অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శీతల గిడ్డంగులు కొరకు దరఖాస్తు

అంగీకార పత్రం కొరకు ఎవరు దరఖాస్తు చేయవచ్చును?

అంగీకార పత్రం జారీ కొరకు ఒక వ్యక్తి వ్యక్తుల సమూహం లేక చట్టపరమైన వ్యక్తి (భాగస్వామ్య సంస్థ, ఒక ట్రస్టు, ఒక సహకార సంఘం, సంఘాల రిజిష్ట్రేషన్ చట్టం క్రింద రిజిష్టరైన ఒక సంఘం, ఒక కంపెనీ, స్వయం సహాయక బృందం) దరఖాస్తూ చేయవచ్చును.

అంగీకార పత్రం జారీ కొరకు ఎక్కడ దరఖాస్తు చేయాలి?

  1. నిర్దేశిత నమూనాలో దరఖాస్తు:జాతీయ ఉద్యానవన బోర్డుప్లాట్ నెం.85, ఇన్ స్టిట్యూషనల్ ఏరియా       సెక్టార్ 18, గుర్గాం
  2. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు సమర్పణ:అంగీకార పత్రం కొరకు దరఖాస్తులను నింపుటకు జాతీయ ఉద్యానవన బోర్డు తన వెబ్ సైట్ లో (www.nhb,gov.in)విధానాన్ని పొందుపరచినది. శీతల గిడ్డంగి పథకం క్రింద వెబ్ సైట్ యొక్క్ హోమ్ పేజీలో లింకును అందచేస్తుంది. “ఆన్ లైన్ లో దరఖాస్తు చేయుట మరియు ట్రాక్ పరిస్థితి” “ఆన్ లైన్ లో దరఖాస్తు చేయు దరఖాస్తు దారునికి సహాయపడు నిమిత్తం ఈ విభా గంలో సమాచారం లభిస్తుంది. దరఖాస్తు ఎలా చేయాలి? దరఖాస్తు వెల, చెల్లింపు విధానాలు చెక్ లిస్టులు మొ|| నవి తెలియును. దరఖాస్తు వెలను చెల్లించుటకు దరఖాస్తు దారునికి మూడు ప్రత్యామ్నాయాలున్నాయి.

దరఖాస్తు వెల నిర్మాణం ఈ దిగువ విధంగా ఉండును

దరఖాస్తు వెల

డిమాండ్ డ్రాప్టు మరియు ఎల క్ట్రానిక్ బదిలీ విభాగం

క్రెడిట్ లేక డెబిట్ కార్డ్ (వీసా/ మాస్టర్ )

రూ.10లక్షల వరకు వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు

రూ.1,000/-

రూ.1,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం)

రూ.10లక్షలు మరియు రూ 20 లక్షల వరకు వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు

రూ.2,000/-

రూ.2,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం)

రూ.20లక్షలు మరియు రూ 50 లక్షల వరకు వ్యయంకలిగియున్న ప్రాజెక్టులకు

రూ.5,000/-

రూ.5,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం)

రూ.50లక్షలు మరియు అంతకు పై బడి వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు

రూ.10,000/-

రూ.10,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం)

జాతీయ ఉద్యానవన బోర్డువారి ఖాతాలో చెల్లింపుకు డిమాండ్ డ్రాఫ్టు గాని లేక ఎలక్ట్రానిక బదిలీకి ఎంపిక చేసుకొన్నచో దరఖాస్తు దారు ముందుగా డిమాండ్ డ్రాఫ్టును లేక ఎలక్ట్రానిక బదిలీ ద్వారా సదరు ఖాతాకు విధులను మళ్ళీంచాలి. అపుడు ఆన్ లైన్ దరఖాస్తులో డిడి నెంబరు లేక ఎలక్ట్రానిక బదిలీ నెంబరును పొందుపరచాలి. ఈ విషయంలో దరఖాస్తుదారుకు తాత్కాలిక గుర్తింపు (ఐ.డి) ఇవ్వబడు తుంది. ఎలక్ట్రానిక బదిలీ ద్వారా జాతీయ ఉద్యానవన బోర్డు ఖాతాలో నిధులు జమ అయిన తరువాత మరియు డిమాండ్ డ్రాఫ్టు విషయంలో బోర్డు వారుకి డ్రాప్టు అందిన తరువాత అంగీకారపత్రం యొక్క్ శాశ్వత కోడ్ ఇవ్వబడును.

దరఖాస్తుదారు డెబిట్ /క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు వెలను చెల్లించుటకు ఎంచుకొన్నట్లయితే వెనువెంటనే అంగీకార పత్రం శాశ్వత కోడ్ తో బాటు (తిరుగు) రశీదు ఇవ్వబడును.

ఆన్ లైన్ లో దరఖాస్తు వారం నింపిన తరువాత దరఖాస్తుదారు పూర్తిచేసిన దరఖాస్తుయొక్క ప్రతిని తీసుకొనవలెను. దీనిని రెండు ప్రతులుగా తీసుకొని ఒక ప్రతిని తన రికార్డు కొరకు ఉంచుకోవాలి. రెండవ ప్రతిని దరఖాస్తుకు అవసరమైన ఇతర పత్రములతో జతపరచాలి. ఆన్ లైన్ దరఖాస్తు తో బాటు దరఖాస్తుదారు తప్పని సరిగా ఫారం 1 నమూనాలో దరఖాస్తు ను పూర్తి చేసిన సమర్పించాలి.

దరఖాస్తుదారునికి గుర్తింపు ఎలా ఋజువుచేయాలి?

వ్యక్తి లేక వ్యక్తుల సమూహం విషయంలో వారిపేరు, లింగ, వయస్సు, వృత్తి, తండ్రి/భర్త పేరు, శాశ్వత చిరునామాతో బాటు తనచే దృవీకరింపబడిన పాస్ పోర్ట్ సైజు ఫోటోను దరఖాస్తుకు అతికించడం ద్వారా అతని వారి గుర్తింపును దృవీకరించవచ్చును.

ఒకవేళ దరఖాస్తుదారు చట్టబద్ధమైన సంస్థ అయినచో ఆ సంస్థను గుర్తించుటకు ఈ క్రింది వివరము లను పొందుపరచమని కోరవలెను.

  1. దరఖాస్తు చేయు సంస్థ /కంపెనీ యొక్క దృవీకరింపబడిన రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్
  2. దరఖాస్తు చేయు సంస్థ/కంపెనీ యొక్క్ నియమావళి
  3. జాతీయ ఉద్యానవన బోర్డు నుండి సబ్సిడీ, బ్యాంకు నుండి అప్పు పొందుటకు పాలక వర్గ తీర్మానం  మరియు సదరు తీర్మానంలో అధికార మివ్వబడిన వ్యక్తి పేరు మరియు దీనికి సంబం ధించి అవసరమైన చర్యలు తీసుకొనవలెను. సంతకము చేయుటకు అధికార మివ్వబడిన వ్యక్తికి సంబందించి పాలక వర్గ తీర్మానములో వివరంగా ఆ వ్యక్తి పేరు, లింగ, వృత్తి, తండ్రి/భర్త పేరు, శాశ్వత చిరునామా, పోస్టల్ చిరునామా ఉండవలెను. మరియు దరఖాస్తు ఫారంపై తనచే దృవీకరింప బడిన పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించ బడవలెను.
  4. బ్యాంకు నుండి అప్పు పొందుటకు, పెట్టుబడి పెట్టుటకు అనుమతింపబడిన/ఆమోదింప బడిన తీర్మానము కూడా జతపరచవలెను.
  5. వ్యక్తి/సంస్థ యొక్క ప్రస్తుత ఆడిట్ నివేదిక మరియు వార్షిక నివేదిక

స్థలముపై హక్కు మరియు హక్కు తెలుపు రికార్డు యొక్క ప్రతి

ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదింపబడినదో ఆ స్థలము కనీసం 15 సంవత్సరాల కాలమునకు దరఖాస్తుదారు పేరున యజమానిగా లేక కౌలుదారు పేరున ఉండవలెను. స్థలమును కౌలు/అద్దెకు తీసుకున్నట్లైయితే సబ్ రిజిష్ట్రాట్ కార్యాలయములో కౌలు పత్రము రిజిష్టరు చేయబడవలెను. స్థలము పై హక్కును తెలుపు ప్రస్తుత పత్రముని దరఖాస్తుకు జతపరచవలెను. అప్పు మంజూరు చేసిన సంస్థ అంగీకరించిననూ తనఖా పెట్టబడిన స్థలమును కౌలుకుతీసుకొన్న స్థలంగా పరిగణిం చరాదు. ఇదే విధంగా స్థలం యొక్క్ స్వంతదారు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా దరఖాస్తుదారుకు సంక్రమింపచేసిన స్థలము ఈ పథకము క్రింద అర్హత కలిగిఉండదు.

అంగీకార పత్రం యొక్క కాలవ్యవధి

  1. కాలిక అప్పు మంజూరు కొరకు అంగీకార పత్రం ఇవ్వబడిన తేదీనుండి ఒక సంవత్సర కాలము
  2. కాలిక అప్పు మంజూరు చేయబడిన తేదీనుండి రెండు  సంవత్సరముల లోపున ప్రాజెక్టు పూరి చేయబడవలెను.
  3. మెరిట్ ప్రాతిపదికపై ప్రాంతీయ అధికారి అంగీకార పత్రకాలపరిమితిని మరొక సంవత్సరమునకు పొడిగించవచ్చును.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate