హోమ్ / విద్య / విద్య - ఉత్తమ పద్ధతులు / విద్య - ఉత్తమ పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విద్య - ఉత్తమ పద్ధతులు

ఇండియాలో కార్మికుల్లా పనిచేసే బాలికలకోసం ఒక విశిష్టమైన పద్ధతిని ఎం.వి ఫౌండేషన్ తయారుచేసింది : సమాజాలకు, ప్రభుత్వాలకు వెట్టి చాకిరీ, బాల కార్మిక వ్యవస్థలెంత అమానుషమైనవో వారికి తెలియజేసి వారిని సమాయాత్తం చేయడం.

సమాజాలకు విద్యనందించడం, సమాయాత్తం చేయడం

ఆడపిల్ల (ద గర్ల్ చైల్డ్)  కార్యక్రమం - రంగారెడ్డి జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఇండియాలో కార్మికుల్లా పనిచేసే బాలికలకోసం ఒక విశిష్టమైన పద్ధతిని ఎం.వి ఫౌండేషన్ తయారుచేసింది : సమాజాలకు, ప్రభుత్వాలకు వెట్టి చాకిరీ , బాల కార్మిక వ్యవస్థలెంత అమానుషమైనవో వారికి తెలియజేసి వారిని సమాయాత్తం చేయడం. ఆడపిల్ల(ద గర్ల్ చైల్డ్) కార్యక్రమం ఎన్నో వినూత్నమైన మంచి పద్ధతులను సూచించింది. ఇళ్లలో పనిచేసే, వెట్టిచాకిరీచేసే  బాలికలను గుర్తించి వారిని తిరిగి బడికి పంపి, వారు చదువుకొనేలా చేయడం  ఈ కార్యక్రమం వల్ల సాధ్యమౌతోంది.
సమాజంలోని  సాంప్రదాయక ఆలోచనలపై,సాంఘిక కట్టుబాట్లపై ఇది సవాలు విసిరింది. కీలక భాగస్వాములకు  'బాలికల విద్యాహక్కు' గురించి తెలియజేయడం, పనిచేస్తున్న బాలికలను గుర్తించి, వారికి సంబంధించిన పలు అవకాశాలను అన్వేషించింది. సమస్యను అర్థం చేసుకొని  బాలికల కోసం శ్రమించాలని సమాజానికుండే సత్తాను ఇది బలపరిచింది. తద్వారా బాలికలను బడికి వెళ్లేలా చేస్తోంది.

సమాజంలో బాలికల వెట్టిచాకిరీ సమస్యను తొలగించే విషయంలో ఉండే చురుకుదనం,  రహస్యంగాకాక, ఆ సమస్యను అందరిముందు బహిరంగంగా చర్చించేలా చేయడం కూడా ప్రాథమిక ఎత్తుగడలలో ఒకటి. ఈ విషయాన్ని  అనేక సామాజికపరమైన సమావేశాల్లో  చర్చించడం జరిగింది. అంతేకాదు. పాఠశాల విద్యా కమిటీలు ఈ విషయాన్ని చర్చించి  పారిశుద్ధ్యం, రక్షణ పరమైన బాలికల ప్రత్యేక అవసరాలను తీర్చేలా పాఠశాలల స్దాయిలను పెంచాలని నిశ్చయించింది. ఈ విషయంలో స్వయంగా ఈ కష్టాన్ని అనుభవించిన వారే 'ఆడపిల్ల' కార్యక్రమ  కార్యకర్తలుగా నియమితులై ఉండటం, వారికి స్థానికంగా శిక్షణనివ్వడం జరిగింది.  వారు ఇంటింటికీ తిరిగి బడికిపోకుండా వెట్టి చాకిరికి గురైన బాలికలెవరున్నారో వారిని (11 మందిని) గుర్తించి, వారి తల్లిదండ్రులకు చెప్పి, వారిని పనికి కాక బడికి పంపేలా చూడటం జరిగింది. ఈ విషయంలో వారు ఘర్షణ లేని మార్గాలలో శిక్షణ పొందిన వీరు  ఆడపిల్లు చదువుకోవడానికి ఉండే అవసరాన్ని అందరూ గుర్తించేలా చేసి, వారి తల్లిదండ్రుల్లో వ్యతిరేకతను బలహీనపడేవరకు పన్చేయడం జరిగింది. తల్లిదండ్రులంగీకరించాక వారి చిన్న ఆడపిల్లలనైతే బడిలో తిరిగి చేర్చడం, పెద్ద ఈడు ఆడపిల్లలైతే  రెసిడెన్షియల్ క్యాంపుల్లో చేర్చడం జరిగింది.  అలా చేసే సమయంలో ఆ పిల్లల తల్లిదండ్రులకు ప్రయోగాత్మకంగా సహాయాన్నివ్వడం జరిగింది. డ్రాప్ఔట్లను మానిటర్ చేయడం, చొరరాని చోట్లకెళ్లి వెట్టిచాకిరీకి గురైన బాలికలను గుర్తించడం జరిగింది.  కార్యకర్తలు  ఆడపిల్లలను ఏకంచేసి, వారిని అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తేజపరిచి  ఒకరికొకరు సహాయపడేలా చేయడం జరిగింది. గ్రామాల్లో ప్రధాన సమస్య అయిన బాల్య వివాహాల నిరోధించడం గురించి కూడా వీరు పనిచేశారు. తద్వారా బాలికలను బడికి పంపే విషయంలో సాయం చేశారు. ప్రతీ ప్రజాకార్యక్రమంలో పాల్గొని  లింగ వివక్ష సమస్యల గురించి లేవలనెత్తి, బాలికల హక్కులగురించి చర్చించేలా 'ఆడపిల్ల' కార్యక్రమ  కార్యకర్తలకు శిక్షణనివ్వడం జరిగింది. వివిధ కమిటీల (ఆడపిల్లల హక్కుల పరిరక్షణ, తల్లులు, బడి బాలికలు, బాలిక యువ మండలి వగైరా) ఏర్పాటు ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారు.  అన్నీ కమిటీలు కూడా  బాలికల వెట్టిచాకిరీ సమస్యనే లెవనెత్తేలా చేశారు. నాటకాలు, వీధి ప్రదర్శనలు ప్రజల్లో అవగాహనకూ, అర్థం చేసుకోవడానికీ దోహదం చేశాయి. వీటి ప్రభావం వెట్టిచాకిరీనించి బాలికలకు విముక్తి కలిగించడంలో, నిరోధించడంలో  ఎంతో వుంది. ఫలితంగా రెసిడెన్షియల్ క్యాంపుల్లో నమోదు శాతం పెరిగింది. ఇంటి పెద్దల అంగీకారంతో బాల్య వివాహాలు కొన్ని  రద్దయ్యాయి. మరి కొన్ని వాయిదా వేయడం జరిగింది.  బాలికలను వెట్టి చాకిరీనించి విముక్తి కలిగించి వారు చదువుకొనేలా చేయడంలో   జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా మరికొందరు కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ కార్యక్రమాన్ని ఎంవి ఫౌండేషన్ చేపట్టి, ఆదర్శంగా నిలిచింది.

ఆధారము: ( Out of Work and Into School, UNESCO )

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ (ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) - హైవెల్- భాగస్వామ్యం

2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 75.7 మిలియన్లు. అక్షరాస్యత రేటు 60.5 శాతం. ఈ మొత్తం జనాబాలో 5 మిలియన్ల గిరిజనులు జనాభా ఉన్నా వారి అక్షరాస్యత రేటు కేవలం 17 శాతం. ఈ తెగలు/ ఆదివాసీలు ఆర్థికంగా చాలా వెనకబడి వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల సేకరణలో, దినకూలి పనులు చేయడం జరుగుతోంది. వీరి అక్షరాస్యతను, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. గురుకులాల పేరిట రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడం ఒకటి. ఈ స్కూళ్లలో వారికి ఉచిత విద్య, భోజన వసతి సౌకర్యాలుంటాయి. విద్యాశాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు సమిష్టిగా వీటిని నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రంలో 4 జిల్లాలలో హోల్-ఇన్-ది-వాల్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ అనే సంస్థ  గిరిజన సంక్షేమ శాఖల భాగస్వామ్యంతో లర్నింగ్ స్టేషన్లని పిలిచే ఈ శిక్షణాలయాలు ఏర్పాటయ్యాయి.   వాటిని  పార్వతీపురం, శ్రీశైలం, భద్రాచలం, నాగార్జున సాగర్లలో ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 2005లో ఆరంభించిన ఈ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ప్రతిభగల ట్రైబల్ విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, 8వ తరగతినించీ 10వ తరగతిదాకా కో-ఎడ్యుకేషన్ వీటిలో ప్రత్యేకం.
నాగార్జునసాగర్లోని ట్రైబల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్ స్కూల్(పిటిజి-బాలురు) 1986లో ఆరంభించారు. ఇందులో 458 విద్యార్థులు, 23 టీచర్లు ఉన్నారు.  ఇక్కడ 3వతరగతినించి 10వతరగతిదాకా ఉంది. ఆంగ్ల భాష బోధిస్తున్నా, తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది.  15 కంప్యూటర్లున్న కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. ఇది ఆరంభ దశలో ఉన్న తెగల విద్యార్థుల గ్రూప్ కోసం ఉద్దేశించబడింది. వీరిలో  తొలి తరానికి చెందిన విద్యార్థులే అధికం.

సంతోషకర గణితం

గణితమంటేనే పిల్లలకు చాలా భయం. ఆ భయాన్ని పోగొట్టడానికి గణిత బోధనను కథల ద్వారా పిల్లలకు సులభంగా ఆగవాహన అయ్యేలా చేసే విధానాలు ఈ విభాగంలో వివరించబడ్డాయి. ఈ పద్ధతులను ఉపయోగించటం ద్వారా పెద్దసంఖ్యలను కూడా పిల్లలు సులభంగా అవగాహనచేసుకోగలరు.

సంతోషకర గణితం మొదటిభాగం - సంఖ్యలు

గణితమంటేనే పిల్లలకు చాలా భయం. గణితంలోని ప్రాథమిక భావనలు ఈ అంకెలు మరియు సంఖ్యలు. ఇవి అమూర్తాలు. వీటిని కథల ద్వారా పిల్లలకు సులభంగా ఆగవాహన అయ్యేలా చెప్పారు. పెద్దసంఖ్యలను కూడా పిల్లలు సులభంగా అవగాహనచేసుకోగలరు.

మొదటి భాగం యొక్క వివరాలు క్రింద జతచేయబడినాయి.

సంతోషకర గణితం రెండవభాగం - ఆకారాలు

పిల్లలకు పెద్దలకి అందరికీ ఇష్టమైన ఆట క్రికెట్. రచయిత గణితఆకారాలను, సరాసరిని, సాంఖ్యకశాస్రంలోని రేఖాచిత్రాలతో పాటు కొన్ని భావనలను నిత్యజీవిత సంఘటనలను ఉపయోగించుకొని వివరించారు. పిల్లలకు గణితాన్ని అభ్యసిస్తున్నామని కూడా భావించరు. పిల్లలు చాలా ఆనందాన్ని పొందుతారు.

రెండవభాగం యొక్క వివరాలు క్రింద జతచేయబడినాయి.

సంతోషకర గణితం మూడవభాగం - కొలతలు

ఈ మూడవభాగంలో కొలతలను కథల రూపంలో వివరించారు. పొడవు, చుట్టుకొలత, బరువు, సమయం, దూరం మొదలైన భావనలను ఆసక్తికరంగా వివరించారు.

మూడవభాగం యొక్క వివరాలు క్రింద జతచేయబడినాయి.

సంతోషకర గణితం నాల్గవభాగం - కాలము, ధనము

కాలాన్ని పూర్వం ఎలాకొలిచేవారు, ఇప్పుడు ఎలా కొలుస్తున్నారు , కొందరు భారత గణితశాస్త్రవేత్తల గురించి, ధనం మొదలైన భావనలను గురించి ఎప్పటిలాగానే ఆసక్తికరంగా కథల రూపంలో వివరించారు.

నాల్గవభాగం యొక్క వివరాలు క్రింద జతచేయబడినాయి.

ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా

3.05882352941
Akshay kumar Jun 27, 2017 07:50 PM

Hai pm sir my name is G. Akshay kumar I am studied tenth class . I am loss my father and so poor .Plz enquiry my real life and help me my study purpose and sanction one own house.

Rajesh Mar 23, 2017 03:22 PM

Your article's are very nice. Please add an article about moral values. And role of teachers to improve the values among the children

kanakadurga Mar 31, 2015 02:54 PM

ఈ రోజుల్లో అందరు తల్లి తండ్రులు ప్రైవేట్ స్కూల్స్ పైన శ్రద్ద ఎక్కువ. ఫీజులకు బయపడకుండా చదివిస్తున్నారు కాని అక్కడ నాణ్యమైన చదువులు లేవు, నైతిక విలువల గురించి చెప్పరు, కేవలం స్కూల్స్ కి ర్యాంకులు వస్తే చాలు. అది అక్కడి పరిస్తితి. ప్రభుత్వ పాటశాలలో అర్హత కలిగిన టీచర్స్ వుంటారు కాని మనకు నమ్మకం లేదు కావున ప్రభుత్వ పాటశాలల నాణ్యత ప్రజలకు తెలిసేలా చేయలి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు