హోమ్ / వ్యవసాయం / ముఖ్యమైన అంశాలు / భారత దేశంలో రూపొందించబడిన విత్తన చట్టాలు - అవగాహన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారత దేశంలో రూపొందించబడిన విత్తన చట్టాలు - అవగాహన

భారత దేశంలో రూపొందించబడిన విత్తన చట్టాలు - అవగాహన.

భారత వ్యవసాయ రంగ చరిత్రలో 1960-70 సం.ల. మధ్య కాలంలో సంభవించిన హరిత విప్లవం ఒక మైలు టాయిగా చెప్పుకోవచ్చును. నూతన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, హైబ్రిడ్ ల రూపకల్పన ద్వారా వివిధ పంటల్లో ఉత్పాదకత గణనీయం పెరిగింది. నూతన వంగడాల పూర్తి సామర్ధ్యాన్ని వినియెగించుకోవాలంటే, నాణ్యమైన విత్తనోత్పత్తి మరియు సరఫరా ద్వారానే సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలోనే విత్తన నాణ్యత నోయంత్రణకు చట్టాలు తీసుకురావలసిన ఆవశ్యకత ఏర్పడింది. భారతదేశంలో తొలిసారిగా 1966 లో విత్తన చట్టాన్ని రూపొందించి, ఆ తర్వాత 1968 లో విత్తన నియమాలు మరియు 1983 లో విత్తన నియంత్రణ శాసనాన్ని తీసుకురావడం జరిగింది. విత్తన నాణ్యత పై నియంత్రణ ఉంచడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని సరైన సమయంలో అందుబాటులోనికి తీసుకురావడమనేదే వీటన్నింటి ముఖ్య ఉద్దేశ్యం.

భారత విత్తన చట్టం (1966)

ఈ చట్టం 1966 లో రూపొందించబడి, అక్టోబర్ 2 వ  తేదీ, 1969 నుండి భారత దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలులోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం, మార్కెట్ లో అమ్మే విత్తనాలన్నింటికీ లేబిలింగ్ మాత్రం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కానీ విత్తన దృవీకరణ మాత్రం ఐచ్చికం, అంటే విత్తన దృవీకరణ చేసిన, చేయకపోయినా లేబిలింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ధృవీకరించని విత్తనాలను ట్రూత్ ఫుల్ లిబిలింగ్ ద్వారా విత్తనోత్పత్తిదారులు అమ్ముకోవచ్చును. అయితే దృవీకరణ విత్తనమైన, ట్రూత్ ఫుల్ లేబిలింగ్ విత్తనమైన నిర్ధేశిత విత్తనమైన ప్రమాణాల్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే విక్రయంచాలి. భారత దేశ కనిష్ట మెలిక శాతం మరియు స్వచ్ఛత కలిగి ఉండాలి. విత్తన  సంచులు లేదా ప్యాకెట్ల పై లేబిలింగ్ ప్రమాణ పద్దతిలో చేయబడి ఉండాలి. ఈ ప్రమాణాల మేరకు లోపలి విత్తన నాణ్యత ఉండాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర విత్తన కమిటీ మరియు కేంద్ర విత్తన దృవీకరణ బోర్డులను స్ధాపించడం జరిగింది. విత్తన చట్టాన్ని అమలు పరచడంలో సలహాలు, సూచనలను కేంద్ర విత్తన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. విత్తన ధృవీకరణకు సంబంధించిన విషయాల పై కేంద్ర, రాష్ర ప్రభుత్వాలకు కేంద్ర విత్తన దృవీకరణ బోర్డు సలహాలు, సూచనలను ఇస్తుంది.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభత్వాల ఆధ్వర్యంలో విత్తన పరీక్ష ప్రయేగాశాలలను ఏర్పాటు చేసి, విత్తన నాణ్యత పరీక్షల ద్వారా మంచి విత్తనాలను రైతులకు అందుబాటులో తీసుకురావడమనేది ఈ చట్టం యెక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతే కాకుండా, విత్తన దృవీకరణ మరియు విత్తన తనిఖీ సేవలు తరువారా నాణ్యత నియంత్రణ చేసే వ్యవస్ధలను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం. విత్తన విక్రయదారులు/డీలర్లకు తప్పనిసరి లైసెన్సింగ్ విధానం ద్వారా నాణ్యత నియంత్రణ చేపట్టడం ఈ చటంలో మరియెక ముఖ్యమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన పరీక్ష అధికారులను (సీడ్ ఎనలిస్టులను) మరియు విధ్న తనిఖీ అధికారులకు నియమించి, విత్తన విక్రయదారులు మరియు డీలర్లు అమ్మే విత్తనాల నుండి నమూనాలను సేకరించి, పరిశించి, నివేదిక రూపొందించడం జరుగుతుంది. ఒక వేళ ఏదైనా విత్తనం నిర్ధేశిత నాణ్యత ప్రమాణాలను కలిగి ఉండనతైతే, సదరు విక్రయదారుల పై రూ.500/- వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ రెండవసారి అదే వేరం చేస్తే రూ.1000/- జరిమానా లేదా 6 నెలలు జెలుశిక్ష లేదా రెండు వొధించే అవకాశం ఉంది. విత్తన వియంత్రణ శాసనం ప్రకారం, ప్రతి విత్తన డీలర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖా నుండి లైసెన్స్ పొందాలి. ఒకసారి తీసుకున్న లైసెన్స్ 3 సంవత్సరాల పాటు ఉపయెగపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయించుకోవాలి. విత్తన తనిఖీ అధికారులకు (తెలంగాణ రాష్ట్రంలో అయితే మండల వ్యవసాయ అధికారి) విత్తన దుకాణాల్లో విక్రయంచబడే విత్తనాలను నుండి నమూనా సేకరించే, రికార్డులను తనిఖీ చేసే డీలర్ల పై చట్టపరమైన చర్యలు చేపట్టే అధికారం విత్తన తనిఖీ అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే విత్తనాలు రైతులు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచులు, ప్యాకెట్లు లేదా డబ్బాల పై ముదిరించబడిన సమాచారాన్ని పరిశీలించాలి. పంట, రకం, లాట్ నెంబర్ జన్యు/భూతికి శుద్ధత, మెలకశాతం, విత్తన పరీక్ష తేదీ మరియు ఎంత కాలం వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే అంశాల్ని ముఖ్యంగా గమనించిలి. విత్తనోత్పత్తిసారుని చిరునామా కూడా ముదిరించబడి ఉండాలి. అయితే రైతు సోదరులు ఈ విషయాలన్నీ గమనించడమే కాకుండా విత్తనాల్ని కొనేటప్పుడు తప్పనిసరిగా విక్రయదారుని నుండి రశీదు తీసుకోవాలి. ఒకవేళ విత్తనాల్ని విత్తుకొన్న తర్వాత నాసివాని నిరూపించబడితే, చట్ట రీత్యా రైతు పరిహారం పొందే అవకాశం ఉంది.

నూతన విత్తన బిల్లు

1990-2000 సం.ల. మధ్య కాలంలో ప్రపంచ వాణిజ్య రంగంలో చోటు చేసుకున్న మార్పులు, ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత తదనుగుణంగా విత్తన విధానాలు, చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావలసిన ఆవశ్యకత ఏర్పడింది. అదే కాకుండా జీవ సాంకేతిక పద్దతుల ద్వారా రూపొందించబడిన వంగడాలు విరివిగా వాడుకలోనికి వస్తున్న జాతీయ మరియు అంతర్జాతీయ విత్తన పరిశ్రమ వ్యాప్తికి మరింత దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త విత్తన బిల్లు (2010)ని రూపొందించడం జరిగింది. ఈ బిల్లు ఆమెదించనది చట్ట రూపం దాల్చితే, 1966 చట్టాన్ని తొలగించి దాని స్ధానంలోనే క్రొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు ఈ బిల్లు లోక్ సభ అనేదాన్ని పొందలేదు. అన్ని పంటలలో విత్తన నాణ్యత ప్రమాణాలను నియంతరించి తద్వారా దేశంలోని రైతులకు మంచి నాణ్యమైన విత్తనాన్ని అందించే లాశ్యంతో నూతన విత్తన బిల్లుని రూపొందించడం జరిగింది. విత్తన నాణ్యత ప్రమాణాలను పరిరశించడమే కాకుండా రైతుల హక్కుల పరిరక్షణ విత్తనోత్పత్తిలో ప్రయివేట్ సంస్ధల భాగస్వామ్యాన్ని పెంపొందిచడం మరియు విత్తన ఎగుమతి, దిగుమతులను సాలీకృతం చేసే ఉద్దేశ్యంతో ఈ బిల్లుని రూపొందించడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ధ విధి విధానాలకు అమ్మడం తెలిపే యెచనతో మరియు చిన్న, మధ్య తరగతి రైతుల ప్రయెజనాలను కాపాడే ఉద్దేశ్యంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ బిల్లులో పొందుపరచిన ముఖ్య అంశాలు

కేంద్ర విత్తన కమిటీని ఏర్పాటు చేయడం. జాతీయ విత్తన రిజిస్టర్ ని ఏర్పాటు చేసి అందులో అన్ని పంటలలో వివిధ రకాల విత్తనాల వివరాలను తప్పనిసరిగా వామేడు చేసుకోవలసి ఉంటుంది. విత్తన ఉత్పత్తిదారులు, విత్తన ప్రాసెసింగ్ సంస్ధలు విత్తన విద్రయాదరులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రైతులు తమ శేత్రంలో పండించిన పంట నుండి సేకరించుకున్న విత్తనాన్ని స్వయంగా మళ్ళీ పంటకు వాడుకోవచ్చు అయితే ఒక బ్రండ్ పేరుతో మాత్రం అమ్మడానికి వీలులేదు. ఈ చట్టం ప్రకారం విత్తనోత్పత్తిదారులు, పంపిణీదారులు లేదు విత్తన విక్రయాలు జరిపే వారు విత్తనాలు వేసిన తర్వాత ఆశించే పంట దిగుబడి లేదా ఇతర మంచి లక్షణాల్ని విత్తన కొనుకోలుదారునికి ముందే తెలియజేయాలి. ఒకవేళ ఆ ప్రకారం పంట దిగుబడి రాకపోయినా, ఇంకా ఏవైనా సమస్యలు తలైతిని, వినియేగదారులు రక్షణ చట్టం 1986 ప్రకారం రైతులు విత్తన సంస్ధల నుండి నష్ట పరిహారం పొందే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం విత్తన స్వయాంధ్రువీకరణ ఏదైనా అధీకృత సంస్ధద్వారా చేయించుకోవచ్చు. విదేశీ విత్తన ధ్రువీకరణ సంస్ధలను కూడా గుర్తించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయబడిన విత్తనాలన్నీ కనీస విత్తన నాణ్యత ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ విత్తనాల ధృవీకరణ, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్ధల ద్వారా ఉత్పత్తిదారులు చేయంచుకోవచ్చు. విత్తన తనిఖీ అధికారుల అధికారాలను మరింత బలోపేతం చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలలో కూడిన విత్తన నాణ్యత పరీక్ష మరియు ధృవీకరణ పద్దతులను ప్రవేశపెట్టడం జరిగింది. క్రొత్త ప్రాంతాల్లో విత్తనోత్పత్తికి రాయితీ ద్వారా ప్రోత్సాహం అందజేయడం కూడా ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది.

విత్తన పరిశ్రమ, రైతు సంఘాలు, రాష్ట్రాలనుండి ఈ బిల్లు పై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. వివిధ వర్గాల నుండి వెలువడిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని తగు విధంగా మార్పులు, చేర్పాలు చేసి త్వరలో ఉభయ సభల అమ్మడం ద్వారా చట్టం రూపంలో తీసుకుని వసై మరింత ప్రయేజనకారిగా ఉంటుంది. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాల గురించి అవగాహనా కార్యక్రమాలు, రైతులకు, విత్తనోత్పత్తి దారులకు మరియు విత్తనరంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి విస్తృతుత ప్రచారాన్ని కల్పించినప్పుడే అన్ని వర్గాలకు ప్రయెజనం చేకూరుతుంది.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.0350877193
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు