పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అస్సాం

ఈ విభాగం అస్సాం రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

కంప్యూటర్ ద్వారా పాస్ పోర్టు పొందే విధానము

 • ధరఖాస్తు చేసిన వెంటనే రసీదు పొందుట.
 • పాస్ పోర్టుల పునఃసృష్టి, పోగొట్టుకొనుట మరియు పాడైపోవుట లాంటి విషయములకు సంబంధించిన కేసులను నిర్వహించుట .
 • పాస్ పోర్టు ధరఖాస్తు యొక్క  స్థితిని గూర్చిన వివరాలు ఇచ్చుట.
 • గౌహాతి పాస్ పోర్టు కార్యాలయ పరిధిలోనున్న ఏడు ఈశాన్య  రాష్ట్రాల పాస్ పోర్టులను ముద్ర (ప్రింట్) వేయుట.

జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ ఆర్ సి)

 • చేతితో వ్రాయబడిన జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ ఆర్ సీస్) కి సంబంధించిన సమాచారాన్నంతా డాటాబేస్ రూపంలో  ఆయా భాషలో సంగ్రహించి పెడతారు.
 • వివిధ రకాలైన సమాచార పట్టికలను సాఫ్ట్వేర్ ఉత్పత్తిచేస్తుంది.

కంప్యూటరైజ్డ్ చేయబడిన భూసమాచార విధానము

 • అస్సాంలోని మొత్తం ఇరవైఏడు జిల్లాలలో, ఇరవై జిల్లాల భూసమాచారము కంప్యూటరైజ్డ్ చేయబడినది.
 • ప్రస్తుతము అస్సాంలోని ఆరు జిల్లాలలో, భూస్వంతదారులకు జమాబంధి (హక్కుల) వివరాలు ఇస్తున్నారు.
 • మూడు జిల్లాల(కమ్ రప్, టిన్ సుఖియా, డిభ్రూఘర్) కు చెందిన జమాబంధి పట్టికను ప్రజలు చూడగలిగే విధంగా వెబ్ లో ఉంచబడినది.

పృథ్వి భౌగోళిక సమాచార విధానము (జిఐఎస్)

 • ఈ విధానం క్రింద అస్సాంలోని అన్నిజిల్లాల సరిహద్దులు డిజిటైజ్డ్ చేయబడ్డాయి.
 • పన్నెండు (12) జిల్లాల బ్లాక్ సరిహద్దులు, మూడు (3) జిల్లాల గ్రామ సరిహద్దులు మరియు గౌహాతి యొక్క వార్డ్ పటాలు కూడా డిజిటైజ్డ్ చేయబడ్డాయి.
 • వెబ్ ఆధారిత భౌగోళిక సమాచారము సర్వర్ సౌలభ్యంతో కడస్ట్రల్ స్థాయిలో నిలకడగా ప్రణాళికలను అమలుపరచుట ద్వారా పృథ్వి మిగితా రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంది.
 • కడస్ట్రల్ మాపింగ్ కు సర్కిల్ స్థాయిలో ప్రారంభించడంలో సోనిట్ పూర్ జిల్లా మొట్ట మొదటిది.
 • రైలు, రహదారులు,నదులు,అడవులు,మురుగు నీటి పారుదల, నీటి వనరులు మొదలైన  వివిధ రకాలైన వివరములతో, భౌగోళిక సమాచారం విభాగం ద్వారా అవసరాలనుగుణంగా   పటాలు తయారుచేయబడ్డాయి.

ఉద్యోగరత్న

 • జిల్లా పరిశ్రమల కేంద్రముల పనితీరు మరియు పర్యవేక్షణకై ఉద్యోగరత్న ఒక ఉపయుక్తమైన, మరియు సమర్థతగల ఒక సాధనము.
 • ఇవి వెబ్ ఆధారిత ఆన్ లైన్ విధానం. జిల్లా పరిశ్రమ కేంద్రాల జనరల్ మేనేజర్స్ వివిధ పథకాలైన 20 అంశముల ప్రోగ్రామ్ , ప్రధాని రోజ్ గార్ యోజన(పి ఎమ్ ఆర్ వై), పారిశ్రామిక విధానం, వ్యయమునకు సంబంధించిన నెలవారీ అభివృద్ధి నివేదికలు ఈ విధానం ద్వారా సమర్పిస్తారు .
 • ఈ విధంగా నమోదు చేయబడిన నివేదికలు పారిశ్రామిక డైరెక్టర్లకు మరియు జిల్లా పారిశ్రామిక కేంద్రాల జనరల్ మేనేజర్లకు ప్రణాళికలు తయారుచేయడానికి సహాయకారిగా ఉంచబడతాయి.

విధాన్ న్యాయాధిపతుల ద్వారా వ్యాజ్యముల నిర్వహణ విధానం

 • జిల్లా న్యాయశాఖాధిపతి కార్యాలయం యొక్క న్యాయశాఖ ద్వారా స్వయంచాలక విధానం ద్వారా వ్యాజ్యములపై విచారణ జరుపుట.
 • ఆన్ లైన్ ద్వారా వ్యాజ్యముల యధాస్థితిపై సమాచార ప్రశ్నలకు మరియు వివిధ రకాలైన నివేదికలు తయారుచేసే సౌలభ్యం.

శపధ్ ప్రమాణపత్రాల నిర్వహణ విధానము

 • శపధ్ స్వయంచాలక విధానం ద్వారా ప్రమాణపత్రాల రికార్డుల (అఫిడవిట్ ల)నిర్వాహణ న్యాయశాఖ డిప్యూటి కమీషనర్ కార్యాలయం ద్వారా చేయబడుతుంది.

జన-సేవ సరళీకృత కౌంటర్ విధానము ద్వారా కంప్యూటరైజ్డ్ చేయబడిన పౌరసేవలు

 • ఆ విధానంలో వివిధ పౌరసేవలకు ఫిర్యాదు స్వీకరణలు నమోదు చేయబడతాయి.
 • ఇది పారదర్శకమైన, ఎటువంటి గందరగోళం లేని సేవలను పౌరులకు కుల ధృవీకరణ పత్రములు, శాశ్వత నివాసధృవీకరణ పత్రములు, చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రములు, బాకీజై చెల్లుబాటు ధృవీకరణ పత్రములు, పాస్ పోర్టు, వయోవృద్ధుల ధృవీకరణ పత్రములు, సంఘము/స్వచ్ఛంద సంస్థల సంబంధించిన నమొదు/పునఃసృష్టి, సకాలములో జారీ చేయబడని జనన/మరణాల ధృవీకరణ పత్రములు, నష్ట పరిహార నిధులు, ఆయుధ లైసెన్సులు, సంచార సినిమా లైసెన్సులు, ప్రేలుడు పదార్థముల లైసెన్సులు, ధృవీకృత కోర్టు ఉత్తర్వుల నకలు, ధృవీకృత ఎన్నికల ఓటర్ల జాబితా నకలు, స్టాంపులు విక్రయ లైసెన్సు లు, వకీలు గుమస్తా కొరకు లైసెన్సు, పోలీస్ స్టేషన్ నుండి తుపాకీని పొందుటకు సంబంధించిన ఫిర్యాదులు, ప్రత్యేక కార్యక్రములకు సంబంధించిన అనుమతి మొదలైనవాటిని అందిస్తుంది.

పరిశోధ్ కంపూటరైజ్డ్ చేయబడిన బాకీజై (అప్పు చెల్లింపు) వ్యవస్థ

 • ఈ విధానంలో సమర్ధవంతంగా నమోదు చేయడం, సత్వర  సందేహనివృత్తి మరియు సకాలంలో  నివేదిక తయారుచేయడం జరుగుతుంది.
 • ఈ విధానం ద్వారా నెలవారీ ఋణంపై  తిరిగి చెల్లింపుల సంగ్రహ నివేదికలు మరియు నెలవారీ కొత్తగా నమోదు చేయబడిన ఋణ గ్రహీతల వివరములు తయారుచేయబడతాయి.

నాతి – అవస్థితి కంపూటరైజ్డ్ చేయబడిన ఫైల్ వ్యవస్థ

 • ఇది అంతర ప్రభుత్వము ప్రయోజనార్థం ఉపయోగపడుతుంది.
 • ఈ విధానం ద్వారా  ప్రభుత్వాధికారులచే డిప్యూటీ కమీషనర్ కార్యాలయములో గల  ఫైళ్ళ కదలికలు పర్యవేక్షించుటకు మరియు ప్రతి ఒక్క ఫైలు యొక్క యధాస్థితిని సమీక్షించుటకు అవకాశం ఏర్పడుతుంది.

అనుశ్రవణ్

కంప్యూటరైజ్డ్ చేయబడిన నెలవారీ నివేదికలు సర్కిల్ ఆఫీసు నుండి డిప్యూటీ కమీషనర్ కార్యా లయము వరకు పంపే విధానము ఈ విధానం ద్వారా సత్వర మరియు సమర్ధవంతమైన నెలవారీ నివేదికలు తయారుచేయుట మరియు (చాలా వరకు ఇవి భూసంబంధిత వివరాలు మరియు భూమి శిస్తులకు సంబంధించి నవి) సర్కిల్ ఆఫీసు నుండి డిప్యూటీ కమీషనర్ కార్యాలయమునకు సమర్పించుటకు వీలు కల్గుతుంది.

ఈ విధానం ద్వారా తయారుచేయబడే నెలవారీ నివేదికల వివరములు–

 • మార్పు  చేయబడిన భూవివరముల తయారీ  మరియు వాటిపై వచ్చే సమస్యల పరిష్కారాలు.
 • నవీకరించబడిన భూసంబంధిత ప్రగతి నివేదిక.
 • రాజ్ అదాలత్
 • ఎన్ ఆర్ వివరాలు/మార్పిడి/చట్టబద్ధంగా ఖాళీ చేయించడం మొదలగు వాటి నివేదికలు.

మనబ్ – సంపద్ కంప్యూటరైజ్డ్ చేయబడిన సిబ్బంది వివరముల నిర్వహణా వ్యవస్థ

ఈ విధానం వల్ల జిల్లా యంత్రాంగంలోని మానవ వనరుల విభాగం ద్వారా :

 • ప్రభుత్వ విభాగముల  వారీగా నిర్వహణా విధానము
 • ప్రశ్నావళి మరియు నివేదిక  విధానము వంటి సౌకర్యాలు లభ్యమౌతాయి.

గృహ-లక్ష్మి కంప్యూటరైజ్డ్ చేయబడిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)

 • ఈ వ్యవస్థ ద్వారా వివిధ రకాలైన తృణ ధాన్యాలు, పంచదార, పెట్రోలియం ఉత్పత్తులు మరియు ముఖ్యమైన ఇతర  నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించిన  సమర్థమైన నిర్వహణకు సంబంధించిన  సమాచారముపొందు సౌలభ్యము ఏర్పడుతుంది.
 • ఈ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు, రేషన్ షాపులు, ఆయిల్ డిపోల వివరాలు మొదలగు వాటికి సంబంధించిన వివరములపై  నివేదికను తయారుచేసి వాటిపై విధాన నిర్ణయం తీసు కోడానికి తోడ్పడుతుంది.

బాటన్ కంప్యూటరైజ్డ్ చేయబడిన వేతన చెల్లింపుల వ్యవస్థ

 • ఈ వేతన చెల్లింపుల  వ్యవస్థ ద్వారా సకాలంలో మరియు ఏ విధమైన ఆటంకము లేకుండా వేతనాలు చెల్లింపబడతాయి.
 • ఒక సంస్థ వేతన చెల్లింపు  విధానమునకు సంబంధించిన - వార్షిక వేతన చెల్లింపు వివరాలు, వార్షిక సంఘటిత నిధి సమాచారము, క్రితం నెల వేతన వివరాలు, ఆస్థి పన్ను సమాచారము, తుది వేతన ధృవీకరణ పత్రము(ఎల్ పిసి) లాంటి సమాచారమును సకాలంలో ఈవిధానము ఏర్పాటు చేస్తుంది

అభియోగ్ కంప్యూటరైజ్డ్ చేయబడిన ప్రజా సమస్య వ్యవస్థ

 • ఏదైనా ఇంటెర్నెట్ కేంద్రం, సమావేశ సమాచార కేంద్రం మొదలగు వాటి నుండి ప్రజలు వారి ఫిర్యాదులను దాఖలు చేసుకోగలుగుతారు.
 • ఏ సమయంలో నైనా వారి ఫిర్యాదు యొక్క యదాస్థితిని ఆన్ లైన్ ద్వారా చూచుకొనవచ్చు.

గ్రామున్నయాన్ కంప్యూటరైజ్డ్ చేయబడిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథకాలను పర్యవేక్షణా వ్యవస్థ

 • స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన మరియు ఇందిరా ఆవాజ్ యోజన క్రింద పని చేయు వివిధ పథకాల అభివృద్ధి సమాచారమును, ఈ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ నివేదించి పర్య వేక్షిస్తుంది
 • అస్సాంలోని పలురకాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (డి అర్ డి ఎ) కార్యనిర్వహణను పర్య వేక్షిస్తుంది.

డాక్ తపాలా నిర్వహణ ఉపయోగార్థం తయారుచేయబడిన సాఫ్ట్ వేర్

 • ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జిల్లా యంత్రాంగంలోని ఏ విభాగపు కార్యాలయమునకు వచ్చిన లేదా పంపబడిన తపాలా వివరములు నమోదు చేయబడుతుంది.
 • పోస్ట్/ డాక్ మీద తీసుకున్న చర్య, వారం/ పక్షం/ నెలల వారీగా పర్యవేక్షంపబడుతుంది.
 • పోస్ట్ /డాక్ సంబంధించిన ఆన్ లైన్ ప్రశ్నాకార్యక్రమాలను నిర్వహిస్తుంది.
 • పోస్ట్ /డాక్ పై నివేదికలు తయారుచేసి ఒక నిర్దిష్టమైన తేదీన ప్రకటిస్తుంది.
 • పోస్ట్ /డాక్ ను ప్రస్తుతము సంబంధము ఉన్న అధికారి /డిపార్ట్ మెంట్ కి పంపిస్తుంది.

ఆధారము: అసోం ప్రభుత్వము

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01342281879
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు