పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అడగండి చెబుదాం

జవాబులు అడిగి తెల్సుకుందాం.

ప్రశ్న: శ్మశాన వాటికలో అపుడపుడు మంటలు వస్తుంటాయి. ఎందువల్ల?

జవాబు: మానవ శరీరంలో అనేక మూలకాలతో (Elements వివిధ జీవ రసాయనిక) పదార్ధాల (Biochemicals) లో ఇమిడి ఉన్నాయి. మనిషి మరణించాక పాతి పెట్టినపుడు భూమిలో ఉన్న వేడికి చాలా మటుకు పదార్ధాలు నిర్వాత రసాయనిక చర్యలు (annaerobic recations) చెందినపుడు ఆ మూలకాల రసాయనిక లక్షణాలు మారుతాయి. అంటే అవే జీవరసాయనిక చర్యలు ఆగిపోయి నిర్జీవ సాధారణ రసాయనిక పదార్ధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి DNA లోను ఎముక మజ్జ (bone marrow) లోనూ, మొత్తటి ఎముక లేదా మృదులాస్తీ (Catrilege) వంటి భాగాల్లోను ఉన్న భాస్వరం (Phosphorus) విడిపోయి గాలిలో ఉన్న ఆక్సిజన్ లో కలిసి ఫాస్పరన్ పెంటాక్సైడ్ (P2O5) గా మారే కర్మంలో అత్యధిక మోతాదులో ఉష్ణం వెలువడుతుంది. ఎందుకంటే 2P+5/2 --- P2O5 అనేచర్య ఉష్ణోమోచక చర్య (Exothermic reaction). ఈ ఉష్ణనికి అక్కడే ఉన్న ఎండు మొక్కలు అకులలుములు, తదితర రసాయనాలు మండుతాయి. అందువల్ల అక్కడ మనకు వెలుగు వస్తుంది. అంతే గాని స్మశానంలో కొరివి దెయ్యాలంటూ ఏమి లేవు. వాస్తు అనేది శాస్త్రమే కాదు కాబట్టి అది సమాధానం కాదు. క్షుద్రపుజలంటూ మోసగాళ్ళు చేస్తారు. వాటిలో మహిమలు ఏమీలేవు. ప్రభావాలు గాలిలో మండడం వల్ల మాత్రమే అపుడపుడు స్వశానంలో మంటలు వస్తుంటాయి. ఈ రసాయనిక చర్మను ఉపయోగించే పల్లెటూళ్ళలో కొందరు మోసగాళ్ళు గడ్డివాముల్లో పురిగుదిసేలు, పకప్పులో నీటిలో తడిసిన భాస్వరాన్ని నిల్వఉంచుతారు. నీటిలో పాస్సరస్కు చర్యలేదు. పైగా భాస్వరాన్ని నిల్వుంచేది కూడా నితిలోనే. ఆ తడి కాస్త ఆరిపోయాక అపుడది గాలిలో పైన చెప్పిన చర్య ద్వారా మండుతుంది. ఆ మంటతో పాటు గడ్డివాములు మండతాయి. పురిగుడేసేలు దగ్ధమవుతాయి. అపుడు ఆ మోసగాళ్ళు గ్రామంలో దయ్యాలు పడ్డట్టు ప్రచారం చేస్తారు. ఆ దెయ్యాలు పోవాలంటే మంత్రాలు అవసరమని డబ్బులు గుంజి లాభపడైరు. ఇలాంటి మోసగాళ్ళు అట మీరే కట్టించాలి.

ప్రశ్న: 26+26+26+26 విలువ ఎంత ?

జవాబు: మనం తొందరపడి ఏ పని చేయకూడదు. అలోచించి, నెమ్మదిగా సైన్సు సూత్రాల్ని దృషిలోకి తెచ్చుకొని సమధానాలు వ్రాయాలి. పరీక్షలు కూడా తొందర్లో వస్తూన్నాయి.కాబట్టి మీరు ఆచితూచి సమాధానం యివ్వండి. ప్రశ్నా పత్రాన్ని ముందు ఎ మాత్రం కంగారు పడకుండా చదవండి. పై ప్రశ్నను చూసిన వెంటనే అన్ని ఘాతాలను కుడి 224 అని వ్రాయాలానిపిస్తుంది అదే 26+26+26+26 అయి ఉంటె సమాధానం 224 కరక్టే అయి ఉండేది. కానీ ఇక్కడ గుణకారం (Multiplication) లేదు కదా! కేవలం కుడికే ఉంది. కాబట్టి 26+26+26+26 ను 26 (1+1+1+1)గా వ్రాసుకోవచ్చును. కుండలీకరణాల (Brackets) లో ఉన్న దాని విలువ 4 కాబట్టి 26 (1+1+1+1)= 26*4=26*22= 28 అవుతుంది.

ప్రశ్న: చెట్టు కొమ్మల్ని కదిల్చినపుడు దానికున్న పళ్ళు రాలడంలో దాగి ఉన్న శాస్త్రీయ దృగ్విషయం ఏమిటి?

జవాబు: అంత వరకు చెట్టు కున్న పళ్ళు నిశ్చలస్దితి (Stationary state) లో ఉన్నాయి. న్యూటన్ మొదటి సూత్రం ప్రకారం ఒక వస్తువు నిశ్చలస్దితిలో ఉంటే అది అలాగే ఉండడానికి ప్రయత్నిస్తుంది. బలప్రయోగంతో మాత్రమే అది కదుల్తుంది. ఇలాంటి స్ధితిని నిస్చాలజడస్ధితి (Static inertia) అంటారు. ఇలాంటి స్ధితిలో మనం ఊపినపుడు మొక్క శాఖ (branch) ఉగుతుంది. కానీ దానికి అంటుకొని ఉన్న పండు/కాయ అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తుంది గానీ శాఖతో పాటు కదలదు. అంటే పండు లేదా కాయ కాడ (Stalk) మీద లాగే బలం పరోక్షంగా పడ్డట్టే కదా! అంటే కాయను చెట్టునుంచి తున్చేసినట్టువుతుంది. అందుకే కాయ కింద పడుతుంది.

ప్రశ్న: (-1)2007 + (-1)2008 + (-1)2009 + (-1)2010 విలువ ఎంత?

జవాబు: ఇక్కడ కూడా మనం నింపాదిగా అలోచించి సమాధానం ఇవ్వాలి. 1ని ఎంత పెద్ద ఘాతంతో పెంచినా ఎంత చిన్న ఘాతంతో పెంచినా విలువ మాత్రం ఒకేటే. అంతెందుకు ఆఖరికి ఓ ఆధారాని (Base) కి సున్న ఘాతం పెట్టినా విలువ 1మాత్రమే 0 విలుమాత్రం 1 అని రామానుజన్ శేలవిచ్చాడు. ఇక ప్రశ్న విషయానికోద్దాం. (-1) ఆధారాన్ని సరిసంఖ్య (Even number) ఘాతంగా వస్తే విలువ (1) అవుతుంది. (-1) ఆధారాన్ని చేసి సంఖ్య (odd number) ఘాతంగా వేస్తె విలువ (-1) గా ఉండిపోతుంది. ఆ విధంగా చూస్తే (-1)2007 = (-1), (-1)2008 = (-1), (-1)2009 = (-1), (-1)2010 = (-1) అవుతుంది. అంటే (-1)2007 +(-1)2008 +(-1)2009 +(-1)2010 = -1+1-1+1=0 (సున్న) అవుతుందన్నమాట.

ప్రశ్న: గునపంతో తవ్వడం, పారాతో చెక్కడం, సైకిల్ తొక్కడంలో బలయుగ్మ౦ పనిచేసే సందర్భం ఇది?

జవాబు: సైకిల్ మిదేక్కి రెండు పెడళ్ళ మీద కుడిఎడమ పాదాలను ఉంచి తొక్కుతున్నపుడు ఒక పాదం ముందు వైపునకు లేదా (Clock wise) తిరుగుతుంటుంది. తద్వారా పల్లచక్రం మీద ఒకే దిశలో తిరిగేలా టార్క్ పనిచేస్తుంది.

3.00456621005
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు