పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అమెరికా

అమెరికా అపారమైన సంపద, ఆయుధ సంపత్తితో ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంది.

9అమెరికాను అగ్రరాజ్యంగా అందరూ పరిగణిస్తారు. ఎందుకంటే అపారమైన సంపద, ఆయుధ సంపత్తితో ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉంది. ప్రపంచంలో ఆత్యధిక జాతీయెత్పత్తిలో తన డబ్బు అయిన డాలర్లను ప్రపంచ వాణిజ్య మారకంగా చెలామణి చేయుస్తున్న దేశం అమెరికా.

ఉత్తర అమెరికా ఖండంలో ఎక్కువ భూభాగాన్ని ఇది ఆక్రమించించి ఉంది. ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దీని సరిహద్దు దేశాలు. కాకపోతే కెనడాకు ఆగ్నేయంగా ఉన్న అలాస్కా రాష్ట్రం కూడా అమెరికానే. ఆ రాష్ట్రం రష్యాకు సరిహద్దుగా ఉంటుంది. అలాస్కాతో కలుపుకొని ప్రధాన భూభాగంలో 40 రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. సుదూరంగా ఉన్న హవాయి ద్వీపంతో కలుపుకుంటే మొత్తం 50 రాష్ట్రాలు. ఇక దేశానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పడమర పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.

ఇంగ్లీషు ప్రధాన బాష అయిన అమెరికా జనాభా 32 కోట్లు.ప్రానిష్ బాష రెండవ బాషగా ఉంది. 16వ శతాబ్దంలో కొలంబస్  దేశ భూభాగంపై కాలు మోపేనాటికి అక్కడ ఉన్న జనాభాని “ఇండియన్స్” అని పిలుస్తున్నారు. కారణం కొలంబస్ అన్వేషించింది ఇండియాని అని మన దేశాన్ని అంతకు ముందు వాస్కోడిగామా యూరప్ నుండి గుడ్ హోప్ అగ్రం చుట్టి భారతదేశాన్ని చేరుకున్నాడు. అంటే తూర్పుగా ప్రయాణం చేసి మనదేశానికి వచ్చాడు.

భూమి గుండ్రంగా ది గనుక యూరప్ నుండి పడమరగా ప్రయాణిస్తే ఇంకా దగ్గరగా జల మార్గం టుందన్న ఆలోచనతో కొలంబస్ పడమరగా ప్రయాణించాడు. అలా ఉత్తర అమెరికా కండాన్ని చేరుకున్నాడు. అదీ ఇండియా అనుకున్నాడు. అందుకే అక్కడి ప్రజలని “ఇండియన్స్”గా వ్యవహరించాడు.

ఒక కొత్త బూభాగాన్ని కనుగొనడంతో యూరప్ వారు అనేక మంది అక్కడికి చేరుకొని జీవిచనారంభించారు. ఈ క్రమంలో అక్కడి భూముల కోసం, సంపదల కోసం స్థానిక అమాయక ప్రజలు లక్షలాది మందిని చంపేశారు. ఎన్నో లక్షల మంది ఐరోపా వాసులు తీసుకొచ్చిన కొత్త కొత్త రోగాలకు బలయ్యారు. ఆ విధంగా ఏర్పాటయిన ఆ దేశం తన సారమైన భూములతో వనరులతో అభివృద్ది చెందింది. విజ్ఞాన శాస్త్రం సహాయంతో అగ్రరాజ్యంగా మారింది.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు