పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

2015 లో వచ్చిన గొప్ప డిస్కవరీలు

2015 సంవత్సరంలో వచ్చిన గొప్ప డిస్కవరీలు ఎంటో తెలుసుకుందాం.

dec7విశ్వం అనంతం. ఈ విశ్వం ఎలా ఆరంభమైంది. నాటి నుండి నేటికి అలాగే ఉందా? విశ్వ పరిణామం జరిగిందా? జరిగితే ఎలా జరిగింది? ఇలా ప్రశ్నలే ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటినీ ఛేదిస్తూ సైన్సు ముందుకు సాగుతోంది. ఈ 2015లో కూడా అనేక విశ్వ రహస్యాలు కనుగొన్నారు శాస్త్రజ్ఞులు. ఈ అనంత విశ్వంలో భూమికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఇప్పటివరకూ భూగ్రహం మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న దాఖలాలు లేవు. అందుకని భూమిని, భూమిని పోలిన వాతావరణం మరెక్కడా లేదా? ఉంటే అక్కడ కూడా జీవులు వుండి వుండవచ్చుకదా! ఏమో? ఉన్నా ఆశ్చర్యం ఏముంది? అయితే అది శాస్త్రీయంగా ఋజువు కావాలి. అప్పుడే మనం నమ్మగలం. గ్రహాంతర వాసుల గురించి కల్పిత కథలు విన్నాం. కానీ వాస్తవం ఏమిటి? ఈ రహస్యాలను బట్టబయలు చేయటానికి ‘బ్రేక్ త్రూ' (Break through) అనే ప్రణాళికతో ఒక బృహత్ పరిశోధన ప్రారంభించారు. రష్యాకు చెందిన శ్రీమంతుడు యూరీమిల్లర్ సుమారు 100 మిలియన్ డాలర్లు ఇందుకు సహాయం చేశాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తో సహా అనేకమంది హేమాహేమీలు ఈ అన్వేషణకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఈ ఏడాది మొదలైన ఈ 'బ్రేకతూ ఇనీషియేటివ్' ముందు ముందు ఏం చెబుతుందో చూద్దాం!

అంతరిక్ష రహస్యాలను పసిగట్టే కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఈ ఏడాది జూలైలో మన భూమికి కవలను కనుగొంది. ఇది మన భూగ్రహం కంటే చాలా పెద్ద సైజులో ఉంది. కాని ఇది భూమి కక్ష్యతో సమానంగా, ఒకే రకమైన నక్షత్రం (సూర్యుడిలా చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. విచిత్రం ఏమిటంటే సంవత్సర కాలం కూడా సమానమట. సూర్యుని వెలుతురు కూడా ఈ భూమి

సోదరిపై మనలాగే ఉండటం మరో విచిత్రం. దీనికి NASA వాళ్లు కెప్లర్-452b అని పేరు పెట్టారు.

ఈ కెప్లర్ టెలిస్కోపు మరో కొత్త నక్షత్రాన్ని (KIC8462852) అక్టోబర్ లో గుర్తించింది. ఇది అతి శీతల నక్షత్రమట. ఇదెందుకింత చల్లగా ఉందంటే ఇక్కడేవో చిత్రమైన నిర్మాణాలున్నాయట. వాటిని మనకంటే తెలివైన వాళ్లు నిర్మించి ఉండవచ్చుననుకుంటున్నారు. వీళ్లేనా గ్రహాంతర వాసులంటే? వీటి సంగతి నిగ్గు తేల్చటానికి ఖగోళశాస్త్రవేత్తలు రకరకాల పథకాలు వేస్తున్నారు.

dec8NASA శాస్త్రవేత్తలు అంగారక గ్రహం (Mars) మీద  నీరు ప్రవహించిన జాడలున్నాయని ఉవగ్రహ  ఛాయాచిత్రాలను బట్టి అంచనాకు వచ్చారు. వేసవిలో ఈ గ్రహపు లోయల్లో, గుంతల్లో నీరు పారినట్లుగా కన్పించింది. ఈ నీటి జాడలు ఒక విసనకర్రను లేదా గాలి పంకాను పోలి వున్నాయట. NASA న్యూహారైజాన్స్ జూలైలో ఫ్లూటో వ్యవస్థను చేరుకున్న సంగతి చెకుముకి రవ్వలకు తెలిసిందే! శాస్త్రవేత్త కనీసం ఊహించనైనా ఊహించని హిమ పర్వాతాలు ఫ్లూటో మీదున్నాయని కనుగొన్నారు. ఖగోళ రహస్యాలోకటొకటీ వెలుగు చూస్తుంటే మరోవైపు జీవపరిణామంపై కూడా ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చాయి. అందుకు ఉదాహరణ డయనోసార్లు అంతరించినా బతికి బట్టకట్టిన క్షీరదం. దీని పేరు కింబెటాప్సాలిస్ సిమ్మొన్సే (Kimbetopsalis Simmonsae) న్యూమెక్సికో లో లభించిన ఈ పాలిచ్చే జంతువు మొక్కలు తినే శాకాహారి. సరీసృపాలు (పాకే జంతువులు) అంతరించాక క్షీరదాలు పరిణామం చెందాయనటానికి ఇదొక నిదర్శనం.

కృత్రిమ పాంక్రియాస్ మానవ స్వరతంత్రుల వంటి ఎన్నెన్నో నూతన పరిణమాలు వైద్యరంగంలో 2015లో వచ్చాయి. మనిషి శరీరంలో అమర్చే కృత్రిమ పాంక్రియాస్తు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీంతో ముందు ముందు మధుమేహ వ్యాధి (Type 1)ని జయించవచ్చు మన స్వరపేటికలో ఉండే పొరలను మిమిక్ చేసే విధంగా మానవ కణాలనుండి కణజాలా డాక్టర్లు అభివృద్ధి చేశారు. దీనితో వాం వంటి రకరకాల కారణాలతో గొంత మూగబోయిన వారికి మాటలొచ్చే మంచిరోజులు రానున్నాయన్నమాట!

జీవవైవిధ్యానికి కేంద్రమైన మన హిమాలయాల్లో రెండు వందలకు పైగా నూతన జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 133 వృక్షజాతులైతే ఒక పక్షిజాతి, ఒక క్షీరదం ఉన్నట్లు తెలిసింది.

వాతావరణ మార్పు (Climate Change) తీసుకొచ్చే అనర్థాల గురించి శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో నెత్తిన నోరు పెట్టుకుని చెబుతున్నారు. అయినా ప్రపంచ అధినేతలకు చీమకుట్టినట్లుగా లేదు. హరిత వాయువులైన CO2, మిథేన్ లను నియంత్రించటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. క్లైమేట్ మార్పుతో వచ్చేది ప్రమాదం కాదు ఉపద్రవం.

ఆధారం: ప్రొ. కె. సత్యప్రసాద్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు