాం మండలాల్లో పండిస్తున్నారు.

ఉద్దాన ప్రాంత జీవనాడి జీడి..

శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటల్లో జీడి ఒకటి.. ఉద్దాన ప్రాంత జీవనాడిగా ప్రసిద్ధి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల హెక్టార్లలో సాగు ఉంది. ప్రధానంగా వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, మెళియాపుట్టి, కొత్తూరు, బామిని మండలాల్లో పంట సాగవుతోంది. ఐదేళ్ల కాలంలో ఏటా 30 శాతం మించి దిగుబడి రావడం లేదు. ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఉన్న చెట్ల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కొత్త పంట ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సరయిన ప్రోత్సాహం లేనందున రైతాంగం ప్రతీ ఏటా వస్తున్న నామ మాత్రపు పంటతోనే కాలం గడపాల్సి వస్తోంది. ఈ ఏడాది పంట ప్రారంభ దశలో వాతావరణం అనుకూలించకపోవడంతో చేతికందిన పంట నేలమట్టమైంది. ఉద్దానం తీర ప్రాంతంలో జీడి పంట సాగు ఎక్కువగా ఉంది. ఇక్కడ సుమారు 25 వేల హెక్టార్లలో సాగవుతోంది.

ఖరీఫ్‌, రబీలో సాగు

జిల్లాలో ప్రధాన పంట వరిసాగు. ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 2,50,497 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇందులో కాల్వల కింద 1,20,634 హెక్టార్లు, చెరువుల కింద 30,362 హెక్టార్లు, బావుల కింద 6080 హెక్టార్లు, ఇతర నీటి వనరుల కింద 4906 హెక్టార్లు సాగవుతున్నాయి. మిగిలినది వర్షాధారం.

  • ఖరీఫ్‌లో వరి 1,96,245 హెక్టార్లలో సాగవుతోంది.
  • చెరకు 7,389 హెక్టార్లు,
  • జొన్న 226 హెక్టార్లు,
  • గంటి - 2,618 హెక్టార్లు,
  • మొక్కజొన్న - 2055 హెక్టార్లు,
  • చోడి - 1288 హెక్టార్లు,
  • కందులు - 1451 హెక్టార్లు,
  • పెసర - 1709 హెక్టార్లు,
  • మినుము - 760 హెక్టార్లు,
  • వేరుశనగ - 22,506 హెక్టార్లు,
  • నువ్వులు - 2,532 హెక్టార్లు,
  • ప్రత్తి - 1908 హెక్టార్లు,
  • గోగు - 9810 హెక్టార్లలోనేసాగవుతోంది.

జిల్లాలో రబీసాగు అంతగా ఉండదు. కారణం.. సరైన నీటి వసతి లేకపోవటమే. జిల్లాలో 1,11,246 హెక్టార్ల విస్తీర్ణంలోనే పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికశాతం ఆరుతడి పంటలే.

  • రబీలో వరి కేవలం 3052 హెక్టార్లలోనేసాగవుతోంది.
  • జొన్న 14 హెక్టార్లు,
  • మొక్కజొన్న 1,836 హెక్టార్లు,
  • చోడి 1242 హెక్టార్లు,
  • ఉలవలు 10,032 హెక్టార్లు,
  • పెసర 31,579 హెక్టార్లు,
  • మినుము 43,401 హెక్టార్లు,
  • బఠాణీ 12 హెక్టార్లు,
  • మిరప 3113 హెక్టార్లు,
  • ఉల్లి 1364 హెక్టార్లు,
  • వేరుశనగ 7376 హెక్టార్లు,
  • నువ్వులు 4989 హెక్టార్లు,
  • పొద్దుతిరుగుడు 3162 హెక్టార్లు,
  • పొగాకు 74 హెక్టార్లలో సాగవుతాయి.

జిల్లాలో ఎగుమతులు

ధాన్యం

జిల్లా నుంచి ధాన్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. సన్నరకం ధాన్యం పంటకు మంచి గుర్తింపు ఉంది. ఏటా జిల్లాలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో జిల్లాలో 4 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. మిగిలిన ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.

జీడిపప్పు:

జిల్లాలో పలాస కేంద్రంగా జీడి ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడి జీడిపప్పుకు మంచి గుర్తింపు ఉంది. రోజుకు రూ. కోటి చొప్పున ఎగుమతులు అవుతున్నాయి. జీడి తొక్క కూడా వంట చెరకుగా వినియోగిస్తున్నారు.

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

వంశధార

  • వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2
  • జిల్లాలో అత్యధిక శాతం సాగు అవసరాలను తీరుస్తున్నది వంశధార ప్రాజెక్టు. వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. ఈ బ్యారేజీకి కుడి, ఎడమన రెండు కాల్వలున్నాయి.
  • కుడి కాల్వ మొత్తం పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరందుతోంది.
  • ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. ఈ కాల్వ ద్వారా జిల్లాలోని నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాలకు సంబంధించి 1,48,000 ఎకరాల ఆయకట్టు ఉంది.
  • గొట్టాబ్యారేజీ నీటి లెవల్‌ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
  • వంశధార నది పొడవు: 265 కిలోమీటర్లు
  • జిల్లాలో ప్రవహించే నది పొడవు: 85 కిలోమీటర్లు
  • వంశధార కాల్వ నిర్మాణం: 1971
  • ఎడమ కాల్వ ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
  • కుడి కాలువ ఆయకట్టు: 62,280 ఎకరాలు
  • ఎడమ కాల్వ పొడవు: 104.826 కిలోమీటర్లు
  • కుడికాల్వ పొడవు: 55 కిలోమీటర్లు
  • వంశధారపై నీటిసంఘాలు: 54
  • డిస్ట్రిబ్యూటరీ కమిటీలు: ఎడమ కాల్వ 7, కుడికాల్వపై 1
  • వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ : రాడ మోహనరావు
  • వంశధార ఎస్‌.ఇ.: రాంబాబు
  • డివిజన్లు: మెంటినెన్స్‌ డివిజన్‌ నరసన్నపేట, టెక్కలి
  • ఎడమ కాల్వ దిగువన చెరువులు: 1036
  • కుడికాల్వ దిగువన చెరువులు: 1518
  • ఎడమ కాల్వపై నిర్మాణాలు: 87
  • కుడి కాల్వపై నిర్మాణాలు: 53

హిరమండలం గొట్టబ్యారెజ్‌

జలయజ్ఞంలో భాగంగా వంశధార స్టేజ్‌, ఫేజ్‌-2 ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ కోసం రూ. 933 కోట్ల అంచనా వ్యయంతో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005 ఏప్రిల్‌ నెలలో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008 మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ గడువులోగా పనులు పూర్తి కాలేదు. 2009 ఏప్రిల్‌కు మరో గడువు పొడిగించారు. అయినా అప్పటికీ పూర్తి కాలేదు. 2012 మార్చి నాటికి గడువు పొడిగించారు. ఇప్పటివరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిధుల కొరత, ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలు, సుప్రీంకోర్టు స్టే విధించడం తదితర కారణాల వల్ల 87, 88 ప్యాకేజీల అమలు, కొత్తూరు, భామిని మండలాల్లోని సింగిడి, పారాపురం బ్యాలెన్సింగ్‌ మినీ రిజర్వాయర్ల నిర్మాణం, కాట్రగడ వద్ద వంశధారలో అడ్డుగోడ నిర్మించి నీటిని అంధ్రావైపు మళ్లించే పనులు, వరద కాలువ పనులు నిలిచిపోయాయి. ట్రైబ్యునల్‌లో వివాదం పరిష్కారం కానిదే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం తాజాగా 2015 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించింది. ఆ గడువు లోగా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

తోటపల్లి ప్రాజెక్టు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతాంగ ఆశాజ్యోతి 'తోటపల్లి' ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తయితే ఇప్పటికే పాత బ్యారేజీ కింద ఉన్న 60 వేల ఎకరాల భూములు స్థిరీకరణతో పాటు రెండు జిల్లాల పరిధిలోని 1.20 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది. 1978 డిసెంబరు 15వ తేదీన ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. సుమారు 16 టీఎంసీల నాగావళి నదీజలాలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునేందుకు ప్రతిపాదన అంగీకారమైంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుకు సమీపంలో 1807లో బ్రిటిష్‌ పాలకులు నిర్మించిన బ్యారేజీ జీవితకాలం ముగియడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ప్రారంభమైన ప్రక్రియలో భాగంగా అన్ని అనుమతులు పొందిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003, నవంబరు 8న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఫాస్ట్‌ట్రాక్‌ కింద ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కన్‌స్ట్రక్షన్‌ డివిజన్‌ (ఇ.పి.సి.) 1, 2 విభాగాలుగా విభజించి నిర్మాణం పనులు ప్రారంభించారు.

ఆఫ్‌షోర్‌ జలాశయం

పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు సాగునీరు అందించేందుకు 2008 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెళియాపుట్టి మండలం చాపర నుంచి మహేంద్రతనయ నది గుండా వెళ్లే వరద నీటిని మళ్లించి జాడుపల్లి, చీపురుపల్లి గుండా రేగులపాడు వద్ద ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌లో నిల్వ చేయాల్సి ఉంది. పలాస, వజ్రపుకొత్తూరుతో పాటు మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి మండలాల పరిధిలోని సుమారు 24,600 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అంచనా వ్యయం రూ. 127 కోట్లకుగాను రూ. 123 కోట్లకు టెండరు ఖరారైంది. పనులకు శంకుస్థాపన చేసి మూడేళ్లు గడచినా ఇంత వరకు 15 శాతానికి మించి పనులు పూర్తికాలేదు. రేగులపాడు వద్ద ట్రెంచి పనులు మాత్రమే జరుగుతున్నాయి. మరో వైపు భూ సేకరణ నత్తనడకన చేపడుతున్నారు. సుమారు రూ. 15 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘానికి శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి 2010 మార్చి నాటికి ఆఫ్‌షోర్‌ ప్రొజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు జరగనందున మరో రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీనిని 2012లో మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దిశగా పనులు జరగడం లేదు. దీంతో ఆఫ్‌షోర్‌ సాగునీటి సరఫరా ఈ ప్రాంత ప్రజానీకానికి కలగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.

జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు చేపట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్‌ 4న పలాస మండలం రేగులపాడు వద్ద శంకుస్థాపన చేశారు. రూ. 127 కోట్ల అంచనాలతో మెళియాపుట్టి, టెక్కలి, పలాస, నందిగాం మండలాల్లోని 24600 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. భూసేకరణ ముందుకు సాగకపోవడం, నిధుల కొరత వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెళియాపుట్టి మండలం చాపరలో మహేంద్రతనయ నుంచి పలాస మండలం రేగులపాడు వరకు 13.54 కిలోమీటర్ల పొడవునా వరద కాలువ ద్వారా జలాశయానికి నీరు తరలించాల్సి ఉంది. ఇందుకు 2600 ఎకరాల భూసేకరణ అవసరం. ప్రభుత్వం ఇప్పటివరకు 600 ఎకరాలు మాత్రమే సేకరించగలిగింది. గత మూడేళ్లుగా బడ్జెట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 98 కోట్లు మాత్రమే కేటాయించింది. భూసేకరణ ముందుకు సాగకపోవడంతో వెనుకకు మళ్లిపోయాయి.

నాగావళి నదిపై విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రెండు కాల్వల ద్వారా జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరందుతోంది. వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలో కుడి కాల్వ 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వంగర మండలం పరిధిలో ఎడమ కాల్వ 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రెండు కాల్వల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు ఉంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది. ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మడ్డువలస ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.3 టీఎంసీలు.

మడ్డువలస ప్రాజెక్టు

  • శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై రూ. 132 కోట్ల అంచనా వ్యయంతో మడ్డువలస ప్రాజెక్టును నిర్మించారు. సువర్ణముఖి, వేగవతి నదుల ప్రవాహం ఇందులో చేరేలా రూపకల్పన చేశారు. 2002 నవంబరు 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీన్ని జాతికి అంకింత చేశారు
  • ప్రస్తుతం ఇది మధ్యతరహా ప్రాజెక్టుగా ఉంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జలాశయం స్థాయి పెరుగుతుంది
  • జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 65 మీటర్లు. రిజర్వాయరులో నీటి సామర్థ్యం పెరిగితే కింద నున్న నాగావళి నదిలోకి నీటిని విడిచిపెట్టేందుకు రిజర్వాయరుకు మొత్తం 11 గేట్లు అమర్చారు
  • రిజర్వాయరు ద్వారా వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, సి.సిగడాం, పొందూరు మండలాల్లోని 104 గ్రామాల పరిధిలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నారు. 50 కిలోమీటర్ల పొడవున్న కుడికాలువ ద్వారా 23,750 ఎకరాలు, 1.6 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ ద్వారా 950 ఎకరాల  ఆయకట్టుకు అధికారికంగా సాగునీరందుతోంది.
  • మడ్డువలస రెండో దశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 47 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. ఈ పనులు పూర్తయితే జి.సిగడాం, లావేరు, పొందూరు మండలాల పరిధిలోని 12,453 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందుతుంది
  • ప్రాజెక్టులోకి సరాసరి నీటిమట్టం 16 టి.ఎం.సి.లు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 3.2 టి.ఎం.సి.లు.

జంపరకోట రిజర్వాయర్‌

పాలకొండ మండలంలోని జంపరకోట వద్ద పెద్దగెడ్డపై రిజర్వాయరు నిర్మాణానికి 1983లో శ్రీకారం చుట్టారు. రూ. 2 కోట్ల వ్యయంతో 2100 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. కొండల నుంచి వచ్చిన వూటజలాలలను రిజర్వాయరులోకి చేర్చి వినియోగించాలన్నది ఉద్దేశం. ఏడాదిపాటు పనులు సాగి నిలిచిపోయాయి. అప్పటి నుంచి రైతులు పోరాటాలు చేస్తూనే వచ్చారు. 2007లో మరోమారు ఈ రిజర్వాయర్‌ నిర్మాణం తెరపైకి వచ్చింది. కొత్త అంచనాలు రూపొందించి రూ. 16 కోట్లుగా నిర్ణయించారు.ఏడాదిలోగా రిజర్వాయర్‌ పూర్తి చేసి 14 గ్రామాల రైతులకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. పనులు ప్రారంభమై ఆర్నెళ్లకే నిలిచిపోయాయి. మట్టికట్ట నిర్మాణం పూర్తికాలేదు. ఇంతవరకు కాల్వల ఏర్పాటు జరగలేదు. పొర్లుకట్టల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిధులు మాత్రం ఇప్పటికే రూ. 9 కోట్లు ఖర్చు చూపారు.

కొండలోవగెడ్డ రిజర్వాయర్‌

భామిని మండలంలోని యాతంగూడ వద్ద మినీ రిజర్వాయరు నిర్మాణానికి 1996లో ప్రతిపాదించారు. రూ. 3 కోట్లతో ఎనిమిది గ్రామాల పరిధిలోని వెయ్యి ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. పనులు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. మట్టికట్ట సగం వరకు ప్రారంభించి పనులు ఆపేశారు. మొదటి నుంచి నిధులు కేటాయింపులు లేకపోవడంతో పనులు జరగడం లేదు.

అక్కులుపేట ఎత్తిపోతల పథకం

ఆమదాలవలస మండలం అక్కులుపేట వద్ద రూ. 6.24 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆమదాలవలస, బూర్జ మండలాల పరిధిలో మండాది, అక్కులుపేట, పార్వతీశంపేట, బొబ్బిలిపేట, తాళ్లవలస, తిమ్మాపురం, ముళ్లశాస్త్రులపేట, జగ్గు శాస్త్రులపేట, సంతకొత్తవలస, చింతలపేట, జి.కె.రంగరాయిపురం, కాలపర్తి, సలికాం, సిలగాం, తాళ్లభ, ఎస్‌.కె.పేట మొత్తం 16 గ్రామాలకు సంబంధించిన 4 వేల 311 ఎకరాలకు సాగు నీరందించాలన్నది అధికారుల ప్రయత్నం. ఈ పథకం నిర్మాణానికి 2007 జూన్‌ 14న స్థానిక ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు పూర్తి కాలేదు.

ఆధారము: ఈనాడు

నదులు

వంశధార

  • ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలోని మిన్నజోలా వద్ద వంశధార జన్మించింది. ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అక్కడి నుంచి సరిహద్దులో 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భామిని మండలం కంట్రగడ వద్ద ఆంధ్ర భూభాగంలోకిప్రవేశిస్తోంది.అది మొదలుకొని జిల్లాలో ఈ నది మొత్తం 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. గార మండలం కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. దీనికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి.
  • హిరమండలం  గొట్ట వద్ద 1972వ సంవత్సరంలో గొట్టా బ్యారేజీ పనులు ప్రారంభించి 1977లో పూర్తి చేశారు.
  • బ్యారేజీతో పాటు 1,48,230 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో 1977 సెప్టెంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ బ్యారేజీని ప్రారంభించారు.
  • కుడికాల్వ ద్వారా 67591 ఎకరాలకు నీరు అందించేందుకు పనులను 1983లో ప్రారంభించారు 2000 నాటికి పూర్తయ్యాయి.
  • కుడి కాలువ పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరందుతోంది.
  • ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. దీనిద్వారా నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాల పరిధిలో 1,48,000 ఎకరాలకు సాగునీరందుతోంది.
  • గొట్టా బ్యారేజీ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
  • ఈ గొట్టా బ్యారేజీ ద్వారా 2.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది.
  • బ్యారేజీలో 38.01 (0.10 టీఎంసీలు) మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచుతున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 సాధారణ గేట్లతోపాటు 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. బ్యారేజీ పొడవు 457 మీటర్లు

నాగావళి

నాగావళి ఒడిశాలోని రాయగడ కొండల్లో పుట్టి 90 కిలోమీటర్లు ఒరిస్సాలో ప్రవహించి జిల్లాలో వంగర మండలంలో ప్రవేశిస్తోంది. జిల్లాలో 115 కిలోమీటర్లు ప్రవహించి శ్రీకాకుళం సమీపంలోని కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీనికి లాంగుల్యా అను మారు పేరు ఉంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం 70 వేల క్యూసెక్కులు దాటితే నదీపరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లినట్టే. కరకట్టల నిర్మాణం పూర్తి కాకపోవడంతో నదీ తీర ప్రాంతాల గ్రామాలన్నీ ఏటా ముంపు బారిన పడుతున్నాయి. నాగావళి నదిపై విజయనగరం జిల్లాలోని తోటపల్లి వద్ద తోటపల్లి ప్రాజెక్టు నిర్మించారు. దీన్ని జలయజ్ఞంలో భాగంగా రూ. 467 కోట్లతో రెండో దశ విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, రెండో దశ విస్తరణ పనులు పూర్తయితే మరో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ప్రస్తుతం కుడికాల్వ ద్వారా వంగర మండలంలోని 3,500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 38 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జిల్లాకు అదనంగా జి.సిగడాం, రేగిడి, రాజాం, సంతకవిటి, వంగర, రణస్థలం, లావేరు మండలాల్లోని 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. నాగావళికి ఉపనదులు ఒట్టిగెడ్డ, జంఝావతి, సువర్ణముఖి. శ్రీకాకుళం పట్టణానికి ప్రధాన నీటివనరు నాగావళి నది. ఈ నది ద్వారా సుమారు 10 మిలియన్‌ లీటర్ల నీటిని రోజువారి ఉపయోగిస్తున్నారు. మనిషికి సగటున 90 లీటర్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నాగావళి నది వలన శ్రీకాకుళం పట్టణానికి వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండదు.

బాహదా

ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామం వద్ద ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన బాహుదా నది కొళిగాం, కీర్తిపురం, పాయితారి, తోటూరు, బిర్లంగి, మశాకపురం, రత్తకన్న, ఇచ్ఛాపురం, లొద్దపుట్టి, శాసనం, అరకబద్ర, టి.బరంపురం తులసిగాం, కొఠారి, ఈదుపురం, కేశుపురం, బూర్జపాడు గ్రామాల మీదుగా ప్రవహించి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.

  • ఒడిశా జరడా కొండలలో పుట్టిన ఈ నది ఒడిశాలో 38 కిలోమీటర్లు, ఆంధ్రాలో (కేవలం ఇచ్ఛాపురం) కేవలం 16 కిలోమీటర్లు ప్రవహించి సముద్రానికి చేరుతోంది.
  • ఒడిశా రాష్ట్రం ఈ నదీ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఏటా రెండు పంటలు సమృద్ధిగా సాగుచేసుకుంటోంది. అదే ఆంధ్రాలో ఈ నదిలో వచ్చిన వరద జలాలను సైతం జాగ్రత్త పరిచే చర్యలు లేవు. వరదలు వస్తే ముంపు, లేకుంటే కరవు.. ఇదీ ఆంధ్రా పరిస్థితి.
  • ఇచ్ఛాపురానికి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న భగలట్టి గ్రామం వద్ద కిలోమీటరున్నర పొడవున 110 అడుగుల ఎత్తున ఒడిశా ఆనకట్టను నిర్మించింది. గత పదేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. బాహుదా జలాలన్నీ అక్కడే నిల్వ చేసుకుని ఆ రాష్ట్రంలో సగం ప్రాంతానికి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.
  • ఆంధ్రాలో బాహుదాజలాలపై ఆధారపడి సుమారు 7 వేల ఎకరాల పంటభూములు ఉన్నాయి. ఈ భూములను ప్రస్తుతం పరిశీలిస్తే, అన్ని చోట్లా బోర్లు వేసుకుని సాగుచేసుకోవడంకనిపిస్తుంది.
  • అరకబద్రవద్ద రిజర్వాయర్‌ కట్టాలని 1978లో ఆంధ్రా ప్రభుత్వం సంకల్పించింది. అప్పట్లో దీనికి రూ. 40 కోట్లు అవసరమౌతాయని భావించారు. సర్వేలు, అంచనాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. సర్వే కోసమే రూ. 40 కోట్లు ఖర్చు చేశారు. తీరా చివరకు తేల్చిందేమిటంటే ఈ ప్రాజెక్టుకోసం రూ. 250 కోట్లు కావాలని చెప్పారు. 7 వేల ఎకరాల కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని ప్రభుత్వం వెనకంజ వేసింది. అదే ఈ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది.
  • ఈ నదిపై ప్రత్యక్షంగా ఈదుపురం ఉద్దానం మంచినీటి పథకంతో పాటు, శాసనం, ఇచ్ఛాపురం పురపాలకసంఘం మంచినీటి పధకం ఆధారపడి ఉన్నాయి. రత్తకన్న ప్రాంతానికి బాహుదానదిలో వేసిన ఊటబావుల ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో పురుషోత్తపురం గ్రామంలో ఏర్పాటు చేసే మంచినీటి పథకానికి కూడా బాహదా జలాలే ఆధారం. ఇక పరోక్షంగా కొళిగాం నుంచి డొంకూరు వరకు గల గ్రామాలన్నీ ఈ నదీ జలాలకు సమీపలోనే బోర్లు వేసుకుని నీటిపథకాలను అమలు చేస్తున్నాయి.
  • ఎగువనున్న ఒడిశా అంతరాష్ట్రనదీజలాల ఒపందాన్ని కాలరాస్తోంది. 1974లో అప్పటి ఆంధ్రా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్‌ల మధ్య భువనేశ్వర్‌లో జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాది పొడునా 1.5 టి.ఎం.సి.ల నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టాలి. గతంలో వరదలు వస్తే నీరు నిల్వ చేసే అవకాశం లేక నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టేసేవారు. దాంతో ఆంధ్రా పంటభూములన్నీ మునిగిపోయేవి. ఇప్పుడు భగలట్టి ఆనకట్ట ఎత్తు పెరిగి పోవడంతో వరద నీరుకూడా దిగువకు విడిచి పెట్టడం లేదు. దాంతో వర్షాలు పడిన మూడు నెలలు మినహా మిగిలిన కాలమంతా బాహుదానది ఎండిపోయి కనిపించేది.
  • ఆంధ్రా పరిధిలో ఉన్న ఈ నదికి 11 ఓపెన్‌ హెడ్‌ చానళ్లు ఉన్నాయి.

మహేంద్రతనయ

మహేంద్రతనయ నది ఒడిశాలోని తుంబ అటవీ ప్రాంతంలో పుట్టి రెండుపాయలుగా విడిపోయి ఆంధ్రాలో ప్రవేశిస్తోంది. ఒక పాయ మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ప్రవహిస్తుండగా మరొక పాయ మందస, సోంపేట మండలాల్లో ప్రవహిస్తోంది. మహేంద్రతనయపై వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, గ్రోయిన్‌ల ద్వారా 40 వేల ఎకరాల వరకు పంట పొలాలు సాగవుతున్నాయి. మందస మండలం పెద్దకోష్ట వద్ద ఆంధ్రాలో ప్రవేశించే మహేంద్రతనయ నది 45 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి సోంపేట మండలం బారువ కొత్తూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. నదిపై పైడిగాం మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుతోపాటు పొత్తంగి, ఏటిబట్టి, బారువ, మూలపొలం గ్రోయిన్‌లు, పొత్రఖండ ఎత్తిపోతల పథకాల ద్వారా మందస, కంచిలి, సోంపేట మండలాల పరిధిలో 25 వేల ఎకరాల పంట పొలాలు సాగవుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో 300కు పైగా గ్రామాల పరిధిలో 4 లక్షల మందికి తాగునీరందుతోంది. నదిపై ఉద్దానం ప్రాజెక్టుతోపాటు 10 రక్షిత మంచినీటి పథకాలు, ఒక సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం పనిచేస్తున్నాయి.

సువర్ణముఖి

ఒరిస్సాలో జన్మించిన ఈ నది వంగర మండలం కొండ శేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తోంది. జిల్లాలో మొత్తం 17 కిలోమీటర్ల మేర ప్రవహించి వంగర మండలం సంగం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు ఉంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

వేగవతి

వేగవతి నది విజయనగరం జిల్లా పాచిపెంట కొండల వద్ద ప్రారంభమై పశ్చిమ నుంచి తూర్పుగా ప్రవహించి సువర్ణముఖి, గోముఖి నదుల్లో విజయనగరం జిల్లా శిర్లాం వద్ద కలుస్తోంది. అక్కడి నుంచి సువర్ణముఖి నది ప్రవాహం వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి చేరుతోంది. ఇక్కడ సామర్ధ్యానికి మించి నీరు నిండితే ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 11 గేట్ల ద్వారా నాగావళి నదిలోకి నీటిని విడిచి పెడతారు. నాగావళి నది ద్వారా అదనపు జలాలు సముద్రంలో కలసిపోతున్నాయి

ఆధారము: ఈనాడు

3.00412541254
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు