অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మంచి నిర్వహణ పద్ధతులు

మంచి నిర్వహణ పద్ధతులు

సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే రొయ్యల పెంపకం - మంచి నిర్వహణ పద్ధతులు

సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే రొయ్యల పెంపకం - మంచి నిర్వహణ పద్ధతులు

రొయ్యల చేరువులో రొయ్య పిల్లలను వదలడానికి ముందుగా చెరువుకు బాగా ఎండసోకనివ్వడం-ఇతరత్రా సిద్ధంచేయడం

ముందుగా, చెరువును తగినవిధంగా సిద్ధంచేసుకోవడమనేది చేపల , రొయ్యల పెంపకంలో తప్పనిసరిగా పాటించవలసిన ప్రాథమికచర్యలలో ఒకటి. నేలలో వుండే రోగకారకాలను తొలగించడంకోసం చెరువుగా ఉపయోగించే నేలను బాగా దున్ని, ఎండకు బాగా ఆరనివ్వాలి. తర్వాత చీడపురుగులను, బదనికలను (పరాన్నజీవులను) తొలగించాలి. చెరువు నేలలో, నీటిలో భాస్వరం (pH) , పోషకాలు గరిష్ఠ స్థాయిలో వుండేలా చూడడంకోసం సున్నం, సేంద్రియ ఎరువులు, సేంద్రియేతర రసాయనిక ఎరువులను వేయాలి.

గ్రామానికి, చేపల చెరువులకుమధ్య కొంత దూరం వుండేలా చూడాలి

రొయ్యల కేంద్రాలకు సులువుగా ప్రజల రాకపోకలకు వీలుగా, పక్క పక్కనేవుండే రొయ్యల చెరువులకు ఒకదానికి, మరొకదానికి మధ్య తగినంత ఖాళీ జాగా వుండేలా శ్రద్ధ వహించాలి. చిన్న రొయ్యల చెరువులైతే, ఒకదానికి, మరొకదానికి మధ్య కనీసం 20 మీటర్లు, పెద్ద చెరువులైతే 100-150 మీటర్ల ఎడం వుండాలి.ఇంతేకాకుండా పెద్ద చెరువులవద్ద మధ్య మధ్య, నిర్ణీత దూరానికి నిర్ణీత ఖాళీ జాగాలు వదలాలి.

రొయ్యల చెరువులోని వ్యర్ధ జలాలను మళ్లించే చెరువులలోను , కాల్వలలోను సముద్ర తీరాలలో పెరిగే ఆల్గేలాంటి మొక్కలను, మడ అడవుల చెట్ల మొక్కలను , జంట చిప్పల జలచరాలను (బై వాల్వ్స్‌ను) పెంచాలి.

రొయ్యల చెరువులలోని వ్యర్ధ జలాలను నేరుగా బహిరంగ జలాశయాలలోకి పంపకూడదు.వ్యర్ధ జలాలను ద్వితీయ స్థాయి వ్యవసాయానికి, ముఖ్యంగా, ముత్యపు చిప్పలు,ఆహారంగా ఉపయోగపడే మ్యూజిల్స్ (జంట చిప్పల జలచరాలు),ఆల్గేలాంటి మొక్కలు , ఫిన్ చేపలను పెంచడానికి ఉపయోగించాలి. వ్యర్ధ జలాల కాల్వలలో మడ అటవీ మొక్కలను కూడా పెంచవచ్చు. ఈ చర్యలు రొయ్యల చెరువులో నీటి నాణ్యత మెరుగుపడడానికి, చెరువుపై సేంద్రియ అవశేషాల భారం తగ్గడానికి తోడ్పడడమేకాకుండా; రైతుకు అదనపు ఆదాయాన్నికూడా అందిస్తాయి.

చెరువులో నేల, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలి

చెరువులోని నీటి నాణ్యత గరిష్ఠంగా వుండేలా చూడడంకోసం, నీరు, నేల నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలి. చెరువులోని నీటిని మారుస్తుండాలి, అయితే,నీటి నాణ్యతలో ఎక్కువ హెచ్చుతగ్గులులేకుండా జాగ్రత్తవహించాలి. హెచ్చుతగ్గులు ఎక్కువైతే, రొయ్యలను ఒత్తిడికి గురిచేస్తాయి. చెరువు నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణాన్ని ఉదయంపూట పెందలాడే కొలవాలి. చెరువులో కాలుష్యం చేరకుండా శ్రద్ధ వహించాలి.

రొయ్య పిల్లల పెంపకం కేంద్రాలనుంచి నాణ్యమైన రొయ్యపిల్లలనే తెచ్చుకోండి

చెరువులో వదలడానికి,రిజిస్ట్రేషన్‌వున్న , రొయ్యపిల్లల (సీడ్) పెంపకం కేంద్రాలనుంచి, ఆరోగ్యవంతమైన, ఎలాంటి వ్యాధిసోకని రొయ్యలనే తెచ్చుకోవాలి. రొయ్య పిల్లల ఆరోగ్య స్థితిని అంచనావేయడానికి పి సి ఆర్ వంటి ప్రమాణిక పరీక్షా విధానాలను పాటించండి. బహిరంగ నీటి వనరులనుంచి సేకరించిన రొయ్య పిల్లలను చెరువులలో పెంపకానికి ఉపయోగించవద్దు. బహిరంగ నీటి వనరులలోని జలచరాల వైవిధ్యాన్ని ఇది దెబ్బతీస్తుంది.

చెరువులో రొయ్య పిల్లల సాంద్రత మరీ ఎక్కువగా లేకుండా చూసుకోండి

చెరువులో రొయ్య పిల్లల సాంద్రతకు, ఆ నీటిలో వ్యర్ధపదార్ధాలు చేరే స్థాయికి ఎంతో సంబంధం వుంటుంది. చెరువులో రొయ్యలను దట్టంగా వదలడం వాటిపై ఒత్తిడిని పెంచి, వ్యాధులు ఎక్కువగా సోకడానికి కారణమవుతుంది. అందువల్ల,సాంద్రత తక్కువ వుండేవిధంగా రొయ్య పిల్లలను వదలాలని సిఫారసు చేయడం జరిగింది. అంటే, మెరుగుపరచిన సాంప్రదాయిక చెరువులలో ఒక చదరపు మీటరు విస్తీర్ణానికి 6 , విస్తరించిన (ఎక్స్ టెన్సివ్) చెరువులలో ఒక చదరపు మీటరు విస్తీర్ణానికి 10 వంతున వదలాలి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate