హోమ్ / ఇ-పాలన / ఆధార్ / ఆధార్ డేటా అప్ డేట్ (మార్పులు)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆధార్ డేటా అప్ డేట్ (మార్పులు)

ఆధార్ డేటా డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్) & బయోమెట్రిక్ డేటా అప్ డేట్ (మార్పులు) చేసుకోవడం మరియు దాని అవసరం గురించిన సమాచారం.

ఆధార్ డేటా అప్ డేట్ ఎందుకు

ప్రభుత్వం & ప్రభుత్వేతర సేవలు, సబ్సిడీ ప్రయోజనాలు, పెన్షన్లు, ఉపకార వేతనాలు, సామాజిక ప్రయోజనాలు, బ్యాంకింగ్ సేవలు, భీమా సేవలు, టాక్సేషన్ సేవలు, విద్య, ఉపాధి, ఆరోగ్య మొదలగు వివిధ రకాల సేవలకు ఆధార్ తోడ్పడుతున్నది మరియు వాటిలో ఆధార్ డేటాను నిర్ధారించడానికి సిఐడిర్ డేటాబేస్ నందు నిల్వవున్న నివాసి ఆధార్ డెమోగ్రాఫిక్ & బయోమెట్రిక్ డేటా ఖచ్చితంగా మరియు నవీనమై (అప్ డేట్) ఉండవలసిన అవసరం ఉన్నది.

ఆధార్ లో అప్ డేట్ చేయగలిగే వివరాలు:

డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ పేరు, పుట్టిన తేది (వెరిఫై చేయబడిన) లేదా వయసు (ప్రకటించబడింది), జెండర్, చిరునామా, మొబైల్ నెంబర్ (ఇష్ట ప్రకారమైన) మరియు ఇమెయిల్ ఐడి (ఇష్ట ప్రకారమైన)
బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ పది వేలిముద్రలు, రెండు కళ్ళ సంగ్రహణ (క్యాప్చర్), మరియు ముఖ ఫోటో

ఆధార్ డెమోగ్రాఫిక్ డేటా అప్ డేట్ ఆవశ్యకత:

 • వివాహం వంటి జీవిత సంఘటనల ద్వారా నివాసితులు వారి పేరు మరియు చిరునామా వంటి వారి ప్రాథమిక డెమోగ్రాఫిక్ వివరాలను మార్చడానికి దారితీయవచ్చు. కొత్త ప్రాంతాలకు వలస వెళ్లడం కారణంగా కూడా చిరునామా మరియు మొబైల్ నంబరు మారిపోవచ్చును. నివాసితులు వారి బంధువుల వివాహం, మరణం వంటి మొదలైన జీవిత సంఘటనల మార్పుల కారణంగా వారి వివరాలు మార్చాలి అనుకోవచ్చును. అదనంగా, నివాసితులు ఇతర వ్యక్తిగత కారణాలతో వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ మొదలైనవి మార్చుకోవచ్చును.
 • నివాసితులు వివిధ సర్వీస్ డెలివరీ ప్లాట్ఫారమ్ లలొ డిక్లరేషన్ అభ్యర్థన మార్పులు మరియు సిఐడిర్ కు మొబైల్ నంబరును జోడించడం వంటి మార్పులకు దారితీయవచ్చు.
 • ఆధార్ నమోదుచేసే సమయంలో నివాసితుల డెమోగ్రాఫిక్ డేటాను తప్పుగా క్యాప్చర్ చేసిన లోపాల వలన. "పుట్టిన తేది/వయసు" మరియు "లింగం (జెండర్)" వివరాలు ప్రధాన ఎన్రోల్మెంట్ తప్పులుగా భావిస్తున్నారు.
 • యుఐడిఎఐ కూడా ఎన్రోల్మెంట్ / అప్ డేట్ సమయంలో సేకరించిన ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) మరియు ఇతర డాక్యుమెంట్ల యొక్క లభ్యతను నిర్ధారించేందుకు వారిని డెమోగ్రాఫిక్ సమాచారాన్ని అప్డేట్ మరియు అవసరమైన డాక్యుమెంట్ ను సమర్పించాలని నివాసికి తెలియజేయవచ్చును.

ఆధార్ బయోమెట్రిక్ డేటా అప్ డేట్ ఆవశ్యకత:

 • పిల్లలు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ డేటాను (10 చేతి వేళ్లు మరియు 2 కళ్ళ సంగ్రహణ (క్యాప్చర్), మరియు ముఖ ఫోటో) అందించి నమోదు (రీ ఎన్రోల్మెంట్) చేసుకోవాలి. పిల్లలకు ఈ వయసులో నకలు తీసివేయడం జరుగుతుంది. ఈ అభ్యర్థన కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్ అభ్యర్థనను పోలి వ్యవహరించబడుతుంది.
 • 5 మరియు 15 సంవత్సరముల వయస్సు లో ఎన్రోల్మెంట్ - నివాసి (రెసిడెంట్) 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అప్ డేట్ ల కోసం అన్ని బయోమెట్రిక్స్ ను సమకూర్చుర్చాలి.
 • >15 సంవత్సరాల వయసులో ఎన్రోల్మెంట్ - నివాసితులు వారి బయోమెట్రిక్ డేటాను ప్రతి 10 సంవత్సరాలకు అప్ డేట్ సిఫార్సు చేయబడును.
 • ప్రమాదాలు లేదా వ్యాధులు వంటి వాటి వాళ్ళ బయోమెట్రిక్ మినహాయించబడును.
 • ఆధార్ నిర్ధారిత సర్వీసు సర్వవ్యాప్తిగా మారుతోంది, నివాసితులు కూడా బయోమెట్రిక్ అప్ డేట్ ల కోసం సంప్రదించే అవకాశం ఉంది ఎందుకంటే ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) సమయంలో అస్పష్ట నాణ్యత గల బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడం వలన వచ్చే ఆధార్ నిర్దారణ రిజెక్ట్ ల (ఫాల్స్ రిజెక్ట్స్ గా పిలువబడే - చెల్లుబాటు అయ్యే ఒక ఆధార్ సంఖ్యతో సరైన నివాసి తప్పుగా తిరస్కరించబడి ఉండవచ్చు) వలన కావచ్చు.
 • యుఐడిఎఐ ఎన్రోల్మెంట్ / అప్ డేట్ సమయంలో క్యాప్చర్ చేసిన బయోమెట్రిక్ నాణ్యతను తనిఖీ (వెరిఫై) చేసి మరియు కనీస ప్రమాణాల్ని నిర్ణయిస్తుంది. అందరూ నివాసితుల బయోమెట్రిక్స్ లో ఎవరి బయోమెట్రిక్స్ అయితే కనీస ప్రమాణాల్ని కలిగి ఉండవో వారిని యుఐడిఎఐ బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోమని తెలియజేయబడవచ్చు.

అప్ డేట్ చేసుకోవడానికి (మోడ్) పద్ధతులు:

1. ఆన్లైన్ సెల్ఫ్ అప్డేట్ పోర్టల్ ద్వారా: సెల్ఫ్ సర్వీస్ ఆన్లైన్ మోడ్ ద్వారా నివాసితులు నేరుగా పోర్టల్ నందు డెమోగ్రాఫిక్ అప్డేట్ అభ్యర్థనను పంపవచ్చును. సెల్ఫ్ అప్డేట్ పోర్టల్ లోనికి లాగిన్ అవడానికి పౌరుడి ఆధార్ సంఖ్య మరియు నమోదైన మొబైల్ నంబర్ అవసరం. రెసిడెంట్ అతని / ఆమె రిజిస్టరైన మొబైల్ నంబర్ ఒటిపి (OTP) ఉపయోగించి నిర్దారించబడతారు. అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయడానికి నివాసి ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి, తర్వాత యుఐడిఎఐ అప్ డేట్ బ్యాక్ ఆఫీస్ వద్ద ఒక వెరిఫైర్ ద్వారా పరిశీలింపబడుతుంది. నివాసి ఈ సర్వీసును ఉపయోగించి అప్డేట్ అభ్యర్థన కోసం ఆధార్ తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయివుండాలి.

2. పోస్ట్ ద్వారా: నివాసితులు మొబైల్ తప్ప మిగతా డెమోగ్రాఫిక్ వివరాలను అప్డేట్ అభ్యర్థన ఫారమ్ ను పూర్తి ఆధార్ డేటాతో సహాయక పత్రాలను పోస్ట్ ద్వారా పంపించి అప్డేట్ చేయవచ్చును. అప్ డేట్ అభ్యర్థన బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చెయ్యబడుతుంది మరియు అప్ డేట్ అభ్యర్థన అందిన ఎస్ఎంఎస్ ను తర్వాత యుఐడిఎఐ ద్వారా నివాసితులకు పంపబడుతుంది. అప్ డేట్ అభ్యర్థనను ఈ క్రింది ఏ చిరునామాకు అయినా పంపవచ్చు:

 • UIDAI, Post Box No. 10 Chhindwara, Madhya Pradesh- 480001 India (యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10 చింద్వార, మధ్యప్రదేశ్ Pradesh- 480001 భారతదేశం)
 • UIDAI, Post Box No. 99, Banjara Hills, Hyderabad – 500034 India (యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 99, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034 భారతదేశం)

౩. పర్మినెంట్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా: ఈ మోడ్ లో నివాసితులు పర్మినెంట్ ఎన్రోల్మెంట్ కేంద్రంవద్ద ఒక ఆపరేటర్ సహాయంతో డెమోగ్రాఫిక్ / బయోమెట్రిక్ అప్ డేట్ అభ్యర్థనను చేసుకోవచ్చును.

ఆధార్ అప్ డేట్ స్టేటస్ (స్థితిని) తెలుసుకోవడం: ఆధార్ అప్ డేట్ ప్రక్రియ పూర్తయిన నివాసులు వారి ఆధార్ అప్డేట్ అయినదా లేదా ఇంకా జనరేషన్ కింద ఉందా అను స్టేటస్ (స్థితిని) ఈ లింక్ లోకి వెళ్లి వారి అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) ద్వారా తెలుసుకోవచ్చుhttps://ssup.uidai.gov.in/web/guest/check-status

ఇ-ఆధార్ డౌన్ లోడ్: ఇప్పుడు మీరు మీ ఆధార్ యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://eaadhaar.uidai.gov.in/

3.12686567164
Devid paul Jul 01, 2019 11:14 AM

పేరు మార్చాలి

Hanumantharao Nov 18, 2017 10:00 PM

How to changing aadhar address

రామకృష్ణ Nov 03, 2016 09:58 PM

Sir నాపేరు లక్ష్మి మాది తెలంగాణ నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది మా అత్తగారిది ఆంద్రప్రదేశ్ , నేను మా అత్తగారి రేషన్ కార్డులో యాడ్ అవ్వాలని వి.ఆర్.ఓ అండ్ ఆర్.ఐ తో సంతకాలు చేయించి ఆన్లైన్ చేస్తుంటే మా అత్తగారి రేషన్ కార్డులో నా ఆధార్ కార్డు నెంబర్ ఆడ్ అవడం లేదు అని మీ సేవ వాళ్లు అంటున్నారు . ఎందుకు ఆడ్ అవడం లేదు సర్
నా ఆధార్ కార్డు పుట్టింటి నుండి అత్తగారి ఇంటికి ట్రాన్స్ఫర్ అండ్ కర్రెచ్షన్ చేయించాను కానీ ఆన్లైన్ లో పుటింటి కాడిది అలాగేవుండి మల్లి ఇక్కడ అడ్రస్ తో ఇంకొకటి వచ్చింది రెండు ఆధార్ కార్డులు వున్నాయి వేరువేరు అడ్రస్ లతో అల ఉండటం వలన రేషన్ కార్డు లో ఆడ్ అవడంలేదా ?
పుట్టింటి కాడ ఆధార్ కార్డు ఎలా పుర్తిగా తీసివేయాలి ? ? ? దయ చేసి తెలియజేయగలరు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు