హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / 2Fe + O2→2FeO అనే చర్యలో మోత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు బదిలీ అయ్యాయి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

2Fe + O2→2FeO అనే చర్యలో మోత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు బదిలీ అయ్యాయి?

మొత్తం 4 ఎలక్ట్రాన్లు రెండు ఇనుమ పరమాణువుల నుండి బదిలి అయి రెండు ఆక్సీజన్ పరామాణువులను ఆక్సైడ్లుగా మార్చాయి.

ఎడమవైపు ఉన్న రెండు క్రియాజనకాలు (Reactants) మూలకాలు. మూలకాల ఆక్సీకరణ సంఖ్య సున్న (0). కుడివైపున ఉన్న ఫెర్రస్ ఆక్సైడ్ ఒ సంయోగ పదార్థం (Compound). ఇందులో ఇనుముఆక్సీజన్ రెండు కలిసి ఉన్నాయి. సాదారణంగా లోహాలు సంయోగ పదార్థాల్లో ధనా ఆక్సీకరణ ల్థితి (Positive Oxidation State)లోనూ, ఆక్సీజన్ ఋణ ఆక్సీకరణ స్థితిలోనూ ఉండాయి. ఒక్కో ఆక్సీజన్ పరమాణువు రెండు ఎలక్రాన్ లను తీసుకొని ఆక్సైడ్ రూపాన్ని తీసుకోవడం రివాజు. కుడి ప్రక్కన ఫెర్రస్ ఆక్సైడ్ మరో క్రియాజన్యం (product) లేదు. ఎడమ వైపు వున్న రెండు పరమాణువులు చెరి రెండు ఎలక్రాన్లను తీసుకొని ఫెర్రస్ ఆక్సైడ్ లో ఉన్నాయి. రెండు ఇనుమ పరిమాణువుల్లు ఖర్చయ్యాయి. కాబట్టి ప్రతి ఇనుమ పరమాణఉవు రెండేసి ఎలక్ట్రాన్ల చొప్పున చెరో ఆక్సీజన్ ని పంచినట్టు అర్థం. కాబట్టి మొత్తం 4 ఎలక్ట్రాన్లు రెండు ఇనుమ పరమాణువుల నుండి బదిలి అయి రెండు ఆక్సీజన్ పరామాణువులను ఆక్సైడ్లుగా మార్చాయి.

3.00362318841
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు