పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జవాబుదారీ మరియు బహుళ రంగాల బాధ్యత

'పరిష్కార హక్కు' వీటిని కలిగి ఉంటుంది: (ఎ) సమాన మరియు సమర్థవంతమైన న్యాయ ప్రాప్తి కల్పన; (బి) తగినంత, ప్రభావవంతంగా మరియు సరియైన సమయంలో బాధితులను బాగుచెయ్యటం; (సి) ఉల్లంఘనలు మరియు నష్టపరిహార పనితీరుకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచటం. ప్రభావవంత పరిహారమంటే పరిహారం, పునరావాసం, సంతృప్తి మరియు అది పునరుక్తంకాదని హామీ. అందువల్ల రాష్ట్రం RTE, 2009 నియమాలను మెరుగుగా అమలు చేయటం కోసం, శారీరక దండన యొక్క సందర్భాలలో 'సమర్థవంతమైన బాగుచెయ్యటం'కి అనుకూలంగా చట్టపరమైన నిబంధనలు సరిచేయాలి.

 • విద్యా సంస్థలు అన్ని పాఠశాలలు మరియు వసతి గృహాలు, ప్రభుత్వ అలాగే ప్రైవేటు, పిల్లలు వారి ప్రాంగణంలో ఉన్న సమయంలో పిల్లలను సంరక్షించవలసి ఉంటుంది.. అందువలన పిల్లలు శారీరక శిక్షతో సహా అన్ని రకాల హింసల నుండి సురక్షితంగా ఉండేలా చూడటం పాఠశాల/సంస్థ యొక్క నిర్వహణ/పరిపాలన వ్యవస్థ బాధ్యత. అందువలన, పిల్లల మీద హింసకు పాల్పడ్డ పాఠశాల ఉపాధ్యాయుల, వార్డెన్ తోపాటు ఆ పాఠశాల/సంస్థ యొక్క సిబ్బంది, సంబంధిత విద్యా నిర్వాహకులు నిర్వహణ/ పరిపాలన/ఉన్నత స్థాయిలలో యాజమాన్యాలు కూడా బాధ్యుతవుతారు.
 • పిల్లలపై హింసకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలో సంబంధిత నిర్వహణ/పరిపాలన అధికారులు కేవలం పాఠశాల/సంస్థ నిర్వహించిన విచారణ తోపాటు, ఒక స్వతంత్ర దర్యాప్తు చేయాలి. దానివలన పాఠశాల/సంస్థలలో జరుగుతున్న వాటిని తెలుసుకోవచ్చు. పిల్లలకు కష్టం కలిగే అన్ని సందర్భాలలో, తలిదండ్రులు కేసు తిరిగి తీసుకుంటే, నియమించబడిన అధికారి నేరంపై అవగాహనను ఎర్పరుచుకొని పిల్లలకు నష్టం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవటం కొనసాగించాలి.
 • RTE చట్టంలోని విభాగం 32 (1) క్రింద రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తగిన 'స్థానిక అధికారులను నిర్దిష్టంగా నియమించాలి. శారీరక శిక్షలు, వివక్ష, మనోవేదనలకు సంబంధించిన వారి ప్రయోజనం కోసం సంబంధిత వారికి దీనిని తెలియజేయాలి. అటువంటి 'స్థానిక అధికారి' జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ (DCPS) సభ్యుడిగా ఉండాలి. ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ICPS) కింద ఉంటుంది. దీనికి అధికారిగా జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్/డిప్యూటీ కమిషనర్ ఉంటారు. DCPS జిల్లా స్థాయి కమిటీగా శారీరక దండన కోసం పని చేయాలి. దీనికి చేర్మన్ గా జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్/డిప్యూటీ కమిషనర్ ఉంటారు. సంబంధిత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) దాని ఎక్స్ అఫిషియో సభ్య కార్యదర్శి/కన్వీనరుగా ఉంటారు. శారీరక దండన యొక్క మూసివేసిన కేసులు సుయో మోటు విచారణ తీసుకొని వేగంగా చట్ట ప్రకారం నివారణా చర్యలు తీసుకోవటం కూడా అతని బాధ్యత.
 • శారీరక దండన యొక్క కేసుకు సంభవించి వెంటనే పైన తెలిపిన మార్గదర్శకాల ప్రకారం CPMCను ప్రాథమిక నిజనిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూడమని ఆదేశించటం SDM విధి.
 • పిల్లలు పాఠశాలలో ఉండగా శారీరక శిక్ష వలన మరణం (నరహత్య లేదా ఆత్మహత్య), లైంగిక వేధింపుల లేదా తీవ్రమైన/దారుణ శారీరక లేదా మానసిక గాయంతో బాధపడుతున్నట్లు తెలిసిన వెంటనే SDM పాఠశాలకు వెళ్ళి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రాథమిక విచారణ చేపట్టాలి. అతను ప్రాథమిక విచారణ 7-10 రోజులలో పూర్తిచేయాలి.
 • పాఠశాల టీచర్/సిబ్బంది చర్య కారణంగా పిల్లలు ఆత్మాహుతి/లైంగిక వేధింపు/వైద్యశాలలో చేరిన సందర్భాలలో ఆరోపించిన వెంటనే సస్పెండ్ చేయాలి. SDM పరిశోధనలముగిసే వరకు అతని సస్పెండు చేసి ఉంచాలి.
 • CPMC ప్రాథమిక విచారణ నివేదికను అందిన తర్వాత నియమిత SDM అతను/ఆమె స్వతంత్రంగా నివేదికను అంచనా వేసి అనుమానాలేమైనా ఉన్నాయేమో చూసి నిజాలు ధ్రువీకరించాలి. అతడు/ఆమె సంఘటన జరిగిందని నమ్మితే వెంటనే స్థానిక పోలీసు స్టేషనులో కేసును నమోదు చేయాలి.
 • SDM నుంచి శారీరక దండన యొక్క అన్ని ఫిర్యాదులు అందిన వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్/పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేయాలి. అదే కాపీని ముందుగా SDM, CPMC మరియు పాఠశాల నిర్వహకులకు మరియు తల్లిదండ్రులు/ సంరక్షకులకు పంపాలి. అతను సంబంధిత అన్ని అవకాశాలను పొందుపరచాలి. ఇందులో IPC, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్) చట్టం, 2000 మరియు సంబంధిత రూల్స్, సివిల్ హక్కుల పరిరక్షణ చట్టం 1955, మరియు SC / ST ( అట్రోసిటీస్ నివారణ) చట్టం, 1989 మరియు దాని రూల్స్ వంటి శిక్షా అంశాలతో సహా ఎఫ్ఐఆర్ లో పొందు పరచాలి.
 • ఆ తరువాత, కేసు పోలీసు వైపు నుండి తార్కిక నిర్ధారణకు తీసుకోవడానికి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ (CWO) కు అప్పగించాలి. వెంటనే అదుపులో ఉన్న నిందితుడిపై ఒక సహేతుకమైన సమయం లోపల అతని/ఆమె విచారణ పూర్తి చేయాలి. సహేతుకమైన సమయంలోపల అంటే ఎఫ్ఐఆర్ నమోదు తేదీ నుండి 3 నెలల్లో మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, దాని ప్రతిని SDM పంపాలి. అతను/ఆమె గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, కేసు ఎంత క్రూరమైనాదైనా కాని ఏ పిల్లలు/గురువు/ సిబ్బంది/తలిదండ్రులను మరియు పాఠశాల లేదా సంఘటన గురించి తెలిసిన పరిసర ప్రాంతాల వారిని సాక్షం కోసం పోలీసు స్టేషనుకు పిలవరాదు. పాఠశాల లేదా పొరుగు పిల్లలతో అతను బెదిరింపు పద్ధతిలో మాట్లాడకూడదు. వారి తల్లిదండ్రులు మరియు CPMC న్యాయ సహాయ సభ్యుడు ఉన్నప్పుడు మాత్రమే విచారించాలి.
 • శారీరక శిక్ష సంబంధించిన దానిలో బాధిత పిల్లల తల్లిదండ్రులు న్యాయ సహాయానికి డబ్బులు చెల్లించ లేని పరిస్థితిలో ఉంటే వారికి CPMC (సభ్య కార్యదర్శి ద్వారా నియమించబడ్డారు) న్యాయ సాయం అందించడానికి జిల్లా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ నుండి చట్టపరమైన సభ్యులు బాధ్యత తీసుకోవాలి.
 • SDM మరియు CWO పాఠశాల యొక్క హెడ్డు లేదా పాఠశాల నిర్వాహకులు లేదా ఉపాధ్యాయులు, సంఘాలు మొదలైనవి ప్రత్యక్షంగా లేదా పరోక్ష పద్ధతిలో సాక్షుల మార్చడానికి ప్రయత్నించనివ్వకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
 • ఈ మొత్తం ప్రక్రియలో, CPMC మరియు SDM బాధిత పిల్లల భద్రత, భౌతిక మరియు మానసిక ఆరోగ్యం, రెండింటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే, పిల్లలను ఆస్పత్రికి తరలించవలసిన అవసరం ఉంటే, వారు ఏలాంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి లేదా ఒక ప్రొఫెషనల్ మానసిక వైద్యుడు లేదా మనస్తత్వవేత్త లేదా పిల్లల కౌన్సిలర్ సేవలు అవసరం ఉంటే  ప్రభుత్వం పాఠశాల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేయాలి. ఎయిడెడ్ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ నిర్వహకులు ఖర్చు భరించాలి.
 • SDM ద్వారా విచారణ పూర్తయితే, అతను నిర్ణీత కాల వ్యవధిలో బాధితపిల్లలు లేదా అతని కుటుంబానికి తగినంత పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా సిఫార్సు చేయాలి. దానిని పాఠశాల నుంచి ప్రభుత్వం కొంతకాలానికి స్వాధీనం చేసుకుంటుంది.
 • పాఠశాల టీచర్/ప్రిన్సిపాల్/బోధనేతర సిబ్బందికి వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్య (వర్తించే)లను గురించిన SDM సిఫార్సును డైరెక్టర్ (స్కూల్ ఎడ్యుకేషన్)కు తన విచారణ నివేదిక కాపీని పంపాలి. SDM నివేదిక టీచర్/హేడ్డు/సిబ్బందికి వ్యతిరేకంగా ఉండి స్పష్టమైన ఆధారాలు ఉంటే చట్టం ప్రకారం సరైన క్రమశిక్షణా చర్యను డైరెక్టర్ (స్కూల్ ఎడ్యుకేషన్) సహేతుకమైన సమయం లోపల తీసుకోవాలి.
 • డైరెక్టర్ (స్కూల్ ఎడ్యుకేషన్) శారీరక శిక్ష గురించి ఆ పాఠశాల లైసెన్సు పునరుద్దరణ లేదా కొత్త శాఖ తెరవడానికి అనుమతి సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి.
 • సకాలంలో సాయం చేయడానికి, శారీరక శిక్షకు సంబంధించిన జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్/డిప్యూటీ కమిషనర్ చేర్మైన్ షిప్ కింద జిల్లా స్థాయి కమిటీ ఒక జాబీతాను తయారు చేసుకోవాలి. దీనిలో వైద్యులు, కౌన్సెలర్లు, మానసిక నిపుణులు, న్యాయవాదులు, పిల్లలకు అవసరమైన నిపుణులు, హక్కుల/మహిళలు హక్కుల కార్యకర్తలు (ఉప-జిల్లా వారీగా) వివరాలను పొందుపరచాలి. కార్పోరల్ పనిష్మెంట్ సంబంధించిన సమస్యలపై ఇటువంటి జాబితాలో చేర్చిన నిపుణులకు జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు పునశ్చరణ నిర్వహించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కేటాయించాలి. కేసు ఆధారంగా వారికి పారితోషికం చెల్లింపు, అలాగే శిక్షణ/గుర్తింపు/చైతన్యపరచే సమావేశం/ప్రచారం/ప్రజా అవగాహన కార్యక్రమ ఖర్చులు పొందు పర్చాలి.
 • SDMs జిల్లా కలెక్టర్లు/మేజిస్ట్రేట్ (కార్పోరల్ పనిష్మెంట్ జిల్లా స్థాయి కమిటీ చైర్పర్సన్)కు డైరెక్టరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ సూచించిన ఫార్మేట్ లో ప్రతి 3 నెలల్లో తమ అధికార పరిధిలోని శారీరక దండన సందర్భాలలో పరిణామాలు గురించి సమాచారం అందించాలి.
 • జిల్లా కలెక్టర్లు/మేజిస్ట్రేట్ క్రమానుగతంగా, కనీసం 3 నెలల్లో ఒకసారి, జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లాలో శారీరక దండన యొక్క పరిస్థితిని అంచనా వేసేందుకు నిర్వహించాలి. తద్వారా నివారణా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 • పై మార్గదర్శకాలను విస్తృతంగా అందరికీ తెలియ చేయటం రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత పరిపాలన డైరెక్టర్ (స్కూల్ ఎడ్యుకేషన్) యొక్క బాధ్యత.
 • అన్ని ICSE, CBSE మరియు రాష్ట్ర బోర్డులు వాటి అనుబంధ పాఠశాలల్లో శారీరక దండన యొక్క సంఘటనలు సుయో మోటుగా తీసుకొని ఒక సహేతుకమైన సమయంలోపల ఆరా తీయాలి. స్కూల్ బోర్డ్ స్వతంత్ర విచారణ ప్రయోజనం కోసం (రాష్ట్రం వారీగా) ఒక బహుళ క్రమశిక్షణా మండలిని ఏర్పాటు చేయాలి. వారు శారీరక దండన ఫిర్యాదులు స్వీకరించి వేగంగా అలాంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకోవడానికి ఒక ఫిర్యాదుల పరిష్కార సెల్ ను ఏర్పాటు చేయాలి. ఈ సెల్లులు వాటి అనుబంధ పాఠశాలలు ఇటువంటి సంఘటనలు నివారించడం కోసం వ్యూహాలు కూడా చేయాలి. ఈ వ్యూహంలో భాగంగా ఎప్పటికప్పుడు శారీరక శిక్ష సమస్యలపై ఉపాధ్యాయులను చైతన్యపరచే కార్యక్రమాలు నిర్వహించాలని తమ అనుబంధ పాఠశాలలకు తెలియచేయాలి. ఈ సేల్లులు సమస్య పరిష్కరించడానికి బోర్డుకు సలహాలు కూడా ఇవ్వాలి.
 • స్కూల్ బోర్డ్ 'శారీరక దండన లేని వాతావరణం' ఏర్పరచటం వారి అనుబంధం/గుర్తింపు/NOC ఇవ్వడానికి ముఖ్యమని పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలి. అదే విధంగా వారు 'భౌతిక శిక్ష/మానసిక వేధింపుల పద్ధతి' కూడా అనుబంధం/గుర్తింపు/NOC ఉపసంహరణకు ఒక కారణమవవచ్చని తెలియచేయాలి.
 • స్కూల్ బోర్డ్ ఉచిత మరియు నిర్బంధ విద్య (RTE) చట్టం, 2009 మరియు నియమాలు మరియు మార్గదర్శకాలు తమ అనుబంధ పాఠశాలలకు జారీ చేయాలి. వారు సంవత్సరంలో ఒకసారి ఈ విషయాన్ని పరీక్షించాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (MHRD) మంత్రిత్వశాఖలోని స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసి డిపార్టుమెంట్ ఈ విషయంలో సంవత్సరానికి ఒకసారి NUEPA ద్వారా విశ్లేషించబడిన ఫలితాలను పొందాలి. ఈ ఫలితాలను NCPCRకు అందచేయాలి.

మూలం: బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు