హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సముతలన పర్యాటక సంవత్సరం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సముతలన పర్యాటక సంవత్సరం

మన దేశ టూరిజం గురించి, వాటి లక్ష్యాల గురించి తెలుసుకుందాం.

ప్రియమైన చెకుముకి నేస్తాలూ, మీకందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ప్రతి సంవత్సరాన్ని అంతర్జాతీయ పరిధిలో ఐక్యరాజ్యసమితి ఏదో ఒక విధానానికి అనుగుణంగా ప్రకటిస్తుంది కదా! మరి 2017 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సముతలన పర్యాటక సంవత్సరం (The International Year of Sustainable Tourism for Development 2017) గా ప్రకటించింది. మరి ఆ వివరాలను సంక్షిప్తంగా మీకు తెలియజేస్తున్నాము.

ప్రపంచంలో ప్రతి ఒకరు తమ నివాస ప్రాంతానికే జీవితాంతం పరిమితం కాలేరు. బోరు కొడ్తుంది. అడపాదడపా ఇతర ప్రాంతాలను, అక్కడి వింతలను, విడ్డూరాలను, చారిత్రక కట్టడాల్ని, ప్రకృతి అందాల్ని అద్భుతమైన కొండలు, లోయలు, గుహల్ని, నదులు, సరసుల్ని, వాతావరణాన్ని, మంచును చూడాలని అనిపి స్తుంది. ఆముష్మిక చింతన ఉన్నవాళ్ళ విహారయాత్రతో పాటు తీర్థయాత్రలు కూడా చేయాలని వివిధ ప్రాంతాలలో ఉన్న దేవాలయాలను, ప్రార్థనా మందిరాలను, మత పరమైన కట్టడాల్ని చూడాలనుకొంటారు. మీలాంటి విద్యార్థులు చారిత్రక నిర్మాణాలు, ప్రకృతి సహజ వింతలతో పాటు ఆయన ప్రాంతాల్లో ఉన్న సైన్సు మ్యూజియంలను, నక్షత్ర శాలలను, పరిశ్రమలను, పరిశోధనాలయాలను, విద్యాలయాలను కూడా చూడాలనుకొంటారు. కొందరికేమో అండర్ గ్రౌండ్ లో వెళ్లే మెట్రోరైలు ఒకసారయినా ఎక్కాలని మోజు, మరికొందరికి మంచు దిబ్బలమీద జారాలని ఉంటుంది. ఇంకొందరికి స్టీమరు ప్రయాణం చేయాలని సముద్ర తీరాలలో అలలలో అలవోకగా ఆడుకోవాలని ఇష్టం.

ప్రతి దేశానికి వివిధ శాఖలతో పాటు పర్యాటక శాఖ కూడా ఉంటుంది. ఏవో కొన్ని వింతలు, విడరాలు లేని దేశం ఏదీ ఉండదు. అందుకే పర్యాటకులు, సందర్శకుల ద్వారా వచ్చే ఆదాయం కూడా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని దేశాలనైతే పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. మన భారతదేశానికి ప్రపంచంలో అన్ని ప్రాంతాల వాళ్లు వస్తుంటారు. అన్ని దేశాలలోను అన్ని రకాల వింతలు విడ్డూరాలు లేకపోవచ్చునేమో గానీ మనదేశంలో అన్ని విధాలయిన వింతలు, విడ్డూరాలు చారిత్రక కట్టడాలున్నాయి. సముద్ర తీరం, నదులు, మంచుకొండలు, ఎడారులు, అడవులు, పర్వతశ్రేణులు, సరస్సులు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు, జైన దేవాలయాలు, బౌద్ధాలయాలు, నక్షత్రశాలలు, లోయలు మొదలయిన వెన్నో ఉన్నాయి. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటయిన తాజ్మహల్ ఉంది. ప్రపంచ పర్యాటక రంగంలో భారతదేశానికి గణనీయమైన ప్రాధాన్యత ఉంది. మరొక సందేహం. అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం (International Year of Tourism) అని సింపుల్ గా అనకుండా సుదీర్ఘంగా 'అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సమతులన పర్యాటక సంవత్సరం’ అంటూ ఇందుకు సాగదీసినట్లు? దానికి కారణం ఉంది.

పర్యాటకం పేరుతో ఆయా పర్యాటక ప్రాంతాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అక్కడ పర్యావరణాన్ని నాశనం చేయడం గమనించాము. పేట్రేగి పోయేలా వినిమయ సంస్కృతి, దుబారా, ప్లాస్టిక్ వ్యర్థాల పారవేత, తొక్కిసలాట, నదుల కలుషితం, వన్యమృగాల పట్ల విశృంఖలత, అక్రమాలు, ట్రాఫిక్ సమస్యలు పర్యాటక ప్రాంతాల్లో మామూలయిపోయింది. అలాంటి విశృంఖల అనియంత్రత పర్యాటకం తాత్కాలికంగా ఆర్థిక వనరులాగా కనిపించినా కాలక్రమేణా అలాంటి చర్యలు ఆయా ప్రాంతాలకు నష్టాన్ని కలిగించకమానవు. కొన్ని సార్లు ఆ ప్రాంతాలు తమ పర్యాటక విశిష్టతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ ప్రపంచ పర్యాటక సంస్థ United Nations World Tourism Organisation - UNWTO), అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (United Nations Educational, Scientific and Cultural Organisation - UNESCO) సంయుక్తంగా చర్చించుకుని డిసెంబర్ 5, 2016 తేదీన 2017 సంవత్సరాన్ని అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సమతులన పర్యాటక సంవత్సరంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన లోగో పోటీలలో బొమ్మలో చూపిన లోగో గెలుపొందింది. విత్తన వ్యాప్తిలో ఇలాంటి పుష్పాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయని, అందరూ అన్ని చోట్లకు వెళ్లాలని సూచించే బొమ్మ అది.

పైగా సమతులనంగా పర్యాటక విధానం ఉండాలన్నది దాని విధానం. పర్యాటకం ప్రపంచాభివృద్ధికి సహకరించాలని కూడా అందులోని ఒక ఆశయం. ప్రపంచం కూడా గుండ్రంగా ఉందని అందులోనే వివిధ ఖండాలు, దేశాలు, ప్రాంతాలు సాంస్కృతిక వైవిధ్యం ఉన్నాయని కూడా అది సూచిస్తుంది. అయినా మానవులంతా ఒకే పుష్పపు భాగాలని కూడా అర్థం స్ఫూరిస్తుంది. అంతర్జాతీయ అభివృద్ధి ప్రోత్సాహక సముతలన పర్యాటక సంవత్సరపు గమ్యాలు ఆశయాలు ప్రధానంగా ఇవి.

  1. సర్వసమ్మత సంతులనార్థికాభివృద్ధి (Inclusive and sustainable economic growth)
  2. సామాజిక సార్వత్రికత, ఉపాధి కల్పన, పేదరికం నిర్మూలన (Social inclusiveness, employment, and poverty reduction)
  3. పర్యాటక వనరుల సామర్థ్యం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ నియంత్రణ (Part 1 environmental protection and climate change)
  4. సాంస్కృతిక విలువలు, వైవిధ్యం, భారత వారసత్వం (Cultural value diversity heritage)
  5. పరస్పర అవగాహన, శాంతి, సర్వ (Mass understanding, Peace and security)

ప్రపంచ వ్యాప్తంగా సగట జిడిపిలో 10 శాపం వరకు ఉన్న పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ దేశానికి ఎక్కువ పర్యాటకులు వచ్చేలా కృషి చేద్దాం. మనదేశపు ఔదార్య గుణమైన అతిధి దేవోభవ నినాదాన్ని నిజం చేయడమే కాకుండా సంకల పర్యాటక రంగంగా ప్రయోజనం పొందగలిగిన దేశాన్ని కృషి చేద్దాం.

ఆధారం: ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య

3.01339285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు