హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / శనగ విత్తనోత్పత్తిలో మెళకువలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శనగ విత్తనోత్పత్తిలో మెళకువలు

శనగ విత్తనోత్పత్తిలో మెళకువలు.

మన రాష్ట్రంలో శనగను రబీలో వర్షాధారంగా పండిస్తారు. ఇది సాధారణంగా మొక్కజొన్న, సోయాచిక్కుడు, పెసర లేదా మనుము తర్వాత వేసే పంట. మన రాష్ట్రంలో సుమారుగా 1 లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతూ 1200 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. ఇది గద్వాల్, కామారెడ్డి, జోగులాంబ, సంగారెడ్డి మరియు ఆదిలాబాద్ జిల్లాలలో సాగు చేస్తున్నారు.

శనగలో అధిక దిగుబడిని సాధించాలంటే నాణ్యమైన విత్తనం వాడటం ఎంతో అవసరం. ఈ పంటలో నాణ్యమైన విత్తనం వాడకపోతే దిగుబడులు తగ్గటంతో పాటు అధిక చీడ పీడలు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రైతులు విత్తనోత్పత్తిలో తగిన మెళకువలు పాటిస్తే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.

విత్తనోత్పత్తిలో యాజమాన్య పద్ధతులు

విత్తన సేకరణ

విత్తనోత్పత్తిదారులు పండించవలసిన రకాన్ని సర్తెనా తరగతికి చెందిన పునాది విత్తనాన్ని నమ్మకమైన విత్తన సంస్ధల నుండి సేకరించాలి.

విత్తన శుద్ధి

విత్తనాన్ని విత్తుకునే ముందు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. ధైరం లేదా కష్టాం లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ తో విత్తనశుద్ధి చేయాలి.

విత్తన మేతదు

శనగలో విత్తన బరువును బట్టి విత్తన మేతదు మారుతుంది.

విత్తు సమయం

అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుటకు అనువైన సమయం.

వంద విత్తనాలు బరువు విత్తన మేతదు (కి/ఎకరా)
20 గ్రా. ఉ: జె.జి.315 20-25
20-30 గ్రా. ఉ: జేజి 11, జెఇకేయ్ 9218 25-35
30-40 గ్రా. ఉ: కెఎకె-2, ఎల్ బిజీ - 7 35-45
40 గ్రా. ఉ: జేజికె - 3 45-60

శేత్రం మరియు నెలలు

విత్తనోత్పత్తికి ఎంచుకున్న శేత్రంలో క్రితం పంట, శనగ అయి ఉండకూడదు. ఒక వేళా వేసినట్లయితే ప్రస్తుతం విత్తనోత్పత్తి చేసే రకమై ఉండాలి మరియు ధ్రువీకరణ ప్రమాణాలకు లోబడి పండించే శేత్రం అయి ఉండాలి, లేని యెడల క్రితం పంట విత్తనాలు మేలుకైత్తి జన్యుస్వచ్ఛత దెబ్బతినే అవకాశం ఉంది. నల్లరేగడి నెలలు శనగ పండించుటకు అనువైనవి.

ఎరువు యాజమాన్యం

విత్తటానికి ముందు ఎకరాకు 2 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పోటాష్ మరియు 40 కిలోల గంధకం ఇచ్చే ఎరువులను వేయాలి.

సుష్మపోషకాలైన సల్పర్, జింక్, ఇనుము మరియు మాలిబ్డినమ్ ముఖ్యపాత్రను పోషిస్తాయి. కనుక వీటి లభ్యతను బట్టి వాడుకోవాలి.

నీటి యాజమాన్యం

కొమ్మలు వేసే దశ (విత్తిన 35 రోజులు) మరియు గింజ కట్టే దశ (విత్తన 55-65 రోజులు) లలో నీటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు.

అంతరాదురం

గరిష్ట జన్యుస్వచ్ఛత గల విత్తనం పండించాలంటే విత్తనోత్పత్తి శేత్రం చుట్టూ అదే పంటకు చెందిన వేరే రకాలు ఉండకూడదు. ఆలా ఉన్నట్లయితే వేరే రకాల పుప్పొడి రేణువులు ఈ రకంతో ఫలదీకరణ చెంది జన్యుస్వచ్ఛత దెబ్బతిమ్టుంది. శనగలో నాణ్యమైన విత్తనం పండించాలంటే ఇతర రకాల శేత్య్రాల నుండి కనీసం 5 మీ. అంతరాదురం పాటించాలి.

కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆకులు  పచ్చబరి రాలడం, కాయలు పసుపుగా మరి మొక్కలు ఎండి, గింజ గట్టగా అయినప్పుడు కోతకు అనుకూలమైన సమయం. కోసిన మొక్కలను పొలంలో విత్తనం బాగా ఎండ్ వరకు ఎండబెట్టి నూర్పిడి యాంత్రికంగా లేదా చేతితో గాని చేయాలి. నూర్చిన తర్వాత విత్తనాన్ని పల్చని పోరా వాలే పరచి 8% తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి.

ఎండిన విత్తనాలతో ఉన్న జడ పదార్ధాలను, మట్టిబెడ్డలు, రాళ్ళూ, ఇతర రకాల పంటల విత్తనాలు, చిన్న మరియు దెబ్బతిన్న విత్థనాలు, చిన్న మరియు దెబ్బతిన్న విత్తనాలను లేకుండా శుభ్రవరచాలి. ఈ విత్తనాలను ప్రత్యేకమైన ప్రోసెసొంగ్ యంత్ర లలో శుభ్రపరచాలి.

శుభ్రపరిచి విత్తనాలను క్రొత్ర సంచులలో నిల్వ చేసుకోవాలి. విత్తన సంచులను ప్యాలెట్ పై ఉంచాలి ఎప్పుడు నేలపై ఉంచరాదు. నిల్వ చేసిన గోదాములలో తేమ మరియు ఆర్ద్రత ఎప్పుడు నియంత్రణలో ఉండేటట్టు చూసుకోవాలి లేని యెడల చీడపీడల ఉదృతి పెరిగి విత్తనం దెబ్బతినే అవకాశం ఉంది.

శనగ విత్తన నాణ్యత ప్రమాణాలు

నాణ్యత ప్రమాణం మూలా విత్తనం ధృవీకరణ విత్తనం
భౌతిక స్వచ్ఛత (గ)% 98 98
వ్యర్ధ పదార్ధం (గ)% 2 2
ఇతర పంట విత్తనాలు (గ) ఉండకూడదు ఉండకూడదు
ఇతర గుర్తించ దగ్గ రకాల (గ) 5/కిలో 10/కిలో
ఇతర కలుపు మొక్క విత్తనాలు ఉండకూడదు ఉండకూడదు
మొలక శాతం (క)% 85 85
తేమ శాతం-నార సంచాలు (గ)% 9 9
తేమశాతం-గాలి చొరబడని సంచాలు (గ)% 8 8

ఆధారం: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.14285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు