హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయి ?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతున్నాయి ?

నక్షత్రాలు, గ్రహాలు పరస్పరం ఒకదానిచుట్టూ ఒకటి తిరుగుతూ ఏ ఆధారం లేకున్నా వాటిమీద పనిచేసే ఫలితబలం “సున్న” కావడం వల్ల ఏమీ కాకుండా స్థిరంగా ఉండగలుగుతున్నాయి.

solarsystemఈ ప్రశ్నే కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలామందికి తలెత్తింది. గ్రహాలను, నక్షత్రాలను భూమి చుట్టూ కొందరు దేవదూతలు త్రిప్పుతున్నట్టు భావించారు. త్రిప్పేది దేవదూతలు కాదని నేడు ఋజువయినా త్రిప్పేవారు మాత్రం చరిత్రలో మరుగు కాలేదు.

నక్షత్రాలు, గ్రహాలు యివన్నీ చలనంలో ఉన్నాయి. చలనంలో ఉన్న వస్తువుల మీద ఎన్నో రకాల బలాలు అంతరంగికంగానూ బాహ్యంగానూ పనిచేస్తుంటాయి. ఒక అంతరిక్ష వస్తువు మరో అంతరిక్ష వస్తువును ఢీకొనాలంటే ఆ రెండింటికీ మధ్య ఉన్న గురుత్వ బలం చాలు. అయితే ఆ వస్తువులు పరస్పరం ఒక దాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తున్నట్లయితే అదే వస్తువుల మీద వాటిని దగ్గరకు రానీయకుండా పట్టి ఉంటే అపకేంద్రబలం పనిచేస్తుంది. భూమి ఆకాశంతో ఆధారం లేకుండా వేరవడానికి కారణం అది ఎంతో వేగంగా సూర్యుని చుట్టూ పరిభ్రమించటమే! ఇలా అన్ని నక్షత్రాలు, గ్రహాలు పరస్పరం ఒకదానిచుట్టూ ఒకటి తిరుగుతూ ఏ ఆధారం లేకున్నా వాటిమీద పనిచేసే ఫలితబలం “సున్న” కావడం వల్ల ఏమీ కాకుండా స్థిరంగా ఉండగలుగుతున్నాయి.

ఇప్పుడు నీకో ప్రశ్న: ఒకవేళ గ్రహాలు, నక్షత్రాలు ఏదో ఒక ఆధారానికి నువు యింట్లో గోడమీద కొక్కేల హుక్కులకు నీ బట్టలు తగిలించుకొన్నట్లుగానే లేదా పైకప్పుకు సీలింగు ఫ్యాను వ్రేలాడుతున్నట్టు గానో, వ్రేలాడుతున్నాయనుకుందాం. మరి ఆ కొక్కేలు, ఆపై కప్పు ఏ ఆధారంతో స్థిరంగా ఉంటున్నాయో చెప్పగలవా?

ఉదా: ఓ శక్తివంతుడు అన్ని ఖగోళ వస్తువుల్ని పట్టుకొని పడిపోకుండా కాపాడుతున్నాడనుకుందాం. ఆ శక్తి వంతుడు ఏ ఆధారంతో నిలబడ్డాడో చెప్పగలవా?

ప్రశ్న అడిగినవారు: -కె. వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్, మహాలక్ష్మిపురం

3.0
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు