హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / సియస్సి ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సియస్సి ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్

సియస్సి ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్ నుండి విధ రకాల ఉపాధి సంబంధిత సేవలు పొందడానికి సమాచారం

కార్మిక మంత్రిత్వ శాఖ, వివిధ రకాల ఉపాధి సంబంధిత సేవలు / ఉపాధి సర్వీస్ మార్పిడి కోసం ఒక మిషన్ మోడ్ ప్రాజెక్టుగా నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) ను అమలుచేస్తుంది. ఇ సేవలను ఆన్లైన్ ద్వారా అందించడానికి 20 జులై 2015 న గౌరవనీయులు ప్రధాన మంత్రి గారి చేతులు మీదుగా జాతికి అంకితం చేసినారు. సరిపోయే ఉద్యోగాలు, కెరీర్ కౌన్సిలింగ్, వృత్తి మార్గదర్శకం, నైపుణ్యం అభివృద్ధి కోర్సుల సమాచారం, శిష్యరికం (అప్ప్రేన్టిషిప్), ఇంటర్న్ షిప్ లు మొదలైనవి ఇ సర్వీస్ క్రిందవచ్చును. ఇ సర్వీస్ ప్రజలకు చేరువ అవటానికి భారత దేశంలో మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిన వున్న సియస్సి సంస్థ తో ఎంఓయూ కూదుర్చుకొనుట జరిగినది. ఇ ఎంఓయూ వలన యువత మన సియస్సి పోర్టల్ ద్వారా వివిధ రకాల ఉపాధి అవకాశాలను, శిక్షణ సమాచారం యాక్సెస్ చేయగలరు. ప్రసూతానికి మన సియస్సి నెట్వర్క్ ద్వారా 2800 నేషనల్ కెరీర్ సర్వీస్ పథకం లావాదేవీలు చేసినారు.

సియస్సి నేషనల్ కెరీర్ సర్వీస్ పొందే విధానం:

  1. మొదటగా మీ దగ్గరలో వున్న సియస్సి సెంటర్ కి వెళ్లి ఆపరేటర్ కి  మీ వివరాలు ఇవ్వవలెను (మీ సమీపంలోని సియస్సి సెంటర్ ను ఇక్కడ శోదించవచ్చును).
  2. సెంటర్ ఆపరేటర్ (VLE ) www.ncs.gov.in పోర్టల్ లోకి వెళ్లి కుడి చేయి వైపు వున్నలాగిన్ సెక్షన్ లో  కనెక్ట్ బటన్ ను క్లిక్  చేయదురు.
  3. వేరొక విండో లో కనెక్ట్ స్క్రీన్ ప్రదర్శింప బడును.
  4. ఆపరేటర్ తన వద్ద వున్న సియస్సి వివరాల ద్వారా సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్  చేయుదురు.
  5. లాగిన్ చేసిన తరువాత నేషనల్ కెరీర్ సర్వీస్ అధికారిక హోమ్ పేజీ తెరుచుకుంటుంది.
  6. ఇందులో ఉద్యోగం ఆశించే యువతకు ఉద్యోగం ఆశించేవారు (జాబ్ సీకర్) లో రిజిస్ట్రేషన్ చేయవలెను.
  7. స్థానికంగా ఉద్యగం కల్పించే వారిని స్థానిక సేవా ప్రదాత(లోకల్ సర్వీస్ ప్రొవైడర్) లో రిజిస్ట్రేషన్ చేయవలెను.
3.01492537313
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు