పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అడగండి చెబుతాం

జవాబులు అడిగి తెలుసుకుందాం .

గత సంవత్సరం చెకుముకి టేలెంట్ పరీక్షలో (Chekumuki Talent Test) మండల స్ధాయి ప్రశ్నాపత్రంలో వివరణ అవసరమయిన ప్రశ్నలకు జవాబులు యిస్తున్నాను.

ప్రశ్న: 999999/999 ? విలువ ఎంత?

జవాబు: మనం అలవాటు ప్రకారం క్రింద ఉన్న 3తోమ్ముదులలో పైన ఉన్న మూడు తోమ్ముడులను క్యాన్సిల్ చేసి సమాధానం 999 అని తొందరపాటుగా తప్పుచేసే ప్రమాదం ఉంది. ఇక్కడ సమాధానం 1001 అవుతుంది. మామూలు భాగహార పద్ధతిలాగా వ్రాసి ఋజువు చేసుకోగలము. లేదా మొదట లవాన్ని (numrator) హారాన్ని (denominator) 9 తో క్యాన్సిల్ చేస్తే 999999/999 = 1111111/111 వస్తుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 3తో నిశ్మేషంగా భాగించగలం కాబట్టి పైన అంకెల మొత్తం 6క్రింద 3 కాబట్టి సంఖ్య 111 సంఖ్య 3చేత భాగించబడాలి. కాబట్టి ఆ తర్వాత 3 చేత క్యాన్సిల్ చేయొచ్చు.

999)999999(1001

999

--------

999

--------

0

---------

111111/111=37037/37=1001 అవుతుంది.

ప్రశ్న: పంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్ లో ఏమి జరుగుతుంది?

జవాబు: వంట కార్యక్రమం శాస్త్రియంగా చెప్పాలంటే పెద్ద అనువుల్ని జలవిశ్లేషణ (Hydrolysis) ద్వారా చిన్న అనువులుగా మార్చడమే! ఆ పెద్ద అణువులే ప్రోటీన్లు కార్బోహైడ్రేటు. ముఖ్యంగా అవి అలాగే పెద్దగానే ఉనట్లయితే మన జీర్ణ వ్యవస్ధ వాటిని జీర్ణంచేయలేదు.

పిండి పదార్ధాల్లో ఎన్నో మోనో శాకరైడ్ లు C-O-C సంధానాలతో ఉంటాయి. ఇక్కడ ఎడమ వైపు ‘C’ ఎడమవైపు మోనోశాకరైడ్ (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) లోనిది. కుడి వైపున్న C పరమాణుపు కుడివైవున్న మోనోశాకరైడుది. ఈ రెంటిని కలిపిన ఆక్సిజన్ ను ‘ఈధర్’ సంధానంలో ఉందంటాము. ఇలాంటి C-O-C లింకులు మనం తినే గోధుమ, సజ్జ, బియ్యం, దుంపల్లో వందలాదిగా ఉంటాయి. దీనికి నీటిని (HOH)కలిపినప్పుడు C-O-C + H-O-H C-O.H+ H-O-C అనే విధంగా లింకు తెగిపోతుంది. తెగిన లింకులకు నీటి అణువులోని OH భాగం ఒక లింకుకు H భాగం మరో లింకుకు జట కావడాన్ని గమనించండి.అందువల్లే ఈ చర్యను జలవిశ్లేషణం అంటాము. మారి ఏదైనా రసాయనిక చర్యలలో పాల్గొనే పదార్ధాలకు తగినంత శక్తి ఉండాలి. ఈ శక్తినే ఉత్తేజశక్తి (Activation Energy) అంటాము. చర్యలో పాల్గొనే పదార్ధాలకు (వీటినే క్రియాజనకాలు (reactants) అంటాము. ఉత్తేజశక్తి ఉంటేనే అవి చర్యలో పాల్గొని ఉత్పన్నాలు (products) గా మారగలవు . ఒక ప్రమాణ కాలం(unit time) లో ఎన్ని అణువులు రసాయనిక చర్యలో పాల్గొన్నాయన్న విషయం ఆ చర్యలో పాల్గొనే అనువుల్లో ఎన్నింటికి ఉత్తేజశక్తి ఉందన్న వాస్తవం మీద అధారపడుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్ది ఉత్తేజశక్తి ఉన్న అణువుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రత వద్ద అధిక వేగంతో రసాయనిక చర్యలు జరుగుతాయి. అయితే మనం వంటచేసేటపుడు పిండి పదార్ధాల్లోని C-O-C లింకు తొందరగా తెగి చ-OH+H-O-C గా విడి పోవాలన్నా ప్రోటిన్లలోని A-CO-NH-B+HOH -----A-COOH+B NH2 గా విదిపోవాలన్నా ఉష్ణోగ్రత 100౦ C కన్నా ఎక్కువ అవసరం కావచ్చును. మామూలు వాతావరణ పీడనం దగ్గర వంట పదార్ధాలలో కలిసిన నీటి ఆవిరయ్యే ఉష్ణోగ్రత కూడా 100౦ C కాబట్టి కార్బోహైడ్రేలు ప్రోటీన్లు ఆశించినంత వేగంగా చర్య జరగక ముందే నీరంతా ఆవిరయ్యే ప్రమాదం ఉంది. అయితే క్లాసియస్, క్లాఫిరన్ సూత్రం ప్రకారం అధిక పిడనంలో ఒక ద్రవపు ఆవిరయ్యే ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు అధిక పీడనం 100౦ C దగ్గర కాకుండా 120౦ C దగ్గర లేదా ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర అవిరవుతుంది. తద్వారా రెండు ప్రయోజనాలు మన సాధిస్తాము. ఒకటి నీరు ఆవిరి కాకుండా ఉండడం వల్ల పదార్ధాలకు ద్రావణి (Solvent) గా నీరు ఉపకరిస్తుంది. రెండు ఉష్ణోగ్రట పెరగడం వల్ల పదార్ధాల్లో ఎక్కువ అనువులకు ఉత్తేజశక్తి లభించడం వల్ల చర్య తొందరగా జరుగుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడినపుడు ఏకకాలంలో పై రెండు ప్రయోజనాలు ఒనగూరుతాయి.

ప్రశ్న: బాణసంచా తయారీలో మెరుపులు వచ్చేందుకు ఉపయోగించే లోహం ఏమిటి ?

జవాబు: సాధారణంగా మేగ్నిషియుం లోహపురజను పేలుడు పదార్ధాలతో పాటు కలిపినపుడు తెల్లని, కాంతివంతమైన మెరుపులు పెలుతున్నపుడు అధిక ఉష్ణం వెలువడుతుంది. ఆ వేడికి ఉత్తేజం అయిన మెగ్నీషియం పరమాణువులు ఆక్సిజన్ లు కలిసి MgO మారే.

3.00636942675
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు