অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సస్యరక్షణ

ఏమి చేయాలి?

  • రసాయన పురుగుల మందుల వినియోగం కంటే జీవన పురుగు మందులకు ప్రాదాన్యత ఇవ్వాలి.
  • ఏదేవి పురుగుల మందుల వినియోగం చేయటానికి ముందే శత్రు మిత్ర పురుగుల నిష్పత్తిని రైతులు సమగ్ర సస్య రక్షణ విధానాలపై అంచనా వేసుకోవాలి. (ఏఎస్ ఈఏ విశ్లేషణ చేసుకోవాలి).
  • హానికారక క్రిములను చంపే మిత్ర పురుగులను పెరుగుటకు ఇష్టపడే పంటలను అంతర పంటలుగా, కంచె వేయాలి.
  • వేసవి కాలములో భూమి లోతుగా దున్నడం చేయాలి.
  • హానికారక క్రిములను పురుగులను నిరోధించే బి.టి. ప్రత్తి లాంటి పంటలని వేయాలి . హానికారక పురుగులను ఉధృతి నిరోధించే పద్దతులైన పంట మార్పిడి అంతర పంట మరియు ఎర పంటలను వేసుకోవాలి.
  • దీపపు ఎరలు / స్టిక్కి ట్రాప్స్ / లింగాకర్షక ఎర ఉపయోగించి పురుగుల పర్యవేక్షణ చేసి పురుగుల ఉధృతి తగ్గించుటకు చర్యలు తీసుకోవాలి.
    • పైన పేర్కొన్న నివారణలు ఫలవంతము కానపుడు శాస్త్రవేత్తల సలహా మెరకు రసాయన పురుగు మందులు క్రింద కనబరచిన జాగ్రత్తలు పాటిస్తూ ఉపయోగించండి.
    • రసాయన పురుగు మందులు వినియోగించే ముందు సురక్షిత జాగ్రత్తలు పాటించండి.
    • రసాయన మందులు చల్లే సమయంలో చేతులకు ముఖానికి ఎల్లపుడూ తొడుగులు ధరించాలి.
    • గాలి వీచే దిశను చూసుకొని దానికి అనుకూల దిశలోనే రసాయన మందులు పిచ్చికారి చేయాలి. పురుగు మందుల తుంపర మన పై పడకుండా జాగ్రత్తగా వహించండి.
    • చిన్న పిల్లలకు పెంపుడు జంతువులకు అందకుండా వుంచండి. పురుగు మందులను స్ప్రెయర్లను తాళం వేసి భద్రపరచండి.
    • పురుగుల మందుల కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్ మరియు చలామణి తేదీని చూసుకోండి
    • ఏదేని పురుగుల మందు చే విషపూరితం అయినపుడు వెంటనే వైద్యుని సంప్రదించండి. మీ వెంట కాళి లిపురుగు మందుల డబ్బాను, పురుగు మందకు సంబందించిన సమాచారాము తీసుకొని వెళ్ళండి .
    • పురుగు మందులకు కరపత్రములో పేర్కున్న విధముగా పురుగుల మందులను వాడండి.
    • కరపత్రములో పేర్కున్న విధముగా ఖాళీ పురుగు మందుల డబ్బాలను ధ్వంసం చేయండి.

మీరు ఏమి పొందుతారు?

క్రమ

సంఖ్య

సహాయము యొక్క వివరములు

సహాయము యొక్క పరిమాణము

పథకం / కాంపొనెంట్

1

డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటినే అండ్ స్టోరేజ్ , ఫరీదాబాద్ , హర్యానా, దీని ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించిన 31 ఐపిఎం కేంద్రాల ద్వారా రైతుల ప్రయోజనం కోసం వివధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి.

 

నేషనల్ మిషన్ ఆఫ్ అగ్రికల్చ్రర్ ఎక్సెన్షన్ అండ్ టెక్నాలజి (ఎస్.ఎంఏఈటి) సబ్ మిషన్ ఆన్ ప్లాంట్ అండ్ ప్రొటెక్షన్ ప్లాంట్ క్వారంటినే (ఏస్ఏంపిపి)

రైతులకు స్వచ్చంద సంస్థలకు పురుగు మందుల డీలర్లకు పట్టణాలలో, నగరాలలో సిఐపిఎంసి పర్యవేక్షణ రెండు రోజుల శిక్షణ కార్యక్రమము.

రూ.38,600/-ఒక శిక్షణ కార్యక్రమమునకు

 

బి

ప్రోగ్రెస్సివ్ రైతులకు మరియు విస్తరణ అధికారులకు సిఐపిఎంసి పర్యవేక్షణ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము.

రూ.152100/-ఒక శిక్షణ కార్యక్రమమునకు

 

సి

వివిధ జాతీయ సమగ్ర కీటక యాజమాన్య కేంద్రాల (సిఐపిఎంసి సెంటర్ల) ద్వారా రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వాహణ

రూ.26,700/-ఒక శిక్షణ క్షేత్ర పాఠశాల కార్యక్రమమునకు

 

డి

కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వాహణ

రూ.29,200/-ఒక క్షేత్ర శిక్షణ పాఠశాల కార్యక్రమమునకు

 

2

ఐ.పి.ఎం, పెస్తి సైడ్స్ , ఫెర్టిగేషన్ , ట్రీ గార్డ్ మొదలగు వాటి మద్దతు ఒరకు సమగ్ర పోషక యాజమాన్యము

ధరలో 50 శాతం రూ.5000/- హెక్టారుకు గాను పరిమితి చేయబడినది.

పామ్ ఆయిల్ విస్తరణకు గాను ప్రత్యేక

కార్యక్రమము

3.

సస్యరక్షణ మందులు, జీవ నియంత్రణ పురుగు మందుల పంపిణీ (ఐపిఎం)

ధరలో 50 శాతం రూ.500/- హెక్టారుకు ఏది తక్కువ అయితే అది.

జాతీయ ఆహార భద్రత పధకము (ఎస్.ఎఫ్.ఎస్.ఎం)

4

కలుపు మందుల పంపిణీ

ధరలో 50 శాతం రూ.500/- హెక్టారుకు ఏది తక్కువ అయితే అది.

జాతీయ ఆహార భద్రత పధకము (ఎస్.ఎఫ్.ఎస్.ఎం)

5

ఉద్యానవ మరియు తోట పంటలలో సమగ్ర సస్యరక్షణ

రూ.1000/- ఒక హెక్టారుకు ఒక లబ్ధిదారునికి

ఎన్.హెచ్.ఎం.హెచ్.ఎం.ఎన్ ఈహెచ్ సబ్ స్కీములు ఎంఐహెచ్ క్రింద

సస్య రక్షణ పరికరములు పొందుటకు ఆర్ధిక సహకారము కొరకై ఎస్ యూ ఏ ఎం చాప్టర్ 5 లో మెకనైజేషన్ అండ్ టెక్నాలజి సస్య రక్షణ పరికరముల క్రింద పేజీ 20 మరియు మినీ మిషన్ – 1 (నూనె గింజలు) కై ఎస్ ఎం ఓఓపి లో ఇవ్వడం జరిగినది.

ఎవరిని సంప్రదించాలి?

జిల్లా వ్యవసాయ అధికారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆత్మ/కేవికే ఇంచార్జ్ .

ఆదారము: వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate