పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కౌపాట్ గుంత తయారీ

కౌపాట్ గుంత ద్వారా ఎరువుతయారీ

కావలసిన పదార్థములు

గుంత 3క్స x 2 x 1.5 అడుగులు
ఆవుపేడ 60 కిలోలు
గ్రుడ్ల పెంకుల పొడి 250గ్రా.
రాక్ డస్ట్ /బోస్ మీల్ 500 గ్రా
బి.డి సెట్ 502-507
బెల్లం 250 గ్రా

గుంత తయారీ :

నీరు నిల్వ ఉండకుండా, నీడ ఉండి మంచి గాలి సోకు ప్రదేశములో 3X2X1.5 అడుగుల విస్తీర్ణములో ఇటుకలతో ఒక తొట్టిని నిర్మించాలి. తొట్టి అడుగు భాగమును ఆవు పేడతో అలకాలి.

తయారు చేయుపద్ధతి :

 1. ఆవుపేడ బాగా మర్థన చేయాలి
 2. కోడిగ్రుడ్ల పెంకుల పొడిని, రాక్ పౌడరు/ బోన్ మీల్ ను ఆవుపేడ మీద చల్లి బాగా కలపాలి.
 3. 2 లీటర్ల నీటిలో బెల్లమును కలిపి ఆ నీటిని పైమిశ్రమముపై చల్లాలి.
 4. పిదప ఈ పేడ మిశ్రమమును ముందుగా నిర్మించుకున్న గుంతలో వేసి 4-5 లీటర్ల నీటిని చిలకరించి 10-15 నిముషములు బాగా కలపాలి.
 5. పేడ మిశ్రమము మీద 2 అంగుళములు లోతుగల 5 రంధ్రము లను చేసి బి.డి 502 నుండి 506 లను కూర్చాలి.
 6. బి.డి 507ను ఒక లీటరు నిటిలో కలిపి 15 నిముషాములు తరువాత గుంతలోని మిశ్రమముపై చల్లాలి.
 7. తడిపిన గోనె సంచిని పై మిశ్రమము మీద గుంతలో కప్పాలి.
 8. నెలలో రెండు సార్లు ఈమిశ్రమానిని బాగా కలియబెట్టాలి.

తయారీ సమయము :

ఈ కౌపాట్ కంపోస్టు లేదా యస్ – 9 తయారగుటకు 60-70 రోజుల వ్యవధి పట్టును.

ఎరువు మోతాదు :

ఒక తొట్టి నుంచి 30 కిలోల కౌపాట్ గుంత ఎరువు తయారగును

నిల్వ ఉంచు పద్ధతి :

ఈ సేంద్రియ ఎరువును మట్టి కుండలో, చీకటి ప్రదేశములో నిల్వ ఉంచాలి. 6 నెలల లోపు పంటకు వాడాలి. నిల్వ ఉంచినపుడు కూడా తేమను కాపాడాలి.

ఎరువు వాడు పద్దతి :

ఒక ఎకరము విస్తీర్ణమునకు 5 కిలోల ఎరువును 20 లీటర్ల నిటిలో కలిపి ఒకరాత్రి నాననివ్వాలి. మరుసటి రోజు సవ్య దిశలో (clock wise ) అప సవ్యదిశలో (anti clock wise ) 20 నిముషాములు కలియ బెట్టి సన్నని గిడ్డతో వడపోయాలి.దీనికి మరల 50 లీటర్ల నీటిని కలిపి పంట పై ఈ క్రింద ఉదహరించిన విధంగా పిచికారీ చేయాలి.

2-3 ఆకుల వయసులో ఉన్నపుడు ఒక సారి
పూత సమయములో రెండవసారి
కోతసమయములో మూడవసారి

విత్తన శుద్ధి/ వేరు శుద్ధి :

 1. ఈ ఎరువును 2 శాతము బెల్లం నీటిలో కలిపి విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేయాలి.
 2. నారును నాటుటకు ముందుగా వేళ్ళను ద్రావణములో ముంచి, నిడలో ఆరబెట్టి నాటుకోవాలి.

పని చేయు విధానము :

 1. కౌపాట్ గుంత ఎరువు పంటమీద రెండు విధాలుగా పనిచేస్తుంది.
 2. 75-90 రోజులు ఎరువు మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
 3. 120 రోజులు ఎరువు భూమిలోని పోషక విలువలను పెంచుతుంది.
 4. సేంద్రియ ఎరువులలో వున్న హార్మోన్లు సబ్ టిలిన్ ఒక్క పోషక విలువలు పెంచుటే కాకుండా, పంట ఎదుగుదలకు మరియు రోగనిరోధక శక్తిని పెంచుటకు మధ్య సత్సంబంధము ఏర్పడేలా పనిచేస్తుంది.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

3.00801165331
prasad Jun 10, 2016 11:41 PM

ఈ సైట్ లో మీరు వివరించిన వివిధ అంశాలు చాలా అర్ధవంతంగా రైతులకు అర్దమయ్యె రీతిలో ఉన్నాయి. మా లాంటి క్రొత్త వారికి చాలా ఉపయుక్తముగా ఉంది. ప్రధానంగా ఎరువును తాయారు చేసి నిల్వ చేసే పద్దతే గాకుండా, ఏ మోతాదులో వాడాలో, ఎలా, ఎప్పుడు వాడుకోవాలో మీరు వివరించిన విధానం చాలా అద్బుతం, సంతోషం. కృతఙ్ఞతలు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు