పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అడవులు

అడవులు ప్రకృతి వనరులలో ఓ ప్రధాన వనరు కావడానికి ఎన్నో కారణాలున్నాయి.

forestబాలలూ, గత సంచికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అడవుల ఉపయోగాల గురించి, సంక్షిప్తంగా తెలుసుకున్నాం.

మన దేశపు వైశాల్యంలో సుమారు 22 శాతం మేరకు అడవులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో ఎక్కువగా అడవులు ఉన్నాయి. 2013 సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 77 లక్షల సెక్టారుల్లో అడవులు విస్తరించి ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లో సుమారుగా 70 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్ ఘడ్ వంతు వస్తుంది. ఈ రాష్ట్రంలో అడవులు 56 లక్షల హెక్టారుల్లో ఉన్నాయి. ఇక 4వ స్థానం ఒడిషా రాష్ట్రానిది. ఈ రాష్ట్రంలో ఉన్న అడవులు సుమారు 48 లక్షల హెక్టార్లు, సుమారు 47 లక్షల హెక్టార్ల అడవుల విస్తీర్ణంతో మహారాష్ట్ర రాష్ట్రం 6వ స్థానంలో ఉంది.

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అడవుల వైశాల్యం గణనీయంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 28 వేల చదరపు కి. మీ అడవులు ఉండగా అందులో సుమారు 651 చ.కి.మీ మేర మాత్రమే దట్టమైన అడవులు ఉన్నాయి. ఒక మోస్తరు దట్టమైన అడవులు సుమారు 11 వేల చ. కి. మీ లు ఉండగా మిగిలిన భాగమంతా చెల్లాచదురుగా ఉన్న అడవులే. అధిక భాగం అడవులు గోదావరి, కర్నూల్, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఉన్న నల్లమల అడవులు చాలా ప్రసిద్ధి చెందాయి. పావురాల గుట్టలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై. యస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చిత్తూరు, కడప, నెలూరు జిల్లాలలో విస్తరించి ఉన్న అడవులలో ఎర్రచందనం వృక్షాలు ప్రపంచ ప్రఖ్యాతిని సంతరించుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఈ వృక్షజాతి ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదంటారు. ఎర్రచందనం పేరు వింటూనే అక్రమ నరికివేత, రవాణా గుర్తుకొస్తాయి. ఆ వృక్షజాతి మొక్కజొన్న ప్రత్యేకత ఉంది.

తెలంగాణా రాష్ట్రంలో అడవులు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్ర వైశాల్యంలో సుమారు25 శాతం మేర అడవులు విస్తరించి ఉన్నాయి. సుమారు64 వేల చ.కి.మీ విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉండగా అందులో 21 వేల చ.కి.మీ లలో దట్టమైన రిజర్వు అడవులు ఉన్నాయి. రక్షిత అడవులు 8 వేల చ.కి.మీ విస్తరించి ఉన్నాయి. అందులో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి. వరంగల్  ఏలూరు నాగారం, భూపాల్ పల్లి ప్రాంతాల్లో ఉన్న అడవులలో పెరిగే టేకు వృక్షాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ టేకు కలపతో గృహనిర్మాణం కోసం తయారయిన సామాగ్రికి బాగా గీరాకీ ఉంది.

భారతదేశంలో ఉన్న షెడ్యూల్డ్ తెగల ప్రజలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నాయి. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో కొండజాతి ప్రజలు ఆటవిక హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అడవుల నరికి వేత ద్వారా పారిశ్రామికీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక విధంగా పెనం నుండి పొయ్యిలో పడ్డట్టుగా అవుతుంది. పరిశ్రమలకన్నా అడవుల ప్రాముఖ్యత ఎక్కువ. జీవవైవిధ్యాన్ని కాపాడడమే కాక అడవులు ఎన్నో ఉత్పత్తుల ద్వారా జిడిపి లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

హరితహారం అనే ప్రణాళిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర యావత్తూ సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అడవులు ప్రకృతి వనరులలో ఓ ప్రధాన వనరు కావడానికి ఎన్నో కారణాలున్నాయి.

1. వర్షపాతానికి కారణమైన రుతుపవనాలను చల్లబరుస్తాయి.

2. రాలిన ఆకులు, మురికీ, జంతు కళేబరాల మీదుగా పర్షపు నీరు లోయలలో ప్రవహించడం వల్ల నదీ తీరాలు సారవంతమవుతాయి. నదుల్లోను, సముద్రాల్లోను ఉండే జల జీవనానికి పరోక్షంగా ఊతమిస్తాయి.

3. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఆహారాన్ని ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో కలపను, తదితర ఆటవిక ఉత్పత్తుల్ని ఇవ్వడమే కాకుండా హరిత గ్రహవాయువైన కార్బన్ డయాక్సైడ్ నిల్వలను తగ్గించి ఆ నిల్వల్ని ఆక్సీజన్ గా మార్చి భూవాతావరణంలో ఆక్సీజన్ నిల్వల్ని సమృద్ధి చేసే ప్రధాన కార్యాలయాలు అడవులే! వరదలు, భూకంపాల తాకిడిని తగ్గిస్తాయి.

4. పశుగ్రాసం, కలప, సుగంధద్రవ్యాలు, జిగురు, మూలిక ఔషధాలు, ప్రకృతి సిద్ధ రసాయనాలు, వంట చెరకు, కాగితపు పరిశ్రమకు ప్రధానమైన నార (Pulp) తేనె, విస్తరాకు, తునికాకు, ఫలాలు, చెరకు, పుట్టగొడుగులు ఇలా వాటి స్థావరాలు ఆడవిజాతి ప్రజానీకానికి ఆలవాలమవుతాయి. జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. క్రూరమృగాలు జనవాసాల్లోకి రాకుండా ఆసరా యిస్తాయి.

రచయిత: - ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, సెల్: 9490098910

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు