অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉత్పత్తి మరియు పంట నూర్పిడి ఉద్యానవనాల అభివృద్ధి

ఉత్పత్తి మరియు పంట నూర్పిడి ఉద్యానవనాల అభివృద్ధి

  1. ఆసక్తి కనబరచుచూ ఎవరుదరఖాస్తు చేయవచ్చు
  2. ఆసక్తి కనబరచుటకు దరఖాస్తు ఎక్కువ చేయాలి
    1. నిర్ణీత నమూనాలో దరఖాస్తు
    2. దరఖాస్తు ఆన్ లైన్ లో సమర్పించుట
    3. దరఖాస్తు రుసుము వివరములు
  3. దరఖాస్తుదారుని గుర్తించు విధానము
  4. భూయాజమాన్యము మరియు హక్కు పత్రపు నకలు
  5. దరఖాస్తూతో పాటు జత చేయవలసిన పత్రములు
  6. సమ్మతి తెలుపుతు చేసిన దరఖాస్తు పరిశీలన
  7. పొదిన దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను కలిగి వుండుట
  8. యల్.ఓ.ఐ. మరియు పరిశీలనకు ముందు యల్.ఓ.ఐని దరఖాస్తుపై జారీ చేయుట
    1. యల్.ఓ.ఐని దరఖాస్తుపై నిర్ణయం చేయు అధికారము
    2. యల్.ఓ.ఐ జారీ చేయుటకు ముందు పరిశీలన
    3. ప్రాజెక్టు (అప్రైజల్) అంచనాలను విలువ కట్టుట
    4. యల్.ఓ.ఐ చెల్లుబాటు కాలము
  9. లబ్దిదారునికి ముఖ్యమైన సూచనలు

పధకము క్రింద ఆసక్తి కనబరచుటకు దరఖాస్తు చేయు విధానము

ఆసక్తి కనబరచుచూ ఎవరుదరఖాస్తు చేయవచ్చు

ఒక సాధారణ వ్యక్తి, కొంతమంది వ్యక్తులు, లేక చట్ట బద్దమైన వ్యక్తి (భాగస్వామ్య సంస్థ, ధర్మకర్తల మండలి, సహకార సంఘము, సంఘములు నమోదు చట్టము క్రింద నమోదు చేయబడిన సంఘము,కంపెనీ, స్వయం సహాయక బృందము) ఆసక్తి కనబరచుటకు గాను దరఖాస్తు చేయవచ్చు.

ఆసక్తి కనబరచుటకు దరఖాస్తు ఎక్కువ చేయాలి

నిర్ణీత నమూనాలో దరఖాస్తు

  1. సంబంధిత రాష్ట్రాపు ఉద్యానవనాల పెంపక బోర్డు కార్యాలయములందు ప్రాజెక్టు వ్యయము రు.50.00 లక్షల వరకు
  2. ప్రాజెక్టు వ్యయము రు.50.00 లక్షలు పైబడిన సందర్భములో జాతీయ ఉద్యానవనాల బోర్డు   ప్రధాన కార్యాలయము నందు అయితే, ఆ దరఖాస్తు నకలును సంబంధిత రాష్ట్ర ఉద్యానవనల బోర్డు కార్యాలయమునకు కూడా పంపవలయును

దరఖాస్తు ఆన్ లైన్ లో సమర్పించుట

జాతీయ ఉద్యానవనాల బోర్డుకు ఆసక్తి కనపరచు దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా సమర్పించు సదుపాయమును తన వెబ్ సైట్ . www. Nhb.gov.in ద్వారా కల్పించియున్నది. వెబ్ సైటు యొక్క హోమ్ పేజిలో ఆన్ లైన్ దరఖాస్తు మరియు దరఖాస్తు స్థితిని తెలియ చేయుటకు లింక్ ఏర్పాటు చేసియున్నది. ఈ విభాగములో దరఖాస్తు చేయు విధానము, దరఖాస్తు రుసుము చెల్లింపు సదుపాయములు, చెక్ లిస్టు మొ|| వాటిని ఆన్ లైన్ లో దరఖాస్తు చేయు వారికి సహాయపడుటకు గాను వుంచియున్నది. దరఖాస్తుదారుడు దిగువ మూడు విధాలైన పద్ధతులలో దరఖాస్తు రుసుము చెల్లింపవచ్చును.

  • డిమాండు డ్రాప్ట్స్
  • యన్ హెచ్ బి. ఖాతాకు ఆన్ లైన్ ద్వారా నిధులబదిలి.
  • క్రెడిటు/డెబిట్ కార్డు (విసా/మాస్టర్)

దరఖాస్తు రుసుము వివరములు

దరఖాస్తు రుసుము

డిమాండు డ్రాప్ట్స్ మరియు ఎలక్ట్రానిక్ బదిలీ తరగతి.

క్రెడిటు/డెబిట్ కార్డు (విసా/మాస్టర్)

ప్రాజెక్టువిలువ రు. 10.00 లక్షల వరకు వున్నవాటికి

రూ. 1000/-

రూ. 1000/-(వర్తించు ప్రవేశ వ్యవహార రుసుము చెల్లింపు కొరకు

ప్రాజెక్టువిలువ రు. 20.00 లక్షలకు పైబడి మరియు 50.00 లక్షల వరకు వున్న వాటికి

రూ. 2000/-

రూ. 2000/-(వర్తించు ప్రవేశ వ్యవహార రుసుము చెల్లింపు కొరకు

ప్రాజెక్టువిలువ రు. 20.00 లక్షలకు పైబడి మరియు 50.00 లక్షల వరకు వున్న వాటికి

రూ. 5000/-

రూ. 5000/-(వర్తించు ప్రవేశ వ్యవహార రుసుము చెల్లింపు కొరకు

ప్రాజెక్టువిలువ రు. 50.00 లక్షలకు పైబడిన వాటికి

రూ. 10,000/-

రూ. 10000/-(వర్తించు ప్రవేశ వ్యవహార రుసుము చెల్లింపు కొరకు

చెల్లింపు డిమాండ్ డ్రాప్ట్స్ లేక ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ ద్వారా య హెచ్ బి. ఖాతాకు చెల్లింపు చేయు చున్నట్లైన మొదట డిమాండ్ డ్రాప్ట్ ను తయారు చేయవలయును లేక యన్.హెచ్.బి. యొక్క ఖాతాకు నిధులను జమచేయవలయును ఎందువల్లననగా ఆఉ లైన్ దరఖాస్తు దారునికి తాత్కాలిక గుర్తింపు నెంబరు జారీ చేయబడును. ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేసిన చెల్లింపుల విషయములో అవి యన్.హెచ్.బి. యొక్క ఖాతాకు జమ అయినప్పుడు మాత్రమే, శాశ్వత యల్ ఓ.ఐ.కోడ్ జారీ చేయబడుతుంది. ఆన్ లైన్ దరఖాస్తుతో పాటు గా దరఖాస్తు దారులు నమూనా – I లో సంపూర్ణ వివరములను సమర్పించవలయును.

దరఖాస్తుదారుని గుర్తించు విధానము

  1. దరఖాస్తుదారుడు సాధారణ వ్యక్తి అయిన, అతని పేరు, లింగము వయస్సు, వృత్తి, తండ్రి/ భర్త పేరు, శాస్వత చిరునామా, పూర్తి చిరునామాతో కూడికి, తను స్వయంగా దృవీకరించి దరఖాస్తు పై అతికించిన పోటో ద్వారా సాధారణ వ్యక్తి లేక వ్యక్తుల బృందమును గుర్తించవచ్చును.
  2. దరఖాస్తుదారుడు చట్టబద్దప్రతినిది అయినట్లైన దరఖాస్తుదారుని గుర్తించుటకు దిగువ వాటి కొరకు గట్టిగా కోరవలయును.
  3. దరఖాస్తుదారుని వ్యవస్థ/కంపెని నమోదు పత్రము యొక్క దృవీకరింప బడిన నకలు
  4. దరఖాస్తుదారుని వ్యవస్థ /కంపెనీ యొక్క వివరములు మరియు నియమావళి.
  5. పాలక వర్గ సభ్యలచే బ్యాంకురుణము కొరకు దరఖాస్తులో సంతకము చేయుటకు యన్.హెచ్.బి. నుండి సబ్సిడి మరియు ఈ సందర్బములో తీసుకొన వలసిన యితర చర్యలకు గాను అధికార మిస్తూ చేయబడిన తీర్మాణము. పాలక వర్గ తీర్మాణము నందు  దరఖాస్తూలో సంతకము చేయుటకు అధికార మియ్యబడిన వ్యక్తి యొక్క పేరు, వయస్సు, లింగము, హోదా /వృత్తి, తండ్రి/భర్త పేరు, శాశ్వత చిరునామా, తపాలా చిరునామా మరియు స్వయంగా దృవీక రించిన పోటోను దరఖాస్తుకు జత చేయవలయును.
  6. దరఖాస్తుదారుని వ్యవస్థ యొక్క పాలకవర్గ సభ్యులు / అధీకృత కార్య నిర్వాహక వర్గముచే పెట్టుబడి పెట్టుటకు, బ్యాంకులోను తీసుకొనుటకు గాను అనుమతి లేక అంగీకారము తెలుపుతు చేసిన తీర్మాణము జత చేయవలయును.
  7. దరఖాస్తుదారుని వ్యవస్థ యొక్క యిటీవలి ఆడిట్ రిపోర్టు

భూయాజమాన్యము మరియు హక్కు పత్రపు నకలు

ఏ భూమియందైతే దరఖాస్తుదారుడు ప్రాజెక్టును అమలు చేయదలచినారో, దానిపై, అతనికి గల యాజమాన్యపు హక్కు లేక కౌలుదైన యెడల కనీసము 10 సం|| లుగా వుండవలయును. అయితే పండ్లతోటలు మరియు దీర్ఘకాము ఫలసాయమిచ్చు మొక్కల విషయములో కౌలు 15 సం|| లై వుండవలయును. భూమి కౌలుదైన పక్షమున కౌలు పత్రము సంబంధిత సబ్ రెజిస్ట్రారు మొ|| నమోదు అధికారుల వద్ద నమోదు చేయించవలయును. యిటీవలి భూమి యాజమాన్యపు హక్కు పత్రమును దరఖాస్తుకు జత చేయవలయును. రుణమిచ్చు సంస్థ ఏవిధంగా భావించినా తనఖా వుంచిన భూమి కౌలుభూమితో సమానంగా భావించరాదు. అదే విధంగా భూమిప యాజమాన్యపు హక్కు కల్పిస్తూ యివ్వబడిన పవర్ ఆఫ్ అటార్నీ ఈ పధకము క్రింద ప్రయోజనము పొందుటకు అర్హత కలిగి వుండదు

దరఖాస్తూతో పాటు జత చేయవలసిన పత్రములు

  1. ప్రాజెక్టు భూమి పై హక్కు చూపు యాజమాన్యపు హక్కు పత్రపు నకలు
  2. కౌలు భూమి అయిన యెడల దరఖాస్తుసమర్పించునాటికి కౌలు పత్రము నమోదైనట్లుగా చూపు దృవీకరింపబడిన నమోదైన కౌలు పత్రపు నకలు.
  3. అనుబంధింప బడిన నమూనాలో అఫిడవిట్
  4. నిర్ణయింప బడిన దరఖాస్తు  రుసుము మరియు పధకపు వివరముల తోటి బ్రోచరు. యిటీవల సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్ను, ఏదేని వున్నయేడల
  5. ఏదేని ఆర్థిక సహాయ సంస్థ/బ్యాంకుకు సమర్పించ్న ప్రాజెక్టు రిపోర్టుతో పాటు అట్టి సంస్థ,బ్యాంకుచే రుణ దరఖాస్తును పరిగణనలోకి తీసుకొంటున్నట్లు యిచ్చిన పత్రము.
  6. ప్రాజెక్టు భూమి యొక్క లేఅవుట్ మరియు సరిహద్దులు నీటి వనరులు, వినియోగించుకొను చున్న భూమి మొ|| వాటితో కూడిన పటము
  7. దరఖాస్తుదారుడు సహకార సంఘము లేక భాగస్వామ్య సంస్థ అయిన యెడల అట్టి సంస్థచే జారీ చేయబడిన యన్.ఓ.సి.
  8. ప్రాజెక్టు పండ్లుమరియు కూరగాయల ప్రాధమిక ప్రాసెసింగ్ కలిగి వున్నట్లైన మరియు పండ్ల ఉత్పత్తులైన 1955 ఎఫ్ పి.ఓ. పరిధిలో తయారు చేయవలసి వున్నట్లైన ఆహార పదార్ధాల తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖచే జారీ చేయబడిన యన్.ఓ.సి

సమ్మతి తెలుపుతు చేసిన దరఖాస్తు పరిశీలన

పరిశీలన చేయుటకు దిగువ విషయములు సూచించబడినవి మరియు సందర్బమును బట్టి అదనపు విషయములను జత చేసుకొనవచ్చును.

  1. దరఖాస్తు పూర్తిగా నింపబది అన్ని పేజీలలో సంతకం చేయబడి మరియు అవసరమైన సందర్బమునకు సంబందించిన పేపర్లు/పత్రములో జత పరచబది వుండవలెను
  2. దరఖాస్తు నమూనాతో అనుబంధింప బడిన పత్రముల ద్వారా దరఖాస్తుదారుని గుర్తింపు మరియు తేదిని దృవీకరించుకోవలెను.
  3. ప్రాజెక్టులో చూపబడిన భూమి యాజమాన్యము/కౌలు (నమోదు చేయబడివుండాలి) పత్రము నిర్ణయింపబడిన సంవత్సరములకు గాను దరఖాస్తుదారుని పేరున వుండవలయును మరియు మూడవ వ్యక్తికి తనఖా పెట్టబడి వుండరాదు.
  4. యన్.హెచ్.బి. పథకం క్రింది అనుమతింప బడుటకు ప్రతిపాదింప బడిన పంట కార్యక్రమము.
  5. ప్రాజెక్టు భూమి పూర్తి వివరములు (సర్వే నెంబరు/ప్లాటు నెంబరు, గ్రామము లేక పట్టణం/తాలుకా, జిల్లా మరియు రాష్ట్రలను తప్పనిసరిగా చూపబది వుండవలెను. ప్రాజెక్టులోని భూమికి సంబంధించిన పటము దరఖాస్తుకు జత చేయబడి నీటి పారుదల సౌకర్యము (అవసరమైన) చూపుతుండవలెను. ప్రస్తుత నిర్మాణమున్న తీరు, ప్రతిపాదింప బడినతీరు, ప్రస్తుతమున్న చెట్లు మరియు దాని విస్తీర్ణము పటము స్కేలు ప్రకారము వుండవలసిన అవసరం లేనప్పటికి దాని స్కెచ్ ద్వారా ప్రాజెక్టు భూమి గుర్తిం&చుటకు అవకాశము నివ్వవలెను. సంబంధిత ఏ.డి మరియు ల్చేయడు దారుడు బడిన దారుడు యల్ ఓ.ఐ. పరిశీలనాధికారి లబ్దదారుడు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయములను వదిలి వేయలేదనే సమాచారం సేకరించుకోవాలి.
  6. పం, దానివెరైటీ, మొక్కల సాంద్రత, మొక్కల మాట్రిక్స్ , దాని ప్రతిపాదిత విస్తీర్ణము మరియు మొక్కలు నాటుటకవసరపడే పనిముట్లు దొరకు ప్రదేశములను క్షుణ్ణంగా చూపాలి. ఈ వివరములలోనికి వెళ్ళి దరఖాస్తుదారునికి అవసరమగు సాంకేతిక సలహాలనివ్వాలి. యిందు కొరకు ప్రాజెక్టు పొలమునకు చెందిన సూచనలతో కూడిన పటమును కూడా పరిగణనలో వుంచుకొనవలెను.
  7. నిధులనిచ్చు సంస్థలు పనిచేస్తున్నట్లుగా దృవీకరించుకోవాలి. బ్యాంకు పై ఏదేని అనుమాన మున్న యెడల దానికి లైసెన్సు మంజూరు, చేసిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదిం చాలి. నిధుల సమకూర్పు పరపతి సంఘము చేస్తున్నట్లైన అట్టి ఆర్థిక సదుపాయ సంస్థయైన పరపతి సంఘముతో పాటు దాని బ్యాంకు కూడా సక్రమంగా పనిచేస్తూ వుండవలయును. అలాంటి సందర్బములో దరఖాస్తును ఆర్థిక సదుపాయ బ్యాంకు ద్వారా యన్ హెచ్ బికి సబ్సిడిని అనుమతించుటకు గాను పంపవలయును మరియు సబ్సిడి రిజర్వుఫండు ఖాతా ను లబ్దిదారుని పేరు మీద ఆర్థిక సదుపాయ బ్యాంకులో నిర్వహింపబడవలయును. సందేహ మున్నట్లైన అందుకు సంబంధించని వివరముల కొరకు నాబార్డు యన్ యల్ పి. మరియు జిల్లా సహకార సంఘముల రిజిస్ట్రారును సంప్రదించవలెను.
  8. ప్రాజెక్టు రిపోర్టు ద్వారా ఆర్థిక వనరులపై అదుపు కలిగి ప్రాజెక్ట్కు రెండు లేక  అంత కంటే ఎక్కువ పధకముల ద్వారా సబ్సిడి ఒకేక్ ప్రాజెక్టుకు రెండు లేక అంతకనంటె ఎక్కువ వ్యవస్థ ల ద్వారా సబ్సిడీ అందకుండనట్లు చూడాలి.
  9. దరఖాస్తులో ఇవ్వబడిన ప్రాజెక్టు వివరములు ప్రాజెక్టు రిపోర్టులోని వివరములుతో ఒకదానితో మరోకటి సరిపోవలెను.
  10. దరఖాస్తుదారుడు కంపెనీ అయిన అది తగినంట అధీకృత మూలధనము మరియు రెజర్వులతో పాటు తనవాటాగా కేటాయించుటకు తగిన మిగుళ్ళను కలిగివుండాలి. హామిలేని రుణాలును ఈక్విటీగా పరిగణీంచరాదు.
  11. ప్రాజెక్టు అమలు కాలపరిమితిని జాగ్రత్తగా గమనించి యల్ .ఓ.ఐ.ని పాత చెట్లు, కార్యకలాప ములు మరియు సామగ్రిని వదలి వేయునట్లు చేయవలెను.
  12. ప్రతిపాదికత ప్రాధమిక ప్రాసెసింగ్ యూనిట్ .ఎఫ్ .సి.ఓ. 1955 లో నిర్వహించబడినట్లుల్గా పండ్ల ఉత్పత్తులను “కలిగి వున్నట్లైన యమ్ .ఎఫ్ .పి.ఐ. ద్వారా నిరభ్యంతర సర్టిఫికేట్ ను పొందవలసి యుండును.  నిరభ్యంటర సర్టిఫికేట్టు నందు ప్రాజెక్టు రిపోర్టు నందలి విభాగముల యమ్ .ఎఫ్ .సి.ఐ. సహాయ మందించ లేదని మరియు అందించుటకు పరిగణింప బడ లేదని మరియు యన్ . హెచ్ .బి. తన పధకముల క్రింద సహాయ మందించిన తమకెట్టి అభ్యంతరములు లేవని తెలుపవలసి వుండును

పొదిన దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను కలిగి వుండుట

ఆసక్తి కనపరచుచు చేయబడిన దరఖాస్తులను సంబంధిత రిజిస్టరు నందు కాల క్రమములో నమోదు చేయవలసి వుండును. ఆ దరఖాస్తుల రిజిస్టరు బైండింగ్ చేయబడి పేజి నెంబర్లు కలిగి మరియు అసిస్టెంట్ డైరెక్టరు ఇన్ చార్జి, ప్రాంతీయ కార్యాలయము లేక అదనపు నిర్వహణా సంచాలకులు ప్రధాన కార్యాలయము వారిచే దృవీకరింప బడవలెను. ఇందులో ఆన్ లైన్ లో నమోదు చేసుకొన్న తేది మరియు సాప్ట్ వేర్ లో అభివృద్ధి చేయబడిన ప్రత్యేక యల్ .ఓ.ఐ. నెంబరు కలిగివుండవలెను.

యల్.ఓ.ఐ. మరియు పరిశీలనకు ముందు యల్.ఓ.ఐని దరఖాస్తుపై జారీ చేయుట

యల్.ఓ.ఐని దరఖాస్తుపై నిర్ణయం చేయు అధికారము

ప్రాంతీయ కార్యాఅయం - ప్రాంతీయ అధికారి అధ్యక్షత కలిగిన రాష్ట్ర కమిటి ప్రధాన కార్యాలయము - ఐ.సి./పి.ఎ/సి అయితే రెఫరల్ వ్యను/ప్రత్యేక రవాణా వాహనమునకు సంబంధించిన ప్రతిపాదనల విషయములో వాటికి చెందిన యల్.ఓ.ఐలను అనుమతించుటకు గాను ప్రధాన కార్యాలయ మునకు సమర్పించవలయును. రెఫరల్ వ్యాను/ప్రత్యేక రవాణా వాహనమునకు దరఖాస్తుపై సంబంధించిన ప్రతిపాదనల యల్.ఓ.ఐలను పరిష్కరించుటకు రాష్ట్ర కార్యాలయ మునకు పరిధిలేదు

యల్.ఓ.ఐ జారీ చేయుటకు ముందు పరిశీలన

యల్.ఓ.ఐ జారీ చేయుటకు ముందు పరిశీలన కొరకు ప్రాజెక్టులను దిగువరీతిలో నమూనా లను ఎంపిక చేసుకొనవచ్చును

రూ.50.00 లక్షల వరకు (ప్రాంతీయ కార్యాలయం వద్ద)

సాద్యమైనంత వరకు 100%

ప్రాజెక్టు విలువ రూ.50.00 లక్షలకు మించిన

100%

రెఫరల్ వ్యాన్

100%

స్వల్పకాల పంటలైన అరటి బొప్పాయి స్ట్రాబెర్రి, గ్లాడియోలస్

ప్రాధాన్యతా పద్దతిలో100%

  • పరిశీలన సందర్భంలో గమనించ వలసిన విషయములు
  • సరియైన ప్రదేశము
  • భూసార మరియు నీటి పరీక్ష నివేధికలు
  • నీటిపారుదల సౌకర్యములు
  • హైటెక్ భాగములు
  • ఖర్చు నియమములు మరియు ప్రాజెక్టు ఖర్చులు
  • భౌగోళిక పటము
  • లబ్దిదారుని నైపుణ్యతలు
  • ముందస్తు పరిశీలన నమూనా నకలు నమూనా -  III ఏలో ఇవ్వబడినది.

గమనిక: ముందస్తు యల్.ఓ.ఐ. పరిశీలన అధికారి తప్పనిసరిగా ప్రాజెక్టు భౌగోళిక పటము (చేతితో వేసినది) తయారు చేయాలి మరియు నీటి పారుదల సౌకర్యములను (ఏదేన్ని వున్న), నిర్మాణములు, ప్రస్తుత వినియోగములోనున్న భూమిని కూడా చూపవెలెను. ఆయన లబ్ది దారునికి అవసరమైన మార్పు చేర్పులపై సలహాఇవ్వవెలెను. అనగా పంట, మొక్కల సాంద్రత పంటల నమూనా మాట్రిక్స్, మౌళిక సదుపాయములు మొ|| నవి మరియు లబ్దిదారుడు సల హాలను అంగీకరించినట్లైన దరఖాస్తును ఆవిధంగ సరిదిద్ద వచ్చును. ప్రాజెక్టులోని ఏదేని భాగము పూర్తిఅయిన యెడలా దానికి సంబంధించిన వివరములను సిఫారసు చేయవచ్చును.

ప్రాజెక్టు (అప్రైజల్) అంచనాలను విలువ కట్టుట

ప్రాధమిక దశ రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ పెట్టుబడి దారుని వివరములను ప్రాజెక్టు భాగములు, భూసార మరియు నీటి పరీక్ష నివేధికలు, మార్కెట్ అంచనాలను విలువ కట్టును మరియు లబ్దిదారునికి నూతన సాంకేతిక అంశాలను నీటిపారుదల మరియు ఎరువుల వినియోగ పద్దతులు, సూక్ష్మ వ్యవసాయము, జి.ఎ.పి.అదునూతన వ్యవసాయ యంత్రములు మొ|| వాటిని అమలు పరుచుటకు సలహాలివ్వవచ్చును.

యల్.ఓ.ఐ చెల్లుబాటు కాలము

కాల పరిమితి రుణము మంజూరు చేయుటకు యల్.ఓ.ఐ జారీ చేసిన తేది నుండి 1 సం|| కాలం

కాలపరిమితి రుణము మంజూరు తేదీ నుండి 2 సం|| లోపు ప్రాజెక్టు పూర్తి కావలెను. ప్రాజెక్టు కాలము మించి పోయిన తగు విధంగా పరిశీలించవలెను.

ప్రాజెక్టు అర్హతను బట్టి సంబంధిత ప్రాంతీయ అధికారిచే మరి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు పొడిగించవచ్చును.

లబ్దిదారునికి ముఖ్యమైన సూచనలు

అమలులోనికి వచ్చిన తరువాత ఆన్ లైన్ దరఖాస్తు విధానము యన్.హెచ్.బి. వెబ్ సైట్ నందు ప్రకటింపబడును)

  1. రూ.50.00లక్షల వరకు ప్రాజెక్టు వ్యయం కలిగిన యల్.ఓ.ఐ దరఖాస్తులను సంబంధిత రాష్ట్రము లోని కేంద్రపు అధికార ప్రతినిధికి అనుబంధం 1లో చూపబడిన చిరునామాకు పంపవలెను.వీరి చిరునామాలో ఏదేని మార్పువున్న యన్.హెచ్.బి. వెబ్ సైట్ లో కాలానుగుణంగా ప్రకటింపపబడును.
  2. రూ.50.00లక్షలకు పైబడిన యల్.ఓ.ఐ దరఖాస్తును నేరుగా నిర్వహణా సంచాలకులు, జాతీయ ఉద్యానవనాల బోర్డు, ప్లాటు నెం.85. సెక్టారు,18, ఇన్సిట్యూషనల్ ఏరియా గుర్ గావ్ -122015 (హర్యానా)వారికి మరియు దీని నకలును సంబంధిత రాష్ట్ర జాతీయ ఉద్యానవనాల బోర్డు వారికి పంపాలి
  3. దరఖాస్తులోని సంబంధిత వివరములన్నిటిని పూర్తి చేసివుండి లబ్దిదారునిచే ప్రతి పేజియందు  సంతకం చేయబడాలి
  4. దిద్దులు వుండరాదు. ఏవేని దిద్దులున్న వాటిని దృవీకరించాలి
  5. దరఖాస్తుదారుడు ఆఫిడవిట్ భూమి వివరములు, వివరణాత్మక ప్రాజెక్టు రిఓర్టు, బ్యాంకుకు సమర్పించబడిన కాలపరిమితి అప్పు దరఖాస్తు, స్వయంగా దృవీకరించిన పోటోలు, జత పరచాలి. లేని యెడల దరఖాస్తు అంగీకరింపబడదు.
  6. అఫిడవిట్ ఇందు వెంట జతచేయబడిన నమూనాలో మాత్రమే వుండవలెను.
  7. దరఖాస్తుదారుడు/ పెట్టుబడి దారుడి దరఖాస్తుపై యల్.ఓ.ఐవి సంబంధిత అధికృత అధికారి చే అర్హతను బట్టి ఒక సంవత్సరకాలం పాటు చెల్లుబాటు కాలాన్ని పొడిగించవచ్చును.
  8. కౌలు ఒప్పంద పత్రము సంబంధిత నమోదు అధికారిచే నమోదు చేయబడవలెను.
  9. ప్రతిపాదనలోని ప్రాజెక్టు భూమి, పంట, విస్తీర్ణము, బ్యాంకు మొదలగు వాటిలో మార్పు చేయు టకు ముందు బోర్డు అనుమతిని దరఖాస్తుదారుడు పొందవలెను.
  10. పెట్టుబడి దారునిచే సమర్పించబడిన ప్రాజెక్టు ప్రతిపాదనలో పొందు పరచబడని అంశములు, బ్యాంకుచే విలువకట్టబడిన నోటు నందు కూడా లేనియెడల మరియు దరఖాస్తు సమర్పించు నప్పుడు దీనిని మదింపు చేయని యెడల లేక బ్యాంకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మొ|| వాటిని విలువ కట్టనపుడు యన్.హెచ్.బి. సబ్సిడికి అర్హము కాదు.
  11. కొన్ని వ్యవసాయ యంత్రములు, విద్యుత్ కనెక్షన్ చార్జీలు, బనానా బంచ్ కవరు, నీడకొరకు వల పి.హెచ్ .యమ్ . మౌలిక సదుపాయములు, భద్రత మరియు నిల్వ సౌకర్యములు మొ|| విభాగములను యల్.ఓ.ఐ దరఖాస్తులో చెప్పబడినప్పటికీ, వాటిని ప్రాజెక్టుకొరకు కొన్నట్లు లేక నిర్మించినట్లు నమ్మదగ్గ ఆధారాలు చూపినట్లైన వాటిని ప్రాజెక్టు వ్యయనిబంధనల లోపల మరియు ఆ విభాగమునకు సంబంధించి వ్యక్తిగత వ్యయనిబంధనల లోపల అనుమతింప వచ్చును. అదేవిధంగా ఏదేని ప్రాజెక్టు విభాగపు వ్యాయాన్ని అంచనా వేయడంలో తప్పు నిర్ధారణకు వచ్చి, సాంకేతికంగా ఆ విభాగపు అమలు సాధ్యం కానట్లైనచో దానిని సాధారణ వ్యయానిఇ మించకుండా పెంచుటకు అనుమతించ వచ్చును.
  12. నీడవల, mulch cover, stakes, plastic crates, మొ|| విభాగములు సబ్సిడీకి అర్ హత కలిగివున్నప్పటికి అవి ఉత్పత్తి వచ్చుదశలో అవసర వస్తువులు కావునా ప్రాజెక్టు అమలు ఆదశకు వచ్చినప్పుడు మాత్రమే మరియు బ్యాంకు రుణము పొందిన తర్వాత సబ్సిడి అనుమ తించబడును.
  13. దరఖాస్తుదారుడు సహకార సంఘము లేక భాగస్వామ్య సంస్థలో భాగస్వామి అయి యన్.హెచ్.బి. ద్వారా అట్టి కార్యకాలాపమునకే నిధులు మంజూరు చేయబడినట్లైన సహకార సంఘము, భాగస్వామ్య సంస్థ దరఖాస్తుతో పాటు నిరభ్యంతర పత్రమును సమర్పించ వలయును.
  14. దరఖాస్తుదారుడు  ఒకరైన లేక ప్రాజెక్టు భూమిపై ఉమ్మడి యాజమాన్యము కలిగిన వారిలో కొందరైన మరియు ప్రాజెక్టును దరఖాస్తుదారునికి సంబంధించిన భాగములో ప్రతి పాదించినట్లైన నిరభ్యంతర పత్రమును యితర సహయజమానుల నుండి పొంది సమర్పించ వలయును.
  15. బ్యాంకు కాలపరిమితి రుణము సబ్సిడి భాగము మరియు ప్రాజెక్టు కంటె 15% అధికముగా ఉండవలయును. లేని యెడల ప్రాజెక్టు ఈ పధకము క్రింద సబ్సిడికి అర్హము కాదు.
  16. ప్రాజెక్టు భూమిని చూపు పటము స్కేలు ప్రకారము వుండనవసరం లేదు. అది ప్రస్తుతం వినియోగంలోనున్న భూమి, దాని ఎల్లలు, నీటి పారుదల సౌకర్యములు (ఏవేనివున్న), ప్రతిపాదింపబడిన భూ వినియోగ విధానములను చూపవలెను.
  17. ప్రాజెక్టు ప్రాధమిక పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ తో కూడి వున్నట్లైన ఎఫ్.పి.ఓ. 1955 క్రింద ప్రాసెసింగ్ యూనిట్ ను నడపుటకు గాను ఎఫ్.పి.ఓ. లైసెన్సు అవసరమవుతుంది. ఇంకనూ భారత ప్రభుత్వ ఆహార పదార్ధముల తయారి పరిశ్రమల మంత్రిత్వశాఖ నుండీ పధకము మరియు సబ్సిడీలు డూప్లికేట్ కాకుండగా నిరభ్యంతర పత్రమును జత పరచవలెను. ఒకవేళ నిరభ్యంతర పత్రము దరఖాస్తుతో పాటు సమర్పించని యెడల, ప్రాధమిక ప్రాసెసింగ్ యూనిట్ ను చేపట్టుటకు ముందు సమర్పించ వలెనను నిబంధనలతో కూడిన  యల్.ఓ.ఐ.ని జారీ చేయవలెను
  18. ప్రాజెక్టు అమలులో నున్న కాలంలో పంటను మార్చవెలనన్న, ప్రమోటరు ప్రాజెక్ట్ పూర్తగుటకు ముందే అందు నిమిత్తం బ్యాంకు/యన్.హెచ్.బి. ని కోరవలెను. ఒక వేళ బ్యాంకు మార్పు చేసిన పంటతో అప్పు మంజూరు పత్రమును సమర్పించిన యెడల మరియు యన్.హెచ్.బి. అనుమతి మాత్రమే తీసుకొనక ప్రాజెక్టు పూర్తయిన సందర్బములను ఈ దిగువ నిబంధనలతో ప్రాసెస్ చేయవలెను.
  19. మొక్కలు నాటు పరికరములను, నర్సరీ నుండి కొనుగోలు చేసినట్లు చూపు పత్రసహిత ఆధారము సమర్పించవలెను.
  20. పంట మార్ప పై బ్యాంకుకు సమాచార మందించినట్లు బ్యాంకు పునర్మదింపుచేసి రుణ మంజూరు పత్రమును తగిన సమయంలో రెవజ్ చేయని యెడలను, పైవాటిని సమర్థిస్తూ రుణ (విడుదల) చెల్లింపు వివరములను చూపు పత్రసహిత ఆధారములను సమర్పించవలెను.
  21. ప్రాజెక్టు ఉమ్మడి తనిఖీ తప్పనిసరి.
  22. అసలు వ్యయములో కనీస మొత్తమును మరియు రివైజ్ చేసిన మొక్కలు నాటు వ్యయాన్ని మాత్రమే సబ్సిడీని లెక్కించుటకు పరిగణనలోకి తీసుకొనవలెను. మరియు అదేవిధంగా సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలు మొ|| విభాగములపై వ్యయంలో కనీసం స్థాయిని పరిగణనలోకి తీసుకొనవలెను. అయితే ప్రాజెక్టులోని యితర విభాగముల వ్యయముల పెంపు అనుమతించబడదు.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate