హోమ్ / ఇ-పాలన / మొబైల్‌ గవర్నెన్స్‌ / భారతదేశం లో మొబైల్ - పరిపాలన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారతదేశం లో మొబైల్ - పరిపాలన

ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది.

మొబైల్ ఫోను: ఒక బాధ్యతాయుతమైన బట్వాడా మార్గంగా ఏర్పడుతున్న క్రమం

ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది. భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది. ఇంకొక వైపు, యువకులకు, ప్రత్యక్షంగానూ, మరియు పరోక్షంగాను లక్షలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.

తన అభివృద్ధి పధంలోని రెండవ దశలో, వివిధ రకాల సేవలకు ఇది ఒక బట్వాడా మాద్యమంగా అవతరించింది. ఎవరైనా తమ మొబైల్ ఫోను ను ఉపయోగించి, తమ బ్యాంకు ఖాతాలోని సోమ్మును వేరొక బ్యాంకు ఖాతా లోనికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్ధలు మరియు ప్రైవేట్ సంస్ధలు కూడ తమ పౌర సేవలు మరియు వ్యాపార సేవలను సామాన్య మానవునికి మొబైల్ ఫోను ద్వారా అందజేయడం మొదలు పెట్టాయి. ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకుల సేవలను మొబైల్ ఫోను ద్వారా అందజేయడానికి ఒప్పుకుంది. అదే విధంగా భారత ప్రభుత్వం, మంత్రిత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసిన మొబైల్ ఫోను ద్వారా ఆర్ధిక సేవల బట్వాడా పై పధక రచన ను అంగీకరించింది. 3 జి సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశంలో ప్రారంభమైన తరువాత (2010 సంవత్సరాయంలో సామాన్యంగా వినియోగించుకోవడానికి, ఇది అందుబాటులో ఉంటాయి.) వినియోగదారులు, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, సమాచార సేవలను తమ మొబైల్ ఫోను ద్వారానే అందుకోగలుగుతారు.

భారతదేశంలో మొబైల్ బ్యాంకింగ్

శరవేగంతో పురోగమిస్తున్న భారత బ్యాంకింగ్ రంగం - ఖాతాదారులకోసం మొబైల్ బ్యాంకింగ్ అనే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవల సహాయంతో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్ళకుండానే కేవలం ఎస్ ఎమ్ ఎస్ అధారిత ప్రశ్నలు మరియు మెలుకువలు (ఎలర్ట్స) ద్వారా తమ ఖాతాను, అందులోని లావాదేవీలను గురించి తెలుసుకోవచ్చును . ఈ సేవలను కొన్ని బ్యాంకులు ఉచితంగా అందిస్తుండగా, మిగిలిన బ్యాంకులు ఖాతాదారులనుంచి సంవత్సరానికి కొంత మొత్తం ఫీజుగా వసూలు చేస్తున్నాయి. ఈ సేవలను పొందడానికి సెల్ ఫో్న్ నుంచి బ్యాంకుకు ఎస్.ఎమ్.ఎస్ పంపించడానికి అయ్యే ఛార్జిని మాత్రం ఖాతాదారే భరించాల్సిఉంటుంది.

కొన్ని బ్యాంకులైతే సెల్ ఫోన్ల ద్వారా ఖాతాదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత బ్యాంకింగ్ సేవలను (personalized banking) కూడా అందిస్తున్నాయి. అయితే దీనికి గానూ ఆ బ్యాంకులు ఆ ఖాతాదారుల సెల్ ఫోన్ లలో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అమర్చవలసి ఉంది. ఇది జి పి ఆర్ ఎస్ వాడుకలో ఉన్న మొబైల్ హాండ్ సెట్స్ లో మటుకే వీలవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభమైనది, ఖాతాదారులు దీనిని సులువుగా వాడుకోవచ్చు.

మొబైల్ బ్యాంకింగ్ అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి:

యాక్సిస్ బ్యాంక్

అందుబాటులో ఉన్న సేవలు
  1. ఖాతాలోని నిల్వ సమాచారం
  2. గత మూడు లావాదేవీలు
  3. చెక్కు పరిస్థితి
  4. డీమ్యాట్ అకౌంట్ లోని సెక్యూరిటీ సమాచారం
  5. మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం అభ్యర్ధన
  6. మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఆపివేయమని అభ్యర్ధన
ఈ సేవలకు ఛార్జీలు
  1. ప్రతి ఆర్ధిక సంవత్సరానికి రు.150/-(పన్నులు అదనం)
  2. మొదటిసారి ఈ సేవలు తీసుకుంటున్నవారికి కొంత కాలం పాటు (60 రోజులు) ఉచితంగా ఈ సేవలు అందిస్తారు. తొలి 60 రోజులలోపు గనుక (అన్ సబ్స్ క్రైబ్) ఈ సేవలను వద్దనికుని మీ పేరు వెనక్కు తీసుకుంటే, ఎటువంటి చార్జీలు ఉండవు.
మొబైల్ సర్వీసులు వినియోగించుకునే విధానం

ఖాతాదారు కోరే సేవ

ఎస్ ఎమ్ ఎస్ చేయవలసిన పదాలు
5676782 లేదా 9717000002
నంబరుకు ఎస్ ఎమ్ ఎస్ పంపాలి.

బ్యాంకు స్పందన

ఖాతాలో నిల్వ సమాచారం

BAL జాగా ఖాతా నంబరు టైపు
చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతాలో నిల్వఎంత ఉందో తెలుపుతుంది

గత మూడు లావాదేవీలు

MINI<జాగా>ఖాతా నంబరు టైపు
చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతా తాలూకు గత మూడులావాదేవీలను తెలుపుతుంది.

చెక్ పరిస్థితి

CHQSTATUS<జాగా>ఖాతా
నంబరు<జాగా>చెక్ నంబర్ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతా తాలూకు గత మూడు లావాదేవీలను తెలుపుతుంది

డీమ్యాట్ అకౌంట్ లోని షేరు/ సెక్యూరిటీ నిల్వ పరిస్థితి

DMAT<జాగా>ఖాతాదారు ఐడీ <జాగా>ISIN నంబరు టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ ఖాతాదారుకు సంబంధించిన నిర్దేశిత సెక్యూరిటీ నిల్వ పరిస్థితి తెలుపుతుంది

మొబైల్ బ్యాంకింగ్ మెదలు సేవలను
పెట్టడానికి అభ్యర్ధన

ACT<జాగా>ఖాతానంబర్ టైపు
చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

నిర్దేశిత ఖాతాకు మొబైల్ బ్యాంకింగ్ ప్రారంభిస్తుంది.

మొబైల్ బ్యాంకింగ్ సేవలు సేవలను
నిలిపేయాలని అభ్యర్ధన

SUSPEND <జాగా> ఖాతా నంబర్ టైప్ చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి.

నిర్దేశిత ఖాతాకు మొబైల్ బ్యాంకింగ్ నిలిపేస్తుంది.

రిజిస్ట్రేషన్ విధానము
ఫోన్ బ్యాంకింగ్ ద్వారా
  • ఖాతాదారు తను నివసించేచోట ఉన్న బ్యాంకు శాఖకున్న ఫోన్ బ్యాంకింగ్ నంబరుకు ఫోన్ చేసి మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • మీరు నివశించే చోట యాక్సిస్ బ్యాంకు శాఖ ఫోన్ బ్యాంకింగ్ నంబర్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏ టీ ఎమ్ ద్వారా
  1. ఖాతాదారు తన ప్రధాన ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డు ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
  2. కార్డును ఏటీఎమ్ లోకి చొ్ప్పించి పిన్ నంబర్ టైపు చేయండి.
  3. మెనూలోని అదర్ సర్వీసెస్(ఇతర సేవలు) ను ఎంచుకోండి.
  4. మెనూలోని మొబైల్ బ్యాంకింగ్/అప్ డేట్ అంశాన్ని ఎంచుకోండి.
  5. మీరు ఏ సెల్ ఫోన్ నంబర్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ ఫోన్ నంబరును టైపు చేయండి.
  6. అదే నంబరును మళ్ళీ టైపు చేయండి.
  7. మీ అభ్యర్ధన తీసుకుంటున్నట్లు తెలిపే రసీదు వస్తుంది. దానిని తీసుకోండి. ఏ ఖాతానంబరుపైన మీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవుతాయో ఆ రసీదు మీద అచ్చయి ఉంటుంది.
  8. మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవడానికి మరో 48 గంటలు పడుతుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ , వెబ్ సైట్ ద్వారా (i Connect) - యాక్సిస్ బ్యాంక్
  1. మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు లాగ్ ఆన్ అవ్వండి. (మీరు iConnectలో రిజిస్టర్ కాకపోతే మీకు సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్ళి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ పొందండి.
  2. మొదట 'కస్టమైజ్' మీద, తర్వాత 'మొబైల్ బ్యాంకింగ్' మీద క్లిక్ చేయండి.
  3. మీ సెల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. 'ఎనేబుల్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్' అని రాసిఉన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. మొబైల్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
బ్యాంకు శాఖా కార్యాలయంద్వారా 1. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలోకి వెళ్ళి మొబైల్ బ్యాంకింగ్ కోసం ఒక దరఖాస్తు రాసి ఇవ్వండి

యాక్సిస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ గురించిన మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాక్సిస్ బ్యాంక్ వారి ఫోన్ బ్యాంకింగ్ సేవలగురించి మరి్న్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్

బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ తమ వినియోగదారులకు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం', 'మొబైల్ బ్యాంకింగ్' సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సదుపాయాన్ని పొందాలనుకునేవారు బ్యాంకుకు చెందిన తమ శాఖలలో రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.

' ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం ' సౌకర్యము

1. ఈ సేవలకోసం రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారు సెల్ ఫోన్ కు ఎస్ ఎమ్ ఎస్ దానంతట అదే (ఆటోమాటిక్ గా) వెళ్ళిపోతుంది.

2. ఎస్ ఎమ్ ఎస్ ఎలర్ట్ సేవల ద్వారా ప్రస్తుతం ఈ కింది సమాచారం అందించబడుతోంది :

  • ఆ రోజు ముగిసే సమయానికి ఖాతాలో ఉన్న నిల్వ సమాచారం
  • ఇతర ఛార్జీలు/పెరిగిన వడ్డీ/జమ అయిన సొమ్ము సమాచారం
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు సంబంధించిన సమాచారం
  • ఏటీఎమ్ కు సంబంధించిన సమాచారం
మొబైల్ బ్యాంకింగ్

మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం ఖాతాదారులు బ్యాంకువారు నిర్దేశించిన ఫోన్ నంబరుకు తమ అభ్యర్ధనతో ఎస్ ఎమ్ ఎస్ పంపాల్సి ఉంటుంది. తదనుగుణంగా ఖాతాదారులు ఈ కింది సమాచారాన్ని పొందుతారు.

  1. ఖాతాలోని నిల్వ సమాచారం.
  2. గత ఐదు లావాదేవీలు
  3. చెక్ పరిస్థితి
  4. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  5. ఖాతా వివరాల స్టేట్ మెంట్ పోస్టుచేయాలని అభ్యర్ధన
రిజిస్ట్రేషన్ విధానము
ఈ సేవల కొరకు రిజిస్టర్ చేసుకోవడానికి, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన ఇతర వివరాల కోసం మీరు ఎ బ్యాంక్ లో ఐతే ఖాతా తెరిచారో అక్కడ కన్నుకోండి.

బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ వారి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కార్పొరేషన్ బ్యాంక్

కార్పొరేషన్ బ్యాంక్ వారి మొబైల్ ద్వారా చెల్లింపు సౌకర్యం

దేశంలో సెల్ ఫోన్ ఎస్ ఎమ్ ఎస్ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి జాతీయ బ్యాంకు - కార్పొరేషన్ బ్యాంక్. కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎమ్, డెబిట్ కార్డులు కలిగి ఉన్న ఖాతాదారులు ఈ మొబైల్ చెల్లింపుల సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కార్పొరేషన్ బ్యాంకు యొక్క ఏ ఏటీఎమ్ వద్దనైనా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారు దీనికోసం తన మొబైల్ ఫోన్ నంబరుతోసహా ఏఏ వివరాలు ఇవ్వాలో ఏటీఎమ్ సూచిస్తుంది. ఈ సేవకోసం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారు సెల్ ఫోన్ కు నాలుగంకెల పిన్ నంబర్ ఎస్ ఎమ్ ఎస్ లో వస్తుంది. ఖాతాదారు భవిష్యత్తులో ఈ పిన్ నంబర్ ద్వారానే తన మొబైల్ ద్వారా లావాదేవీలన్నిటినీ జరపగలుగుతారు.

కార్పొరేషన్ బ్యాంక్ వారి ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని రెండు తరగతులుగా విభజించారు.

1. పుష్

2. ఫుల్

పుష్ సర్వీసెస్(సమాచారం తెలిసే సందేశాలు): ఖాతాదారుకు సంబంధించిన ఖాతాలో ఏ విధమైన లావాదేవీ జరిగినా ఆ ఖాతాదారు సెల్ ఫోన్ కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారాన్ని పంపించడమే ఫుష్ సర్వీసు.
పుల్ సర్వీసెస్(అభ్యర్ధనల సందేశాలు) : ఖాతాదారు తనకు కావాల్సిన సమాచారం తెలుసుకోడానికి, తనకు కావాల్సిన సేవలను కోరడానికి ఈ పుల్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. దీనికోసం ఖాతాదారు బ్యాంకువారు నిర్దేశించిన నమూనాలో 56767 లేదా 9986667045 నంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ పంపాల్సిఉంటుంది. తదనుగుణంగా బ్యాంకువారు ఖాతాదారు కోరిన సమాచారాన్ని లేదా సేవను అందిస్తారు.
రిజిస్ట్రేషన్ విధానము
  1. మీకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో దరఖాస్తు నింపి ఇవ్వండి.
  2. ఆ దరఖాస్తు పరిశీలన పూర్తయిన తర్వాత బ్యాంకు వారు మీకు ఒక పిన్ నంబరును ఎస్ ఎమ్ ఎస్ ద్వారా పంపుతారు.
  3. బ్యాంకు వారు నిర్దేశించిన నమూనాలో 56767 లేదా 9986667045 నంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ పంపడం ద్వారా మీరు ఈ సేవను ప్రారంభించుకోవచ్చు.
  4. ఉదాహరణకు...మీకు కేటాయించిన పిన్ నంబర్ - 7890, మీ ఖాతానంబరు ఎస్ బీ/01/123456 అనుకుంటే మీరు పంపాల్సిన ఎస్ ఎమ్ ఎస్ - ACTIVATE 7890 123456 అని ఉండాలి.
  5. ఈ ఎస్ ఎమ్ ఎస్ పంపిన వెంటనే మీకు ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించుకునే అవకాశం ప్రారంభమవుతుంది.
మెనూ ఆధారిత ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్

కార్పొరేషన్ బ్యాంక్ మెనూ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ మెనూను మీ సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకుంటే మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం మరింత సులభమవుతుంది.

ఈ మెనూను సెల్ ఫోన్ లో ఏర్పాటు చేసుకునే విధానం
  1. జీ పీ ఆర్ ఎస్ ద్వారా ఈ అప్లికేషన్ ను మీ సెల్ ఫోన్ లోకి నేరుగా అమర్చుకోండి.
  2. ముందుగా ఈ అప్లికేషన్ ను మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి. తర్వాత బ్లూటూత్ ద్వారాగానీ, డేటా కేబుల్ ద్వారాగానీ దానిని మీ సెల్ ఫోన్ లోకి ఎక్కించుకోండి.

మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ను మీ సెల్ ఫోన్ లోకి ఎక్కించుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కార్పొరేషన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్యూషె బ్యాంక్

డ్యూషె బ్యాంక్ డీబీ ఎలర్ట్ సేవలను ప్రవేశపెట్టింది. ఖాతాదారుల బ్యాంకు ఖాతాలలోని తాజా లావాదేవీలను వారికి ఎప్పటికప్పుడు ఎస్ ఎమ్ ఎస్ , ఈ మెయిల్ ద్వారా తెలియపరుస్తుంటారు.


ఖాతాదారు కోరే సేవలు

ఎస్ ఎమ్ ఎస్ పంపే విధానము561615 నంబరుకు మెసేజ్ పంపాలి

మీ ఈ మెయిల్ ఐడీ బ్యాంకుకు తెలియచేయడానికి

UPDATE<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<జాగా>కస్టమర్ ఐడీ టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ క్రెడిట్ కార్డు సమాచారం

ESTMT<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<జాగా>మీ క్రెడిట్ కార్డు నాలుగు అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ బ్యాంక్ స్టేట్ మెంట్ ను మెయిల్ చేయమని మెసేజ్ పంపాలి కోరడానికి

UPDATE<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<కస్టమర్ ఐడీ టైపు చేసి
ఎస్ ఎమ్ ఎస్ పంపాలి .

మీ క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ ను మెయిల్ చేయమని కోరడానికి

ESTMT<జాగా>మీ ఈమెయిల్ ఐడీ<space>మీ క్రెడిట్ కార్డు నంబరులోని చివరి నాలుగు అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

డ్యూషే బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ధనలక్ష్మి బ్యాంక్

అందుబాటులో ఉన్నసేవలు
  1. ఖాతాలోని నిల్వ సమాచారం
  2. గత ఐదు లావాదేవీల వివరాలు
  3. ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా వివరాలకోసం అభ్యర్ధన
  4. లావాదేవీల పద్దుకోసం అభ్యర్ధన
  5. ప్రాధమిక ఖాతా మార్పుకోసం అభ్యర్ధన
  6. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  7. చెక్ పరిస్థితికోసం అభ్యర్ధన
  8. చెక్ నిలిపేయాలంటూ అభ్యర్ధన
రిజిస్ట్రేషన్ విధానము

మీకు ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఈ సేవల కోసం నిర్దేశించిన దరఖాస్తు పత్రంలో మీ మొబైల్ నంబర్, తదితర వివరాలను నింపి అధికారులకు సమర్పించండి.s

మొబైల్ బ్యాంకింగ్ ఎలర్ట్ సేవలు

క్రెడిట్ ఎలర్ట్

  1. ఈ సేవలకోసం రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారు ఖాతాలోకి సొమ్ము జమ అయినట్లయితే, ఆ జమ తాలూకు లావాదేవీలు ఆ ఖాతాదారు మొబైల్ నంబరుకు పంపిస్తారు.
  2. రెండు వేల రూపాయలు, అంత కంటే ఎక్కువ జమ అయిన సందర్భంలో క్రెడిట్ ఎలర్ట్ కోసం ప్రత్యేకమైన విధానం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. (ఈ క్రెడిట్ ఎలర్ట్ సేవలకు కనీసం రెండువేల రూపాయల లావాదేవీ జరగాలి.)
మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించే విధానము

ఖాతాదారు కోరే సేవ

ఎస్ ఎమ్ ఎస్ చేయవలసిన పదాలు6161 నంబరుకు ఎస్ ఎమ్ ఎస్ పంపాలి.

బ్యాంకు స్పందన

సేవలు ప్రారంభించు విధానం

D L B R E G < జాగా>ఖాతాదారు ఐడీ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

సేవలు ప్రారంభిస్తున్నట్లు మీకొక
ఎస్ ఎమ్ ఎస్ వస్తుంది

ఖాతాలో నిల్వ సమాచారం

DLBBAL<జాగా>ఖాతా నంబరు టైపు
చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతాలో
నిల్వఎంత ఉందో తెలుపుతుంది

మినీ స్టేట్ మెంట్ వివరాలు

D L B T X N <జాగా>కస్టమర్ ఐడీ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతా తాలూకు గత ఐదు లావాదేవీలను తెలుపుతుంది.

ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా
వివరాలకోసం అభ్యర్ధన

D LB FD R <జాగా> కస్టమర్ ఐడీ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

మీ ఫిక్సెడ్ డిపాజిట్ వివరాలతో ఒక ఎస్ ఎమ్ ఎస్ వస్తుంది.

బ్యాంకు స్టేట్ మెంట్ కోసం

D L B S M R <జాగా>కస్టమర్ ఐడీ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

మీ అభ్యర్ధనను స్వీకరించాము, 7 రోజులలో మీకు స్టేట్ మెంట్ అందుతుందని మీకు మెసేజ్ వస్తుంది.

మీరు ప్రస్తుతం నడుపుతున్న/ ప్రాధమిక ఖాతాను మొబైల్ బ్యాకింగ్ కు మార్చుకోండి

DL B C P A <జాగా> కస్టమర్ ఐడీ <జాగా>ఖాతానంబరు(మీరు ఏ ఖాతాను ప్రాధమిక ఖాతాగా మార్చాలనుకుంటున్నారో
ఆ నంబర్ టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

మీఖాతాను విజయవంతంగా మాత్చడమైనది అంటూ మీకొక మెసేజ్ వస్తుంది

చెక్ బుక్ కోసం అభ్యర్ధన వారంరోజుల్లో

D LB C B R<జాగా>కస్టమర్ ఐడీ <జాగా>ఖాతానంబర్(చెక్ బుక్ కోరుతున్న
ఖాతాకు సంబంధించిన నంబర్ టైపు చేసి
మెసేజ్ పంపాలి

మీ అభ్యర్ధనను స్వీకరించాము, మీరు చెక్ బుక్ 7 రోజులలో అందుకుంటారని మెసేజ్ వస్తుంది.

చెక్ పరిస్థితి సమాచారం తెలుపుతుంది

D L B C S R<జాగా>కస్టమర్ ఐడీ నంబరు<జాగా>చెక్ నంబర్ టైపు ఎస్ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

మీరు సూచించిన చెక్ పరిస్థితి (చెల్లించినదీ , లేనిదీ) మీకు మెసేజ్ వస్తుంది.

చెక్ చెల్లింపు నిలపాలని మెసేజ్ అభ్యర్ధన

D L B S C R<జాగా>కస్టమర్ ఐడీ నంబర్<జాగా>చెక్ నంబర్ టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ అభ్యర్ధనను అమలుచేసినట్లు మీకు మెసేజ్ వస్తుంది.

ధనలక్ష్మి బ్యాంకు టెలీ బ్యాంకింగ్

ఫోన్ ద్వారా కింది సేవలు కావాలనుకుంటే 0487-2322095 నంబరుకు డయల్ చేయండి(24x7x365రోజులూ)

  1. ఖాతాలో నిల్వ సమాచారం
  2. డిపాజిట్ మీద వడ్డీ రేటు
  3. ఫ్యాక్స్ మరియు ఫోన్ ద్వారా ఖాతా స్టేట్ మెంట్
  4. పిన్ నంబర్ మార్పు

ధనలక్ష్మి బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్ సేవలగురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ సేవలతో ఖాతాదారు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండానే కేవలం ఎస్ ఎమ్ ఎస్ సౌకర్యంతో బ్యాంకింగ్ లావాదేవీలనన్నిటినీ నడుపుకోవచ్చు. ఖాతాదారులు తమ లావాదేవీలను సెల్ ఫోన్ తెరపై కూడా చూసుకోవచ్చు.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు
  1. ఖాతాదారు యొక్క కస్టమర్ ఐడీ నంబరు సాయంతో అతనికున్న ఖాతాలలోని నిల్వ సమాచారం తెలుసుకోవచ్చు.(గరిష్ఠంగా ఐదు ఖాతాలవరకు)
  2. ఖాతాదారు ప్రాధమిక ఖాతాలో జరిగిన గత మూడు లావాదేవీలను తెలుసుకోవచ్చు.
  3. చెక్ చెల్లింపు నిలిపేయాలని కోరవచ్చు.
  4. చెక్ బుక్ కోరవచ్చు.
  5. బ్యాంకు స్టేట్ మెంట్ కోరవచ్చు.
  6. చెక్ పరిస్థితి తెలుసుకోవచ్చు.
  7. ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా పరిస్థితి తెలుసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ విధానము
  1. మీరు బ్యాంకులో ఖాతా తెరుస్తున్నట్లయితే, ఖాతా ప్రారంభించే దరఖాస్తు పత్రం ద్వారా మొబైల్ బ్యాంకింగ్ కోసం అభ్యర్ధించండి.
  2. మీకు బ్యాంకులో ఇప్పటికే ఖాతా ఉన్నట్లయితే మొబైల్ బ్యాంకింగ్ కావాలని కోరుతూ నిర్దేశించిన దరఖాస్తు తీసుకుని వివరాలు నింపి బ్యాంకువారికి సమర్పించండి.
  3. మీకు బ్యాంకులో ఇప్పటికే ఖాతా ఉండి, నెట్ బ్యాంకింగ్ సేవను కూడా పొందుతున్నట్లయితే, మొబైల్ బ్యాంకింగ్ కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఖాతాదారు కోరే సేవ

ఎస్ ఎమ్ ఎస్ చేయవలసిన పదాలు 5676712నంబరుకు ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

బ్యాంకు స్పందన

ఖాతాలో నిల్వ సమాచారం

BAL అని టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ నంబరులోని ఖాతాలో నిల్వఎంత ఉందో తెలుపుతుంది ( 5 ఎకౌంట్ల/ఖాతాల దాకా మీ ఖాతా గుర్తింపు నంబరుకు జత చేయబడుతుంది.)

మినీ స్టేట్ మెంట్ వివరాలు తెలుపుతుంది.

TXN అని టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఆ ఖాతాలోని గత మూడు లావాదేవీలను

చెక్ పరిస్థితి సమాచారం తెలుపుతుంది.

CST<ఆరంకెల చెక్ నంబర్> టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

మీరు సూచించిన చెక్ పరిస్థితి

చెక్ బుక్ కోసం అభ్యర్ధన

CHQ అని టైపు చేసి మెసేజ్ పంపాలి

మీకు చెక్ బుక్ పోస్టు చేయబడుతుంది `

చెక్ చెల్లింపు నిలపాలని అభ్యర్ధన

STP<ఆరంకెల చెక్ నంబర్> టైపు చేసి మెసేజ్ పంపాలి

నిర్దేశిత చెక్కుకు చెల్లింపు నిలిపయబడుతుంది

బ్యాంకు స్టేట్ మెంట్ కోసం చిరునామాకు అభ్యర్ధన

STM అని టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ప్రస్తుత కాలానికి స్టేట్ మెంట్ మీకు పోస్టు చేయబడుతుంది

ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా డిపాజిట్ లన్నిటి వివరాలకోసం అభ్యర్ధన

FDQ అని టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ఈ బ్యాంకులో మీకున్న ఫిక్సెడ్ డిపాజిట్ల వివరాలు మీకు అందుతాయి(గరిష్ఠంగా 5ఖాతాలు)

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫెడరల్ బ్యాంక్

సెల్ ఫోన్ తో బ్యాంకింగ్

ఫెడరల్ బ్యాంక్ వారు తమ వద్ద సెల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఎస్ బి, ఎస్ బి ఎన్ ఆర్ ఇ, ఎస్ బి ఓ ఎన్ ఆర్, సిఏ మరియు ఓడీసీసీ ఖాతాదారులకు ఈ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందజేస్తున్నారు.

అందుబాటులో ఉన్న సేవలు
  1. ఖాతాలోని నిల్వ సమాచారం
  2. మినీ స్టేట్ మెంట్
  3. బ్యాంకు స్టేట్ మెంట్ కోసం అభ్యర్ధన
  4. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకునే విధానం

సేవలు

ఎస్ ఎమ్ ఎస్ చేసే విధానం
9895088888నంబరుకు మెసేజ్ పంపాలి

బ్యాంకు వారి స్పందన

ఖాతాలో నిల్వ సమాచారం

BAL <4 అంకెల యాక్సెస్ కోడ్> టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ ఖాతాలోని నిల్వ సమాచారం మీకు అందుతుంది

ఖాతాలోని లావాదేవీ

TXN <4 అంకెల యాక్సెస్ కోడ్>టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ ఖాతాలో ఎంత జమ/ఖర్చు అయిందీ మరియు ప్రస్తుతం మీ ఖాతాలోని నిల్వ సమాచారం మీకు అందుతుంది

యాక్సెస్ కోడ్ మార్పు

PIN <4 అంకెల యాక్సెస్ కోడ్> జాగా <4 అంకెల కొత్త యాక్సెస్ కోడ్> టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ పిన్ నంబర్ మార్చినట్లు మెసేజ్ అందుతుంది

మినీ స్టేట్ మెంట్ కోసం అభ్యర్ధన

TXN <4 అంకెల యాక్సెస్ కోడ్> టైపు చేసి మెసేజ్ పంపాలి

మీ ఖాతాలో జరిగిన గత ఐదు లావాదేవీల వివరాలు మీకు అందుతాయి

ఖాతాదారు ఎస్ ఎమ్ ఎస్ ఎలర్ట్ సర్వీసెస్ ద్వారా కూడా తన ఖాతాలో జరిగిన లావాదేవీ సమాచారాన్ని పొందవచ్చు.

ఫెడరల్ బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీఐసీఐ బ్యాంక్

అందుబాటులో ఉన్న సేవలు
  1. ఐసీఐసీఐ మరియు ఇతర బ్యాంకులకు నగదు బదిలీ
  2. మీ ఖాతాలోని నిల్వ సమాచారం
  3. మీ ఖాతోలోని గత నాలుగు లావాదేవీలు
  4. చెక్ పరిస్థితి గురించిన సమాచారం
  5. చెక్ చెల్లింపు నిలిపేయాలని సూచన
  6. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  7. నెలవారీ బిల్లుల చెల్లింపు
ఎలర్ట్ సౌకర్యం

ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ ఎలర్ట్ సేవల కింద, మీరు సూచించిన లావాదేవీ జరిగినపుడు మీకు సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుంది. కింది లావాదేవీలకోసం మీరు ఈ ఎలర్ట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

  1. జీతం జమ అయినపుడు
  2. ఖాతానుంచి డబ్బు ఖర్చయినపుడు
  3. ఖాతాలోడబ్బు జమ అయినపుడు
  4. చెక్ వెనకకు వచ్చినపుడు
  5. మీ నిల్వలు పరిమితికంటే దాటిపోయినపుడు
  6. మీ నిల్వలు పరిమితికంటే తగ్గిపోయినపుడు
అందిస్తున్నసేవలు

ప్రాధమికఖాతానంబరుకు ఎస్ ఎమ్ ఎస్
5676766లేదా9837142424
నంబరుకుమెసేజ్పంపాలి

ప్రాధమికేతరఖాతానంబరుకుఎస్ ఎమ్ ఎస్
5676766లేదా9837142424
నంబరుకుమెసేజ్పంపాలి

నిల్వ సమాచారం

IBAL అని టైపు చేసి మెసేజ్ పంపాలి

IBAL <జాగా>ఖాతానంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

గత మూడు లావాదేవీలు

ITRAN అనిటైపు చేసి మెసేజ్ పంపాలి

ITRAN <జాగా>ఖాతానంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

చెక్ పరిస్థితి గురించి సమాచారం

ICSI <జాగా> చెక్కు నంబరు టైపు చేసి ఎస్ ఎమ్ ఎస్ పంపాలి

ICSI <జాగా> చెక్ నంబరు <జాగా> ఖాతానంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

చెక్ చెల్లింపు నిలిపివేయుట

ISCR <జాగా> చెక్ నంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

ISCR <జాగా> చెక్ నంబరు <జాగా> ఖాతానంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

చెక్ బుక్ కోసం అభ్యర్ధన

ICBR అని టైపు చేసి మెసేజ్ పంపాలి

ICBR <జాగా> ఖాతానంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

ఏటీఎమ్ కనుగొనడానికి

ATM <జాగా>పిన్ కోడ్ నంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

 

బ్యాంకు కార్యాలయం కనుగొనడానికి

Branch <జాగా>పిన్ కోడ్ నంబర్ టైపు చేసి మెసేజ్ పంపాలి

 

క్రెడిట్ కార్డు నిల్వ సమాచారం

IBALCC <జాగా>క్రెడిట్ కార్డు నంబర్ లోని చివరి 6 అంకెలుటైపు చేసి మెసేజ్ పంపాలి

 

ప్రాధమిక ఖాతా మార్పు
కోసం

ICPA <జాగా> కొత్త ఖాతా నంబరులోని చివరి 6 అంకెలు టైపు చేసి మెసేజ్ పంపాలి

 

ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలగురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీఐసీఐ బ్యాంకువారి ఫోన్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఐడీబీఐ బ్యాంకు

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ ఈ కింది సేవలు అందిస్తోంది
  1. నిల్వ సమాచారం
  2. గత మూడు లావాదేవీలు
  3. చెక్ చెల్లింపు సమాచారం
  4. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  5. స్టేట్ మెంట్ కోసం అభ్యర్ధన
  6. డీమ్యాట్ ఖాతాలో ఫ్రీ బ్యాలెన్స్ హోల్డింగ్
  7. డీమ్యాట్ ఖాతాలో గత రెండు లావాదేవీలు
  8. నెలవారీ బిల్లుల చెల్లింపులు

సేవలు

ఎస్ ఎమ్ ఎస్పంపాల్సినవిధానం
9820346920లేదా9821043718నంబరుకుమెసేజ్పంపాలి

నిల్వ సమాచారం

BAL <జాగా> కస్టమర్ ఐడీ పిన్ నంబరు <జాగా>ఖాతానంబరు

ఫిక్సెడ్ డిపాజిట్ సమాచారం

Type FD <జాగా> కస్టమర్ ఐడీ పిన్ నంబర్<జాగా> ఖాతానంబరు

గత మూడు లావాదేవీలు

TXN <జాగా> కస్టమర్ ఐడీ పిన్ నంబరు<జాగా>ఖాతానంబరు

చెక్ చెల్లింపు సమాచారం

CPS <జాగా> కస్టమర్ఐడీ పిన్ నంబరు <జాగా> చెక్ నంబరు <జాగా> ఖాతానంబరు

చెక్ బుక్ కోసం అభ్యర్ధన

CBR <జాగా> కస్టమర్ ఐడీ పిన్ నంబరు <జాగా> కావాల్సినచెక్కుల సంఖ్య <జాగా> వ్యక్తిగతంగా తీసుకుంటే పీ అని,పోస్టు ద్వారా అయితే ఎమ్ అని టైపు చేయాలి <జాగా> ఖాతానంబరు

పిన్ నంబర్ మార్పు

CPN <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> పాత పిన్ నంబరు <జాగా> కొత్త పిన్ నంబరు

ప్రాధమిక ఖాతా మార్పు

CPA <జాగా> కస్టమర్ ఐడీ పిన్ నంబరు<జాగా> ఖాతానంబరు

రిజిస్ట్రేషన్ విధానము

నిర్దేశిత రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రాన్ని(బ్యాంకు కార్యాలయంలోగానీ, ఏటీఎమ్ వద్దగానీ పొందవచ్చు) వివరాలతో నింపి మీకు సమీపంలోని బ్యాంకు కార్యాలయంలో ఉన్న రిలేషన్ షిప్ మేనేజర్ కు సమర్పించండి లేదా డ్రాప్ బాక్స్ లో వేయండి.

మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రం డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిర్దేశిత రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రాన్ని(బ్యాంకు కార్యాలయంలోగానీ, ఏటీఎమ్ వద్దగానీ పొందవచ్చు) వివరాలతో నింపి మీకు సమీపంలోని బ్యాంకు కార్యాలయంలో ఉన్న రిలేషన్ షిప్ మేనేజర్ కు సమర్పించండి లేదా డ్రాప్ బాక్స్ లో వేయండి.

మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు పత్రం డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐ ఎన్ జీ వైశ్యా బ్యాంక్

ఐ ఎన్ జీ వైశ్యా బ్యాంకు సెల్ ఫోన్ ఎస్ ఎమ్ ఎస్ ద్వారా కింది సేవలు అందిస్తోంది
  1. అన్ని ఖాతాలలోని నిల్వ సమాచారం
  2. గత 5,10,15 లావాదేవీల సమాచారం
  3. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  4. చెక్ చెల్లింపు నిలిపేయాలని సూచన
  5. చెక్ పరిస్థితి సమాచారం(చెల్లింపు జరిగిందా, లేదా అన్న సమాచారం)
రిజిస్ట్రేషన్ విధానము
  1. ఐ ఎన్ జీ వైశ్యాబ్యాంకులో ఖాతా కలిగిఉన్న ఖాతాదారు తన బ్రాంచినుంచి యాక్టివేషన్ కోడ్ అడిగి తీసుకోవాలి లేదా
  2. ఉచితంగా 1800 425 9900 నంబరుకు ఫోన్ చేసి లేదా బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ విభాగం నంబరు 56070కు ఎస్ ఎమ్ ఎస్ చేసి యాక్టివేషన్ కోడ్ పొందవచ్చు.

ఐ ఎన్ జీ వైశ్యాబ్యాంకువారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐ ఎన్ జీ వైశ్యాబ్యాంకువారి ఫోన్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొటాక్ మహీంద్రా బ్యాంకు

అందుబాటులో ఉన్న సేవలు
  1. మీఖాతా లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు
  2. కొటాక్ బ్యాంకులో ఉన్న మీ ఖాతాలమధ్య, ఇతర ఖాతాలమధ్య నగదు బదిలీ చేసుకోవచ్చు.
  3. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.
  4. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను సొమ్ము చేసుకోవచ్చు
  5. డెబిట్ కార్డు దొంగతనం/పోగొట్టుకోవడం గురించి సమాచారమివ్వవచ్చు, కొత్తకార్డుకోసం అభ్యర్ధించవచ్చు.
  6. మీరు జారీచేసిన చెక్కు పరిస్థితిగురించిన సమాచారం తెలుసుకోవచ్చు
  7. కొత్త చెక్ బుక్ కోసం అభ్యర్ధన సమర్పించవచ్చు
ఈ మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందే విధానము

కొటాక్ మహీంద్రా బ్యాంకులో మీ సెల్ పోన్ నంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి 5676788నంబరుకు ఎస్ ఎమ్ ఎస్ చేయండి లేదా

మీ సెల్ ఫోన్ లో మొబైల్ బ్యాంకింగ్ ప్రారంభించడానికి ఉచితంగా 1800 116022(ఉత్తర భారతదేశం) లేదా 1800 226022(మిగిలిన భారతదేశం) నంబర్లకు ఫోన్ చేయండి.

కొటాక్ మహీంద్రా మొబైల్ బ్యాంకింగ్ దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవడానికి K MOBILE<మీ కస్టమర్ ఐడీ నంబరులోని చివరి నాలుగు అంకెలు>టైపు చేసి 5676788 నంబరుకు మెసేజ్ పంపాలి.

మీ లాగ్ ఇన్ పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం ప్రారంభించండి.

కొటాక్ మహీంద్రా బ్యాంకు వారి మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కరూర్ వైశ్యా బ్యాంక్

కరూర్ వైశ్యా బ్యాంకు తన ఖాతాదారులకు రెండురకాల మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం తెలుసుకోవడం ఎస్ ఎమ్ ఎస్ ద్వారా ఎలర్ట్స్ పంపించడం

ఈ సేవలు పొందడానికి దయచేసి మీ సెల్ ఫోన్ నంబరును బ్యాంకువారికి తెలియచేసి మీ కస్టమర్ ఐడీ కనుక్కోండి. ఎలర్ట్స్ సేవలకోసం రిజిస్టర్ చేసుకోవడం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యమవుతుంది.

కరూర్ వైశ్యాబ్యాంకులో ఎస్ ఎమ్ ఎస్ ద్వారా కింది సమాచారం పొందవచ్చు
  1. ఖాతాలో నగదు నిల్వ
  2. లావాదేవీ గురించిన సమాచారం
  3. చెక్ పరిస్థితి గురించిన సమాచారం
  4. చెక్ చెల్లింపు నిలిపేయాలన్న ఆదేశాల జారీ
  5. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  6. టర్మ్ డిపాజిట్ గురించిన సమాచారం

సేవలు

ఎస్.ఎమ్.ఎస్పంపేవిధానం56161నంబరుకుమెసేజ్పంపాలి

మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం రిజిస్ట్రేషన్

KVBREG <జాగా> కస్టమర్ ఐడీ టైపు చేసి మెసేజ్ పంపాలి

ప్రాధమిక ఖాతాలోని నిల్వ సమాచారం

KVBBAL <జాగా> కస్టమర్ ఐడీ టైపు చేసి మెసేజ్ పంపాలి

ప్రాధమికేతరఖాతాలలోని నిల్వ సమాచారం

KVBBAL <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> ఖాతా నంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

మీఖాతాలోని గత ఐదు లావాదేవీలు

KVBTXN <జాగా>కస్టమర్ ఐడీ టైపు చేసి మెసేజ్ పంపాలి

ప్రాధమికేతర ఖాతాలలో లావాదేవీలగురించిన సమాచారం

KVBTXN <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> ఖాతానంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

కొత్త చెక్ బుక్ కోసం అభ్యర్ధన

KVBCHR <జాగా> కస్టమర్ ఐడీ

ప్రాధమికేతర ఖాతాల చెక్ బుక్ కోసం అభ్యర్ధన

KVBCHR <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> ఖాతా నంబరు

చెక్ పరిస్థితి సమాచారం-చెల్లింపుజరిగిందా,లేదా,ఆపేశారా

KVBCHQ <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> చెక్ నంబరు

జారీ అయిన చెక్ చెల్లింపు నిలిపేయాలని అభ్యర్ధన

KVBCHS <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> చెక్ నంబరు

టర్మ్ డిపాజిట్ సమాచారం

KVBTDQ <జాగా> కస్టమర్ ఐడీ

ప్రాధమిక ఖాతా నంబరు మార్పుకోసం అభ్యర్ధన

KVBACC <జాగా> కస్టమర్ ఐడీ <జాగా> ప్రత్యామ్నాయ ఖాతా నంబరు

ఎస్ ఎమ్ ఎస్ ఎలర్ట్స్ సేవలు

ఖాతాదారులు ఎస్ ఎమ్ ఎస్ ఎలర్ట్స్, ఈమెయిల్ ఎలర్ట్స్ సేవలకై రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కూడా తమ క్రెడిట్/డెబిట్ కార్డుల లావాదేవీలు, ఖాతాలలోని నగదు నిల్వ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.

కరూర్ వైశ్యాబ్యాంకువారి మొబైల్ బ్యాంకింగ్ సేవలగురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్ష్మీవిలాస్ బ్యాంక్

ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ లోని ముఖ్యాంశాలు
  1. ప్రతిరోజూ నగదు నిల్వ గురించిన సమాచారం
  2. ఐదువేల రూపాయలు, అంతకు మించి జరిగిన ప్రతి ఖర్చు గురించిన సమాచారం
  3. ఐదువేల రూపాయలు, అంతకంటే మించి జరిగిన ప్రతి జమ గురించిన సమాచారం
  4. ప్రాధమిక ఖాతా మార్పు సౌకర్యం
  5. ఖాతాలోని నగదు నిల్వ సమాచారం(సీఐఎఫ్ ఐడీకి సంబంధించిన ఖాతా)
  6. ఖాతా సమాచారం(గత ఐదు లావాదేవీలు)
  7. చెక్ పరిస్థితి సమాచారం
  8. ఫిక్సెడ్ డిపాజిట్ సమాచారం
  9. ప్రాధమిక ఖాతా మార్పు
మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే విధానం

సేవలు

ఎస్ ఎమ్ ఎస్ పంపే విధానం
56070 నంబరుకు మెసేజ్ పంపాలి

ప్రాధమిక 'కాసా'ఖాతాకు అనుసంధానంగా ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేయాలని అభ్యర్ధన

LVB REG <జాగా> ఖాతాదారు నంబరు <జాగా> ఖాతా నంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

ప్రాధమిక 'కాసా' ఖాతా మార్పు కోసం అభ్యర్ధన

LVB ACC <జాగా> ఖాతాదారు నంబరు <జాగా>
ఖాతానంబరు టైపు చేసి మెసేజ్ పంపాలి

నగదు నిల్వ సమాచారం

LVB BAL <జాగా> ఖాతాదారు నంబరు <జాగా> ఖాతా నంబరు

నిర్దేశిత కస్టమర్ ఐడీతో ఉన్న కాసా ఖాతాలో నగదు నిల్వ సమాచారం

LVB BAL <జాగా> ఖాతాదారు నంబరు <జాగా>
ఖాతా నంబరు

మొదటి మూడు టర్మ్ డిపాజిట్ల సమాచారం

LVB TDQ <ఖాతాదారు నంబరు>

ప్రాధమిక కాసా ఖాతాకు సంబంధించిన చెక్ పరిస్థితి సమాచారం

LVB CHQ <జాగా> ఖాతాదారునంబరు <జాగా>
చెక్ నంబరు

ప్రాధమిక ఖాతాలోని గత ఐదు లావాదేవీల సమాచారం

LVB <జాగా> TXN <ఖాతాదారు నంబరు>

ఇతర ఖాతాలోని గత ఐదు లావాదేవీల సమాచారం

LVB <జాగా> TXN <ఖాతాదారునంబరు> <జాగా> ఖాతానంబరు

ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్ సేవలను నిలిపేయాలని అభ్యర్ధన

LVB <జాగా> DEL <ఖాతాదారునంబరు>

లక్ష్మీవిలాస్ బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్ సేవలగురించి మరింత సమాచారంకోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కింది సేవలను అందిస్తోంది
  1. నగదు బదిలీ(బ్యాంకు లోపల, బయటకూడా - 'ఎన్ ఈ ఎఫ్ టి' సహాయంతో)
  2. నగదు నిల్వ సమాచారం/మినీ స్టేట్ మెంట్
  3. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  4. నెలవారీ బిల్లుల చెల్లింపు
  5. ఎమ్ కామర్స్(సెల్ ఫోన్ టాప్ అప్, మర్చంట్ పేమెంట్, ఎస్ బి ఐ జీవితబీమా ప్రీమియం)
ఎస్ బీ ఐ మొబైల్ బ్యాంకింగ్ సేవల ముఖ్యాంశాలు
  1. మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఖాతాదారు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
  2. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారు - రోజువారీగా - ఐదువేలరూపాయలవరకు; నెలవారీగా - ముఫ్ఫైవేలరూపాయల వరకు నగదు బదిలీ, బిల్లు/మర్చంట్ పేమెంట్ లావాదేవీలు నడుపుకోవచ్చు.
  3. ఈ సేవలు పూర్తిగా ఉచితం, అయితే ఎస్ ఎమ్ ఎస్ /జీపీఆర్ఎస్ కనెక్షన్ ఖర్చు మాత్రం ఖాతాదారే భరించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విధానము
  1. MBSREG <జాగా> <సెల్ ఫోన్ తయారీ కంపెనీ పేరు> <జాగా> <సెల్ ఫోన్ మోడల్> అని టైపు చేసి 567676 నంబరుకు మెసేజ్ పంపాలి, ఉదాహరణకు - MBSREG Nokia 6600
  2. మీ సెల్ ఫోన్ లో జావా సౌకర్యం ఉన్నట్లయితే మీకు యూజర్ ఐడీ, ఎమ్ పీ ఐ ఎన్ నంబరు, ఇంటర్నెట్ నుంచి దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవడానికి వెబ్ సైట్ లింకు వంటి సమాచారంతో మెసేజ్ వస్తుంది.
  3. సెల్ ఫోన్ లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందిన మెసేజ్ లో ఉన్న యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వండి.
  4. మీకందిన మెసేజ్ లో ఎలా ఉందో ఖచ్చితంగా అలాగే యూజర్ ఐడీని టైపు చేయాలి.
  5. మొబైల్ బ్యాంకింగ్ దరఖాస్తు తెరచిన తర్వాత ఎమ్ పీ ఐ ఎన్ నంబరును మార్చమని మీకు సూచన అందుతుంది.
  6. మీకు సూచన రాకపోతే ప్రధాన మెనూలో 'సెట్టింగ్స్' అని ఉన్న చోట నొక్కి 'ఛేంజ్ ఎమ్ పీ ఐ ఎన్' అనే అంశాన్ని ఎంచుకోండి.
  7. ప్రాధమిక ఎమ్ పీ ఐ ఎన్ నంబరును పాత ఎమ్ పీ ఐ ఎన్ బాక్సులో వేసి మీరు కోరుకున్న ఎమ్ పీ ఐ ఎన్ నంబరును కొత్త ఎమ్ పీ ఐ ఎన్ బాక్సులో వేయండి. కన్ ఫర్మ్ న్యూ ఎమ్ పీ ఐ ఎన్ అని ఉన్న చోట కొత్త ఎమ్ పీ ఐ ఎన్ నంబరును మళ్ళీ వేసి మీ అభ్యర్ధనను సమర్పించండి.
  8. ఎమ్ పీ ఐ ఎన్ నంబరును మార్చినట్లు మీకు మెసేజ్ వస్తుంది.
  9. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఒక రహస్య ప్రశ్నను ఎంచుకుని దానికి సమాధానాన్ని ఇవ్వండి.
  10. దీనికొసం ప్రధాన మెనూలోకి వెళ్ళి 'సెట్టింగ్స్' ను ఎంచుకోండి. తర్వాత 'వేలిడేట్ ఎకౌంట్' ను ఎంచుకోండి. అక్కడ వచ్చిన డ్రాప్ డౌన్ మెనూలోనుంచి ఒక రహస్య ప్రశ్నను ఎంచుకుని దానికి సమాధానాన్ని ఇవ్వండి.
  11. ఈ రహస్య ప్రశ్నను, జవాబును గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు మీ ఎమ్ పీ ఐ ఎన్ నంబరును మర్చిపోయినా, మొబైల్ బ్యాంకింగ్ నుంచి విరమించుకోవాలనుకున్నా - ఈ ప్రశ్న, జవాబు ద్వారా మీ గుర్తింపును ధృవపరుచుకుంటారు.
  12. ఈ తతంగం పూర్తియిన తర్వాత మీకు సమీపంలోని ఎస్ బీ ఐ ఏటీఎమ్ వద్దకు వెళ్ళి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.
  13. ఏటీఎమ్ వద్ద డెబిట్ కార్డు స్వైప్ చేసిన తర్వాత మొదట 'సర్వీసెస్' అనే అంశాన్ని, తర్వాత 'మొబైల్ బ్యాంకింగ్' అనే అంశాన్ని ఎంచుకోండి.
  14. మొబైల్ బ్యాంకింగ్ కింద రిజిస్టర్ అనే అంశాన్ని ఎంచుకోండి. మీ సెల్ ఫోన్ నంబరును టైపు చేయండి, రిజిస్ట్రేషన్ ధృవపరుచుకోవడంకోసం మళ్ళీ అదే నంబరును టైపు చేయండి.
  15. పై తతంగం అంతా పూర్తయితే మీ ఖాతా యాక్టివేట్ అయినట్లే.
  16. ఆ తర్వాత మీరు మొబైల్ బ్యాంకింగ్ లోని సేవలను పొందవచ్చు.

ఎస్ బీ ఐ మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అందుబాటులో ఉన్న సేవలు
  1. నగదు బదిలీ: ఖాతాదారు యూనియన్ బ్యాంకుకు చెందిన మరో ఖాతాదారుకు నగదు బదిలీ చేయవచ్చు. అయితే ఈ ఇద్దరు ఖాతాదారులు 'యూ మొబైల్ సేవ'లకు రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
  2. నగదు నిల్వ సమాచారం: ఖాతాదారు ఖాతాలో ప్రస్తుతం ఉన్న నగదు నిల్వను తెలుపుతుంది.
  3. మినీ స్టేట్ మెంట్: ఖాతాలో జరిగిన గత తొమ్మిది లావాదేవీలను తెలుపుతుంది.
  4. రిజిస్ట్రేషన్: ఖాతాదారు తన డెబిట్ కార్డునుపయోగించి ఏటీఎమ్ లో యూమొబైల్ సేవ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
  5. డీ రిజిస్ట్రేషన్: ఖాతాదారు బ్యాంకు ఏటీఎమ్ ద్వారా యూమొబైల్ సేవనుంచి విరమించుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ విధానము
  1. ఏటీఎమ్ కేంద్రంలో మీ డెబిట్ కార్డును చొప్పించి మీ డెబిట్ కార్డు పిన్ నంబరును ఎంటర్ చేయాలి.
  2. ప్రత్యక్షమైన తెరమీద అదర్స్ అనే అంశాన్ని ఎంచుకోండి.
  3. మొబైల్ పేమెంట్ అంశాన్ని, తర్వాత రిజిస్ట్రేషన్ అంశాన్ని ఎంచుకోండి.
  4. ఖాతాదారు తన సెల్ ఫోన్ నంబరును రెండుసార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  5. రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తియిన తర్వాత ఏటీఎమ్ నుంచి ఈ కింది విధంగా రసీదు వస్తుంది. "

రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయింది. యాక్టివేషన్ కోడ్ XXXX, మీ సెల్ ఫోన్ లోకి మొబైల్ సేవల దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్ సైట్ ను దర్శించండి:http://mobile.fssnet.co.in/MPAYPORTAL/"

మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని సెల్ ఫోన్ లో అమర్చుకునే విధానము

ఖాతాదారు యూమొబైల్ సౌకర్యాన్ని సెల్ ఫోన్ లో అమర్చుకోవడానికి బ్యాంకువారి వెబ్ సైట్ http://mobile.fssnet.co.in/MPAYPORTAL/ ను దర్శించాలి. ఈ సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కింద చూపిన సూచనలు పాటించండి.

  1. http://mobile.fssnet.co.in/MPAYPORTAL/ పేజికి వెళ్ళిన తర్వాత మీ సెల్ ఫోన్ నంబరును యాక్టివేషన్ కోడ్ ను ఎంటర్ చేయండి.
  2. డౌన్ లోడ్ అప్లికేషన్ అని ఉన్న చోట క్లిక్ చేయండి.
  3. మోడల్ జాబితాలోనుంచి మీ సెల్ ఫోన్ మోడల్ ఎంచుకుని డౌన్ లోడ్ అని ఉన్న చోట్ క్లిక్ చేయండి.
  4. షరతులు, నిబంధనలను అంగీకరిస్తున్నట్లు తెలపండి.
  5. ఈ తతంగం పూర్తయితే మొబైల్ సేవల సౌకర్యం మీ కంప్యూటర్/ల్యాప్ టాప్ లోకి డౌన్ లోడ్ అవుతుంది.
  6. ఈ సౌకర్యాన్ని మీ కంప్యూటర్/ల్యాప్ టాప్ లోనుంచి డేటా కేబుల్/బ్లూ టూత్/యూ ఎస్ బీ లేదా జీ పీ ఆర్ ఎస్ ద్వారా మీ సెల్ ఫోన్ లోకి బదిలీ చేయండి.
  7. మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని మీ సెల్ ఫోన్ లోకి అమర్చుకోండి.
యూ మొబైల్ ఉపయోగించే విధానము

సేవలు

చేయాల్సిన విధానము
9870338500 నంబరుకు మెసేజ్ పంపాలి

నగదు నిల్వ సమాచారం

బ్యాలెన్స్ ఎంక్వయిరీ అనే అంశాన్ని ఎంచుకుని నాలుగంకెల ఎమ్ పీ ఐ ఎన్ నంబరును టైపు చేయండి. మెసేజ్ పంపాలా అని అడిగినపుడు యెస్ అన్న చోట క్లిక్ చేయండి.

మినీ స్టేట్ మెంట్

మినీ స్టేట్ మెంట్ అనే అంశాన్ని ఎంచుకుని నాలుగంకెల ఎమ్ పీ ఐ ఎన్ నంబరును టైపు చేయండి. మెసేజ్ పంపాలా అని అడిగినపుడు యెస్ అన్న చోట క్లిక్ చేయండి.

నగదు బదిలీ(బ్యాంకు లోపలే)

ఫండ్ ట్రాన్స్ ఫర్ అనే అంశాన్ని ఎంచుకుని నాలుగంకెల ఎమ్ పీ ఐ ఎన్ నంబరును టైపు చేయండి. బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని టైపు చేసి నగదు అందుకునే వ్యక్తి మొబైల్ నంబరు టైపు చేయండి. సెండ్ అనేచోట నొక్కండి. మెసేజ్ పంపాలా అని అడిగినపుడు యెస్ అన్న చోట క్లిక్ చేయండి.

ఎమ్ పీ ఐ ఎన్ నంబరు మార్పు

ఎమ్ పీ ఐ ఎన్ అనే అంశాన్ని ఎంచుకుని పాత ఎమ్ పీ ఐ ఎన్ నంబరును, తర్వాత కొత్త ఎమ్ పీ ఐ ఎన్ నంబరును, మళ్ళీ కొత్త ఎమ్ పీ ఐ ఎన్ నంబరును టైపు చేయండి. మెసేజ్ పంపాలా అని అడిగినపుడు యెస్ అన్న చోట క్లిక్ చేయండి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారి యూ మొబైల్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్

అందుబాటులో ఉన్న సేవలు

  1. నగదు నిల్వ సమాచారం
  2. మినీ స్టేట్ మెంట్(గత మూడు లావాదేవీలు)
  3. చెక్ బుక్ కోసం అభ్యర్ధన
  4. బ్యాంకు స్టేట్ మెంట్ కోసం అభ్యర్ధన

మొబైల్ బ్యాంకింగ్ సేవలకోసం మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీరొక లావాదేవీ నడపటానికి(ఉదా.కు నగదు నిల్వ తెలుసుకోవడం) ఒక మెసేజ్ పంపితే చాలు.


సేవలు

ఎస్ ఎమ్ ఎస్ పంపే విధానం
9987123123 నంబరుకు మెసేజ్ పంపాలి

నగదు నిల్వ సమాచారం

BAL A1

మినీ స్టేట్ మెంట్(గత 3 లావాదేవీలు)

TXN A1

చెక్ బుక్ కోసం అభ్యర్ధన

CBR A1

బ్యాంకు స్టేట్ మెంట్ కోసం అభ్యర్ధన

STR A1

కీలక పదాల జాబితా

HELP A1

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ వారి మొబైల్ సేవల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అందిస్తున్న సేవలు:

  1. నగదు నిల్వ సమాచారం
  2. గత ఐదు లావాదేవీల సమాచారం
  3. ఫ్యాక్స్/ఈ మెయిల్ ద్వారా మినీ స్టేట్ మెంట్
  4. బ్యాంకు సేవలకు సంబంధించిన సమాచారం
  5. ఖాతాదారు ఇతర ఖాతాలలోకి నగదు బదిలీ
  6. పిన్ నంబరు మార్పు
  7. రిజిస్ట్రేషన్ విధానము
  8. టెలీబ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందాలనుకుంటున్న ఖాతాదారులు నిర్దేశిత దరఖాస్తుపత్రాన్ని నింపి తన ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచిలో దానిని సమర్పించాలి.
  9. 033-22428940 నంబరుకు ఫోన్ చేసి ఖాతాదారే పిన్ నంబర్ పొందవచ్చు.
  10. దరఖాస్తు సమర్పించిన 24గంటల తర్వాత బ్యాంకు పనిచేసే ఏ రోజయినా ఉదయం పదిగంటలు నుంచి సాయంత్రం ఆరుగంటలలోపు మాత్రమే ఫోన్ చేసి పిన్ నంబరు పొందడానికి వీలవుతుంది.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి మొబైల్ బ్యాంకింగ్ సేవలగురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ( ఐ ఒ బి మొబైల్)

లభ్యమయే సేవలు:

  • బ్యాలెన్స్ విచారణ
  • చిన్న బ్యాంక్ స్టేట్ మెంట్
  • మనీ తరలింపు
  • కొత్త చెక్ బుక్ ని జారీ చేయడం, చెక్ చెల్లింపుల్ని ఆపడం మొదలైన వాటికి అభ్యర్ధన

ఐ ఒ బి మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం కోసము నమోదు చేసే విధానము:

  • ఖాతా ఉన్న శాఖలలో కస్టమర్లు ఐ ఒ బి మొబైల్ బ్యాకింగు కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ క్రింద ఇచ్చిన సూచనలని దయచేసి అనుసరించండి:

సూచన 1: శాఖలో మొబైల్ బ్యాకింగ్ అభ్యర్ధన ఫార్మ్ ఉంటుంది (లేదా) ధరఖాస్తు ఫార్మ్ ని డౌనులోడు చేయడానికి ఇక్కడ నొక్కండి.

సూచన 2 : ధరఖాస్తు ఫార్మ్ డౌనులోడు చేసి ప్రింటు తీసి దానిని మీ శాఖలో ఇవ్వండి.

సూచన 3: ఖాతా ఉన్న శాఖలో నమోదు ఫార్మ్ తో పాటు చిరునామాని ధృవపరచే రుజువుని ఒక్కటే కస్టమరు ఇవ్వాలి.

సూచన 4: నమోదుని విజయవంతంగా చేసిన తరువాత, కస్టమరుకి రెండు ఎస్ ఎమ్ ఎస్ లు వస్తాయి.

సూచన 5: మూడు పని రోజులలోపున మీరు నమోదు చేసిన చిరునామాని మొబైల్ బ్యాకింగ్ ఎమ్ పి ఐ ఎన్ పంపబడుతుంది.

సూచన 6 : మీకు ఎమ్ పి ఐ ఎన్ వచ్చిన తరువాత, దయచేసి http://www.iobnet.mobi సందర్శించి, మీ సరియైన యూజర్ ఐడి మరియు ఎమ్ పి ఐ ఎన్ ని నమోదు చేయండి.

సూచన 7: మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం మొదలు పెట్టండి.

ఐ ఒ బి మొబైల్ బ్యాంకింగ్ సేవలు గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.

ఆంధ్రా బ్యాంక్

లభ్యమయే సేవలు:
ఎస్ ఎమ్ ఎస్ హెచ్చరిక సౌకర్యం
  • కొంత పరిధి, దాటిన తరువాత కార్యకలాపాలకి
  • కొంత పరిధి దాటిన తరువాత ఎటిమ్ నుండి తీయడం
  • చెక్ రిటర్న్ లు
  • చెక్ బుక్ జారీ చేయడం
  • కట్టాల్సిన టెర్మ్ డిపోజిట్ మరియు
  • రోజు చివరలో ఏదైనా కార్యకలాపాలకి బ్యాలెన్స్
విచారణ
  • బ్యాలెన్స్ విచారణ
  • చివరి మూడు కార్యకలాపాలు
  • చెక్ యొక్క స్థితిగతుల విచారణ
  • ఎస్ ఎమ్ ఎస్ పాస్ వర్డు మార్పు
నమోదు చేసేవిధానం:

నియమనిబంధనలని అంగీకరిస్తూ సంతకం చేసిన ఫార్మ్ ని ఇవ్వడం ద్వారా మొబైల్ బ్యాంకింగు సేవలకి ఆంధ్రాబ్యాంకు కస్టమరు తనకు తానే నమోదు చేసుకోవచ్చు. ఖాతా ఉన్నవారికి దగ్గరలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ శాఖ లో ధరఖాస్తు కొరకు కస్టమరు సంపర్కం చేయవచ్చు. అయినప్పటికిని, అన్ని నియమ నిబంధనలని అంగీకరించి ఏ ఆంధ్రా బ్యాంక్ ఏటిఎమ్ ద్వారా నైనా వారు నమోదు చేయవచ్చు.

ఆంధ్రా బ్యాంక్ మొబైల్ బ్యాంకింగు సేవల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి

మొబైల్ లేదా ఫోన్ ఆధారిత సేవలు

సేవలు అందిస్తున్నవారు

అందిస్తున్న సేవలు

ఎలా ఉపయోగించుకోవాలి

కిసాన్ కాల్ సెంటరు వ్యవసాయానికి సంబంధించిన సందేహలకు పరిష్కార మార్గాలు 1551 కి ఫోన్ చేయండి
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం, ఉద్యానవనం, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పశువుల ఆరోగ్యంనకు సంబంధించిన వివిధ సందేహలకు పరిష్కార మార్గాలు 18002334433 కు ఫోన్ చేయండి
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, హర్యానా ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన సందేహలకు పరిష్కార మార్గాలు 9915862026 నెంబరుకు యస్. యం.యస్ చేయండి
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పధకానికి సంబంధించిన సమాచారం మరియు ఫిర్యాధు ల కొరకు 1800110707 నెంబరుకు ఫోన్ చేయండి
హర్యానా ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పధకానికి సంబంధించిన సమాచారం మరియు ఫిర్యాధు ల కొరకు 18001802023 నెంబరుకు ఫోన్ చేయండి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , హిమాచల్ ప్రదేశ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే, వారిపై ఫిర్యాధు చేయడానికి 09418153535 నెంబరుకు ఫోన్ చేయండి
09418153535 నెంబరుకు అవినీతికి పాల్పడుతున్న అధికారి వివరాలతో యస్. యం.యస్ చేయండి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ, జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే వారిపై ఫిర్యాధు చేయడానికి హైదరాబాద్ పరిధిలో ఐతే 040 24732768 నెంబరుకు ఫోన్ చేయండి
విశాఖపట్నం పరిధిలో ఐతే 0891 2783333 నెంబరుకు ఫోన్ చేయండి
సాంఘిక సంక్షేమం మరియు కార్మికుల సంక్షేమ శాఖ, యన్.సి.టి. డిల్లీ ప్రభుత్వం అడుక్కునే బాలలను కాపాడటానికి 1098 నెంబరుకు ఫోన్ చేయండి
భారతీయ రైల్వే రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే వారిపై ఫిర్యాదు చేయడానికి 155210 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయండి
భారతీయ రైల్వే పాసెంజరు నేమ్ రికార్డు (పి.యన్. ఆర్), ప్రస్తుతం నడుస్తున్నరైలుల స్థితి, బెర్తుల ఖాళీలు, టిక్కెటు ధర మొ.. వివరాల కొరకు 139 నెంబరుకి ఫోన్ చేయండి మరియు మీ 10 సంఖ్యల నెంబరు గల పి.యన్.ఆర్ నెంబరును లేదా నాలుగు సంఖ్యలు గల మీ రైలు నెంబరును నొక్కండి
భారతీయ రైల్వే పాసెంజరు నేమ్ రికార్డు (పి.యన్. ఆర్), ప్రస్తుతం నడుస్తున్నరైలుల స్థితి వివరాల కోసం 9773300000 నెంబరుకు ఫోన్ చేయండి
జాన్కారీ ,
బీహార్ ప్రభుత్వం
సమాచారమును పొందే విషయంలో ఇబ్బందులు ఏర్పడితే అధికారులపై ఫిర్యాధు, మొదటి, రెండవ సారి ఆపీలు చేయడానికి , చట్టం గురించి మరింత సమాచారం కోసం ఫిర్యాధు నమోదు చేసుకోవడానికి, మొదటి, రెండవసారి ఆపీలు కోసం 155311 నెంబరికి ఫోన్ చేయండి
మీ ధరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి మరియు ఇతర సమాచారం కోసం155310నెంబరుకి ఫోన్ చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబియస్ఇ) 10 వ తరగతి మరియు 12 వ తరగతి (ఇంటర్మిడియట్) చదువుతూ వైకల్యంతో ఉన్న విద్యార్థుల సందేహలను నివృతి చేసుకోవడానికి డిల్లీ విద్యార్థులు
9717882074 ఫోన్ చేసి శ్వేతా ఖన్నాతో మాట్లాడండి
ముంబాయి విద్యార్థులు
9967800337 ఫోన్ చేసి అభా శర్మతో మాట్లాడండి లేదా 9833950896 కు ఫోన్ చేసి శ్రీ షిప్లే తో మాట్లాడండి లేదా 9819209623 కి ఫోన్ చేసి హెతల్ సయల తో మాట్లాడండి
సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబియస్ఇ) 10 మరియు 12 వ తరగతుల పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి 011 24357270 నెంబరుకు ఫోన్ చేయండి
స్టేట్ ప్రీ-యూనివర్సిటీ డిపార్టుమెంట్, కర్ణాటక ప్రభుత్వం పరీక్షలకు సంబంధించి 12 వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రలకు కౌన్సిలింగు ఇవ్వడానికి 080-23366778 లేదా 080 23366779 నెంబరుకు సాయంత్రం మూడు గంటలనుండి నాలుగున్నర లోపు ఫోన్ చేయాలి
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, చెన్నై ధరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి, ప్రకటించబడిన ఉద్యోగ వివరాలు, అర్హతలు మరియు ఉద్యోగపరీక్షా ఫలితాలు తెలుసుకోవడానికి 6161 కు యస్.యం.యస్ చేయండి
ఎమర్జెన్సి మేనేజ్ మెంట్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ (ఇ.యం.ఆర్.ఐ), హైదరాబాద్ గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం 108 కి ఫోన్ చేయండి
ఆరోగ్య శాఖ రోగి గ్రస్తులకు అంబులెన్సు మరియు ఇతర వైద్య సహయం 102 లేదా 1099 కి ఫోన్ చేయండి
భారత సుఫ్రీం కోర్టు – అత్యున్నత న్యాయ స్థానం కోర్టులో కేసు నడుస్తున్న వారి వివరాలు, లాయర్ల వివరాలు, కేసు సుఫ్రీంకోర్టులో ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి 011-4362062 లేదా 011 4360112 నెంబరుకు ఫోన్ చేయండి
డిల్లీ లీగల్ సర్వీసెస్ అధారిటీ న్యాయ సలహాలు మరియు సహయం 12525 టోల్ ఫ్రీ నెంబరుకి లేదా 23070345 & 23073132 నెంబరుకు ఫోన్ చేయండి
కేరళ లీగల్ సర్వీసెస్ అధారిటీ న్యాయ సలహాలు మరియు సహయం 9846 700 100 నెంబరుకు ఫోన్ చేయండి
బ్రిహత్ ముంబాయి మున్సిఫల్ కార్పోరషన్ (బియంసి) చెత్తాచెదారాల నిర్వహణ, మురిగి కాలువలు, మురుగు, రోడ్లు, ట్రాఫిక్, పరిశ్రమలు, లైసెన్సుల జారీ, నీటి సరఫరా, కీటకాల నియంత్రణ, భవనాలు, అక్రమణ వంటి అంశాలపై ఫిర్యాధు చేయడానికి 1916 నెంబరుకు ఫోన్ చేయండి
బ్రిహత్ ముంబాయి మున్సిఫల్ కార్పోరషన్ (బియంసి) ఇరవై వేల రూపాయల వరకు బకాయి పడ్డ నీటి, ఆస్తి పన్నుల చెల్లింపుచేయడానికి 57575 నెంబరుకి యస్ యం యస్ చేయండి. దీనిని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఐటిజడ్ క్యాష్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఈ కార్డు 16 సంఖ్యలు గల నెంబరును ఇస్తుంది. పౌరులు యస్ యం యస్ చేసేటప్పుడు ఈ 16 సంఖ్యలు గల నెంబరును కూడా తెలియజేయాలి. యస్.యం.యస్ ను బి.యం.సి. ఐటి కంట్రోల్ రూం అందుకుంటుంది. వెంటనే వారు మీరు బకాయి పడ్డ అంటే మీరు ఎంత మొత్తం చెల్లించవలసి ఉందో యస్..యం.యస్ ద్వారా తెలియజేస్తారు. వెంటనే మీరు 16 సంఖ్య గల యస్.బి.ఐ-ఐ.టి.జడ్. నెంబరును మరియు చెల్లించే మొత్తాన్ని యస్.యం.యస్ ద్వారా వారికి తెలియజేస్తారు.
కోజికోడ్ జిల్లా
కేరళ – డాక్టరు యస్.యం.యస్
మీ దగ్గరలో, మీజిల్లాలో బ్లడ్ బ్యాంకులు, పరీక్షా కేంద్రాలు, ప్రవేట్ ఆసుపత్రులు, ప్రత్యేక ఆసుపత్రులు, సర్జరీ మరియు వెంటిలేటర్స్ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు వివరాలు తెలుసుకోవడానికి 9446460600 నెంబరుకు మీ పూర్తి చిరునామాతో యస్.యం.యస్ చేయండి
గుర్గాం పోలీసు
హర్యానా ప్రభుత్వం
మీరు ప్రమాదంలో లేదా ఒత్తిడిలో ఉన్నట్లయితే పోలీసులు మీకు సహాయ పడతారు 9717595423 నెంబరుకి యస్.యం.యస్ చేయండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా

లభ్యమయ్యే సేవలు
  • ఇదివరకటి కార్యకలాపాల వివరాలు
  • ఖాతా బ్యాలెన్స్
  • చిన్న ఖాతా స్టేట్ మెంట్
సేవలని పొందే విధానం

సూచన 1: ధరఖాస్తు ఫార్మ్ ని నింపి మీ ముఖ్యశాఖలో ఇవ్వాలి. ధరఖాస్తు ఫార్మ్ ని డౌనులోడు చేయడానికి ఈ క్రింద ఇచ్చిన లింక్ ని నొక్కండి.

1.ప్రస్తుతం ఉన్న ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ఉపయోగించేవారికి

2.క్రొత్తగా ఉపయోగించేవారకి

సూచన 2: మీరు కొత్తగా ఉపయోగించేవారైతే, పోస్టు/ కొరియర్ ద్వారా మీ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ని నేరుగా అందుకుంటారు.

సూచన 3 : యూజర్ ఐడి, పాస్ వర్డు పొందిన తరువాత, ఎస్ ఎమ్ ఎస్ పాస్ వర్డ్ ని మార్చడానికి లాగ్ ఆన్ చేయండి.

సూచన 4 : ఎస్ ఎమ్ ఎస్ వర్డు మార్చిన తరువాత, మీ మొబైల్ లో బ్యాంకింగు సేవలను వినియోగించవచ్చును.

బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

లభ్యమయ్యే సేవలు

ఈ క్రింద ఇచ్చిన చర్యలకి ఎస్ ఎమ్ ఎస్ హెచ్చరిక :

  • రూ. 5000/ - లేక అంతకమించి, మొత్తం జమ చేసినపుడు లేక తీసినపుడు
  • కస్టమర్లు జారీ చేసిన చెక్, ఫండ్స్ లేని కారణంగా బౌన్స్ అయినపుడు
  • కనీస బ్యాలెన్స్ కన్నా తక్కున బ్యాలెన్స్ ఖాతాలో ఉన్నప్పుడు
  • ఫిక్స్ డు డిపాజిట్ మెచూరిటీకి ఏడు రోజుల ముందు

ఆసక్తి గల కస్టమర్లు తమ ప్రధాన శాఖలో వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబరు/ నంబర్లు మరియు 10 డిజిట్లు మొబైల్ నంబరుకి ముందు 91 పెట్టి నమోదు చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగు సేవలు గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

లభ్యమయ్యే సేవలు
  • ఖాతాలో / ఖాతాలలో బ్యాలెన్స్ విచారణ
  • చిన్న స్టేట్ మెంటు – చివరి ఐదు కార్యకలాపాలు
  • ఎస్ బి ఐ & ఇతర బ్యాంకుల ఖాతాలకి ఫండ్స్ ని తరలింపు
  • చెక్ బుక్ జారీ చేయడం కోసం అభ్యర్ధనలు
  • విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలగు యుటిలిటీ బిల్లుల చెల్లింపులు
  • వ్యాపార చెల్లింపులు
  • మొబైల్ టాప్ అప్
  • ఎస్ బి ఐ జీవిత భీమా ప్రీమియమ్ చెల్లింపు

ఆసక్తి ఉన్న కస్టమరు మొదట వారి ప్రధాన శాఖని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ హైదరాబాద్ మొబైల్ బ్యాంకింగ్ సేవలని పొందడానికి సంపర్కం చేయాలి.

సేవలకోసం నమోదు చేసే విధానం
యూజర్ ఐడి పొందడానికి నమోదు
  1. 567676 కి SMS <SBIREG> <MobileMake> <MobileModel> ఎస్ ఎమ్ ఎస్ పంపండి.
  2. మొబైల్ బ్యాంకింగ్ ధరఖాస్తు డౌను లోడు చేయడానికి ( మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే) మీకు యూజర్ ఐడి మరియు ఎమ్ పి ఐ ఎన్ మరియు డబ్ల్యూ ఏ పి లింకుని పొందుతారు,
  3. బ్యాంకింగ్ కు ధరఖాస్తు ( మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే )

ఈ సేవలు ప్రస్తుతం జావా కలిగి ఉన్న మొబైల్ ఫోన్స్ కు ఎస్ ఎమ్ ఎస్ / జి పి ఆర్ ఎస్ / డబ్ల్యూ ఎ పి ద్వారా మరియు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉండి జావా లేని ఫోన్స్ కు లభ్యమవుతుంది.

మీ మొబైల్ హ్యాండ్ సెట్ కు మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుని డౌను లోడ్ చేయటం
  1. మీ హ్యాండ్ సెట్ లో జావా కలిగి ఉండాలి
  2. మీకు జి పి ఆర్ ఎస్ కనెక్షన్ ఉంటే, యూజర్ ఐడి తో మీరు తీసుకున్న డబ్ల్యూ ఎ పి లింక్ ఉపయోగించి ధరఖాస్తుని డౌను లోడ్ చేసుకోవచ్చు.
  3. లేదా, బ్యాంక్ వెబ్ సైట్ www.sbi.co.in కి లాగాన్ చేసి, సేవలు - మొబైల్ బ్యాంకింగు దగ్గర నొక్కండి. మీరు డేటా-కేబుల్ లేక బ్లూటూత్ ఉపయోగించి తగిన మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుని డౌను లోడ్ చేసుకోవచ్చు
లాగిన్
  1. మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుని డౌను లోడ్ చేసిన తరువాత, ఎస్ బి ఐ ఫ్రీడంమ్ ఐకాన్ నొక్కండి,
  2. మీ యూజర్ ఐడి ని నమోదు చేయండి,
  3. వికల్పం మీద నొక్కండి మరియు లాగిన్ ఎంచుకోండి,
  4. ఎమ్ పి ఐ ఎన్ మార్చమని మీకు తెలియపరుస్తుంది,
  5. తెలియపరచకపోతే, సెట్టింగ్సుకు వెళ్ళండి - ఎమ్ పి ఐ ఎన్ మార్చండి,
  6. మొదటి లాగిన్ తరువాత ఎమ్ పి ఐ ఎన్ మార్చండి,
  7. ఎమ్ పి ఐ ఎన్ మార్పును ఎంచుకోండి,
  8. పాత ఎమ్ పి ఐ ఎన్ క్రింద- ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వచ్చిన ఎమ్ పి ఐ ఎన్ నమోదు చేయండి,
  9. స్క్రోల్ బటన్ ఉపయోగించి తరువాత కొత్త ఫీల్డ్ ఎమ్ పి ఐ ఎన్ కు వెళ్ళండి,
  10. కొత్త ఎమ్ పి ఐ ఎన్ క్రింద – మీకు ఇష్టమైన ఎమ్ పి ఐ ఎన్ నమోదు (6 అక్షరాలు/ అంకెలు) చేయండి,
  11. తరవాత ఫీల్డ్ కు క్రిందకి స్క్రోల్ చేసి కొత్త ఎమ్ పి ఐ ఎన్ ధృఢపరచండి
  12. వికల్పాన్ని నొక్కండి. మార్పును ఎంచుకోండి మరియు చివరిగా “ కొత్త ఎస్ ఎమ్ ఎస్ సెట్టింగు సఫలమైంది ” – అని మీకు ఎస్ ఎమ్ ఎస్ వస్తుంది

స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరబాదు మొబైల్ బ్యాంకింగు సేవలు గురించి మరింత తెలుసుకొనుటకు ఇక్కడ నొక్కండి.

విజయ బ్యాంక్

లభ్యమయే సేవలు
  1. బ్యాలెన్స్ విచారణ,
  2. చిన్న బ్యాంక్ స్టేట్ మెంట్,
  3. మనీ తరలింపు,
  4. యుటిలిటీ బిల్లు చెల్లింపు,
  5. సినిమా టికెట్ బుకింగు,
  6. మొబైల్ రీచార్జ్,
  7. ఫీజులు చెల్లింపు ( తరువాత దశ),
  8. ఎ టి ఎమ్ మరియు శాఖలని చూపించేది,
  9. కొత్త చెక్ బుక్ ని జారీ చేయడం, చెక్ చెల్లింపుల్ని ఆపడం మొదలైన వాటికి అభ్యర్ధన
విజయ మోబైల్ బ్యాంకింగు సేవలకు కావలసిన కనీస అవసరాలు:
  1. వినియోగదారుడుకి సేవింగ్స్ / కరెంటు బ్యాంక్ ఖాతా ఎ టి ఎమ్/డెబిట్ కార్డు ఉండాలి
  2. మీ హ్యాండ్ సెట్ లో జావా కలిగి ఉండాలి మరియు కనీసం ఈ క్రింద ఉన్న ఏదైనా ఒకటి కలిగి ఉండాలి :
    • జి పి ఆర్ ఎస్ (జెనరల్ ప్యాకెట్ రేడియో సేవలు) కలిగి ఉండాలి,
    • బ్లూ టూత్,
    • డేటా కేబుల్ ద్వారా డేటాని తరలించే ఏర్పాటు
నమోదుచేసే విధానం @ ఎ టి ఎమ్
  1. ఎ టి ఎమ్ కార్డు ని ఎ టి ఎమ్ మెషీన్ లో పెట్టి మరియు మీ ఎ టి ఎమ్ కార్డు పిన్ ని నమోదు చేయండి,
  2. ఎ టి ఎమ్ మెషీన్ లో మొబైల్ బ్యాంకింగు నమోదు వికల్పాన్ని ఎంచుకోండి,
  3. మీ 10 అంకెల మొబైల్ నెంబరు నమోదు చేసి మరియు తిరిగి మోబైల్ నెంబరు ధృఢ పరచుటకు ‘ధృఢపరచు’ బటన్ ని ఎంచుకోండి ,
  4. తిరిగి మొబైల్ నెంబరు నమోదు చేసి మరియు ధృడపరుచుకోండి,
  5. మీ ఖాతా రకము ఎంచుకోండి <కరెంట్ > లేదా < సేవింగ్స్ >
  6. ఆమోదించిన తరువాత, ఎ టి ఎమ్ సమాచారము చూపిస్తుంది “ మీ మోబైల్ నెంబరు నమోదు సఫలమైంది ” మరియు అదే ప్రింటు చేయబడుతుంది,
  7. వినియోగదారుడు వివరాలు సరియైనవి కాకపోతే, అప్పుడు ఎ టి ఎమ్ “నమోదు విఫలమైంది ” అని చూపిస్తుంది,
  8. నమోదు సఫలమైన తరువాత, మొబైల్ ధరఖాస్తు సాప్ట్ వేరు మరియు రెండు పాస్ వర్డులు డౌన్ లోడ్ చేయుటకు బ్యాంక్ నుండి మొబైల్ ధరఖాస్తు యు ఆర్ ఎల్ లింక్ కలిగి ఉన్న ఎస్ ఎమ్ ఎస్ వినియోగదారుడు అతని/ ఆమె మొబైల్ కు వస్తుంది-
    • ధరఖాస్తు పాస్ వర్డు
    • సక్రియ కోడ్/ ఎమ్ పి ఐ ఎన్

మీరు మొబైల్ బ్యాంకింగు ధరఖాస్తుకు అందిన యు ఆర్ ఎల్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా తమ మొబైల్ కు ధరఖాస్తు సంబంధించి డౌనులోడ్ చేయుటకు దగ్గరలో ఉన్న బ్యాంకు శాఖని సంప్రదించండి.

విజయ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగు సేవలు గురించి మరింత తెలుసుకునుటకు ఇక్కడ నొక్కండి.

అలహాబాద్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకిగ్ సేవలు

అలహాబాద్ బ్యాంకు, వినియోగదారులకు మొబైల్ ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా ఈ క్రింది బ్యాంకు సేవలను అందిస్తోంది.
  • ఖాతా లో మిగిలిన సోమ్ము వివరాలను అడుగుట
  • బ్యాంకు అతి చిన్న నివేదిక గురించి తెలుసుకొనుట ( చివరి ఐదు లావాదేవీల వరకు)
  • చెక్కు పుస్తకం కొరకు విన్నపం పంపుట
  • జారీ చేసిన చెక్కు యొక్క చెల్లింపును నిలిపివేయమని కొరుట
  • చెక్కు కు సోమ్ము ను విడుదల స్ధితిని తెలుసుకొనుట
  • నిర్ణీత కాలానికి దాచిన సోమ్ము యొక్క వివరాలను అడుగుట
మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందుటకు కావలసిన అర్హత
  • అలహాబాద్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉండడం
  • ఖాతాదారుడి మొబైల్ పరికరం ( mobile hand – set , Gprs పరిధిలో ఉండడం
  • ఖాతాదారుడు, బ్యాంకు నుండి, మొబైల్ బ్యాంకింగ్ కొరకై యూజర్ ఐ.డి (వినియోగదారుడి గుర్తింపు) మరియు పాస్ వర్డ్ ( సంకేత పదం) ను పొంది ఉండడం
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( కంపూట్యర్ బ్యాంకింగ్) (వినియోగదారుడి గుర్తింపు) యూజర్ ఐ.డి మరియు ( సంకేత పదం) పాస్ వర్డ్ కలిగి ఉన్న వ్యక్తి అయితే, మొబైల్ బ్యాంకింగ్ కు కూడ అవే వర్తిస్తాయి.
అధికారిక నమోదు ప్రక్రియ
  • నిర్దేశించిన అభ్యర్ధనా పత్రంలో, (తమ) మూల ( మాతృ) శాఖ కు మొబైల్ బ్యాంకింగ్ కొరకై దరఖాస్తు చేయాలి.
  • బ్యాంకుకు, మీ మొబైల్ నంబరు ను నమోదు కొరకై అందజేయండి.
  • బ్యాంకు, మీకు mpin ( ఎమ్ పిన్ - mobile personal identification number - సంచార ఫోను వ్యక్తిగత గుర్తింపు సంఖ్య) ను జారీ చేస్తుంది.
  • mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్ ను పొందిన తరువాత, బ్యాంకుకు తెలియపర్చండి. అందువలన మీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవుతాయి.
  • ఆరంభమైన తరువాత, మీ ఖాతా, మీ మొబైల్ పోన్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది.
  • మీకు గనుక, అలహాబాద్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నట్లైతే ఆన్ లైన్ విన్నపం ద్వారా( ఎస్.ఎమ్.ఎస్ sms banking ( short message service - సంక్షిప్త సందేశ సేవ) అడగవచ్చు.
  • మొబైల్ హ్యాండ్ సెట్ (మొబైల్ ఫోన్) ( సంచార ఫోన్) లో బ్యాంకింగ్ సేవలు పొందే ముందు, బ్యాంకు అందించిన సూచనలను అనుసరించండి. అది అందుబాటులో ఉన్నది www.allbankonline.in

మీ వినతిని, అలహాబాద్ బ్యాంకుకు - 9795244444 పంపి మీ మొబైల్ హ్యాండ్ సెట్ లో బ్యాంకింగ్ సేవలను పొందండి . sms message (ఎస్.ఎమ్.ఎస్ సందేశాలు) ముందే నిర్వచించిన ప్రకారం మరియు సంపూర్ణ రూపంలో పంపించాలని గుర్తించండి అవి అందుబాటులో ఉన్నది www.allbankonline.in

అలహాబాద్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చేయండి

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర మొబైల్ బ్యాంకింగ్ సేవలు

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, మొబైల్ లో దిగువ పేర్కొన్న బ్యాంకింగ్ సేవలను అందజేస్తోంది
  • ఖాతాలో మిగిలిన సోమ్ము పై ఆరా
  • అతి చిన్న నివేదిక - ఆఖరి మూడు లావాదేవీలు
  • చెక్కు విడుదల స్ధితిని తెలుసుకొనుట
  • నిధుల బదిలీ - వినియోగదారుడి, స్వయం ఖాతాలలో
  • నిధుల బదిలీ - బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర పరిధిలో ఉన్న ఏ యితర ఖాతాకైనా
  • వేరే బ్యాంకులకు నిధుల బదిలీ
  • చెక్కు పుస్తకం జారీ కొరకై వినతి
  • ఖాతా యొక్క భౌతిక నివేదిక కై వినతి
నిధుల బదిలీ పరిమితి

నిధుల బదిలీ పరిమితి మహా మొబైల్ సదుపాయం ద్వారా వినియోగదారుడు, ఒక రోజులో 50000 రూపాయల వరకు నిధులను బదిలీ చేయవచ్చు. రోజుకు నిధుల బదిలీ పరిమితి, వినియోగదారుడి కోరిక మేరకు ఎంత సోమ్ము వరకైనా 50000 రూపాయల లోపల నిర్ణయించవచ్చు.

ఈ సదుపాయం పొందుటకు కావలసిన అర్హత
  1. అన్ని రకాల పొదుపు ఖాతాదారులు వ్యక్తిగతంగానూ, లేక జాయింట్ ఎకౌంట్ హాల్డర్స్ ( ఉమ్మడి ఖాతాదారులు), ప్రక్రియ జీవించి ఉన్న యిద్దరిలో ఎవరైనా ఉన్నవారు.
  2. ఒకే యాజమాన్యం గల ఉమ్మడి సంస్ధ కరెంట్ ఎకౌంట్ ( రోజు వారీ ఖాతా ) మరియు క్యాష్ క్రెడిట్ ఎకౌంట్ ( ఖాతాదారులు) ఖాతాదారులు.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి వర్తించే షరతులు

మొబైల్ బ్యాంకింగ్ పొందడానికి వినియోగదారునికి ఈ క్రింది అంశాలు తోడ్పడాలి.

  • జావా కలిగిన ( mobile banking computer programe)మెమరీ తో ఉన్న ( memory – computer argon ) మొబైల్ ఫోను
  • మొబైల్ ఫోను gprs - తో అనుసంధానం కలిగి ఉండడం
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు అయ్యే ఖర్చులు

ప్రస్తుతం బ్యాంకు, ఈ మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అందజేస్తోంది. కాని చెక్కు పుస్తకం బట్వాడాకు లేక ఖాతా యొక్క నివేదికను వినియోగదారుని చిరునామాకు పంపుటకు, బ్యాంకు, కొరియర్, పోస్టల్ ఖర్చులను 50 రూపాయలు తీసుకుంటుంది.

మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందుటకు అధికార నమోదు ప్రక్రియ

మొదటి అంకం : - నిర్దేశించిన అభ్యర్ధనా పత్రంతో మీ మూల శాఖ కు మొబైల్ బ్యాంకింగ్ సేవ కొరకై దరఖాస్తు చేయాలి. మీకు చేరువలో ఉన్న బ్యాంకు శాఖ నుండి అభ్యర్ధనా పత్రం పొందవచ్చు. విజయవంతంగా ఈ అభ్యర్ధనా ప్రక్రియ, బ్యాంకు శాఖలో మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెల్ లో పూర్తి అయిన తరువాత, మీరు నాలుగు అంకెలు గల mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్) సంఖ్యను మొబైల్ బ్యాంకింగ్ కొరకై పోస్టు ద్వారా గాని, కొరియర్ ద్వారా గాని అందుకుంటారు.

రెండవ అంకం : - మొబైల్ బ్యాంకింగ్ అభ్యర్ధనా పత్రాన్ని మీ మొబైల్ ఫోనులో పొందుపరచాలి.

  • ఎంపిక -1 : - ఒక sms bom mobile ( ఎస్. ఎమ్.ఎస్.బి.ఎమ్ మొబైల్ ) ను 9975494909 కు పంపించండి మీ మొబైల్ నంబర్ బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో మొబైల్ బ్యాంకింగ్ సేవల కొరకై అధికారికంగా నమోదు అయి ఉన్నట్లైతే, మీరు ఒక లింకు కు సంబంధించిన sms (ఎస్. ఎమ్.ఎస్ - సంక్షిప్త సందేశ సేవ) ను అందుకుంటారు. ఇది ఉపయోగించి, మీ మొబైల్ ఫోను లో మొబైల్ బ్యాంకింగ్ అభ్యర్ధనా పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకొనవచ్చు.
  • ఎంపిక -2 : - మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ను వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చు. వెబ్ సైట్ ను సందర్శించండి (visit website) – https.// www. Maha connect.in ఇతర సాంకేతిక ఉత్పత్తి అయిన మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి వెళ్ళి డౌన్ లోడ్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లింకును క్లిక్ చేయండి. మీ పర్సనల్ కంప్యూటర్ లో అభ్యర్ధనా పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకుని, యు.ఎస్.బి డేటా కేబుల్ లేక బ్లూటూత్ ని ఉపయోగించి మొబైల్ ఫోనులోకి మార్చండి.

అంకం : - మహా- మొబైల్ కొరకు అధికారిక నమోదు ప్రక్రియ

  1. మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసిన మహా- మొబైల్ అప్లికేషన్ ను (ఓపెన్ - తెరవండి) చెయ్యండి.
  2. బ్యాంకులో నమోదు అయిన మొబైల్ నంబర్ ను మరియు బ్యాంకు, మీకు పోస్టులేదా కొరియర్ ద్వారా పంపించిన mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్) నంబర్ ను ఎక్కించండి మరియు ( ఎంపిక చేసుకొనండి) register ను select చెయ్యండి.
  3. మహా- మొబైల్ యొక్క నియమాలు, షరతులు సారాంశం మీ మొబైల్ ఫోను తెర పై ప్రత్యక్షమవుతాయి. Agree ( అగ్రీ) ను ఎంపిక select చేసుకొనండి
  4. తరువాత తెరపై, మీరు ఆరు అంకెల మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, సంకేత పదం ను చేర్చండి అభ్యర్ధనా పత్రం పాస్ వర్డ్ ను రెండు సార్లు ప్రవేశ పెట్టండి ఒక సారి అభ్యర్ధనా పత్రం, సంకేత పదం బాక్స్ లో ప్రవేశ పెట్టండి - ఎంటర్ అప్లికేషన్ పాస్ వర్డ్ బాక్స్) లో ఇంకొకసారి కన్ ఫర్మ్ అప్లికేషన్ పాస్ వర్డ్ బాక్స్ )- ( సేవ్ ని ఎంచుకోండి) సేవ్ అనగా మనం చేసినది కంప్యూటర్ లో నిక్షిప్తమవుతుంది.
  5. ఇప్పడు అప్లికేషన్, మీ నెట్ వర్క్ ను చేరడానికి అనుమతి అడుగుతుంది, అప్లికేషన్ కు gprs ద్వారా, నెట్ వర్క్ లో చేరడానికి అనుమతినివ్వండి. నమోదు ప్రక్రియ పూర్తి అయ్యేదాకా ఎదురుచూడండి, ఈ విషయం 1 – 2 నిముషాల సమయం తీసుకుంటుంది.
  6. నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యాక దయచేసి బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర మీకు పంపించిన mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్) నంబర్ ను మార్చండి.
  7. దయచేసి, మీ mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్) ను మరియు అప్లికేషన్ పాస్ వర్డ్ , మీరు సెట్ కు విర్చినది చేసినది గుర్తు ఉంచుకోండి.
  8. మీ mpin ( ఎమ్ పిన్.ఐ.ఎన్) ను మీకు తిరిగి ఉత్పత్తి చేయవచ్చు మరియు మళ్ళీ జారీ చేయవచ్చు అని గ్రహించండి కాని, మీ అప్లికేషన్ పాస్ వర్డ్ ను మీరు మర్చి పోయినట్లైతే , మీరు తిరిగి మళ్ళీ క్రొత్తగా అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మరియు నమోదు ప్రక్రియ మళ్ళీ క్రొత్తగా చేసుకోవాలి.
  9. విజయవంతంగా నమోదు ప్రక్రియ పూర్తి అయిన తరువాత, మీరు మొబైల్ బ్యాంకింగ్ సేవల ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

కెనరా బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

కెనరా బ్యాంకు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను రెండు విధాలుగా చేస్తుంది.
  • ఎస్.ఎమ్.ఎస్ వినతి ( సంక్షిప్త సందేశ సేవ) విచారణ సదుపాయం
  • ఎస్.ఎమ్.ఎస్ హెచ్చరిక సదుపాయం (ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్ ఫెసిలిటీ)
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హతలు
  • Sms ఆధారంగా కల మొబైల్ ఫోను ( gsm లేక cdma)
  • బ్యాంకులో ఇ - మొయిల్ ఐ.డి మరియు మొబైల్ నంబర్లును నమోదు చేసుకుని ఉండడం.
Sms వినతి ( sms request) / విచారణ సదుపాయంలో అందుబాటులో ఉన్న సేవలు
  • Sms బ్యాంకింగ్ కొరకు నమోదు ప్రక్రియ
  • ప్రాధమిక ఖాతా ను మార్చడం
  • Casa ( current account) (కరెంట్ ఖాతా) saving account (పొదుపు ఖాతా) లో మిగిలిన సోమ్మును చూడగలగడం.
  • నిర్ణీత వ్యవధికి దాచుకున్న సోమ్ము వివరాలను చూడగలగడం.
  • జారీచేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని పరిశీలించగలగడం.
  • బ్యాంకు యొక్క అతి చిన్న నివేదికను పొందగలగడం ( చివరి 5 లావాదేవీలు)
  • Sms బ్యాంకింగ్ రద్దు కొరకై వాడుకొనడం
Sms / e- mail హెచ్చరిక సదుపాయం (sms / e- mail alerts facility ) లో అందుబాటులో ఉన్న సేవలు

ఈ క్రింద పేర్కొన్న సంఘటనల నేపధ్యంలో బ్యాంకు, ఒక హెచ్చరిక సందేశాన్ని Sms ద్వారాగాని, ఇ-మొయిల్ ద్వారాగాని పంపిస్తుంది.

  • ఒక బాకీ / పరపతి (జమచేయు) లావాదేవీలో సోమ్ము 10,000 రూపాయలకు మించినా లేక వినియోగదారుడు నిర్దేశించిన సోమ్ముకు మించినా
  • వినియోగదారుడి పనిచేసే ఖాతాలు వేటికైనా, నెల నెలా ప్రస్తుతం ఉన్న మిగిలిన సోమ్ము అప్పు గురించి తెలియ జెప్పడం.
  • బ్యాంకులో నిల్వ ఉన్న సోమ్ము కంటె అధికంగా తీసుకున్న సమయంలో, వినియోగదారుడి పనిచేసే ఖాతాలు బాకీ సోమ్ము లోనకి వెళ్ళిపోతాయి లేక పరిమితికి మించి తీసుకున్నప్పుడు కూడ యిలా జరుగుతుంది. అటువంటప్పుడు చేసే హెచ్చరిక (over draft alert)
Sms వినతి (sms request) విచారణ సదుపాయం పొందుటకు చేసే అధికారిక నమోదు ప్రక్రియ
  • మీ బ్యాంకు యొక్క మాతృ ( మూల ) శాఖ నుండి మొబైల్ బ్యాంకింగ్ అభ్యర్ధనా పత్రాన్ని తీసుకొనండి.
  • నింపిన అభ్యర్ధనా పత్రాన్ని రెండు ప్రతులుగా తీసుకొనండి.
  • అప్లికేషన్ ఫారమ్ ( అభ్యర్ధనా పత్రం ) ను డౌన్ లోడ్ కూడ చేసుకొనవచ్చు. ఇక్కడ నుండి www.canarabank.in
  • మీరు Sms వినతి సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ బ్యాంకు శాఖ నుండి, మీ వినియోగదారుడి గుర్తింపు ను తెలుసుకుని, వ్రాసుకుని ఉంచుకోండి.
  • అప్లికేషన్ లో Sms వినతి సదుపాయంను పొంద గలిగే ఇ- మొయిల్ ఐ.డి మరియు మొబైల్ నంబర్లు దేశం యొక్క కోడ్ తో సహా స్పష్టంగా, తప్పకుండా సూచించాలి.
  • అన్ని Sms లు చిన్న సంఖ్య అయిన 61 61 కు మాత్రమే పంపించాలి
బ్యాంకింగ్ సేవలు Sms ద్వారా పొందుటకు అనుసరించవలసిన పద్ధతి

క్రమ సంఖ్య

ముఖ్యమైన సాంకేతిక పదాలు

సందేశ రూపం (నిర్మాణం)

ఉద్దేశం

1.

CANREG
or
canreg

CANREG <Customer No>

ముందుగా తెరచిన ఖాతాను ప్రాధమిక ఖాతాగా భావించి మొబైల్ బ్యాంకింగ్ సేవ కొరకు అధికారిక నమోదు మీరు ప్రవేశ పెట్టిన ఖాతాగా మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ కొరకు అధికారిక నమోదు

CANREG <Customer No> <A/c No.>

మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ కొరకు అధికారిక నమోదు.

2.

CANACC
or
canacc

CANACC <Customer No> <Acct.No>

మౌలిక ప్రాధమిక ఖాతా నంబర్ మార్పు కొరకు

3.

CANBAL
or
canbal

CANBAL <Customer No>

మౌలిక ఖాతా యొక్క మిగిలిన సోమ్ము వివరణ కొరకు

CANBAL <Customer No> <Acct.No>

వేరే ఖాతా యొక్క మిగిలిన సోమ్ము వివరణ కొరకు

4.

CANTDQ
or
cantdq

CANTDQ <Customer No>

మొదటి 3 టర్మ్ డిపాజిట్ ఖాతాలు వివరాల కొరకు

CANTDQ <Customer No> <Acct.No>

ప్రత్యేకంగా ఒక ఖాతా యొక్క టర్మ్ డిపాజిట్ వివరాల కొరకు

5.

CANCHQ
or
canchq

CANCHQ <Customer No> <Cheque No>

మౌలికమైన పనిచేసే ఖాతాలు జారీ చేసిన చెక్కు స్ధితి పై వివరణ కొరకు

6.

CANTXN
or
cantxn

CANTXN <Customer No>

మౌలిక ఖాతాలో చివరి ఐదు లావాదేవాలు యొక్క వివరణ

CANTXN <Customer No> <Acct.No>

ఇతర ఖాతాలో చివరి ఐదు లావాదేవీల యొక్క వివరణ.

7.

CANDEL
or
candel

CANDEL <Customer No>

Sms సదుపాయం నుండి తన రద్దు కొరకు

8.

CANHLP
or
canhlp

CANHLP

వ్యవస్ధ ఇంటర్నెట్ పైన పేర్కొన్న అన్ని ముఖ్యమైన పదాలను పట్టిక మరియు వాటి విధులను ఇస్తుంది.

కెనరా బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల ( mobile banking service) (net banking guidelines >> mobile banking) గురించి మరికొంత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కెనరా బ్యాంకు యొక్క టెలి - బ్యాంకింగ్ ( టెలిఫోనుతో బ్యాంకింగ్ సేవ) సేవ

కెనరా బ్యాంకు మరియొక విలువైన సేవను అందజేస్తుంది. టెలి బ్యాంకింగ్ సేవల ద్వారా, తన వినియోగదారులు ఇంటి నుండే బ్యాంకు కు సంబంధించిన సేవలను నిర్వహించుకోవచ్చు. బ్యాంకు కేటాయించిన నంబరును డయల్ చేయడం ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం, టెలి - బ్యాంకింగ్ సదుపాయం రోజంతా అందుబాటులో ఉంది. ఈ సదుపాయం, మా కోర్ బ్యాంకింగ్ శాఖలలో ఖాతాదారులకు మాత్రమే ఉన్నది. వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు ( డబ్బు చెల్లించనక్కరలేని) 1800 4250018 ను డయల్ చేసి భారతదేశం లోపల, దిగువ పేర్కొన్న సేవలను బ్యాంకు నుండి పొందవచ్చు.

  • వినియోగదారుడి అన్ని ఖాతాలకు సంబంధించిన మిగిలిన సోమ్ము యొక్క వివరణ
  • ఖాతా యొక్క చివరి ఐదు లావాదేవీల వివరాలు
  • చెక్కు స్ధితి పై విచారణ
  • ఫాక్స్, ఇ- మొయిల్ లేక పోస్టు ద్వారా ఖాతా యొక్క నివేదిక కై వినతి
  • చెల్లింపు నిలుపుదలకై ఆదేశాలు
  • వినియోగదారుడి రుణ వివరాలు
  • బ్యాంకు ఉత్పత్తి సమాచారం
టెలి - బ్యాంకింగ్ సేవలు అందుకొనుటకు చేయవలసిన ప్రక్రియ

మీ అప్లికేషన్ ఫారమ్స్ ( అభ్యర్ధనా పత్రాలు) ను రెండు ప్రతులుగా మీ బ్యాంకు యొక్క మాతృశాఖలో టెలి - బ్యాంకింగ్ సదుపాయం పొందుటకు దాఖలు చేయండి.

  • అప్లికేషన్ ఫారమ్ తగిన రీతిలో చేరినట్లు, ఆ శాఖ రసీదు పంపిన తరువాత, Tpins, FTPINS కేంద్రంలో తయారు చేయబడి, కొరియర్ ద్వారా మీకు అందజేస్తారు.
  • వారి Tpins, FTPINS మొదటిసారి మీ కంప్యూటర్ లో Log in ( లాగ్ - యిన్- చేరిన) తరువాత, తప్పనిసరిగా వాటిని మార్చాలి.

కెనరా బ్యాంకు యొక్క టెలి - బ్యాంకింగ్ సేవలు గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

దేనా బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

దేనా బ్యాంకు ఈ బ్యాంకింగ్ సేవలను, వినియోగదారులకు మొబైల్ ఎస్.ఎమ్.ఎస్. ద్వారా అందజేస్తోంది.
  • ఖాతాలో మిగిలిన సోమ్ము గురించి తెలుసుకొనుట
  • ఖాతా యొక్క అతి చిన్న నివేదిక ను పొందుటకు
  • చెక్కు విడుదల స్ధితి చెల్లింపు గురించి తెలుసుకొనుటకు
ఎస్.ఎమ్.ఎస్. బ్యాంకింగ్ ( సంక్షిప్త సందేశ సేవ) కొరకు చేసే అధికారిక నమోదు ప్రక్రియ

అన్ని cbs శాఖలలోని వినియోగదారులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి ఉపయోగించుకుంటున్న వారు, ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అధికారిక నమోదు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. వినియోగదారుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నట్లైతే, వినియోగదారుడు వినతి పత్రాన్ని నిర్దేశించిన విధంగా, బ్యాంకు శాఖకు, తాను ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం దారుడనని మరియు sms బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందగోరుతున్నానని తెలియజెపుతూ దాఖలు చెయ్యాలి. వినతి పత్రంలో, వినియోగదారుడు కస్టమర్ ఐ.డి మరియు మొబైల్ నంబరును సూచించాలి. ఇతర వినియోగదారులకు, వారు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకుని, అప్లికేషన్ ఫారమ్ లో ప్రత్యేకంగా, తాము ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు sms బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందగోరుతున్నామని తెలియచెప్పాలి.
  2. వినియోగదారుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయానికి లాగ్ - యిన్ ( చేరువై) అయి menu ( పట్టిక - మెనూ) ను అందుకుని అందులోని set sms pass word under ( ustomize) మెనూ ఆప్షన్ ను ( పట్టికలో ఎన్నుకుని) సెట్ చేసి ( అమర్చి) వినియోగదారుడు, sms బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందడానికి వీలుగా చెయ్యాలి.
  3. పాస్ వర్డ్ ( సంకేత పదం) ను అమర్చిన తరువాత, వినియోగదారుడు sms బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. వినియోగదారుడి మొబైల్ నంబరు కు, సమాధానం చేరుతుంది.
మొబైల్ బ్యాంకింగ్ కు అయ్యే ఖర్చులు
  • ప్రస్తుతం ఈ సేవ ఉచితంగా అంద చేయబడుతున్నది
మొబైల్ బ్యాంకింగ్ సేవలు

బ్యాంకు మొబైల్ నంబరు - 9619141566 కు వినియోగదారుడు క్రింద యిచ్చిన విధంగా sms సందేశాన్ని పంపించాలి. < > ఈ గుర్తుల మధ్యగల వివరాలను వినియోగదారుడు ఎంటర్ (ప్రవేశింప) చేయాలి. < sms pwd > వినియోగదారుడు తయారు చేసుకున్న పాస్ వర్డ్ ( సంకేత పదం), మరియు < a/c number > వినియోగదారుడి ఖాతా నంబరు

క్రమ సంఖ్య

సదుపాయం

Sms సాంకేతిక ముఖ్య పదం క్రింది విధంగా యిచ్చిన మొబైల్ నంబరు 9619141566

1.

ఖాతాలో మిగిలిన సోమ్ము

DENRBAL < SMSPWD > < A/C NUMBER >

2.

అతి చిన్న నివేదిక

DENRTRAN < SMSPWD > < A/C NUMBER >

3.

చెక్కు స్ధితి

DENRCHQSTATUS < SMSPWD > < CHQNUM > < ACCTNUM >

మొబైల్ బ్యాంకింగ్ సేవల కొరకు కావలసిన అభ్యర్ధనా పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు యిక్కడ క్లిక్ చేయండి

మొబైల్ మరియు అలర్ట్ (హెచ్చరిక చేసే) బ్యాంకింగ్ ఫెసిలిటీ ( సదుపాయం) పొందుటకు తెలుసుకొనవలసిన నియమాలు మరియు షరతులు కొరకై యిక్కడ క్లిక్ చెయ్యండి

దేనా బ్యాంకు యొక్క ఫోను బ్యాంకింగ్ సేవలు

దేనా బ్యాంకు యొక్క ఫోను బ్యాంకింగ్ వ్యవస్ధ ఒక దాని మీద ఒకటి పనిచేసే కంఠధ్వని సమాధాన వ్యవస్ధ వినియోగదారుడు టోల్ ఫ్రీ నంబరు ( సుంకంలేని నంబరు) 18002336427 కు డయల్ చేసి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఫోను బ్యాంకింగ్ అప్లికేషన్, వినియోగదారుడిని ( కస్టమర్ ఐ.డి - వినియోగదారుడి గుర్తింపు) మరియు లాగ్ . యిన్ పాస్ వర్డ్ (పాస్ వర్డ్ ను ప్రవేశపెట్టి) వినియోగదారుడు ఎంచుకున్న ఎంపిక ఆప్షన్ ను బట్టి, ఫోను బ్యాంకింగ్ వ్యవస్ధ, వినియోగదారుడి అభ్యర్ధనా మేరకు సేవలు యిస్తుంది. ఒక వేళ, వినియోగదారుడు ఆర్ధిక లావాదేవీలు జరపదలచుకున్నట్లైతే, అతడు లావాదేవీల కు సంబంధించిన పాస్ వర్డ్ ( సంకేత పదం) ను కూడ ఎంటర్ (ప్రవేశ) చేయాలి.

ఫోను బ్యాంకింగ్ కొరకు అధికారిక నమోదు ప్రక్రియ

CBS శాఖలలోని అందరు వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. వినియోగదారులు, ఫోను బ్యాంకింగ్ అప్లికేషన్ పారమ్ ఆ బ్యాంకు శాఖకు దాఖలు చేయాలి. రెండు పాస్ వర్డ్ లు ( సంకేత పదాలు) తయారు చేయబడతాయి. ఒకటి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కానిది log in పాస్ వర్డ్ మరియు ఇంకొకటి, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించినది. పాస్ వర్డ్ ఈ విధంగా ఏర్పరచిన పాస్ వర్డ్ లు ఆయా శాఖాలకు బట్వాడా అవుతాయి. ఆయా శాఖాల నుండి, వినియోగదారుడు పాస్ వర్డ్ లు ను అందుకోవాలి.

దేనా బ్యాంకు యొక్క ఫోను బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

ఇండియన్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

మొబైల్ ద్వారా ఇండియన్ బ్యాంకు, ఈ క్రింది బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది
  • ఖాతాలో మిగిలిన సోమ్ము గురించి విచారణ
  • చివరి లావాదేవీ యొక్క వివరాలను తెలుసుకొనుట
  • జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని తెలుసుకొనుటకు
  • స్వంత ఖాతాల మద్య నిధుల బదలాయింపునకై
  • ఇండియన్ బ్యాంకు ఇతర ఖాతాలకు, ఇండియన్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఖాతాలకు మరియు ఇతర బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపునకై

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రమాణాల ననుసరించి, ఖాతాదారుడు, ఒక రోజుకు 50000 రూపాయల పరిమితి వరకూ నిధులను బదిలీ చేసుకొనవచ్చు./p>

అధికారిక నమోదు ప్రక్రియ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను కొరకు
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హత

Gprs/ java ( జి.పి.ఆర్.ఎస్/ జావా) కలిగిన మొబైల్ ఫోన్లు

అర్హత

వాడుకలో ఉన్న మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు (మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు) , నూతనమైన j2me మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వెంటనే పొందవచ్చు. క్రొత్త వినియోగదారులు, ఈ సదుపాయమును, కోరుకున్నట్లైతే, వారి మాతృ బ్యాంకు శాఖకు, తమకు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయము కావాలని విన్నవించాలి. అప్పుడు వారికి j2me సదుపాయం లభిస్తుంది.

అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొనుట

వినియోగదారుడు తన రిక్వెస్టు ( వినతి) ను తన మొబైల్ ద్వారా మా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు నంబరు - 9444394443 కు పంపినప్పుడు, వినియోగదారుడి మొబైల్ కు url లింక్ ( url link) అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొనుటకు పంపబడుతుంది. j2me మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ను నేరుగా బ్యాంకు యొక్క వెబ్ సైట్ నుండి usb/ gprs ను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకొనవచ్చు.

j2me అప్లికేషన్ యొక్క అధికారిక నమోదు

j2me అభ్యర్ధనా పత్రాన్ని మొబైల్ హ్యాండ్ సెట్ లో ఇన్వాల్ ( నిక్షిప్తం) చేయడానికి, వినియోగదారుడు అప్లికేషన్ ను ఓపెన్ చేస్తాడు, వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( అధికారిక నమోదు ప్రక్రియ ) తనంతట తానే ప్రారంభమైపోతుంది. అప్పుడు వినియోగదారుడు తన మొబైల్ నంబరును మరియు నాలుగు అంకెలు గల సంఖ్య mpin ను ఎంటర్ చెయ్యాలి. వినియోగదారుడు ఆరు అంకెలు గల అప్లికేషన్ పాస్ వర్డ్ ను తన ఎంపిక ననుసరించి రిజిస్టర్ చేసుకుంటాడు. విజయవంతంగా mpin, cif మరియు మొబైల్ నంబరు ధృవీకరింపబడిన తరువాత, సిస్టమ్ ( వ్యవస్ధ - మొబైల్ బ్యాంకింగ్ ) అనుసంధానించబడిన ఖాతాలు మరియు యాడడ్ బెనిఫిషియరీ ఎకౌంట్లును ( ప్రయోజనం పొందే ఖాతాలతో కూడ) నమోదు మరియు పొందుపరచడం చేస్తుంది.

ఇండియన్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

జమ్ము & కాశ్మీర్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

జమ్ము & కాశ్మీర్ బ్యాంకు, sms alert ( ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్ - sms హెచ్చరిక) ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఈ క్రింది విధంగా అందిస్తుంది.
  • ఖాతాలో బాకీ యొక్క లావాదేవీలు ( 500 రూపాయలకు మించి)
  • ఖతాలో జమచేసే లావాదేవీలు ( 500 రూపాయలకు మించి)
  • ఖతాలో మిగిలిన సోమ్ము
  • రుణ వాయిదా ల కై సమాచారమందించుట
  • నిర్ణీత కాల వ్యవధికి దాచుకున్న సోమ్ము తీరి చెల్లింపుకు వచ్చినది ( టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ)
  • జారీ చేసిన చెక్కు యొక్క చెల్లింపును నిలిపివేయమని కోరుట
Sms సేవల కొరకు అధికారిక నమోదు ప్రక్రియ

(ఇండియన్ బ్యాంకు) జమ్ము & కాశ్మీర్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి అధికంగా తెలుసుకొనుటకు, యిక్కడ క్లిక్ చెయ్యండి.

కర్ణాటక బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

కర్ణాటక బ్యాంకు, ఈ క్రింది మొబైల్ మొబైల్ బ్యాంకింగ్ సేవలను, తన వినియోగదారులకు అందిస్తుంది.
  • ఎమ్. కామర్స్ సర్వీస్ ( మొబైల్ వాణిజ్య సేవ)
  • మొబైల్ బ్యాంకింగ్ ఎస్.ఎమ్.ఎస్ హెచ్చరిక సేవ
ఎమ్. కామర్స్ (M- commerce - మొబైల్ వాణిజ్య సేవ)
  • యుటిలిటీ బిల్లుల చెల్లింపు ( వాడకం బిల్లుల చెల్లింపు)
  • మొబైల్ ఫోనులను డబ్బుతో రీచార్జ్ చేయుట
  • సినిమా టికెట్లను ముందుగానే కొనుట
  • ఆన్ లైన్ లో వస్తువులను కొనడం మొదలైనవి.

ఎమ్. కామర్స్ గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

కర్ణాటక బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ ఎస్.ఎమ్.ఎస్ హెచ్చరిక సేవలో రెండు అంశాలు ఉన్నాయి.
  • మొబైల్ బ్యాంకింగ్ ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్ ఫెసిలిటీ కర్ణాటక బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్ , తన వినియోగదారులకు ఈ క్రింది పనుల ద్వారా సమాచారమందిస్తుంది.
  • లావాదేవీల హెచ్చరిక ( ట్రాన్సాక్షన్ అలర్ట్ ) ( మీ ఖాతాలో ఎటువంటి జమ/ బాకీ)
  • చెక్కు చెల్లని యెడల హెచ్చరిక ( చెక్ బౌన్స్ అలర్ట్)
  • చెక్కు చెల్లింపు జరిగినదని సమాచారం ( చెక్ పెయిడ్ అలర్ట్ )
  • చెక్కు విడుదలకు సంబంధించిన, మొదలైనవి.

మొబైల్ బ్యాంకింగ్ వినతి సదుపాయాలు (మొబైల్ బ్యాంకింగ్ రిక్వెస్టు ఫెసిలిటీస్)

కర్ణాటక బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ రిక్వెస్టు ఫెసిలిటీ, మీ ఖాతా గురించి మీరు ప్రశ్నించడానికి వీలు కలిగిస్తుంది. మీరు 9880654321 కు కీ వర్డ్ ( ముఖ్య సాంకేతిక పదం) తో sms చేసి అవసరమైన వివరాలను పొందగలరు. కర్ణాటక బ్యాంకు మొబైల్ రిక్వెస్టు, ఈ క్రింది వినతులను అందిస్తుంది.

  • KBAL : ఎకౌంట్ బ్యాలెన్స్ ఎన్ క్వయిరీ ( ఖాతాలో మిగిలిన సోమ్ము పై వివరణ) (KBAL పాస్ వర్డ్ ఎ/సి నంబరు లేక KBAL పాస్ వర్డ్ - మౌలిక ఖాతాలో మిగిలిన సోమ్ము కొరకు
  • KTRN : మీ ఖాతాలోని చివరి ఐదు లావాదేవీలు (KTRN పాస్ వర్డ్ ఎ/సి నంబరు - KTRN PASS WORD A/C NO)
  • KPWD : ఎస్.ఎమ్.ఎస్ పాస్ వర్డ్ యొక్క మార్పు (KPWD PRESENT PASSWORD NEW PASS WORD)
  • KSUS : SMS బ్యాంకింగ్ నుండి మీరు తప్పుకొనుట (KSUS పాస్ వర్డ్ PASS WORD
  • పైన పేర్కొన్నవే కాకుండ, క్రొత్త మొబైల్ SMS అలర్ట్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించని వినియోగదారులకు కూడ అందుబాటులో ఉన్నవి. ఈ సేవ ద్వారా, తమ ఖాతాలోని ప్రముఖమైన లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని, వినియోగదారునికి అందిస్తుంది. వినియోగదారుడు, ఈ సదుపాయమును పూర్తిగా అప్లికేషన్ ఫారమ్ ను తమ మూల శాఖలో దాఖలు చేయడం ద్వారా పొందవచ్చు. SMS ఒక్కింటికి 21 రూపాయల చొప్పున నెలవారీగా ఈ సేవను ఉపయోగించుకొనవచ్చు.
అధికారిక నమోదు ప్రక్రియ
  • మీ మాతృశాఖను, ఈ సేవలను పొందుట కొరకై సంప్రదించండి

కర్ణాటక బ్యాంకు, మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, తమ వినియోగదారులకు SMS బ్యాంకింగ్ ను అందిస్తోంది. బ్యాంక్ యొక్క ఏ ఖాతాదారుడైనా ఈ సేవను పొందవచ్చు. ఈ సేవలు రెండు రకాలు అవి పుష్ బేస్డ్ అలర్ట్ మరియు పుష్ బేస్డ్ అలర్ట్స్

పుష్ బేస్డ్ సేవలు

వినియోగదారుడి మొబైల్ నంబరుకు తమంతట తామే SMS ద్వారా ఈ సేవలు, పంపబడి చేయబడతాయి. అతడి ఖాతా యొక్క వివిధ లావాదేవీలు మరియు ఈ క్రింద పేర్కొన బడిన వాటిని కూడ చేస్తాయి.

  • వినియోగదారుడి వ్యక్తిగతమైన నిర్దేశించిన సోమ్ము యొక్క క్రెడిట్ (జమ) డెబిట్ (బాకీ) హెచ్చరికలు
  • ఖాతాదారుల బ్యాలన్స్ సోమ్ము ఉండవలసిన దాని కంటె తక్కువగా వారి వివిధ రకాల ఖాతాలలో ఉన్నప్పుడు ప్రారంభ హెచ్చరికలను ఖాతాదారులకు పంపిస్తుంది.
  • చెక్కు విడుదలయ్యిందని తెలియజేప్పే సూచనలు
  • ప్రతీవారం, బ్యాలన్స్ ( ఖాతాలో ఉన్న సోమ్ము) యొక్క సమాచారం, అన్ని ప్రత్యేకమైన ఖాతాలకు సంబంధించి, తెలుపుట
  • ప్రచార సూచనలు ఉదాహరణకు క్రొత్త సేవలను ప్రారంభించుట విదేశి మారక ద్రవ్య విలువ రుణాల గురించి ప్రశ్నించడం మొదలైనవి.
  • వివిధ మార్గాల ద్వారా బట్వాడా చేయబడిన లావాదేవీలు ఉదాహరణకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM మొదలైనవి. లావాదేవీల సోమ్ముకు సంబంధం లేకుండ చేయబడేవి.
పుల్ బేస్డ్ సేవలు

ఈ సేవలు, వినియోగదారుడికి, తన మొబైల్ ద్వారా ఒక నిర్దేశించిన నంబరుకు వినతి ని వివిధ రకాల సేవా సదుపాయాలు పొందుటకు, పంపడం ద్వారా పొందవచ్చు. అవి క్రింద పేర్కొన బడినవి.

  • ఖాతాలో బ్యాలెన్స్ ( మిగిలిన సోమ్ము) ఒకటి / అనేక ఖాతాలు, ఉన్నచో
  • అతి చిన్న నివేదిక
Sms సేవలు పొందుటకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • ఈ పుల్ - బేస్డ్ సేవలను పొందుటకు, వినియోగదారుడు ఒక Sms ను కీ వర్డ్స్ ( ముఖ్యమైన సాంకేతిక పదాలు) ను ఉపయోగించి, వాటిననుసరించి space మరియు 14 అంకెలు గల ఖాతా నంబరును, మొబైల్ నంబరు ను 919915622622 కు పంపించాలి.
  • Sms అలర్ట్ బేస్డ్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు, అప్లికేషన్ ఫారమ్ ( అభ్యర్ధనా పత్రమును) ను సంతకం చేసి, మీ బ్యాంకు యొక్క మాతృశాఖలో దాఖలు చేయండి.
ఈ సేవను పొందుటకు అయ్యే ఖర్చులు
  • ప్రస్తుతం, బ్యాంకు , ఈ సేవ కొరకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు . కాని, ఖాతాదారులు, సాధారణ ఖర్చులైన Sms చార్జీలు, అతడి, ఆమె మొబైల్ కనెక్షన్ కు ఉన్న టారిఫ్ ను బట్టి, భరించాలి.

ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి

పంజాబ్ నేషనల్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

మొబైల్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ క్రింది బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
  • ఖాతాలో బ్యాలెన్స్ గురించి పరిశీలన
  • అతి చిన్న ఖాతా నివేదిక పంపించుట
  • ఆన్ లైన్ లో అతి చిన్న నివేదిక తీసుకొనుట
  • మూడవ పక్షానికి నిధుల బదలాయింపు
  • జారీ చేసిన చెక్కు యొక్క చెల్లింపును ఆన్ లైన్ ద్వారా ఆపి వేయుట
  • చెక్కు పుస్తకం కొరకు విన్నపం
  • జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని గమనించుట మొదలైనవి
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హతలు
  • హ్యాండ్ సెట్ Gprs ఎనేబుల్డ్ (Gprs కలిగిలది) గా ఉండాలి.
  • సేవలు అందించే వాడి నుండి Gprs కనెక్టివిటీ ( అనుసంధానం) పొంది ఉండాలి. వారి కనెక్షన్ ను వినియోగదారుడు ఉపయోగించుకుంటాడు.
  • Gprs ను పొందుటకు వినియోగదారుడు, సర్వీస్ ప్రోవైడర్ తో వారి కస్టమర్ కేర్ నంబరుకు ఫోనులో సంప్రదించి Gprs enabled (కలిగి) అయి ఉండాలి.
  • Gprs, ఎనేబిల్డ్ (enabled - కలిగి ఉందా లేదా) అయి ఉందా లేదా అని తెలుసుకొనుటకు, మొబైల్ బ్రౌజర్ ద్వారా ఏ వెబ్ సైట్ నైనా, ఓపెన్ చేసి చూడండి. ఉదా (www.google.com)
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుట కొరకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • మీకు చేరువలో ఉండే pnb ( పంజాబ్ నేషనల్ బ్యాంకు) శాఖ నుండి అప్లికేషన్ ఫారమ్ తీసుకోండి.
  • మీ మాతృశాఖకు, పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారమ్ ను, అవసరమైన అధికార పత్రంతో సహా దాఖలు చేయండి.

Pnb (పి.ఎన్.బి) మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉపయోగించుటకు మార్గదర్శి సూచనలను చూచుటకొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

దయచేసి పి.ఎన్.బి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి ఇంకొంత సమాచారం తెలుసుకొనుటకు ఈ రెండు లింకులను కూడ చూడండి.

https://mobile.netpnb.com/mbanking.html

http://netpnb.com/index.html

స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ యొక్క బ్యాంకింగ్ సేవలు

మొబైల్ నందు స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ ఈ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నది.
  • నిధుల బదిలీ (బ్యాంకు లోపల మరియు బ్యాంకు బయట (NEFT ను ఉపయోగించి
  • వివరణ సేవలు ( enquiry services) ( బ్యాలెన్స్ గురించి విచారణ మరియు / అతి చిన్న నివేదిక)
  • వినతి సేవలు ( request services) ( చెక్కు పుస్తకం కొరకు విన్నపం)
  • బిల్లు చెల్లింపు ( utility bills) వాడకపు బిల్లులు, క్రెడిట్ కార్డ్స్
  • ఎమ్. కామర్స్ - m commerce ( మొబైల్ టాప్ అప్ ( రీచార్జీ చేయుట, మర్చెంట్ పేమెంట్ ( వర్తక చెల్లింపు), sbi లైఫ్ యిన్స్యూరెన్స్ వాయిదా
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హత
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ లో ఖాతా కలిగిన ( current/ savings) ప్రతి ఖాతాదారుడు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హుడే
  • ఈ సేవలు పొందుటకు ఖాతాదారుడు అధికారికంగా నమోదు చేసుకోవాలి.
  • నిధుల బదిలీకి మరియు బిల్లు చెల్లింపు లావాదేవీలకు, రోజుకు 5000 రూపాయల పరిమితి మరియు వర్తక చెల్లింపునకు 10000 రూపాయల పరిమితి, ఒక ఖాతాదారునకు ఒక కేలండరు రూపంలో పరిమితి 30000 రూపాయలు
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన ఆవశ్యకతలు
  • జావా కలిగిన ( java enabled) మొబైల్ ఫోన్లు sms/gprs/wap లకు
  • జావా లేని ఫోన్లు, gprs తో అనుసంధానించబడినవి.
Sms సేవలు పొందుటకు అధికారిక నమోదు ప్రక్రియ

బ్లూటూత్ / డేటా కేబుల్ ను ఉపయోగించే విధానం

స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి

స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా యొక్క బ్యాంకింగ్ సేవలు

స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, మొబైల్ నందు ఈ క్రింది బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నది.
  • ఖాతాలలో మిగిలిన సోమ్ము పై వివరణ
  • అతి చిన్న నివేదిక చివరి ఐదు లావాదేవీల వరకు
  • నిధుల బదిలీ, SBP ఖాతాల నుండి మరియు ఇతర బ్యాంకులకు
  • చెక్కు పుస్తకం కొరకై విన్నపం
  • యుటిలిటీ బిల్లుల చెల్లింపు ( ఎలక్ట్రిసిటీబిల్లు, టెలిఫోను బిల్లు మొదలైనవి)
  • వ్యాపారసంబంధమైన చెల్లింపులు
  • మొబైల్ ను డబ్బుతో రీచార్జీ చేయుట
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ యిండియా లైఫ్ యిన్స్యూరెన్స్ వాయిదా చెల్లింపు ( జీవిత భీమా వాయిదా)
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హత
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా లో ఖాతా ఉన్న ప్రతీ ఖాతాదారునికి ఈ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ సేవల కోసం, ఖాతాదారులు అధికారికంగా నమోదు చేసుకోవాలి
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన ఆవశ్యకతలు
  • జావా ఎనేబుల్డ్ మొబైల్ ఫోన్లు sms/gprs/wap లకు (జావా కలిగిన మొబైల్ ఫోన్లు java enabled mobile phones)
  • జావా లేని gprs కనెక్షన్ కలిగిన ఫోన్లు
Sms సేవలు పొందుటకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోండి
  • పూర్తిగా నింపిన దరఖాస్తుకు, అవసరమైన అధికార పత్రం తో సహా మీ బ్యాంకు యొక్క మాతృశాఖలో యివ్వండి.

ఉపయోగించే విధానం ( user guide) చదువుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి

స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావన్ కోర్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావన్ కోర్, మొబైల్ పై, ఈ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నది.
  • నిధుల బదిలీ (బ్యాంకు లోపల మరియు బ్యాంకు బయట NEFT ఉపయోగించి
  • విచారణ సేవలు ( బ్యాలెన్స్ విచారణ / అతి చిన్న నివేదిక
  • వినతి సేవలు ( చెక్కు పుస్తకం కొరకు విన్నపం)
  • బిల్లు చెల్లింపు (వాడకపు బిల్లులు, క్రెడిట్ కార్డ్)
  • ఎమ్. కామర్స్ (ఎమ్. వాణిజ్యం - మొబైల్ రీచార్జి, వర్తక చెల్లింపులు, SBI జీవిత బీమా వాయిదా ), టాటా స్కై యొక్క రీచార్జి మరియు, బిగ్ టి.వి మొదలైనవి.
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన అర్హత
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావన్ కోర్ లో ఖాతా ఉన్న ప్రతీ వ్యక్తీ ( SAVING/ CURRENT ACCOUNT) మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందగలుగుతారు.
  • ఈ సేవల కొరకు, ఖాతాదారులు అధికారికంగా నమోదు చేసుకోవాలి.
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు కావలసిన ఆవశ్యకతలు
  • SMS / GPRS/ WAP లకై JAVA ఎనేబుల్డ్ (కలిగిన) మొబైల్ ఫోన్లు
  • జావా లేని GPRS కనెక్షన్ కలిగిన మొబైల్ ఫోన్లు
Sms సేవలు పొందుటకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • మీకు చేరువలో ఉన్న బ్యాంకు శాఖ నుండి దరఖాస్తును తీసుకోండి.
  • పూర్తిగా నింపిన దరఖాస్తుకు, అవసరమైన అధికార పత్రం తో సహా మీ బ్యాంకు యొక్క మాతృశాఖలో యివ్వండి.
మొబైల్ బ్యాంకింగ్ సేవలను నడిపించే వ్యాపార నియమాలు
  • రోజూ వారీ లావాదేవీ పరిమితి, నిధుల బదిలీకి మరియు బిల్లు/ వ్యాపార చెల్లింపునకై 50000 రూపాయలు ఒక ఖాతాదారునకు ఒక కేలండరు మాసానికి మొత్తం పరిమితి 250000 రూపాయలు
  • ఈ సేవకు ఎటువంటి రుసుము లేదు అయినప్పటికీ SMS / GPRS కనెక్టటివిటీకి అయ్యే ఖర్చును ఖాతాదారుడే భరించాలి.

స్టెప్ - బై - స్టెప్ ( వరుస క్రమంలో) అధికారిక నమోదు ప్రక్రియ

ఉపయోగించే విధానం చదువుట కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి

స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావన్ కోర్ అందజేసే మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి

సిండికేట్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

సిండికేట్ బ్యాంకు, మొబైల్ నందు బ్యాంకింగ్ సేవలను తన వినియోగదారులకు రెండు విధాలుగా చేస్తున్నది.
  • SMS విచారణ సదుపాయం
  • SMS హెచ్చరిక సదుపాయం (SMS ALERT FACILITY) SMS విచారణ నందు ఈ క్రింది సేవలు అందుబాటులో ఉన్నవి.
SMS బ్యాంకింగ్ కొరకు అధికారిక నమోదు
  • బ్యాంకు బ్యాలెన్స్ గురించి తెలుసుకొనుట
  • మౌలిక ఖాతాను మార్చుట
  • టర్మ్ డిపాజిట్ వివరములను తెలుసుకొనుట
  • జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని గురించి తెలుసుకొనుట.
  • జారీ చేసిన చెక్కు యొక్క చెల్లింపును నిలిపివేయమని వినతి
  • చివరి ఐదు లావాదేవీల వివరములు తెలుసుకొనుట.
SMS విచారణ సేవ పొందుటకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • మీ మాతృశాఖ నుండి SMS బ్యాంకింగ్ దరఖాస్తును తీసుకోండి.
  • పూర్తిగా నింపిన దరఖాస్తుకు, అవసరమైన అధికార పత్రం తో సహా దాఖలు చెయ్యండి
  • తరువాత, అదే మొబైల్ ఫోను నుండి SMS enquiry కొరకు, SMS రిజిస్ట్రేషన్ మెసేజ్ ని క్రింద యిచ్చిన విధంగా రిజిష్టర్ చేసుకోండి.
  • మొబైల్ నంబర్ల యొక్క వివరములు (దేశం యొక్క కోడ్ తో సహా) దేని నుండి SMS enquiry FACILITY కలిగి ఉందో, దరఖాస్తులో తప్పనిసరిగా స్పష్టంగా తెలియచెప్పాలి.
  • అన్ని SMS లు, చిన్న కోడ్ అయిన 56767 కు మాత్రమే పంపాలి.

SMS ఎంక్వరీ ఫెసిలిటీ కొరకు కావలసిన దరఖాస్తు ను డౌన్ లోడ్ చేసుకునేందుకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్ ఫెసిలిటీ (SMS ద్వారా హెచ్చరిక చేసే సదుపాయం)

మీరు గనుక అలర్ట్ ల కోసం రిజిస్టర్ చేసుకున్నట్లైతే, సిండికేట్ బ్యాంకు యొక్క SMS అలర్ట్ సర్వీస్, తనంతట తానే ఒక అలర్ట్ మెసేజ్ ను వినియోగదారుడి మొబైల్ కు SMS ద్వారా, ఈ సంఘటనల నేపధ్యంలో మీ ఖాతాకు సంబంధించి పంపుతుంది

  • ఒక బాకీ / జమ ( debit/ credit) లావాదేవీల సోమ్ము 10000 రూపాయలకు మించినా లేక, వినియోగదారుడు నిర్దేశించిన సోమ్మును మించినా.
  • నెలవారీ అలర్ట్ ( హెచ్చరిక) ప్రస్తుత బ్యాలెన్స్ / రుణం మీ యొక్క పనిచేసే ఖాతాలలో ఉన్నది తెలియ జెప్పడం అలర్ట్ ఫెసిలిటి కలిగి ఉన్నవయితే
  • మీ యొక్క ఏదైనా పనిచేసే ఖాతా రుణ బ్యాలెన్స్ లోకి పడిపోయినా లేక పరిమితికి మించినా, ఓవర్ డ్రాఫ్ట్ అలర్ట్ పంపిస్తుంది.
SMS అలర్ట్ సదుపాయం పొందుటకు నమోదు చేసుకునే ప్రక్రియ
  • SMS బ్యాంకింగ్ దరఖాస్తు ఫారమ్ ను మీ మాతృశాఖ ద్వారా పొందండి. పూర్తిగా నింపి అదే శాఖలో దాఖలు చేయండి.
  • దరఖాస్తులో, మీరు ప్రత్యేకంగా SMS అలర్ట్ ఫెసిలిటి కని పేర్కొని రిక్వెస్టు ( విన్నవించాలి) చేయాలి.
  • మొబైల్ నంబర్ల యొక్క వివరములు (దేశం యొక్క కోడ్ తో సహా) వేటి కయితే అలర్ట్స్ పంపవలసి వస్తుందో, వాటి గురించి దరఖాస్తులో తప్పనిసరిగా, స్పష్టంగా సూచించాలి

సిండికేట్ బ్యాంకు, యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి యింకా తెలుసుకొనుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

సౌత్ ఇండియన్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

సౌత్ ఇండియన్ బ్యాంకు, తమ వినియోగదారులకు, మొబైల్ పై ఈ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.
  • మీ ఖాతాలో మిగిలిన సోమ్ము ను తెలుసుకొనుట
  • మీ ఖాతాలకు సంబంధించి నాలుగు లావాదేవీల వివరములు మరియు మీ ఎకౌంట్ బ్యాలెన్స్ తో సహా తెలుసుకొనుట
  • జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితి పై వివరణ మొదలైనవి.
మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందుటకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • మీకు చేరువలో ఉన్న బ్యాంకు శాఖ నుండి దరఖాస్తు ఫారమ్ ను తీసుకోండి.
  • పూర్తిగా నింపిన దరఖాస్తును, అవసరమైన అధికార పత్రం తో సహా మీ మాతృశాఖలో యివ్వండి.

సౌత్ ఇండియన్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

యు.కో. బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

యుకో బ్యాంకు, తన బ్యాంకింగ్ సేవలను మొబైల్ పై రెండు విధాలుగా చేస్తున్నది.
  • SMS అలర్ట్ ( హెచ్చరిక సేవలు) సర్వీసేస్
  • మొబైల్ బ్యాంకింగ్ సేవలు
యుకో బ్యాంకు క్రింద సూచించిన పనులకు SMS అలర్ట్స్ ద్వారా సందేశాలను పంపి మొబైల్ బ్యాంకు చేస్తున్నది.
  • జీతం జమ అయినప్పుడు
  • ఖాతా రుణ పరిధిలోనికి పోయినప్పుడు
  • ఖాతాలో సోమ్ము చేరినప్పుడు
  • చెక్కు చెల్లనప్పుడు
  • నిర్దేశించిన పరిమితికి మించిన బ్యాలెన్స్
  • బిల్లు చెల్లింపు / బిల్లు రిజిస్ట్రేషన్ ( అధికారిక) ( e- బ్యాంకింగ్ ద్వారా అలర్ట్)

SMS అలర్ట్ సేవలు కాకుండ, యూకో బ్యాంకు ఈ క్రింది బ్యాంకింగ్ సేవలను కూడ మొబైల్ నందు అందిస్తోంది.

  • బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకొనుట
  • చివరి మూడు లావాదేవీల వివరములు తెలుసుకొనుట
  • జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని తెలుసుకొనుట
  • బ్యాంకు నివేదిక కొరకు రిక్వెస్టు చేయుట
మొబైల్ బ్యాంకింగ్ సేవల కొరకు చేసే అధికారిక నమోదు ప్రక్రియ
  • మీకు చేరువలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు ఫారమ్ ను తెచ్చుకోండి.
  • పూర్తిగా నింపిన దరఖాస్తును, అవసరమైన అధికార పత్రం తో సహా మీ మాతృశాఖలో యివ్వండి.

యూకో బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ సేవల గురించి మరికొంత సమాచారం పొందుటకు యిక్కడ క్లిక్ చెయ్యండి.

ఎస్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవలు

ఎస్ బ్యాంకు తమ వినియోగదారులకు, మొబైల్ ద్వారా బ్యాంకింగ్ సేవలను రెండు విధాలుగా అందిస్తున్నది.
  • మొబైల్ బ్యాంకింగ్ సేవలు.
  • SMS అలర్ట్ సేవలు.

ఈ క్రింద పేర్కొన్న సేవలు , మొబైల్ లో అందుబాటులో ఉన్నవి

  1. బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకొనుట
  2. ఖాతాలోని చివరి ఐదు లావాదేవీల గురించి తెలుసుకొనుట.
  3. జారీ చేసిన చెక్కు యొక్క విడుదల స్ధితిని
  4. జారీ చేసిన చెక్కు యొక్క చెల్లింపును నిలిపివేయమని కోరుట
  5. చెక్కు పుస్తకం కోసం విన్నపం
  6. ఖాతాకు అనుసంధానించబడిన ఫిక్స్ డ్ డిపాజిట్ల వివరములు తెలుసుకొనుట.
  7. బ్యాంకు ఖాతా యొక్క నివేదిక తీసుకొనుట
మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రమే కాకుండ, ఎస్ బ్యాంకు, SMS అలర్ట్ లను, రిజిస్టర్ అయిన వినియోగదారునికి ఈ పనులకు సంబంధించి పంపిస్తుంది.
  • డెబిట్ కార్డు అలర్ట్ (బాకీ హెచ్చరిక) : మీ ఖాతాలో ఉన్న బాకీలకు సంబంధించి మిమల్ని హెచ్చరిస్తుంది. ( నిర్దేశించిన దానికి మించిన ఎడల)
  • క్రెడిట్ కార్డు అలర్ట్ ( జమ అయినప్పుడు సూచన) : మీ ఖాతాలో ఏదైనా సోమ్ము (నిర్దేశించిన దానికి మించిన ఎడల) జమ అయినట్లైతే
  • బ్యాలెన్స్ అలర్ట్ ( మిగిలిన సోమ్ము పై సూచన) : నియమిత కాలానికి, మీ ఖాతా యొక్క బ్యాలెన్స్ ను తెలుపుతుంది. (రోజూ/ వారానికి / మాసానికి)
  • సేలరీ క్రెడిట్ అలర్ట్ ( జీతం చేరినప్పుడు) సూచన) : మీ ఖాతాలో మీ జీతం వచ్చి చేరినప్పుడు
  • ఓవర్ డ్రాప్ట్ అలర్ట్ (ఉండవలసిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు) : మీ ఖాతాలోని సోమ్ము పరిమితికి మించి తీసుకున్నప్పుడు
  • బిలో బేలన్స్ అలర్ట్ (పరిమితి కంటె తక్కువైనప్పుడు) : మీ ఖాతాలోని బేలన్స్ నిర్దేశిత ప్రారంభ పరిమితి కంటె తగ్గినప్పుడు
మొబైల్ బ్యాంకిగ్ సేవల కొరకు చేయవలసిన అధికారిక నమోదు ప్రక్రియ
  • మీకు చేరువలో ఉన్న బ్యాంకు నుండి దరఖాస్తు ను స్వీకరించండి.
  • పూర్తిగా నింపిన దరఖాస్తు ను మీ మూల శాఖలో, అవసరమైన అధికార పత్రంతో సహా దాఖలు చెయ్యండి.

ఎస్ బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ సేవల కొరకై మరికొంత సమాచారం కొరకు యిక్కడ క్లిక్ చెయ్యండి

మొబైల్ లేదా ఫోన్ ఆధారిత సేవలు

సేవలు అందిస్తున్నవారు

అందిస్తున్న సేవలు

ఎలా ఉపయోగించుకోవాలి

కిసాన్ కాల్ సెంటరు వ్యవసాయానికి సంబంధించిన సందేహలకు పరిష్కార మార్గాలు 1551 కి ఫోన్ చేయండి
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం, ఉద్యానవనం, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పశువుల ఆరోగ్యంనకు సంబంధించిన వివిధ సందేహలకు పరిష్కార మార్గాలు 18002334433 కు ఫోన్ చేయండి
వ్యవసాయ మంత్రిత్వ శాఖ, హర్యానా ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన సందేహలకు పరిష్కార మార్గాలు 9915862026నెంబరుకు యస్. యం.యస్ చేయండి
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పధకానికి సంబంధించిన సమాచారం మరియు ఫిర్యాధు ల కొరకు 1800110707 నెంబరుకు ఫోన్ చేయండి
హర్యానా ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పధకానికి సంబంధించిన సమాచారం మరియు ఫిర్యాధు ల కొరకు 18001802023 నెంబరుకు ఫోన్ చేయండి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , హిమాచల్ ప్రదేశ్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే, వారిపై ఫిర్యాధు చేయడానికి 09418153535 నెంబరుకు ఫోన్ చేయండి
09418153535 నెంబరుకు అవినీతికి పాల్పడుతున్న అధికారి వివరాలతో యస్. యం.యస్ చేయండి
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ, జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే వారిపై ఫిర్యాధు చేయడానికి హైదరాబాద్ పరిధిలో ఐతే 040 24732768 నెంబరుకు ఫోన్ చేయండి
విశాఖపట్నం పరిధిలో ఐతే 0891 2783333 నెంబరుకు ఫోన్ చేయండి
సాంఘిక సంక్షేమం మరియు కార్మికుల సంక్షేమ శాఖ, యన్.సి.టి. డిల్లీ ప్రభుత్వం అడుక్కునే బాలలను కాపాడటానికి 1098 నెంబరుకు ఫోన్ చేయండి
భారతీయ రైల్వే రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నట్లయితే వారిపై ఫిర్యాదు చేయడానికి 155210 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయండి
భారతీయ రైల్వే పాసెంజరు నేమ్ రికార్డు (పి.యన్. ఆర్), ప్రస్తుతం నడుస్తున్నరైలుల స్థితి, బెర్తుల ఖాళీలు, టిక్కెటు ధర మొ.. వివరాల కొరకు 139 నెంబరుకి ఫోన్ చేయండి మరియు మీ 10 సంఖ్యల నెంబరు గల పి.యన్.ఆర్ నెంబరును లేదా నాలుగు సంఖ్యలు గల మీ రైలు నెంబరును నొక్కండి
భారతీయ రైల్వే పాసెంజరు నేమ్ రికార్డు (పి.యన్. ఆర్), ప్రస్తుతం నడుస్తున్నరైలుల స్థితి వివరాల కోసం 9773300000 నెంబరుకు ఫోన్ చేయండి
జాన్కారీ ,
బీహార్ ప్రభుత్వం
సమాచారమును పొందే విషయంలో ఇబ్బందులు ఏర్పడితే అధికారులపై ఫిర్యాధు, మొదటి, రెండవ సారి ఆపీలు చేయడానికి , చట్టం గురించి మరింత సమాచారం కోసం ఫిర్యాధు నమోదు చేసుకోవడానికి, మొదటి, రెండవసారి ఆపీలు కోసం 155311 నెంబరికి ఫోన్ చేయండి
మీ ధరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి మరియు ఇతర సమాచారం కోసం155310నెంబరుకి ఫోన్ చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబియస్ఇ) 10 వ తరగతి మరియు 12 వ తరగతి (ఇంటర్మిడియట్) చదువుతూ వైకల్యంతో ఉన్న విద్యార్థుల సందేహలను నివృతి చేసుకోవడానికి డిల్లీ విద్యార్థులు
9717882074 ఫోన్ చేసి శ్వేతా ఖన్నాతో మాట్లాడండి
ముంబాయి విద్యార్థులు
9967800337 ఫోన్ చేసి అభా శర్మతో మాట్లాడండి లేదా 9833950896 కు ఫోన్ చేసి శ్రీ షిప్లే తో మాట్లాడండి లేదా 9819209623 కి ఫోన్ చేసి హెతల్ సయల తో మాట్లాడండి
సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎగ్జామినేషన్ (సిబియస్ఇ) 10 మరియు 12 వ తరగతుల పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి 011 24357270 నెంబరుకు ఫోన్ చేయండి
స్టేట్ ప్రీ-యూనివర్సిటీ డిపార్టుమెంట్, కర్ణాటక ప్రభుత్వం పరీక్షలకు సంబంధించి 12 వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రలకు కౌన్సిలింగు ఇవ్వడానికి 080-23366778 లేదా 080 23366779 నెంబరుకు సాయంత్రం మూడు గంటలనుండి నాలుగున్నర లోపు ఫోన్ చేయాలి
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, చెన్నై ధరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి, ప్రకటించబడిన ఉద్యోగ వివరాలు, అర్హతలు మరియు ఉద్యోగపరీక్షా ఫలితాలు తెలుసుకోవడానికి 6161 కు యస్.యం.యస్ చేయండి
ఎమర్జెన్సి మేనేజ్ మెంట్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ (ఇ.యం.ఆర్.ఐ), హైదరాబాద్ గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం 108 కి ఫోన్ చేయండి
ఆరోగ్య శాఖ రోగి గ్రస్తులకు అంబులెన్సు మరియు ఇతర వైద్య సహయం 102 లేదా 1099 కి ఫోన్ చేయండి
భారత సుఫ్రీం కోర్టు – అత్యున్నత న్యాయ స్థానం కోర్టులో కేసు నడుస్తున్న వారి వివరాలు, లాయర్ల వివరాలు, కేసు సుఫ్రీంకోర్టులో ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి 011-4362062 లేదా 011 4360112 నెంబరుకు ఫోన్ చేయండి
డిల్లీ లీగల్ సర్వీసెస్ అధారిటీ న్యాయ సలహాలు మరియు సహయం 12525 టోల్ ఫ్రీ నెంబరుకి లేదా 23070345 & 23073132 నెంబరుకు ఫోన్ చేయండి
కేరళ లీగల్ సర్వీసెస్ అధారిటీ న్యాయ సలహాలు మరియు సహయం 9846 700 100 నెంబరుకు ఫోన్ చేయండి
బ్రిహత్ ముంబాయి మున్సిఫల్ కార్పోరషన్ (బియంసి) చెత్తాచెదారాల నిర్వహణ, మురిగి కాలువలు, మురుగు, రోడ్లు, ట్రాఫిక్, పరిశ్రమలు, లైసెన్సుల జారీ, నీటి సరఫరా, కీటకాల నియంత్రణ, భవనాలు, అక్రమణ వంటి అంశాలపై ఫిర్యాధు చేయడానికి 1916 నెంబరుకు ఫోన్ చేయండి
బ్రిహత్ ముంబాయి మున్సిఫల్ కార్పోరషన్ (బియంసి) ఇరవై వేల రూపాయల వరకు బకాయి పడ్డ నీటి, ఆస్తి పన్నుల చెల్లింపుచేయడానికి 57575 నెంబరుకి యస్ యం యస్ చేయండి. దీనిని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఐటిజడ్ క్యాష్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఈ కార్డు 16 సంఖ్యలు గల నెంబరును ఇస్తుంది. పౌరులు యస్ యం యస్ చేసేటప్పుడు ఈ 16 సంఖ్యలు గల నెంబరును కూడా తెలియజేయాలి. యస్.యం.యస్ ను బి.యం.సి. ఐటి కంట్రోల్ రూం అందుకుంటుంది. వెంటనే వారు మీరు బకాయి పడ్డ అంటే మీరు ఎంత మొత్తం చెల్లించవలసి ఉందో యస్..యం.యస్ ద్వారా తెలియజేస్తారు. వెంటనే మీరు 16 సంఖ్య గల యస్.బి.ఐ-ఐ.టి.జడ్. నెంబరును మరియు చెల్లించే మొత్తాన్ని యస్.యం.యస్ ద్వారా వారికి తెలియజేస్తారు.
కోజికోడ్ జిల్లా
కేరళ – డాక్టరు యస్.యం.యస్
మీ దగ్గరలో, మీజిల్లాలో బ్లడ్ బ్యాంకులు, పరీక్షా కేంద్రాలు, ప్రవేట్ ఆసుపత్రులు, ప్రత్యేక ఆసుపత్రులు, సర్జరీ మరియు వెంటిలేటర్స్ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు వివరాలు తెలుసుకోవడానికి 9446460600 నెంబరుకు మీ పూర్తి చిరునామాతో యస్.యం.యస్ చేయండి
గుర్గాం పోలీసు
హర్యానా ప్రభుత్వం
మీరు ప్రమాదంలో లేదా ఒత్తిడిలో ఉన్నట్లయితే పోలీసులు మీకు సహాయ పడతారు 9717595423 నెంబరుకి యస్.యం.యస్ చేయండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01312335958
కటిక రహీమ్ Jul 05, 2017 08:41 PM

కోసిగి

StephenLulse Jan 04, 2017 12:28 PM

చాలా మంచి సమాచారం. చాలా ఉపయోగకరం గా ఉంది

సి సాయి చైతన్య Dec 15, 2015 12:28 PM

సమాచారం బాగా ఉన్నది

avanapu demudu Apr 01, 2015 02:33 PM

గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న వికాస్ పీడియా వారికి ధన్యవాదములు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు