অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎర్రచందనం

‘రక్త చందనం’, ‘రక్తగంధం’, ‘అగరు గంధం’ అనే పేర్లతో పిలువబడుచున్న బహువార్షిక పెద్ద చెట్టు. సుమారు 10 మీ. పెరుగతుంది. కాండం చుట్టుకొలత 1-1.5 మీ. వరకు ఉంటుంది. బెరడు పగుళ్ళబారి ఎండి మొసలి చర్మంలో కంపిస్తుంది.

నేలలు

సముద్ర మట్టానికి 500 - 600 మీ. ఎత్తులో వాతావరణంలో పొడిగా ఉండి సున్నపు రాయితో కూడిన లేటరైట్ నెలల్లో 100 మి. మీ. కు తక్కువ కాని సగటు వర్షపాతంలో బాగా పెరుగుతుంది. రాళ్ళూ, గులక రాళ్ళ తో కూడిన నెలల్లో పెరిగే చెట్ల నుండి వచ్చే కలప మంచి నాణ్యతతో కూడినదై ఉంటుంది.

రకాలు

ఈ మొక్కలు విత్తనాల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అయితే శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కూడ మొక్కలు పెంచే అవకాశం ఉన్నది.

విత్తన మోతాదు (ఎకరాకు)

డిసెంబర్-ఫెబ్రవరి మధ్య కాలాలు విత్తని సేకరణకు అనుకూలం. కాయలు తయారయ్యేందుకు 10-11 నెలల కాలం పడుతుంది. కాయలు పలుచగా రెక్కలతో సహా 3-4 సెం. మీ. పరిధిలో ఉంటాయి. ఒక్కొక్క గింజ 1-1.5 సెం. మీ. పొడవుతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి,. సేకరించిన విత్తనాలను మూడు రోజుల పాటు ఎండబెట్టిన 8 నెలలువరకు మొలకెత్తే శక్తిని నిలబెట్టికుంటాయి. ఎకరానికి 8 నెలల వరకు మొలకేత్తే శక్తిని నిలబెట్టికుంటాయి. ఎకరానికి రెండు కిలోల విత్తనం కావాలి.

విత్తన శుద్ధి

విత్తనాన్ని 3 రోజుల పాటు చల్లని నీటిలో నానబెట్టి గాని లేదా ఆవు పేడ ద్రావణంలో 48గం. నానబెట్టి గాని విత్తుకున్నట్లయితే అధిక మొలక శాతం పొందడానికి అవకాశం ఉంటుంది.

విత్తే దూరం

3.5 మీ లేదా 4.5 మీ.

నారుమడి యాజమాన్యం

నారుమడిలో పెంచిన మొక్కలను 4-10 అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు పాలిధిన్ సంచులలోకి మార్చుకోవాలి. 4 నెలల తర్వాత ఈ పాలిధిన్ సంచ్చులను నెమ్మదిగా నిడ నుంచి ఎండ పడే ప్రాంతాలకు మర్చి 3-4 నెలల వరకు నీటి తడి ఇవ్వవలసి వుంటుంది. వేరు వ్యవస్ద 20-60 సెం. మీ. పెరిగినపుడు నాటుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు గుర్తించాలి.

నీటి తడులు

మొదటి రెండు సంవత్సరాల పాటు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.

దిగుబడి

15 సంవత్సరాల వయస్సు చెట్ల నుండి ఒక ఎకరానికి 12 టన్నుల కాయ దిగుబడి వస్తుంది. 20-25 సంవత్సరాల వయస్సు చెట్ల నుండి బెరడు, కలప తీయడానికి ఉంటాయి. బెరడును సాధారణంగా ప్రత్యేక మైన స్ట్రిప్ పద్ధతిలో వేరుచేయడం జరుగుతుంది. కలప కోసమైతే నరికిన చెట్ల నుండి లేత కలపను, చేవ దేరిన కలపను వేరు చేస్తారు. లేత, చేవదేరిన మరియు బెరడు నుంచి శాంటాలిన్ – ఎ, శాంటాలిన్ – బి అనే రెండు రకాల రంగులను తీస్తారు. చేవదేరిన కలప ముదురు ఎరుపు రంగులో 1.10 సాంద్రతతో చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెట్ల నుండి ఐసోటిల్ కార్పోలిన్, టిరోకార్ప్ ట్రాయోల్, ఐసోటిరోకార్ప్న్, టిరోకర్బ్ యోన్, ఎసిటైలీయానోలిన్ ఆమ్లాలను వేరు చేసి మందుల తయారీలో వాడుతున్నారు. ఇది విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate