పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

ఈ అంతరిక్ష కేంద్రం భూమి పరిభ్రమించే లోపలి కక్ష్యతో (Low Earth Orbit) నిర్మించబడింది.

aa1అంతరిక్ష కేంద్రం భూమి పరిభ్రమించే లోపలి కక్ష్యతో (Low Earth Orbit) నిర్మించబడింది. ఎవరు నిర్మించారు. దీన్ని? భుకక్ష్యలో నుండే ఈ కేంద్రం కనిపిస్తుందా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు రావాలి ఎవరికైనా!

ఈ అంతరిక్ష కేంద్రం పలుదేశాల అంతరిక్ష స్ధానాల ప్రాజెక్టుల సమ్మిళతంగా ఏర్పడింది. సోవియట్, రష్యాప్రాజెక్టు మీర్-2 ఐరోపాదేశాల కొలంబస్ 2 జపానీయుల కోబో (Kibo) వంటి అనేక దేశాల అంతరిక్ష పరిశోధనా పధకాల ఫలితంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశాలతో పాటు కెనడియన్ అంతరిక్ష పరిశోధనా సంస్ధ కూడా భాగస్వామి ఈ ఐదు దేశాలు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ కేంద్రాన్ని నడుపుతాయి. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 278 నుండి 460 కి.మీ. ఎత్తులో (Altitude) ఉండి, సరాసరి గంటకు 27,743.8 కి.మీ వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది రోజుకు 15.7 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. దీన్ని నిర్మించడం, నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఏ దేశానికాదేశం స్వయంగానే ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చెయాలనుకున్నా అందరూ కలిసి పరస్పర సహకారం అవగాహనతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు దీనికి 35నుండి 160 బిలియన్ డాలర్ల ఖర్చుకాగలదని పేర్కోన్నారు.

aa2దీని నిర్మాణం 1998 లో ఆరంభమైంది. ఈ సం. ఆఖరుకు (2011) పూర్తిగా పనిచేసే స్ధితిలోకి రాగలదు. ఇది 2015 వరకు మరి ఎక్కువగా అయితే 2020 వరకు పని చేస్తుందని అంచనా. ఇప్పటివరకూ నిర్మించిన అంతరిక్ష కేంద్రాలన్నింటికంటే ఇది చాలా పెద్దది. భూమి చుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహలన్నింటికంటే కూడా ఇది ఎంతో పెద్దది,. అందువలన దీనిని భూమి మీది నుండి మనం తేలిగ్గా చూడవచ్చు.

1998 నుండి ఈ కేంద్ర నిర్మాణం ఒక రూపం తీసుకున్నా వాస్తవానికి ఇది 1994 లో రష్యా సంధించిన మీర్-2 (Mir - 2) అంతరిక్ష వాహకనౌకతో ఆరంభమైంది. దీని మొట్టమొదటి మడ్యుల్ (Module) జార్యా (zarya) ను రష్యా అంతరిక్షంలో ఏర్పాటు చేసింది. అటు తర్వాత పలు దఫాలుగా ఈ అంతరిక్ష కేంద్రానికి కావలసిన పరికరాలను అంతరిక్ష వాహక నౌకలు (Speech shuttle) చేరవేసినాయి. ఈ పనిలో ప్రధానపాత్ర పోషించిన చారిత్రాత్మక అంతరిక్ష నౌక “డిస్కవరీ”. ఈ నౌక అంతరిక్ష కేంద్రానికి కావలసిన ప్రధాన పరికరాలను మాత్రమేగాక అందులో పనిచేసే చాలకులను (crew) కూడా పలుమార్లు తీసుకెళ్ళింది. అమెరికా అంతరిక్ష కేంద్రం, నాసా (NASA-National Aeronautics and Space Administration) ఉపగ్రహాన్ని తన 100వ అంతరిక్ష ప్రయోగగంగా ‘డిస్కవరీ’ ద్వారా సంధించింది. దీని ద్వారా అంతరిక్ష కేంద్ర అసెంబ్లీ ని విజయవంతంగా నెరవేర్చింది. ఇలా అంతరిక్ష కేంద్రానికి కావలసిన వివిధ భాగాల పరికరాలను అమెరికా డిస్కవరీ ద్వారా చేరవేస్తే, రష్యా ప్రోటీన్, సూయజ్ రాకెట్ల సహాయంతో కేంద్ర నిర్వహణ సంభందమైన ఏర్పాట్లు రిపేర్లు వగైరా చేస్తున్నది.

aa2ఈ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు అస్ట్రోనాట్లు, కస్మోనాట్లు ఉండి దీన్ని నిర్వహస్తుంటారు. మొట్టమొదటి అంతరిక్ష సాహసయాత్ర (Expedition) చేపట్టిన అక్టోబర్ 31, 2000 సం. న ఇప్పటివరకూ ఈ అంతరిక్ష కేంద్రంలో నిరంతరం మనుషులు ఉంటూనే ఉన్నారు. నెలాఖరు నాటికి సుమారు 10 సంవత్సరాల 135రోజులు అంతరిక్ష కేంద్రంలో నిరాటంకంగా మనుషులు ఉండి వివిధ పనులు చేపడుతున్నారు. ఇంత దీర్ఘకాలం అంతరిక్షంలో మనుషుల మనుగడ కూడా ఒక రికార్డే. అంతరిక్ష కేంద్రంలో సుక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే ఇదో పరిశోధనాశాలగా పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసేవారు వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు. జీవశాస్త్రం, శారిరధర్మశాస్త్రం , భౌతికశాస్త్రం, ఆస్ట్రానమీ వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. ఈ అంతరిక్ష కేద్రం అంతరిక్ష వాహక వ్యవస్ధ (spacecraft system) లను పరీక్షించేందుకు తగిన వాతావరణాన్ని అందిస్తుంది. చంద్రుడు, మార్స్ (Mars) వంటి అనేక గ్రహాలకు క్షేమంగా ప్రయాణించి, మంచి ఫలితాలు సాధించాలంటే ముందుగ అంతరిక్ష వాహక వ్యవస్ధలను పరీక్షించి, పటిష్టం చేసుకోవటం ఎంతో అవసరం. ఇన్ని రకాల ప్రయోజనాలనాశించి ఏర్పరచిన ఈ అంతరిక్ష కేంద్రానికి కావలసిన శక్తిని ఎక్కణ్ణించి సంగ్రహిస్తారో తెలుసా? ఇంకెక్కణ్ణించి ? సూర్యుడి నుండి! అంటే సొరశక్తితో ఈ కేంద్రం పనిజేస్తుందన్నమాట. ఇది బాగా పనిచేసి ముందుముందు మానవాళి పురోగతికి సరికొత్త మార్గాలను కనిపెడుతుందని ఆశిద్దాం!

డిస్కవరీ ఇక సెలవ్! (లేదా) గుడ్ బై డిస్కవరీ!

డిస్కవరీ అంతరిక్ష వాహకనౌక (space shuttle) తన 27 ఎళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని మార్చి 9వ తేది ఉద్యయం 11గం. 57 ని.కు నాసా (NASA National Aeronautics and space Administration) కు చెందిన ఫ్లోరిడాలో ఉన్న కెన్నడి అంతరిక్ష కేంద్రం (Kenedy Space Center) లో దిగింది. భారత కాలమానం ప్రకారమైతే మర్చి9వ తేది రాత్రి 10గం. 27ని.కు  భూమిని చేరుకుంది. డిస్కవరీ నౌక 27 సం. ల్లో మొత్తం 39 సార్లు అంతరిక్షయానం చేసింది. ఈ క్రమంలో 5830 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. తన చివరి ప్రయాణాన్ని ఫిబ్రవరి 24న ప్రారంభించి మార్చి9తో ముగిచింది. డిస్కవరీ ప్రయాణించిన మొత్తం దూరం 148221675 మిలియన్ మైళ్లు ప్రపంచం ఇంత వరకూ ఏ అంతరిక్ష నౌక ప్రయాణించినంత దూరం తిరగడమే గాక పూర్తి స.కాలం అంటే 365 రోజులు అంతరిక్ష ప్రయాణం కొనసాగించింది.

డిస్కవరీ ఈ పేరెలా పెట్టారో తెలుసా? రెండు వ్రఖ్యాత నౌకాయానాలకు గుర్తుగా అనేకం నౌకలో వారు చేసిన గొప్ప సహసయత్రలకు గుర్తుగా డిస్కవరీ అనే పేరు పెట్టారు. మొదటిది హెన్రీ హడ్స్ న్ నాయకత్వాన 1610-1611వ సం.లో చేపట్టిన సహనయాత్ర. ఈ యత్రలోనే అట్లాంటి పసిఫిక్ మధ్య అగ్నేయమార్గాన్ని (North West passage) కనిపెట్టారు. రెండోది 1776-79 మధ్యకాలంలో జేమ్స్ కుక్ చేపట్టిన యాత్ర. హవాయి ద్వీపాలను ఈ సందర్భంలోనే కన్గోనతం జరిగింది. దీని వెనుక మరోకారణం కూడ లేకపోలేదు. అది ఆర్ఆర్ఎస్ డిస్కవరీ.   రాయల్ జియోగ్రాఫికల్ సొసైటి రాబర్ట్ ఫాల్కన్ స్కాట్, ఎర్నెస్ట్ షాకిల్టన్ 1901-1904 మధ్యకాలంలో చేపట్టిన పరిశోధనా నౌక ఇది. అంటార్కిటికా సాహసయాత్ర కూడ డిస్కవరి పేరు పెట్టడానికి మరోకారణం.

కెన్నడి అంతరిక్షకేంద్రానికి 1983 నవంబర్ లో ఈ నౌకను అందిస్తే దీనిని మొదటిసారి 1984 ఆగస్టు 30వ తేదిన అంతరిక్షంలోకి సంధించారు. డిస్కవరీ అనేక సమాచార ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశపెట్టటమే గాక, పరిశోధనలు చేపట్టేందుకు దోహదం చేసింది తొలి ప్రయాణంలోనే మూడు సమాచార ఉపగ్రహాలను తీసుకుపోయింది. ఇందులో ఒకటి LEASATF – 2. ఈ ప్రయాణంలో ఆరు రోజుల, 56 నిమిషాలు అంతరిక్షకేంద్రాన్ని లోపలి భూకక్ష్యలో ఏర్పాటు చేయటంలో డిస్కవరీ పాత్ర ఎంతో ఉంది. 1990 లో హబుల్ స్పేస్ టేలిస్కోఫ్ ను అమర్చటం డిస్కవరీ ప్రయాణంలో ఒమైలురాయి. ఈ టెలిస్కోప్ రెండు తరాల ఆస్ట్రానామో, అస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలకు అంతరిక్షదర్శినిగా పనిచేస్తున్నది.

డిస్కవరీ చాలకులు (crew) అంతర్జాతీయ అంతరిక్షకేంద్రపు భాగాలను అందించడంలో వాటిని అమర్చడంలో కీలక పాత్ర పోషించారు. చాలెంజర్ (1986), కొలబియా (2003) నౌకలు ప్రమాదానికి గురైనప్పటికీ డిస్కవరీ మరల అంతరిక్ష కార్యక్రమాన్ని తిరిగి పట్టాలేక్కిచింది. సూర్యుని ద్రువప్రాంతాల్లో లను పరిశోధించేందుకు ఉద్దేశించిన్ ఉలిసేస్ అనే అంతరిక్ష ఉపగ్రహాన్ని కూడ డిస్కవరీ ద్వారానే ప్రయోగించారు. భూమి ఉర్ద్వవాతావరణ పరిశోధనా ఉపగ్రహాని 1991 సెప్టెంబర్ లో ప్రయోగించడం మరో మైలురాయి. ప్రాజెక్టు మెర్క్యురిని మోసుకుపోయింది. డిస్కవరీనే. జాన్ గ్లెన్ తన 77 సం. వయసులో ఎస్.టి.ఎస్ – 9లో రెండవసారి 1998 అక్టోబర్ 29న అంతరిక్ష్యంలో విహరించాడు. ఇలా అంతరిక్ష్యంలో వెళ్ళిన అతిపెద్దవయసు వ్యోమగామిగా జాన్ గ్లెన్ చరిత్రకేక్కాడు. కాగా గ్లేన్ తో పాటు పయనించిన పెడ్రోడ్యూక్ అంతరిక్ష ప్రయాణం చేసిన మొదటి స్పెయిన్ దేశస్తుడు. అమెరికన్ అంతరిక్ష నౌకలో (ఎస్.టి.ఎస్-60) పయనించిన తొలి రష్యన్ సేర్గిక్రికలో. అలాగే 1985 లో తొలి సౌది అరెబియా దేశపు సమాచార ఉపగ్రహాన్ని డిస్కవరీ ద్వారా ప్రయోగించారు. వాతావరణ ప్రయోగశాల (అట్లాస్-2) ను 1993 లో పంపించారు.  సమాచార ప్రసార రంగంలో ఉన్నత స్ధాయి టెక్నాలజితో కూడిన ఉపగ్రహం ACTS న్ అదే సం. సెప్టెంబర్ లో  డిస్కవరీ అంతరిక్షంలో కి తీసుకుపోయింది. హబుల్ స్పెన్ టెలిస్కోప్  ను తిసుకోపోయి. అంతరిక్షకేంద్రంలో స్ధాపించడమే సైతం 1990లో చేపట్టి విజయవంతంగా చేసింది.

డిస్కవరీ ప్రయాణంలో కొన్ని ముఖ్యఘట్టాలు

ఉపగ్రహం

సంధించిన సం.తేది

అంతరిక్షంలో ఉన్నరోజు

వివరము

STS 41-D

1984 ఆగస్టు 30

6రోజుల 56 నిమిషాలు

రెండు సమాచార ఉపగ్రహాలతో డిస్కవరీ తోలిప్రయాణం.

STS 51-G

1985 జూన్ 17

 

సౌదిఅరేబియా సమాచార ఉపగ్రహం అంతరిక్షంలో కి

STS 48

1991 సెప్టెంబర్ 12

 

ఊర్ధ్వ వాతావరణ పరిశోధనా  ఉపగ్రహం

STS 31

 

 

హేబుల్ స్పెన్ టెలిస్కోవ్ ను సంధించడం

STS 51

1993 సెప్టెంబర్ 12 ఉపగ్రహ (ACTS)

(9రోజుల 20గం.)

ఉన్నత సమాచార టెక్నాటజి

STS 95

1998 అక్టోబర్ 29

8రోజుల 21 గంటలు

జాన్గ్లెన్, పెడ్రోడ్యూక్ అంతరిక్షంలో

STS 96

1999 మే 27

 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రపు సామాన్ల వెళ్ళినమోదటి ఉపగ్రహం

STS 103

1999 డిసెంబర్ 19

7రోజుల  23 గంటలు

హబుల్ స్పేస్ టెలిస్కోప్ సర్విస్ చేయడం

STS 92

2000 అక్టోబర్ 11

12రోజుల 21 గంటలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర పరికరాలను అమర్చటం ఇది నాసా 100వ ఉపగ్రహం

STS 105

201 ఆగస్టు 10

11రోజుల 21 గంటలు

అంతరిక్షకేంద్రపు చాలకుల్ని చేరవేయుట

STS 120

2007 అక్టోబర్ 23

13రోజుల 8గంటలు

హార్మోని మోడ్యుల్ ఏర్పాటు

STS 124

2008 మే 31

 

చాలకుల రోటేష్ (crew rotation)

STS 131

2010 ఎప్రియల్ 5

15రోజుల 2 గంటలు

లియోనార్డో బహుళార్దసాధక మోడ్యుల్ ఏర్పాటు

STS 133

2011 ఫిబ్రవరి 24

12రోజుల 19గంటలు

డిస్కవరి తుది పయనం పీడనంతో ఉన్న బహుళార్ద సాధక లాగిస్టర్ మోడ్యూల్ (PMM) అంతర్జాతీయ అంతరిక్ష కేం ద్రాన్ని రోబోనాట్ ల సప్లై

అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి కావలసిన వాటిని సప్లైచేయటం, అమర్చటం, అంతరిక్ష శాస్త్రవేత్తలను చేరవేయటం వంటి ఎన్నో కీలకమైన పనులను డిస్కవరీ నిర్వహించింది. ఈ కేంద్రాన్ని నడిపించే శాస్త్రజ్ఞాలను మార్చే ప్రక్రియను కూడ డిస్కవరీ చేపట్టింది. కేవలం రొటేట్ చేయటమే కాదు అత్యాధునిక మద్యుల్స్ ను అంతరిక్షకేంద్రంలో ఏర్పాటు చేసింది. ఇందులో పెర్కొనదిగింది. హర్మొనీ మోడ్యుల్ వివిధ సందర్భాల్లో డిస్కవరీ సంబంధించిన అంతరిక్ష ఉపగ్రహాలు అది ఎన్నిరోజులు అంతరిక్షంలో ఉన్నది పట్టికలో చూడవచ్చు.

డిస్కవరీ తన 27ఏళ్ల ప్రస్ధానం లో చిట్టచివర మజిలి (39వది) ఫిబ్రవరి 24న ఆరంభించి మార్చి 9 తో ముగించింది. ఈ దఫా ఆరుగురు వ్యోమగాములను తీసుకుపోయి దీనిలో పిడనంతో కూడిన బహుళార్దసాధక మోడ్యూల్ (Pressurized Multipurpose) ను విడి భాగాలు అంతరిక్షకేంద్రపు భాగాలు ఉన్నాయి. వ్యోమగాముల్లో స్టీన్ బోవెన్ ఆరవసారి అంతరిక్షంలో  నడువగా  ఆల్విన్ డ్రుకు మాత్రం తొలి అనుభవం ఆల్విన్ డ్రు అంతరిక్షంలో నడచిన మానవుల్లో 200వ వాడు. దీని వారు ఫిబ్రవరి 28 న 11గంటల 29నిమిషాల (భారత కాలమానం ప్రకారం రాత్రి 9గంటల 59 నిమిషాల కు చేశారు. వీరిద్దరూ బహుళార్ధసాధక మాడ్యుల్ కు అవసరమైన విధ్యత్ కేబుల్ యునిటినోడ్ తో కలిపి పనికిరాని పంప్ మాడ్యుల్ ను తీసివేశారు. అక్కడ ఒక సిలిండర్ ను కూడా వెనక్కు తీసుకోచ్చారు. డిస్కవరి మిషన్ స్పెషలిస్టులు నికోలస్ స్కోట్ కల్లి అంతరిక్ష కేంద్రంలో వివిధ కార్యక్రమాలను సమస్వయం చేస్తే మైక్ బర్రాట్ మాత్రం రోబోటిక్ అర్మోని పర్యవేక్షిస్తూ స్టీన్ బోవెన్, ఆల్విన్ డ్రులు అంతరిక్షంలో నడవటాన్ని సుగమం చేశారు.

ఇంతటి చారిత్రాత్మక పాత్ర నిర్వహించిన డిస్కవరీ ఎం చేస్తారు? ఇప్పుడు దాన్ని ప్రజలు చూడటం కోసం స్మిత్ సోనియన్ అంతరిక్ష సంస్ధకు చెందిన మ్యూజియంలో ఉంచుతారు. మ్యూజియంలో ఉన్నాకూడా డిస్కవరీ ఎంతో మేలు చేస్తుందండోయ్! అంతరిక్షంలో పయనించే వాహకనౌకలను మున్ముందు తయారుచేయటంలో కర్గొను మోసుకుపోవటంలో తీసుకోవాల్సిన ఎన్నో మెళుకువలను దీన్నుండి గ్రహించవచ్చు. దీని ప్రోఫల్షన్ సిస్టమ్ అధ్యయనానికి ఆసక్తికరామైనది. భుకక్ష్యను దాటి వెలుపలకు వ్యోమ నౌకలను పంపటంలో డిస్కవరీ నుండి ఎన్నో పాటాలు నేర్చుకోవచ్చు. అందువల్లనే  డిస్కవరీ ఎంతో విశిష్టమైనది.

ఆధారం: వంగల విష్ణువర్ధన్

2.99307958478
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు