অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

టమాటా

ప్రపంచంలో  అత్యధికంగా సాగుచేయు కూరగాయలలో ఆలుగడ్డ తరువాత టమాటా ముఖ్యమైనది.

ఉపయెగాలు:

వీటిని అధికంగా కూరగాయగానే కాకుండా సుపుగాను, క్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్టూ మరియు పొడి రూపంలో కూడా వాడుతారు. తమటలో అధికంగా విటమిన్ 'సి' వుంటుంది. వీటి ఉత్పత్తులకు అనేక దేశాలలో గిరికి ఉంటుంది. టమాటా విత్తనంలో 24 % నూనె వుంటుంది. దీని నూనెను సలాడ్ నూనెగా పార్గర్తెన్ పరిశ్రమలలో వాడుతారు. టమాటా గుజ్జుకు రక్తశుద్ధి మరియు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధులను నయము చేయు గుణము కలదు. భారతదేశములో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో టమాటాను పండిస్తున్నారు. కానీ ఎక్కువగా వ్యాపార సరళిలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకు, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, అస్సాం, మహా రాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రలలో పండిస్తున్నారు.

విస్తీర్ణం:

భారత దేశంలో 8085840 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడి హెక్టారుకు 19 . 5 టన్నుల నాగటూ దిగుబడితో మొత్తం 1,96,96,920 టన్నుల నాగటూ దిగుబడి వస్తుంది.

తెలంగాణలో 53640 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడి హెస్టరుకు 12.6టన్నుల నగతు దిగుబడితో మొత్తం 13,64,930 టన్నుల దిగుబడి వస్తంది.

టమాటా సాగులో సమస్యలు :

  • ఎండాకాలంలో దిగుబడి తగ్గిపోవుట
  • వర్షాకాలపు పంటలో ఎండు తెగులు
  • కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్ళు
  • అధిక ఉప్నోగ్రతను తట్టుకోను రకాల విత్తనాలు లభించకపోవడం

నివారణ మార్గాలు :

  • అధిక ఉప్నోగ్రతలో కూడా (>28 సెం.) కాయకట్టు రకాలను ఎంచుకొని సరైన సమగ్ర యాజమాన్య పద్దతులను అవలంభించవలయును.
  • సమగ్ర సస్యరక్షణ పద్దతులను అవలంచించి తెగుళ్ళను తట్టుకోను రకాలు, హతేబ్రిడ్స్ ను సాగుచేయాలి.
  • రైతు స్ధాయిలో విత్తనోత్పత్తికి శిక్షణా తరగతులు నిర్వహించి, విత్తన గ్రామాలను ఏర్పరచి, మార్కెటింగ్ నియంత్రణ ఉండేటట్లు చూడాలి.

టమాటా రకాలు:

పూసారుబి: నాటిన 60-65 రోజులలో కోతకు వచ్చును. పంటకాల పరిమితి 130 - 135 రోజులు. ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి నిచ్చును.

పూసా ఎర్లీ డ్వార్ఫ్ : నాటిన 60 రోజుల లోపల పూసారుబి కన్నా తొందరగా కాపుకు వస్తుంది. తొలకరి వర్షాలకు వేసుకోవటానికి అనుకూలం. ఈ రకం అధిక వర్షాన్ని తట్టుకోగలిగి, 125-130 రోజుల కాల పరిమితితో ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి నిస్తుంది.

అర్కావికాస్: ఈ రకం 80-85 గ్రాముల బరువుగల కోలా పండ్లను కలిగి వుంటుంది. ఖరీఫ్ కు అనువైనది. పతకాల పరిమితి 105-110 రోజులు. ఎకరాకు 14-16 టన్నుల దిగుబడి నిస్తుంది.

పి.కె. ఎం - 1 : ఈ రకం మొక్కలు చిన్నవిగా ఉండటం వలన ఎకరానికి ఎక్కవ మొక్కలు నాటవచ్చును, అన్నికాలములలోను సాగుచేయటకు అనువైనది. కాల పరిమితి 135 రోజులు. ఎకరాకు 12.8 టన్నుల దిగుబడి వస్తుంది.

అర్కషారబ్: ప్రతి పండు సరాసరి 70 గ్రా. బరువును కలిగి వుంటుంది. కయ పగులును తట్టుకొంటుంది. ఖరీఫ్ కు అనువైనది. పంటకాల పరిమితి 105-110 రోజులు. ఎకరాకు 14 టన్నుల దిగుబడినిచ్చును.

మారుతమ్: కాయలు లేత ఆకుపచ్చ రంగులో గుండ్రంగా వుంటాయి. ఇది పిబ్రవరి - మార్చికి అనువైన రకం. అధిక ఉప్నోగ్రతలో కూడా కయ కడుతుంది. ఎకరాకు 8-10  టన్నులు దిగుబడి నిస్తుంది.

తీగ రకాలు : అర్క సొరభ్, అర్క వికాస్, పూసా రూబీ, పూసా ఉపహల్, పంత్ మహర్, పూసా దివ్య.

పొద రకాలు : పూసా ఎర్లీ డ్వార్ష్, పూసా గ్రారావ్, పూసా సాదబాహర్, రత్న, రూపాలు, అవినాష్ - 2 , కో - 3 , హిస్సార్ 101 & 102 , హిస్సార్ అన్మేల్, హిస్సార్ లలిమ, రజని, రోమా మెదులగునవి.

పూసా రోహిణి : ఎక్కువ నిల్వ ఉండి, ప్రాసెసింగ్ కు అనువైనది. దిగుబడి 16.5 ట/ఎకరాకు.

పూసా సదా బహార్ : 8o సెల్సియస్ నుండి 30o సెల్సియస్  వరకు గల వాతావరణంలో పెరుగుతుంది. దిగుబడి 10-14 ట/ఎకరాకు.

పూసా హైబ్రిడ్ - 4 : నులి పురుగులను తట్టుకునే రకం. దిగుబడి 22 ట/ఎకరాకు.

సంకరజాతి రకాలు:

అవినాశ్ - 2 , నవీన్, రూపాలి, రిషి, అభిమాన్, మనమెహన్, మినాశి, లారీక, బి.యస్.యస్, - 20 , వైశాలి, రష్మీ, యం.టి.హెచ్-6 , మంగళ, పూసా హైబ్రాడ్ - 1 , అర్క వర్ధన్, ఆర్కా విశాల్ మెదలయిన సంకర జాతి రకాలు మన రాష్ట్రములో వండించుటకు అనుకూలమైనవి.

వర్షాధార పంటకు: అర్క మేఘాలు, పూసా ఎర్లీ డ్వార్ఫ్, కొద్దిగా ఆలస్యంగా వేసుకోవటానికి పూసారుబి, అర్క వికాస్ అనుకూలమైనవి.

శీతాకాల పంటకు: పూసా రూబీ, పూసా ఎర్లీ, డ్వార్ఫ్, అర్క వికాస్, అర్క సేరభ్

వేసవి పంటకు: మారుత మ్, పికెఎం-1 , అర్క వికాస్, అర్క సేరభ్

వాతావరణం : టమాటా శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలంలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనము 18.5 సెం. నుండి 24 సెం లో బాగా మెలకెత్తుతుంది. కాయ 15 సెం నుండి 32 సెం వరకు బాగా కట్టుతుంది. టమాటా ఎక్కవ ఉప్నోగ్రతను గని, ఎక్కవ వర్షపాతమును గాని తట్టుకొనలేదు. వేసవిలో ఈ పంటను వాతావరణము చల్లగా ఉండు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాలలోను మరియు విశాఖపట్టణం  జిల్లాలోని అరకు ప్రాంతాలలోను సాగు చేయవచ్చును.

నేలలు : టమాటాను ఇనుకతో కూడిన గారప నేలలు నుండి బరువైన బంక నెలల వరకు వివిధ రకములైన నెలల్లో సాగుచేయవచ్చును. అధిక దిగుబడికి నీరు బాగా ఇంకా బరువైన గారప నెలల శ్రష్టము. వర్షాకాల ప్రారంభంలో తెలంగాణలోని తేలిక పాటి నేలలందు అర్షకాల పంటగా కూడా సాగుచేయవచ్చును. ఉదజని సూచీకి 6.0   నుండి 7.0 గల సారవంతమైన నేలలు చాల అనుసులము.

పంట కలం: టమాటాను మన రాష్ట్రంలో అన్ని కాలాలలో పండిస్తున్నారు. కానీ రబి పంటకాలం ముఖ్యమైనది. ఖరీఫ్ పంట  జూన్-జులై (వర్షధారపు పంట) మాసాలలోను, రబి పంట  అక్టోబర్-నవంబర్ మాసాలలోను, వేసవి పండి స్తే అధిక దిగుబడులు వస్తాయి.

వేసవి కాలంలో ఆలస్యంగా విత్తినప్పుడు శంఖు మరియు ముడత రోగములు ఆశించి పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది.

విత్తన మేతదు : సూటి రకాలకు ఏకలకు 200  గ్రాముల విత్తనము కావాలి. కానీ సంకరజాతి రకాలకు 70 నుండి 80 గ్రా. విత్తనము ఎకరాకు సరిపోతుంది.

విత్తనశుద్ధి : ఆకుపచ్చ మరియు ఆకుమడు తెగులు సోకకుండా కప్తాన్ లేక మాంకోజెబ్ పూడి ముండును 3 గ్రా. ఒక్కకిలో విధానమునకు పట్టించి విత్తుకోవాలి. వేసవిలో రసం పీల్చు పురుగుల చెడదా తెట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. కిలో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

నారుమడులు పెంపకం :

నేలను శుభ్రంగా 3-4 సార్లు వగలితో దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 40 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 4 కిలోల సైపర్ పస్పెట్ (40 చ.మీ.ల నారుమడికి) వేసి కలియదున్నాలి. 4.0 మీ  పొడువు 1.0 మీ వెడల్పు 15 సెం. మీ ఎత్తు కలిగిన నారుమడులను తాయారు చేసుకోవాలి. మరుగు నీరు పోవుటకు మడికి మడికి మధ్య 50 సెం. మీ. వ్యత్యాసం ఉంచాలి. ఒక  ఎకరాకు 10 వారమడులు సరిపోతాయి.

నెల ద్వారా ఉత్పన్నమయ్యే శిలీముద్రలను అరికట్టడానికి ఒక శాతం బోర్డామిశ్రమమున లేదు రాజధాతు శిలీముద్రణశానితో నారుమడి తడిచేలా పిచికారి చేసి రోగ రహితం చేయాలి.

నారుమడిలో విత్తనాలను 10 సెం.మీ. ఎడముగల వరుసలలో పై పైన 1-2 సెం. మీ. లోతులో విత్తాలి. విత్తినాలను ఎక్కువ వత్తుగా విత్తరాదు. ఆ తరువాత రోజ్కన్తో నీరు పెట్టాలి. మొలకెత్తే వరకు నర్మాదుల పై ఎండు గడ్డి కట్టాలి. దీని వాలాను విత్తనాలు బాగా మెలకెత్తుతాయి. మెలకెత్తగానే కప్పినాగడ్డిని తీసివేయాలి.

నారుమడులలో ఎప్పటి కప్పుడు కలవు తీసివేయాలి. 40 చ.మీ. నారుమడికి ఫూరడం 3 జి గుళికలు 100 గ్రా. లు చల్లి కీటక రహితం చేయాలి. రసం పీల్చే పురుగులు మరియు ఆకుమచ్చు తెగులును నిరోధించటానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.

నారు మొక్కలు త్వరగా పెరగడానికిగాను అధిక మేతదులో నత్రజని ఎరువులకు వాడటం లేదా అధిక నీటి తడులు ఇవ్వడం లాంటి ప్రయత్నాలు చేయరాదు. నారు మక్కలు పీకడానికి 7-10 రోజులు ముందుగా క్రమక్రమంగా నీటి తడులు తగ్గించట వలన నారు దూరడంగా తయారవుతుంది.

నారు పీకడానికి 6-12 గ.ల ముందు విత్తన మందులను నీటితో తడపాలి. తద్వారా నారు పీకడం సులభతరం అవడమే కాకుండా మొక్క దూరడంగా ఉంది వేలుకు రక్షణగా ఉపయెగపడుతుంది. ఈ మధ్య కాలంలో నారును ప్రోత్ర్లలో పెంచుతున్నారు.

ప్రధాన శేత్రం / నేల తయారీ :

భూమిని నాగలితో 3-4 సార్లు బాగా దుక్కిదున్ని చదును చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల బాగా మరీనా పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. క్రితం పంట మెదళ్ళను, మిగిలిన అవశేషాలను ఏరి తగుల బెట్టాలి.

నాటుదురం : టమాటా పంటను వరసాలలోకాని లేదా బోదెలలోకాని నాటుకోవాలి. వర్షాకాలంలో వారనుకు వరునకు 60 సెం. మీ. దూరం ఉండేలాగా మరియు మొక్కకు 40 నుండి 45 సెం.మీ ఉండేలాగా, శీతాకాలంలో 60*60 సెం.మీ. డేరంలో, వేసవిలో 45*30 సెం.మీ దూరం నాటుకోవాలి.

దంట్లు వేయట (ఖాళీలను పూరించడం) :

ఒక్కొక్క దంటుకు రెండు మొక్కలు ఉండేలాగా చూడాలి. మిగిలిన మొక్కలు తీసి, లేని వాటి దగ్గర నాటాలి. అన్ని వరుసలలో ఖాళీ లేకుండా మొక్కలు ఉండేలా చూడాలి.

ఎరువుల యాజమాన్యం :

ఆఖరి దుక్కిలో ఎకరాకు దాదావు 8-12 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ను ఇచ్చు ఎరువులు వేసి బాగా కలియదున్నాలి. 40 కిలోల నత్రజనిని మాడు సమపాళ్ళుగా చేసి వాటిని 30 వ రోజు, 45 వ రోజు మరియు 60 వ రోజున వేయాలి. సంకరజాతి రకాలు వేసుకున్నప్పుడు రసాయనిక ఎరువులను 50 శాతం పెంచి వేసుకోవాలి.

జీవన ఎరువులు : ఎకరాకు 2 కిలోల అజుతోబాక్టర్ను 50 కిలోల పశువుల ఎరువులో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజుల మాగినిచ్చి తర్వాత ఆఖరు దుక్కిలో వేయాలి. దీనితో పట్టుగా ఎకరాకు 2 కిలోల పాస్పో బాక్టీరియా (పి ఎన్ బి) ను పొలం అంత నామంగా చల్లుకోవాలి. ఏ జీవన ఎరువులు వేసినప్పుడు సిఫార్సు చేసిన 25% నత్రజని, భాస్వరం అదా అవుతుంది.

నీటి యాజమాన్యం : నాటిన 5 - 6 రోజులకు సరిగా నీరుకట్టి దంటు వేయాలి. భూమి తేమను బట్టి వర్షధారపు పంటలలో నీరు పారించాలి.

కలుపు నివారణ మరియు అంతర కృశ్శి: నాటిన 25-30 రోజులలో దంతెను నడిపించిగాని, చేతిలోగాని కలుపు మొక్కలను తీసి వేయాలి. మట్టిని బోదెలకు ఎగదోసి సరి చేయాలి. లేదా పెండిమిధలైన్ (స్టాంప్) అనే కలుపు మందును 6 మీ.లి లీటరు నీటిలో కలిపి (ఎకరాకు 1.2 లి. స్టాంప్/200 లి. నీటిలో) నాటిన తీసి బోదెలు ఎగదోయాలి.

మొక్కలకు ఊతమివ్వుట : పొడవుగా పెరిగే తీగ టమాటా రకాల/శంకర రకాలకు కర్రలను పాతి ఊతం ఇవ్వటం వలన మంచి నమ్యత గల కాయల దిగుబడి పెరుగుతుంది. వెదురు బొంగులతో ఊతం ఇచ్చే ప్రక్రియ కొంత మంది రైతులు వయసు నుండి ప్రారంభించాలి. కొంత మందిరైతులు పందిరి కారింది టమాటా సాగు చేస్తున్నారు. అప్పుడు టమాటా కొమ్మలకు ప్లాస్టిక్ వైరు కట్టి నేరుగా పందిరి లాగి ఊతం కల్పించవచ్చు.

వేసవి పంటలో తమతను ఎండ తీవ్రత నుండి తగ్గించుటకు 35% షేడ్నెట్లను  పందిరి పై పరచాలి. పొలంలో అయితే ప్రతి 2-3 వారసులకు ఒక వరస మొక్కజొన్న పంటను ఉత్తర డాషిణా దిశలలో విత్తుకోవాలి.

సస్యరక్షణ : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలెను.

  1. వెనవి లోతు దుక్కులు చేసి ప్యుపాలను నశింప చేయాలి.
  2. ఎరా పంటగా బంతిని వేయవలయును. బంతినారుసు 20 రోజుల ముందుగా నాటుకోవాలి. ప్రతి 16 వరసల టమాటా పంటకు ఒక వరస బంతి నరుసు నాటుకోవాలి.
  3. లేదా 40 రోజుల బంతి నారుసు, టమాటా నారుతో కలిపి నాటిన, రెండు ఒకేసారి పూతకు  వచ్చి శనగపచ్చ పురుగులు బంతి పులచే ఆకర్షించబడుతాయి.
  4. యాన్. పి.వి. వైరస్ ద్రావణాన్ని ఎకరానికి 250 యల్.ఇ. చొ న పిచికారి చేయాలి.
  5. నాటిన 28 , 35 రోజులకు ధాయేదికార్బ్ 75 % డబ్ల్యు.పి 1 గ్రా. లేదా నోవాల్యూరాన్ 10 % ఇ.సి 1. 5 మీ.లి. లేదా ఇందాకేసాకర్బ్ 14 . 5 % యస్.సి 1 మీ.లి. లేదా క్లొరాంత్రనిలిపారోల్ 18 . 5%  ఇసి 0 . 3 మీ.లి లేదా ప్రొఫెహోఫాస్ లేదా క్వింఅల్ఫాస్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి మర్చి మందులు పిచికారి చేయాలి. ఎకరాకు 200  లీటర్ల ద్రావణం తప్పనిసరిగా పాచికర చేయాలి.>

ఆశింతల పురుగు : పిల్లపురుగు, పెద్ద పురుగు ఆకుల పత్రహరితమును గోకి తిని వేయును, ఆశించిన ఆకులూ తెరవలె కంపించును. దీని నివారణకు ప్రొఫెనోఫేస్ లేదా క్వింఅల్ఫాస్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పచ్చదోమ : పిల్లపురుగు పెద్ద పురుగు ఆకూ అడుగు భాగాన ఉంది రానంపిల్చి వేయుట వలన ఆకులూ వడలిపోయి ఎండిపోవును. దీని నివారణకు డైమిదోయేట్ లేదా మెరసిస్తక్స్ లేదా ఫిప్రాణి 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తమర పురుగులు : ఇది మొక్కల నుండి రసం పీల్చటం వలన ఆకులూ ఎండి తలిపోతాయ్. ఆకుల మీరు, కందం మీద తెల్లటి మచ్చల ఎండుతెగులు (ఠిస్డబ్లుని) అను వైరస్ వాహకాలుగా ఉంది ఎక్కువ నష్టం కలుగచేస్తాయి. వీటి నివారణకు వేపనూనె 10,000 పిసియం 3 మీ.లి.లేదా డైమిదోయేట్ 35 % ఇ.సి. 2 మీ.లి. లేదా ఫిప్రోనిల్ 5 % ఎస్.సి. 2 మీ.లి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్.సి. 0.3 మీ.లి. లేదా ఏసీ ఫేట్ 75% ఎస్.సి. 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి : వేడి పొడి వాతావరణం లో వీటి ఉదృతి ఎక్కువగా ఉంటుంది. పురుగులు సాలె గుళ్ళ మాదిరిగా కట్టుకొని రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి. వీటి నివారణకు గంధకం పొడి 80% డబ్ల్యు.పి. 3 గ్రా.లేదా డైకోఫాల్ 18.5% ఇ.సి. 5 మీ.లి. నీటికి కలిపి మర్చి పిచికారి చేయాలి.

తెగుళ్ళు:

నారుకుళ్ళు తెగులు : నారుమడులలోని నారు మొక్కలకు ఈ తెగులు ఎక్కువ సోకుతుంది. దీని వలన నారు మొక్కల మెదళ్ళు కుళ్ళిపోయి పారిపోవును. దీని నివారణకు

  1. విత్తనం నారుమడిలో పలుచగా విత్తాలి.
  2. విత్తనానికి 2-3 గ్రా. ధైరామ్ లేదా మ్యంకోజెబ్ లేదా 10 గ్రా. లేదా  స్త్రెకోడెర్మావిరిడి కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
  3. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కాపర్ సల్పేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి బరుమది తడి జలగ పోయాలి.

వడలు తెగులు : మొక్క అడుగు ఆకులూ పసుపుతుంగుకు మరి తొడిమతో సహా రాలిపోవును. ఆ తరువాత మొక్క వడలిపోయి చనిపోవును. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు తట్టుకొని రకాలను వాడాలి. పంట మార్పిడి పద్దతిని అవలంభించిలి.

ఆకుమడు తెగులు : గోధుమ ఠంగుతో కూడిన నళయకారపు మచ్చలు కాండము, ఆకులూ, కాయల మీద ఏర్పడును. కాయలు కుళ్ళి రాలిపోవును. మొక్కలు ఎండిపోవును, దీని నివారణకు మాంకోజెబ్ 3గ్రా./లి.  లేదా ప్రొపికోనజోల్ 1 మీ.లి. నీటికి కలిపి పిచికారి చేయాలి.

వైరస్ తెగులు : ఆకులో అక్కడక్కడా పసుపు పచ్చిని మచ్చలు ఏర్పడును. ఆకూ ఉపరి తాళము పెళుసుగా మారిపోవును. దీని నివారణకు వైరస్ తెగులు వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగులు బెడద తగ్గించటానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనాశద్ది తెగులు సోకినా మొక్కలను పెరికి నాశనము చేయాలి. తెగులు వ్యాప్తి చేయు రసము పీల్చే పురుగులు నివారణకు అంతర్వాహిక మందులైన మెటాసిస్టాక్స్ / ఇమిడాక్లోప్రిడ్ 0.3 మీ.లి. లేదా దయమీదకేసం 0.3 గ్రా. లీటరు నీటికి కలిపి మందులను మర్చి పిచికారి చేయాలి.

టమాటా మచ్చ మాడు వైరస్ (టి ఎస్ డా బ్ల్యుని) :  చిగురు ఆకుల పై భాగంలో గోధుమ వర్ణంతో కూడిన పసుపు రంగు మక్కలు రాపిడి ఆకులూ క్రీంది వైపుకు వంగిపోయి ఉండును. తెగులు ఆశించిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే కీటకాల నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారి చేయాలి. 40 చ. మీ. నారుమడిలో 100 గ్రా. మరియు నాటిన 10 వ రోజును ఎకరాకు 6 కిలోల ఫూరడం 3 జి గుళికలు వాడాలి.

పంటకోత : నాటిన 65-70 రోజుల నుండి కోతకు వస్తుంది. ఆ తరువాత 45-60 రోజుల వరకు కాయలు వస్తాయి. దూర ప్రాంతాలకు పంపే కాయలను పచ్చగా వున్నప్పుడే కోసుకోవాలి. ప్రాసెసింగ్కు బాగా పండిన పళ్ళను కోయాలి.

దిగుబడి : రబీలో 12-16 తన్నులు / ఎకరాకు. వేసవిలో 8-10 తన్నులు / ఎకరాకు.

పంటకోత అనంతరం జాగ్రత్తలు :

గ్రేడింగ్ : కాయలు కోసిన తరువాత సాధారణంగా రైతులు గంపలలో కానీ, బట్టలలో కానీ గ్రేడింగ్ చేయకుంగా అమ్మడం వలన తక్కువ  ధర పలికి నష్టం వస్తుంది. కావున టమాటా కాయలు కోసిన వెంటనే కాయ పరిమాణమును బట్టి వివిధ గ్రేడులుగా చేయాలి.

ప్యాకింగ్ : టమాటా  కాయలను గ్రేడింగ్ చేసిన తరువాహత బట్టలకు బదులుగా పిలాస్టిక్ క్రేట్లలోగాని, ప్లాఅస్టిక్ సంచులలోగాని ప్యాక్ చేయాలి. టమాటాలు ప్లాస్టిక్ క్రేట్స్లలో పాక్ చేసినట్లయితే దూత ప్రాంతాలకు రవాణా చేయటకు అనుకూలం. డోరా టమాటాలు సోడియం హైపోక్లోరైట్ 25 మీ.గ్రా./లి. నీటిని కలిపినా ద్రావణంలో ముండిన 21 రోజుల వరుకు సాయిలు నిల్వ వుంటాయి.

వాక్సింగ్ : టమాటా కాయలకు వాక్సింగ్ చేయుట వలన బరువు తగ్గకుంగా చాలా రోజలు నిల్వ వుంటాయి. టమాటా కాయలను 6 % వఙ్కసోల్ ఎమల్షన్ మరియు 9 % సోడియం అర్ధోపినైల్ పినెట్లో ముంచి తీసిచ్చి చాలా రోజులు నిల్వ వుంటాయి.

నిల్వ వుంచుట : టమాటా పండ్లను 13 సెం. లో 90% తేమలో ఎక్కవ రోజులు నిల్వ వుంచవచ్చును.

టమాటా పండ్లతో ఉత్పత్తులు :  టమాటా పండ్లను వివిధ ఉత్పత్తు తాయారు చేయవచ్చును. ఇందులో ముఖ్యమైనవి టమాటా రసము, టమాటా కెచప్ , టమాటా చిప్స్, టమాటా సూపు, టమాటా క్యానింగ్ మరియు టమాటా వరుగులు, తీపిరకాలతో సలాడ్, కెచప్, ప్యూరీ మొదలగునవి తాయారు చేయ వచ్చును.

టమాటాలో వైరస్ తెగుళ్ళ యజమాన్యము :

  • ఆరోగ్యవంతమైన పంట / నెల నుండి విత్తనాలు సేకరించాలి.
  • వైరస్ తెగుళ్ళను తట్టుకొనే రకాలు వాడాలి ఉదా: హిస్సార్, ఆన్మేల్
  • నాటే ముందు ట్రై సోడియం అర్ధోపస్పెట్ ద్రావణంలా (150 గ్రా. లీటరు మంచి నీరు ) పది నిముషాలు నానబెట్టి, తర్వాత మంచి నీటిలో శుభ్రంగా కడిగి విత్తుకోవాలి.
  • వారుముడికి 40  మెష్  వలలు / దోమతెరలు ఏర్పరచాలి.
  • కంచె పంటలుగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేయాలి.
  • ఎప్పటికప్పుడు కలుపు తయాలి.
  • వైరస్ సోకినా మొక్కలను పీకి నాశనం చేయాలి.
  • అంతర్వాహిక కీటక నాశనులను వాడాలి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate