অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రత్తి

ప్రత్తి

  1. నేలలు
  2. పంట కాలాలు మరియు అనుకూలమైన సమయం
  3. రకాలు
  4. సాగుకు అనువైన ముఖ్య రకాలు – వాటి లక్షణాలు
  5. విత్తన మోతాదు (ఎకరాకు)
  6. విత్తే దూరం
  7. మొక్కల సాంద్రత/ఎకరాకు
  8. విత్తు పద్ధతి
  9. అంతర పంటలు / పంటల సరళి
  10. సమగ్ర ఎరువుల యాజమాన్యం
  11. సూక్ష్మపోషకాల లోపాలు – యాజమాన్యం
  12. డ్రిప్ ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల వాడకం
  13. సమగ్ర కలుపు యాజమాన్యం
  14. నీటి యాజమాన్యం
  15. పంట ఎదుగుదలకు కావలసిన వాతావరణ పరిస్థితులు
  16. పంట కొత – ప్రత్తి తీతలో మెళుకవలు
  17. ప్రత్తిని ఎండబెట్టుట మరియు నాణ్యతా ప్రమాణాలు
  18. ప్రత్తి సాగులో పాటించవలసిన ముఖ్య మొళకువలు
  19. సమగ్ర సస్యరక్షణ
    1. పురుగులు మరియు తెగుళ్ళు – లక్షణాలు మరియు సమగ్ర యాజమాన్యం
    2. రసం పీల్చే పురుగుల నవారణకు ప్రత్యేక సూచనలు
    3. కాయతొలుచు పురుగులు
  20. పంటలేని సమయాన చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
  21. ప్రత్తి విత్తడానికి ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
  22. పంట కాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
  23. పంట తీసిన తరువాత చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
  24. టొబాకోస్ట్రీక్ వైరస్
  25. హైబ్రిడ్ ప్రత్తి విత్తనోత్పత్తి

తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ప్రధానమైన పంట. ఈ పంట 2016-17 సంవత్సరంలో సుమారు 12.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడి, 48 లక్షల వేళ్ళ ఉత్పత్తి మరియు హెక్టారుకు 653 కిలోల (దూది) ఉత్పాతకతను ఇచ్చినది. దేశంలో మహారాష్ట్ర, గుజురాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రపంచంలోని ప్రత్తి పండించు దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో, ఉత్పత్తి మరియు ఎగుమతులలో రెండవ ప్థానంలో ఉంది. 2016-17 సంవత్సరంలో దేశంలో ప్రత్తి సుమారు 105 లక్షల హెక్టార్లలో సాగుచేయబడి 351 లక్షల వేళ్ళ ఉత్పత్తిని మరియు హెక్టారుకు 568 కిలోల (దూది) ఇత్పాదకతను ఇచ్చినది (గుణాంకాలు – సి.ఎ.బి. 2016).

నేలలు

లోతైన నల్ల రేగడి నేలలు ప్రత్తి సాగుకు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూముల్లో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు, మరీ తేలిక పాటి చల్కా భూములు ప్రత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక 6 నుంచి 8 గల భూముల్లో ప్రత్తిని సాగు చేయవచ్చు.

పంట కాలాలు మరియు అనుకూలమైన సమయం

ప్రత్తి సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగకు అనుకూలమైన పంట. పంటకాలం దాదాపు ఏడు నుండి ఎనిమిజి నెలలు. దీనిని జూన్, జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జులై 20 తరువాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి.

నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేద జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మి.మీ. వర్షం కురిసిన తర్తాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకుంటే, భూమిలో వేడి తగ్గి, మొలక శాతం బాగుంటుంది.

రకాలు

ప్రత్తి సాగులో రైతాంగమంతా కూడా కాయ తొలుచు పురుగులను తట్టుకునే బిటి హెబ్రిడ్లనే వాడుతున్నారు. ఇవన్ని కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కావున రైతులు తమ ప్రాంతానికి అనువైన వంగడాలను, ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను మరియు సామర్థాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

వర్షాధారంగా సాగు చేసేటప్పుడు తొందరగా పూతకు, కాతకు వచ్చే మధ్యస్థ/చిన్న కాయ సైజు రకాలను ఎంపిక చేసుకోవాలి.

వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు మెంచి సూటి రకాలను విత్తిన లభ్యతను బట్టి ఎంపిక చేయుకోవచ్చును. నరసింహ, శ్రీరామ (యన్ డియల్ హెచ్ – 1938), డబ్ల్యూసివి – 48, డబ్ల్యూసివి – 79, ఎడిబి – 39 మొదలగునవి అనుకూలమైనవి.

ఇటీవల వర్షాధారంగా ప్రత్తలో సుస్థిరమైన/అధిక దిగుబడులు సాధించడానికి అందుబాటులోకి వచ్చిన అధిక సాంద్రత ప్రత్తి సాగులో కూడా రైతులు కంపెనీ వారు అందజేస్తున్న స్వల్పకాలిక బిటి హైబ్రిడ్ల విత్తనాన్నే వాడుతున్నారు.

సాగుకు అనువైన ముఖ్య రకాలు – వాటి లక్షణాలు

రకం పంటకాలం (రోజులు) దిగుబడి (క్వి/హె) గుణగణాలు
నరసింహ(ఎన్.ఎ,1325) 160 – 170 25 – 28 అన్ని ప్రాతాలకు అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పచ్చదోమను కొంత వరకు తట్టుకుంటుంది. పింజ పొడువు 26 మి.మీ. ప్రత్తిలో 36 శాతము దూది వుంటుంది.
శివనంది 160 – 170 16 – 17 అన్ని ప్రాతాలకు అనువైనది. మధ్యస్థ కాయ సైజు కలిగి ఉంటుంది. 28 – 29 మి.మీ. పింజ పొడవుండి, 37.5 శాతం దూదినిస్తుంది.
శ్రీ రామ (ఎన్.డి.ఎల్.హెచ్.1938) 160 – 180 25 – 30 అన్ని ప్రాతాలకు అనువైనది. అధిక దిగుబనిస్తుంది. నీటి ఎద్దిడిని, దోమను కొంత వరకు తట్టుకుంటుంది. మధ్యస్థ కాయ సైజు, 35 % దూది, 28 – 30 మి.మీ. పింజ పొడువు కలిగి వుంటుంది.
ఓరుగల్లు కృష్ణ (డబ్యూ.జి.హెచ్.హెచ్-2 హైబ్రిడ్) 150 - 170 25 - 35 అన్ని ప్రాతాలకు అనువైనది. పచ్చదోమ మరియు నల్లమచ్చ తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది. పింజ పొడుపు 26 – 28 మి.మీ., 36 - 37% దూదినిస్తుంది.

ఇదే కాకుండా, వరంగల్ మరియు అదిలాబాద్ పరిశోధనా స్థానాల్లో తయారైన డబ్ల్యూ.జి.సి.వి.79 మరియు ఎ.డి.బి.39 అనే సూటి రకాలు, అన్ని ప్రాంతాలకు, వర్షాధారంగా, నీటి పారుదల క్రింద సాగుకు, అధిక సాంద్రత ప్రత్తి సాగుకు అనువైనవిగా గుర్తింపబడినాయి. మధ్యస్థ కాయ సైజు కలిగిన వీటి దిగుబడి 20 – 26 కి./హెం ఇవి ఇంకా విడుదల కానప్పటికి సాగులో ప్రాచూర్యం పొందినవి.

విత్తన మోతాదు (ఎకరాకు)

  • హైబ్రిడ్ వంగడాలు : 1.0 కిలో
  • సూటి రకాలు : 2.0 కిలోలు
  • అధిక సాంద్రత సాగుకు : 3 – 5 కిలోలు

విత్తనశుద్ధి :

సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే హైబ్రిడ్ విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి ఉంటుంది. అలాంటి వాటకి తెగుళ్ళ నివారణకు కూడా కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడర్మా విరిడి లేదా 10 గ్రా. సూడోమొనాస్ ఫ్లోరిసెన్స్ తో విత్తే నుందు కొంచం జిగురు కలిపి విత్తనశుద్ధి చేయాలి. దీని వలన పంట తొలి దశలో (నెల వరకు) ఆశించు పురుగులు, తెగుళ్ళ నుండి రక్షింపబడుతుంది.

విత్తనశుద్ధి చేయని యెడల, కిలో విత్తనానికి మొదట ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్యూ.యస్. 5 గ్రా. లేదా 600 ఎఫ్.ఎస్ 5 మి.లీ. లేదా థయామిథాక్సమ్ 70% డబ్ల్యూ.ఎస్. 4 గ్రా. కలిపి తరువాత 10 గ్రా. ట్రైకోడర్మా విరిడి లేదా సూడోమొనాస్ ఫ్లోరిసెన్స్ తో గాని విత్తనశుద్ధి చేయాలి.

విత్తే దూరం

భూమి స్వభావం వరుసల మధ్య దూరం(సెం.మీ.) మొక్కల మధ్య దూరం(సెం.మీ.)
నల్ల రేగడి 120 45 – 60
మధ్యస్థ నేలలు 90 60
తేలికపాటి నేలలు (చల్కా) 90 30
అధిక సాంద్రత ప్రత్తి సాగు 80/75/60/45 15/10

మొక్కల సాంద్రత/ఎకరాకు

ప్రత్తిలో మొక్కల సంఖ్య విత్తే దూరం, నేల స్వభావం, నీటి వసతి, వేసే రకాలు మరియు పాటించే యాజమాన్య పద్దతులను బట్టి మారుతూ వుంటుంది. నల్ల రేగడి, మధ్యస్థ బలమైల భూముల్లో మొక్కల సంఖ్య ఎక్కువగా, అలాగే ఆరుతడి క్రింద మొక్కల సంఖ్య మధ్యస్థంగా, వర్షాధారం క్రింద మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటే దిగుబడులు బాగా వస్తాయి.

అధిక సాంద్రత ప్రత్తి సాగులో ఎకరాకు 25,000 – 35,000 వరకు మొక్కల సంఖ్యను పాటిస్తూ వర్షాధారంగా కొంత వరకు సుస్థిర దిగుబడులు (9 – 13 క్వి./ఎ) సాధిస్తున్నారు.

విత్తే దూరం మొక్కల సంఖ్య / ఎకరాకు
120 X 60 సెం.మీ. 5555
120 X 45 సెం.మీ. 7407
90 X 60 సెం.మీ. 7407
90 X 30 సెం.మీ. 14815

విత్తు పద్ధతి

ప్రత్తిలో ఇప్పటికీ కావలసిన ఎడంలో ఎడ్లతో అచ్చును (మార్కర్ పరికరము) తోలి అచ్చు సాళ్ళలో చేతులతో నేరుగా గాని లేదా పొడవు, అడ్డం రెండు అచ్చులు వేసి, రెండు అచ్చులు కలిసే కేంద్ర భిందువు వద్దగాని విత్తనాలను చేతిలో పెడతారు. ఇది చాలా సులుపుగా తక్కువ ఖర్చుతోనే జరుగుతున్న ప్రక్రియ. మొక్కల సంఖ్య కూడా కావలసిన రీతిలో ఉంటుంది. కావున ఎక్కువగా ఈ పద్ధతినే రైతులు ఆచరిస్తున్నారు.

అచ్చు వేసే ముందు, వేసవి లేదా తొలకరి వర్షాలతో భూమిని 2-3 సార్లు దున్ని శుభ్రంగా చదను చేసుకొని ఉంచాలి. అప్పుడే అచ్చు బాగా పడుతుంది. సరియైన తేమలో విత్తనాన్ని వేసేటప్పుడు 5-6 రోజులలో మొలకంతా బయటకు వస్తుంది. విత్తనం ములవని చోట 10 రోజులలో మరల విత్తనాన్ని పెట్టాలి. విత్తనం మొలిచిన 15-20 రోజులలోపు ఎక్కువ మొక్కలు ఉన్నచోట తీసి కుదురుకు 1 (హైబ్రిడ్) లేదా 2 (రకాలు) మొక్కలు ఉంచాలి. తరువాత గొర్రు, గుంటకలతో అంతరకృషి చేసినప్పుడు మొక్కల చాళ్ళ వెంట బోదెలు ఎక్కించాలి.

వీలైతే విత్తనాన్ని వేసే ముందుగానే తగిన ఎడంతో బోదే సాళ్ళు చేసుకొని, బోదెకు పై నుండి 1/3 వంతులో విత్తనం విత్తుకుంటే చాలా మంచిది. దీని వలన వర్షపాతం ఎక్కువైనప్పుడు నీపు బయటకు పోవడం, బెట్ట పరిస్థితులలో బోదె వెంట ఉన్న మొక్కలకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉండడం జరుగుతుంది. తద్వార పంట కొంత బెట్టను తట్టుకొని కూడా మంచి దిగుబడి ఇస్తుంది.

ఇటీవల కాలంలో అధిక సాంద్రత ప్రత్తి సాగు పద్దతిలో ప్రైవేటు కంపెనీ వారు న్యూమాటిక్ ప్లాంటర్ తో విత్తనాన్ని విత్తుతున్నారు. దీనితో విత్తినప్పుడు విత్తనం భూమిలో సమాంతరంగా ఒకే లోతులో, తేమలో పడి మొలక ఒకేసారి బాగా రావడం జరుగుతుంది. ఇది ఇంకా ప్రాచూర్యం పొందలేదు. మిషన్ రేటు చాలా ఎక్కువ (లక్షల్లో) మరియు రోజు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేయడానికి ఉపయోగపడుతుంది.

అంతర పంటలు / పంటల సరళి

సుస్థిర పంట సాగుకు మరియు దిగుబడికి అంతర పంటల సాగును తప్పక చేపట్టాలి. ప్రత్తిలో అంతరపంటలుగా సాళ్ళ మధ్య దూరాన్ని బట్టి రెండు లేదా మూడు పరుసులు పెసర, బొబ్బెర, మినుము, సోయాచిక్కుడు మొదలగు పంటలను సాగు చేసుకోవచ్చు. కాయ తీసుకున్న తరువాత మిగిలిన అంతర పంటల మోళ్ళను/అవశేషాలను భూమిలో సేంద్రీయ ఎరువుగా కలియ దున్నుకోవచ్చు.

అంతర పంటల సాగుతో ప్రధాన పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా, వాతావరణ ఒడుదుకుల నుండి కూడా కొంత రక్షణ లభిస్తుంది.

ప్రత్తిలో కంది పంటను కూడా నాలుగు ఆరు ఎనిమిది పరుసల ప్రత్తికి ఒక వరస చొప్పున సాగు చేసుకున్నా బాగుంటుంది. ఈ పద్దతిని పైతులు ఎక్కువగానే ఆచరిస్తున్నారు.

బిటి ప్రత్తి సాగులో ఇటీవలి కాలంలో ఉధృతమవుతున్న గులాబి రంగు పురుగు మరియు ఇతర పురుగుల నివారణకు ప్రత్తి పంట కలాన్ని ఎక్కనగా పొడిగించకుండా, జనవరి మధ్య కల్లా పూర్తి చేసి, జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటి పక్షంలోపు ఆరుతడి పంటలైన పెసర, మినుము, తెల్లనువ్వులు గాని లేదా జనవరి చివర్లో అయితే మొక్కజొన్న లాంటి పంటను గాని సాగుచేసుకుంటే, రానున్న పంటలో గులాబి రంగు పురుగు ఉధృతి తగ్గడమే కాకుండా, పప్పుధాన్యాలు సాగు వలన నేల సారవంతం, పంట మార్పిడి వలన పలు ప్రయోజనాలు కలుగుతాయి. కావున ప్రత్తి తరువాత ఆరుతడి పంటగా పప్పుధాన్యపు పంటలు సాగు తప్పక చేపట్టాలి.

సమగ్ర ఎరువుల యాజమాన్యం

సిఫార్సు చేసిన ఎరువులు (ఎకరాకు కిలోల్లో)

ప్రత్తి రకాలు నత్రజని భాస్వరం పొటాష్
సూటి రకాలు(అమొరికన్ రకాలు) 36 18 18
హైబ్రిడ్స్ (సంకర జాతి రకాలు) 48 24 24

ప్రత్తి సాగు చేయు భీములలో ప్రతీ సంవత్సరం ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి.

సాధారణ / సూటి రకాలను ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. హైబ్రిడ్ రకాలను ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.

సిఫారసు చేసిన భాస్వరం మొత్తాన్ని, సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో (రకాలకు 100 కిలోలు, హైబ్రిడ్లకు 150 కిలోలు) ఎకరానికి విత్తేముందు ఆఖిరి దుక్కిలో వేసి కలియదున్నాలి లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు.

సాధారణ రకాలకైతే సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్ లను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి. బిటి హైబ్రిడ్లకు సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్ లను నాలుగు సమభాగాలుగా చేసి విత్తిన 20,40,60,80 రోజులకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసివేయాలి.

పై పాటుగా వేయు నత్రజని, పొటాష్ లను యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రూపంలో అందించాలి. ఎరకాకు రకాలకైతే ప్రతీసారి 25 కీలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ లను 3 సార్లు – 36,60,90 రోజులలో, హైబ్రిడ్లకయితే అదే మొతాదులో 20,40,60,80 రోజులకు అందించాలి.

ప్రధాన పోషకాలను సింగల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు – ఎకరాకు 50 కిలోల డి.ఎ.పి.ని విత్తినప్పుడు వేసి, పైపాటుగా యూరియా, పొటాష్ లను పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డి.ఎ.పి. లేదా 20:20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీని వలన ఖర్చు పెరగడమే కాకుండా, భూమిలో భాస్వరపు నిల్వలు ఎక్కువై చైడు భూములుగా మారుతాయి.

పైన సూచించిన అన్ని ఎరువుల మోతాదును భూసార పరీక్షలననుసరించి, ఏదైన పోషకాన్ని సిఫారసు కంటే 30% తక్కువగా మరియు పోషకం మధ్యస్థంగా ఉన్నప్పుడు, సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడితే ఫలితం బాగుంటుంది.

ఎక్కువకాలం ప్రత్తి సాగు చేస్తున్న భూముల్లో, ప్రత్యేకంగా వేరు తెగుళ్ళు ఆశించే భూములలో మాత్రం పంట మార్పిడితో పాటు, ఎకరాకు 200 కిలోల వేపపిండిని రెండు – మూడు సంవsత్సరాలు వేయాలి.

సూక్ష్మపోషకాల లోపాలు – యాజమాన్యం

ఒకే పోలంలో పంట మార్పిడి చేయకుండా ప్రత్తినే అనేక సంవత్సరాలుగా పండించడం వల్ల పైరుపై జింకు, మెగ్నీషియం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాల లోపం కనిపిస్తుంది.

పోషక ధాతు లోపాలు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు లోప సవరణ చర్యలు
జింకు ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారుతుంది. ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి కణువుల మధ్య దూరం తగ్గుతుంది. మొక్క గిడసబారిపోతుంది. (1) ఒకే పంట సాగు (2) భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడటం (3) చౌడు భూములు (4) సహజసిద్ధంగా లోపం కలిగిన నేలలు. 2 గ్రా.ల జింకు సల్ఫేట్ ను లీటరు నీటికి చొప్పున కలిపి 2 లేదా 3 సార్లు ప్రతీ 5 రోజులకోకసారి పిచికారి చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ను భూమిలో వేయాలి.
మెగ్నిషియం ముదురు ఆకుల ఆంచులు పసుపు రంగుకు మారుతాయి. తరువాత ఆకులు ఎర్రబడి ఎండి రాలి పోతాయి. ఆకుల ఈనేలు మాత్రం రంగు మారాక ఆకుపచ్చగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ లోపం కనిపిస్తుంది. లీటరు నీటికి 10 గ్రా. చొప్పున మెగ్నిషియం సల్ఫేటుని కలిపి పైరుపై వారం పది రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ పూలు చిన్నవిగా మారడం, పూత, కాయ, పిందె రాలడం, మొక్కలు గిడసబారి కాండంపై పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంది. సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో, వర్షాభావ పరిస్థితులలో మరియు అధిక వర్షపాతం వున్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. లీటరు నీటికి 1.5 గ్రా. ల బోరాక్స్ ను కలిపి 1 లేదా 2 సార్లు 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
పూత, పిందె రాలడం ప్రతికూల పరిస్థితులలో (అధిక తేమ/ బెట్ట) మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వలన ప్రత్తిలో గూడ, పూత, పిందె రాలడం జపుగుతుంది. ప్లానోఫిక్స్ (యన్.ఎ.ఎ.10.పి.పి.య్) ద్రవణాన్ని 5 లీటర్ల నీటికి 1 మి.లీ. చొప్పున కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ప్లానోఫిక్స్ విడిగా కాని లేదా లీటరు నీటికి 20 గ్రా. డి.ఎ.వి. లేదా యూరియా ద్రావణంతో కలిపి పిచికారి చేస్తే ఫలితం బాగుంటుంది.
పండాకు తెగులు ప్రత్తిలో ఆకులు ఎర్రబడటాన్ని పండాకు తెగులు అంటారు. బిటి ప్రత్తిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అడుగు ఆకుల నీద ఎక్కవగా ఉంటుంది. ఆకుల మొదట గులాబి రంగుకు మారి, తరువాత పూర్తిగా ఎర్రబడి, ఎండిరాలి పోతాయి. ప్రత్తిలో కాపు అధికంగా వున్న సమయంలో పోషక పదార్థాల ఆవశ్యకత ఎక్కువగా ఉండటం, అదే సమయంలో మొక్క వాతావరణ (అధిక బెట్ట/తేమ) ఒత్తిడిలకు లోనవడం వలన ఈ తెగులు కనిపిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21o సెల్సియస్ కంటే తగ్గడం. గాలి అధికంగా ఉండడం. లీటరు నీటికి 10 గ్రా. మెగ్నిషియం సల్ఫేటు మరియు 10 గ్రా. ల యూరియా/డి.ఎ.పి. కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

డ్రిప్ ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల వాడకం

ప్రత్తిలో బిందు సేద్యము (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా 25-30 శాతం వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. బిందు సేద్య పద్దతిలో ఎరువులను నేరుగా మొక్కల వేర్ల దగ్గర అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఎరువులు అసలు వృధాకావు. మొక్కకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో 20-25 శాతం వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు.

ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు సిఫార్సు చేసిన మొత్తం భాస్వరాన్ని, సంగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో విత్తనం వేసే ముందు అడుగు మందుగా భూమిలో వేయాలి.

తదుపరి సిఫారసు చేసిన నత్రజని మరియు పొటాష్ ఎరువులను యూపియా మరియు మల్టీ-కె (పొటాషియం నైట్రేట్) రూపంలో కావలసిన సమభాగాలుగా చేసి పంట విత్తిన 20 నుండి 120 రోజుల వరకు భూస్వభావాన్ని బట్టి 7-10 రోజులకొకసారి చొప్పున డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా అందించాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

ప్రత్తిలో మొదటి దశలో (అనగా విత్తిన నెలలోపు) వచ్చు కలుపు నివారణ: ప్రత్తిని విత్తే 3-5 రోజుల ముందు ప్లూక్లోరాలిన్ 45% మందును ఎకరాకు 1 లీటరు చొప్పున చివరి దుక్కిలో పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా విత్తనం వేసిన 24-48 గంటలలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1.2 లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో- లీటరు నీటికి 6 మి.లీ. చొప్పున కలిపి చేతి పంపుతో చేనంతా సమంగా తడిచేటట్టు పిచికారి చేయాలి. భూమిలో సరియైన పదును/తేమ ఉన్నప్పుడే పిచికారి చేసిన గడ్డి మందు చాలా సమర్థవంతంగా పనిచేసి, కలుపును నివారిస్తుంది.

ప్రత్తి మొలకెత్తిన నెల రోజులకు చేనులో వచ్చు లేత గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు నివారణకు – క్వాజలోఫాస్ ఇధైల్ (టర్గా సూపర్) 400 మి.లీ. లేదా ప్రోపాక్విజాఓఫాస్ (ఎజిల్) 250 మి.లీ. మరియు పైరిథయోబ్యాక్ సోడియం (హిట్ వీడ్/థీమ్/ రైఫ్) 250 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిరి రిచికారి చేయాలి.

కలుపు మందులతో పాటుగా ప్రత్తిలో సమాయానుకూలంగా, ప్రతీ వారం, పదిరోజులులకొకసారి గొర్రు, గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు, పైరు పెరుగుదల బాగా ఉండి, భూమిలో ఎక్కువ తేమ నిల్వవుండి, తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది.

వర్షాలు ఎక్కువగా ఉండి, అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితులలో పారాక్వాట్ 5 మి.లీ. లేదా గ్లేఫోసేట్ 10 మి.లీ. మరియు 10 గ్రా. ల యూరియాతో లీటరు నీటికి కలిపి ప్రత్తి మొక్కలపై పడకుండా, పరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లుగా పిచికారి చేస్తే, కలుపు నివారణ బాగా జరుగుతుంది.

ప్రస్తుతానికి ప్రత్తిలో వాడటానికి సమర్థమంతమైన అంతరకృషి యంత్రం లేదు. కాని డ్రిప్ పద్దతిలో ప్రత్తిని సాగుచేసేటప్పుడు, వరుసల మధ్య దూరం 5 అడుగులు వున్నట్లయితే కుబొటా లాంటి చిన్న ట్రాక్టర్ తో అంతపకృషి బాగా చేయుకోవచ్చు.

నీటి యాజమాన్యం

ప్రత్తి సాగుకు 600-800 మి.మీ. వర్షపాతం అవసరం వుంటుంది. ప్రత్తి సాధారణంగా ఎక్కువ నీటిని గాని / అధిక తోమను గాని తట్టుకోలేదు. కావున అవసరం మేరకు నీరు పెట్టాలి.

ప్రత్తిలో పూత, పిందే, కాయ తయారయ్యే దశలు క్లిష్టమైనవి. ఈ దశలో బెట్ట వేస్తే పూత, పిందే. కాయ రాలిపోవడం జరుగుతుంది. మరియు బెట్ట దశలో వచ్చిన ప్రత్తిని జిన్నింగ్ చేసినప్పుడు దూది శాతం తక్కువ రావడం జరుగుతుంది. కావున నీటి వసతీ ఉన్న చోట, పూత మరియు కాయ తయారయ్యే దశలో అవసరాన్ని బట్టి (10-15 రోజుల బెట్ట) నీటి తడులు తప్పని సరిగా ఇవ్వాలి. తద్వారా పంట దిగుబడి బాగా వస్తుంది.

ప్రత్తి పంటకు బిందు సేద్యం బాగా ఉపయోగ పడుతుంది. కాని ఈ వసతి చాలా తక్కువ మందికి ఉంది. బిందు సేద్యం వసతి ఉన్నచోట ఫర్టిగేషన్ తో పాటు నీరు కూడ సమయానుకూలంగా (సరాసరి 10 రోజులకొకసారి) కీలక దశలో పంటకు అందిస్తే దిగుబడులు బాగా వస్తాయి. ప్రత్తికి స్ప్రింకర్లు లేదా వప్షపుగన్ (రేయిన్ గన్)ల వాడకం లేదు.

పంట ఎదుగుదలకు కావలసిన వాతావరణ పరిస్థితులు

ప్రత్తి విత్తిన తరువాత మొలక శాతం బాగా రావడానికి రోజులో కనీస ఉష్ణోగ్రత 16o సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండాలి. పంట సమృద్ధిగా ఎదగడానికి పూతకు వచ్చే సమయం వరకు 21o-37o సెల్సియస్ మధ్య వాతావరణ ఉష్ణోగ్రత వుంటే చాలా బాగుంటుంది.

పూత, కాయ దశలో పగటి ఉష్ణోగ్రత 27o -32o సెల్సియస్ మధ్య మరియు రాత్రి పూట చల్లని వాతావరణం ఉంటే కాయ ఎదుగుదల బాగుపడి దిగుబడి మంచిగా వస్తుంది. మొక్క ప్రత్యుత్పపత్తి మరియు కాయ తయారయ్యే దశలో పగలు ప్రకాశవంతంగాను, రాత్రి, ఉదయం మంచు కురవని చల్లని కాలం ఉండాలి.

ప్రత్యుత్పపత్తి దశలో 40o -42 o సెల్సియస్ మించితే, పువ్వులోని పుప్పొడు ఫలదీకరణ శక్తిని కోల్పోతుంది. అలాంటప్పుడు గింజ కట్టుట, కాయ తయారగుట జరగదు.

పంట కొత – ప్రత్తి తీతలో మెళుకవలు

ప్రత్తిలో పూత దఫదఫాలుగా రావడం వల్ల ప్రత్తిని దాదాపు 4 సార్లు తీయవలసి వస్తుంది. బాగా ఎండిన ప్రత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. లేనిచో ప్రత్తితో పాటు తొడిమలు, కాడలు, ఆకులు వస్తాయి.

ప్రత్తి తీత ఎక్కువగా చలికాలంలో తీయడం జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మంచు కురియటం వలన ఉదయాన్నే ప్రత్త తేమగా, ముద్దగా ఉంటుంది. కాబట్టి ప్రత్తని ఉదయం 10 గం. ల నుండి ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుండి 6 గంటలలోపు తీయాలి. మరీ ఎండ సమయంలో మధ్యాహ్నం ఎక్కువ తీసినా ప్రత్తితో పాటు తొడిమలు, కాడ కూడ వస్తుంది. కాపున సమయాన్ని పాటించాలి.

ప్రత్త తీసిన తరువాత నీడలో ప్లాస్టిక్ పట్టాల మీద/ తాటి ప్రతుల మీద వేసి ఆరబెట్టినట్లయితే గింజ గట్టిబడి ప్రత్తిలో తేమ శాతం తగ్గి శుభంగా ఉంటుంది. తరువాత గోన సంచిలలో తొక్కి తేమ తగులకుండా నిల్వ చేసుకొని, మార్కెట్ రేటు బాగా వున్నపుడు అమ్ముకోవాలి. ప్రత్తి తీసిన వెంటనే ఆరబెట్టకుండా సంచులలో తొక్కి నిల్వచేస్తే, లోపలవున్న తేమను గింజ ముడుచుకోకపోవడం, దూది నాణ్యత తగ్గడం జరుగుతుంది.

ప్రత్తిని ఎండబెట్టుట మరియు నాణ్యతా ప్రమాణాలు

ప్రత్తి నాణ్యత అనేది ప్రధానంగా జన్యు సంబంధమైనది. ఇది కొంత వరకు వాతావరణ పరిస్థితులు, పోషకాల యాజమాన్యం, పంటలలో చీడ పీడల తాకడిపైన ఆధారపడి ఉంటుంది.

అంతే కాకుండా ప్రత్తి నాణ్యత ముఖ్యంగా పింజ పొడువు, పింజ గట్టితనం, పింజ మృదుత్వం, పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఈ నాణ్యత లక్షణాలు ప్రత్తి రకాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. అప్పుడు మార్కేట్ లో ఏ ప్రత్తికి మంచి రేటు వస్తుంద, ఆ రకాన్ని ఎంపిక చేసుకొవలసి ఉంటుంది.

చేనులో నుండి ఏరిన ప్రత్తిని నీడలో మంచి నేల మీద/ ప్లాస్టిక్ పట్టాల మీద మండెలు వేసి ఆరబెట్టాలి. ఇలా 1.2 రోజులు చేయడం వలన ప్రత్తిలో గింజ బాగా గట్టి పడటమే కాకుండా, తేమ శాతం కూడ తగ్గి ప్రత్తి శుభంగా ఉంటుంది. ప్రత్తిలో తేమ శాతం 10 లోపు (అనగా 8 లేదా 9%) ఉంటే మంచి రేటు లభిస్తుంది.

8% తేమ ఉన్న ప్రత్తిని గొనె సంచులలో తొక్కి, తేమ తగలని చోట నిల్వ చేయవచ్చు. మంచి రేటు రాగానే మార్కేట్ లో అమ్మవచ్చును.

ప్రత్తి సాగులో పాటించవలసిన ముఖ్య మొళకువలు

  • వీలైనంత తొందరగా విత్తనాన్ని విత్తాలి. మే చివరి నుండి జూన్ 15 లోపు విత్తితే దిగుబడులు ఎక్కువగా వస్తాయి.
  • జులై 15 తరువాత వీలైనంత వరకు ప్రత్తిని విత్తరాదు.
  • తేలిక నేలల్లో తప్పనిసరిగా ప్రత్తిని సాగు చేసినప్పుడు మొక్కల సంఖ్య మాములు కంటే ఎక్కువగా ఉండేటట్లు దగ్గరగా విత్తుకోవాలి.
  • నేల స్వభావాన్ని, నీటి వసతులు దృష్టిలో ఉంచుకొని సరియైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
  • కలుపు మందులు వాడి మొదటి దశలో వచ్చు కలుపును సమర్థవంతంగా నివారించుకోవాలి.
  • కాంప్లెక్సు ఎరువులను ఎట్టి పరిస్థితులలో పై పాటుగా వేయరాదు. నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రమే పైపాటుగా చేసుకోవాలి.
  • ఎరువులను భూమి లోపల మొక్కకు దగ్గరగా పడునట్లు గొర్రుతో గాని/చేతితో గాని వేయాలి.
  • డ్రిప్ పద్ధతిలో ప్రత్తిని సాగు చేసినప్పుడు వరుసల మద్య దూరాన్ని పెంచి, మొక్కల మద్య 1.5 – 2 అడుగులు ఉండేటట్లు విత్తుకోవాలి.
  • బిటి ప్రత్తి సాగులో కూడా సమగ్ర సస్యరక్షణ పద్దతులను తప్పకుండా ఆచరించాలి. దీని వలన సాగు ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు పెరుగుతాయి.
  • పైరు పూత, కాత దశలో ఉన్నప్పుడు భూమిలో వేసే ఎరువులతో పాటు, పై పాటుగా ప్రతీ వారం నుండి పది రోజులకు ఒకసారి పోషకాల పిచికారి (డిఎపి/యూరియా/ మల్టి-కె/ పాలిఫీడ్) చేయాలి. దీని వలన కాత బాగా వస్తుంది. మొక్క పచ్చగా వుండి ఎక్కువ దిగుబడి వస్తుంది.
  • పైరు పూత, కాత దశలో సాధారణంగా వచ్చే ఆకుమచ్చలు, బాక్టీరియా నల్లమచ్చ తెగుళ్ళను వంటనే గుర్తించి సిఫారసు చేసిన మందులను 1 లేదా 2 సార్లు పిచికారి చేసినట్లయితే పైరు బాగుండి మంచి దిగుబడులు వస్తాయి.
  • పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. దేనికి ఏది అవసరమో తెలుసుకొని మాత్రమే వాడాలి.
  • ప్రత్తి పండించే భూములలో భూసారం తగ్గకుండా తగిన మొతాదులో సేంద్రియ ఎపువులను క్రమం తప్పకుండా వేయాలి.
  • ప్రత్తి పంట కాలాన్ని ఏడు నెలలకు మించి పొడిగించకూడది. పంట పూర్తి కాగానే మోళ్ళను భూమిలో దున్నడం లేదా సమగ్రంగా నిర్మూలంచడం చేసి, గులాబి రంగు పురుగు ఉధృతిని అరకట్టాలి.
  • ప్రత్తి తరువాత జనవరిలో పప్పుధాన్యపు పంటలైన పెసర, బొబ్బెర, మినుము పంటలు చేసుకొని దిగుబడిని, భూసారాన్ని పెంటుకోవాలి.
  • ప్రత్తి తీతలో మెళికువలు పాటించి, మంచి రేటు పొందాలి.

సమగ్ర సస్యరక్షణ

పురుగులు మరియు తెగుళ్ళు – లక్షణాలు మరియు సమగ్ర యాజమాన్యం

పురుగులు/తెగుళ్ళ పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు/ఉధృతిగా ఉండు కాలం పురుగు మందులు జీవ రసాయనాలు
పచ్చదోమ (1) పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయు. (2) ఆకులు మొదట దేనెలుగా ముడుచుకొని, లేత పసుపు రంగులోకి మారి ఆ తరువాత ఆకుల అంచుల నుండి ఎర్రబడి క్రమేపి ఎండి రాలిపొతాయి. (3) పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది. (4) పైరు లేత దశ నుండి పంటకాలం చివరి వరకు ఈ పురుగు ఆశిస్తుంది. ఎక్కువ వర్షపాతం, మబ్బులతో కూడుకున్న వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృధ్ది చెందుతుంది. (1) తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్దతిని పాటించాలి. 30,45 రోజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తలో పూయాలి. (2) మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 75 యస్ పి 1.45 గ్రా. లేదా ఫ్లేనికామిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మి.లీ. కలిపి వాడాలి.
పేనుబంక (1) పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క లేత కొమ్మల నుండి మరియు ఆకు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయు. (2) ఆకులు దోనెలుగా మారి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. (3) ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులపై, కాండంపై నల్లని బూజు ఏర్పడుతుంది. దీని వలన కిరణజన్య సంయోగప్రక్రియ తగ్గుతుంది. (4) పేనుబంక విసర్జించిన తేనె వంటి జిగురు పదార్థాన్ని తినడానికి ఆకర్షింపబడిన చీమలు మొక్కలపై కనిపించినట్లయితే పెనుబంక ఆశించినట్టుగా భావించవచ్చు. (5) పర్షాలు పడినప్పుడు పురుగుల యెక్క సాంద్రత తగ్గిపోతుంది. బెట్ట వాతావరణంలో మరియు చలి కాలంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. (1) నివారణకు పంట తొలి దశలో కాండానికి ముందు పూత 30, 45 రొజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తలో పూయాలి. ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. లీటరు నీటికి కిలిపి పిచికారి చేయాలి. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మి.లీ. కలిపి వాడాలి.
తామర పురుగు (1) పైరు పిందె, కాయ దశలలో ఎక్కువగా ఆశిస్తుంది. (2) పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయు. (3) ఆకుల మీద పచ్చదనం కోల్పోయి మచ్చలేర్పడి, ఆకులు పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి. (4) పురుగు సోకిన మొక్కలు గిడసబారి, పూమొగ్గులు, పూలు, కాయలు రాలి, కాయలు తయారు కాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గుతుంది. (5) ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించి దూదిని కలుషితం చేస్తాయి. ఎక్కవగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి మాసం వరకు ప్రత్తిని ఆశిస్తాయు. (1) పంట తొలి దశలో సింథటిక్ పైరిత్రాయిడ్ మరియు ఆర్గనోఫాస్ఫేట్ మందులను విచ్చలవిడిగా పిచికారి చెయకూడదు. (2) కాండానికి ముందు పూత 30, 45 రొజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్ప్తత్తలో మరియు 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తలో పూయాలి. (3) లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్ పి 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ, లేదా డైఫెన్ థాయీరాన్ 1.25 గ్రా. లేదా స్ప్రైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. పిచికారి చేయాలి. వీలైనంత వరకు పై పురుగు మందులతో పాటు వేప సంభందిత మందులను కలిపి పిచికారి చేయాలి, లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మి.లీ. కలిపి వాడాలి.
ఎర్రనల్లి (1)ఎర్రనల్లి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి సాలీడు గూడులా అల్లిక చేసి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులపై పసుపు పచ్చని చుక్కలు ఏర్పడతాయి. (2) ఆకుల మధ్య బాగం నుండి ఎరుపుగా మారి ఎండిపాతాయి. పైరు, పిందె, కాయ దశలలో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆశిస్తాయి. (1) ముఖ్యంగా పంట తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్ మరియు నియో నికోటినాయిడ్ మందులను విచ్చలవిడిగా పిచికారి చెయకూడదు. (2) నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
పిండినల్లి (1) పిండినల్లి చిన్న పురుగులు లేత పసుపు రంగులో ఉంటాయి. తల్లి పురుగు రెక్కలు లేకుండా శరీరమంతా మైనపు పూత కల్గున వెంట్రుకలతో కప్పుబడి ఉంటాయి. (2) ఈ పురుగులు ఆకు తొడిమెల నుండి పూత, కాయల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి మరియు పూత పిందే రాలుతాయి. (3) ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. (4) ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన నల్లబూజు తెగులు ఆశించి దూది నాణ్యత తగ్గుతుంది. (1) అధిక ఉష్ణోగ్రత వర్షాభావ పరిస్థితులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. (2) పిండినల్లి ఎక్కువగా ప్రత్తి విత్తనాల ద్వార గాలి, చీమలు, నీటి పీరకము, వర్షాలు, పక్షులు, మనుషులు మరియు పశువుల ద్వార ఒక చోట నుండి మరొక చోటికి వ్యాపిస్తాయి. నివారణకు ఫ్రొఫెలోఫాస్ 50 ఇ.సి. లేదా మిథైల్ పారాథియాన్ 50 ఇ.సి. 3 మి.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా. + ట్రైటాన్ లేదా సాండోవిట్ లాంటి జిగురు మందులను 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనెను 5 మి.లీ. కలిపి వాడాలి.

రసం పీల్చే పురుగుల నవారణకు ప్రత్యేక సూచనలు

  • పచ్చదోమను తట్టుకొను నూగు ఎక్కువగా ఉన్న రకాలను ఎంచుకొని పాగు చేయాలి.
  • ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్ తో విత్తనశుధ్ది చేయుట వలన దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చును.
  • నత్రజని ఎరువులను సరియైన మోతాదులో సకాలంలో వేయాలి. లేకుంటే పురుగుల ఉధృతి ఎక్కువ అవుతుంది.
  • ప్రత్తిలో అంతర పంటలుగా పెసర, మినుము, సోయాచిక్కుడు, ఆలసంద వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధిచెంది కొంత వరకు రసం పీల్చు పురుగుల నియంత్రణకు దోహద పడుతాయి.
  • రసం పీల్చు పురుగుల నివారణకు తొలిదశలో విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారి చెయకుండా కాండానికి ముందు పూసే పద్దతిని పాటించాలి.
  • కాండానికి ముందు పూత మూడు సార్లు అనగా 30,45 రోజులలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్పత్తిలో పూయాలి.
  • ప్రత్తి పంట చుట్టు మొక్కజొన్న లేదా జొన్న రక్షణ పంటగా 2-3 వరుసలలో ఒత్తుగా విత్తుకోవాలి.
  • కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ, తుత్తురుబెండ లాంటి కలుపు మొక్కలు చేను చుట్టు లేకుండా చూసుకోవాలి.
  • తెల్లదోమ నివారణకు మందుల పిచికారితో పాటు మార్కెట్ లో లభించు పసుపు రంగు జిగురు పూసిన అట్టలను (ఎల్లోస్టికి ట్రాప్స్) ఎకరానికి 10 చొప్పున అమరిస్తే తెల్లదోమలు అకర్షించబడి జిగురుకు అంటుకొని చనిపోతాయి.
  • ఒకే గ్రూపుకు చెందిన పురుగు మందులను వెంటవెంటనే పిచికారి చేయకుండా, వేర్వేరు గ్రూపులకు సంభందించిన పురుగు మందులను మార్చి పిచికారి చేయాలి.
పురుగులు/తెగుళ్ళ పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు/ఉధృతిగా ఉండు కాలం పురుగు మందులు జీవ రసాయనాలు
కాండం తొలుచు పురుగు (1) ఈ పురుగు వార్వాలు, ప్రత్తి యెక్క కాండాన్ని భూమి నుండి అడుగు అడుగున్నర దూరంలో తొలిచి కాండము మధ్య భాగాన్ని మొత్తము తినేస్తాయి. (2) పురుగు ఆశించిన ప్రత్తి మొక్కల దగ్గర రంపపు పొట్టులాగా వడి ఉండడము గమనించవచ్చు. (3) పురుగు ఆశించినప్పుడు కాండి బలిహీనమై, కొమ్మలు పెరుగుతాయి. క్రమేపి మొక్క మొత్తం చనిపోతుంది. (4) పురుగు ఉనికిని గమనించిన వెంటనే లార్వాను ఏరివేసి నాశనము చేయాలి. ఈ పురుగు ఉనికిని జూన్ నుండి అక్టోబర్ మాసంలో అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షాభావ పరిస్థితులు ఉన్నపుడు గమనించవచ్చు. ఆక్సీడెమటాన్ మిధైల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే పురుగు ఉధృతి కొంత వరకు తగ్గుతుంది.
కాండపు ముక్కు పురుగు (1) ముక్కు పురుగు లార్వాలు కాళ్ళు లేకుండా లేక తెలుపు రంగులో ఉంటాయి. (2) ఇవి ప్రత్తి మొక్క మొదలు భాగంలో చిన్న రంధ్రాన్ని చేసి కాండములోనికి తొలుచుకుపోయు నష్టాన్ని కలిగిస్తాయి. (3) ఆశించిన కొమ్మలు బలహీనపడి, బలమాన గాలులు వీచినప్పుడు లేదా అంతరకృషి చేసినప్పుడు విరిగిపోతాయి. ఆశించిన మొక్క భాగం కొంత ఉబ్బి ఉంటుంది. పురుగు ఆశించిన కొమ్మలు కాలక్రమేణా వడలి చనిపోతాయి. ఈనెల దగ్గర, అడవుల దగ్గర తాగు చేస్తున్న ప్రత్తిలో కాండపు ముక్కు పురుగు సమస్య అధికంగా కనిపిస్తుంది. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి మొక్క మొదళ్ళ దగ్గర పిచికారి చేయాలి. ఎకరాకు 100 కిలోల వేపపిండి వేయాలి.
పొగాకు లద్దె పురుగు (1) ఈ పురుగు పైరును అన్ని దశలలో ఆశించి బాగా నష్టపరుస్తుంది. (2) తల్లి పురుగు ఆకుల భాగాన ఒకే దగ్గర గుంపుగా గుడ్లను పెడుతుంది. (3) గుడ్లనుండి వచ్చిన చిన్న లార్వాలు ఆకుల అడుగున గుంపులు గుంపులుగా చేరి ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి. (4) లార్వా దశలు పెరిగేకొద్ది విడివిడిగా ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రమే మిగిలిస్తాయి. వీటినే “జల్లేడ ఆకులు” అంటారు. (5) ఈ లార్వాలు మొగ్గలు, పువ్వులు మరియు కాయలను ఆశించి నష్టపరుస్తాయి. (6) పగటి పూట ఇవి మొక్కల మొదళ్ళో భూమి లోపల ఉండి రాత్రిపూట నష్టం కలుగజేస్తాయి. ఎడతెరిపి లేకుండా అధిక వర్షాలు పడటం అనుకూల పరిస్థితులు. (1) మూడవ దశ దాటిన లద్దె పురుగును అదుపు చేయటానికి విషపు ఎరను వాడాలి. ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంలో పాలు 1 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 750 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 300 గ్రా. ధయోడికార్బ్ మందుకు సరిపడే నీటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయంలో పొలమంతా చల్లాలి. (2) నొవల్యూరాన్ 1 మి.లీ. లేదా లుఫేన్యూరాన్ 1.25 మి.లీ. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా ప్లూబెండమైన్ 0.3 మి.లీ. లేదా క్లోరాట్రినిసిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (1) 5 శాతం వేప గింజల కషాయం పిచికారి చేయాలి. (2)ఎకరానికి లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. (3) ఎకరాకు ఎర పంటగా 20 ఆముదం మొక్కలను వేయాలి.
శనగ పచ్చ పురుగు (1) తల్లి పురుగు మొక్క లేత భాగాలపై తెల్లని గుండ్రని గుడ్లను విడివిడిగా పెడుతుంది. (2) గుడ్లనుండి పొదగడబిన చిన్న లార్వాలు, ఆకులు, గూడ, పూత మరియు కాయలకు చిన్న రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. (3) లార్వా ముందుగా తలను పూత, కాయలోనికి జొప్పించి మిగితా శరీర భాగాన్ని బయట ఉంచి తింటుంది. (4) కాయలు చేసే రంధ్రం గుండ్రంగా పెద్దగా ఉంటుంది. (5) పురుగు ఆశించిన మొగ్గలు, పూత రాలి పోతాయి. ఈ పురుగు ఆశించిన పూలు విచ్చుకొని కనిపిస్తాయి. అధిక తేమతో కూడిన చల్లని వాతావరణం (1)పచ్చ పురుగు గుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ధయేడికార్బ్ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (2) పచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఇండాక్సాకార్బ్ 1 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా ఫ్ల్యూబెండమైడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిసిప్రోల్ 0.3 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. (1) 5 శాతం వేప గింజల కషాయం పిచికారి చేయాలి. (2)ఎకరానికి లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. (3) ఎకరాకు ఎర పంటగా 100 బంతి మొక్కలను వేయాలి.
తలనత్త పురుగు (1) తల్లి పురుగు గుడ్లను ఒకొక్కటిగా గూడ మీద, కొమ్మ మీద, లేత ఆకుల మీద పెడుతుంది. (2) ఈ పురుగు లార్వాలు లేత కొమ్మలను పూ మొగ్గలను మరియు కాయలను తొలిచి నష్టం కలుగజేస్తాయి. (3) చిన్న లార్వా మొక్కల చివర్లను తొలిచి తినడం వలన కొమ్మన చివర్లు వడలి ఎండిపోతాయి. వీటిని “తలనత్తి” అంటారు. (4) పురుగు ఆశించిన లేత కొమ్మలు వాలిపోయి ఎండిపోవడం, పూ మొగ్గలు మరియు కాయలు రాలిపోవడం జరుగుతుంది. (5) పురుగు ఆశించిన భాగాలలో విసర్జన పదార్థం కనబడుట ముఖ్య లక్షణ. అధిక తేమతో కూడిన చల్లని వాతావరణం లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్ 2 మి.లీ. లేదా థయాడికార్బ్ 1.5 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి. 5 శాతం వేప గింజల కషాయం పిచికారి చేయాలి.
మకిలి పురుగు (1) పెంకు పరుగుల జాతికి చెందిన ఈ పురుగులు ప్రత్తి మొలకెత్తి బయటకు వచ్చిన వెంటనే మొక్కల మొదళ్ళ దగ్గర కొట్టివేస్తాయి. (2) వీచి వల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు మొక్క మొలకెత్తడం కూడా చాలా ఆలస్యమపుతుంది. (3) మొక్కలు మొలకెత్తిన వెంటనే మొక్క మొదళ్ళ దగ్గర కొట్టివేస్తాయి. దీని వలన మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. బెట్ట వాతావరణ పరిస్థితులలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రత్తి పంట చుట్టు తుప్పలు, కంచెలు ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మలాథియాన్ పొడిని కొద్ది మొత్తంలో మొక్క చుట్టు చల్లుకోవాలి.
బాక్టీరియా నల్లమచ్చ తెగులు లేదా బ్లాక్ ఆర్మ్ (1) నల్లమచ్చ తెగులు మొక్క వివిధ దశలలో రూపాలలో కనిపిస్తుంది. (2) ముందుగా ఆకులపై కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తపువాత నల్లగా మారి మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపొతాయి. దీనినే “బ్లాక్ ఆర్మ్” అని పిలుస్తారు. (3) తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు వంగి రాలిపోతాయి. (4) తెగులు పువ్వులకు, కాయలకు సోకినప్పుడు పరిపక్వం చెందడానికే రాలిపోతాయి. (5) కాయ మీద ముదురు ఆకుపచ్చ నూనె రంగు మచ్చలు ఏర్పడి తరువాత నల్లగా మారి గుంచలు ఏర్పడడం వలన కాయలు కుళ్ళిపొతాయి. (6) ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో మబ్బులు పట్టివప్పుడు ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది. (1) కిలో విత్తనానికి 10 గ్రా. సూడోమోనాన్ ప్లోరోసెన్స్ తో విత్తనశుద్ధి చేయాలి. (2) ఉధృతిని బట్టి 3-4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్ట్రైప్టోపైక్లిస్ 1 గ్రా. మరియు రాగి ధాతు సంభందిత మందులు(కాపర్ ఆక్సిక్లోరైడ్) 30 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్ళు తెగులు (1) అర్ధాతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం. ఒక్క రోజులోనే మొక్క చనిపోతుంది. తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి. (2) మొక్కలేని అన్ని ఆకులు పై నుండి క్రింది వరకు వాడిపోయి వ్రేలాడుతు ఉంటాయి. (3) తెగులు సోకిన మొక్కలను తేలికగా పీకివేయవచ్చును. (4) ఎదిగిన మొక్కలు వాడిపోయి ఆకులు పసుపుబారి రాలిపోతాయి. (5) భూమిలో ఉండే శీలీంధ్రం ద్వారా ఈ తెగులు ఆశిస్తుంది. భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు పైరు అన్ని దశల్లో కనబడుతుంది. (1) కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడిలో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. (2) కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రవణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ళ చుట్టు నేలపై పోయాలి. సిఫారసు మేరకు పొటైష్ ఎరువులును తప్పక వాడాలి.
ఫ్యూజేరియం వడల తెగులు (1) మొలక దశలో ఆశించినప్పుడు నానుడు తెగులు లక్షణాలు కనిపిస్తాయి. (2) తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి, మొదట ఈనెల మధ్య పసుపు రంగుగా, తదుపరి ఎర్రగా మారి ఆకులు క్రింది నుండి పైకి ఎండుకుంటు రాలిపోతాయి. (3) కాండంను చీల్చి చూస్తే లోపల నల్లని బూజుతో చారలు కనిపిస్తాయి. ఈ తెగులు ప్రత్తిలో అన్ని దశలలో కనిపిస్తుంది. ఎదిగిన మొక్కలలో పుష్పించే దశలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. (1) కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడిలో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. (2) కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రవణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ళ చుట్టూ నేలపై పోయాలి. (3) సిఫారసు మేరకు పొటాష్ ఎరువులను తప్పక వాడాలి.
వర్టిసీలియం వడల తెగులు (1) ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి, తెగులు తీవ్రమైనప్పుడు కణాలు చనిపోతాయి. పెద్ద పెద్ది నల్లని మచ్చలు ఏర్పడి ఆకులపై పులిచారల వలె కనుపుస్తాయి. (2) ఆకులు కొంతకాలం వేలాడి, పూర్తిగా రాలాక క్రింది భాగంలో ఉన్న మొగ్గలు క్రొత్త ఆకులను, కొమ్మలనిస్తాయి. కాని కాయలు ఏర్పడవు. (3) కాండం మరియు వేరును చీల్చి చూస్తే, లోపల గొధుమ రంగుకు మారి ఉంటుంది. ప్రత్తి తరువాత జొన్న లేదా మొక్కజొన్నతో పంట మార్ప్డి చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడరాదు. సిఫారసు మేరకు పొటాష్ ఎరువులను తప్పక వాడాలి. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సొకిన మొదళ్ళ చుట్టు నేలపై పోయాలి.
అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు (1) అల్టర్నేరియా వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు సుడులుగా, గింగులుగా ఏర్పడతాయి. (2) తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తరువాత దశలలో కాయల మీద కూడ మచ్చలు కనబడతాయి. (3) ఈ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తాయి. మబ్బులతో కూడిన వప్షపు వాతావరణం ఈ తెగులును ఎక్కువగా గమనించవచ్చును. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 గ్రా. ట్రైకోడర్మా విరిడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. లీటరు నీటికి ప్రోరికోనజోల్ 1 మి.లీ. లేదా కాస్టాన్ + హెక్సకొనజోల్ 1 గ్రా. 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు (1) సెర్కోస్పోరా వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రటి మచ్చలు ఏర్పడి చుట్టు ఎరుపు వర్ణం కలిగి మధ్యభాగం తెల్లగా ఉంటుంది. (2) ఈ తెగులు ఎక్కువగా ముదురు రకుల మీద పంట చివరి దశలో కనబడుతుంది. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకొజెబ్ 2.5 గ్రా. లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా కాప్టాన్+హెక్సకొనజోల్ 1 గ్రా. 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి
హెల్మింథో స్పోరియమ్ ఆకుమచ్చ తెగులు ఆకుల మీద తేలిక గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్యభాగం బూడిద రంగుతో చుట్టు ఎర్రటి అంచులు ఏర్పడతాయి. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడర్మా విరిడితో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. లీటరు నీటికి ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేదా కాప్టాన్+హెక్సకొనజోల్ 1 గ్రా. 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి
బూడిద తెగులు లేదా గ్రే మిల్డ్యూ (1) ఆకుల మీద కోణాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడి, బూజు తెగులు శీలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. (2) ఉధృతి ఎక్కువైనప్పుడు బూజూ తెగులు ఆకు పైభాగాన కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి వండుబారి రాలిపోతాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు వ్యాప్తి ఎక్కువగును. లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. కలిపి పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా టెబుకొనజోల్ + ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 0.6 గ్రా. పిచికారి చేసుకోవాలి.
కాయ కుళ్ళు తెగులు (1)ప్రత్తి పెట కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడితే అనేక రకాలైన శీలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. (2) పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా లేదా గాయాల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శీలీంధ్రాలు కాయలోనికి ప్రవేశించి తెగులును కలుగజేస్తుంది. అధిక తేమతో కూడిన వాతావరణం తెగులు ఉధృతి పెరిగే అవకాశముంది. (1) నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడరాదు. (2) ఉధృతిని బట్టి 3-4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్ట్రెప్టోసైక్లిన్ లేదా పౌషామైసిన్ లేదా ప్లాంటామైసిన్ 1 గ్రా. మరియు రాగిధాతు సంభందిత మందులు, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగులు

కాయతొలుచు పురుగులలో శనగపచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు గులాబి రంగు పురుగు ముఖ్యమైనవి. కాయతొలుచే పురుగుల వల్ల ముఖ్యంగా నాన్ బి.టి. ప్రత్తిని సాగుచేస్తున్నప్పుడు ప్రత్తి పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ నాలుగు పురుగులు ఏక కాలంలో పంటను ఆశించవు. పైరు పెరుగుదలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఒకొక్కసారి ఒక్కోరకమైన పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

గులాబి రంగు పురుగు:

ఈ పురుగు గత రెండు సంవత్సరాలుగా బిటి ప్రత్తిని కూడా ఆశించి నష్టపరుస్తుంది. పురుగు ఉధృతి, పంట నష్టం రోజురోజుకూ పెరుగుతుంది. ఈ పురుగు నివారణకు సూచించిన పలు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టివట్లయితే, మున్ముందు బిటి ప్రత్తి సాగు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కావున ప్రస్తుత సమయంలో ఈ పురుగు నివారణ చాలా ముఖ్యం.

లక్షణాలు:

  • తల్ల పురుగు లేత ఆకుల అడుగు భాగాన, లేత కొమ్మలపైన, పూ మొగ్గలపైన, లేత కాయలపైన, రక్షక పత్రాలపైన గుడ్లను గుంపులుగా లేదా విడివిడిగా పెడుతుంది.
  • గుడ్ల నుండి బయటకి వచ్చిన కంటికి కనిపించని చిన్న లార్వాలు పూ మొగ్గ లోనికి తొలుచుకొని పోయి లోపలి పదార్థములను తిని వీటిని గుడ్డి పూలూగా మారుస్తాయి.
  • చిన్న లార్వాలు కాయలపై కనిపించనంత చిన్న రంధ్రాలు చేసి, లోనికి ప్రవేశిస్తాయి. తరువాత కాయలకు చేసిన రంధ్రం పూడిపోయి, పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ దూదిని బాగా నష్టపరుస్తుంది. దూది రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి.
  • పురుగు లార్వా దశ మొత్తం కాయలోనే గడపడం వలన, కాయ పగిలిన తరువాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం.
  • పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక తరువాత పక్వానికి వస్తాయి.

గులాబి రంగు పురుగు ప్రత్తి పంటను నష్టపరుచు విధానం:

గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనబడదు. కాయలు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గుడ్ల నుండి వెలువడిన వెంటనే చిన్న లార్వాలు మొగ్గలపైన లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులోని పదార్థాలను తినడం వలన ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా ముడుచుకోనే ఉంటాయి. వీటినే గడ్డిపూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకున్నపటికీ లోపల అండాశయాలను పుప్పోడిని తినడం వలన నష్టం కలుగుతుంది. ఈ విధంగా తొలి దశలో ఆశించినచో మొగ్గలు పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం గాని, కాయ పరిమాణం పెరగకపోవడం గాని, కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గుడ్డిపూలను, కాయలను తెరిచి లోపలి భాగన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేదా పెద్ద గుsలాబి రంగు గొంగళి పురుగులను గమనించవచ్చు. గులాబి రంగు కాయతొలుచు పురుగు ఆశించిన ప్రత్తలో దూది రంగు, నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది.

నివారణ చర్యలు: సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించి గులాబి రంగు పురుగును నివారించుకోవాలి. ఇవి ప్రధానంగా పంటలేని సమయాన, విత్తడానికి ముందు, పంటకాలంలో మరియు పంట తీసిన తరువాత చేపట్టవలసిన వివిధ చర్యలు.

పంటలేని సమయాన చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

  • ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకొనుట ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చును.
  • గులాబి రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకూడదు. అలా చేసినచో తరువాత పంటకాలంలో దీని ఉధృతి ఎక్కువయ్యే అవకాశముంటుంది.
  • గులాబి రంగు పురుగు ఆశించిన ప్రత్తిని రైతుల ఇళ్ళ వద్ద గాని లేదా జిన్నింగ్ మిల్లు వద్దగాని నిల్వ ఉంచకూడదు.

ప్రత్తి విత్తడానికి ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

  • పంట మార్పిడి పద్దతిని ప్రతి 2 – 3 సంవత్సరాలకొకసారి విధిగా పాటించాలి.
  • తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబి రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
  • బిటి ప్రత్తిని విత్తేటప్పుడు ప్రత్తి చుట్టు 5 వరుసలలో నాన్ బి.టి. ప్రత్తిని విధిగా విత్తుకోవాలి.
  • ప్రత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
  • ప్రత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి.

పంట కాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

  • ప్రత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి బుట్టలలో వరుసగా మూడు రోజులు 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే లేదా 10% పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే పురుగు ఉధృతిని నియంత్రించవచ్చును.
  • లింగాకర్షక బుట్టల ఆధారంగా పురుగు ఉధృతిని అంచనా వేసుకొని, నష్టపరిమితికి చేరే సమయంలో ఎకరాకు 4 కార్డుల ట్రైకోగ్రామా టాయిడియా బాక్ట్రే గుడ్డు పరాన్నజీవిని చేనులో వదులుకోవాలి.
  • పురుగు సష్టపరిమితి స్థాయి దాటిన వెంటనే 5% వేప గింజల కషాయము లేదా 5 మి.లీ. (1500 పి.పి.యమ్) వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
  • క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • పంట కాలంలో ఒకటి లేదా రెడు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మైథిన్ 25% ఇ.సి. 1.0 మి.లీ లేదా లామ్డాపైహలోత్రిన్ 5.0% ఇ.సి. 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు ప్రత్తి పంటపై ఎక్కువ సార్లు పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశముంది.

పంట తీసిన తరువాత చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

  • నీటివసతి ఉన్నపటికీ ప్రత్తిని ఏడు నెలలు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలము పొడిగించుచ ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృతి తొలిదశలోనే ఎక్కువయ్యే అవకాశముంది.
  • నీటివసతి ఉన్నచోట రెండో పంటలుగా ఇతర ఆరుతడి పంటల్ని సాగుచేసుకోవడం వలన పంట మార్పిడి జరగడమే కాకుండా ప్రత్తిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆధాయం పొందవచ్చు.
  • పంట తీసిన తరువాత చేనులో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి.
  • ప్రత్తి మొళ్ళను ష్రెడ్డరుతో గాని, రోటావేటరుతో గాని భూమిలో కలియదున్నాలి.
  • ప్రతి మొళ్లను ఇళ్ళ వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ చేయకూడదు.
  • ప్రత్తి తీసిన తరువాత ఎండిన మొళ్ళను, విచ్చుకొని కాయలను పీకివేసి తగులబెట్టి ఆ తరువాత భూమిలో కలియదున్నుట ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చును.

ఈ విధంగా ప్రత్తిలోని గులాబి రంగు కాయతొలుచు పురుగు నివారణకు దుక్కిదున్నే దశ నుండి చివరి దశ వరకు సమగ్ర యాజమాన్య పద్దతులను పాటించినట్లయితే పురుగు ఉధృతి తగ్గించుకొని అదిక దిగుబడులు సాధించవచ్చును.

టొబాకోస్ట్రీక్ వైరస్

లక్షణాలు:

  • ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
  • వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివర లేత ఆకులు కొద్దిగా పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయు.
  • కొంత భాగము ఆకులు మాడిపోతాయి మరియు కొంచెం వంకర తిరిగినట్లు కుచించుకుపోతాయి.
  • సాధారణంగా వ్యాధి పోకిన కొమ్మల్లో ఎదుగుదల ఆగిపోయి గిడసబారుతాయి. మిగిలిన మొక్క భాగాల్లో పెరుగుదల మామూలుగానే ఉంటుంది.
  • వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వ్యాపించిన కొమ్మకు ఉన్న మొగ్గలు ఎండి రాలిపోతాయి.

తెగులు వ్యాప్తి:

  • కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ పుప్పొడి రేణువుల నుండి ప్రత్తి మొక్కలకు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • తామర పురుగులు కలుపు మొక్కల పూల నుండి రసాన్ని పీల్చినప్పుడు వ్యాధికారక వైరస్ తో కూడిన పుప్పోడి రేణువులు తామర పురుగుల వివిధ భాగాలకు అంటుకుంటాయి.
  • ఈ తామర పురుగులు ప్రత్తి మొక్కలను ఆశించి ఆకులను గీకి తినడం వల్ల ప్రత్తి ఆకుల కణజాలం, పుప్పొడి రేణువులు చీల్చబడి వైరస్ క్రిములు మొక్కలోకి ప్రవేశిస్తాయి.
  • వ్యాధికారక వైరస్ తో కూడిన పుప్పొడి రేణువులు గాలి ద్వారా కూడా ప్రత్తి మొక్కలకు వ్యాపించి ప్రత్తి మీద ఉన్న తీమర పురుగులు ఆకులను గీకి తినడమ వలన కూడా ఈ తెగులు వ్యాప్తి చెందవచ్చు.
  • ఈ వైరస్ తామర పురుగుల ద్వారా ఒక ఆకు నుండి ఇంకొక ఆకు మీదకు వ్యాప్తి చెందలేదు. పుప్పొడి రేణువులు, తామర పురుగులు తప్పనిసరిగా అవసరం.
  • చాలా కలుపు మొక్కలు ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ ను పెంచి పోషిస్తాయి. కలుపు మొక్కల్లో వయ్యారిభామ పాత్ర వైరస్ వ్యాప్తిలో చాలా ప్రధానమైనది. వయ్యారిభామ మొక్కల్లో ఈ వైరస్ ఉన్నప్పటికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వయ్యారిభామ కేవలం వ్యాధికారక వైరస్ వృధి చెందుటకు ఉపయోగ పడుతుంది.

నివారణ చర్యలు:

  • ప్రత్తి పంట పొలంలో మరియు గట్ల వెంబడి ఉండే వయ్యారిభామ, ఉత్తరేణి, గడ్డి చామంతి వంటి కులుపు మొక్కలను పూతకు రాకముందే పీకి తగులబెట్టాలి.
  • ఈ వ్యాధిని అదుపు చేయడానికి కులుపు మొక్కలు పూతకు రాకముందే నివారించడమే ఈ రోగ నివారణకు ఏకైక మార్గం.
  • తామర పురుగులను అరికట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చు.
  • తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. లేదా డైఫెన్ థయీరాన్ 1.25 గ్రా. చొప్పున వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.

హైబ్రిడ్ ప్రత్తి విత్తనోత్పత్తి

  • ప్రత్తిలో ఎక్కువగా హైబ్రిడ్ (సంకర జాతి) రకాల విత్తనోత్పత్తి జరుగుతుంది. ఈ విత్తనోత్పత్తిని అభ్యుదయ పైతులు ప్రైవేటు విత్తన కంపెనీల పర్యవేక్షణలో వాటి అవసరార్థమ విత్తన రేటు కాంట్రాక్టు పద్ధతిలో చేయుచున్నారు. ఆనుకూల పరిస్థితులలో మంచి లాభాలను పొందుతున్నారు.
  • హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఆడ, మగ రకాలను 4:1 నిష్పత్తిలో అనగా నాలుగు వరుసల ఆడ రకానికి ఒక వరుస మగ రకం విత్తనాన్ని విత్తుకోవాలి.
  • విత్తనోత్పత్తి చేసే రైతులు తప్పకుండా నీటి పారుదల వసతి (బోరు/బావి కాని) కలిగి ఉండాలి.
  • విత్తనోత్పత్తిని మంచి బలమైన భూమిలో అన్ని వసతులతో చేసినప్పుడే లభదాయకంగా ఉంటుంది.
  • విత్తనోత్పత్తినిలో ప్రధానంగా ఆడ వరుసలలొని ప్రత్తి పూలను అనగా తెల్లవారితే పువ్వుగా విచ్చుకునే మంచి మొగ్గలను ఎంపిక చేసి వాటిని ముందు రోజు గిల్లుతారు. అనగా మొగ్గ యొక్క ఆకర్క పత్రావళిని మరియు దానికి అంటుకొని లోపల ఉన్న పుప్పొడి సంటుల సముదాయాన్ని మొత్తం చేతిలో తీసి పడేస్తారు. అప్పుడు కేవలం ఆ మొగ్గపై ఆడ పువ్వుకు సంభందించిన అంచకోశం, కీలం, కీలాగ్రం మాత్రమే వుంటాయి.
  • ఈ విధంగా గిల్లిన ప్రత్తి మొగ్గను తొల్లవారి గుర్తించేట్లు పైపర్ ట్యాగ్స్ వేస్తారు. ఈ గిల్లిన మొగ్గల మీద తెల్లవారు ఉదయం 9:30 నుండి 12:00 గంటలలోపు మగ వరుసలలో నుంచి తెంపిన వికసించిన పూలలోని పుర్రోడితో సున్నితంగా అద్దుతారు.
  • ఇలా ఒక మగ పువ్వును 4-5 గిల్లిన మొగ్గల మీద అద్దుతారు.
  • ప్రత్తిలో ఈ విధంగా పూలను 2 నుండి 3 నెలల వరకు గిల్లి అద్దవచ్చును.
  • ఈ విధంగా గిల్లి, పుప్పొడి అద్దిన మొగ్గల నుండి వచ్చు కాయలలో హైబ్రిడ్ ప్రత్తి విత్తనాలుంటాయి.
  • ప్రత్తి కాయలు బాగా తయారయి పగిలిన తరువాత ప్రత్తిని తీసి దానిలోని గింజలను జిన్నింగు యంత్రంలో లేరు చేస్తారు.
  • అలా వచ్చిన హైబ్రిడ్ గింజలను/ విత్తనాన్ని శుద్ధి చేసి, తెగుళ్ళు/ పురుగు మందులను పట్టించి, ప్యాకింగ్ చేసి అమ్ముతారు.
  • హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ఎకరానికి 300-500 కిలోల విత్తనాన్ని పండించవచ్చును.
  • ప్రత్తి పూతలో ఉన్న 60-80 రోజులు. ప్రతీ రోజు ఎకరానికి దాదాపు 10 మంది కూలీలను పెట్టి మొగ్గలను గిల్లించాలి. అలా గిల్లిన మొగ్గలను మరుసటి రోజు ఉదయం మగ పువ్వుల పుప్పొడితో అద్దాలి. మరల సాయంత్రం మొగ్గలు గిల్లాలి. ఈ ప్రక్రియ దాదాపు 2.5 నెలలు కొనసాగాలి. ఆప్పుడే మంచి విత్తన దిగుబడి వస్తుంది.
  • మొక్కల వరుసల మధ్య దూరాన్ని మరియు మొక్కల మధ్య దూరాన్ని, భూమి స్వభావాన్ని మరియు వేసే ప్రత్తి రకాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
  • వీలైనంతవరకు చాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటే మొగ్గలు గిల్లటానికి, అద్దటానికి, మిగితా పనులకు వీలుంటుంది.
  • ఎరువులు మరియు పోషకాల పిచికారి విత్తనోత్పత్తి క్షేత్రానికి సమృద్ధిగా, సమయానుకులంగా వేయవలసి/చేయవలసి వుంటుంది.
  • విత్తనోత్పత్తి క్షేత్రానికి సిఫారసు చేసిన ఎరువుల మోతాదు కంటే 25-30 శాతం మేర ఎక్కువ వేయవలసి ఉంటుంది.
  • విత్తనోత్పత్తి క్షేత్రం మిగిలిన ప్రత్తి క్షేత్రాలకు 50 మీ. దూరంలో ఉండాలి,
  • మేలైన అన్ని సాగు పద్దతులతో పాటు సమగ్ర సస్యరక్షణా పద్దతులను కూడా అవలంభించాలి.
  • నిపుణులు సలహాతో విత్తనోత్పత్తి చేసినప్పుడు మంచి లాభాలు వస్తాయి.
  • ప్రత్తి పంట ప్రస్తుతం మంచి కాత/కాయ తయారయ్యే దశలో వుంది. ప్రస్తుత దశలో పంటను పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, పొగాకు లద్దె పరుగు మరియు ఆకుమచ్చ, బాక్టీరియా నల్ల మచ్చలు, కాయకుళ్ళు మొదలగు తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తున్నాయి. కావున సరియైన నివారణ చర్యలు చేపట్టాలి.
  • 100 రోజులు నాటిన ప్రత్తి పంటకు భూమి ద్వారా ఎరువులు ఆందించవలసిన అవసరం లేదు. కేవలం పైపాటుగా అప్పడప్పడు పోషకాల పిచికారి చేస్తే సరిపోతుంది. దీనికి గాను లీటరు నీటికి 10 గ్రా, మల్టీ-కె (పొటాషియం నైట్రేట్) లేదా పాలీఫీడ్ (19:1919) లేదా 20 గ్రా. యూరియాను 10-15 రోజులకొకసారి పిచికారి చేస్తే సరిపోతుంది.
  • ప్రత్తి పంటను ఎక్కువగా ఆశిస్తున్న ఆకుమచ్చ, బాక్టీరియా నల్లమచ్చ, కాయకుళ్ళు మరియు ఆల్టర్నేరియా ఆకు, కాండం తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. (కార్భండాజిమ్+మాంకోజెబ్ మిశ్రమం) సాఫ్ లేదా కంపానియస్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ + 0.1 గ్రా. సైప్లోసైక్లిన్ మందులను 1 లేదా 2 సార్లు వారం— పది రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
  • కేవలం ఆల్టర్నేరియా కాండం మరియు ఆకు తెగులు ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 1 గ్రా. ప్రాఫికొనజోల్ లేదా 3 గ్రా. క్యాబ్రియోటాప్ మందులను 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
  • ప్రత్తి పంటను ప్రస్తుత దశలో ఎక్కువగా ఆశిస్తున్న పొగాకు లద్దె పరుగు నివారణకు చేనులో కనిపించే పురుగుల సమూహంతో వున్న జల్లెడాకులను ఎప్పటికప్పుడు ఏరివేసి, సమూలంగా నిర్మూలించాలి. దీనితో పురుగు నివారణ సులువు. తదుపరి థయోడికార్చ్ 1.5 గ్రా. లేదా ఇమామెక్లిన్ బెంజోయేట్ (ప్రొక్లెమ్) 0.5 గ్రా. లేదా నొవాల్యురాన్ 1 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను వూరునూ వారం —పదిరోజుల వ్యవధిలో 1-2 సారు పిచికారి చేయాలి.
  • పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 గ్రా. లేదా డైఫెన్తయూరాన్ 1.25 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • గులాబి రంగు పరుగును గమనించినట్లయితే సూచించిన తగు నివారణ చర్యలు చేపట్టాలి.
  • ప్రస్తుతం ప్రత్తి, తీత మరియు కోత దశోలో ఉంది. వర్షాల ప్రభావం తగ్గి, మళ్ళి మంచి పూత, కాపు దశలోకి వచ్చింది. నవంబరు, డిసెంబరు నేలలు పంట దిగుబడికి కీలక మైనవి. కావున సరియైన యాజమాన్య మరియు సస్యరక్షణ మెళకువలు పాటించాలి.
  • ఈ దశలో పంటకు భూమి ద్వారా ఎరువులు అందించవలసిన అవసరం లేదు. కేవలం 10-15 రోజులకోకసారి పైపాటుగా పోషకాల పిచికారీ చేస్తుండాలి. ఇందుకు లీటరు నీటికి 10గ్రా. 19:19:19 (పాలీఫీడ్) లేదా 20గ్రా. యూరియా కలిసి వాడవచ్చు. పోషకాలను మారుస్తూ, అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తుండాలి. పోషకాలను పురుగు మందులతో కలిపి కూడా పిచికారి చేసుకోవచ్చు.
  • ప్రత్తి పంటలో ప్రస్తుతం చాలా చోట్ల గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించి పంటను నష్టపరుస్తుంది. దీనితో పాటు, పచ్చదోమ, తెల్లదోమ, పెనుబంక పంటను ఆశిస్తూన్నాయి. పురుగులతో పాటు తెగుళ్ళు కూడా ముఖ్యంగా బాక్టిరియా అకుమచ్చ, కయకుళ్ళు తెగులు, ఇతర అకుమచ్చలు పంటను ఎక్కువగా ఆశిస్తూన్నాయి. కావున అవసరాన్ని బట్టి సరియైన సస్యరక్షణ చేపట్టల్లి.
  • ప్రధానంగా గులాబీ కాయ తొలుచు పురుగు నియంత్రణకు సరియైన సస్యరక్షణ చేపట్టాలి. దీనికి గాను చేనులో ఇప్పటికి ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలి పెట్టి, పురుగు ఉధృతిని గమనిస్తూ పురుగును కొంత వరకు నియంత్రించవచ్చు.
  • చేనులో కనిపించే గుడ్డిపూలను, పురుగు ఆశించి రాలిపోయిన మొగ్గలను, కాయలను ఎప్పటికప్పడు ఏరి నిర్మూలించాలి. దీని వలన పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. తర్వాత చేసే పిచికారీ బాగా ఉపయోగ పడుతుంది.
  • గులాబీ రంగు పురుగు నివారణకు పై రెండు చర్యలే కాకుండా క్రమం తప్పకుండా మందులను మారుస్తూ పిచికారీ చేయాలి. ఒకసారి పురుగు అదుపులోనికి వచ్చిన తర్వాత 15 రోజులకోకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
  • గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు ముఖ్యంగా ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లేదా ధయోడికార్బ్ 2 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ లేదా క్లోరిపిరైఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రతీ 2 పిచికారీల తర్వాత మూడవ పిచికారి వేపనునేను కాని లేదా 5% వేప కషాయాన్ని కాని కలిపి పురుగు మందు పిచికారీ చేస్తే ఫలితం బాగుంటుంది.
  • పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 1 మి.లీ సైపర్మెత్రిన్ లేదా 1 మి.లీ లామ్డాసిహలోత్రిన్ లేదా 0.5 మి.లీ ఆంప్లిగో (క్లోరాంత్రానిలిప్రోల్ + లామ్డాసిహాలోత్రిన్) గాని ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసి పురుగును నియంత్రించుకోవాలి. సింధటిక్ పైరిద్రాయిడ్ మందులు ఎక్కువ సార్లుకొడితే తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది. కావున అవసరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి మరల ఇతర మందులు పిచికారీ చేయాలి.
  • ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చేసే పిచికారిలను ఉదయం 12 గతలలోపు మరియు సాయంత్రం 4 గంటల తర్వత మాత్రమే చేయాలి. అప్పుడే పురుగు నియంత్రణ బాగా అవుతుంది.
  • సాధారణంగా ఒకసారి పురుగు కాయలోకి ప్రవేశించిన తర్వత ఎ మందులు పిచికారీ చేసిన ఫలితం అంతగా ఉండదు. కావున పైరు పూత, పిందే, లేత కాయల దశలు పురుగు నియంత్రణకు అనుకూల దశలు. ఈ దశలో పిచికారీ చేస్తే పురుగు నియంత్రణ సులువు.
  • ప్రత్తిని ఆశిస్తూన్న తెల్లదోమ, పచ్చదోమ మొదలగు వాటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా డైఫేన్ త్యురాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఎక్కువుంటే పురుగుమందుతో పాటు వేపకషాయం లేదా వేపనునేను కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 10-15 పసుపు రంగు జిగురు కార్డులు పెట్టాలి. బాక్టిరియా ఆకుమచ్చ, కాయకుళ్ళు తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ తో పాటు 0.1 గ్రా. స్ట్రెప్లోసైక్లిన్ లాంటి యంటిబయోటిక్ను కలిపి పిచికారీ చేయాలి.
  • 2 లేదా 3 పురుగు మందులు ఒకేసారి కలిపి పిచికారి చేయకూడదు.
  • పంట పేరుగుడలకు సూచించిన పోషకాలను మాత్రమే పిచికారీ చేయాలి. బయో మందులను పిచికారి చేయ కూడదు.

ప్రత్తి సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ:ప్రధాన శాస్తవేత్త (ప్రత్తి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్. ఫోన్ నెం. 9866962634

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate