హోమ్ / వ్యవసాయం
పంచుకోండి

వ్యవసాయం

ఈ పోర్టల్ లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాటించే అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.

  • Site

    ఆధునిక పద్ధతులతో వ్యవసాయం లాభసాటి

    ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటించగలిగితే వారి పంట ఉత్పత్తి అధికమవుతుంది. రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన, సలహా సూచనలను అందించాలి. గ్రామాల్లో పప్పుదినుసులు పండించే రైతులకు అవగాహన కల్పించాలి.

  • Site

    పైసా పెట్టుబడి లేని వ్యవసాయం

    రెండు ఎద్దులు, కఱ్ఱనాగలి చాలు. వ్యవసాయం చేయవచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో 30 ఎకరాల మిశ్రమ పంటలు పండించవచ్చు. ఆవు పేడ, మూత్రంతో వానపాములు, కుమ్మరి పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి సారవంతమవుతుంది. ఆవుపేడ, మూత్రం, పెసర, మినుము, శనగ గింజల పొడుల మిశ్రమం పొలంలో వేస్తే భూమికి అమృతంగా పని చేస్తుంది.

  • Site

    సత్ఫలితాలనిస్తున్న "ఈ-సాగు"

    హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మీడియా లాబ్స్ ఆశియా వారు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన "ఈ-సాగు" కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ వినూత్న ప్రయోగంతో రైతులు ఎకరాకు సుమారు రు. 3874 పెట్టుబడులపై ఆదా చేయగలుగుతున్నారు.

గ్రామీణ భారతంలో జీవనోపాధినిచ్చేది నిస్సందేహంగా వ్యవసాయమే (అనుబంధ రంగాలతో). మనం ఎలక్ట్రానిక్ యుగంలోకి అడుగుపెట్టాం. దానికి తోడు కొత్త కల్పనలు, ఆవిష్కరణలూ ఎన్నో వస్తున్నాయి. దీనికి వ్యవసాయ రంగం అతీతమైనది ఎమీ కాదు. అందువల్ల వ్యవసాయదారులందరికీ ఈ రంగంలో వస్తున్న వినూత్న మార్పుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన పరిజ్ఞానం గురించి ఉపయుక్తమైన సమాచారాన్ని గ్రామీణ భారతంలోని రైతులోకానికీ, మరియు రైతులకు సేవలందించే వారికీ తెలియాలి. అలా అందుబాటులోకి తేవడమే ఈ పోర్టల్ లక్ష్యం.

గ్రామీణ వ్యవసాయ రంగంలో వివిధ భాగస్వాములు అంటే-రైతులు, సహకార సంస్థలు, ఔద్యోగిక సంస్థలు, వ్యవసాయ పనిముట్ల క్రయవిక్రయదారులు, ఎరువులు, రసాయనిక కంపెనీలు, బీమా సంస్థలు, అగ్రోనమిస్టులు, కన్సల్టెంట్స్, సలహాదారులు వంటి వారికోసం ఈ పోర్టల్ ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసి, ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలను చూపే విధంగా ప్రయత్నిస్తుంది.

ఈ పోర్టల్ లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాటించే అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.

సమయానికి నమ్మకమైన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా స్ధానిక భాషల్లో అందించి, అనుభవజ్ఞులతో పరస్పర సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, రోజువారీ పనులు ప్రణాళిక చేసుకోవడానికి ఒక వేదిక నందిస్తుంది., అవసరమైనప్పుడు అన్ని రకాల సహాయాలు, సలహాలూ అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో మేము ఒక వ్యవసాయ జ్ఞాన సమాజాన్ని చూడ గోరుతున్నాం.

పంట ఉత్పత్తి

ఈ విభాగం ఉత్పత్తి మరియు పంటకోత అనంతర పరిజ్ఞానాలు, వ్యవసాయ పెట్టుబడులు వ్యవసాయ పనిముట్లు, వాతావరణం, మార్కెటింగ్ విజయవంతమైన పంట ఉత్పత్తి మరియు వివిధ అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది.

పశు సంపద

పశు సంపద, ఆవుల జాతులు, కోళ్ళ జాతులు, మేకల పెంపకం, కుందేళ్ళ పెంపకం, గొఱ్ఱెల పెంపకం, పందుల పెంపకం, ఎమూ, కౌజు, టర్కీ, రాష్ట్రాల పాడి పశువుల అభివృద్ధి, సాంకేతిక, జాతులు, ఆర్థిక సహాయ, మోడల్ ప్రాజెక్టులు, పాల, పౌల్ట్రీ, పంది, మేక, గొర్రె, కుందేలు యొక్క వాణిజ్య ఉత్పత్తి కేస్ స్టడీస్ సహా పశువుల నిర్వహణ యొక్క అనేక కోణాలను, ఈ విభాగంలో ఉన్నాయి.

మత్స్య పరిశ్రమ

మత్స్య సంపద. చేపల పెంపకంద్వారా వ్యర్ధ జలాల శుద్ధి , గట్టి పెంకు పీతల ( మడ్ క్రాబ్స్ ) పెంపకం , మంచినీటిలో ముత్యాల పంట (పెర్ల్ కల్చర్) , కార్ప్ జాతి మంచినీటి చేపల పెంపకం,లోతట్టు మత్స్య, రొయ్యల సంస్కృతి, అలంకరణ చేపలు ఉత్పత్తి,చేప ఉత్పత్తి యొక్క వివిధ కోణాలు, యంత్రాలు మొదలైనవి వివరాలు ఈ విభాగం అందిస్తుంది.

వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు

ఆధునిక మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ తేనెటీగల పెంపకం పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకం పెరటి తోటల పెంపకం వర్మి కంపోస్టు ఆగ్రి బిజినెస్ గ్రామీణ పరిజ్ఞానం మొదలగునవి ఇందులో పొంద పరిచినవి.

వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు

శ్రీ వరి సాగు, రైతు అనుభవాలు, ఖచ్చిత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మొదలగు విషయాలు ఈ విభాగం లో ఉన్నాయి.

పథకములు

వ్యవసాయానికి సంబంధించిన పథకాలు మరియు స్కీములు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఉపాధి కల్పన, మత్స్య సంపద ఉన్నాయి.

అప్పు మరియు బీమా పథకాలు

వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు సంబంధించిన వ్యవసాయ రుణ మరియు బీమా ఉత్పత్తులు వివిధ అంశాలను వివరించబడినవి.

వివిధ సంస్ధల వివరాలు

వివిధ ఏజన్సీల, వ్యవసాయం, పశు పోషణ మరియు వ్యవసాయ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వినూత్న రైతులు, వ్యవసాయ పోర్టల్, సంబంధిత మంత్రిత్వశాఖలు, సరుకు బోర్డ్ మరియు వారి సంప్రదింపు వివరాలు జాబితా లో అందిస్తున్నాం.

చర్చా వేదిక - వ్యవసాయం

ఈ వేదిక వ్యవసాయ సంబంధిత సమస్యలకు చర్చ కోసం అందుబాటులో ఉంది.

3.10132774284
సత్య నారాయణ Mar 22, 2018 03:24 PM

పచ్చి మిర్చి పంట కు 2 నెల ల వయస్సు లో వచ్చే ఆకు ముడత బింగి కి వాడవలసిన మందులు తేలియ చేయండి

n .వెంకట సుబ్బా రెడ్డి Jun 22, 2017 08:27 PM

మాకు వరి పసుపు ఉల్లి మిర్చి పంట సాగు గురించి తెగుళ్లు గురించి వాటి నివారణకు చర్యలు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయగరు

ఇ. వి. మద్దిలేటి Apr 13, 2017 10:57 AM

మిరప క్వింటా ధర ఏంత?

boyinibalaswamy Mar 13, 2017 11:14 PM

పోట్టేలు త్వరగా బరువు పెరగాలంటే ఎమిఎమి మేత పెట్టాలి సార్

vinod Dec 11, 2016 09:15 PM

పాపయ లో రింగ్ స్పోర్ట్ వైరస్ కో మందలు వాడాలి కంట్రోల్ అవుతుందా .అలాగా పోత పాటలంటే యామె ఛాయలే వడలిసన మందలు ఏవ్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు