హోమ్ / ఇ-పాలన / డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు / ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై తరచుగ అడిగె ప్రశ్నలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై తరచుగ అడిగె ప్రశ్నలు

ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై తరచుగ అడిగె ప్రశ్నలు

ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏమిటి

నెట్ బ్యాంకింగ్ ఒక ఆన్లైన్ బ్యాంకు సైట్. దీన్ని ఉపయోగించి మీరు మీ బ్యాంకు ఖాతా కు సంబంధించిన వివిధ సేవలను ఎప్పుడైనా, ఎక్కడైనా  మరియు  ఏ స్థానం నుండైనా యాక్సెస్ చేయవచ్చు. మీకు ఇ బ్యాంకింగ్ ఉంటే, మీ బ్యాంకు మీతో ప్రయాణిస్తుంది.

ఆన్లైన్ బ్యాంకింగ్ ఎందుకు

ఆన్లైన్ బ్యాంకింగ్ మీరు బ్యాంకింగ్  చేసే  పధ్ధతి ని పూర్తిగా మార్చేస్తుంది . దీని వాడటం ద్యారా మీరు దేశంలో ఎక్కడనించి అయినా 24 గంటలు 365 రోజులు మీ బ్యాంకు లావాదేవీలు చేయవచ్చు

ఆన్లైన్ బ్యాంకింగ్ ఎవరు ఉపయోగించవచ్చు

ఆన్లైన్ బ్యాంకింగ్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులు ఉపయోగించవచ్చు. కానీ ఉమ్మడి ఖాతాలు ఉన్న రెసిడెంట్ వినియోగదారులుఉమ్మడి ఆపరేటింగ్ మెండెట్  ఉండివుంటాయ్ ఈ ఖాతాల పై వివరాలు మాత్రమే చూడవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుమతి లేదు అయితే "ఐథెర్ లేదా సర్వైవర్" మెండెట్ తో ఉమ్మడి ఖాతాల కేసులో ఉమ్మడి సంతకాలతో అప్లికేషన్ బ్యాంకు సమర్పించి ఆన్లైన్ బ్యాంకింగ్ చేయవచ్చు

ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడానికి ఏమి అవసరం

మీకు కనీసం PII ప్రాసెసర్, 32 MB RAM ఉన్న ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6.0 బ్రౌజర్ అవసరం ఉంటుంది

నా దగ్గర ఒక సొంత కంప్యూటర్ లేకపోతే ఏమి చేయాలి

మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ కలిగి ఏ కంప్యూటర్ ద్వారా ఐనా ఇ-బ్యాంకింగ్ యాక్సెస్ చేయవచ్చు

ఒక సైబర్ కేఫ్ నుండి ఇ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ సురక్షితమైందేనా

అవును, సైబర్ కేఫ్ నుండి ఇ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ సురక్షితమైందే.అయితే మీరు మీ పాస్వర్డ్లను అందరికి తెలిసేలా టైప్ చేయ కూడదు  . అదే విధంగా మీరు మీ ఇ బ్యాంకింగ్ ఖాతా నుండి లాగ్అవుట్ పూర్తి చేయాలి. దయచేసి మీరు మీ బ్యాంక్ సైట్లో ఆన్లైన్ భధ్రత మార్గదర్శకాలును చదివి అనుసరించండి

నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల యాక్సెస్ ఎలా పొందగలను

మీ పేరుతొ ఒక బ్యాంకు ఖాతా ఉండటం  అవసరం. మీరు మీ బ్యాంకు శాఖలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కోసం అప్లికేషన్ ఫారం నింపి నమోదు చేయాలి. మీ బ్యాంకు అప్పుడు మీ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కొరకు యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ జారీ చేస్తుంది

నేను ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ [ఎన్నారై]. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చా

అవును, మీరు మీ బ్యాంకు శాఖ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కోసం నమోదు చేయవచ్చు. మీ బ్యాంకు మీ విదేశీ చిరునామాకు మీ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ పంపుతుంది.

నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కోసం యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎలా పొందవచ్చు

మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ మీరు బ్యాంకు లో నమోదు చేసుకున్న చిరునామాకు పంపబడుతుంది

నేను ఎన్ని బ్యాంకు పాస్వర్డ్లను అందుకుంటాను

మీరు మీ ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ లాగిన్ అవ్వడానికి ఒక లాగిన్ పాస్వర్డ్ మరియు లావాదేవీలు చేయడం కోసం ఒక లావాదేవీ పాస్వర్డ్ను అందుకుంటారు.

నేను నా ఇ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చవచ్చా

అవును, మీరు మీ పాస్వర్డ్ను అనేక సార్లు మార్చవచ్చు కానీ మీరు మీ id మార్చలేరు

మీరు మీ పాస్వర్డ్ను ఎలా సృష్టంచాలి

  1. పాస్వర్డ్ మరియు మీ యూజర్ పేరు ఒకేలా ఉండకూడదు. ఉదాహరణకి మీ యూజర్పేరు "వెంకట్" ఉంటే అప్పుడు మీ పాస్వర్డ్ "వెంకీ" ఉండకూడదు.
  2. పస్స్వర్డ్లో తప్పనిసరిగా కనీసం ఒక అంకె, ఒక అక్షరం మరియు ప్రత్యేక అక్షరం (స్పెషల్ క్యారెక్టర్ @#$%&*) ఉండాలి.
  3. మీ పాస్వర్డ్ను సృష్టించేటప్పుడు ఖాళీలు ఉపయోగించకూడదు .
  4. పాస్వర్డ్ కనీసం 8 అక్షరాలు మరియు గరిష్టంగా 14 అక్షరాలు కలిగి ఉండాలి.
  5. మీ కొత్త పాస్వర్డ్ మీ మునుపటి 3 పాస్వర్డ్ లు ఒకేలా ఉండకూడదు.

ఒక సురక్షిత పాస్వర్డ్ను సృష్టించడానికి అనుసరించవలసిన మంచి పద్ధతులు ఏమిటి

  1. పాస్వర్డ్ సృష్టించడానికి డిక్షనరీ పదం ఉపయోగించవద్దు.
  2. ఇతరులకు తెలిసిన వ్యక్తిగత సమాచారాన్ని , కుటుంబ సభ్యులు పేర్లు, పెంపుడు జంతువుల పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యలు మొదలైనవి ఉపయోగించవద్దు.
  3. తరచుగా మీ పాస్వర్డ్ను మార్చాలి.
  4. దయచేసి పాస్వర్డ్ను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.
  5. మీ పాస్వర్డ్ను ఎక్కడా రాయకండి
  6. మీరు మీ పాస్వర్డ్ మరియు వ్యక్తిగత సమాచారం ఎవరికి చెప్పవద్దు . ఎవరైనా బ్యాంకు నుండి ధృవీకరణ కోసం కాల్ చేస్తున్నామని చెప్పినా  మీ పాస్వర్డ్ను చెప్పవద్దు

లాగిన్ పాస్వర్డ్ను మర్చిపోతే ఏం చేయాలి

  1. వ్యక్తిగత వినియోగదారులు కొత్త పాస్వర్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ లో " ఫోర్గెట్ / రీసెట్ " పాస్వర్డ్ లింకులు ఉపయోగించి తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు.
  2. మీరు మీ బ్యాంకు శాఖ వద్ద కొత్త పాస్వర్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ బ్యాంకు మీ కొత్త పాస్వర్డ్ను మీ నమోదిత చిరునామాకు పంపుతుంది.

మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి ని మర్చిపోతే ఏమి చేయాలి

ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి ని మర్చిపోతే, దయచేసి మీ శాఖని సంప్రదించండి.

నేను బ్యాంకు కేటాయించిన కస్టమర్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయలేకపోతున్నాను దీని కారణం ఏమిటి

మీ బ్యాంకు ద్వారా మీకు అందించబడిన పాస్ వర్డ్ లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి. మీ పాస్ వర్డ్ లు మొదటిసారి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేయండి . మీరు ఇప్పటికీ లాగిన్ చెయ్యలేకపోతే మీ బ్యాంకు బ్రాంచి ని సంప్రదించండి

నేను ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ పేరు అందుకున్నాను కానీ పాస్ వర్డు అందుకోలేదు. నేను ఎమి చెయ్యాలి

యూజర్ పేరు మరియు పాస్వర్డ్ను భద్రతా కారణాలుగా ప్రత్యేక కవర్స్లో వేరువేరుగా పంపుతారు. మీకు యూజర్ ID లేదా పాస్వర్డ్ లో ఏ ఒకటి అందకపోయినా , దయచేసి మీ బ్యాంకు బ్రాంచిని సంప్రదించండి

ఇంటర్నెట్ బ్యాంకింగ్ యెంత సురక్షితం

మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ బాగా సురక్షితమైనది. మీ బ్యాంకు మీ ఆన్లైన్ లావాదేవీల భద్రత కోసం 128 బిట్ నుండి 256 బిట్ SSL ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తుంది. ఈ ఎన్క్రిప్షన్ కారణంగా ఇంటర్నెట్లో ఎవరూ ఈ డేటా యాక్సెస్ చేయలేరు

నేను లాగ్అవుట్ చేయకపోతే ఏమి జరుగుతుంది

దయచేసి మీ ఆన్లైన్ లావాదేవీలు పూర్తయిన తర్వాత సరైన విధంగా లాగ్అవుట్ చేయండి. ఏ కారణాలు వల్లనైనా మీరు ఆకస్మికంగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజీ మూసివేస్తే మీ ఆన్లైన్ సెషన్ ముగుస్తుంది. అదే విధంగా మీరు కొంత సమయం ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ ఉపయోగించకపోతే మీ బ్యాంకింగ్ పేజీ ముగుస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ సురక్షితమా

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అత్యంత సురక్షితమైనది. మీ బ్యాంకులు మరియు ఇతర బ్యాంకుల్లో ఖాతాలకు (నెఫ్ట్ మరియు RTGS ద్వారా) ఫండ్ ట్రాన్స్ఫర్ లబ్దిదారుని నమోదు మరియు గుర్తించిన తర్వాతే చేయవచ్చు. ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ మీ లావాదేవీ పాస్వర్డ్ ఉపయోగించటం ద్వారా చేయవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ లావాదేవీలకు OTP అడుగుతాయి .ఈ ఒటిపి మీ నమోదైన మొబైల్ నంబర్ కు పంపబడుతుంది.

నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఏమి చేయవచ్చు

నెట్బ్యాంకింగ్ ఉపయోగించి మీరు

  1. మీ ఖాతా వివరాలు (డిపాజిట్, క్రెడిట్ , రుణాలు, డిమాట్ ) చూడగలరు.
  2. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు
  3. మీ చెక్ పై చెల్లింపు ఆపవచ్చుఁ
  4. డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్డర్ చేయవచ్చు
  5. మీ విద్యుత్, నీరు, హౌస్ పన్ను మరియు పురపాలక బిల్లులు చెల్లించవచ్చు
  6. మీ ఎయిర్ టికెట్ / రైల్వే టికెట్ బుక్ చేయవచ్చు
  7. కొత్త చెక్ పుస్తకం కోసం అప్లికేషన్ చేయవచ్చు.
  8. మీ ఆన్లైన్ కొనుగోలు కోసం డబ్బు చెల్లించవచ్చు.
  9. మీ బ్యాంకు కు ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు
  10. అభ్యర్థన స్థితి కోసం తనిఖీ చేయవచ్చు
ఆధారం: వివిధ బ్యాంకు వెబ్సైట్లు
2.9649122807
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు