অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ పండు చాలా పుష్టికరమైనదే కాక సేద తీర్చు లక్షణము కూడా కలిగింటుంది. దానిమ్మతో రసం, సిరప్, జెల్లీ వంటివి తాయారు చేయవచ్చు. తోలు, పులా నుంచి రంగు పదార్ధం లభిస్తుంది. ఆకులు, పూలలో అనేక వైద్య గుణాలున్నాయి.

భారతదశంలో మహారాష్ట్ర దానిమ్మ వంట ఉత్పత్తిలో మొదటి స్ధానం ఆక్రమించింది. దేశంలో దానిమ్మ సాగులో 78 % విస్తీర్మము, ఉత్పత్తిలో 84 % మహారాష్ట్ర ఆక్రమిస్తున్నది. ఆంధ్రప్రదశ్ లో అనంతపురం, తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 5000 హెక్టార్లలో సాగులో ఉంది.

వాతావరణం: దానిమ్మ ఉష్ణ మండలం చెట్టు. శీతాకాలం చల్లగాను, ఎండాకాలం  వేడిగా ఉండే మెట్ట ప్రదేశాలలో బాగా పండుతుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. కయ ఎదిగే దశలోనూ, పండే దశలోనూ పొడిగా, వేడిగా ఉండే వాతావరణం అవసరం. ఉపనాగ్రత తగినంత ఎక్కువగా లేకపోతే కాయలు తీయగా ఉండవు. తేమ ఉన్న ప్రాంతాలలో కాయ నాణ్యత డెబ్భత్తింటుంది.

నేలలు: దానిమ్మను అనేక రకాలైన నెలల్లో సాగు చేయవచ్చు. మిగతా పండ్ల చెట్లను సాగుచేయలేని నెలల్లో కూడా ఈ పంట పండించువచ్చు. సన్నం శాతం ఎక్కవ గల భూముల్లో కూడా దానిమ్మ సాగుచేయవచ్చు. లోతైన గారప నేలలు మరియు ఒండ్రు నేలలు మిక్కిలి అనుసూలం.

రకాలు:

  1. గణేష్ : ఈ రకంలో కాయలు పెద్దవిగా ఉండి ఆకర్షణీయమైన పింక్ కలర్ రంగులో  వుంది పసుపు వర్ణం చర్మంను కలిగి ఉండును. విత్తనాలు ముదుదువుగా ఉండి తీయని గుజ్జు కిలిగి ఉండును. గుజ్జు శీతాకాలంలో ఆకర్షణీయమైన  పింక్ కలర్ లోను, వేసవి కాలంలో వైట్ కలర్ లోను ఉండును. కయ సగటు బరువు 200 - 250 గ్రాములు.
  2. ముడుల(అరక్తా) : ఈ రకంలో పండ్లు గుండ్రంగా, క్రికెట్ బల్ పరిమాణంలో ఉండి ఆకర్షణీయమైన చక్కని రెడ్ కలర్ లో వుంటాయి. ముడుల పండ్లలో గింజలు లావుగా వుంది. మూడువైన విత్తనంతో పాటు కంటికి ఇం పైన ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ రకం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
  3. రూబి : పండు గణేష్ రకాన్ని పోలి ఉండి, చర్మం ఎరుపు రంగుతో కూడిన గోధుమ వర్ణంలో అక్కడక్కడా పచ్చని గీతాలు కలిగి ఉంటాయి. చర్మం పలుచగా ఉండి పండ్లలో ఎర్రని పెద్ద సెజు గల విత్తనాలు మెత్తని గుజ్జుతో వుంటాయి. సగటు దిగుబడి హెక్టారుకు 16 - 18 టన్నుల వరకు ఉంటుంది.
  4. భగవ : కాయలు మధ్యస్థంగా, గుండ్రంగా ఉంటాయి. కాయ సగటు బరువు 200 - 275 గ్రా. ఉంటంది. గింజలు మదుపుగా ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ రకం ఎక్కవ ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఇవియేగాక మస్కట్, జావర్ సిడిల్స్ జ్యోతి, జోడీపూర్ రెడ్, భేసిస్, సీడ్లెస్, అలసంద, డాక, పేపర్ షెల్ మెదలైన రకాలు వివిధ ప్రాంతాల్లో సాగు చేయబడుతున్నాయి.

ప్రవర్ధనం : ఎక్కవగా కత్తిరింపులు ద్వారాను, నెల అంట్లు, గాలి అంట్లు ద్వారా వ్యాప్తి చేస్తారు. పెన్సిల్ మందమున్న కొమ్మలని 25 - 30 సెం. మీల పొడవుతో కత్తిరించి నాటాలి. నాటే మందు సెరదెక్స్ - బి లేదా 100 పి. పి. యం ల ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము హార్మోన్లలో ముంచి నాటితే కొమ్మలకు బాగా వేర్లు ఏర్పడును. నాటిన 90  రోజులలో మొక్కలు పొలంలో నాటడానికి తయారవుతాయి.

నాటుటకు 60 ఘ. సెం ల గుంతలు త్రవ్వి 5 * 5  మీటర్ల ఎడంలో నాటాలి. 20  కేజీల చివికిన పశువుల ఎరుపు, 100 గ్రాముల లిండెన్, 500 గ్రాముల సింగిల్ సూపర్ సూపర్ ఫాస్పెట్ కల్పి గోతిని నింపాలి. జూన్-జులై మాసంలో నరురా మంచిది.

కొమ్మ కత్తిరింపు: దానిమ్మలో కత్తిరింపులు మొదటి దశలో చెట్టు మంచి ఆకారాన్ని సంతరించు కోవడానికి చేస్తారు. దానిమ్మ పొదల పెరిగే స్వభావం కల్గిఉంటుంది. అందువలన భూమత్తం నుంచి అనేక సంఖ్యలో కొమ్మలు వస్తాయి. అన్ని కొమ్మలను వదిలేస్తే గాలి చొరబడకుండా గుబురుగా పెరిగి కాండం తొలిచే పురుగులు మరియు తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బలంగా ఉన్న 3 - 4  కాండాలను మాత్రమే వుంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి. ఒక వేళ భూమి నుంచి ఒకే కాండాన్ని పెంచినప్పుడు. భూమట్టం నుంచి 1 - 1  1 / 2  పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయంచుకోవాలి.

బహిర్ ట్రిటిమెంట్ :

అంబేబహర్ సీసన్ కొరకు నవంబర్ ఆఖరి వరకు నీటి తడులు అపి డిసెంబర్-జనవరి మాసాల్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జూన్-జులై మాసాల్లో పండ్లు కోతకు వస్తాయి.

మ్రిగ్ బహార్ సీసన్ కొరకు డిసెంబర్-ఏప్రిల్ వరకు చెట్లకు విశ్రంతి నిచ్చి ఆ తర్వాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెట్టాలి. జూన్-జులై మాసాల్లో చెట్లు

సిసస్

పూత కలం

కోత

అంబే బహార్

జనవరి-ఫిబ్రవరి

జూన్-జులై

మ్రిగ్ బహార్

జూన్-జులై

అక్టోబర్-నవంబర్

హస్త బహార్

సెప్టెంబర్-అక్టోబర్

మార్చ్

అడుగుల ఎత్తులో వచ్చే కొమ్మల్లో నాలుగు వైపులా విస్తరిస్తున్న 3 - 5 , బలమైన ప్రధాన కొమ్మల్ని ఉంచి మిగతా వాటిని కత్తిరించి వేయాలి. కత్తిరించిన భాగాలకి వెంటనే ఒక శాతం బోర్డాపెస్ట్  రాయాలి. 3 - 4 సంవత్సరాల వయసు గల చెట్లలో అడ్డదిడ్డంగా పెరుగుతున్న కొమ్మలను, రెమ్మలను తెగులు సోకినా కొమ్మలను తీసి వేయడం వాళ్ళ అన్ని భాగాలకు గాలి  వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. విశ్రంతి నిచ్చే సమయంలో చెట్లలోని చివరి కొమ్మలను, 6 - 9 అంగుళహాల పొడవున్న చివర కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల బలమైన కొమ్మల మీద పిందెలు ఏర్పడి కాయ స్తేజు పెరుగుతుంది.

పూత కాలము మరియు నియంత్రణ :

భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దానిమ్మ సంవత్సరం పొడవునా పూతపూసే అలవాటు కలిగి ఉంటుంది. అయినప్పటికి ఈ ప్రాంతాల్లో దానిమ్మ మఖ్యంగా మూడు కాలాలలో ( సీజన్ లలో) పూత ఎక్కవగా పూస్తుంది.

మనరాష్త్రంలో అంబే బీహార్ మరియు మ్రిగ్ బహార్ సీసన్ లు సాగుకు అనుకూలం. అయితే ఏ బహార్ పంట తీసుకోవాలో మార్కెట్ లో ఏ సమయంలో దానిమ్మ పండ్లకి అధిక రేటు లభిస్తుందో భూమి లక్షణాలు, క్రిమికీటకాలు వలన కలిగే నష్టం మరియు వాతావరణ పూతకు వచ్చి అక్టోబర్-నవంబర్ మాసాల్లో కోతకు వస్తాయి.

బహార్ ట్రిటిమెంట్ ఇచ్చిన నెలరోజుల్లో చెట్లు పూతకు వస్తాయి. ఆ తర్వాత 5 - 6 నెలల్లో పండ్లు కోతకు వస్తాయి.

మొక్క వయస్సు

పశువుల ఎరుపు

మొక్కకు గ్రాములలో

నత్రజని

భాస్వరం

పొటాషియం

1

10

250

125

125

2

20

250

125

125

3

30

500

125

125

4

40

500

125

250

5

50

625

125

250

పైన తెల్పిన ఎరువులను చిన్న మొక్కలలో వర్షాలు పాడేటప్పుడు వేయాలి. పెద్ద చెట్లలో కావు >కాయంచే నెల రోజుల ముందు ఎరువులు వేయాలి. పూతకు ముందు ఒకసారి 0 . 4> % పెర్రస్ సల్పేట్ + 0 . 3 % మాంగనీస్ సల్పేట్ + 0 . 2 % జింక్ సల్పేట్ + 0 . 3 % బోరిక్ ఆమ్లం పిచికారీ  చేయటం వల్ల చెట్టు ఎదుగుదల, దిగుబడి మరియు నాణ్యత పెరుగుతాయి.

నీటి తడి: నీటి తడులకు దానిమ్మ బాగా ప్రతిస్పందిస్తుంది సంవత్సరానికి దాదావు 20 - 25 తడులు అవసరం.ప్రత్యేకించి కావు సమయంలో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. చెట్ట మీదు కాయలున్నప్పుడు నీటి ఎద్దడి ఏర్పడితే కయ పగుళ్ళు ఏర్పడుతుంది. నీటి ఎద్దడి లేనప్పుడు కాయ పగుళ్ళు కనిపిస్తే బోరాన్ లోపంగా గుర్తించి 0 . 1 % బొరాక్స్ ద్రావణంను పిచికారి చేయాలి.

దిగుబడి : వుత ఏర్పడిన 5 - 6 నెలలకు కాయ తయారువుతుంది. కాయ తోలు పసుపు పచ్చ రంగుకు మారగానే కోయాలి. మాగిన పండును గట్టిగ నొక్కితే ఒక రకమైన లోహ శబ్దం వస్తుంది. దానిమ్మను 2 వ సంవత్సరం నుంచి కోత కోయపచ్చును. చెట్టు ఎదిగిన పిమ్మట సగటున 150 - 200 పండ్లను ఇవ్వగలదు. ఐతే చెట్ల పై కొంతకాపును తీసివేసి 50 - 60 కాయలు ఉంచటం వల్ల కాయ పరిమాణం మరియు నాణ్యత పెరుగును.

నిల్వ : దానిమ్మను గది ఉప్నోగ్రత వద్ద 15 - 20 రోజుల వరుకు నిల్వ చేయవచ్చును. అదే విధంగా 0 % సెం. గ్రే. ఉప్నోగ్రత 80 % తేమ వద్ద ఉంచితే 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు.

కాయల్లో పగుళ్ళు నివారణ:

దానిమ్మలో భూమిలో గల తేమలో హెచ్చు తగ్గులు అధికంగా ఉన్నప్పుడు, రాత్రి, పగలు, ఉపాంగ్రంథాల్లో తేడా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్ద్రతలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మరియు కాయలు చర్మంలో సాగే గుణం లోపించినప్పుడు కాయలు మిగిలిపోతాయి. సాధారణంగా మ్రిగ్ బహార్ పంటలో కాయల పగుళ్ళు ఎక్కవగా ఉంటాయి. కాయల్లో పగుళ్ళను వర్షాభావ సమయంలో నీటి తడులు ఇచ్చి తగ్గించవచ్చు. లేత కాయల్లో పగుళ్ళు బోరాన్ లోపం వలన కలుగుతుంది. నీటి ఎద్దడి ఎక్కవగా ఉన్న సమయంలో చర్మం సాగు గుణాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత నీరు పెట్టినా లేదా వర్షం పడినా కాయలు విపరీతంగా మిగిలిపోతాయి. ఇదే విధంగా మెతాడు మించి నత్రజని నాడినా కాయల్లో పగుళ్ళు కన్పిస్తాయి. భూమిలో తేమశాతం 25 శాతానికి తగ్గినప్పుడు నీటి తడులిచ్చి 0 . 6 శాతం మొతాదులో నత్రజని పిచికారీ చేసి కాయల్లో పగుళ్ళను తగ్గించవచ్చు. కాయ ఎదిగే దశలో 100 లీటర్ల నీటికి ఒక కిలో కాల్షియం క్లోరైడు+ఒక కిలో మెగ్నీషియం క్లోరైడ్ కలిపినా ద్రావణాన్ని పిచికారి చేసి ఆ తర్వాత ఒకటిన్నర కిలోల డి.ఎ.పి+0 . 5 కిలో మెగ్నీషియం సల్పెటు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసి కాయ పగుళ్ళను నియంతరించవచ్చు. అవసరం అయితే 90 మీ.లి. సైటో జెమ్, 100 గ్రాముల బొరాక్స్, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కాయ రంగు పెంచే పద్ధతులు:

కాయ తయారు అయ్యే సమయంలో ఉప్నోగ్రత అధికంగా ఉన్నప్పుడు గణేష్ రకంలో కాయ రంగు పేలవంగా ఉంటుంది. ఇదే విధంగా అధికంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి తడులు, మరియు భూమిలో మెగ్నీషియం ఎక్కువగా వేసినప్పుడు కూడా కాయలు పేలవంగా తయారవుతాయి. కాయలు పక్వానికొచ్చే దశలో పొటాషియం అధిక మేతదులో అవసరం ఉంటుంది. ఈ అవసరాన్ని భర్తీ చేయుటకు 2 గ్రాముల పొటాషియం డై హైడ్రోజన్ ఆర్దోపాస్పెట్ లీటరు నీటికి కలిపి రంగు మారె దశలో పిచికారి చేయాలి లేదా 15 రోజులు వ్యవధిలో 2 సార్లు 500 పి.పి.ఎమ్. మేతదులో లిహుసి పిచికారి చేసి గాని, స్తేతోజేతేమ్ 100 మీ.లి.+100 గ్రా. పొటాషియం డై హైడ్రోజన్ ఆర్దో పాస్పెట్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కాయలు సంతరించుకొనేలా చేయవచ్చు.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate