హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / జొన్న - విలువ ఆధారిత ఉత్పత్తులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జొన్న - విలువ ఆధారిత ఉత్పత్తులు

జొన్న - విలువ ఆధారిత ఉత్పత్తులు.

సాధారణంగా జొన్నపంట మెట్ట వాతావరణం లోను మరియు అల్ప భూసార ప్రాంతాలకు పరిమితమై అక్కడ ప్రజల యెక్క ఆహార అవసరాలను మరియు పాడి పశువుల చొప్ప అవసరాలను తీరుస్తూ తరతరాలుగా కొనసాగించబడుతుంది. జొన్న ఆరోగ్యపరంగా వరి, గోధుమల కంటే నాణ్యమైనది. ఎందువలనంటే దీనిలో పీచు పదార్ధం అధికంగా ఉండి జీర్ణించబడుటకు ఎక్కువ సమయం పడుతుంది.

జొన్నలు ఆహారంగా (ప్రత్యేకంగా ఖరీఫ్ జొన్న) వాడుక క్రమేణ తగ్గడం వల్ల ఇతర ప్రత్యేక అదనపు అవసరాల కొరకు వాడుబడుచున్నది. దీనివలన గింజ, చొప్ప దిగుబడితో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వలన రైతుకు అదనపు ఆదాయం చేకూరడమే కాక జొన్న సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. జొన్నలో అనేక పోషక విలువలు ఉండటం, గ్లూతిం లోపించటం, ఫినల్ పదార్ధాలు కలిగి ఉండటమే కాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం వల్ల మార్కెట్ లో జొన్నకు డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. దీనితో పాటుగా ఆధునికి పద్ధతులైన మ్లటింగ్, బ్లంచింగ్, డ్రైహిటింగ్, ఆమ్లంతో చర్య మొదలగు వాటి వల్ల జొన్న మొత్తం జొర్ణం అయ్యే చర్య మరియు నిల్వ సామర్ధ్యం పెరగడం వల్ల జొన్న వాడకం ఆధునికి కాలంలో గణనీయంగా పెరిగింది.

జొన్నని మెత్తగా పిండిలాగా తాయారు చేసుకొని దాని నుండి కేకులు, బ్రేడ్ మరియు బిస్కట్లు తాయారు చేయవచ్చు. నూటికి నూరుశాతం జొన్న పిండిని ఉపయేగించి కేకుని తయారుచేయవచ్చు. జొన్నకు ఉండే సహజమైన తీపి వల్ల కేకు తయారీలో పంచదార వాడకం తగ్గి తద్వారా కేకు తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అన్ని రకముల కేకులు జొన్నపిండితో తయారుచేయవచ్చు. మైదాతో చేసిన కేకు కన్నా, జొన్న కేకు రుచినా ఉండి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 60 శతం జొన్న పిండితో 40 శాతం మైదాపిండిని కలిపి బ్రేడ్ తాయారు చేయవచ్చే. జొన్నలో గ్లుటిన్ అనే పదార్ధం లోపించడం వల్ల పిండి జిగురుగా ఉండదు.

జొన్నతో తయారైన బ్రేడ్ రెండురోజులు మాత్రమే మెత్తగా ఉండి, తర్వాత ఎండి రాస్కుల రుచి వస్తుంది. ఇందువల్ల రాస్కుల తయారీకి జొన్న అనువైనది. 75 శాతం జొన్నపిండి, 25 శాతం మైదాతో మిత్రమంగా చేసి నిస్కట్లు తాయారు చేయవచ్చు. ఇవి దాదాపుగా నెల రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేకాక జొన్నతో పేలాలు చేయవచ్చు. పేలాలు, అటుకులు అల్పాహారంగా పట్టణ ప్రాంతాల్లో భుజించడం వల్ల కుటీర పరిశ్రమగా పేలాలు, అటుకులు తయారీని నిరుద్యోగులు చేపట్టవచ్చు.

జొన్నతో పై ఆహార పదార్ధాలు కాకుండా జొన్న వారిమాసెల్లి, జొన్న నూడుల్స్, జొన్న ప్లెక్స్  తాయారు చేసుకోవచ్చు. సోయాబీన్ ను జొన్న ఉత్పత్తులతో కలిపి వాడటం వల్ల లైసిన్ ఎక్కు శాతం జొన్న పెరగడమే కాకుండా సుష్మి పోషకాల లోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఈ విధంగా జొన్నతో చేసిన ఆహార పదార్ధాలన్నింటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అన్ని వయసులవాళ్ళు వీటిని ఉపయేగించి ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.09090909091
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు