অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరి

వరి

  1. నారు పెంచి నాటు వేసే పద్ధతి
  2. దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి
  3. యంత్రాలలో నాటిన వరిసాగు
  4. పొడి వరిని తరి పొలంగా సాగు చేయుట
  5. ”శ్రీ” వరి సాగు పద్ధతి
  6. ఆరుతడి వరి (ఎరోబిక్ రైస్)
  7. చౌడు పొలాల్లో వరి యాజమాన్యము
    1. నారుమడి యాజమాన్యము
  8. ప్రధాన పొలం యాజమాన్యం
  9. సల్ఫైడ్ దుష్ఫ్రభావం
  10. చీడపీడల యాజమాన్యం (అన్ని పద్ధతులకు)
    1. కాండం తొలిచే పురుగు (మొగి పురుగు/తెల్లకంకి/ఊసపోటు)
    2. సుడిదోమ
    3. అగ్గితెగులు
  11. సమీకృత సస్యరక్షణ
    1. అగ్గి తెగులును తట్టుకొనె రకాలు
    2. బ్యాక్టీరియా ఎండాకు తెగులును తట్టుకొనె రకాలు
    3. ఉల్లికోడును తట్టుకొనె రకాలు
    4. సుడిదోమ తట్టుకొనె రకాలు
    5. వరిలో నాణ్యతా ప్రవాణాలు( Fair Average Quality )
  12. సేంద్రియ వరిపాగు
  13. రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి
    1. పాటించాల్సిన మెళకువలు:
  14. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి
  15. సుడిదోమ
  16. కాండం తొలిచే పురుగు
  17. ఆకునల్లి / కంకినల్లి
  18. బాక్టీరియా ఎండాకు తెగులు
  19. దీనిలో దెబ్బతిన్న మొలకెత్తిన, పుచ్చుబట్టిన గింజలు 4% మించకుండా ఉండాలి.
  20. రబికి అనువైన వరి రకాలు

తెలంగాణా జిల్లాలో సుమారుగా 44 లక్షల ఎకరాలలో సాగవుత్తున్న ప్రధాన ఆహారపు పంట వరి. ఇటీవలి కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్తితులు, ఆలస్యంగా కురిసే వర్షాల వలన వరి విస్తీర్ణం క్రమంగా తగ్గుత్తున్నది. రానురాను వ్యవసాయ కార్మికుల సమస్య, నీటి కొరత, చీడ పీడల వలన వరి సాగు సంక్షోభంలో పడుతున్నది. దీనికి తోడు చౌడు మరియు యాసంగిలో చలి వలన రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సాగు ఖర్చులు కుడా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆధునిక పరిజ్ఞాణం మధ్య, స్వల్పకాలిక క్రొత్త రకాలు, వివిధ వరి సాగు పధ్దతులు, చౌడు మరియు చలికి, దోమ కాటుకు రూపొందించిన యాజమాన్య పద్దతులు తెలంగాణ రాష్టంలో వరి ఉత్పాదక శక్తిని పెంచటమే కాకుండా ఖర్చులను కూడా తగ్గిస్తాయి. వరి పంటను నీటి వసతి, కాలాలను, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగ పండించవచ్చును.

సాగు పద్ధతులు

నారు పెంచి నాటు వేసే పద్ధతి

నేలలు: సమస్యాత్మకత నేలలు (చౌడు/క్షారము/ఆమ్లము) తప్ప సాధారణంగా వరి సాగుకు అన్ని నేలలు అనుకూలం. నీటి ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకూలం కాదు. నీరు అధికంగా అవసరమయ్యే చౌక, దుబ్బ నేలల్లో వేరే పంటలు వేసుకోవడం మంచిది.

పంట కాలాలు:వర్షాకాలం: జూన్ - డిసెంబర్

యాసంగి: నవంబర్- ఎప్రిల్

అనుకూలమైన సమయము

నీటి వసతి నార్లు పోయడానికి రకాల పరిమితి
1. నీటి వసతి క్రిందా – మిందిగా నారు పోయడానికి (బావుల క్రింద) మే చివరి నుండి జూన్ 20 వరకు ధీర్ఘకాలిక
2. సాధారణ పరిస్తితులలో (కాలువలు, చెరువులు, బావల క్రింద) జూన్ 20 నుండి జులై 15 వరకు మధ్య, స్వల్పకాలిక
3. ఆలస్యంగా నారు పోసుకొనుటకు (చిన్న చెరువులు, నీరు తక్కువగా వున్న చోట) జులై చివరి వరకు స్వల్పకాలిక
ప్రత్యామ్నాయ పరిస్తితులల్లో (మరీ ఆలస్యంగా) ఆగస్టు మొదటి వారం వరకు అత్యల్పకాలిక
  • దమ్ము చేసి నేరుగా విత్తె పద్ధతిలో స్వల్పకాలిక రకాలు ఎంచుకొని ఆగష్టు 10 వరకు విత్తుకోవచ్చు.
  • నాటే పద్ధతిలో ఆగష్టు చివరి వరకు నాటు వేసుకోవచ్చు. కాని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, అదిలబాద్ లో ఆగష్టు 20 వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తాయి. తరువుత నాటికి చలికి దిగుబడి తగ్గుతుంది. చలి తక్కువగా ఉండే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సెప్టెంబర్ 10 వరకు కూడా నాటుకోవచ్చు.

రకాలు: ధీర్ఘకాలిక రకాలు (150 రోజుల కాలపరిమితి గల) సాగుచేయడం వలన ఎక్కువ నీరు మరియు విద్యుత్తు వాడకమే కాకుండా పచ్చి రొట్ట పంటలు వేసి భూమిలో కలియదున్నడానికి సమయం ఉండదు. అంతేకాకుండా చెరువులు, నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద ఆలస్యంగా నాట్లు వేయడం వలన పంట చీడపీడలకు గురై, పూత సమయంలో చలి వలన తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గుతాయి. అందువలన తెలంగాణా రాష్టంలే మధ్య మరియు స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది. దీని వల్ల సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాక నీటిని ఆదా చేయవచ్చు.

వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలకు సిఫారసు చేసిన రకాలు:

ఉత్తర తెలంగాణ: సాంబ మషూరి, జగిత్యాల మషూరి, ప్రాణహిత, పొలాస ప్రభ, జగిత్యాల సన్నాలు, అంజన, బతుకమ్మ, కూనారం సన్నాలు. యం.టి.యు-1010. మానేరు సొన, జగిత్యాల సాంబ, ప్రత్యుమ్నా.

మధ్య తెలంగాణ: సిద్ధి, సాంబ మషూరి, సోమనాథ్, భద్రకాలి, సురేఖ, వరంగల్ సున్నాలు, వరంగల్ సాంబ, శీతల్, రామప్ప, తెలంగాణ పోస, బతుకమ్మ కూనారం సన్నాలు, ఎర్ర మల్లెలు, ప్రద్యుమ్న, వరాలు, యం.టి.యు-1010. యం.టి.యు - 1001.

దక్షిణ తెలంగాణ: సాంబ మషూరి, కృష్ణ, జగిత్యాల మషూరి, విజేత, బతుకమ్మ, కూనారం సన్నాలు, తెలంగాణ పోస, తెల్లహంస, నెల్లూరి మషూరి, యం.టి.యు-1010. యం.టి.యు - 1001.

  • యాసంగిలో అన్ని స్వల్ప కాలిక రకాలు వేసుకోవచ్చు. చలి ఉధృతిని బట్టి పంటకాలం 15 నుండు 30 రోజుల వరకు పెరుగుతుంది. అందుకే చలికి ప్రత్యేక యాజమాన్యం పాటించాలి.

కొత్త రకాలు:

తెలంగాణ పోస(ఆర్.ఎన్.ఆర్ 15048): ఇది ఆలస్యంగా నార్లు పోయుటకు అనువైన రకం కనుక, ఖరీఫ్ లో రైతులు జూన్ మొదటి వారంలో పచ్చిరోట్ట పైరిలైన జనుము, జీలుగ లేదా పెసర పంటను సాగుచేసి జలైలో ఈ రకాన్ని సాగుచేసుకోవాలి. రెండు కాలాలకు అనులవుగా ఉండే ఈ రకం అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది (2.6-2.8 టన్నులు/ఎకరాకు). సాంబ మషూరి కన్నా సన్న గింజ నాణ్యతతో, తక్కువ నూక శాతముతో (68% – 70% బియ్యం), అన్నము నాణ్యత కలిగి ఉండి, యాసంగిలో గింజ రాలదు. దీనికి 15 రోజుల నిద్రావస్థ ఉంది. ఈ రకంలో కాండము తొలుచు పురుగు (మొగి పురుగు లేదా తెల్లకంకి) ఆశించును కనుక నాటిన 7-10 రోజులలో మరియు చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రొక్లొరైడ్ 50 డబ్ల్యూపి (400 గ్రా./ఎకరాకు) లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్సి (60 మి.లీ./ఎకరాకు) పిచికారి చేయాలి. బెట్టు పరిస్థితులలో కంకిసల్లి ఆశించిన చిరుపొట్ట దశలో డైకోఫాల్ 18.5 యస్ సి (1000 మి.లీ/ఎకరాకు) లేదా స్పైరోమెసిఫెన్ 22.9 యస్ సి (200 మి.లీ/ ఎకరాకు) మందులు పిచికారి చేయాలి. ఈ రకం ముందుగా (జూన్ లో) వేసి నిటినచో ఎత్తుగా పెరగడమే కాకుండా కాలపరిమితి కూడా ఎక్కువవుతుంది మరియు పడిపోతుంది.

బతుకమ్మ (జె.జి.ఎల్ 18047): మన రాష్ట్రములో దొడ్డు రకాలలో యం.టి.యు 1010 ఎక్కువ విస్థీర్ణంలో ఉన్నది. ఈ రకంలే అగ్గి తెగులు సోకడము మరియు కోత సమయంలే ముఖ్యంగా యాసంగిలో గింజలు రాలిపోయె లక్షణము ఉండడము వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా బతుకమ్మ అనే రకాలన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8-3.2 టన్నులు/ ఎకరాకు దిగుబడినిస్తుంది. యాసంగిలో గింజరాలదు. దీనికి 3 వారాల నిద్రవస్థ కలదు.

కూనారం సన్నాలు (కె.ఎన్.యం 118): ఇది కూడ యం.టి.యు 1010 కు ప్రత్యామ్యాయంగా రూపొందించడం జరిగింది. గింజలు రాలే లక్షణం తక్కువగా ఉండి, గింజ బరువు ఎక్కువగా ఉండును. ఈ రకం కూడా రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8-3.2 టన్నులు/ఎకరాకు దిగుబడినిస్తుంది. దీనికి 3-4 వారాల నిద్రవస్థ కలదు.

సోమనాథ్ (డబ్ల్యూ.జి.ఎల్ 347): మధ్యస్థ గింజ నాణ్యత కలిగి ఉల్లికోడును తట్టుకొనె మధ్యకాలిక రకము (130-135 రోజులు). కాని వరంగల్ ఉల్లికోడు బయోటైప్ (4ఎమ్ ను) తట్టుకొనను. ఈ రకం అగ్గి తెగులును కూడ తట్టుకొని, ఎకరాకు 2.6-3.0 టన్నులు దిగుబడినందిస్తుంది.

సిద్ధి (డబ్ల్యూ.జి.ఎల్ 44): ఇది వర్షాకాలానికి మాత్రమే అనుకూలము. 150 రోజుల పంటకాలము కలిగిన మధ్యస్థ గింజ రకం. ఎకరాకు 2.4-3.0 టన్నులు దిగుబడినందిస్తుంది.

పట్టిక 1: ఇతర రకాల వివరాలు

రకం ఋతువు పంటకాలం (రోజుల్లో) వడ్ల దిగుబడి(ఎకరాకు టన్నుల్లో) గుణగణాలు
సాంబ మషూరి వర్షాకాలం 150 2.2 - 2.5 సన్న బియ్యం, నాణ్యమైన అన్నం, ఏ చీడరీడలను తట్టుకోదు.
ఇంద్ర (యంటియు 1061) వర్షాకాలం 160 2.4 - 2.8 దోమను తట్టుకోనును. ముతక రకం. ఖమ్మంకు అనువైనది.
కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458) వర్షాకాలం 135 2.2 - 2.8 అగ్గితెగుళ్ళను తట్టుకొనును. సన్న బియ్యం, నాణ్యమైన అన్నం, చేను మీద పడిపోదు.
జగిత్యాల మషూరి (జెజియల్ 11470) వర్షాకాలం 135 2.5 - 2.7 ఉల్లికొడును (బయోటైప్-3) తట్టుకొనును. అగ్గితెగుళ్ళను తట్టుకొనును. మంచి గింజ, అన్నం బాగుంటుంది.
ప్రాణహిత (జెజియల్ 11727) వర్షాకాలం 135 2.5 - 2.7 ఉల్లికొడును (బయోటైప్-3) అగ్గితెగుళ్ళను తట్టుకొనును. సన్న బియ్యం, అన్నం బాగుంటుంది.
పొలాసప్రభ (జెజియల్384) వర్షాకాలం 135 2.2- 2.5 ఉల్లికొడును (బయోటైప్-3) తట్టుకొనును. గింజ అన్నం నాణ్యతగా వుండును.
వరంగల్ సన్నాలు(డబ్ల్యూజియల్ 32100) వర్షాకాలం 135 2.0 - 2.4 సన్న బియ్యం.
వరంగల్ మషూరి(డబ్ల్యూజియల్ 14) వర్షాకాలం 135 2.0 - 2.4 సన్న బియ్యం, బాక్టీరియా ఎందకు తెగులును తట్టుకొనును.
సురేఖ (డబ్ల్యూజియల్ 13400) వర్షాకాలం 135 2.2 - 2.5 సన్న పొడువు బియ్యం, ఉల్లికొడు వరంగల్ బయోటైప్ 4 ఎమ్ ను తట్టుకొనుదు.
భద్రకాలి (డబ్ల్యూజియల్ 3962) వర్షాకాలం 135 2.4 - 2.8 సన్న పొడువు రకం, ఉల్లికొడు వరంగల్ బయోటైప్ 4 ఎమ్ ను తట్టుకొనుదు.
అంజన (జెజిఎల్ 11118) వర్షాకాలం 125 2.5 - 2.7 సన్న బియ్యం, అన్నానికి బాగుంటుంది. ఉల్లికొడు (బయోటైప్ 1,2,3), చలిని తట్టుకొంటుంది.
రామప్ప (డబ్ల్యూజిఎల్ 23985) వర్షాకాలం, యాసంగి 125 2.0 - 2.5 ఉల్లికోడును తట్టుకొనును. కాని బయోటైప్ 4 ఎమ్ ను తట్టుకొనదు. చేను మీద పడిపోదు, గింజ పొడువు, సన్న రకం.
జగిత్యాల సన్నాలు (జెజిఎల్ 1798) వర్షాకాలం 125 2.0 - 2.5 ఉల్లికోడు (బయోటైప్ 1,2,3,4) తట్టుకొనును. సాంబ మషూరి గింజ రకాన్ని పోలి ఉంటుంది.
తెల్లహంస అన్ని కాలాలు 125 2.0 - 2.5 పెరిగే దశలో చలిని బాగా తట్టుకుంటుంది. గింజ పొడువుగా, నాణ్యత కలిగి అన్నం బాగుంటుంది.
శీతల్ (డబ్ల్యూజిఎల్ 283) యాసంగి 125 2.4 - 2.8 సన్న పొడువు బియ్యం, చలిని తట్టుకుంటుంది. గింజ రాలదు.
ఎర్ర మల్లెలు (డబ్ల్యూజిఎల్ 20471) అన్ని కాలాలు 120 2.0 - 2.2 ఉల్లికోడు నీటి ఎద్దిడిని తట్టుకుంటుంది. గింజ పొడువుగా, సన్నగా ఉంటుంది. ఉల్లికోడు వరంగల్ బయోటైప్ 4 ఎమ్ ను తట్టుకొనదు.
ప్రద్యుమ్న (జెజిఎల్ 17004) అన్ని కాలాలు 105 2.4 - 2.5 ఉల్లికోడు (బయోటైప్ 1,2,5) అగ్గి తెగులును తట్టుకొనును. స్వల్పకాలిక పొట్టి రకం. చేను మీద పడిపొదు. బియ్యం మధ్యస్థ రకం, నీటి సమస్య ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అవసరమైన రకం
సుమతి (ఆర్ఎన్ఆర్ 18833) వర్షాకాలం 145 1.8 - 2.0 సువాసన కలిగిన పొడువు గింజ రకం. హెచ్చు నత్రజని వేస్తే గింజ పగులుతుంది.
సుగంధసాంబ (ఆర్ఎన్ఆర్ 2465) వర్షాకాలం 130 2.0 - 2.3 అగ్గి తెగులును కొంత వరకు తట్టుకొనను. బియ్యం సన్నం, సువాసన కలిగిన రకం.
శోభిని (ఆర్ఎన్ఆర్ 2354) వర్షాకాలం 135 2.0 - 2.5 బియ్యం సన్నం, సువాసన కలిగి, మంచి అన్నం నాణ్యత కలిగి మార్కెట్ లో మంచి ధర ఉంటుంది.

విత్తన మోతాదు: ఎకరానికి నాటే పద్ధతికి: దొడ్డు రకాలు 25 కిలోలు, సన్న రకాలు 20 కిలోలు.

విత్తనశుద్ధి: మెట్ట నారుమళ్ళకు అయితే రిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండాజిమ్ ను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమళ్ళైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండాజిమ్ కలిపిన ద్రవణంలో 24 గంటలు నానబెట్టి తరువాత మండెకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలకు లీటరు ద్రవణము సరిపోతుంది. నిద్రావస్థను తొలిగించడానికి లీటరు నీటికి, తక్కువ నిద్రావస్థ (2-3 వారాలు) వున్న విత్తనాలకైతే 6.3 మి,లీ., ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) వున్న విత్తనాలకైతే 10 మి,లీ., గాధ నత్రికామ్లం కలిపి ఆ ద్రవణంలో 24 గంటలు నానబోట్టి కచిగి మండోకట్టాలి.

నారుమడి పెంపకము:

  • నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ముచేసి చదను చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగ కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారుచేయాలి.
  • రెండు గుంటల (5 సెంట్లు) నారుముడికి 2 కిలోల నట్రజని (1 కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. పశువుల పేడను లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది.
  • మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (వారం రోజులు) ఆరు తదులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ.) నీరు ఉండాలి.
  • జింకు లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు కలిపిన ద్రవణాన్ని పిచికారి చేయాలి.
  • మెట్టనారుమడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే సరిచేయాలి.
  • నారు పీకే 7 రోజుల ముందు గుంట నారుముడికి (2.5 సెంట్లకు) 400 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలి. అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
  • నాట్లు ఆలస్యమయ్యే ప్రదేశాల్లో రెండవ దఫా నట్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలి. ఈ పరిస్థితులల్లో తామర పురుగులను నివారించుకోవాలి.

నారుమడిలో బ్యూటాక్లోర్ 50 మి.లీ. లేదా ప్రెటిలాక్లోర్ + సేఫసర్ 25 మి.లీ. ఏదైన ఒకదానిని ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి. బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి విత్తివ 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి. నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాప్-పి-బ్యుటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

యాసంగిలో చలికి ప్రత్యేక నారుమడి యాజమాన్యం: యాసంగిలో నారుమడికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. యాసంగిలో దమ్ము నారుమడిలో మండకట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి. రాత్రి ఉష్ణోగ్రతలు 12o సెల్సియస్ కంటే తగ్గిన్నప్పుడు, చలి తీవ్రత పెరిగి సరిగా ఎదగక నారు ఎర్రబడి, కొన్నిసార్లు చనిపోతుంది. రెండు గుంటల నారుమడికి, వర్షాకాలంలో సూచించిన మోతాదులో రసాయనిక ఎరువులతో (నత్రజని, పొటాష్) పాటు రెండు క్వింటాళ్ళ కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మికాంపోస్టును వోసి కలియ దున్నుకోవాలి. భాస్వరాన్ని దుక్కిలో మోతాదుకు రెట్టింపు వేయాలి. చలి సమస్యను అధిగమించడానికి నారుమళ్ళపైన ఇనుప చువ్వలు/sవెదురు కర్రలతో ఊతం ఇచ్చి పైన పలుచని పాలథీన్ షీట్ లేదా పాలిపువెన్ యీరియా బస్తాలతో తయ్యారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళ్ళల్లో కప్పి ఉంచి మరుసటి రోజూ ఉదయాన్నే తీసివేయ్యాలి. రబీలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడును. కావున లోపాన్ని సవరించాలి. నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాచుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి 2 గ్రా. కార్బండాజిమ్+మాంకోజేబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉండి తెల్లవారు జామున తీసివేసి క్రొత్త నీరు పెట్టాలి.

ప్రధాన పొలం తయారి, మొక్కల సాంద్రత: నాట్లు వేయటానికి 15 రోజుల ముందునుండే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురుగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా చెక్కతోగాని, జంబుతోగాని, ట్రాక్టరుకున్న లెవరర్తోగాని చగును చేయాలి. బాగా మురిగిన ఎడల కలుపు తగ్గి, బాగా పిలకలు తొడిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగును. నాలుగు నుండి ఐదు ఆకులున్న నారును నాటుకోవాలి. కొద్దిగా చౌడున్న పొలాల్లో లేత నారు వేయవద్దు. మట్ట మదరాలి. భూసారాన్ని, గకాన్ని, కాలాన్ని బట్టి చ.మీ.కు కుదుళ్ళ సంఖ్య మారుతుంది. నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయడం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉదృతి కొంత వరకు అదుపు చోయవచ్చు. దీర్ఘ, మద్యకాలిక రకాలకు చ.మీ.కు. 33 స్వల్పకాలిక రకాలకు 44 కుదుళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి. బాగా ముదురు నారు ఆలస్యంగా నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి, కుదురుకు 6-8 మొక్కలు చెప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25% పెంచి మూడు దఫాలుగా కాక, రెండు దఫాలుగా అంటే 70% నాటే సమయంలో మిగితా 30% అంకురం దశలో వాడాలి. యాసంగిలో స్వల్పకాలిక రకాలలో చ.మీ.కు 44-66 కుదుళ్ళతో అధిక దిగుబడి సాధించవచ్చును.

సమగ్ర పోషక యాజమాన్యయం: పశువుల ఎరువు, కంపొస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులతొ కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకుంటు 20-25 శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటీ పచ్చి రొట్ట పైరును పెంచి ముందే కలియ దున్నడం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25 శాతం నత్రజని ఆదా చేయలచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనారు, అజొల్లా, అజోస్పైరిల్లం, ఫోస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి, నత్రజని, భాస్వర మోతాదులను 10-20 % తగ్గించవచ్చును.

అజొల్లా వాడుట ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరు నిలువగట్టి 100-150 కిలోల అజొల్లా వేసి 2 నుంచి 3 వారాలు పెరగన్నిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట మరుయు 12 కోలోల నత్రజనిని నేలకు అందుతుంది. అజటోబాక్టర్ వాడుటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చరును పట్టించాలి లేక 1 కిలో కల్చరును 20 కిలోల పశవుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ వరిలో మాత్రమే ఇది అవసరం. ఫాస్ఫోబాక్టీరియా భాస్వరపు జీవన ఎరువులలో ముఖ్యం. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వారాన్ని లభ్యమయ్యోలా చేస్తుంది. ఫాస్ఫోబాక్టీరియా లేదా అజోస్పైరిల్లమ్ లను అదటోబాక్టర్ లాగే వినియోగించాలి.

పట్టికలో సిఫారసు చేసిన పోషకాల మోతాదు భూసారం, పంటకాలం, రకాల కాలపరిమితి మరియు యాజమాన్య పద్ధతులు బట్టి కొంత మారుతుంది.

  • సవాలుకాలిక రకాలకు నత్రజనిని ముందు సమభాగాలుగా చేసి, నాటుటకు ముందు డమ్మీలోను, బాగా దుబ్బుచేసే దేశంలోనూ, అంకురం తొడిగే దశలోనూ, బురద పదునులో మాత్రమే సమన పాస్లలో వెదజలి 36-48 గంటలో తర్వాత పలుచగా అనేటు పెట్టాలి. మధ్య మరియు సిర్సకలికా రకాలకు 4 దశలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజనిని చివరి దోప అంకురం దశలో వేయాలి, ఆ తర్వాత వేయకుండదు.

పట్టిక: వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారసు చేసిన పోషకాల మోతాదు (కోలోలు/ఎకరాకు)

మండలం వర్షాకాలం యాసంగి
నత్రజని భాస్వరం పొటాష్ నత్రజని భాస్వరం పొటాష్
ఉత్తర తెలంగాణ 40 - 48 20 16 48 - 60 24 16
మధ్య తెలంగాణ 40 - 48 20 16 48 - 60 24 16
దక్షిణ తెలంగాణ 40 - 48 24 16 48 - 60 24 16
  • ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాని మొక్కలకు నేఁవొడిగ అంది పది శతం వినియోగ సమర్డవుమ్ ఎక్కువవుతుంది. కాబట్టి తేటంగమ్ అనువసరంగా యూరియా ఎక్కువగా వాడటం వలన వారి పంటలో రోగాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువ. అంతేకాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంస్త్రాలలో ప్తెరుయ్ విత్తు పెరిగి పడిపోతుంది.
  • మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తరువాత కాంప్లెక్స రూపంలో వేయకూడదు.
  • పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖిరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చల్కా (తేలిక) భూముల్లో ఆఖిరి దమ్ములో సగం, అంకురం ఏర్పడె దశలో మిగితా సగాన్ని వేయ్యాలి.
  • జింకు ధాతు లోపం వలన పై నుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలి పోతుంది, ఎక్కువ లోపం వున్నప్పుడు ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరు ప్రక్కల త్రుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెలుసుగా మారుతాయి. మొక్కలు గిడసబారి దుబ్బుకూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికి పైరు రచ్చబడదు. దీని సవరణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకేసారి లేనిచో రీబీ సీజన్ లో, ఆఖిరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను 200-250 కిలోల పశువుల పేడ వేదా వర్మికాంపొస్టుతో కలిపి 20 నుండి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి, ఆ తర్వార చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రా, జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు/తెగుళ్ళ మందులను కలుపరాదు. చౌడు నేలల్లో పిచికారి తప్పనిసరి.
  • ఇనుప ధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి, ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి, ఎత్తు పెరగదు, వర్షాధార నారుమళ్ళలో, మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కవిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తరి నారుమళ్ళు పోస్తే ఈ సమస్య రాదు, దీని సవరణకు లీటరు నీటికి 20 గ్రా. అన్నభేరి, 2 గ్రా. నిమ్మఉప్పు కలిపి పిచికారి చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (5-10 గ్రా. అన్నభేరి) వాడాలి.

కలుపు యాజమాన్యం:

  • నాటిన 3-5 రోజులలోపు ఎకరానికి బ్యూటాక్లోర్ 1-1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 500-600 మి.లీ. లేదా ఆక్సాడయార్జిల్ 35-40 గ్రా. లేదా బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ (0.6) + ప్రెటిలాక్లోర్(6.0) 4 కిలోల గుళికలు, పైరాజోసల్ఫ్యూరాన్ ఈథైల్ + ప్రైటిలాక్లోర్ 6.15 గుళికలు 4 కిలోలు లేదా 8-10 రోజిల లోపు పైరాజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80-100 గ్రా. 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
  • నాటిన 15-20 రోజులకు ఎకరాకు సైహలోపాప్ పిబ్యూటైల్ 250-300 మి.లీ. లేదా ఫినాక్జిప్రాప్ పి ఈథైల్ 250 మి.లీ. లేదా మెట్ సల్ఫ్యూరాన్ + మిథైల్ క్లోరిమ్యూరాన్ ఇధైల్ అనే మందును 8 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • వెడల్పాకు కలుపు నివీరణకు 25-30 రోజులకు 2,4-డి సోడియం సాల్ట్ అనె మందు ఎకరాకు 500-600 గ్రా. లేదా 2,4-డి, ఇ. ఇ. 1.25-1.50 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు నివీరణకు బిస్ పైరిబాక్ సోడియంను ఎకరాకు 100 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి 15 నుండి 20 రోజీల మధ్య పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం: నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. మూస తిరిగిన (ఏనుకున్న) రోజు నుండి పైరు దుబ్బు చేయటం పూర్తి అయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-3 సెం.మీ., చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు సుమారు 5 సెం.మీ. నీటి మట్టం ఉండాలి. కోతకు 7-10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా ఆరగట్టాలి. నీటిని ఆదా చేయుటకు అరుతడి (AWD) నిధానాన్ని పాటించవచ్చు.

కాలపు ఎక్కువగా ఉండే పొలాల్లో నాటిన మొదటి 10 రోజులు సాధారణ పద్దతి మాదిరిగానే నీటిని అందించి తదుపరి ఆరుతడి విధానంలో నీటిని అందించాలి.

దమ్ము చేసి నాటు వేసే సాధారణ పద్ధతిలోనే ఆరుతడి విధానం (ఎ.డబ్లు.డి)తో నీటి యాజమాన్యం పాటించినట్లయితే దిగుబడి తగ్గకుండానే సుమారు 15-30 నీటిని ఆదా చేయవచ్చు. ఈ పద్ధతికి 15 సెం.మీ. వ్యాసం, 40 సెం.మీ. పొడువు గల పి.వి.సి(ప్లాస్టిక్) పొపును వరి పొలంలో సుమారు రూ.1000 ఖర్చుతో అమర్చుకొన్నట్లయితే నీటి మట్టమును సులభంగా గమణించవచ్చును. పైపులే సగభాగం (20సెం.మీ.) వదిలి మీగితా 20 సెం.మీ.ల పైపుకు 5 సెం.మీ. ఎడంతో రంధ్రాలు చేసుకోవాలి. ఈ పైపును రంధ్రాలున్నంత వరకు ఒక ఒడ్డు (ఒరం)కు దగ్గరగా దింపాలి. పైపును దింపేటప్పుడు గట్టి పలకలు (నాగటి పలకలు) లేకుండా చూసుకేవాలి. ఆ తరువాత పైపు లోపలి మట్టిని పైపు అడుగు భాగం వరకు (20 సెం,మీ.) తీసివేయాలి. పైపు లేపలి నీటి మట్టము మరియు పొలం నీటి మట్టం ఒకే ఎత్తులో ఉండేటట్లు జాగ్రత్త పడాలి.

ఎప్పుడైతే పైపులో నీటిమట్టం 3-5 సెం.మీ. (నేల మట్టం నుండి) తగ్గినచో పొలంలో నీటి మట్టం నేల మట్టం కన్నా 5 సెం.మీ. పైకి ఉండేటట్లు నీటిని పెట్టాలి. నాటిన నుండి చిరుపొట్ట దశ వరకు పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా 5 సెం.మీ క్రిందకు తగ్గినచో పొలంలో నీటి మట్టం నేల మట్టం కన్నా 5 సెం.మీ. పైకి ఉండేటట్లు నీటిని పెట్టాలి. పూత దశ నుండి గింజ పాలుపోసుకునే దశ వరకు పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా 3 సెం.మీ క్రిందకు తగ్గినప్పుడు తిరిగి నీటిని నేల మట్టంపై 5 సెం.మీ. ఉండేటట్టు తడి పెట్టవలెను.

ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు భూసారాన్ని కాపాడుతూ మరీయు వాతావరణ కాలుష్యాన్నితగ్గించవచ్చు.

వరికోత: వెన్నులోని 80 శాతం గింజలు పక్వానికి నచ్చిన తరువాత, పొలాన్ని ఆరగట్టి కోయాలి. ఈ దశలో గింజల్లో సుమారు 18-24 శాతం తేమ వుంటుంది. కావున ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రపరుచుకోవాలి. ( FAQ వివరాలు తరువాయి పేజీలలో ఇవ్వబడినవి)

ముఖ్య గమనిక: వర్షాకాలంలో స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా కాటన్ దొర సన్నాలు (యంటియు 1010) లాంటివి వేసినచో తప్పనిసరిగా 20-25 రోజుల నారుతోనే వరినాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా 40-50 రోజుల నారుతో నాట్లు వేసినచో, నాటిన 20-25 రోజులకే తల్లి కర్ర పిలకలు వేయకుండానె ఈని, వెన్నులు చిన్నవిగా వచ్చి దిగుబడులు తగ్గుతాయి. అందువలన ముందుగానే ఎక్కువ మోతాదు నత్రజనిని (ఎకపాకు 40-50 కిలోల యూరియా) వాడి అంతకృషి చేయవలెను.

దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి

ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలరెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరానికి 15-20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7-10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు చేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.2500/- నుండి రూ.3000/- వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండడం వలన దిగుబడి 10-15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ వస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరత అధిగమించవచ్చు. ప్రతికుల వాతావరణ పరిస్తితులలో పంట కాలం కోల్పోకుండ నీరు అందాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. అందువలన తెలంగాణాలో ముఖ్యంగా కొన్ని జాల్లాల్లో (ఖమ్మం, వరంగల్ మొ.) బాగా ప్రాచుర్యం పొందుచున్నవి. వర్షాకాలంలో కంటె యాసంగిలో చలి తక్కువ ఉండె జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కాని ఈ పద్ధతి ఎక్కువగా చలు ఉండే ప్రాంతాల్లో, సమస్యాత్మక నేలల్లో ( చౌడు/ క్షారము/ ఆమ్లము) అనికూలం కాదు. ఒక్కోసారి విత్తనం చల్లిన తరువాత వర్షం వల్ల పూర్తిగా విత్తనం కోట్టుకుపొయే అవకాశం కలదు.

నేలలు: సమస్యాత్మక నేలలు తప్ప సాధారణంగా వరిని సాగుచేసే అన్ని నేలలు అనుకూలం. ముంపుకు గురయ్యే భూములు సాగుకు అనుకూలం కాదు.

విత్తన మొతాదు: రకాన్ని బట్టి ఎకరాకు 10-15 కిలోలు ఆవసరమవుతాయి. కాండం గట్టిగా ఉండి వేరు వ్యవస్త ధృఢంగా వుండి పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం. ఆయా ప్రాంతానికి అనివైన, రైతుకు ఇష్టమైన ఏ రకమైన ఈ పద్ధతిలో లాగు చేసుకోవచ్చు.

విత్తనాన్ని మండె కట్టడం: విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నానిన విత్తనాలను గోనెసంచిలో మందెకట్టి దమ్ముచేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాన్ని విత్తుకోవాలి.

డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నప్పుడు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండాజిమ్ కలిపిన ద్రావణంలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 గంటలు మందెకట్టి కొద్దిగా ముక్కు పగిలిన (తెల్లపూస) గింజలను సీడర్ లో వేసి విత్తుకోవాలి. డ్రమ్ సీడర్ పరికరాన్ని 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలీ. గిందలు రాలడానికి వీలుగ ప్రతి డ్రమ్ లో కేవలం 3/4 వంతు మాత్రమే గింజలను నింపాలి. గింజలను నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుసకు వరుసకు మధ్య దూరం 5-8 సెం.మీ. వుంటుంది. ఒక్కో కుదురులో 5-8 గింజలు పడటం జరుగుతుంది. కొన్ని అనివార్య కారాణాల వల్ల (మొలక సరిగ్గా లేకనో లేక పక్షులు తినివేయం వల్లనో) కుదురులోని గింజలు 50 శాతం దెబ్బతిన్న మిగిలిన 50 శాతం గింజల నుండి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది. రకాన్ని బట్టి గింజలు పడటాన్ని బట్టి రంధ్రాలను స్టాపర్స్ తో మూసుకోవాలి. సన్న గింజ రకాలను రంధ్రం వదిలి రంధ్రం మూసేయాలి. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పు కాలిబాటలు ఉంచుకోవాలి. తాడును వినియోగించి డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది.

ప్రధాన పొలం తయ్యారీ: సాధారణ పద్ధతిలో వరి నాటేట్టప్పుడు కంటే వీలైనంత బాగా చగును చేసుకోవాలి. ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. పొలంలో నీరు నిల్వ ఉండకూడదు . కాబట్టి నీరు ఎక్కువైతే బయటకి పోవడానికి ఏర్పాటు చేయాలి. పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుంటే చదును చేయచానికి, నీరు పెట్టడానికి, విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా వుంటుంది. బంక నేల్లల్లో ఆఖరి దమ్ము చేసి, చదును చేసిన మరిసటి రోజు విత్తుకోవచ్చును. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా వుంటే చాలు. ఇసుక శాతం ఎక్కువగా వున్న నేలల్లో విత్తనాలకున్న రోజే ఆఖరి ధమ్ము చేసి, చదని చేసి పలుచటి నీటి పొర వుండేటట్టు చూసుకేవాలి. విత్తనాలను వెదజల్లి గాని, డ్రమ్ సీడర్ తో గాని విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: ఈ పద్ధతికి కూడా సాదారణ పద్ధతిలో సిఫారసు చేసిన మోతాదే సరిపోతుంది. కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు (మొత్తం మొతాదు) మరియు పొటాష్ ఎరువు (సిఫారసు చేసిన మోతాదులో సగం) మాత్రమే వేయాలి. దమ్ములో కానీ, విత్తేటప్పుడు కాని నత్రజనిని వేస్తే రలుపు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ సమయంలో నత్రజనినిచ్చే ఎరువులను వేయకూడదు. భూసార పరీక్ష చేసి భాస్వరం ఎక్కువగా ఉన్నచో 25 మేర తగ్గించి వేసుకేవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి 13 భాగం విత్తిన 15-20 రోజులకు, 13 భాగం విత్తిన 40-45రోజులకు, మిగిలిన 13 భాగం నత్రజని, సగం పొటాష్ విత్తిన 60-65 రోజిలకు వేయాలి.

కలుపు యాజమాన్యం: ఎకరాకు ప్రెటిలాక్లోర్ సేఫ్నర్ మందును 600-800 మి.లీ. విత్తిన 3-5 రోజులలోపు లేదా పైరాజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80-100 గ్రా. లేదా బ్యూటాక్లోర్ 1-1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 500 మి.లీ. లేదా అక్సాయార్జిల్ మందును 35-45 గ్రా. 8-10 రోజులలో ఇసుకలో కలిపి చల్లాలి.

ఎకరాకు సైహలోఫాస్ పి బ్యూటైల్ 300 మి.లీ. (ఊద, ఒడిపిలి) లేదా ఫినాక్స్ ప్రాప్ పి ఈధైల్ 250-300 మి.లీ. విత్తివ 15 రోజులకు లేదా బిస్పైరిబాక్ సోడియం 100 మి.లీ. విత్తిన 20 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిస్పైరిబాక్ సోడియం వెడల్పాకు గడ్డి జాతిని కూడా అరికట్టును. వెడల్పాకు కలుపు నివారణకు 2,4-డి సోడియం సాల్ట్ 600 గ్రా. విత్తిన 25-30 రోజులకు పిచికారి చేయాలి. పంట దశను, కలుపు రకాన్ని బట్టి కలుపు మందును ఎంచుకోవాలి.

నీటి యాజమాన్యం: విత్తిన తరువాత మొదట్లో నీరు లేకుండా బురదగా మాత్రమే ఉంచాలి. నీరు నిల్వ ఉన్నచోట మొలక రాదు. ఆ తరువాత పలుచగా నీరు (2-3 సెం.మీ.) పిలకలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపుతుంది. పైరు పొట్ట దశ నుండి పంట కోసే 7-10 వరి రోజుల వరకు నాటువేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి.

యంత్రాలలో నాటిన వరిసాగు

నారును ట్రేలల్లో పెంచుతారు. ఎకరా నాటు వేయుటకు దాదాపు 80-100 ట్రేలు అవసరం అవుతాయి. ఒక్క ట్రేకు 150 గ్రా. విత్తనం చొప్పున ఎకరాకు 12-15 కిలోల విత్తనం అవసరం అవుతుంది.

విత్తనాలను సీడింగ్ మిషన్ (విత్తనాలు వేసే యంత్రం) ద్వారా ట్రేలల్లో విత్తుకేవాలి. ట్రేలల్లో మట్టి నింపడం, సీడింగ్ చేయడం మొత్తం యంత్రాల ద్వారా చేయవచ్చు. ప్రతి 4 కిలోల మట్టికి 4 గ్రా. అన్నభేరి, 8 గ్రా. జింక్ సల్ఱేట్ మరియు 2 గ్రా. కార్బండాజిమ్ మాంకొజెల్ చొప్పున కలుపుకుంటే పోషక సమస్యలు రాకుండా నారు ధృడంగా పెరుగుతుంది. అలాగే ఎకరాకు 3 పాళ్ళ మట్టి ఒక పాలు పశువుల ఎరువు చొప్పున కలిపి ట్రేలల్లో నింపుకోవచ్చు. ఖాళీ ట్రేలల్లో మొదట క్రింది మట్టి (బాటమ్ సాయిల్), ఆ తరువాత నీరు, విత్తనాలు, వాటిని కాపాడటానికి ఆఖరిగా పై మట్టి నింపబడతాయి.

ట్రేలు ఉంచి, నారు పెంచడానికి నేలను బాగా దున్ని, మెత్తగా ఉండేలా దమ్ముచేసి, సమానంగా బల్లపరువుగా తయరు చేసుకోవాలి. ట్రేలను ఉంచడానికి బెడ్ లను 2 అడుగుల వెడల్పు, వీలైనంత పొడువు ఉండేలా 15 సెం.మీ. ఎత్తులో బెడ్లు తయారుచేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ట్రేలను రోజుకు మూడు సార్లు రోజ్ క్యాన్ తో తడపాల్తి ఉంటుంది. అవసరాన్ని బట్టి 0.5 నుంచి 1 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి 3-45 రోజుల వ్యవధితో ప్రతి ట్రేకు 2-3 సార్లు పిచికారి చేయాలి. మ్యాట్ నర్సరీలో జింక్ మరియు ఇనుప ధాతులోప లక్షణాలు అప్పుడప్పుడు కనపడుతుంటాయి. ఇనుప ధాతు లోప సవరణకు 10 లీటర్ల నీటికి 5 గ్రా. అన్నభేరి కలిపి 2 సార్లు పిచికారు చేయాలి. జింకు లోప సవరణకు 10 లీటర్ల నీటికి 10 గ్రా. జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.

ప్రధాన మడి తయారి మరియు నాట్లు: ప్రధాన మడిని వేసవిలో ఒకటి రెండు సార్లు దుక్కి దున్నుకొని, లేజర్ గైడెడ్ లెవరర్ తో చదను చేసుకేవాలి. లేదా లెవర్ బ్లేడ్ తో పొలమంతా సరిసమానంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి, నాటడానికి వారము నుండి పది రోజులు ముందుగా ఒకేసారి, నాటడానికి రెండు మూడు రోజులు ముందుగా మరోసారి రోటావేటర్ దమ్ము చేసుకోవాలి. ఎక్కువ సార్లు దమ్ము చేయడం వలన వరినాటు యంత్రం దిగబడిపోతుంది. పొలం జారుగ లేకుండ బిగుతుగ ఉండేలా చూసుకోవాలి. మట్టి పేరుకోకపెతే నారు నిలబడక పడిపోతుంది. నారుమడి నుండి ట్రేలను ఒక గంట ముందుగా బెడ్ ల నుండి తీసి గట్ల మీద పెట్టుకోవాలి. నీరు కారిపోవడం వల్ల ట్రేల బరువు తగ్గిపోయి, వాట్లకు అనుకూలంగా ఉంటుంది. నాట్లు వేస్తున్నప్పుడు యంత్రానికి మట్టి అంటుకోకుండ ఉండడానికి 1-2 సెం.మీ. నీరు పలుచగా ఉండాలి. వరి నాట్లు యంత్రాలలో సాలుకు సాలుకు మధ్య దూరం 30 సెం.మీ. ఉంటుంది. మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని 12, 14, 16, 18, 21 సెం.మీ. వరకు యంత్రాలను బట్టి సరి వేసుకోవచ్చు . కుదురుకు 3-6 మొక్కలుండేలా నియంత్రించుకోవడానికి అవకాశముంది. ఒక గంటలో ఎకరము నాటు వేయవచ్చు. మరియు యంత్రాన్ని బట్టి గంటకు 3.0-3.5 లీటర్ల డీజిల్ లేదా 4.0-4.5 నీటర్ల పెట్రోలు అవసరం. నాటు యంత్రములు ఒకే సారి 6-8 వరసలలో నాటు వేయును. ఒక ఎకరము నాటు వేయడానికి 1.30 గంటల సమయం పట్టును. ఒక ఎకరానికి 75-80 ట్రేలు వాడుకోవాలి. నాటు వేశాక పొలంలో నీరు ఎక్కువగా ఉంటే, తీసివేసి, పైరు పచ్చబడే వరకు పలుచగా నీరు ఉంచాలి. ఆ తరువాత భూమి ఆరకుండా ఎల్లప్పుడూ పదనుతో ఉండేలా జాగ్రత్త వహించాలి. కలుపు మరియు నీటి యాజమాన్యము మామూలుగా నాటేసిన వరిలాగానే చేయాలి.

వీడర్ వాడకం వల్ల వేరుకు బాగా ఆక్సీజన్ అంది పిలికలు బాగా వస్తాయి. పవర్ వీడర్ ద్వారా 2.0-2.5 గంటలలో ఒక ఎకరంలో కలుపు నివారించవచ్చు. గంటకు సుమారుగా ఒక లీటరు పెట్రోలు అవసరం.

రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ లేదా జీవన ఎరువులను వాడి, పైరుకు సమతుల్యంగా పోషక పదార్ధాలను అందచేయాలి. ఎకరాకు 48 నుండి 60 కాలోల వరకు నత్రజనిని, 24 కిలోల భాస్వరాన్ని మరియు 20 కిలోల పొటాష్ ను వాడాలి. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుకు ముందు దమ్ములోను, దుబ్బుచేసే దశలోను, అంకురం దశలోను బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి, 36-48 గంటల తరువాత పలుచగా నీరు పెట్టాలి. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములో వేయాలి. పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో సగం, అంకురం ఎర్పడే దశలో మిగితా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎపువులను దుబ్బు లేదా అంకురం ఏర్పడే దశల్లో పైపాటుగా వేయకూడదు. దమ్ములో వాడుకోవచ్చు.

పొడి వరిని తరి పొలంగా సాగు చేయుట

చాలా మంది రైతులు సకాలంలో నుంచి వర్షాలు కురుస్తాయని ముందుగా నార్లు పోసుకొని, సరియైన సమయంలో వర్షాలు పడక బోర్లలో, బావులలో సరిపడే నీరు లేక ప్రధాన పొలం తయారీ ఆలస్యం కావడం వలన అదునులో నాట్లు వేయలేక ముదురు నార్లు వేసుకోవలసివచ్చి దిగుబడులు తగ్గుత్తున్నవి.

ఈ సవస్యను అధిగనించడానికి వేసవిలో కురిసే వర్షాలతో పొడి దుక్కులు చేసుకోవాలి. వ్యవసాయ వాతావరణ సూచనలను అనుసరించి మిందస్తు సమాచారంతో విత్తన శుద్ది చేసిన పొడి విత్తనాలను ఎకరాకు 25-30 కిలోలు. నాగలి లేదా గొర్రుతో దుక్కిలో విత్తి మట్టితో కప్పాలి. ఇల విత్తిన విత్తనాలను చీమల బారిన పడకుండా రక్షించుకోవాలి. నీటి వసతులు లేని ప్రాతాంల్లో వర్షాధారంగా ఆయకట్టు ప్రాతాంల్లో సాగు చేస్తారు. కాబట్టి వర్షాలు కురిసేంత వరకు విత్తనాలు నేలలోనె ఉండి, వర్షాలు కురుసిన తరువాత మొలకెత్తుతాయి. వర్షాలు కురిసిన వెంటనే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1.2 నీటర్ల చెప్పున పిచికారి చేయాలి. ఇలా మొలకెత్తిన పంటను జలాశయాలు, చెరువులు, కాలువల ద్వారా నీరు విడుదలయ్యోంత వరకు వర్షాధారంగానే ఆరుతడి పంటలాగా సాగు చేయాలి. ఆ తరువాత విత్తిన 20 రోజులకు బిస్పైరిబాక్ సోడియం 100 మి.లీ. మందును ఎకరాకు నేలలో తేమ ఉన్నప్పుడు పిచికారు చేయాలి. వర్షాలు కురిసి, నీరు విడుదలైన తరువాత నీరు నిల్వ ఉంచి సాంప్రదాయ పద్ధతిలో పంటను సాగు చేయాలి. సాధారణంగా 40-45 రోజులకు నీరు వదులుతారు.

”శ్రీ” వరి సాగు పద్ధతి

ఈ పద్ధతిలో ఎకరాకి 2 కిలోల విత్తనంతోనే వరి చాలా ఆరోగ్యంగా పెంచవచ్చు. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకుపోయి, భూమి లోపల పొరల నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి. కాబట్టి ఈ సాగు పద్దతిలోనె ఖచ్చితంగా వరి పండిస్తే సాధారణ వరికి అవసరమయ్యే నీటిలో 60% నీరు మాత్రం సరిపోతుంది. ఈ సాగు పద్దతిలో పాటించాల్సిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్దతులు.

1. లేతనారు నాటడం: 8 నుండి 12 రోజుల వయస్సుగల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి. దీని వలన అధిక సంఖ్యలో పిలకలు వేస్తాయు. వేర్లు బాగా వ్యాపిస్తాయి.

2. జాగ్రత్తగా నాటడం: నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా, వేరు, బురద, గంజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దీనివలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన వత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు చేస్తుంది.

3. దూరదూరంగా నాటడం: మొక్కకు మొక్కకు, చాలుకు చాలుకు మధ్య 25 సెం.మీ. దూరం ఉండేటట్లు నాటాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాచుకోవచ్చు.

4. కలుపు నివారణ: పొలంలో నీరు నిలిపకుండా చూస్తాం కాబట్టి, కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు, రోటరీ/కోనో వీడర్ నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తరువాత 10 రోజుల వ్యవధిలో మరో మూడు సార్లు నేలను కదిలిస్తే, కలుపు మొక్కలు నేలలో కలసి పోతాయి. ఈ విధంగా కలియబెట్టడం వలన ప్రతీసారి రోటరీ/కోనో వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సీజన్ అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. రెండుసార్లు కంటే ఎక్కువగా రోటరీ/కోనో వీడర్ పనిచేసినప్పుడు ఒక్కొక్కసారికి ఎకరాకు 800 కిలోల అధిక దిగుబడి వస్తుందని రైతులు అనుభవం తెలియజేస్తున్నది.

5. నీటి యాజమాన్యం: నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగ ఉండాలి. గాని నీరు నిలుపకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగ ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.

6. సేందియ ఎరువులు: సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచాలి. ప్రస్తుత పిరస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడ పైరుకు తొలిదశలో వాడవచ్చు. కాని, ముందు ముందు సేంద్రియ ఎరువులు వాడి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి.

ఈ పద్ధతి భూమిలోని సూక్ష్మజీవులు సహజంగానే పైరుకు కావలసిన పోషక పదార్థాలు అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెండుతూ సుస్థిర దిగుబడులనివ్వగలదు.

నారుమడి యాజమాన్యం: వరి నారును 8 నుండి 12 రోజుల దశలో నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెళకువలు పాటించాలి. 2 కిలోల విత్తనాన్ని ఒక సెంటు భూమిలో చల్లి నారు నారు పెంచితే ఎకరాకు సరిపోతుంది. భూమిని మొత్తగా దున్ని, దమ్ముచేసి, ఎత్తుగా తయారుచేసి, చుట్టు కాలువ తీయాలి. తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టు చెక్కతోగాని, బొంగులతోగాని ఊతం ఏర్పాటు చేయాలి. నారుమడి తయారైన తరువాత చివికిన మెత్తటి పశువుల ఎరువును ఒక పొరలాగా చల్లి, దానినీద 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండె కట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాలపైన మరల మరోపోర పశువుల ఎరువు చల్లి గడ్డితో కప్పాలి. మెలక వచ్చిన వంటనే గడ్డిని తీనివేయాలి. రోజు నీరు చల్లుతూ ఉంటే 8 రోజులలో వరి నారు 2-3 ఆకులలో ధృడంగా పెరుగుతుంది. నారుమడి నుండి నారు పీకకుండా, మట్టితో సహా రొలంలోకి తీసుకెళ్లి, గింజ, బురదతో సహా 25 X 25 సెం.మీ. ఎడంగా ముందుగా మార్కర్ పరికరము సహాయంతో గీతలు గూసుకొని గీతలు కలిస్తె ప్రాంతంలో ఒక్కొక్క మొక్కను పైపైన నాటాలి.

ప్రధాన పొలం తయారీ: సాధారణ పద్దతుల్లో వరి నాటడానికి కూడా తయారుచేయాలి. అయితే, ఈ పద్ధతిలో పొలం తడిగా ఉండాలని. నీరు నిలువ ఉండకూడదు కాబట్టి పొలాల్ని బాగా చదును చేసి, నీటిని బయటకు తీయడానికి కాలువలు ముందుగానే ఏర్పాటు చెయాలి. దమ్ముచేసి చదను చేసిన పొలంలో చేతితో లాగే రోలర్ మార్కర్ తో 25 X 25 సెం.మీ. దూరంలో నీలువుగా మరియు అడ్డంగా గీతలు గూయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలను పైపైన గుచ్చాలి.

ఆరుతడి వరి (ఎరోబిక్ రైస్)

ఎరోబిక్ వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మెక్కజొన్న పంట వలె ఆరుతడి పరిస్థితులలో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని “ఎరోబిక్ వరి” అవి వ్యవహరిస్తారు. ఎరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో, సాధారణం పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండించే భూముల్లో అడరదడప మీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల క్రింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్దతి ఆనుకూలంగా వుంటుంది. దమ్ము చేసి నీరు నిలగట్టవలసిన అవసరం లేదు.

ఎరోబిక్ పద్ధతిలో సాగు చేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి, బెట్టను తట్టుకునే స్వల్ప కాలిక రకాలు అనుకూలం. యం.టి.యు.1010, ఐఅర్-64, అనఘ వంటి రకాలు అనుకూలంగా వున్నట్లు పరిశోధనల్లో తేలింది.

తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకుని పలుమార్లు దున్ని, మెత్తని దుక్కి చేసి కలుపు సమస్యను లేకుండా చూసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల పొటాష్ ఎరువులు వేసి కలియ దున్ని బాగా చదును చేయాలి. నేల సమతలంగా, చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడ సమానంగా వుండదు.

ఎరకానికి 25-30 కిలోల విత్తనము ఉపయోగించాలి. విత్తే ముందు 3 గ్రా. కార్బండాజిమ్ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.

శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో 20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనుకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేస్తే గొర్రులతో (ఫర్చికవ్ సీడ్ డ్రిల్ తో) గాని వేసుకోవచ్చు. విత్తనాన్ని పైపొరల్లో పడేటట్లుగా తక్కువ (2.5-5 సెం.మీ.) లోతులో వేసుకోవాలి.

పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో సగ భాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేతుకోవాలి. నత్రజని ఎరువుకు సాధారణంగా చేసే మాగాణి వరి కంటే సుమారు 25% అధికంగా వేయాలి. నత్రజని ఎరువును మూడు దఫాలుగా విత్తిన 15 రోజులకు, పిలక దశలో, అంకురం దశలో వేయాలి.

ఎరోబిక్ వరిలో ఇనుపధాతు లోపం వలన ఆకులు తెల్లగా పాలిపోయినట్లు వుండి ఎదుగుదల తగ్గుతుంది. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 20 గ్రా. అన్నభేధి, 2 గ్రా. నిమ్మఉప్పు కలిపి లిచికారి చేయాలి. అవసరమైతే వారం రోజుల తరువాత మరొకసారి పిచికారి చేయాలి.

ఈ పద్ధతిలో కలుపు సమస్య ఎక్కువగా వుంటుంది. కాబట్టి విత్తిన వెంటనే కలుపు మందు వేయడం తప్పనిసరి. కలుపు నివారణకు ఎకరాకు పైకజొసల్ఫ్యూరాన్ ఇథైల్ 80-100 గ్రా. లేదా పెండిమిథాలిన్ లేదా ప్రెటిలాక్లోర్ + సేఫ్నర్ 600 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల లోపు పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి సైహలోఫాస్ పి బ్యూటైల్ 300 మి.లీ. లేదా మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ + క్లోరిమ్యూరాన్ ఇథైల్ 8 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి 20-25 రోజుల మధ్యన పిచికారి చేయాలి. వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు 400గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ అనే మందును పిచికారి చేయాలి. పంట వరుసల్లో విత్తినట్లయితే వరుసల మధ్య అంతరకృషి చేసుకోవచ్చు. దీని వలన తక్కువ ఖర్చుతో కలుపును నివారించడమే కాక తేమ బాగా నిలుపుకొని పంట బాగా పెరుగుతుంది.

పంటకు ప్రతి 7-10 రోజూలకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెట్టాలి. అయితే పంటకు కావలసిన తేమను అందించడం, పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూడటం ప్రధానమైన అంశం. అధిక వర్షాలు నమోదైనప్పుడు నీటి తడుల అవసరం ఉండదు. ఈ విధంగా ఖరీఫ్ లో 3-4 తడులలో వరిసాగు చేసుకునే అవకాశం ఉంది. నీటిని 40-50% మేర ఆదా చేసుకోవచ్చు. కాగా ఏటా ఇదే పద్దతిలో వరి పండించినప్పుడు చీడపీడలు, సూక్ష్మధాతు లోపాల వలన క్రమంగా దిగుబడులు తగ్గుతాయి. ఆరుతడి వరిలో సాధారణ దిగుబడి ఎకరాకు సుమారు 1.6-1.8 టన్నుల వరుకు పొందవచ్చును.

చౌడు పొలాల్లో వరి యాజమాన్యము

చౌడును తట్టుకొను వికాస్, సస్యశ్రీ, సియస్ఆర్-13 వంటి రకాలను ఎన్నుకోవాలి.

నారుమడి యాజమాన్యము

చౌడు సమస్య ఉన్నప్పుడు సాధారణ పద్ధతిలో వారు పెంచినట్లయితే నారుమడి సరిగ్గా రాదు. కావున రైతులు ఈ చౌడు పొలాల్లో వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయాలి. నారుమడిలో వేయవలసిన ఎరువుల మోతాదును పెంచి వేసుకోవాలి. ముఖ్యంగా భాస్వరం ఎరువును సిఫారసు మోతాదు కంటే రెట్టింపు చేయాలి. నారుమడిలో జింకు లోపం వచ్చే అవకాశం ఉన్నందున, ఎకరాకు సరిపోవు సరిపోవు నారుమడి తప్పనిసరిగా 1 కిలో జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. నారు పెరుగే సమయంలో పశువుల ఎరువు గాని, గోర్రె ఎరువు గాని పొడి చేని లేదా వర్మికాంపొస్టును గాని నారుమడిలో పలుచగా మారుమడిలో నీరు పెడుతూ తీసివోస్తుండాలి.

ప్రధాన పొలం యాజమాన్యం

ప్రధాన పొలంలో చౌడు తీవ్రతలను తగ్గించుటకు ప్రతి పంటకు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పెసర మరియు పిల్లిపిసర లాంటి పంటలను వేసి పూత సమయంలో పొలంలో బాగా కలియదున్నాలి. చౌడు పొలాలను బాగా దమ్ము చేసి, నీరు తీసివేయాలి. తప్పనిసరిగా 3-4 మొక్కలు నాటాలి. చౌడు పొలాల్లో లేత నారు నాటడం మరియు పైపైన నాట్లు వేయడం వలన లవణాల ప్రభావముతో నారు చనిపోయే అవకాశం ఉన్నది. కావున చవుడు ఉన్నప్పుడు కొద్దిగా మట్ట ముదిరిన నారును నాటు దూరము తగ్గించి కొంచెం లోతుగా నార్లు వేసుకోవాలి. పొలంలో చౌడు ఉన్నప్పుడు నీటి యాజమాన్యములో కూడా మార్పులు చూసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉంచుతూ, తీసివేస్తూ క్రొత్త నీరు పెట్టడం వలన, లవణాల సాంద్రత పెరగకుండా నిరోధించవచ్చు. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయడం వలన, చౌడు ప్రభావాన్ని మొక్కలపై కొంతవరకు తగ్గించవచ్చు. చౌడు పొలాల్లో అంతరకృషి చేయడము లేదా కోనో వీడర్ గాని పవర్ వీడర్ గాని త్రిప్పడము వలన చౌడు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. వర్షపు నీరు వలన పొలంలో లవణాల సాంద్రత తగ్గి చౌడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి వర్షాకాలము కన్నా యాసంగిలో చౌడు పొలాల్లో ఎక్కువ లవణాల ప్రభావం ఉంటుంది. శాశ్వత చౌడు నివారణ గాను రైతులు ఎప్పటికప్పుడు పచ్చిరొట్ట పైర్లను పాగుచేయడం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం మరియు భూసార పరిక్షననువరించి జిప్సం వాంటి రసాయనాలను భూమిలో వేసి బాగా నీరుపెట్టి కలియదున్నాలి. నీటిని తీసివేయడము వలన పొలంలో లవణాల సాంద్రతను తగ్గించి చౌడును నివారించుకునే అవకాశం ఉన్నది.

సల్ఫైడ్ దుష్ఫ్రభావం

వరి నేలల్లో, పంట మధ్య కాలంలో, అక్కడక్కడ గుంపులు గుంపులుగా బాగా పెరిగిన పంట మెత్తము పసుపు వర్ణంలోకి మారిపోవడం, అక్కడి నేలల్లో సల్ఫైడు (గంధకపు) దుష్ఫ్రభావం వలన సంభవించును. ఇటువంటి ప్రాంతములో, నేలమడి బాగా మెత్తగా ఉండి, కాలు చాలా లోతుగా దిగబడిపోవును. పొలంలో నడుస్తుంటే బుడగలు రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుండి దుర్గందపు వాసన మరియు మొక్కను వేర్లతో బయటకు తీసినప్పుడు క్రుళ్లిన కోడి గుడ్ల వాసన వచ్చును. పంటవేర్లు పూర్తిగ నల్లబడి జీవము లేక కిళ్ళిన వాసన వస్తుంది. మొక్కలు పూర్తిగా చనిపోయే ఆస్కారమున్నది.

వరి చేనులో ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికంగా అధిక నీటి ముంపు, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవడం, వేలలో రసాయన చర్యల వలన లభ్య ఇనుము మార్పు చెందడం, చాలా కాలంగా బరువు నేలల్లో సల్ఫరు (గంధకము) కలిగిన 20-20-0-15 లాంటి కాంప్లెక్సులను వాడటం. ఇటువంటి పరిస్థితులలో మొక్క వేర్లకు తగిన గాలి తగిలే విధంగా, ముదురు నీటిని తీసి మళ్ళీ నీరు అందివ్వాలి. పైరు వేయటానికి మడిని తయారు చేయుటకు ముందు ఇటువంటి ప్రాంతాలలో మట్టిని బాగా కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తుచేయడం. 1-2 బండ్ల ఎర్రమట్టిని వేయటం చేయాలి. పంట మద్యకాలంలో పొలాల్ని సన్న నెఱ్ఱెలు వచ్చేవరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరివ్వాలి. ఈ చర్యలతో క్రమంగా సల్ఫైటు దుష్ప్రభావం తగ్గుతుంది. అమ్మోనియం సల్పేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడరాదు.

చీడపీడల యాజమాన్యం (అన్ని పద్ధతులకు)

తెలంగాణలో వివిధ రకాల పురుగుల వల్ల వరిలో సుమారు 25-30 శాతం దిగుబడులు తగ్గి రైతాంగం నష్టపోతున్నారు. వాటిలో కాండం తొలిచే పురుగు మరియు నుడిదోమ అత్యంత ప్రమాదమైనది. వాటి గురించి విపులంగా ఈ క్రింద పొందుపరుస్తూ, మిగితా పురుగుల గురించి పట్టిక(2) లో పొందుపరచడం జరిగింది.

కాండం తొలిచే పురుగు (మొగి పురుగు/తెల్లకంకి/ఊసపోటు)

నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే ఈనిన తరువాత తెల్లకంకులు బయటకు వస్తాయి. ఆలస్యంగా లేకా ముదురు నారు నాటడం, కరువు పరిస్థితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి, సూర్యరశ్మి రోజుకు 7 గంటలు కంటే ఎక్కువ, నత్రజని తక్కువగా వాడటం వలన కాండం బలహీనం కావడం ఈ పురుగు ఆశించడానికి అనుకూలం. ముఖ్యంగా యాసంగి వరి పైరులో ఎక్కువగా ఆశిస్తుంది.

ముదురు గోధుమ/ ఎండుగడ్డి/ పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడిన గ్రుడ్ల సముదాయం చిన్న గోధుమ రంగు ముద్ద వలె ఆకు కొనలపై లేదా కాండం మీద కనబడుతుంది. తెలుపు-గోధుమ రంగులో ఉండే పిల్ల పురుగుల (లార్వా) తల ఎదిగిన తర్వాత నారింజ-పసుపు రంగు కలిగి ఉంటుంది. చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేకా గ్రుడ్ల సముదాయం లేదా 10 శాతం చచ్చిన మొవ్వులు లేదా లింగాకర్షక బుట్టలలో వారానికి బుట్టకు 25-30 మగ రెక్కల పురుగులు గమనించినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

నారు పీకే 7 రోజుల ముందు 2 గంటల (200 చ.మీ.) నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చెయాలి. ముదురు నారు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి. ట్రైకోగ్రామా గ్రుడ్లు వారన్న జీవులను నాటిన 25 రోజుల నుండి ఎకారకు 4 కార్డుల చొప్పున లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి. 1.5 గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

అంకురం నుండి చిరుపొట్ట దశలో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్.సి 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలుపు పిచికారి చేయాలి.

సుడిదోమ

వరి పండించే అన్ని ప్రాంతాల్లో ఈ రెండు రకాల దోమలు (గోధుమ రంగు దోమ, తెల్ల వీపు దోమ) ఆశిస్తాయి. వానాకాలంలో సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు యాసంగిలో మార్చి 2వ వారం నుండి ఏప్రిల్ వరుకు ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల, పెద్ద దోమలు నీటి పైభాగంలో దుబ్బల మొదళ్ళ దగ్గర వుండి రసం పీల్చడం వలన పైరు లేత పసుపు వర్ణంలోకి మారుతుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీటిని గమనిస్తే తెట్టులాగా తేలియాడుతూ కనబడుతుంది. పైరు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటుంది. దీనినే హాపర్ బర్న్ ఆంటారు. ఉధృతి ఎక్కువైతే పొలం ఎండిపోయి పడిపోవడం, తాలు గింజలు ఏర్పడడం లేదా నీర్చినప్పుడు నూక ఇవ్వటం జరుగుతుంది. సుడిదోమ వల్ల “గ్రాసీ స్టంట్” అనే వైరన్ తెగులు వ్యాప్తి చెందుతుంది.

దోమను తట్టుకొని రకాల సాగు, పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు, ఆగష్టు మాసంలో 300-400 మి.మీ. మధ్య వర్షపాతం, పగటి ఉష్ణోగ్రతలు 25-30 డి. సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21-20 డి. సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు, నత్రజనిని అధిక మోతాదులో వాడిన్నప్పుడు కాలి బాటలు తీయని పొలాల్లో, పైరు తొలిదశలో ఆకులను ఆశించే పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాస్ లేదా లామ్డాసైహలోథ్రిన్ మరియు బీటా సైఫ్యూథ్రిన్ వంటి పైరథ్రాయిడ్ మందులను వాడినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతుంది.

పైరు తొలి దశలో దోమ ఉధృతి దోహదపడే మందులను వాడకుండా, పిలక దశలో దబ్బుకు 10-15, అంకురం నుండి ఈనిక దశల్లో దుబ్బుకు 20-25 దోమలు గమనించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. తొలిదశలో ఎసిఫేట్ 75 యస్.పి 1.5 గ్రా. లేదా ఇథోపెస్ప్రాక్స్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటేప్యూరాన్ 0.4 గ్రా. లేదా బ్యూప్రొఫెజిస్ 1.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 0.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందులు పిచికారి చేసే ముందు పొలంలో నీటిని తగ్గించి, పాయలు తీసి మొక్కల మొదళ్ళపై పడేట్లు పిచికారి చేస్తే మంచి ఫలితాలుంటాయి.

వరి పైరును వివిధ రకాల తెగుళ్ళు ఆశించడం వలన దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరిని ఆశించే తెగుళ్ళలో అగ్గి తెగులు ప్రధానమైనవి. దాని గురించి విపులంగా పొందుపరుస్తూ మిగిలిన తెగుళ్ళ యాజమాన్యం పట్టిక(3) లో పొందుపరచడం జరిగింది.

అగ్గితెగులు

తెలంగాణ జిల్లాల్లో వరి పండించే అన్ని ప్రదేశాలలో ఈ తెగులు పైరిక్యులేరియా గ్రిజియా అనే శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. తెగులు లక్షణాలు వివిధ దశల్లో అగుపిస్తాయి.

పట్టిక 2: పురుగుల ఉధృతస్థాయి మరియు నివారణ చర్యలు

వరుస సంఖ్య పురుగు ముఖ్యమైన గుర్తింపు లక్షణాలు ఉధృతి దోహదపడే కారణాలు ఆర్థిక నష్టపరిమితి స్థాయి సిఫారసు చేయబడిన పురుగు మందులు
1. ఉల్లికోడు (దుంప రోగం/ గొట్టాలు/ గొట్టపు రోగం) నారుమడి/పిలక దశలో అంకురం ఉల్లికాడ వలే లేత ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మార్పు చెందుతుంది. ఉల్లికోడు తట్టుకొని రకాల సాగు, ఋతువవనాలు ఆలస్యమై నాట్లు ఆలస్యమవడం, గాలిలో అధిక తేమ (82-88%), సెప్టెంబర్లో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షం నారుమడి: చ. మీ.కు 1 ఉల్లికోడు సోకిన పిలక పిలక దశ: 5 శాతం ఉల్లి గొట్టాలు లేక దుబ్బుకి 1 కోడు సోకిన పిలక నారు మొలకెత్తిన 10-15 రోజుల లోపు 2 గంటలకు (200 చ.మీ.) 800 గ్రా. కార్బోప్యూరాన్ 3జి లేదా 250 గ్రా. ఫోరేట్ 10జి గుళికలు, నాటిన 10-15 రోజుల్లో కార్బోప్యూరాన్ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గుళికలు 5 కిలోలు వేయాలి.
2. తాటాకు తెగులు (పిస్పా) నారుమడి/పిలక దశలో పిల్ల, పెద్ద పురుగులు ఆకులను గీకి తినడం వల్ల తెల్లని నిలుపు చారలు ఏర్పడతాయి. అధిక నత్రజని ఎరువులు వానాకాలం ముందు మంచి వర్షాలు పడి తర్వాత బెట్ట పరిస్థితులు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తక్కువ తేడా, గాలిలో అధిక తేమ దబ్బుకు: 2 పెంకు పురుగులు/ 2 పురుగు ఆశించిన ఆకులు క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా ప్రోఫెనోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.
3. వరి ఈగ ఆకులు సన్నగ పెరిగి తెల్లగా మారి విరిగిపోతాయి లేదా తెల్ల ఆకుల అంచుల దగ్గరలో రంద్రాలు ఏర్పడతాయి. వెన్నులోని కొన్ని గంజలు పాలు పోసుకోక పాక్షికంగా తాలుగా మారుతాయి. నాట్లు ఆలస్యమైనప్పుడు లేదా యాసంగి వరిలో 40-60 రోజుల లోపు పైరులో ఎక్కువగా ఆశిస్తుంది మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.
4. ఆకుముడత (నాము తెల్ల తెగులు/ మజ్జిగ తెగులు) ఆకులు నిలువుగా మడుచుకొని తెల్లని గీతలు, ఆకు ముడతలు విడదీస్తే లేత పసుపు లేక ఆకుపచ్చ లార్వాలు, పొలంలో గుంపులు గుంపులుగా ఎగిరే రెక్కల పురుగులు వెడల్పాటి ఆక్లు గల రకాల్లో ఆలస్యంగా నాట్లు పడి, అధిక వర్షాల తరువాత బెట్ట పరిస్థితులు, వారం పాటు మబ్బులతో కూడిన వాతావరణం, పోలం చుట్టు నీడ ప్రదేశాలు పోటాకు దశలో దబ్బుకు 2 నుండి 3 కొత్తగా తెల్లగా గీత పడిన ఆకులు, నాటిలో చిన్న లార్వాలు. పిలక దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. పోటాకు దశలో కార్టప్ హైడ్రో క్లోరైడ్ 2 గ్రా. క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లేక ఫ్లూబెండమైడ్ 20 డబ్ల్యూ.జి. 0.25గ్రా. లేక ఫ్లూబెండమైడ్ 480 యస్.సి 0.1 మి.లీ
5. తామర పురుగులు పిలక దశలో ఆశించడం వలన ఆకుల అంచులు పైకి చుట్టుకుంటాయి. ఆకులు నూది మొనల్లాగా కనబడతాయి. యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి పరిస్థితులు. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ.
6. ఆకునల్లి (ఎర్రనల్లి /లక్కతెగులు) ఆకులపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేపి బూడిద ఎరుపు కాషాయ రంగుకి మారుతాయి. దూరం నుండి పొలం ఎండిపోయినట్లు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులు, అధిక నత్పజని ఎరువులు, ఆధిక ఉష్ణోగ్రతలు, పొలంలో కలుపు మొక్కలు. నీటిలో కరిగే గంధకం 80% 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫేన్ 1 మి.లీ.
7. కంకినల్లి(నల్ల కంకి తెగులు) ఆకుల మధ్య ఈనెపై లేదా ఆకు మట్ట లేదా కాండం మీద గోధుమ నుండి నల్ల మచ్చలు, వెన్నులు వంకర తిరగడం లేదా పాక్షికంగా బయటకి రావడం మరియు గింజ తయ్యారి దశలో గింజల మీద గోధుమ లేక నల్ల మచ్చలు పగటి ఉష్ణోగ్రతలు 28-30 డి. సెల్సియస్, ఆధిక తేమ ఆదిక ఉష్ణోగ్రతలు, బెట్ట పరిస్థితులు. డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫేన్ 1 మి.లీ. రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో
8. ఆకుచుట్ట పురుగు (కేన్ వార్మ్) లార్వాలుఆకు కొనలను కత్తరించి గొట్టాలుగా చుట్టి వాటిలో దాగివుండి నీటిలో తేలుతాయి. అధికంగా వర్షాలు పడిన సంవత్సరాల్లో ఉధృతి ఎక్కువ క్లోరిపైరిఫాస్ 2.5 మి,లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.
9. రెల్లరాల్చు పురుగు(కట్ వార్మ్) గింజ గట్టిపడే దశలో లార్వాలు కంకులను కత్తిరించడం వల్ల వెన్నులు రాలిపోతాయి. అధికంగా వర్షాలు పడిన సంవత్సరాల్లో ఉధృతి ఎక్కువ క్లోరిపైరిఫాస్ 2.5 మి,లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.ను డైక్లోరోవాస్ 1.0 మి.లీ.తో కలిపి వాడాలి
10. కంపునల్లి (గంధిబగ్) పాలుపోసుకునే దశలో గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి లేదా గింజలు తాలు పోతాయి. పొలం నుండి సాయంత్రం వేళల్లో కంపు వాసన వస్తుంది. క్లోరిపైరిఫాస్ 2.5 మి,లీ.ను డైక్లోరోవాస్ 1.0 మి.లీ.తో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.

గమనిక: 1. ఎకరాకు సూచించిన గుళికలను 25 కిలోల పొడి ఇసుకతో కలిపి పలుచగా నీరుంచి సమానంగా జల్లాలి.

2. పిచికారి మందుల మోతాదు లీటరు నీటికి సూచించబడింది. ఎకరాకు పంట దశను బట్టి 150 నుండి 200 నీటర్ల మందు ద్రావణం పడుతుంది.

3. వాడే పంపు ఏదైన మందు మోతాదును ఎకరానికి 200 లీటర్ల నీటికి లెక్కించి వాడుకోవాలి.

పట్టిక 3:తెగుళ్ళ ఉధృతస్థాయి మరియు నివారణ చర్యలు

వరుస సంఖ్య తెగుళ్ళు ముఖ్యమైన గుర్తింపు లక్షణాలు ఉధృతి దోహదపడే కారణాలు ఆర్థిక నష్టపరిమితి స్థాయి సిఫారసు చేయబడిన తెగుళ్ళ మందులు
1. పొడ తెగులు (మాగడు తెగులు) పిలక/దుబ్బు చేసే దశలో నీటి ముట్టానికి దగ్గరగా వుండే ఆకుల తొడిమెలపైన, కాండం మీద, రెండు లేదా మూడు సెం.మీ. పొడవు కలిగిన ధీర్ఘ వృత్తాకారం లో మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాము పొద ఆకారం పోలివుంటాయి. మచ్చలపైన ఉన్న శితీంధ్రం రూపాంతరం చెంది సిద్ధ బీజాలు (స్ల్కీరోషియా) ఏర్పడతాయి. ఉష్ణోగ్రత 28-32 డి. సెల్సియస్, గాలిలో తేమ 90 శాతం, మబ్బులతో కూడిన వర్షం, చెట్ల నీడకు, పైరు చేనుపై పడిపోయినప్పుడు, నత్రజని ఎరువులు ఎక్కువైనప్పుడు. చ.మీ.కు 10 శాతం పిలకలు హెక్సాకొనజోల్ 5 ఇసి లేదా 5 యన్ ని 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా టెబుకొనజోల్+ ట్రైప్లోక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యూ,జి 0.4 గ్రా. 15 రోజులకొకసారి రెండు పర్యాయాలు మందు ద్రవణాన్ని పిచికారి చేయాలి.
2. బాక్టీరియా ఆకు ఎండు తెగులు నారుమడి దశల్లో ఆకు చివర్ల నుండి క్రింది వరకు తడిసినట్లుగా వుండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోతాయి. (క్రిసెక్ దశ). పిలకలు తొడిగే దశలో ఆకుల పైన పసుపు రంగు మచ్చలేర్పడి వాటి చుట్టూ దాగు మచ్చలుగా మొదలై ఆంచుల వెంబడి అలల మాదిరిగా పైనుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయి. పతుపు పచ్చని జిగురు వంటి బాక్టీరియా ఎండ వేడిమికి గట్టిపడి చిన్న, చిన్న ఉండలుగా ఏర్పడతాయి. ఎడతెరిపి లేకుండా (2-3 రోజులు) గాలులతో కూడి వర్షాలు పడటం, తుఫాను ధాటికి రోజుల తరబడి వర్షాలు కురవడం, మంచు అధికంగా కురవడం, ఉష్ణోగ్రత 22-26 డి. సెల్సియస్, తెగులు ఆశించిన తరువాత నత్రజని ఎపువులు వాడటం చ.మీ.కు 5 శాతం ఆశించిన మొక్కలు ప్రస్తుతానికి నివారణకు మందులు లేవు. తెగులు 5 శాతం కంటే ఎక్కువైతే నత్రజనిని వేయడం తాత్కాలికంగా నిలుపు చేయాలి. తెగులు ఆశించిన పొలంలోని నీటికి ఒకటి రెండు సార్లు పూర్తిగా బయటకి మురుగు నీటి కాలువ ద్వారా పంపాలి.
3. కాండం కుళ్ళు తెగులు నీటి మట్టానికి అనుకున్న పోటాకుపైన నల్లని చాకలతో కూడిన మచ్చలు ఏర్పడతాయి. దుబ్బులోని పిలకలు వాడి పోవటం లేదా క్రింది వరుస ఆకులు పసుపు రంగుకు మారి కుళ్ళిపోయి పిలకలు చనిపోతాయి. ఎండిన పిలకలను చీల్చి చూసినప్పుడు లోపలి భాగంలో సన్నని ఆవాల గింజ రూపంలో సిద్ధ బీజాలు (స్ల్కీరోషియాలు) కనిపిస్తాయు. సిద్ధ బీజాలు భూమిలో 6-9 నెలల పాటు జీవిస్తూ పంట అవశేషాలు, సాగు నీరు, విత్తనమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. మరుగు నీటి వసతి లేకపోవడం, పురుగుల వలన ఏర్పడిన గాయాలు, అధిక నత్రజని ఎరువులు హెక్సాకొనజోల్ 5 ఇసి లేదా 5 యన్ ని 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లేదా టెబుకొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిలకలు క్రింది వరకు తడిచేలా పిచికారి చేయాలి.
4. పొట్టకుళ్ళు మరియు గింజమచ్చ తెగులు పోటాకు తొడిమెలపై నల్లటి లేదా ముదురు గోధుమ రంగు/చాక్లేట్ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు వెన్నులు పొట్టలో కుళ్ళిపోతాయి. వెన్నులు పాక్షికంగా బయటకి వస్తాయి. లేదా తాలు గింజలు రంగు మారి తాలుపోతాయి. గింజలపైన శీలంధ్రం పెరుగుదల గమనించవచ్చు. ఆలస్యంగా నాటి, చలికి పూత దశకు వచ్చినప్పుడు గాలిలో తేమ 90 శాతం, గింజ దశలో మబ్బులతో కూడిన వర్షం, నత్రజని ఎరువులు కార్బండాజిమ్ 50 శాతం డబ్ల్యూపి 1 గ్రా. లేదా కార్బండాజిమ్ + మాంకోజెబ్ 2 గ్రా. లేక ప్రోపికోనజోల్ 1 మి.లీ. లేదా టెబుకొనజోల్ + ట్రైప్లొక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యూజి 0.4 గ్రా.
5. మానిపండు తెగులు పూతదశలో ఆశిస్తుంది. అందాశయంలో శిలీంధ్రం పెరుగుదల వలన ఆకుపచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెంది, పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడుతుంది. పూతదశలో గాలిలో అధిక తేమ శాతం, మంచుతో కూడిన వర్షపు జల్లులు లేదా మంచు కురవడం ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా కార్బండాజిమ్ 50 శాతం డబ్ల్యూపి 1 గ్రా. లేదా టెబుకొనజోల్ + ట్రైప్లొక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యూ.జి 0.4 గ్రా. వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయాలి
6. బ్యాక్టీరియా మొదలు కుళ్ళు తెగులు దుబ్బు/ఈనిక దశలో ఆకుల కొనలు ఎండిపోవడం లేక దుబ్బు మొదలు కుళ్ళిపోవడం, ఆశించిన పిలకల వేర్లు చీల్చి చూస్తే కణజాలం ముదురు ఎరుపు రంగులోకి మారడం, మొక్కల మొదళ్ళు బ్యాక్టీరియా నీటితో (ఊజ్) నిండి దుర్వాసన రావడం. మురుగు నీటి సౌకర్యం లేకపోవడం, మొక్కలకు కీటకీల వల్ల కలిగే గాయాలు. ప్రస్తుతానికి నివారణకు మందులు లేవు. మురుగు నీటి వసతి కల్పించాలి. కాండం తొలిచే పురుగు ఆశించకుండా సస్యరక్షణ చేపట్టాలి.

పిచికారి మందుల మోతాదు లీటరు నీటికి సూచించబడింది. ఎకరాకు పంట దశను బట్టి 150 నుండి 200 నీటర్ల మందు ద్రావణం పడుతుంది.

నారుమడిలో మరియు నాటిన వరిపైరు తొలిదశలో ఆకులపైన నీలుకండే ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఇవి పెద్దవై మచ్చల చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో వుండి మచ్చల మధ్య భాగం బూడిద లేక తెలుపు రంగులో వుండి అనుకూల వాతావరణ పరిస్థితులలో మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పోయి ఆకులు పాక్షికంగా లేదా మొత్తం ఎండిపోతాయి. క్రమేణా తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండిపోయి దూరం నుండి చూసినట్లయితే తగులబడినట్లు కనిపిస్తుంది. అందువలన ఈ తెగులును అగ్గి తెగులుగా పిలవడం జరుగుతుంది. పిలక దశలో ఆకులపైన ఉన్న మచ్చలు క్రమేపి మొక్కల కణువులకు సోకడం వలన ఆ భాగం ముదురు గోధుమ రంగు లేదా నల్లగా మారి చివరకు కణువులు కుళ్ళిపోతాయి. ఈనిక దశలో మెడపైన నల్లటి మచ్చలు ఏర్పడి కంకులోని పోషకాలు అందకపోవడం వలన మెడలు విరిగి వేలాడుతుంటాయి. గింజలు తాలు పోతాయి. ఒకవేళ గింజలు ఏర్పడిన వాటిని మర అందించినప్పుడు నూక శాతం ఎక్కువ అవుతుంది.

నత్రజని అధిక మోతాదులో వాడటం, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డి. సెల్సియస్, కన్న తగ్గినప్పుడు, పగటి ఉష్ణోగ్రతలు 25-30 డి. సెల్సియస్ ఉన్నప్పుడు, గాలిలో తేమ 90 శాతం కన్నా ఎక్కువ, జల్లులు మరియు మబ్బుతో కూడిన వాతావరణం, వారం రోజుల పాటు వర్షం కురవడం, పొలంలో మరియు పొలంగట్ల పైనున్న గడ్డిజాతి కలుపు మొక్కలు ఉండటం అగ్గితెగులు వ్యాప్తి చెందడానికి చాసా దోహదం చేస్తాయి.

ఈ తెగులు తరచూ ఆశించే ప్రాంతాలలో తెగులు తట్టుకునె రకాల సాగు, విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ట్రైసైక్లజోల్ 0.6 గ్రా. లేదా ఐసోఫ్రోథయాలేస్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ/లీటరు నీటికి చెప్పున కలుపుకొని తెగులు ఉధృతిని మరియు నెలకొన్న వాతావరణ పరిస్థితులను బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.

సమీకృత సస్యరక్షణ

  • వేసవిలో లోతు దుక్కులు చెయాలి.
  • చీడపీడలను/తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.

అగ్గి తెగులును తట్టుకొనె రకాలు

కృష్ణ, నెల్లూరు మషూరి, విజేత, తెలంగాణ సోన, సోమనాథ్, బతుకమ్మ

బ్యాక్టీరియా ఎండాకు తెగులును తట్టుకొనె రకాలు

ఇంప్రూవుడ్ సాంబ మషూరి, వరంగల్ సాంబ.

ఉల్లికోడును తట్టుకొనె రకాలు

సిద్ధి, పొలాస ప్రభ, జగిత్యాల మషూరి, ప్రాణహిత, అంజన, ప్రద్యుమ్న. ఇవి వరంగల్ బయోటైపు(4)ను తట్టుకొనవు.

సుడిదోమ తట్టుకొనె రకాలు

విజేత, ఇంద్ర

  • విత్తనశుద్ధి తప్పక పాటించాలి.
  • నారుమడికి సిఫారసు చేసిన సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను వాడాలి.
  • నారుమడిలో సస్యరక్షణకుగాను నారు పీకే 7-10 రోజుల ముందు కార్బోప్యూరాన్ 3జి 800 గ్రా. / ఎకరానికి సరిపోయే నారు మడిలో వేయాలి.
  • ప్రధాన పొలంలో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను వేసి పూత సమయంలో కలియదున్నాలి.
  • గత పంట అవశేషాలను నిర్మూలించాలి.
  • పొలంలోను, గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి.
  • ముదిరిన నారు నాటే పరిస్థితుల్లో లేదా నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి.
  • పొలంలో ప్రతి రెండు మీటర్లకి 20 సెం.మీ. కాలి బాటలు తూర్పు, పడమర (వానాకాలం) మరియు ఉత్తర-దక్షిణ (యాసంగి) దిశల్లో తీయాలి.
  • మురుగు నీరు బయటకి తీసి అంతరకృషి చేయడం ద్వారా తెగుళ్ళు, పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చును.
  • లింగాకర్షక బుట్టలు (3/ఎకరానికి) అమర్చి మొగి పురుగు ఉధృతిని గమనించాలి.
  • వారానికి బుట్టకి 25-30 మగ రెక్కల పురుగులు గమనించిన వారంలోపు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
  • ఎర పంటగా పూసా బాస్మతి-1 రకాన్ని ఉపయోగించి ప్రధాన పంటపైన కాండం తొలుచు పురుగు ఉధృతిని, ప్రధాన వరి రకాలలో తగ్గించుకోవచ్చు. ప్రతి రెండు మీటర్ల ప్రధాన వరికి రెండు వరసల పూసా బాస్మతి రకాన్ని వేసుకోవాలి.
  • ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్న జీవులను నాటిన 25 రోజుల నుండి ఎకరాకు 4 కార్డుల చొప్పున 5 దఫాలుగా పొలంలో 10 రోజుల వ్యవధిలో వదలాలి.
  • ముఖ్యంగా సత్రజని ఎరువును మోతాదు మించి వేయకూడదు.
  • దోమ ఉధృతి పెరగకుండా పొలాల్ని అడపాదడపా అరగట్టాలి.
  • మిత్రపురుగులను సంరక్షించుకోవాలి.
  • తప్పని పరిస్థితుల్లోనే పురుగు/తెగుళ్ళ మందులను సిఫారసు చేసిన మేరకు పిచికారి చేయాలి.

వరిలో నాణ్యతా ప్రవాణాలు( Fair Average Quality )

వరికోత మరియు నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమ శాతం 23-26 మరకు ఉంటుంది. కావున నూర్పిడి అయిన వెంటనే ధాన్యాన్ని టార్పాలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెట్టినచో గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది.

నాణ్యతా ప్రమాణాల ప్రకారం పొడువు వెడల్పు నిష్పత్తి 2.5 మరియు ఆపైన ఉన్నచో “ఎ గ్రేడ్” (సన్న రకం) మరియు 2.5 కన్నా తక్కువ ఉన్నచో సాధారణ(దొడ్డు రకం) రకంగా గుర్తింరబడును.

యాసంగిలో సన్న వడ్లను పారాబాయిల్ చేయరు కనుక నూక కాకుండా జాగ్రత్త పడాలి. పొలాన్ని 7 రోజుల ముందు క్రమంగా ఆరబెట్టి కోసిన తరువాత ధాన్యాన్ని నీడలో మెల్లిగా ఆరబెట్టాలి.

కోత సమయంలో అధిక గాలులతో కూడిన వర్షాలు/వడగళ్ళ వాన వల్ల వరి పైరు పడిపోయి గింజ మొలకెత్తే లేదా రంగు మారే అవకాశముంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో వీలైన చోట్ల పైరును నిలగట్టాలి. వరి వనలపైన 50 గ్రా. ఉప్పు ద్రావణాన్ని ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

సేంద్రియ వరిపాగు

ఈ మధ్య కాలంలో వరిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయటానికి రైతాంగం ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ళ మందుల వినియోగం తగ్గించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నేలలను అందించడం ముఖ్య ఉద్దేశం.

సేంద్రియ వరి సాగులో కూడా వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాల్లలో చేసిన పరిశోధనల ఆధారంగా, అధిక ధిగుబడులు సాధించడానికి ఈ క్రింది పద్దతులను అవలంబించండి.

సేంద్రియ వరి సాగుకు లోతైన నల్ల రేగడి, మధ్యస్థ నల్ల, ఎర్ర చల్కా, ఇసుక బంక మట్టి లేదా బంక మట్టి నేలలు అనుకూలం. ఉదజని సూచిక తటస్థంగా ఉండాలి. సమస్యాత్మక (చౌడు/ క్షార/ ఆమ్ల) భూములు పనికిరావు. దీర్ధకాలిక రకాల కన్నా, మధ్య, స్వల్పకాలిక వరి రకాలనే సేంద్రియ సాగుకు ఎంచుకోవాలి. సాధారణంగా రైతులు పండించే రకాలతో పాటు సువాసన గల వరి రకాలైన సుగంధ సాంబ లేదా శోభిని వంటివి వేసుకుంటే ఆదాయం పొందవచ్చు.

నారుమడిని సాధారణ పద్దతి లాగానే తయారు చేయాలి. కాకపోతే నేల ఆరోగ్యం పెంచడానికి సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు/వర్మికాంపోస్ట్ 2 గుంటలు (5 సెంట్లకు) నారుమడికి 200 కిలోలు వేసుకోవాలి. విత్తనశుద్దికి అజోస్పైరిల్లమ్ లేదా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లేదా పిఎస్ బి లేదా పిఎస్ ఎమ్ 10 గ్రా. కిలో విత్తనానికి కలిపి 136-24 గంటలు నానబెట్టి 24-36 గంటలు మండెకట్టి ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో చల్లాలి. సేంద్రియ పద్ధతిలో నాటడానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. నీటి యాజమాన్యం సాధారణ నారుమడిలో లాగానే చేపట్టాలి.

వరిలో నాణ్యాతా ప్రమాణాలు ( Fair Average Quality )

క్రమ సంఖ్య వివరాలు గరిష్ఠ పరిమితి (%)
1. ఇతర వ్యర్ధ పదార్ధాలు ఎ) సేంద్రీయేతర (మట్టి పెడ్డలు, రాళ్ళు మొ.) బి) సేంద్రియ (గడ్డి, చెత్త మొ.) 1
2. దెబ్బతిన్న, రంగు మారిన, మొలకెత్తిన మరియు పుచ్చిపోయిన గింజలు 5
3. పర్వానికి రాని, ముడత కుచించుకుపోయిన 3
4. తక్కువ జాతిరకం బెరుకుల గింజలు 6
5. తేమ శాతం 17

దీనిలో దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చిపోయిన గింజలు 4% మించకుండా ఉండాలి.

నారుమడిలో ఆశించే తొలిదశ పురుగుల నివారణకు 1500 పిపిఎమ్ వేప సంభందిత మందును 5 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

నారు ఎదుగుదలను బట్టి వర్మికాంపోస్టు లేదా పశువుల ఎపువును మరోసారి అందించాలి. నారు పీకే వారం రోజుల ముందు నీళ్ళు బాగా పెట్టి నారుమడిని తడపాలి.

సాధారణ సాగు పద్ధతిలో లాగానే ప్రధాన పొలాల్ని తయారు చేయాలి. నీటి పారుదల వసతి ఉంటే తప్పని సరిగా పచ్చిరొట్ట పైర్లను (జనుము/ జీలుగ/ పిల్లిపెసర) వేసి కలియదున్నాలి. అందుబాటులో ఉంటే ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 2 టన్నుల ఎండు గడ్డిని కూడా కలిపి దున్నుకోవచ్చు. వానపాముల ఎరువు సొంతంగా తయారు చేసుకునే రైతులు ఎకరాకు 0.8 టన్నుల చొప్పున వేసుకోవచ్చు. వీటన్నిటివల్ల ఎకరాకు సుమారు 60 కిలోల నత్రజని, 16-20 కిలోల భాస్వరం, 10-48 కిలోల పొటాష్ తో పాటు కొన్ని సీక్ష్మపోషకాలు మొక్కలకు అందించవచ్చు. నాటడానికి ముందు అజోస్పైరిల్లమ్ లేదా పిఎస్బి లేదా పిఎస్ఎమ్ ఎకరాకు 1.2 కిలోలు, 10 కిలోల పశువుల ఎరువు లేదా వర్మికాంపోస్టుతో కలిపి వేయాలి. అందుబాటును బట్టి జీవన ఎరువులైన నీలి ఆకుపచ్చ నారు(4 కిలోలు) లేదా అజొల్లా (400 కిలోలు) నాటిన 10 రోజులకు వేయాలి. దీని ద్వారా 12-16 కిలోల నత్రజని అందించవచ్చు. పంటకు కావల్సిన నత్రజనిలో 20 శాతం మించకుండా గనుల నుండి లభ్యమయ్యే నైట్రేట్ల రూపంలో సోడియం నైట్రేట్ లేదా బుల్ డాగ్ సోడా లేదా చిలియన్ నైట్రేట్స్ వాడకోవచ్చు.

సేంద్రియ పరి సాగులో అందించే పోషకాలు సద్వినియోగం చేసుకోవడానికి, కలుపు, నివారించుకోవడానికి వీలుగా సాధారణ రైతు పద్ధతిలో చిక్కు నాటు వేయకుండా 25-30 సెం.మీ. వెడల్పు వరుసలలో నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉన్నా సరిపోతుంది. నాటేటప్పుడు నారుకొనలను తృంచి నాటుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. వెడల్పు కాలి బాటలు తీయాలి. కలుపు నివారణకు నాటిన 15, 30 మరియు 45 రోజులకు కోనోవీడర్/పవర్ వీడర్ ను వాడుకోవాలి. ప్రధాన పొలంలో తొలిదశ పురుగుల నివారణకు 1500 పిపిఎమ్ వేప సంబంధిత మందును 5 మి.లీ./లీటరు నీటికి కలిపి నాటివ 20 మరియు 40 రోజులకు పిచికారి చేయాలి. మొక్కలకు మధ్య మధ్యలో పోషకాలను అందించడానికి ఎకరాకు 200 కిలోల వేపచక్క/కానుకచెక్క/వర్మికాంపోస్టు రెండు సార్లు నాటిన 25 మరియు 50 రోజులకు వాడుకోవచ్చు. దీనివల్ల కాండంతోలిచే పురుగు మరియు ఆకుముడత పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.

తెగుళ్ళ ఉధృతిని తగ్గించడానికి నూడోమోనాస్ 10 గ్రా. కిలో విత్తనానికి చొప్పున వేపచెక్క లేదా కానుగ చెక్కతో పట్టంచాలి లేదా 10 గ్రా. లీటకు నీటికి చెప్పున కలిపి దుబ్బు కట్టే దశ నుండి 2-3 సార్లు పిచికారి చేయాలి. కాండం తెలిచే పురుగు నియంత్రణకు ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎకరాకు 4 ట్రైకోగ్రామా కార్డుల చొప్పున నాటిన 25 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 5 సార్లు వదలాలి. నీటి యాజమాన్యం సాధారణ నాటు పద్ధతిలో లాగానే చేయాలి. కాకపోతే పొలాన్ని అడపాదడపా అరగట్టినట్లయితే నుడిదోమ ఉధృతిని తగ్గించవచ్చు. కీలక దశలైన అంకురం, పూత పాలుపోసుకొనే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

వర్షాకాలంలో సేంద్రియ వరిపాగు చేపట్టి, తర్వాత పంటకాలంలో మినుము/పెసర లేదా వేరుశనగ లేదా కూరగాయలు-పచ్చిరొట్ట పైర్లు వంటి పంటల సరళిని ఎంచుకుంటే లాభదాయకం.

రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి

వరి స్వపరాగ సంపర్క మొక్క ప్రస్తుతం పైతుల పొలాల్లో సాగులో ఉన్న నీటి రకాల నాణ్యామైన విత్తనాన్ని రైతు స్థాయిలోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని తమ అవసరాలకు ఉపయోగించవచ్చు. విత్తిన పంటకు మామూలు వాణిజ్య పంటవలే మంచి యాజమాన్యం పాటించాలి.

సాధారణంగా ఒకే విత్తనాన్ని కొంతకాలం సాగుచేసిన తరువాత వరి వంగడం దిగుబడి తగ్గుతుందనే అపోహ రైతుల్లో ఉంది. ఇది యాంత్రిక కల్తీవల్ల, ఆశించే తెగుళ్ళ ప్రభావం వల్ల జరుగుతుంది. కాబట్టి విత్తనాన్ని కల్తీలను నివారించి, స్వచ్ఛతను కాపాడి, ఆరోగ్యమైన, నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. కొన్ని మెళకువలు పాటిస్తే అదే విత్తనాన్ని 3-4 సార్లు వాడుకోవచ్చు.

పాటించాల్సిన మెళకువలు:

వాతావరణ పరిస్థుతులను, కాలపరిమితిని బట్టి అనువైన రకాలను సాగుచేయాలి. ఆవిధంగా చేస్తే రకాల్లో లక్షణాలు ప్రస్పుటంగా వ్యక్తీకరింపబడతాయి.

విత్తనోత్పత్తి సారవంతమైన, మంచి నీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి. విత్తనోత్పత్తి, అంతకు ముందు పంటకాలంలో అదే రకం వేసిన పొలంలో లేదా వేరే పంట సాగు చేసిన పొలంలో చేపట్టడం వల్ల స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా జాగ్రత్త పడవచ్చును.

విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ వేరే వరి రకం ఉంటే కనీసం 3 మీటర్ల అంతర దూరం పాటించాలి. నాట్లు చేసేటప్పుడు 25-30 రోజుల వయస్సు గల నారును, రకాల కాలపరిమితిని బట్టి నాటాలి.

కీలక దశలైన అంకురం, పూత దశ, గింజ పాలుపోసుకుని, గింజ గట్టిపడే దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఈ దశల్లో పైరు నీటి ఎద్దడికి గురైతే విత్తన నాణ్యత లోపింస్తుంది.

విత్తనోత్పత్తిలో ప్రధాన అంశం పంటలో దెరుకులు తీయుట. ఈ బెకురుల ఎరివేత ముఖ్యంగా 3 దశల్లో అనగా పైరు దుబ్బు చేసే సమయం, పూతదశ మరియు గింజ గట్టిపడినప్పుడు (వరి కోతకు ముందు) చేయాలి. మనం సాగు చేసిన రకం లక్షణాలను బట్టి అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, వెడల్పు, పొడువు మరియు ఇతర లక్షణాలను దుబ్బుచేసే సమయంలో గమనించాలి. అలాగే పూత దశలో ముందుగా పూదకు వచ్చినవి లేదా ఆలస్యంగా పూతకు వచ్చేవి, పొటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసివేయాలి. అలాగే గింజకట్టే దశలో వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా తీసివేయాలి.

విత్తనం నిల్వలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వరి కోత కోసినప్పుడు, నూర్పిడి సమయాల్లో యాంత్రిక కల్తీ అనగా యంత్రాల ద్వారా గాని, మనుషుల ద్వారా గాని, పని ముట్ల ద్వారా గాని, ఇతర రకాల గింజలు కలపకుండా జాగ్రత్త వహించాలి.

విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 12 శాతానికి చేరుకునేవరకు బాగా ఎండబెట్టాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనెసంచులను లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం, ఆధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి. విత్తనాన్ని గాదెల్లో గాని, పాతరల్లోగాని లేదా ఎరువుల సంచుల్లోగాని నిల్వ ఉంచరాదు. విత్తనాన్ని నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని, పురుగ మందులను గాని ఉంచకూడదు. వాణిజ్య ఉత్పత్తిలో ధృవీకరణ విత్తన నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. జన్యు స్వచ్ఛత మరియు భౌతిక స్వచ్ఛత 98%, జడ పదార్ధం 2% మించకుండా, కనీస మొలక 80% , తేమ 12 % మించకుండా, ఇతర పంటలు లేదా రకాల విత్తనాలు కిలో గింజల్లో 20 గింజలు మించకుండా విత్తనాన్ని తయారు చేయాలి.

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి సాధారణ వరి రకాల విత్తనోత్పత్తికి చాలా అంశాలలో విభిన్నత ఉంటుంది. తెలంగాణా రాష్ట్రంలో రబీ పంట కాలంలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం వలన హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి ఎక్కువ విస్థీర్ణంలో చేయబడుతోంది.

విత్తు సమయం: నవంబర్ 15 నుండి డిసెంబర్ చివరి వరకు ఆడ మరియు మగ జనకములను విత్తుటకు అనుకూలం.

విత్తన మోతాదు: ఎకరానికి 6 కిలోల ఆడ రకం విత్తనాలు, 3 కిలోల మగ రకం విత్తనాలు సరిపోతాయి.

వేర్పాటు దూరం: విత్తనాలు జన్యూస్వచ్ఛత కాపాడటానికి ఇతర వరి వంగడాల నుండి సుమారు 100 మీ. వేర్పాటు దూరంలో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి పొలం ఉండే విధంగా నాటుకోవాలి. వేర్పాటు దూరం వీలుకాని పక్షంలో విత్తనోత్పత్తి పొలం చుట్టు సుమారు 2 మి. ఎత్తు వరకు పాలిథీన్ షీట్స్ అమర్చుకోవాలి.

నారుమడి పెంపకం: ఆడ మరియు మగ విత్తనాలు కలపకుండా చాలా జాగ్రత్తగా వేరువేరుగా నారు పెంచుకోవాలి.

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి దిగుబడి సాగుచేసిన ఆడ మరియు మగ రకాల పూత సమస్వయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కావున ఆడ మరియు మగ రకాల పంట కాలంలోని వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలస్యంగా వచ్చు రకం విత్తనాలు ముందుగా నారురోసుకోవాలి. మగ రకం యొక్క విత్తనాలను 3 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా విడివిడిగా విత్తుకోవాలి. ఇలా విత్తుకోవడం వలన పూత సమయంలో ఎక్కువ రోజులు పుప్పొడి అందుబాటులో ఉండి హైబ్రిడ్ గింజ దిగుబడి పెరుగుతుంది. రెండవ దఫా మగ రకం, ఆడ రకం పూత సమయం కలిసేటట్లు ఆయా రకాల పంట కాలాలను బట్టి చాలా జాగ్రత్తగా విత్తుకోవాలి.

మొలక కట్టిన విత్తనాలను ఎత్తుగా చదను చేసిన నారుమడిపై పలచగా వెదజల్లుకోవాలి. నారుమడిలో సిఫారసు మేరకు ఎరువులు వేసి ఆరోగ్యంగా పెంచుకోవాలి.

నాట్లు వేయుట: ఆడ మరియు మగ మొక్కలు వేరువేరుగా వరసలలో నాటుకోవాలి. ఆడ మరియు మగ వరుసల నిష్పత్తి మొక్కల యెక్క లక్షణాలను బట్టి 6:2 లేదా 8:2 లేదా 10:2 గా ఉంటుంది. సాధారణంగా 6 వరుసల ఆడ, 2 వరసల మగ రకాల నిష్పత్తితో నాటుకోవాలి.

రబీలో 25-35 రోజుల వయస్సు నారు నాటుటకు అనుకూలం. ఆడ మరియు మగ (రెండవ దఫా విత్తిన) నారు ఒకే వయస్సులో ఉండే విధంగా నాటుకుంటే పూత సమస్వయం లోపంలో దిగుబడి తగ్గుతుంది. అందువలన ఆడ మరియు మగ రకాల మధ్య విత్తిన సమయాలను దృష్టిలో ఉంచుకొని దానికనుగుణంగా వేరువేరుగా ఒకే లోతులో (2-3 సెం.మీ.) నాట్లు వేసుకోవాలి.

మగ వరుసల మధ్యలో 6 ఆడ వరుసలు నాటడానికి వీలుగా 125 సెం.మీ. వదలి వేయాలి. రెండు మగ వరుసలను 30 సెం.మీ. ఎడంతో మొక్కకు మొక్కకు మధ్య 15 సెం.మీ. ఉండేటట్లు కుదురుకు 2-3 మొక్కలు నాటుకోవాలి. ప్రతియొక్క వరుసలో మూడు దఫాలుగా విత్తిన నారును వేయాలి.

మొదట విత్తిన దానిని మొదట పూసకు, రెండవ సారి విత్తిన నారును మూడవ పూతకు వరుసగా నాటాలి. విత్తనోత్పత్తి పొలం చుట్టు మగ వరుసలు వచ్చేలాగా నాటుకోవాలి.

ఆరు ఆడ వరుసలు 15 సెం.మీ.X15 సెం.మీ. దూరంలో జంట మగ వరుసల మధ్య నాటుకోవాలి. ఆడ వరుసకి, మగ వరుసలను మధ్య 25 సెం.మీ. దూరం ఉండే విధంగా నాటాలి.

కేళీల ఏరివేత: జన్యూ స్వచ్ఛత గమ హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయాలంటే కేళీల ఏరివేత పకడ్బందీగా అమలు చేయాలి. కేళీలను వివిధ దశలలో అంటే శాఖీయ దశ (మొక్క ఆకుల యొక్క బాహ్య లక్షణాలు), పూత దశలో (పంట కాలంలో తేడా, వెన్ను బయటకు వచ్చే విధానం, వెన్ను లక్షణాలు, పుప్పోడి మరియు కీలాగ్రము రంగు), పక్వదశలో (ఆడ మొక్కలలో గింజ శాతం, గింజ రంగు, గింజ ఆకారం ఆధారంగా) జాగ్రత్తగా గుర్తించి తీసి వేయాలి.

పూత సమయాన్ని గుర్తించుట: ఆడ, మగ రకాల పంట కాలంలో వ్యత్యాసాన్ని బట్టి విత్తనాలను వేరు వేరు సమయాల్లో నాటినప్పటికి, వాతావరణంలోని మార్పులు, చలి ప్రభావం, యాజమాన్య పద్దతుల వలన పూత సమన్వయం కొన్నిసార్లు కోల్పోతుంది. వెన్ను ఏర్పడే దశను బట్టి పూత కాలాన్ని నిర్ధారించవచ్చు. కంకులు ఏర్పడే తొలి దశ నుండి 30 రోజుల తరువాత పూత వస్తుంది. ఆడ, మగ రకాల పంట కాలాన్ని బట్టి 60 రోజుల ముందు నుండి వెన్ను ఏర్పడే దశలలో వ్యత్యాసాన్ని గుర్తించి కొన్ని సహాయక చర్యలు చేపట్టినట్లయితే పూత సమయాన్ని కొంత వరకు సవరించి ఒకేసారి పుష్పించే విధంగా చేయవచ్చు. వెన్ను ఏర్పడే దశను గుర్తించుటకు బాగా పొడవుగా పెరిగిన ప్రాధమిక పిలకను గుర్తించి ఎక్కడయితే కాండం, వేరుతో కలుస్తుందో అక్కడికి కత్తిరించాలి. కాండాన్ని నిట్టనిలువుగా అడుగు భాగం నుండి పిలక పైభాగం వరకు కత్తిరించాలి. కణువు పైభాగాన్ని విప్పి పరిశీలించినట్లయితే కంకి వృద్ధి చెందుటను గమనించవచ్చును.

ఈ కంకి ఏర్పడు దశలను గమనించి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన వెంటనే సవరణ చర్యలు చేపట్టాలి. ఆడ మొక్కలను ఆలస్యంగా పుష్పించేటట్లు చేయుటకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలి. అదే విధంగా త్వరగా పుష్పించేందుకు 1 శాతం ఫాస్ఫేట్ ఎరువును పిచికారి చేయుట, వరసలలో తొక్కుడు చేయడం వంటివి పాటించాలి. మగ వరుసలు పూత త్వరగా వచ్చుటకు పొలంలో నీరు నిండుగా ఉంచుకోవాలి. పూత సమయంలో వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంటే ముందుగా వచ్చిన కంకులను పీకి వేయాలి.

పోటాకును కత్తరించుట: పోటాకు ప్రాథమిక దుబ్బులు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు కత్తిరించాలి. పోటాకును కత్తరించడం వల్ల పరగారేణువులు స్వేచ్ఛగా కదిలి అధిక శాతంలో పుప్పొడి వ్యాప్తి చెంది అధిక విత్తనోత్పత్తికి దోహద పడుతుంది. మొక్కపై ఆకులు పట్టుకొని కొడవలితో ప్రాథమిక 2/3 వ భాగం కత్తిరించాలి. బాక్టీరియా ఎండు తెగులు లేదా పాముపొద తెగులు ఆశించిన పొలాల్లో ఆరోగ్యంగా ఉన్న పొలంలో పొటాకును కత్తిరించిన తరువాతనే వ్యాధి సోకిన పోటాకును కత్తిరించాలి, పోటాకు సన్నగా చిన్నగా ఉన్న ఆడ రకాలలో పొటాకు కత్తిరించనవసరం లేదు.

జీబ్బరెల్లిక్ ఆమ్లము ( జిఎ) పిచికారి: ఆడ మొక్కల వెన్నులు పొటాకు నుండి పూర్తిగా బయటకు రావడానికి, కీలాగ్రాము పవ్వు నుండి ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు మరియు పువ్వు చాలా సమయం నిప్పారి ఉండుటకు జీబ్బరెల్లిక్ ఆమ్లము పిచికారి చేస్తారు.

హైబ్రిడ్ విత్తనోత్పత్తి క్షేత్రంలో జీబ్బరెల్లిక్ ఆమ్లమును రెండు సార్లు పుచుకారి చెయాలి. 5-10 శాతం వెన్నులు బయటకి వచ్చిన దశలో మొదటిసారి ఎకరానికి 12 గ్రా. పిచికారి చేయాలి. ఆ తరువాత రెండు రోజులకు లేదా 35-40% శాతం కంకులు వెలువడిన దశలో ఎకరానికి 8 గ్రా. రెండవ దఫా పిచికారి చెయాలి.

ఈ జీబ్బరెల్లిక్ ఆమ్లము నీటిలో కరగదు, కాబట్టి 1 గ్రా. కి 25 మి.లీ. 70% ఆల్కహాల్ లో కలిపి కరిగిన తరువాత మందు ద్రావణం తయారుచేయాలి. దీనిని 15 లీటర్ల నీటికి చొప్పున కలిపి వాడుకోవాలి.

పరపరాగ సంవర్కం పెంపొందించే చర్యలు: వరి స్వపరాగ సంవర్క మొక్క. దీనిలో పరపరాగ సంవర్కం పెంపొందించడానికి లేదా కర్రలతో మగ మొక్కలను ఊపుట వల్ల అధిక పుప్పొడి ఆడ మొక్కలపై పడి పరపరాగ సంవర్కం జరుగుతుంది. మొదటగా అనుబంధ సంవర్క చర్యను 30-40 శాతం వెన్నులు బయటకు వచ్చినప్పుడు ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యలో 30 నిమిషాల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు సుమారు 7-10 రోజుల పాటు చేయాలి, పుప్పొడి రేణువులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా, మబ్బు, చలి వాతావరణం ఉన్నప్పుడు ఆలస్యంగా రావడం జరుగుతుంది.

కలుపు మరియు పోషక యాజమాన్యము, సస్యరక్షణ చర్యలు సాధారణ వరి పంటకు మాదిరిగానే చేపట్టాలి. తెగుళ్ళు సోకిన పంట నుండి గింజలను విత్తనాలుగా సేకరించినట్లయితే తరువాత పంటకు ఆ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విత్తనోత్పత్తి పంట తెగుళ్ళ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, ఎండాకు తెగులు, పాముపొద, కాండం కుళ్ళు తెగులు ఆశించిన పంట నుండి విత్తనాలను సేకరించరాదు.

పంటకోత: వెన్నులో 90 శాతం గింజలు పక్వానికి వచ్చినప్పుడు పంట కోతలు చేపట్టాలి. ఆడవరుసల నుండి వచ్చిన విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలుగా సేకరించాలి. మొదట మగ వరుసలను కోసి వేరు చేయాలి. ఆ తరువాత ఆడ వరుసలను జాగ్రత్తగా పరీశీలంచి మగ మొక్కలు లేవని నిర్ధారించుకోవాలి. ఆడ వరుసలు చేత్తో కోసుకొని నూర్పిడి చేసి గింజలను శుభ్రపరిచి తేమ శాతం 12-13 వచ్చే వరకు అరబెట్టుకోవాలి.

ప్రస్తుతం తొలకరిలో వేసిన వరి పైరు చాలా చోట్ల పూత దశకు చేరుకున్నది. జూలై మరియు ఆగష్టు లో నాటిన పైర్లు కొన్ని పిలకదశకు మరికొన్ని అంకురం వేయు దశలో ఉన్నవి. కావున స్వల్ప మధ్య కాలక రకాలలో చివరి దఫాగా యూరియా 30-35 కిలోలు మరియు 15 కిలోలు పోటాష్ ను పై పాటుగా వేయాలి.

అక్టోబర్ నెలలో ముఖ్యంగా సన్నగింజ రకాలలో సుడిదోమ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి, అగ్గి తెగులు, బాక్టీరియా ఎండాకు తెగులు, ఉధృతి పెరగడానికి క్రింది సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

సుడిదోమ

  • పిలకదశలో దుబ్బుకి 10-15 దోమలు గమనిస్తే ఎసిఫేట్ 75 ఎస్.పి 1.5 గ్రా.లు (300 గ్రా/ఎకరాకు) లేదా బ్యుప్రోఫేజిన్ 1.6 మి.లీ (320 మి.లీ/ఎకరాకు) లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • అంకురం దశ నుండి దుబ్బుకి 20-25 దోమలు గమనిస్తే డైనోటేప్యురాన్ 0.4 గ్రా.లు (80 గ్రా/ఎకరాకు) లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రా.లు (120 గ్రా/ఎకరాకు) లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఎదిప్రోల్ 0.25 గ్రా.లు (50 గ్రా/ఎకరాకు) మదులను మార్చి మార్చి, పొలంలో నీరు తగ్గించి మొక్కల మొదళ్ళ పై పడే విధంగా పిచికారీ చేయాలి.

కాండం తొలిచే పురుగు

  • 30-35 రోజుల వరి పైరులో – కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిల్ ప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు వేయాలి లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. (300 గ్రా/ఎకరానికి) లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • అంకురం నుండి చిరుపోట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్ పి ఎకరాకు 400 గ్రా.లు (2 గ్రా/లీ నీటికి) లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్ సి 60 మి.లీ (0.3 మి.లీ/లీటరు నీటికి కలిపి) పిచికారి చేయాలి.

ఆకునల్లి / కంకినల్లి

డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరాలు ఉధృతంగా కురిస్తే ఉదృతి దానంతట అదే తగ్గుతుంది. గింజ మచ్చ తెగులు ఆశించే ప్రాంతాలలో పై మందులతో బాటు ప్రాపికొనజోల్ 1.0 మి.లీ/లీ కలిపి పిచికారి చేయాలి.

అగ్గితెగులు : టైసక్లోజోల్ 0.6 గ్రా/లీ లేదా ఇసోప్రాథయోలేన్ 1.5 మి.లీ/లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ/లీ వ్యాధి తీవ్రతను బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందును మార్చి రెండుసార్లు పిచికారి చేయాలి.

బాక్టీరియా ఎండాకు తెగులు

తెగులు ఆశించిన పొలంలో నత్రజని ఎరువులు వేయటం తాత్కాలికంగా అపుదల చేయాలి. తెగులు వ్యాప్తిని అరికట్టుటకు అగ్రిమైసన్ 4.0 గ్రా/10 లీ లేదా పోషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ 2.0 గ్రా/10 లీ నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి. విధిగా మ్యూరెట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు/ఎకరానికి చివరి దఫా యూరియూ తో మాములు వాతావరణ వరిస్థితులు నెలకొనగానే వేయాలి.

  • షాధారణంగాతెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు నవంబరూ మాసం నుండి డిసెంబరు 15 వరకు కొనసాగుతాయి.
  • చాలా వరకు వరికోత మరియు పంట నూర్పిడి వరి కోత యంత్రాలతో చేయడం జరుగుతుంది.
  • వరిని సకాలంలో కోసి, సరైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తే, మార్కెట్లో మంచి ధర వస్తుంది.
  • కోతలకు వారం, పది రోజుల ముందే పొలానికి నీరు పెట్టడం ఆపి, ఉన్నటువంటి నీటిని తీసేసి పంటను ఆరబెట్టాలి.
  • కోత మరియు నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమ శాతం 23-26 వరకు ఉంటుంది. కావున నూర్పిడి అయిన వెంటనే ధాన్యాన్ని టార్పాలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెట్టినచో గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతను కల్లి ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా ధాన్యాన్ని పొడవు, వెడల్పు నిష్చత్తిని బట్టి రెండు రకాలుగా విభజించబడింది. అవి ఏ గ్రేడ్ రకం మరియు సాధారణ రకం.

దీని ప్రకారం పొడవు, వెడల్పు నిష్పతి 2.5 మరియు ఆపైన ఉన్నచో "ఏ గ్రేడ్ రకం (సన్న) మరియు 2.5 కన్నా తక్కువ ఉన్నచో సాధారణ (దొడు) రకంగా గుర్తించబడును.

దీనితో పాటు (ఏ గ్రేడ్ కాని, సాధారణ రకం కాని) మిగతా నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటంటే వరి ధాన్యం ఆరిన తర్వాత మట్టి బెడ్డలు, చెత్త, చెదారం లేకుండా చూడాలి. మార్కెట్లో (వ్యవసాయ మార్కెట్ కమిటి, ఐకెపి కేంద్రాలు గాని, మండీలు గాని ఇతర ప్రభుత్వంచే నిర్ణయించబడిన కేంద్రాలు) కనీస మద్దతు ధర రావాలంటే ఈ క్రింది నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలి. దీన్నే ఎఫ్.ఏ.క్యూ (ఫెయిర్-ఆవరేజ్ క్వాలిటి) అని కూడా అంటారు.

క్రమ సంఖ్య

వివరాలు

గరిష్ట పరిమితి (%)

1.

ఇతర వ్యర్ధ పదార్ధాలు ఏ. సేంద్రియేతర (మట్టి బెడ్డలు, రాళ్ళు మొ.)

1

బి. సేంద్రియ (గడ్డి, చెత్త మొ.)

1

2.

దెబ్బతిన్న, రంగు మారిన, మొలకెత్తిన మరియు పుచ్చిపొయిన గింజలు .

5

3.

పక్వానికి రాని, ముడత, కుచింకుపోయిన

3

4.

తక్కువ జాతి రకం, బెరకుల గింజలు

6

5.

తేమ శాతం

17

దీనిలో దెబ్బతిన్న మొలకెత్తిన, పుచ్చుబట్టిన గింజలు 4% మించకుండా ఉండాలి.

పై ప్రమాణాలన్నీ కూడా బి.ఐ.ఎస్ ఆహార ధాన్యాల విశ్లేషణ పద్ధతి ద్వారా నిర్దేశించబడును. పైన పట్టికలోని 1% సేంద్రియ పదార్ధాల పరిధిలో విషతుల్య విత్తనాలు 0.5% మించకుండా ఉండాలి. దీనిలో ఉమ్మెత్త 0.25% మరియు విసియా జాతి విత్తనాలు 0.2% మించకుండా ఉండాలి. పై నాణ్యతా ప్రమాణాలను పాటించి, పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చేలాగా రైతు సోదరులు చూసుకోవాలి.

రబీ పంటగా వరిని నవంబర్ రెండవ పక్షం నుండి డిసెంబర్ మొదటి పక్షంలో గా విత్తుకోవాలి. తక్కువ కాల పరిమితి (125 రోజులు) గల రకాలైన తెలంగాణ సోన కూనారం సన్నాలు, బతుకమ్మ, కాటన్ దొరసన్నాలు, శీతల్ మరియు తెల్లహంస వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు కూడా చలి తీవ్రతను బట్టి వీటి కాల పరిమితి 10-15 రోజులు పొడిగించబడుతుంది. ఎత్తైన నారుమళ్ళను ఏర్పర్చుకొని ఎకరాకు 25 కిలోల విత్తనాన్ని 2-3 గంటలలో పలుచగా వితుకోవాలి. విత్తే మందు కర్బండాజిమ్ తో (1గ్రా./లీటరు నీటికి) తప్పని సరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. నారుమడిలో 200 కిలోలు పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నాలి. చలి ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో నారుమడిలో తప్పని సరిగా 500 గ్రా. జింక్ సల్ఫేట్ వేసి నారుమడిని చదును చేయాలి. సుమారుగా 6.5 కిలోల సూపర్ ఫాస్ఫెట్, 2.5 కిలోల యూరియా 800 గ్రా. పోటాష్ ను విత్తే ముందు నారుమడిలో వేయాలి. చలి వలన నారు ఎదుగుదల లోపించటం సర్వ సాధారణం కావున చలి నుండి కాపాడటానికి నారు మడులను సన్నటి పాలిధిన్ పట్టాను కర్రలోత లేదా ఊచలతో అమర్చాలి. రాత్రి వేళలో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేసినట్లైతే నారు వేడి వలన త్వరగా పెరిగి 3-4 వారాలలో 3-4 ఆకులు తోడుగుతుంది. రాత్రి వేళలో ఉదాయాన్నే ఆ నీటిని తీసివేసి మరల నీటిని పెట్టినట్లైతే నారు ఎదుగుదల బాగా ఉంటుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కన్పించిన వెంటనే జింక్ సల్ఫేట్ 1.0 – 2.0 గ్రా./లీ నీటికి కలిపి అవసరం మేరకు 1-2 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యురియతో (2.5 కిలోలు) బాటు కర్బండాజిమ్ 25% + మ్యాంకోజేబ్ 50% కల్గిన మిశ్రమ శిలింధ్ర నాశకాన్ని 6.25 గ్రా. పట్టించి వేయాలి. అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్ 0.6 గ్రా./లీ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేయాలి. రబీ పంట కాలంలో కాండం తొలుచు పురుగు ఉధ్రుతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15 రోజులకు 2 గంటలు నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు వేసుకోవాలి. చలికి నారు ఎదగక ఆలస్యమైతే నాటువేసే నారం రోజుల ముందు మరోకసారి నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి.

రబికి అనువైన వరి రకాలు

తెలంగాణ రాష్టంలో రబీలో వరి పంటను సాధారంగా 15 లక్షల ఏకరాలలో సాగుచేస్తుంటారు. గత రబీలో నీటి వనరులు అధికంగా అందుబాటులో ఉన్నందున వరి విస్తీర్ణం సాధారణం కన్న ఎక్కువగా సుమారు 21.5 లక్షల ఎకరాలలో సాగైయింది. ఈ రబీలో కూడా అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిగణించి సాధారణం కంటే అధిక విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. రబీ పంట కాలంలో తెలంగాణలోని ఎక్కువ జిల్లాలలో చలి త్రివ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పంట యొక్క శాఖీయదశ అనగా నారుమడి మరియు పిలకలు వేయు దశలలో చలీ త్రివ్రత అధికంగా ఉండటం వలన వరి నారు ఎర్రబడటం ఎదుగుదల తగ్గిపోవటం, పంట కాలం పెరిగిపోవటం తద్వారా దిగుబడులు తగ్గడం సాధారణంగా గమనిస్తుంటాము.

రైతులు ఈ సమస్యను అధిగమించటానికి రబీ సీజనులో సాగుచేయటానికి అనువయిన వరి రకాలు, వాటి లక్షణాలు గురించి అవగాహన కలిగి ఉండాలి.

తెలంగాణలో రబీ సాగుచేయటానికి అనువయిన రకాలు:

రకము

పంటకాలం

గింజ రకము

దిగుబడి క్వి/ఎ

లక్షణాలు

తెలంగాణ సోన

125

మిక్కిలి సన్న గింజ

26-28

అగ్గితేగులును తట్టుకుంటుంది. నూక శాతం తక్కువ. కాడం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువ.

బతుకమ్మ

120

దొడ్డు గింజ

28-30

సుడిదోమ, అగ్గితెగులును కొంతవరకు తట్టుకంతుంది. గింజరాలే గుణము తక్కువ .

కూనారం సన్నాలు

120

దొడ్డుగింజ

28-30

సుడిదోమ, అగ్గితెగులును కొంతవరకు తట్టుకంతుంది. గింజరాలే గుణము తక్కువ .

యం.టి.యు. 1010

120

దొడ్డు గింజ

28

 

సుడిదోమ కొంతవరకు తట్టుకంతుంది.

తెల్ల హంస

120

దొడ్డు గింజ

25

చలిని తట్టుకుంటుంది.

ఐఆర్ 64

120

దొడ్డు గింజ

26

అగ్గితెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ రాలే గుణము తక్కువ.

జగిత్యాల సన్నాలు

(జె.జి.ఎల్ 1798)

125

సన్న గింజ

28

గింజ సాంబ మాషూరిని పోలి ఉంటుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. చలి ఎక్కువగా ఉంటె నారు ఎర్రబడుతుంది.

జగిత్యాల సాంబ

(జె.జి.ఎల్ 3844)

125

సన్న గింజ

28

ఉల్లికోడు, కంకినల్లిని తట్టుకుంటుంది. నూకశాతం తక్కువ.

అంజన (జె.జి.ఎల్ 11118)

120

సన్న గింజ

28

ఉల్లికోడు, చలిని తట్టుకుంటుంది.

నెల్లూరి మషూరి

125

సన్న గింజ

28

అగ్గితెగులును తట్టుకుంటుంది. పొట్టి రకము, అన్నం నాణ్యత బాగుండదు.

రాజేంద్ర

115

దొడ్డు గింజ

24

చలిని తట్టుకుంటుంది.

వేజేత

(యం.టి.యు 1001)

135

దొడ్డు గింజ

28-30

సుడిదోమను తట్టుకుంటుంది. గింజ రాలే గుణము తక్కువ.

రబీలో సాగుచేయటానికి అనువయిన రకాలను ఎంపిక చేసుకోవటం ఎంత ముఖ్యమో విత్తనాలు విత్తే సమయం తెలుసుకోవటం అంతకన్నా ముఖ్యం.

ఏ రకముయిన పొట్ట దశ  నుండి పూత దశ పురయ్యే వరకు చలి వాతావరణం అనగా అత్యల్ప ఉష్ణోగ్రత 15సె. కన్నా తక్కువ ఉంటె గింజ పట్టక తాలు గింజలు ఏర్పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కావున సాగు చేసిన వరి రకము యొక్క పూత దశ చలి పుర్తయింతరువాత వచ్చే విధంగా చూసుకొని నారు పోసి నాటుకోవాలి. ఎ రకము ఎప్పుడు నారు పోసుకోవాలి. అనేది ఆయా రకాల పంట కాలాన్ని బట్టి నిర్ధారించుకోవాలి.

మధ్య కాలిక రకాలు (135 – 140 రోజులు) నవంబరు మొదటి వారం నుండి, స్వల్ప కాలిక రకాలు (120 – 125 రోజులు) నవంబరు 10వ తేది నుండి నారు పోసుకోవాలి.

రబీ సీజనులో ఎక్కువ విస్తీర్ణం లో సాగుచేసే స్వల్పకాలిక రకాలను అక్టోబరు చివరి వారం గాని లేదా నవంబర్ మొదటి వారంలో నారుపోసి నటుకున్నట్లయితె ఆ పంట చిరుపోట్ట దశ నుండి కంకులు ఈనే దశలో చలి ఉండి, కంకి పూర్తిగా పోటాకు నుండి బయటకు రాకపోవడం. గింజలు పట్టక తాలు పోవటం జరిగి దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కావున నీటి వసతి మరియు నేల అందుబాటును బట్టి స్వల్పకాలిక రకాలను నవంబర్ 10వ తేది నుండి డిసెంబర్ 15 వరకు నార్లు పోసుకోవాలి.

రబీ పంట కాలం చివరలో  తరచుగ వచ్చే వడగండ్ల అకాల వర్షాల వల్ల పంట నష్టం తగ్గించేందుకు ఏప్రిల్ మొదటి  వారం లోపు కోతలు పూర్తియ్యే విధంగా నార్లుపోసి నాటుకోవటం ముఖ్యం మరీ ఆలస్యంగా డిసెంబర్ చివరి నుండి జనవరి చివరి వరకు నార్లు జ్పోసినట్లయితే పంట కోతలు ఏప్రిల్ లేదా మే మాసంలో వచ్చి పంట నష్టం జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. అంతే కాకుండా సన్న రకాలు గింజ గట్టిపడే దశలలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే గింజ పగుళ్ళు ఏర్పడి నూక శాతం అధికం అవుతుంది.  తద్వారా దిగుబడికి సరియైన మద్దతు ధర లభించక నష్టపోవడం జరుగుతుంది.

రబీ నారు మడి త్వరగా పెరగటానికి ప్రతి రెండు గుంటలకు 2 క్వి. కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మికంపోస్టు వేసి కలియదున్నుకోవాలి. 2 గుంటలను 2 కి. నత్రజని, 2 కి. భాస్వరం మరియు 1 కి. పోటాష్ నిచ్చే ఎరువులు తప్పనిసరిగ నారు మడికి అందించాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడిపై టార్పలీన్ లేదా యూరియా సంచులతో కుట్టిన పట్టాను రాత్రి వెళ్ళలో కప్పి ఉంచినట్లయితే చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా ఎదుగుతుంది. నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్ని చల్లటి నీటిని తీసివేసి మరల క్రొత్త నీరు పెడుతూఉండాలి.

ఈ విధంగా రబీలో సాగుచేసుకోవటానికి అనువయిన రకాలను సరియైన సమయంలో నారుపోసుకొని నారు యాజమాన్యం సక్రమంగా చేసుకుంటే రబీలో అధిక వరి పంట దిగుబడులు సాధించవచ్చు.

వరి సాగుపై మరిన్నివివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త (వరి), వ్యవసాయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. ౯౮౪౯౦౫౯౨౯౭

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate