অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆయిల్ పామ్ లో అంతర పంటలు సాగు – యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ఆయిల్ పామ్ పంటను తెలంగాణ రాష్ట్రంలో 16,912 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి మరియు నల్గొండ జిల్లాల్లో సాగునీటి ఆధారంగా పండిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం మరియు నెలూరు జిల్లాల్లో పండిస్తున్నారు.

ఆయిల్ పామ్ పంట వేసిన మొదటి మూడు సంవత్సరాలలో ఫలసాయం ఉండదు. ఆయిల్ పామ్ దీర్ఘకాలపు పంట. మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మి. దూరంతో నాటుతారు. మొక్కల మొదటి మూడు సంవత్సరాల కాలంలో ఖాళీ స్థలం ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలలోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ళ వరకు మరియు ఎనిమిదేళ్ళ పైబడిన తోటలలో అంతర పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ లో అంతర పంటల సాగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగ ఆయిల్ పామ్ వరసల మధ్య ఉన్న ఖాళీ స్ధలాన్ని ఉపయోగించుకుంటూ అధిక నికర ఆదాయంను పొందడం.

సాగు నీటి సదుపాయం సమృద్ధిగా ఉంటే సహజ వనరులైన భూమి, గాలి మరియు సూర్యరశ్మిలను సమర్థవంతంగా సద్వినియోగ పరుచుకొని అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

ఆయిల్ పామ్లో అంతరపంటల ద్వారా లాభాలు

  • అంతర పంటల ద్వారా సహజవనరులైనటువంటి నేలలోని పోషకాలను, నీరు మరియు సూర్యరశ్మిలను సద్వినియోగపరచుకొనడమే కాకుండా కలుపు వెుక్కలను నివారించి భూమి అరుగుదలను తగ్గించవచ్చు.
  • అంతరపంట యొక్క వ్యర్ధ పదార్ధాలను తిరిగి నేలలో కలపడం ద్వారా అవి కుళ్ళి భూసారాన్ని పెంచి అధిక దిగుబడులతో అదనపు ఆదాయం పొందవచ్చు.
  • మార్కెట్ లో ఆయిల్ పామ్ గెలల ధర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికి అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం రైతుకు ఊరటనిస్తుంది.
  • వనరుల సద్వినియోగంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఆయిల్ పామ్ లో అంతరపంటలు పండించడానికి ఉన్న అవకాశాలు

అంతర పంటలు పండించడానికి గాను ఆయిల్పామ్ తోటలను 3 రకాలుగా విభజించవచ్చు.

మొదటి దశ: మొదటి మూడేళ్ళలో సరిపడినంత స్థలం, గాలి, సూర్యరశ్మి అంతరపంటల సాగుకు లభిస్తాయి. ఈ దశలో ఎంపిక చేసుకునే అంతరపంటలు నేల, వాతావరణ పరిస్థితులు, ధర మరియు మార్కెటింగ్ సౌకర్యాలకు అనువుగా వుండాలి. ఆయిల్ పామ్లో అంతరపంటల సాగు కొరకు ఎంపిక చేసుకునే అంతర పంట కూడా ఆయిల్ పామ్తో పాటు ఒకే వాతావరణ పరిస్థితులలో పెరిగే దై వుండాలి. అంతర పంట సాగు కొరకు ఎంపిక చేసుకునే పంట ఎక్కువ పరుగు, తెగుళ్ళ బారిన పడకుండా వుండాలి. అంతర పంట సాగుకై ఎంపిక చేసుకొన్న పంట వేరు వ్యవస్థతో నీరు మరియు పోషక పదార్ధాల కొరకు పోటి పడని విధంగా ఉండాలి. అంతర పంట ద్వారా వచ్చే వ్యర్గాలు భూమి యొక్క సేంద్రియ పదార్ధాల లబ్దిని పెంచే విధంగా వుండాలి. ఈ దశలో సాధ్యమైనంత వరకు అంతర పంట వర్బాధారంగా పండేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ దశలో ఎంపిక చేసుకునే పంట తక్కువ సమయంలో, తక్కువ వనరులను వినియోగించుకునేదై సాగు ఖర్చు తక్కువగలదై, తేలికపాటి యూజమాన్య పద్ధతులతో ఎకరాకు/హెక్టారుకు అధిక నికర ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి.

కూరగాయ పంటలు, పూల వెుక్కలు, మొక్కజొన్న మిరప, ప్రత్తి, పొట్టి అరటి, పొగాకు, పశుగ్రాసాలు లాంటి పంటలను అంతర పంటలుగా పండించుకోవచ్చు అరటి, చెఱకు, బొప్పాయి వేసినప్పడు ఆయిల్పామ్పై నీడ పడకుండా ఉండే విధంగా పొట్టి రకాలను ఎంచుకోవాలి లేదా ఆయిల్ పామ్ మొక్కలకు 2-3 మీటర్ల దూరంలో నాటుకోవాలి.

పైన ఉదహరించిన పంటలను ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేయడం ద్వారా ఎకరాకు నికర లాభం రూ. 10,000 నుండి రూ.30,000/- వరకు పొందవచ్చు.

రెండవ దశ : ఈ దశలో మూడు సం||ల వయసు పైబడి 8 సం||ల లోపు వయసు ఉన్న ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు పండించడానికి సరిపడ సూర్యరశ్మి లభించదు. కనుక ఈ దశలో అంతర పంటలు పండించడానికి అవకాశం ఉండదు.

మూడవ దశ : ఆయిల్ పామ్ తోటలో 6 మీటర్ల పైబడి ఎతు ఎదిగినప్పడు గాని 8-10 సం||ల వయసు పైబడినప్పడు గానీ స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పంటలను ఆయిల్ పామ్ తోటల్లో పెంచుకోవచ్చు. ఈ దశలో ఎంపిక చేసుకునే పంటలు ఆయిల్ పామ్ పంటలోని వాతావరణం (సూర్యరశ్మి తేమ) ను ఉపయోగించుకొని ఆయిల్ పామ్ పంటకు పోటిరాని పంటలను ఎంపిక చేసుకోవాలి. మొక్క వయస్సు 8-10 సం||లు ఉండి, 6 మీటర్ల ఎత్తువున్న తోటల్లో అంతరపంటలకు సరిపడినంత సూర్యరశ్మి లభిస్తుంది. కావున ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని పాక్షిక నీడలో పెరిగి మంచి దిగుబడి మరియు ఆదాయనిచ్చే పంటలను ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా పండించుకోవచ్చు.

ఆయిల్ పామ్ వేరు వ్యవస్థను అనుసరించి అంతర పంటల సేద్యం చేయడం మంచిది. ఈ చెట్టు ఎదుగుదలతో పాటు క్రమంగా చెట్టు మొదలు నుంచి దట్టమైన గుబురు వేరు (ప్రాథమిక, ద్వితియు, చతుర్ధ లేదా పిల్ల వేళ్ళతో) భూమిపై పొరల్లో సమాంతరంగా లేదా భూమిలో వ్యాపించి ఉంటాయి. 80 శాతం వేరు వ్యవస్థ దాదాపుగా భూమిపై నుండి 2 అడుగుల లోనే ఉంటుంది. ఎక్కువ వేరు వ్యవస్థ మొదట రెండేళ్ళలో 5 శాతం, 15 శాతం మట్టి పరిమాణం మాత్రమే వినియోగించుకుంటుంది. అనగా మిగిలిన 95 శాతం, 85 శాతం మట్టి పరిమాణం వరుసగా మొదట రెండేళ్ళలో అంతర పంటల సాగుకు లభ్యమవుతుంది. ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో వివిధ రకాలైన దీర్ఘకాలిక పంటలను పండించవచ్చు. నీరు, సూర్యరశ్మి లబ్యత, చేపట్టే యాజమాన్య పద్ధతులను బట్టి పంట దిగుబడి వస్తుంది. సాధారణంగా ఎదిగిన ఆయిల్ పామ్ తోటలో కోకో, మిరియూలు పంటలను పండించడానికి సిఫారసు చేయడమైనది. ప్రాధమిక పరిశోధనా ఫలితాలను బట్టి పూల పంటలైనటువంటి హెలికోనియా, రెడ్ జింజర్లు వంటివి ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో మంచి దిగుబడినిస్తాయి.

పైన ఉదహరించిన వంటలను ఎదిగిన ఆయిల్పామ్ తోటలలో అంతర పంటగా సాగు చేయుట

ద్వారా ఎకరాకు నికర లాభం రూ.40,000/- నుండి రూ.60,000/- వరకు పొందవచ్చు.

ఆయిల్ పామ్ తోటలో అంతర పంటలు సాగు చేయడం ద్వారా వచ్చిన జీవ వ్యర్థ పదార్గాలు పాదులలో కుళ్ళడం ద్వారా බීථළුම් ఉపయోగకరమైన సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా భూమిలో సేంద్రియ కార్బన్, భాస్వరం మరియు పొటాష్ ధాతువుల లభ్యత పెరిగి తద్వారా ఆయిల్పామ్ పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది.

అంతర పంటల సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మరియు జాగ్రత్తలు

  • అంతరపంట సాగుకు గాను సంవత్సరం పొడవునా ఆయిల్ పామ్ తో బాటు చాలినంత సాగునీరు లభ్యమవ్వాలి.
  • అంతర పంటలకు, ఆయిల్పామ్కు పోషకపదార్ధాల కోసం పోటీ పడకుండా, ఆయా పంటలకు సిఫారసు చేసిన వెూతాదులలో వేరు వేరుగా ఎరువులు అందించాలి.
  • చెట్టు మొదలు నుండి చుటూ మూడు మీటర్ల వరకు పాదులో అంతర వంటలు, కలువు వెుక్కలు ఉండకుండా చూడాలి.
  • అంతరపంటలు పండించేటప్పడు ఆయిల్పామ్ చెట్టు మొదలు చుటూ దున్నకూడదు ఆకులను నరకకూడదు దగ్గర చేసి కట్టకూడదు.
  • మొదటి (1-3 సం||లు) మరియు రెండవ దశలో (4-8 సOIIలు) దీర్ఘకాలిక పంటలను పండించడానికి (వేరు వ్యవస్థకు, సూర్యరశ్మికి పోటి కారణంగా) అనువుగా ఉండదు. మొదటి రెండు దశలలో దీర్ఘకాలిక పంటలను అంతరపంటగా ఎంపిక చేసుకొన్నప్పడు, వాటిలో పాటించవలసిన సాగు పద్ధతులను చేపట్టడానికి వీలుగా ఉండదు.
  • ఆయిల్ పామ్ పంటను, అంతర పంటను సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులను వేరు వేరుగా తప్పని సరిగా ఆచరించాలి.
  • అంతర పంటల సాగు విషయంలో భూసారాన్ని ఉత్పత్తిని తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఆర్థికపరంగా లాభం ఉన్న అంతర పంటల ఉత్పత్తిని మాత్రమే పంటనుండి తీసుకొని మిగితా వ్యర్థ పదార్గాలను మరల పొలంలో మల్చింగా ఉపయోగించుకోవచ్చు.

తద్వారా భూ భౌతిక స్వరూపాన్ని నేలలో తేమ నిలుపుదలను మరియు నేలలో సేంద్రియ పదార్ధాల లబ్దిని పెంపొందించు కోవచ్చు.

రైతు సోదరులు తమకున్న వనరునలను ద్రుష్టిలో ఉంచుకొని సరైన అంతర పంటలను ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటల ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate