పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉత్తర ప్రదేశ్

ఈ విభాగం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

ఇ- ఉపకార వేతనాలు (స్కాలర్ షి ప్పులు)

అందుబాటులో ఉన్న సేవలు
  • ఒబిసి, యస్.సి., యస్.టి. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు స్కాలరుషిప్పులను ట్రాన్సుఫర్ చేయడం
  • స్కాలరుషిప్పుల కొరకు ధరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • స్కాలరుషిప్పుల పధకానికి సంబంధించిన వివిధ బ్యాంకుల నోడల్ అధికారుల వివరాలు
  • స్కాలరుషిప్పుల పధకానికి సంబంధించిన ఒబిసి, యస్.సి, యస్.టి నోడల్ అధికారుల వివరాలు
ఈ సేవలు పొందుటకు   http://scholarship.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి.

ఉత్తర ప్రదేశ్ -భూ-లేఖ్ (భూమి రికార్డులు)

అందుబాటులో ఉన్న సేవలు
  • నకిలీ పట్టా వివరాలు
  • జిల్లాలవారీగా గ్రామాల పట్టా వివరాలు
  • అన్ని గ్రామాల గురించి సంక్షిప్త సమాచారం
  • భూమి రకాలు- వాటి వివరాలు
ఈ సేవలను పొందడానికి http://bhulekh.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి.

కోశ్వని

అందుబాటులో ఉన్న సేవలు
  • 73 ట్రజరీలకు సంబంధించిన వసూళ్ళు, చెల్లింపుల నెలవారీ వివరాలు ఉన్నాయి
  • ఆర్థిక యంత్రాంగం వారు నిధుల స్థాయి నుండి ఒచరు స్థాయి వరకూ కావలసిన వివరాలు ఇంకా అంచనా బడ్జెట్ మరియు దాని యొక్క ఖర్చుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు
  • నిధుల స్థాయి నుండి ఓచరు స్థాయి వరకు ఆర్థిక శాఖ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు డిడివో వారీగా ఖర్ఛుల వివరాలు తెలుసుకోవచ్చు
  • కన్యాధాన యోజన పధకం యొక్క ఖర్చులు గురించి తెలుసుకోవచ్చు
  • ఇతర ఖర్చులకు సంబంధించి చేసిన చెల్లింపులు గురించి తెలుసుకోవచ్చు
పైన చెప్పిన వివరాలకొరకు http://koshvani.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి.

కోర్టు కేసుల సమాచార వ్యవస్థ

అందుబాటులో ఉన్న సేవలు
  • కోర్టు తీర్పులు మరియు ఉత్తర్వులు
  • సమస్యలు పరిష్కారాలు
  • కాజ్ లిస్టు మరియు కేసు స్టేటస్ (కేసు ఏ స్థితి లో ఉందనే విషయం )
వంటి వివరాలను http://courtcases.up.nic.in/ ఈ వెబ్ సైటులో పొందవచ్చు

ఆన్ లైన్ లో రవాణా సేవలు

అందుబాటులో ఉన్న సేవలు
  • డ్రైవింగు లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ ధరఖాస్తులు
  • డ్రైవింగు లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ కు అయ్యే రుసుము మరియు పన్ను వివరాలు
  • ధరఖాస్తులు నింపడానికి మార్గదర్శక సూత్రాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు
  • రోడ్డు మీద వాహనం జాగ్రత్తగా నడపడానికి మంచి చిట్కాలు
పైన పేర్కొన్న సేవలను పొందడానికి http://www.uptransport.org అనే వెబ్ సైటును సందర్శించండి.

నియుక్తి ఆన్ లైన్ సేవా

అందుబాటులో ఉన్న సేవలు
  • జిల్లాల వారీగా వివిధ అధికారుల వివరాలు
  • శిక్షణ మరియు డిప్యుటేషన్, పదోన్నతికి సంబంధించిన దరఖాస్తులు
  • ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు
  • కోర్టు కేసులకు సంబంధించిన నోడల్ అధికారుల వివరాలు
మరిన్ని వివరాల కొరకు http://niyuktionline.up.nic.in అనే వెబ్ సైటును సందర్శించండి

భూభౌతిక ఆధారిత ప్రణాళిక అట్లాస్

అందుబాటులో ఉన్న సేవలు
  • అభివృద్ధి మరియు సామాజిక ఆర్థిక సూచికల ఆధారంగా బహుళ బాషలో 100 మ్యాపులను ప్రణాళికా శాఖ కొరకు రూపోందించడం జరిగింది.
  • పూర్తి అట్లాస్ ను అన్ లైన్ లో అందించడం జరిగింది మరియు సంఖ్యాకి పత్రిక కు సంబంధించి 4000 సూచికలు ఆధారంగా ఆన్ లైన్ డైనమిక్ మ్యాపుల ప్రశ్నావళి అందుబాటులో ఉంది.
  • ఈ ఆన్ లైన్ మ్యాపుల కారణంగా ప్రణాళిక శాఖకు సంబంధించి వారు ఇక స్వయంగా లేదా మాన్యువల్ గా అట్లాస్ ను తయారు చేయనవసరంలేదు, దీనివల్ల వారికి చాలా సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది.

మరిన్ని వివరాల కొరకు http://planning.up.nic.in అనే వెబ్ లింకును క్లిక్ చేయండి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో అమలు చేయబడుతున్న మరిన్ని ఈ-పాలన సేవలు ఈ క్రింద జత చేసిన పి.డి.యఫ్ ఫైల్ లో వివరించబడ్డాయి.

ఉత్తర ప్రదేశ్

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0069735007
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు