অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖమ్మం

దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వున్న ఖమ్మం నగరం ఖమ్మం జిల్లాకు ప్రధాన కేంద్రం కూడా. ఇటీవలే చుట్టుపక్కల వున్న 14 గ్రామాలను విలీనం చేయడంతో నగరపాలక సంస్థగా ఈ నగరం రూపాంతరం చెందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు తూర్పున 273 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ నగరం తెలంగాణ సందర్శించే వారికి నచ్చే పర్యాటక స్థలం.

స్థానిక గాధల ప్రకారం స్థంభ శిఖరి లేదా స్తంభాద్రి అని పిలువబడిన నరసిమ్హాద్రి గుడి పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. విష్ణు మూర్తి అవతారం నరసింహ స్వామి దేవాలయం ఇది. సుమారు 1.6 మిలియన్ ఏళ్ళనాటి త్రేతా యుగం నుంచి ఈ నగరం ఉండేదని రుజువైంది. ఈ గుడి ఒక కొండ శిఖరం పై ఉ౦డగా కొండ క్రింద నిలువుగా వున్న రాయి స్థంభం లాగా పని చేసేది. ఈ స్థంభం లేదా ‘ఖంబా’ అనే పదం నుంచి ఈ ఊరి పేరు పుట్టింది. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాన్ని ‘కంబం మెట్టు’ అనేవారు, అదే క్రమేణా ఖమ్మం మెట్టు లేదా ఖమ్మం గా మారిపోయింది.

కృష్ణా నదికి ఉపనది అయిన మునేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగర౦ వుంది. చరిత్రలో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక, రాష్ట్రం మొత్తానికి చాలా ముఖ్యమైనది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్ల ఈ మిశ్రమ శైలి ఏర్పడింది.

ప్రాచీన కాలం నుంచి, ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది. ఖమ్మం ను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మం కు ప్రత్యేకత తీసుకు వచ్చింది. ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే, అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ.

ఖమ్మం లో పర్యటన

ఖమ్మం, భారతదేశం లోని లక్షలాదిమంది పర్యాటకులు ఆకర్షించే ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఖమ్మంలోను, చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణలు. ఈ ప్రాంతంలో పలైర్ సరస్సుతో పాటు పాపి కొండలు, వాయర్ సరస్సు ప్రధాన సందర్శనీయ స్థలాలు.

ఆహ్లాదకర వాతావరణం ఉండే శీతాకాలంలో ఖమ్మం సందర్శించడం ఉత్తమం. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఉత్తర ప్రాంత౦తో పోలిస్తే తక్కువ చలిని కలిగి ఉంటుంది. అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు. ఈ ప్రాంతంలో ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి, ఈ సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ మంచు స్థాయి పెరుగుతుంది.

ఖమ్మం నగరం రాష్ట్రంలోని అదేవిధంగా దేశంలోని ఇతర భాగాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఖమ్మంలో ఎటువంటి విమానాశ్రయం లేదు, రాజధాని నగరమైన హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం. అయితే, ఖమ్మం లో విమానాశ్రయం లేకపోవడం వల్ల రోడ్డు, రైలు మార్గాలు ఏర్పడ్డాయి. ఈ నగరం గుండా రెండు జాతీయ రహదారులు ఉండడం వల్ల రోడ్డు ప్రయాణం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, ఇతర నగరాల మధ్య అనేక బస్సులు నడుపుతుంది. ఇది హైదరాబాద్-విశాఖపట్టణం లైన్ లో ఉండడం వల్ల భారతదేశం అంతటి నుండి అనేక రైళ్ళు ఖమ్మం కి చేరుకుంటాయి.

జమలాపురం ఆలయం

జమలాపురం ఆలయం ఖమ్మ౦ ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు.

అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. హిందువులకు ఎంతో ప్రధానమైన ఆలయం కనీసం 1000 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్ధనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి అతి దగ్గరలో జాబాలి మహర్షి కి సంబంధించిన సూసి గుట్ట అనే కొండ ఉంది. ఈ మహర్షి ఇక్కడ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శన మిచ్చి ఆయనను దీవించారని భావిస్తారు.

ఖమ్మం కోట

ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట మరింత అభివృద్ది చెందింది.

హిందూ, ముస్లింల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ ఈ కోట, దీని నిర్మాణంలో ఇద్దరి శైలి, పాలకులు ప్రమేయం ప్రభావితం చేసింది. నేడు ఈ కోట ఉనికి 1000 సంవత్సరాలు పూర్తి చేసి గర్వంగా నిలబడి ఉంది. ఇది ఆంద్ర ప్రదేశ్ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోటను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడానికి ధన, శ్రమల కోర్చి అభివృద్ధికి కృషి చేసింది.

ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయం

ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయం ఖమ్మం నగరం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నగరం శివార్లలో ఉంది, దీనిని రోడ్డు ద్వారా తేలికగా చేరుకోవచ్చు.

ఈ ఆలయం ఖమ్మం నగరానికి అభిముఖంగా కొండపై నిర్మించ బడింది. ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఖ్యాతి పొందింది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా సంవత్సరం అన్ని రోజుల్లో ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఈ కారణంగా, అనేక మంది ప్రతి రోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఈ ఆలయంలోని నరసింహ స్వామి విగ్రహం విష్ణు మూర్తి అవతారం అంటారు. నరసింహస్వామి విగ్రహం సగం సింహం ఆకారంలో, సగం మనిషి శరీరంతో ఉన్నట్లు రూపొందించడం వల్ల భక్తులు ‘గొప్ప రక్షకుడు’ గా భావిస్తారు. ఈ కారణంగా, ఈ ఆలయంలో ఏర్పాటు చేయబడిన నరసింహస్వామిని పంచ నరసింహ మూర్తిగా పిలుస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న దేవుని విగ్రహం భక్తులను యోగ ముద్రలో ఆశీర్వదిస్తారు.

పాపి కొండలు

ఖమ్మంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు, ఆంధ్రప్రదేశ్ పర్వత శ్రేణుల్లో వుంది. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. పాపి కొండల పర్వత శ్రేణులు మెదక్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భాగంగా ఉండి, ఖమ్మం నగరానికి 124 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

తెలుగులో ‘విభజన’ అనే పదం నుంచి ఈ పర్వత శ్రేణులు ప్రారంభంలో పాపిడి కొండలు అని పిలువబడ్డాయి. ఈ విభజన వల్ల గోదావరి నదిని రూపొందించి ఈ పర్వతశ్రేణికి ఈ పేరు పెట్టారు. ఈ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేస్తే ఒక స్త్రీ తన జుట్టులో తీసే పాపిట ను పోలి వుండడం వల్ల ఈ శ్రేణులకు ఆ పేరు వచ్చిందని కొంతమంది నమ్మకం.

పాపి కొండల పర్వత శ్రేణులు మునివాటం అనే అందమైన జలపాతాలకు చాలా ప్రసిద్దమైనవి. ఇది తప్పనిసరిగా ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం కలిగిన గిరిజన ప్రాంతం. చాలామంది ప్రకృతితో మమేకం అవడానికి ఈ జలపాతాలు సందర్శిస్తారు. ఈ ప్రాంతంలోని గిరిజన వర్గాల ప్రజలు పర్యాటకులకు ఎటువంటి హాని కలగచేయకుండా, శాంతియుతంగా ఉంటారు.

పలైర్ సరస్సు

తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉన్న పలైర్ సరస్సు, భారతదేశం లోని అందమైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లాల్ బహదూర్ కాలువగా పిలువబడే ఈ కృత్రిమ సరస్సు వాస్తవానికి ఎడమ కాలువకి ఒక సమతుల్య రిజర్వాయర్ గా ఉంది, దీనిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఒక భాగంగా నిర్మించారు.

1748 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సరస్సు 2.5 టి ఎం సి ల నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలిగిఉంది. ఈ సరస్సు నీటిని నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, చేపల పెంపకానికి ప్రసిద్ధ ప్రదేశం.

జల క్రీడలు అలాగే సాహస చర్యలు అందించడం వల్ల ఈ పలైర్ సరస్సు ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ సరస్సు అనేక రకాల రొయ్యలను కలిగి ఉండి, మంచి నీటి చేపల సాగుకు మాత్రమె కాకుండా, పర్యాటకులకు పదార్ధాలను తయారుచేస్తుంది. పలైర్ సరస్సుకు చాలా దగ్గరలో ఉన్న వైరా సరస్సు మరొక మంచి విహార స్థలం. ఖమ్మం వచ్చే పర్యాటకులు వారి యాత్రలో ఎక్కువగా అన్ని ప్రదేశాలూ కలిసి ఉండేటట్లు చూసుకుంటారు.

భద్రాచలం

భారత దేశపు దక్షిణ భాగం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. ఈ పట్టణం హైదరాబాద్ నగరానికి సుమారు 309 కి. మీ.ల దూరం లో వుంటుంది. భారత దేశం లో ఇది ఈశాన్య భాగం మరియు గోదావరి నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దెస వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి పేరు చెపితే చాలు ఆంధ్రులకు భద్రాచలం గుర్తుకు వస్తుంది.

ఈ పట్టణానికి భద్రాచలం అనే పేరు భద్ర గిరి నుండి వచ్చింది. భద్ర అంటే ఒక వరం కారణంగా మేరు కు మేనకకు పుట్టిన బిడ్డ అని చెపుతారు. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు. లంక లో రావణుడిని వధించిన తర్వాత రాముడు చాలా కాలం పరిపాలన చేసాడు.

భద్రాచలం గురించిన ఇతిహాస గాధలు

భద్రాచలం ఒకప్పుడు దండకారణ్యం లో భాగం గా వుండేది. రాముడు తన వనవాసం సమయంలో సీతా మరియు లక్ష్మణుల తో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. వారు నివసించిన ప్రదేశం దేవాలయం నుండి సుమారు 32 కి. మీ. ల దూరం లో వుంటుంది. శ్రీరాముడు ఇక్కడ తన కుటుంబం కొరకు నివాసాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన గుడిసె నుండే రావణుడు సీత ని లంక కు అపహరించుకు పోయాడని చెపుతారు.

మరో కధ గా విష్ణు భక్తుడైన భద్రుడు ఒక రుషి. రాముడు అంటే తెగ ఇష్టపడతాడు. రాముడు లంక కు వెళ్ళే సమయం లో ఈ రుషి ని కలిసి ఆయన నుండి ఆతిధ్యం పొందేందుకు తాను మరల సీత తో తిరిగి వస్తానని చెపుతాడు. కాని ఆయన తిరిగి రాక పోవటం తో భద్రుడు అనే ఆ రుషి ఎంతో కాలం ఎదురు చూస్తాడు. తన భక్తుడు భద్రుడి ఎదురు తేన్నులకు మెచ్చిన విష్ణుమూర్తి, తానే రాముడి అవతారం లో , సీతా మరియు లక్ష్మణుడి తో కలసి దర్శనమిస్తాడు. ఈ సంఘటన రామ రాజ్యం బుగిసిన చాలా కాలానికి జరుగుతుంది. రాముడి భక్తుడైన భద్రుడి పేరుపై పట్టణం భద్రాచలం గా పిలువబడుతుంది.

మరో కధ గా శ్రీరాముడు పాకాల దమ్మక్క అనే మహిళకు కలలలో కనపడి, భద్రగిరి కొండల పై విగ్రహాలు కలవని చెప్పాడని, మరుసటి రోజు ఆమె ఆ కొండ పై కొన్ని విగ్రహాలను చూచిందని, వాటి తో ఆమె ఒక చిన్న దేవాలయం ఏర్పాటు చేసి ఆ విగ్రహాలని పూజించిందని, తర్వాతి కాలం లో ఆ ప్రదేశం భద్రాచలం గా పిలువబడుతూవే లాది భక్తుల చే పూజించాబడుతూ వారి పాపాలని నసింప చేస్తోందని చెపుతారు.

ప్రకృతి దృశ్యాల మధురానుభూతులు భద్రాచలం పర్యాటకులకు ఎన్నో సుందర దృశ్యాల అనుభవాలని కలిగిస్తుంది. ప్రధానంగా, ఇక్కడ జటాయు పక్క, పర్ణశాల, దుమ్ముగూడెం, గుణదల కలవు. రెండు ఖ్యాతి గాంచిన దేవాలయాలు అంటే శ్రీ సీతా రామచంద్ర స్వామి గుడి మరియు భద్రాచల రాముడి గుడి కలవు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. రోడ్డు లేదా రైలు మార్గాలలో భద్రాచలం తేలికగా చేరవచ్చు.

భద్రాచల రామ దేవాలయం

భద్రాచల రామ దేవాలయం లో రాముడు, సీతా దేవి విగ్రహాలే కాక ఆలయం లోని వివిధ ప్రదేశాలలో ఇంకా ఇతర దైవాలు అంటే, విష్ణు, నరసింహ, శివ మొదలైన దేముళ్ళ విగ్రహాలు కూడా వుంటాయి.

ఈ దేవాలయం భద్రాచలం టవున్ కు సుమారు 35 కి. మీ.ల దూరం లో వుంటుంది. రాముడి భక్తులు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యా లో ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శ్రీ రామ నవమి ఉత్సవాలు అతి వైభవం గా జరుగుతాయి. ఈ గుడి లో దసరా పండుగ అతి అట్టహాసంగా చేస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ దసరా ఉత్సవాలకు దెస వ్యాప్తంగా భక్తులు వచ్చి ఆనందిస్తారు. రావణుడి గడ్డి బొమ్మలను తగుల బేడతారు.

గుణదల

ఈ ప్రదేశం భద్రచలానికి సుమారు 5 కి. మీ. ల దూరం లోను, హైదరాబాద్ కు 258 కి. మీ. ల దూరం లోను కలదు. చల్లగా వుండే శీతాకాలం లో ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో హిందువుల ఆరాధ్య దైవాలయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడకు వచ్చి స్నానాలు ఆచరిస్తారని చెపుతారు. కనుక, ఈ ప్రదేశం హిందువులకు తప్పక దర్శించ దగినది.

ఇక్కడ కల వేడి నీటి బుగ్గలలో స్నానాలు చేస్తే, చాలా వ్యాధులు పోతాయని, మోక్షం కూడా వస్తుందని విశ్వసిస్తారు. గోదావరి నది ఒడ్డున అనేక వేడి నీటి బుగ్గలు కలవు. ఇవి దెస వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

జటాయు పాక

జటాయు పాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరం లో కల రెక్కపల్లి లో పడిందని చెపుతారు.

తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని చెపుతారు. ఈ ప్రదేశం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

పర్ణ శాల

పర్ణశాల భద్రాచలం నుండి 32 కి.మీ.లు కలదు. ఈ గ్రామం దుమ్ముగూడెం మండలమ్ కిందకు వస్తుంది. రోడ్ లేదా బోటు లో ఇక్కడకు చేరవచ్చు. తన 14 సంవత్సారాల వనవాస కాలం లో రాముడు తన భార్య సీతా మరియు సోదరుడు లక్ష్మణుడు తో కలిసి ఈ ప్రదేశం లో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక గుడిసె ని నిర్మించాడు.

ఈ ప్రదేశానికి సమీపంగా ఒక ప్రవాహం కలదు. సీతా మాత ఈ ప్రవాహం లో స్నానాలు చేసి తన దుస్తులు సుభ్ర పరుచుకున్న దని చెపుతారు. ఇప్పటికి ఇక్కడ కొన్ని ఆధారాలు చూపుతారు.

శ్రీ సీతా రామచంద్ర స్వామి టెంపుల్

ఈ దేవాలయం లో రాముడు, సీతా, మరియు లక్ష్మణుడు విగ్రహాలు వుంటాయి. పర్ణశాల నుండి 35 కి. మీ. ల దూరం లో భద్రాచలం టవున్ లో ఈ గుడి వుంటుంది. ఈ దేవాలయం రాముడు లంకకు వెళ్ళే సమయం లో నదిని దాటిన ప్రదేశం లో నిర్మించారు.

ఈ గుడి కి సంబంధిచిన మరో కధ గా రాముడి గొప్ప భక్తుడైన ముస్లిం కబీర్ దేవాలయం లోకి ప్రవేశం అనుమతించ బడ లేదని దానితో గుడి లోని విగ్రహాలు మాయం అయ్యాయని, కబీర్ గుడి లోనికి వచ్చిన తక్షణం విగ్రహాలు ప్రత్యక్ష మయ్యాయని కూడా చెపుతారు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం గ్రామం భద్రాచలానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం కాకర కాయ ఆకారం లో ఒక చిన్న ద్వీపం గా వుంటుంది. ఈ ప్రదేశం లో రాముడు ఖర , దూషణ అనబడే రాక్షసుల నేతృత్వం లో వచ్చిన సుమారు 14000 మందిరాక్ష సులను వధించాడని చెపుతారు.

ఈ గ్రామం వధించ బడిన రాక్షసుల బూడిద పై నిర్మించారని చెపుతారు. ఆ బూడిదనే తెలుగు లో దుమ్ము అని అంటారు. ఈ ప్రదేశ ప్రజలు రాముడి అవతారమైన ఆత్మా రాముడిని పూజిస్తారు. ఈ ద్వీపం ఒక బలమైన బ్రిడ్జి తో ప్రధాన భూభాగానికి కలుపబడింది. ఈ బ్రిడ్జి సుమారు 100 సంవత్సరాల నాటిది గా చెపుతారు. దీనిని బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు. బ్రిటిష్ వారు ఈ బ్రిడ్జి ని తమ రవాణా సదుపాయాలకు వినియోగించేవారు.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate