పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సేంద్రీయ ఎరువులు

ఈ విభాగంలో సేంద్రీయ ఎరువులు గురించి వివరించబడింది.

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఉత్పాదకత, రైతులను, శాస్త్రవేత్తలను, పర్యావరణ వేత్తలను నేడు తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఆహార అవసరాలను తీర్చటానికి అభ్యమయ్యే వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమిత వనరులతో అధిక ఉత్పాదకత సాధించ గలగాలి. ఈ కోణంలో చూస్తే వ్యవసాయ భూముల యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం అధికమైన దరిమిలా రైతులు సాంప్రదాయకంగా వాడిన సేంద్రీయ ఎరువులను విస్మరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిరోధించలేక పోయినా తగ్గించటానికి ప్రయత్నం చేయాలి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల రసాయనిక ఎరువులకయ్యే ఖర్చు తగ్గటమే కాకుండా భూసారం పెరిగి, భూ భౌతిక స్థితిగతులు మెరుగుపడి మొక్కలు ఏపుగా పెరిగి, పంటల దిగుబడులు పెరుగుటతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుటకు, వాతావరణ కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది.

సేంద్రీయ ఎరువులు తయారికి వాడు పదార్థములు: వ్యర్థపదార్థములు

వ్యవసాయ వ్యర్థపదార్థములైన మొక్కల అవశేషాలు, రాలిన ఆకులు, పచ్చి ఆకులు, ఎండు గడ్డి, పనికి రాని పార వరి గడ్డి, పంట మొదళ్ళు, వేర్లు, పొట్టు, పశువులు తొక్కిన చొప్ప, పనికిరాని, కుళ్ళిన కాయగూరలు, పండ్లు మొదలగునవి.

పశువుల పేడ

ప్రతి టన్ను వ్యర్థ పదార్థములకు 100 కిలోల అవసరము

మక్కిన పశువుల ఎరువు :

అవసరానిని, వీలును బట్టి రెండు, మూడు తట్టల ఎరువును వేసిబాగా కలియబెట్టడం వలన నాణ్యమైన ఎరువు త్వరగా తయారయ్యే అవకాశము ఉంటుంది.

సూపర్ ఫాస్పేట్ / రాక్ ఫాస్పేట్

కంపోస్టు త్వరగా కుళ్ళడానికి దోహద పడుతుంది. ప్రతి టన్ను చెత్తకు 40 – 50 కిలోల వరకు వాడాలి.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

3.00710227273
prasad Jun 10, 2016 11:53 PM

ఉపయుక్తముగా ఉంది.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు