অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డిజిటల్‌ మార్కెటింగ్‌ లో ఉపాధి అవకాశాలు

ఇంటర్నెట్‌, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు జీవితంలో అతి ముఖ్యమైనవిగా మారిపోయాయి. అదే సమయంలో ట్రెడిషనల్‌ మార్కెటింగ్‌ కనుమరుగయిపోయి డిజిటల్‌ మార్కెటింగ్‌ వచ్చేసింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో ఎక్కువ వృద్ధి ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. ఈ రంగంలో కెరీర్‌ ప్రారంభిస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదు.

కంపెనీలు పలు మార్కెటింగ్‌ పద్ధతులను ఫాలో కావడం ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే సంప్రదాయ మార్కెటింగ్‌ స్థానంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ దూసుకొచ్చింది. ఇందులో సైతం వినియోగదారులతో రిలేషన్‌షి్‌పను ఏర్పరచుకోవడమే ఉంటుంది. అయితే కంప్యూటర్స్‌, మొబైల్స్‌, ఇంటర్నెట్‌ ద్వారా రిలేషన్‌షి్‌పను బిల్డప్‌ చేయడం జరుగుతుంది. చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఇండియాలో ఈ ఏడాది డిజిటల్‌ మార్కెటింగ్‌లో 1.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉంది.

డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారు మేనేజర్‌ స్థాయి ఉద్యోగాలకు అర్హులవుతారు. వీరికి డిమాండ్‌ కూడా బాగా ఉంటుంది. కంపెనీలు సైతం అనుభవం ఉన్న వ్యక్తులకు మంచి జీతం ఆఫర్‌ చేస్తుంటాయి. ఎంబీఏతో పాటు డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్టిఫికేషన్స్‌ ఉన్న వారికి కార్పొరేట్‌ కంపెనీలు ఆహ్వానం పలుకుతుంటాయి. అయితే ఎంబీఏ డిగ్రీల లేకపోయినా డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్టిఫికేషన్స్‌ లేకపోయినా అనుభవం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన ఒక విద్యార్థి బైక్‌అడ్వైజ్‌.ఇన్‌ అనే సైట్‌ను క్రియేట్‌ చేశాడు. దీన్ని నాలుగేళ్లలో పది లక్షల మంది వీక్షించారు. తన రెజ్యూమెలో ఈ విషయాన్ని తన పొందుపరిచి ఉద్యోగానికి అప్లై చేసినపుడు కంపెనీలు వెంటనే తీసుకుంటాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ మొత్తం మార్కెటింగ్‌ టీమ్‌ను లీడ్‌ చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ బాధ్యతలు తనపైనే ఉంటాయి

జీతభత్యాలు : డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌కి ఏడాదికి 15 నుంచి 20 లక్షల వేతనం లభిస్తుంటుంది. కొన్ని పెద్ద కంపెనీలు 40 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నాయి

కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్స్‌, కంటెంట్‌ రైటర్స్‌

బ్లాగ్‌ నిర్వహించడం, సేల్స్‌ పేజ్‌ కాపీ రైటింగ్‌, ఈమెయిల్‌ కమ్యునికేషన్స్‌, డ్రిప్‌ మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్‌, ఈబుక్‌ పబ్లికేషన్స్‌, వీడియో మార్కెటింగ్‌, గెస్ట్‌ బ్లాగింగ్‌ వంటి బాధ్యతలన్నీ కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌పై ఉంటాయి. వీళ్లు డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్స్‌కు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. కంటెంట్‌ రైటర్స్‌ టీమ్‌ని మేనేజ్‌ చేయాల్సిన బాధ్యత వీళ్లపై ఉంటుంది. కంటెంట్‌ రైటర్స్‌ పార్ట్‌టైమ్‌ జాబ్‌గా పనిచేయవచ్చు. ఫ్రీలాన్సర్‌గా కంటెంట్‌ని రాసి పంపుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రత్యేకంగా ఇది అర్హత అని ఉండదు. ఎంబీఏ డిగ్రీతో పాటు డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్టిఫికేషన్స్‌ ఉంటే మంచిది. అనుభవానికి అన్నింటికన్నా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రంగంలో 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారు కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఉద్యోగానికి అర్హులవుతారు.

జీతభత్యాలు : ఏడాదికి 10 నుంచి 15 లక్షల వేతనం లభిస్తుంది

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో రెండు ఏరియాలుంటాయి. ఒకటి సొంత కంటెంట్‌ను సోషల్‌ మీడియా చానెళ్ల ద్వారా ప్రసారం చేయడం. ఈ పనిని కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ లేక కంటెంట్‌ మార్కెటింగ్‌ టీమ్‌లో ఉన్న వ్యక్తి చేస్తారు. మరొకటి సోషల్‌ మీడియాలో రన్నింగ్‌ పెయిడ్‌ అడ్వర్టైజింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ వచ్చేలా చూడటం కాంప్లికేటెడ్‌ టాస్క్‌గా చెప్పుకోవచ్చు. కొత్త ఫీచర్లు జోడించడం, ప్రతిరోజు టార్గెట్‌లను చేరుకోవడం కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ లేక డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌లు చేయలేరు. ఈ పనిని సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రమే హ్యాండిల్‌ చేయగలరు.

సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటర్స్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌లో సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటింగ్‌కు ముఖ్యమైన పాత్ర ఉంది. గూగుల్‌ అతి పెద్ద సెర్చ్‌ ఇంజన్‌ అన్న విషయం తెలిసిందే. గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేయడం వీరి పని. ఒకవేళ కంపెనీ చిన్నదయితే డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజరే సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటింగ్‌ బాధ్యతలను చూసుకుంటాడు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కూడా పనిని అప్పగిస్తారు. అయితే పెద్ద పెద్ద కంపెనీలు నైపుణ్యంతో కూడిన సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటింగ్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని కంపెనీలు ఫ్రెషర్స్‌ను సైతం తీసుకుంటాయి. కార్పొరేట్‌ కంపెనీలు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి

ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్స్‌

వీరిని సెర్చ్‌ ఇంజన్‌ అప్టిమైజర్స్‌ అంటారు. కీవర్డ్‌ రీసెర్చ్‌, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆప్టిమైజేషన్‌, డూప్లికేట్‌ కంటెంట్‌ను మేనేజ్‌ చేయడం, పేజీలను ఇండెక్స్‌ చేయడం వంటి పనులన్నీ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎస్‌ఈఓ ఎక్స్‌పర్ట్‌ మార్కెట్‌లో ఉన్న ఎస్‌ఈఓ టూల్స్‌ అన్నింటిని ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉండాలి

కాపీ రైటర్స్‌ :

వీరు డిజిటల్‌ మార్కెటింగ్‌ టీమ్‌లో ఉన్న చాలా మందితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఒక కాపీరైటర్‌ సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటర్‌కు సహాయపడతాడు. సోషల్‌ మీడియా చానెళ్లలో మంచి పదాలు వాడటానికి సోషల్‌ మీడియా మేనేజర్‌లకు సహకరిస్తాడు. అయితే చాలా కంపెనీలు డిజిటల్‌ మార్కెటింగ్‌ టీమ్‌లో కాపీరైటర్‌ను కలిగి ఉండవు. టీమ్‌లో కాపీరైటింగ్‌ స్కిల్స్‌ ఉన్న సీఆర్‌ఓ ఎక్స్‌పర్ట్‌ కాపీరైటర్‌ విధులను నిర్వర్తిస్తుంటాడు

ఆధారము: ఆంధ్రజ్యోతి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate