హోమ్ / వ్యవసాయం / పథకములు / మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగష్ట్ 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడినది.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి

  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్ఇజిఎ) జాతీయ గ్రామీణ ఉపాధి పథకమని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగష్ట్ 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడినది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీసవేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎమ్.ఆర్.డి), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
  • ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర్య రేఖ దిగువనున్న పనివారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడినది. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను ఆడ కూలీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి.
  • గ్రామీణ కుటుంబంలోని వయోజనులందరూ వారి పేరు, వయస్సు మరియు చిరునామా ఫోటోలను గ్రామపంచాయితీకి ఇవ్వవలెను. ఆ గ్రామపంచాయితీ తగిన విచారణ చేసి ఆ కుటుంబ వివరములు నమోదు చేసి ఒక ఉపాధి పత్రమును జారీ చేస్తారు. ఆ ఉపాధి పత్రములో ఆ వయోజనుని వివరములు అతని/ఆమె ఫోటో ఉంటుంది. ఈ పథకములో నమోదు చేసుకున్న వ్యక్తి వ్రాతపూర్వకముగా ( కనీసం పద్నాలుగురోజులు నిరవధికంగా పనిని కల్పించమని కోరుచూ) సదరు పంచాయతీకి గాని ప్రోగ్రామ్ అధికారికిగాని ధరఖాస్తు చేసుకోవాలి.
  • పంచాయితీ/ప్రోగ్రామ్ అధికారి సరియైన ధరఖాస్తును స్వీకరించి మరియు ధరఖాస్తును స్వీకరించినట్లుగా రశీదు ఇచ్చి పనిని కల్పించుచున్నట్లుగా ఒక పత్రాన్ని ధరఖాస్తుదారునికి పంపుతారు మరియు ఆ పంచాయితీ ఆఫీసులో ప్రకటించబడే ఏర్పాటు చేస్తారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉపాధి కల్పించబడుతుంది. ఉపాధి కల్పించే పని ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే అదనపు వేతనం ఇవ్వబడుతుంది.

ఆచరణ యధాస్థితి

  • 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం రెండువందల (200) జిల్లాల్లో మరియు 2007-08 ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై జిల్లాల్లో ప్రవేశపెట్టబడినది.
  • 2008 వ సంవత్సరంలో ఏప్రియల్ నెలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేశంలో సమస్త గ్రామీణ ప్రాంతాల్లో ముప్పైనాలుగు (34) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆరువందల పద్నాలుగు (614) జిల్లాలు, ఆరువేల తొంభైఆరు (6096) మండలాలు, రెండు లక్షల అరవైఐదు వేల గ్రామపంచాయితీలలోను విస్తరింపచేయబడింది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పై తరచుగా అడుగబడే ప్రశ్నలు

ఈ ఉపాధి హామీ చట్టం కింద ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?

జ. ఉపాధి కార్డ్ ఉన్న గ్రామీణ వయోజనులందరూ అర్హులు. ఒక వేళ ఆ వ్యక్తి(వ్యక్తులు) ఉద్యోగం చేస్తున్నా, ఒక పనిచేస్తున్నా ఈ చట్టం కింద నేర్పులేని పనివానిగా ఉద్యోగాన్ని డిమాండ్ చేసే అధికారం ఉంది. ఈ పథకం కింద లబ్దిదారుల్లో ఒకింట మూడోవంతు స్త్రీలకి చోటుంటుంది.

వ్యక్తిగతంగా ఒక్క పౌరుడే పనికై దరఖాస్తు చేసుకోవచ్చా?

జ. చేసుకోవచ్చు. ఉద్యోగానికి దరఖాస్తు గృహాలవారీ జరుగుతుంది. ఐతే, రిజి స్టర్ చేసుకొన్నవారికి, సాలుకి 100 రొజుల కనీస ఉపాధి అర్హత బట్టి ఒక ఇంటిలోనివారు ఎందరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

పనికై దరఖాస్తు చేసుకోవడం ఎలా ?

జ. ఉపాధి కోరే ఎంప్లాయిమెంట్ కార్డ్ ఉన్న గ్రామీణ వయోజనులు, గ్రామపంచాయితీ లేదా బ్లాక్ స్థాయిలోని ప్రోగ్రాం అధికారికిగానీ ఒక తెల్ల కాగితంపై దరఖాస్తు చేసి దానికి తేదివేసిన రసీదు తీసుకోవాలి.

ఏడాదిలో ఒకరు ఎన్నిరోజుల ఉపాధి ని పొందగలరు ?

జ. ఒక ఆర్థికసంవత్సరంలో ఒక ఇంటిలోనివారు 100 రోజుల ఉపాధిని పొందడానికి అర్హులు. ఆ100 రోజులను ఆ ఇంటిలో అర్హులైన వారందరికీ సమంగా పంచడం జరుగుతుంది. సాధారణంగా ఈ వ్యవధి(వారానికి 6 రోజులు మించకుండా) వరసగా 14రోజులుగా ఉంటుంది.

ఎవరైనా ఉపాధి ని ఎపుడు పొందగలరు ?

జ. దరఖాస్తు చేసిన 15రోజుల్లోగా దరఖాస్తుదారుకు ఉపాధి లభిస్తుంది.

ఉపాధి ని ఎవరు ఇస్తారు ?

జ. గ్రామపంచాయితీ లేదా ప్రోగ్రాం అధికారిగానీ, ఎవరికి దరఖాస్తు చేస్తామో వారే ఇస్తారు.

ఉపాధి లభించిందని ఎలా తెలుస్తుంది ?

జ. గ్రామపంచాయితీ లేదా ప్రోగ్రాం అధికారి సదరు దరఖాస్తుదారుకు ఉపాధి గురించి, ఎవరికి రిపోర్ట్ చేసుకోవాలనేది 15 రోజుల్లాగా ఒక ఉత్తరం ద్వారా తెలియజేస్తారు.అదేవిధంగా ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా గ్రామపంచాయితీ నోటీస్ బోర్డ్ లోనూ, బ్లాక్ స్థాయి ప్రోగ్రాం అధికారి కార్యాలయంలోనూ ప్రదర్శిస్తారు. అందులో ఎవరెవరికి, ఎక్కడ ఉపాధి లభించిందీ తెలియజేస్తారు.

ఉపాధి లభించిందని తెలిశాక ఏం చేయాలి?

జ. ఎక్కడ ఉపాధి లభించిందని ఉత్తరంలో రాశారో ఆ స్థలానికెళ్లి (ఎంప్లాయిమెంట్ కార్డ్ తోబాటు) రిపోర్ట్ చేసుకోవాలి..

రిపోర్ట్ చేసుకోని పక్షంలో ఏమౌతుంది ?

జ. గ్రామపంచాయితీ లేదా ప్రోగ్రాం అధికారి ఉపాధి దొరికిందని పంపిన ఉత్తరం అందిన 15 రోజుల్లోగా రిపోర్ట్ చేసుకోని పక్షంలో, సదరు దరఖాస్తుదారు నిరుద్యోగభృతిని పొందే అర్హతను కోల్పోవాల్సి ఉంటుంది.

రిపోర్ట్ చేసుకోని పక్షంలో తిరిగిదరఖాస్తు చేసుకోవచ్చా?

జ. చేసుకోవచ్చు.

దరఖాస్తుదారు ఎంత వేతనాన్ని పొందడం జరుగుతుంది?

జ. రాష్ట్రాంలో వ్యవసాయ పనివారికి లభించే కనీస వేతనమే వీరికీ వర్తిస్తుంది.

వేతనాన్ని ఎలా ఇవ్వడం జరుగుతుంది? రోజువారీ ఇస్తారా లేక పీస్-రేటుగా ఇస్తారా?

జ. ఈ యాక్ట్ ప్రకారం, రెండూ సాధ్యమే. పీస్-రేటుగా చెల్లిస్తే, కనీస వేతనాన్నిచ్చే 7గంటల పనికాలాన్ని పాటించాల్సి ఉంటుంది.

వేతనాన్ని ఎపుడు చెల్లిస్తారు?

జ. వేతనాన్ని వారానికోసారి చెల్లిస్తారు. లేదంటే, ఎట్టిపరిస్థితుల్లోనూ 15రోజుల్లోగా చెల్లించేస్తారు. రొజువారీగా చెల్లింపులు జరిగేట్లయితే మొత్తం కూలీలో కొంత భాగాన్ని రోజూ చెల్లిస్తారు.

పనివారికి ఎలాటి సౌకర్యాలుంటాయి?

జ. సురక్షితమైన నీరు, పిల్లలకు నీడ, విశ్రాంతి సమయం, చిన్న ప్రమాదాలేర్పడిలపుడు అత్యవసర ట్రీట్మెంట్కు కావలసిన సరంజామాతో ఫస్ట్ఎయిడ్ బాక్స్ ఉంటుంది.

పని ఎక్కడ కల్పిస్తారు ?

జ. దరఖాస్తుదారు ఇంటిని కేంద్రంగా 5కి.మీ. లోపలే ఇవ్వడం జరుగుతుంది.అలా 5 కి.మీ. దూరంలోపలే ఉపాధి ఇవ్వని పక్షంలో, వారి రవాణా ఖర్చుకు 10 శాతం అదనపు వేతనం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తుదారుల వయోపరిమితిని దృష్టిలో ఉంచుకొని, వయస్సు ఎక్కువ ఉన్నవారికి, మహిళలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది.

పనివారి విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకొంటారు?

జ.యాక్సిడెంట్స్ సంభవిస్తే : పనిచేసే స్థలంలో ఎవరికైనా ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలితే, రాష్ట్ర ప్రభుత్వం సదరు పనివారికి ఉచిత వైద్య సదుపాయాన్ని కలగజేస్తుంది.
ఆసుపత్రి పాలైతే : సదరు రాష్ట్ర ప్రభుత్వం పనివారికి ఉచిత వైద్య వసతి, మందులు, ఆసుపత్రిలో ఉండటానికి ఉచిత వసతి సదుపాయాన్ని కలగజేస్తుంది. అదే గాయపడినవారికి దినభత్యం కింద వారి కనీస వేతనంలో 50 శాతం చెల్లిస్తారు.
మరణం / శాశ్వతలోపం సంభవిస్తే : అలాటి సందర్భాల్లో 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా గానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తంగానీ సదరు మరణించిన, శాశ్వతలోపం సంభవించిన పనివారి వారసులకు చెల్లిస్తారు.

అర్హులైన దరఖాస్తుదారుకు ఉపాధి రాకపోతే ఏం జరుగుతుంది?

జ. అర్హులైన దరఖాస్తుదారుకు దరఖాస్తు చేసుకొన్న 15 రోజుల్లోగా ఉపాధి రాకపోతే వారికి నిరుద్యోగభృతిని షరతుల మేరకు ఇవ్వడం జరుగుతుంది.అలవెన్స్ రేటు - నిరుద్యోగభృతి తొలి 30 రోజులకి వేతనంలో 25శాతం, మిగిలిన ఆర్థిక సంవత్సరానికి 50 శాతం

ఎలాంటి పనిని ఇవ్వడం జరుగుతుంది?

మన్నికైన ఆస్తులు : ఈ పథకంలో గ్రామీణ బీదలకు మన్నికైన ఆస్తులను ఏర్పాటుచేసి వారి జీవనాధారాన్ని శక్తివంతం చేయడం. కాంట్రాక్టర్ల ద్వారా చేసే పనులకు ఇది వర్తించదు.

ఎలాంటి పనులు ఈ పథకం కింద అనుమతింపబడతాయి, వాటి ప్రాధాన్యత

  • నీటిని కాపాడటం, వాటర్ హార్వెస్టింగ్
  • కరువునివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
  • నీటికాలవలు(మైక్రో, చిన్ననీటిపారుదల పనులు)
  • షెడ్యూల్డ్ కులాలు, తెగలు లేదా ఆ భూమి లబ్దిదారులకున్న పొలాలకు నీటికాలవల సౌకర్యం ఏర్పాటు. ఇందులో భూసంస్కరణల వల్ల లబ్ది పొందిన వారి భూములకు, భారత ప్రభుత్వ పథకమైన ఇందిరా ఆవాస్ యోజన కింద భూమిని పొందినవారికీ వర్తిస్తుంది.
  • సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ(చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
  • భూమి అభివృద్ధి
  • వరదల నియంత్రణ, రక్షణ పనులు(నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
  • గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు. ఈరహదార్ల నిర్మాణంలో కల్వర్ట్లను నిర్మించడం కూడా జరుగుతుంది.
  • ఇవేగాక రాష్చ్రాలను సంప్రదించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పనులు.

ప్రోగ్రాం అధికారులు చేసే పనులకెలా బాధ్యత వహిస్తారు ?

జ. పోగ్రాం అధికారులు చేసే పనులకెలా బాధ్యత అనేది ఈ కార్యక్రమ నిరంతర మదింపు, ఆడిట్ల ద్వారా జరుగుతుంది. ప్రోగ్రాంలో ఉండే అధికారులు, దానికి వెలుపల ఉండే అధికారులు ఈ కార్యక్రమపు మదింపు, ఆడిట్లను చేస్తారు. ఈ ఆడిట్ల నిర్వహణ బాధ్యత గ్రామసభలదే. గ్రామసభలు ఒక గ్రామ స్థాయి విజిలెన్స్ను దీనికోసం ఏర్పాటు చేయాలి. ఎలాటి అతిక్రమణలు జరిగినా 1000 రూపాయలదాకా జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే, ఒక ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికో కమిటీ ఏర్పాటు చేయాలి.

ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. పరిధిలోనికి వచ్చే కార్యకలాపాలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏ యే పనులు అనుమతింపబడతాయో అన్నది ఈ పథకం యొక్క ఒకటవ షెడ్యూలులో మొదటి పేరాలో ఈ దిగువన ఇచ్చిన విధంగా పేర్కొనబడింది:

  • నీటి పరిరక్షణ, వాన నీటి సంరక్షణ;
  • వర్షాభావ నిరోధక చర్యలు (అటవీకరణ, మొక్కలు నాటే కార్యక్రమాలు);
  • నీటి పారుదల కాలవలు, చిన్న, సూక్ష్మ నీటి పారుదల పనులు;
  • నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేయడం; తోటల పెంపకం; షెడ్యూలు కులాలు, తెగల వారికి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి, భూ సంస్కరణ లబ్దిదారులకు, భారత ప్రభుత్వం వారి ఇందిరా ఆవాస యోజన లబ్దిదారులకు, 2008 వ్యవసాయ ఋణ మాఫీ పథకం నిర్వచించిన చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములలో అభివృద్ది పనులను చేపట్టడం. (22.7.2009న జారీచేయబడ్డ నోటిఫికేషను ద్వారా వ్యక్తిగత భూములలోచేపట్టే పనుల వలన చేకూరే లబ్ధిని చిన్న, సన్నకారు రైతులకు విస్తరించడం జరిగింది)
  • చెరువులలో పూడిక తీత మరియు ఇతర సాంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ;
  • భూ అభివృద్ది కార్యక్రమాలు;
  • నీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నీరు పోయేటట్లు చేయడం మరియు ఇతర వరద నిరోధక చెర్యలు;
  • అన్ని వాతావరణాలలోనూ అందుబాటులో ఉండే గ్రామీణ అనుసంధానం;
  • గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ విజ్ఞాన కేంద్రంగా భారత నిర్మాణ్ రాజీవ్ గాంధీ సేవా కేంద్రం, మరియు గ్రామ పంచాయతీ భవనం యొక్క నిర్మాణం (11 .11 .2009 న జారీ చేసిన నోటిఫికేషను లో తెలిపినట్లు).
  • రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం అప్పగించిన ఏ ఇతర పనైనా.

ఆధారము: www.pib.nic.in

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొరకు డబ్బులు కట్టనవసరం లేని ఫోన్ లైన్ ద్వారా సహాయం

  • గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, జాతీయ సహాయం టెలిఫోన్ లైన్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, కుటుంబాలకు మరియు ఇతరులకు మంత్రిత్వశాఖ సహాయం పొందుట కొరకు,ఈ చట్టంద్వారా కల్పించబడే హక్కుల పరిరక్షణ కొరకు మరియు సమర్ధవంతంగా ఈ చట్టాన్ని అమలుపరచుటకు ఏర్పాటుచేయబడినది.
  • రుసుము లేని టెలిఫోన్ లైన్ 1800110707.

ఆన్ లైన్ ద్వారా సమస్యల పరిష్కరించే విధానము

మీరు మీ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన సమస్యలపై ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదుచేయుటకు, ‘ప్రజాసమస్యల పరిష్కార విధానం’ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వెబ్ సైట్లో ఉంచబడినది.
ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. మీ యొక్క రాష్ట్రమును ఎంపిక చేసుకొని మరియు జారీ చేయబడు సూచనలననుసరించి ఫిర్యాదును దాఖలు చెయ్యండి.

వార్తలు

ఇకపై మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ కలల పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మారింది. ఈ పథకాన్ని 'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఆర్‌ఈజీఏ)'గా మార్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాత్ముడి ఆశయమైన గ్రామస్వరాజ్యం సాధనలో తోడ్పడుతున్న ఈ పథకానికి జాతిపిత పేరు పెట్టటం సముచితమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఇది మహాత్ముడికి నిజమైన నివాళిగా అభివర్ణించారు. పేరు మార్చే నిర్ణయాన్ని కేబినెట్‌ సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు.

ఆధారము: ఈనాడు

కనీస వేతన రేటు

కేంద్ర పరిధిలో కనీస వేతనాలను చివరగా 2010 అక్టోబర్ 1, 1948 న కనీస వేతన చట్టం కింద సవరించారు. రాష్ట్ర పరిధిలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన రేట్లను అడపాదడపా సవరించాయి. వ్యవసాయ రంగంతో సహా షెడ్యూల్డ్ (నియమిత) ఉద్యోగాలకు నిశ్చయించిన కనీస వేతనాలు సంఘటిత రంగాలకే కాకుండా అసంఘటిత రంగాలకు కూడా వర్తిస్తాయి.
కేంద్ర, రాష్ట్ర పరిధిలో వ్యవసాయంతో సహా అన్ని రంగాలలో నైపుణ్య రహిత నియమిత ఉద్యోగస్తులకు ఇచ్చే కనీస వేతనాలు, ఇప్పటికి అందిన సమాచారం మేరకు ఈ విధంగా ఉన్నాయి:

(ఒక రోజుకు రూపాయలలో)
క్రమ సంఖ్య రాష్ట్రం/ కేంద్ర
పాలిత ప్రాంతం పేరు
అన్నినియమిత ఉద్యోగాలలోని
నైపుణ్య రహిత ఉద్యోగస్తులు
నైపుణ్య రహితవ్యవసాయ కార్మికులు
1 2 3 4
A కేంద్ర పరిధి* 146.00-163.00 146.00 – 163.00
B రాష్ట్ర పరిధి
1 ఆంధ్ర ప్రదేశ్ 69.00 112.00
2 అరుణాచల్ ప్రదేశ్ 134.62 134.62
3 అస్సాం 66.50 100.00
4 బీహార్ 109.12 114.00
5 ఛత్తీస్ గఢ్ 100.00 100.00
6 గోవా 150.00 157.00
7 గుజరాత్ 100.00 100.00
8 హర్యానా 167.23 167.23
9 హిమాచల్ ప్రదేశ్ 110.00 110.00
10 జమ్మూ మరియు కాశ్మీర్ 110.00 110.00
11 జార్ఖండ్ 111.00 111.00
12 కర్ణాటక 72.94 133.80
13 కేరళ 100.00 150.00 (తేలిక పనికి)
200.00 (భారీ పనికి)
14 మధ్య ప్రదేశ్ 110.00 110.00
15 మహారాష్ట్ర 90.65 100.00 – 120.00
16 మణిపూర్ 81.40 81.40
17 మేఘాలయ 100.00 100.00
18 మిజోరం 132.00 132.00
19 నాగాలాండ్ 80.00 80.00
20 ఒరిస్సా 90.00 90.00
21 పంజాబ్ 127.25 (భోజనంతో పాటు) 127.25 (భోజనంతో పాటు)
142.68(భోజనం లేకుండా) 142.68 (భోజనం లేకుండా)
22 రాజస్తాన్ 81.00 100.00
23 సిక్కిం 100.00 -
24 తమిళ్ నాడు 87.60 100.00
25 త్రిపుర 81.54 100.00
26 ఉత్తర్ ప్రదేశ్ 100.00 100.00
27 ఉత్తరఖండ్ 91.98 113.68
28 పశ్చిమ బెంగాల్ 96.00 96.00
29 అండమాన్ మరియు
నికోబార్ దీవులు
అండమాన్ 156.00 156.00
నికోబార్ 167.00 167.00
30 చండీగర్ 170.44 170.44
31 దాద్రా మరియు నాగర్ హవేలీ 130.40 130.40
32 డామన్ మరియు డయ్యూ 126.40 -
33 ఢిల్లీ 203.00 203.00
34 లక్షద్వీప్ 147.40 -
35 పుదుచ్చేరి
పుదుచ్చేరి/కరైకల్ 100.00 100.00 (6 గంటలకు)
మాహే 120.00 (8 గంటలు
ఆడవారు చేసే తేలిక పనికి )
160.00 (8 గంటలు
మగవారు చేసే భారీ పనికి)
* వివిధ ప్రాంతాలలో.# వివిధ ప్రదేశాలలో (జోన్లలో).

ఈ చట్టం అమలు జరిగేలా చూడడం రెండు స్థాయిలలో జరుగుతుంది. కేంద్ర పరిధిలో ఈ చట్టం అమలును కేంద్ర పారిశ్రామిక సంబంధాల యంత్రాంగం (సి.ఐ.ఆర్.ఎం.) గా వ్యవహరించే ముఖ్య కార్మిక కమిషనరు (కేంద్ర) కార్యాలయపు తనిఖీ అధికారులు పర్యవేక్షిస్తారు. రాష్ట్ర పరిధిలో ఈ చట్టం అమలయ్యేలా స్టేట్ ఎన్ఫోర్స్ మెంట్ యంత్రాంగం చూస్తుంది. వీరు తరచూ తనిఖీలు జరిపి, కనీస వేతనం కన్నా తక్కువ మొత్తం (delete) చెల్లిస్తున్నట్టు కానీ, అసలు చెల్లించనట్లు గానీ కనుగొంటే, ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించ వలసినదిగా సంబంధిత యజమానులను ఆదేశిస్తారు. అలా చెల్లించని పక్షంలో, ఈ చట్టం యొక్క 22 వ సెక్షను కింద ఆ యజమానులమీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.

ఆధారము: www.pib.nic.in

3.00063897764
సుధాకర్ రావు Jun 27, 2019 12:41 PM

ఉపాధి హామీ పథకం లో ఫీల్డ్ అసిస్టెంటుగా విధులను నిర్వహిస్తున్న వ్యక్తికి ఉద్యోగ భద్రత నియమాలు ఏమిటి? రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఫీల్డ్ అసిస్టెంటు ను తొలగించవచ్చునా? ఫీల్డ్ అసిస్టెంటు ఉద్యోగ భద్రత విషయంలో ఉపాధి హామీ చట్టం ఏమి చెప్తోంది?

ధరవత్ సుధాకర్ Sep 17, 2018 06:38 PM

ఉపాధి హామీ పథకం పని చేసిన పనికి డబ్బులు రాలేదు

కుమార్ May 23, 2018 07:03 AM

యోజనులు అంటున్నారు కొన్ని గ్రామాల లో 11 సం" నుండి 16 సం పిల్లలు పని చేస్తున్నరు వారి పై ఏ విద మై న ఆంక్షలు ఉన్నాయా

నరేష్ కుమార్ మద్దెల May 17, 2018 07:00 AM

నాకు జాబ్ కార్డు ఉంది ,నేను కుడా అప్లై చేసుకోవచ్చా .

పసుల సురేష్ Apr 25, 2018 11:31 AM

డబ్బులు రాలేవు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు