పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అమృతపాని

ఈ విభాగంలో అమృతపాని గురించి వివరించబడింది.

ఇది ఒక ద్రవరూపంలో తయారు చేయబడే సేంద్రియ/జీవన ఎరువు. దీనిని అప్పటి కప్పుడు తయారు చేసికొని వాడవచ్చును.

కావలసిన పదార్థములు

తాజా ఆవు పేడ 10 కిలోలు
తేనె 500 గ్రా.
ఆవు నెయ్యి 250 గ్రా.
నీరు 200 లీటర్లు

తయారు చేయు పద్ధతి

  1. ముందుగా ఆవుపేడను, తేనె ను చిక్కగా కలపాలి.
  2. తరువాత ఆవు నెయ్యిని వేసి ఎక్కువ వేగంగా కలియబెట్టాలి.
  3. ఈ కలిపిన ముద్దను 200 లీటర్ల నీరు ఉన్న తొట్టిలో కలపాలి.

వాడు పద్ధతి

ఈ కలియ ఉంచిన మిశ్రమమును విత్తుటకు ముందుగా ఒక ఎకరములో చల్లాలి. రెండవ మోతాదును ఒక నెల రోజుల పైరుకు సాళ్ళ మధ్యలో చల్లటం గాని లేదా సాగు నీటితో కలిపి గాని పారించాలి.

విస్తీర్ణము : ఇది ఒక ఎకరమునకు సరిపడును.

 

 

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

3.01118881119
prasad Jul 02, 2016 01:10 AM

ఉపయోగాలు సూచించడం మరిచారు. పూర్తి వివరాలు అందిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

prasad Jun 11, 2016 12:45 AM

ఎందుకు వాడాలో తెలియపరచ బడలేదు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు