অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఫ్యాష‌న్ రంగంలో విద్యా అవకాశాలు

ఫ్యాష‌న్ రంగంలో విద్యా అవకాశాలు

డిజైన్ పాఠశాలలు మరియు పరీక్షలు

1.

Srishti School

Srishti School

2.

School of Fashion Technology

School of Fashion Technology

3.

Pearl Academy

Pearl Academy

4.

Symbiosis Institute of Design

Symbiosis Institute of Design

5.

Footwear Design and Development Institute

Footwear Design and Development Institute

6.

Maeer’s MIT Institute of Design

Maeer’s MIT Institute of Design

7.

National Institute of Design

National Institute of Design

8.

National Institute of Fashion Technology

National Institute of Fashion Technology

9.

National Aptitude Test in Architecture

National Aptitude Test in Architecture

10.

Center for Environmental Planning and Technology (CEPT)

Center for Environmental Planning and Technology

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి నిఫ్ట్ స్వాగ‌తం

అదో ఫ్యాష‌న్ అడ్డా... ఫ్యాష‌నే అక్కడి విద్యార్థుల‌కు ప్యాష‌న్‌.. అదేవారి లైఫ్‌ యాంబిష‌న్‌

అందుకే... ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోకి అడుగెట్టాల‌నుకునే వారంతా నిఫ్ట్‌ల్లో చ‌ద‌వ‌డానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ఉంటేనే సీటు పొంద‌డం సాధ్యమ‌వుతుంది. పోటీ ఎక్కువ‌గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. విద్యా సంవ‌త్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత‌లేమిటి, ప్రవేశం ఎలా...త‌దిత‌ర‌ వివ‌రాలు క్షుణ్నంగా తెలుసుకుందామా...

కోర్సులు, అర్హత‌ల‌ వివరాలు

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్స్‌:

యాక్సెస‌రీ డిజైన్‌, ఫ్యాష‌న్ క‌మ్యూనికేష‌న్‌, ఫ్యాష‌న్ డిజైన్‌, నిట్‌వేర్ డిజైన్‌, లెద‌ర్ డిజైన్ అండ్ టెక్స్‌టైల్ డిజైన్‌

కోర్సు వ్య‌వ‌ధి: నాలుగేళ్లు

అర్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ- అపెర‌ల్ ప్రొడ‌క్షన్‌

కోర్సు వ్యవ‌ధి: నాలుగేళ్లు

అర్హ‌త‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్‌

కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌

మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌

కోర్సు వ్యవ‌ధి: రెండేళ్లు

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి మూడేళ్ల డిప్లొమా

మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ

అర్హత‌: నిఫ్ట్ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లేదా ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు

ప్రవేశం: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా ల‌భిస్తుంది.

కోర్సుల వారీ సీట్లు ఇలా...

అన్ని నిఫ్ట్‌ల్లోనూ క‌లిపి డిగ్రీ, పీజీ స్థాయుల్లో మొత్తం 2860 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్‌కు సంబంధించి ఫ్యాష‌న్ డిజైన్లో 420, లెద‌ర్ డిజైన్లో 120, యాక్సెస‌రీ డిజైన్ 420, టెక్స్‌టైల్ డిజైన్ 390, నిట్‌వేర్ డిజైన్ 210, ఫ్యాష‌న్ క‌మ్యూనికేష‌న్ 360 సీట్లు ఉన్నాయి.

బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో అపెర‌ల్ ప్రొడ‌క్షన్ విభాగంలో 330 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పీజీ కోర్సులైన మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో 90, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌లో 420, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో 100 సీట్లు ఉన్నాయి.

నిఫ్ట్ సంస్థలు ఇక్కడ‌

దేశ‌వ్యాప్తంగా 15 నిఫ్ట్ సంస్థలున్నాయి. వాటిని బెంగ‌ళూరు, భోపాల్‌, భువ‌నేశ్వ‌ర్‌, చెన్నై, కోల్‌క‌తా, న్యూఢిల్లీ, ముంబై, గాంధీన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, ప‌ట్నా, క‌న్నూరు, రాయ్‌బ‌రేలీ, షిల్లాంగ్‌, కంగ్రా, జోధ్‌పూర్‌ల్లో ఏర్పాటు చేశారు .

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

స‌మీప ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం.

రాత ప‌రీక్ష ఇలా...ఒక్కో కోర్సుకు ప్రశ్నప‌త్రం ఒక్కో విధంగా ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. ప్రతి స‌రైన‌ స‌మాధానానికీ ఒక మార్కు.

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్‌, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జ‌న‌ర‌ల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.

ప‌రీక్షలో: క్వాంటిటేటివ్ ఎబిలిటీ, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నల‌డుగుతారు. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, క‌మ్యూనికేటివ్ ఎబిలిటీ నుంచి 35, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 30, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ 30, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.

బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (ఎంఎఫ్‌టెక్‌) కోర్సుల్లో ప్రవేశానికి ప్రశ్నప‌త్రం ఒకే మాదిరిగా ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. వీటిని మూడు గంట‌ల్లో పూర్తిచేయాలి.

ప‌రీక్షలో: క‌్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 30, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 45, ఎన‌లిటిక‌ల్ అండ్ లాజిక‌ల్ ఎబిలిటీ నుంచి 25, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్ స్టడీకి 25 మార్కులు కేటాయించారు.

మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రత్యేక ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు. మొత్తం 150 ప్రశ్నల‌డుగుతారు. వ్యవ‌ధి 3 గంట‌లు.

ప‌రీక్షలో: క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 10, క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50, ఎన‌లిటిక‌ల్ అండ్ లాజిక‌ల్ ఎబిలిటీ 25, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్ 25, కేస్ స్టడీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.

విభాగాల వారీ ఈ అంశాల నుంచి ప్రశ్నలు

క్వాంటిటేటివ్ ఎబిలిటీ : కూడిక‌లు, గుణింతాలు, భాగాహారం, తీసివేత‌లు, శాతాలు, భిన్నాలు, వ‌డ్డీ రేట్లు, ప‌ని -కాలం, దూరం-వేగం, నిష్పత్తి, స‌గ‌టు..త‌దిత‌ర అంశాల‌పై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల స్థాయి మ‌రీ అంత క‌ఠినంగా ఉండ‌దు. హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల నుంచి ఈ అంశాల‌న్నీ క‌వ‌ర్ అయ్యేలా చ‌దువుకుంటే స‌రిపోతుంది. వీలైతే ఆర్ ఎస్ అగ‌ర్వాలా ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ రెండు పుస్తకాల్లో దేన్నైనా తీసుకుని న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ విభాగాన్ని చదువుకుంటే స‌రిపోతుంది.

క‌మ్యూనికేష‌న్ ఎబిలిటీ: అభ్యర్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ప‌రీక్షిస్తారు. రోజువారీ జీవితంలో మాట్లాడ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌ద‌సంప‌ద‌, వ్యాక‌ర‌ణం ఉన్నాయో, లేదో ప‌రీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నల‌డుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూల్ స్థాయిలో ఉంటాయి. వ్యాక‌ర‌ణ ప్రాథ‌మిక నియ‌మాలు, ప్రాథ‌మిక స్థాయి ప‌ద‌సంప‌ద పరిజ్ఞానం ఉండాలి. స‌మానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెత‌లు, నుడికారాలు, సింగిల‌ర్‌, ప్లూర‌ల్‌, వ‌న్ వ‌ర్డ్ స‌బ్‌స్టిట్యూట్స్‌, స్పెల్లింగ్ క‌రెక్షన్ త‌దిత‌ర విభాగాల్లో ప్రశ్నల‌డుగుతారు.

ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ : అభ్యర్థి త‌ర్కాన్ని పరీక్షించ‌డానికి ఈ సెక్షన్‌ను కేటాయించారు. కొంత స‌మాచారం ఇచ్చి దాన్నుంచే జ‌వాబులు రాబ‌ట్టే ప్రశ్నలు అడుగుతారు. ఈ సెక్షన్ ద్వారా అభ్యర్థి ఆలోచ‌నా స్థాయిని కూడా ప‌రీక్షిస్తారు. ఇచ్చిన స‌మాచారాన్ని బాగా విశ్లేషించ‌గ‌లిగితే స‌మాధానం గుర్తించ‌డం సులువ‌వుతుంది. గ‌ణితంలో ప‌రిజ్ఞానం ఈ సెక్షన్ ప్రశ్నల‌కు స‌మాధానాలు రాబ‌ట్టడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ క‌రెంట్ అఫైర్స్‌: వ‌ర్తమాన అంశాల‌పై ప్రశ్నల‌డుగుతారు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో అభ్యర్థికి స‌మాజం, ప‌రిస‌రాల‌పై ఉన్న అవ‌గాహ‌న‌ను ప‌రిశీలిస్తారు. తాజా ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ఉంటే క‌రెంట్ అఫైర్స్ ప్రశ్నల‌కు సులువుగానే స‌మాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా ప‌త్రిక చ‌దివి ముఖ్యాంశాల‌ను నోట్సురూపంలో రాసుకుంటే సులువుగా గుర్తుపెట్టుకోవ‌చ్చు.

క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్‌: అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజ‌నాత్మక‌త ఎలా ఉందో ఈ ప‌రీక్ష ద్వారా ప‌రిశీలిస్తారు. రంగుల‌ను ఎలా ఉప‌యోగిస్తున్నారు, ప‌రిశీల‌నాశ‌క్తి ఏ విధంగా ఉంది, కొత్తద‌నం ఏమైనా ఉందా, ఇల‌స్ట్రేష‌న్‌, క‌ళాత్మక నైపుణ్యం..త‌దిత‌ర అంశాల మేళ‌వింపుతో ఈ ప‌రీక్ష ఉంటుంది.

కేస్ స్టడీ: ఈ విభాగంలో ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అంశం గురించి స‌మాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజీరియ‌ల్ నైపుణ్యం ప‌రిశీలిస్తారు. మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ ప్రశ్నప‌త్రంలో కొన్ని ప్రశ్నలు ఇంజినీరింగ్ విభాగం నుంచి అడుగుతారు.

రాత ప‌రీక్షలో అర్హత సాధించిన‌వాళ్లకు వారు ఎంపిక చేసుకున్న కోర్సును బ‌ట్టి సిట్యువేష‌న్ టెస్ట్‌, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.

గ్రూప్ డిస్కష‌న్ ఇలా.. ఏదైనా ఒక కేస్ స్టడీ ఇచ్చి దానిపై 15 నుంచి 20 నిమిషాలు చ‌ర్చించ‌మంటారు. అభ్యర్థులు చ‌ర్చిస్తున్నప్పుడు నిర్ణేత‌లు ఆ కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత‌, ఆ అంశంపై ఉన్న ప‌రిజ్ఞానం, ఆ అంశంపై అభ్యర్థి స‌మావేశంలో ఎంత వ‌ర‌కు భాగ‌స్వామి అయ్యాడు, ఇంట‌ర్ ప‌ర్సన‌ల్ స్కిల్స్, కొత్త ఆలోచ‌న‌లు ఏమైనా పంచుకున్నారా, స‌మ‌స్య ప‌రిష్కార దిశ‌గా ఎలా స్పందిస్తున్నారు, నాయ‌క‌త్వ లక్షణాలు, భావాలు పంచుకున్న తీరు, భావాల్లో ప‌రిణ‌తి, భాష‌లో స్పష్టత‌...ఇలా ప‌లు కోణాల్లో అభ్యర్థిని ప‌రిశీలిస్తారు.

ఇంట‌ర్వ్యూలో... అభ్యర్థికి ఫ్యాష‌న్ కెరీర్‌పై ఏమేర‌కు ఆస‌క్తి ఉంది? ఈ రంగంపై ప‌రిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? అక‌డ‌మిక్ ప్రతిభ‌, కో క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌, క‌మ్యూనికేష‌న్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ ఆప్టిట్యూడ్‌, క్రియేటివిటీ, లేట‌ర‌ల్ థింకింగ్‌..త‌దిత‌ర కోణాల్లో ప‌రిశీలిస్తారు.

ఇంట‌ర్వ్యూలోనూ అర్హత సాధిస్తే చివ‌రిగా ప్రవేశం ల‌భిస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న ప్రాధాన్యం ప్రకారం మెరిట్ ప్రాతిప‌దిక‌న ఏదైనా నిఫ్ట్‌లో సీటు కేటాయిస్తారు. కోర్సుల‌కు ఎంపికైన‌వారికి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యారుణాన్ని మంజూరుచేస్తుంది. ఈ మేర‌కు నిఫ్ట్ సంస్థలు యూబీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దేశాల్లోనూ అవ‌కాశం: నిఫ్ట్ విద్యార్థులు కావాల‌నుకుంటే అమెరికాలోనూ చ‌దువుకోవ‌చ్చు. దీనికోసం న్యూయార్క్‌లోని ఫ్యాష‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఫిట్‌)తో నిఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు నిఫ్ట్‌లో రెండేళ్లు చ‌దివిన త‌ర్వాత‌ ఫిట్‌లో ఏడాది పాటు విద్యన‌భ్యసించాలి. అనంత‌రం నిఫ్ట్‌లో చ‌దువుకోవాలి. కోర్సు పూర్తయిన వెంట‌నే నిఫ్ట్‌, ఫిట్ రెండు సంస్థలూ డిగ్రీని ప్రదానం చేస్తాయి. అంటే ఏక కాలంలో డ్యూయ‌ల్ డిగ్రీని అందుకోవ‌చ్చన్నమాట‌.

>వీటిపై అవ‌గాహ‌న త‌ప్పనిస‌రి: ఫ్యాష‌న్ ప్రపంచంలోకి అడుగెట్టాలంటే సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవ‌హారాలు, రంగులు, ట్రెండ్‌, ఫ్యాబ్రిక్‌..వీట‌న్నింటిపైనా అవ‌గాహ‌న పెంచుకోవాలి. కేవ‌లం సృజ‌న ఉన్నంత‌మాత్రాన స‌రిపోదు. ఆలోచ‌న‌లకు సంబంధించిన‌ ఊహా చిత్రాన్ని చేతితో గీయ‌డం, కంప్యూట‌ర్‌లో దానికి రూపాన్నివ్వడం ఈ రెండింటిలో దేన్నైనా తెలుసుకోవాలి. ఫ్యాష‌న్‌, డిజైన్ రెండింటి మ‌ధ్య తేడాలు తెలుసుకోవాలి. అలాగే ఈ రెండింటి మ‌ధ్య సారుప్యత గురించీ అవ‌గాహ‌న ఉండాలి.

కొత్త ట్రెండ్‌: ప్రస్తుతం క‌మ్యూనికేష‌న్ డిజైన్ భార‌త్‌లోనూ విస్త‌రిస్తోంది. డిజైన‌ర్లు త‌యారుచేసిన దుస్తుల‌పై కంపెనీల లోగోలు, ఆక‌ట్టుకునే క్యాప్షన్లు వేసే ప‌నిని వీరు చేస్తారు. కంప్యూట‌ర్‌లో లోగో లేదా కొటేష‌న్‌, సీన‌రీ..ఇలా దేన్నైనా డిజైన్ చేసి త‌యారుచేసిన దుస్తుల‌పై ఉంచుతారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ లోగో సంస్కృతి మ‌న ద‌గ్గ‌రా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆక‌ర్షణీయంగా క‌నిపించాల‌నే త‌ప‌న యువ‌త‌తోపాటు పెద్దవారిలోనూ పెరుగుతోంది. ఇలా క‌నిపించ‌డంలో దుస్తుల పాత్రే కీల‌కం. అందుకే డ‌బ్బు విష‌యంలో వెనుకాడ‌కుండా ఫ్యాష‌న్ ప్రపంచంవైపు జ‌నాలు ప‌రుగులు తీస్తున్నారు. కాబ‌ట్టి ఆక‌ట్టుకునేలా దుస్తుల‌ను కొత్తగా డిజైన్ చేయ‌గ‌లిగే విద్య అబ్బిందంటే ల‌క్షల్లో సంపాదించ‌డం సులువైన‌ట్టే. ఫ్యాష‌న్ విద్యార్థులు అసోసియేష‌న్ ఆఫ్ డిజైన‌ర్స్ ఆఫ్ ఇండియా (ఏడీఐ) గ్రూప్‌లో చేర‌డం ద్వారా అవ‌కాశాలు, తాజా ప‌రిణామాల‌ను అందిపుచ్చుకోవ‌చ్చు. కోర్సులు విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న త‌ర్వాత ఫ్యాష‌న్ మీడియా, డిజైన‌ర్‌, స్టైలిస్ట్ (స్టోర్స్‌), ఫ్యాష‌న్ రిటైల‌ర్‌, ఫ్యాష‌న్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌, ప‌ర్సన‌ల్ స్టైలిస్ట్‌/ సెలెబ్రిటీ స్టైలిస్ట్ త‌దిత‌ర హోదాల‌తో రాణించ‌వ‌చ్చు.

ఆధారము : పోర్టల్ టీమ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate