పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతరిక్ష పాఠశాల ఎడ్యుసాట్

ఎడ్యుసాట్ ఉపగ్రహం, జ్ఞీహరికోట ప్రయోగాల గురించి తెలుసుకుందాం.

sseoneపిల్లలూ! మీరు రోజూ బడికెళతారు. క్లాస్ రూంమ్ లో కూచుని మాస్టారు చెప్పే పాఠాలు వింటారు. మాస్టారి శక్తిని బట్టి మీ పాఠాలుంటాయి. మీ స్కూలు పరిస్థితిని బట్టి మీ కోర్సుకు అసరమైన ప్రయోగశాలలు, పరికరాలు, వుంటాయి. మీ అందరికీ ఒకే రకం స్కూళ్ళుండవు. ఈ రోజుల్లో ఎంతడబ్బు పెడితే అంత పెద్ద స్కూలులో చదువుకోవచ్చుగానీ ఎంతపెద్ద స్కూల్లోనైనా అన్నీ వుండటం అసాధ్యం. అన్నీ తెలిసిన, అన్నీ చెప్పగల టీచర్లుండటం మరీ అసాధ్యం.

మరోవైపు కాలం పరుగెడుతోంది. ప్రపంచం పల్లెటూరిలో చిన్నదైపోతొంది. బోలెడు సమాచారం ఎక్కడెక్కడిదీ పోగవుతోంది. సైన్సు శాఖోపసాఖలవుతోంది. కొత్త శాస్త్రాలు పుట్టు కొస్తున్నాయి. అరటిపండు వొలచి చేతిలో పెట్టినట్టు కావలసిన శాస్త్రాన్ని చెప్పడానికి ఆధునిక పద్ధతులున్నాయి. మరి ఇవన్నీ అందరికీ లభించేదెలా

ssetwoమన శ్రీహరికోటనుండి సెప్టెంబరు 20వ జి.యస్.యల్.వి. రాకెట్ ద్వారా ప్రయోగించిన ఎడ్యుసాట్ ఉపగ్రహం ఈ కొరతను తీర్చబోతోంది. మన దేశం చాలా పెద్దది. మన స్కూళ్ళు అరకొర వసతులతో తగిన టీచర్లు లేక సతమతమవుతున్నాయి. టీచర్లకు మంచి శిక్షణ లేదు. దీన్నుంచి బయట పడ్డానికి ఎడ్యుశాట్ అధ్యుతంగా పనికొస్తుంది.

అంతరిక్షంలో చదువులతల్లి లక్షల మంది పిల్లలిప్పుడు ఒకేకాలంలో ఒకే ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు వినొచ్చు. ప్రసంగాలు చూడొచ్చు. టీచరు స్టేషన్లో ఉంటారు. పాఠాలు ప్రసారమవుతూ ఉంటాయి. ఇందులో విచిత్రమేముంది. ? అని మీరనుకొవచ్చు. విచిత్రం వుంది. మనం టీచరుకు ప్రశ్నలు వెయ్యెచ్చు. అనుమానాలు తీర్చుకోవచ్చు. అచ్చం మన క్లాస్ రూంలో వున్నట్టే అనుభూతి పొందొచ్చు. ఇదీ విచిత్రం.

ఒకేసారి 74 ఛానెళ్ళు దీంట్లో ప్రారంభించుకోవచ్చు. అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని బాషల్లో పాఠాలు చెప్పుకోవచ్చు. ఒకేసారి కావల్సినన్ని సబ్జక్టులు ఎవరిక్కావల్సింది వాళ్ళు ఆయా ఛానెళ్ళలో నేర్చుకోవచ్చు. ఈ 74 ఛానెళ్ళు దూరవిద్యకోసమే.

ఒకేసారి 130 కి పైగా ట్రాన్స్ పాండర్ల సేవలు మనం పొందుతున్నాం. వీటిని మనం నడుపుతున్న చానెళ్ళన్నీ వినోదాలకు, సమాచారంకోసం తప్ప విద్యకోసం పెద్దగా వాడుకోవడంలేదు. ఎడ్యుశాట్ 11 ట్రాన్స్ పాండర్లు 74 ఛానెళ్ళు కేవలం విద్య కోసమే పనిచేస్తాయి.

ssethreeఈ ఉపగ్రహం అక్టోబరు 30 కల్లా ఉపయోగంలోకి వచ్చేస్తుంది. రాష్ట్రాలు తగిన ఏర్పాట్లు చేసుకొంటే ఆయా బాషల్లో ఇంట్లోకి పాఠాలు వచ్చేస్తాయి. అయితే మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రెండు మూడు రాష్ట్రాలు తప్ప మిగిలినవి దీనికి సిద్ధంకాలేదు. మంచి ప్రోగ్రాంలు సిద్దం చేయడానికి మంచి మాస్టార్లు కావాలి. మంచి ప్లానింగు జరగాలి. అప్పుడు మన విద్యారంగమే మారిపోతుంది. మీకందరికి ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేస్తుంది. ధనిక పేద తేడా లేకుండా అందరు పిల్లలకీ ఒకే రకమైన శాస్త్రీయమైన విద్య లభిస్తుంది. ప్రపంచంలో వేళ్ల మీద లెక్కబెట్టగల దేశాల పిల్లలకి మాత్రమే లభించే ఈ అవకాశాన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు మీకందిస్తున్నారు. ఇంతటి విజయం వెనక 30 ఏల్ళ కృషి వుంది.

ఇస్రో Indian Space Research Organisation 1975 లో ఆర్యభట్ట, 1979 భాస్కర ఉపగ్రహాలతో ప్రారంభించి ఒక్కో అడుగు ముందుకేసి SLV, ASLV, PSNV, GSNV రాకెట్లు దాకా మన అంతరిక్ష పరిశోధనాయానం సాగింది. టి.వి. బ్రాడ్ కాస్టింగ్, వాతావరణం, నీరు చమురు, ఖనిజాలు, అటవీ సంపదల అన్వేషణ - వినియోగం లాంటి అవసరాల్ని అధ్బుతంగా తీరుస్తూ ఈ రోజు కోట్లాది మంది పిల్లలకి అపురూపంగా విద్యనందించే స్థాయికి ఇస్రో ఎదిగింది.

ఇప్పుడు ఆకాశవీధికెగిరిన ఎడ్యుసాట్ బరువు 1925 కిలోలు. జీ.యస్.యల్.వి. రాకెట్ దీన్ని భూమికి 209 కి.మీ. దూరంలోకి పంపింది. ఈ రాకెట్ బరువు 414 టన్నులు. ఎత్తు 49 మీటర్లు మూడు దశల్లో మూడు రాకెట్లు ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షానికి మోసుకెళ్ళాయి. మొదటి దాంట్లో 139, రెండవ దాంట్లో 37, మూడవదాంట్లో 12 టన్నుల ద్రవ ఇంధనం ఇందుకోసం నింపారు.

సెప్టంబరు 19 రాత్రి 10 గం,,లనుడి శ్రీహరికోటలో కుంభవృష్ఠి కురవసాగింది. ఒకవైపు జీ.యస్.యల్.వి. కౌంట్ డౌన్ మొదలైంది. శాస్త్రవేత్తల గుండెల్లో ఒకే అలజడి. వాతావరణం కేంద్రాలతో సంప్రదించి సైన్సుపట్ల దృఢ విశ్వాసంతో నిర్ణీత సమయంలో రాకెట్ ని ప్రయోగించారు.

అపూర్వం ఆ దృశ్యం :

ssefourశ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం అంటే ఊరి ప్రజలందరికీ పండగ కింద లెక్క. వాళ్ళకది పెద్ద గర్వకారణం. అది విజయవంతం కావాలని వాళ్ళెంత ఆత్రుత పడతారో చెప్పలేము. సైన్సు పట్ల ఇంత అభిమానం సామాన్యప్రజానీకానికి కల్గించడం నిజంగా శాస్త్రజ్ఞుల విజయం. సెప్టంబరు 20 న శ్రీహరికోట ప్రజలంతా ఆకాశం వైపు చూపు పెట్టి గుండెల్ని బిగబట్టుకొని నిలుచున్నారు. షార్ కేంద్రంలో అయితే ఒకటే సందడి. అధికార్లు, ఔత్సాహికులు, అతిధులు ఒక్కరేమిటి గుంపులు గుంపులుగా చేరారు. అయితే పాస్ వున్న వారినే లోపలికి అనుమతించారు.

ఇస్రో చైర్మన్ కస్తూరిరంగన్, షార్, డైరెక్టరు నారాయణగార్ల పర్యవేక్షణలో సరిగ్గా సాయంత్రం, 4.01 గంటలకు మిరిమిట్లు గొలిపే కాంతుల్ని చిమ్ముకొంటూ నారింజ రంగు పొగలతో ఆకాశాన్ని కమ్మివేస్తూ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. శ్రీహరికోట ప్రజానీకం ఈ చిత్రాన్ని కళ్ళారా చూచి కేరింతలతో భూమ్యాకాశాలు ఒక్కటి చేశారు. రెండున్నర నిమిషాల తర్వాత 69 కి.మీ దాటాక రెండో మోటారు పేలింది. మూడు నిమిషాల వ్యవధిలో 209 కి.మీ. ఎత్తులో తనకు నిర్దేశించిన కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకుంది.

ఇప్పుడు చిన్నచిన్న రాకెట్లు పేల్చి ఉపగ్రహాన్ని సరైన స్థానంలో సరైన కోణంలో వుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకొన్నట్లు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు సంబర పడుతున్నారు.

అసలైన నివాళి:

ssefiveశ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికే కాదు భారతదేశ అంతరిక్షరంగానికే పితామహుడు సతీష్ ధావన్. ఆయన పేరే శ్రీహరి కోట రాకెట్ కేంద్రానికి పెట్టారు.

ప్రతి సెప్టంబర్ 25 న “సతీష్ దావన్ డే” గా ఆయన జయంతిని శ్రీహరికోట శాస్త్రవేత్తలు జరుపుకొంటున్నారు.

“ఎడ్యుశాట్” ఉపగ్రహం ఆయనికి నిజమైన నివాళి. ఎందుకంటారా, శ్రీహరికోట ఒకప్పుడు గిరిజనులు మాత్రమే ఉండే దీవి. వాళ్ళని దూరంగా పంపి రాకెట్ కేంద్రం నిర్మించారు. కానీ గిరిజనులైన ఆ యానాదులు ఎక్కడా ఉండలేక శ్రీహరి కోటకే వచ్చేశారు. సతీష్ ధావన్ దీన్ని గుర్తించి ఎంతో మానవతా హృదయంతో ప్రధాని ఇందిరా గాంధీని ఒప్పించి వారికక్కడే నివాసం కల్పించారు. వాళ్ల పిల్లలు చదువుకోవాలని ఆయన తపించారు. 1972 – 84 మధ్య ఫార్ చైర్మన్ గా ఒక్క రూపాయ వేతనం తీసుకొంటూ అహోరాత్రులు యస్.యల్.వి. ప్రయోగాలకు కృషి చేస్తూనే యానాదులకు చదువు చెప్పించాడు. దీని కోసం కూడా ఆయన అంతే మనసు పెట్టాడు.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆసేతు హిమాచల పర్యంతం ప్రతి బిడ్డ హృదయాన్ని తట్టి లేపే విద్యాబోధన జరిగేలా ఎడ్యుశాట్ నింగికెగిసింది. అంతకన్నా ఆయనకు కావలసిందేముంటుంది ?

3.02234636872
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు