పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వర్మికంపోస్టు తయారీ

వర్మీకంపోస్టు తయారీవిధానము

పాక/బెడ్ ల తయారీ

 1. పాక సుమారుగా 300చ.అ.(20X15అ) వైశాల్యములో నిర్మిస్తే 15X3X1½ అ.ల బెడ్ లు మూడు పెట్టుటకు వీలవుతుంది. ఈ బెడ్ల అదుగు బాగం గట్టిగా ఉండుటకు15 సెం.మీ. మందంలో రాళ్ళు, కంకర, ఇటుక ముక్కలు వేసి,దిమ్మిశ కొట్టాలి.
 2. ఈ విధంగా ఏర్పరచుకున్న బెడ్ లపై సుమారు 45 సెం.మీ మందం వరకూ పాక్షికంగా కుళ్ళిన వ్యర్థపదార్థాలు పరవాలి.
 3. దీనిపై 5 – 10 సెం.మీ.మందం పేడను వేసి బెడ్ మొత్తం నీటితో తడపాలి.
 4. ఎల్లప్పుడూ 50 -60 శాతం తేమ ఉండేలా జాగ్రత్త పడాలి.
 5. ఈ విధంగా వారం వరకు తేమ సరిపోయేలా నీటిని చల్లుతు వారం తర్వాత బెడ్ పై బొరియలు చేయని వానపాములను ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వదలాలి.
 6. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలకు వెళతాయి. ప్రతి రోజూ తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి.
 7. బెడ్ పైన తడిపిన పాత గోనె సంచులను పర్చిన తేమను కాపాడటమే గాక వానపాములను పక్షులు, చీమల నుండి కపాడవచ్చు. కోళ్ళ బెడద లేకుండా జాగ్రత్త పడాలి.

కాల వ్యవధి

సాధారణంగా 2 – 3 నెలల్లో వర్మికంపోస్టు తయారవుతుంది.

తయారయిన కంపోస్టు తీయు పద్ధతి

 1. బెడ్ నుండి వర్మి కంపోస్టు తీయడానికి 4,5 రోజుల ముందు నుండి నీరు చల్లడం ఆపివేయాలి.
 2. ఈ విధంగా చేయటం వలన వాన పాములు తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి అడుగు భాగంలో చేరతాయి.
 3. బెడ్ పైన గోనె సంచులను తీసివేయాలి. ఎరువును చిన్న, చిన్న కుప్పలుగా చేసికొని 2-3 సెం.మీ. జల్లెడతో జల్లించి సంచులలో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.

వాడు పద్ధతి

ఒక ఎకరానికి ఒక టన్ను వర్మికంపోస్టు ఎరువు వేయాలి. వర్మికంపోస్టు అన్నిరకాల పంటలకు వేసుకోవచ్చు.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

3.00067888663
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు